Jump to content

Amaravati


Recommended Posts

సీఆర్డీయే పరిధిలోకి మరో 613.99 ఎకరాలు
29-06-2018 08:30:26
 
636658578275971601.jpg
అమరావతి: రాజధాని పరిధిలోని ఐదు గ్రామాల వాగులు, వంకలు, ఇతర నీటి వనరులున్న భూములను ఏపీసీఆర్డీయే పరిధిలోకి తీసుకొస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కొన్ని చెరువులు కూడా ఉన్నాయి. తుళ్లూరు, కురగల్లు, నవులూరు, నిడమర్రు, కృష్ణాయపాలెం గ్రామాల్లోని చిన్న, మధ్యతరహా వాగులు, వంకలు, నీటికుంటలున్న 613.99 ఎకరాలను సఆర్‌డీఏకు అప్పగించారు. తుళ్లూరులో 218.41 ఎకరాలు, కురగల్లులో 38.39 ఎకరాలు, నవులూరులో 22.75 ఎకరాలు, నిడమర్రులో 77.51 ఎకరాలు ఇచ్చారు. నవులూరులోనే మరో చోట 225.62 ఎకరాలు, కృష్ణాయపాలెంలో 31.31 ఎకరాల భూమిని సీఆర్డీయేకు ఉచితంగా కేటాయించారు. అయితే, నీటి వనరులు ఉన్న భూములను దెబ్బతీయకూడదని ఉత్తర్వుల్లో షరతు విధించారు. ఇకపై సీఆర్‌డీఏ పరిధిలోని వాగులు, వంకలు, కుంటలు, చెరువులు కూడా రాజధాని నిర్మాణ సంస్థ నియంత్రణలోనే ఉండనున్నాయి.
Link to comment
Share on other sites

విదేశీ రాయబారులతో సీఆర్డీయే భేటీ
29-06-2018 07:50:16
 
636658554178741280.jpg
అమరావతి: అమరావతిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, వాటిల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ఆస్ట్రియా, స్పెయిన్‌, వియత్నాం, కువైట్‌ దేశాల్లోని భారత రాయబారులకు ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో గురువారంనాడు జరిగిన సమావేశంలో స్పెయిన్‌లో మన రాయబారి డి.బాలవెంకటేశ్‌ వర్మ, ఆస్ట్రియాలోని రేణు పాల్‌, వియత్నాంలోని పి.హరీష్‌, కువైట్‌లోని రాయబారి కె.జీవసాగర్‌ పాల్గొన్నారు. రాజధానిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు ఆ రాయబారులందరూ ఆసక్తి చూపారు. ఇక్కడ అమలు పరుస్తున్న టెండర్ల ప్రక్రియ గురించి అడిగి, తెలుసుకున్నారు. ఆయా టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని తమకు తెలిపితే దానిని తాము పని చేస్తున్న దేశాల్లోని సంస్థలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. తద్వారా ఆయా దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు అమరావతికి వచ్చేలా సహకరిస్తామని చెప్పారు. సమావేశంలో సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

 

 

 
 
 
 
 
రాజధానికి 92.45 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని మంగళగిరి మండల పరిధిలో 92.45 ఎకరాల ప్రభుత్వ భూముల్ని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములు మంగళగిరి మండల పరిధిలోని కురగల్లు, నవులూరు, కృష్ణాయపాలెం గ్రామాలకు చెందిన వివిధ సర్వేనెంబర్లలో ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల్లో కాలువ, కట్ట, చెరువు భూములుగా నమోదై ఉన్నాయి. రాజధాని నిర్మాణ అవసరాల కోసం ఈ భూములను సీఆర్‌డీఏకు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఉత్తర్వులిచ్చారు.

రూ.195 కోట్లతో నాగావళి కాలువల ఆధునికీకరణ: నాగావళి ఎడమ, కుడి కాలువల ఆధునికీకరణకు రూ.195.34 కోట్ల అంచనా వ్యయంతో సవరించిన అంచనాలకు పాలనామోదం ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

సీఆర్‌డీఏ కార్యాలయాన్ని సందర్శించిన నాలుగు దేశాల్లోని భారత రాయబారులు
ఈనాడు, అమరావతి: ఆస్ట్రియా, స్పెయిన్‌, వియత్నాం, కువైట్‌లలో భారత రాయబారులు రేణుపాల్‌, డి.బాల వెంకటేశ్‌వర్మ, పి.హరీష్‌, కె.జీవసాగర్‌ గురువారం విజయవాడలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) కార్యాలయాన్ని సందర్శించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌తో సమావేశమయ్యారు. రాజధాని నగర ప్రణాళిక, జరుగుతున్న పనులు, అభివృద్ధి అవకాశాల గురించి వారికి కమిషనర్‌ వివరించారు. ఆయా దేశాలకు చెందిన సంస్థలు రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు, రాజధాని నిర్మాణ ప్రాజెక్టుల్లో పాలుపంచుకునేందుకు ఉన్న అవకాశాల్ని శ్రీధర్‌ తెలియజేశారు.
 
Link to comment
Share on other sites

డిసెంబర్‌కల్లా అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తవ్వాలి!
30-06-2018 08:08:05
 
636659428865229446.jpg
  • నిర్మాణ సంస్థలకు సీఆర్డీయే అధికారుల ఆదేశాలు
అమరావతి: అమరావతి ప్రభుత్వ నగరంలో చేపట్టిన హౌసింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని శ్లాబ్‌లను ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి, మిగిలిన పనులన్నింటినీ డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలని సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ నిర్మాణ సంస్థలను ఆదేశించారు. నిర్మాణ సంస్థలతో షణ్మోహన్‌ శుక్రవారం భేటీ అయ్యారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో హౌసింగ్‌ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఎన్‌సీసీ., ఎల్‌అండ్‌టీ, షాపూర్జీ పల్లోంజీ, కేఎంవీ, బీఎస్‌ఆర్‌., ప్రికా సంస్థల ప్రతినిధులతోపాటు సీఆర్డీయే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎంఈపీ ఫిక్సర్లను రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు షణ్మోహన్‌ తెలిపారు. అనంతరం ప్రాజెక్టుల వారీగా నిర్మాణ పురోగతిని సమీక్షించారు.
 
 
ఈ సందర్భంగా జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సీఆర్డీయే ప్రాజెక్ట్‌ కార్యాలయం, మంత్రులు, న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న బంగళాల పనుల గురించి కూడా తెలుసుకున్నారు. రాయపూడి వద్ద ప్యాకేజీ -1 లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయానికి సంబంధించిన స్టిల్ట్‌ శ్లాబులను జులై 10వ తేదీలోగా పూర్తి చేయాల్సిందిగా షణ్మోహన్‌ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీని ఆదేశించారు. ఆ వెంటనే అధునాతన మైవాన్‌ సెంట్రింగ్‌ శ్లాబ్‌ పనులను చేపట్టాలన్నారు. అఖిల భారత సర్వీస్‌ అఽధికారుల (ఏఐఎస్‌) నివాసాలకు సంబంధించిన స్టిల్ట్‌ శ్లాబ్‌లు పూర్తయ్యాయని, మైవాన్‌ సెంట్రింగ్‌ శ్లాబ్‌ పనులు చేస్తున్నామని ఎన్‌సీసీ ప్రతినిధులు తెలిపారు. ప్యాకేజ్‌-2లోని ఎన్జీవోల హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో 3 టవర్లకు సంబంధించి మైవాన్‌ పనులు జరుగుతున్నాయని, జులై 10వ తేదీ నాటికి అన్ని స్టిల్ట్‌ శ్లాబ్‌లను పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి అధికారులు చెప్పారు. అనంతరం అన్ని టవర్ల మైవాన్‌ పనులు చేపడతామన్నారు.
 
 
ప్యాకేజీ-3లో షాపూర్జీ పల్లోంజీ చేపట్టిన గెజిటెడ్‌ టైప్‌ 1, టైప్‌ 2 కాంప్లెక్స్‌లకు సంబంధించిన స్టిల్ట్‌ పనులు పురోగతిలో ఉన్నాయని, ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని టవర్ల మైవాన్‌ పనులు జరుపుతామని పేర్కొన్నారు. గ్రూప్‌-డి ఉద్యోగులకు చెందిన ఒక టవర్‌కు మైవాన్‌, మరో 5 టవర్లకు స్టిల్ట్‌ పనులు జరుగుతున్నాయని, జులై 10 నుంచి అన్ని టవర్ల మైవాన్‌ పనులు చేపడతామని చెప్పారు. కొండమరాజుపాలెం వద్ద నిర్మిస్తున్న సీఆర్డీయే ప్రాజెక్ట్‌ కార్యాలయ భవనపు ఫౌండేషన్‌ పనులను వచ్చే నెల 10వ తేదీకల్లా పూర్తి చేస్తామని కాంట్రాక్ట్‌ సంస్థ ప్రికా ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత కాలమ్స్‌ పనులను ప్రారంభించి, బీమ్స్‌, శ్లాబ్‌ ప్రికాస్ట్‌ పధ్ధతిలో చేపడతామని పేర్కొన్నారు. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ పైల్స్‌ పనులు ఇప్పటికే దాదాపు సగం పూర్తయ్యాయని ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులు తెలిపారు.
 
జులై చివరికల్లా ఫౌండేషన్‌ పూర్తయ్యేలా చూసి, ఆ తర్వాత బీమ్స్‌, కాలమ్స్‌ పనులు చేపట్టాలని షణ్మోహన్‌ వారిని ఆదేశించారు. మంత్రులు, న్యాయమూర్తుల కోసం రాయపూడి- నేలపాడుల మధ్యన నిర్మిస్తున్న బంగళాల పనుల్లో సాధించిన పురోగతిని సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థలు కేఎంవీ, బీఎస్‌ఆర్‌ ప్రతినిధులు వివరించారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు తాము రూపొందించుకున్న ప్రణాళికను తెలిపారు. ఈ సమావేశంలో సీఈ ఎం.జక్రయ్య, ఎస్‌.ఇ. సిహెచ్‌ ధనుంజయ, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సిహెచ్‌ దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సీఆర్‌డీఏ పరిధిలోకి మరో 904.53 ఎకరాలు
30-06-2018 08:10:52
 
636659430535674882.jpg
అమరావతి: రాజధాని పరిధిలోని వాగులు, వంకలు, నీటి కుంటలు, ఇంకా కరకట్టలను కూడా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)కు అప్పగిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం 613 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులు, కుంటలను సీఆర్‌డీఏకు అప్పగించిన రెవెన్యూశాఖ శుక్రవారం మరో 904.53 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పెద్ద చెరువులతోపాటు ప్రధాన కరకట్టలు కూడా ఉన్నాయి.
 
 
వెంకటపాలెంలోని 205.78 ఎకరాల్లోని కరకట్ట, లింగాయపాలెంలో 201.53 ఎకరాలు, ఉద్దరండరాయునిపాలెంలోని 249.66 ఎకరాల్లోని కరకట్టలు, చెరువు భూములను సీఆర్‌డీఏకు ఇచ్చారు. మల్కాపురం-2.77 ఐనవోలు-42.48 , వెంకటపాలెం-205.78 , మందడం-38.14 , వెలగపూడి-4.91, ఉద్దండరాయునిపాలెం-249.66, లింగాయపాలెం-201.53, నిడమర్రు-38.23, అబ్బరాజుపాలెం-11.69, పిచ్చుకలపాలెం-13.45, రాయపూడి-89.50, దొండపాడు 6.39 ఎకరాలను కేటాయించారు. నీటి వనరులున్నచోట వాటి రూపాన్ని మార్చొద్దని కూడా స్పష్టమైన షరతు విధించారు.
 
Tags : lands, AP capital, amaravathi
Link to comment
Share on other sites

అమరావతిలో క్యాన్సర్‌ ఆసుపత్రి
01brk97a.jpg
విజయవాడ: నవ్యాంధ్రలో వారానికి రెండు రోజులు బసవతారకం క్యాన్సర్‌ క్లినిక్‌ వైద్య సేవలు అందిస్తుందని ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలో క్యాన్సర్‌ క్లినిక్‌ను ఆయన ప్రారంభించారు. సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు సొంతజిల్లాలో బసవతారకం క్యాన్సర్‌ క్లినిక్‌ కార్యకలాపాలు ప్రారంభించడం హర్షణీయమన్నారు. క్యాన్సర్‌ క్లినిక్‌లో వారానికి రెండు రోజులపాటు రోగులను వైద్యులు పరీక్షిస్తారని తెలిపారు. అతి త్వరలో అమరావతిలో 1000 పడకల అత్యాధునిక క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రారంభిస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో సభాపతి కోడెల శివప్రసాద రావు, మంత్రి ఉమా మహేశ్వర రావు, ఎంపీ నాని, ఎమ్మెల్యే ఉమ తదితరులు పాల్గొన్నారు.

 

 
 
 
 

జాతీయ-అంతర్జాతీయ

Link to comment
Share on other sites

#ఎన్టీఆర్ పుట్టినగడ్డపై క్యాన్సర్‌ సేవలు ప్రారంభించటం చాలా ఆనందంగా ఉంది - #Balayya

విజయవాడ: బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రి క్లినిక్‌, సమాచార కేంద్రాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పుట్టినగడ్డపై క్యాన్సర్‌ ఆస్పత్రి సేవలు ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రజలకు చేరువ చేస్తామన్నారు. అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి ఆగస్టులో భూమి పూజ చేస్తామని బాలకృష్ణ చెప్పారు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నమ్మకానికి చిరునామా బసవతారకం ఆస్పత్రని ఏపీ స్పీకర్‌ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమానికి కోడెలతోపాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...