Jump to content

Amaravati


Recommended Posts

రాజధానిలో వెయ్యి అపార్టుమెంట్లు
26-04-2018 03:27:37
 
636603100570290131.jpg
  • 494 కోట్లతో నిర్మాణం
  • వేలం పద్ధతిలో ప్రజలకు విక్రయం
  • చదరపు అడుగు రూ.3500
  • 71 మున్సిపాలిటీల్లో 203 అన్న క్యాంటీన్లు
  • మంత్రి నారాయణ వెల్లడి
 Untitled-122.jpg
అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ప్రైవేటు ఉద్యోగులతోపాటు, ఇతరుల కోసం రూ.494 కోట్ల వ్యయంతో వెయ్యి అపార్టుమెంట్లు నిర్మిస్తున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. వీటిని వేలం ద్వారా విక్రయిస్తామన్నారు. సచివాలయ నిర్మాణ పనులకు అంతా సిద్ధంగా ఉందని.. రెండు రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ఈ అపార్టుమెంట్లును మూడు కేటగిరిలో నిర్మించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా 71 మున్సిపాలిటీల్లో 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగిందని ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న అపార్టుమెంట్ల నిర్మాణాల ప్రగతిపై సీఎం సమీక్షించారని తెలిపారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద మిగిలిన 1500 ఎకరాలపై చర్చ జరిగినట్లు మంత్రి చెప్పారు. సిటీ కోర్టు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు. వెయ్యి అపార్ట్‌మెంట్ల నిర్మాణాలను ఏడాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో టెండర్లు పిలవడానికి సీఆర్డీఏ చర్యలు చేపట్టిందన్నారు. జీప్లస్‌-11 పద్ధతిలో చేపట్టే ఈ అపార్టుమెంట్ల నిర్మాణానికి ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించిందన్నారు. ఫస్ట్‌ఫేజ్‌లో ఈ నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి మరిన్ని అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. 1200 చదరపు అడుగుల్లో 500 అపార్టుమెంట్లు, 1500 చదరపు
అడుగుల్లో 300, 1800 చదరపు అడుగుల్లో 200 ఇలా మూడు కేటగిరీల్లో నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. అవసరాన్ని బట్టి 2400 చదరపు అడుగుల్లో నిర్మిస్తామని మంత్రి చెప్పారు. నో ప్రాఫిట్‌-నో లాస్‌ విధానంలో ఈ అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. చదరపు అడుగు రూ. 3500లకు విక్రయించనున్నట్టు తెలిపారు.
 
రూపాయికే టిఫిన్‌.. 5కే భోజనం
రాష్ట్రంలో తొలి విడతగా 71 మున్సిపాలిటీల్లో 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉంటుందన్నారు. భోజనం రూ.5కే అందిస్తామన్నారు. బ్రేక్‌ ఫాస్ట్‌లో ఇడ్లీ, పొంగల్‌, ఉప్మా ఉంటాయన్నారు. ఇడ్లీ రేటు రూపాయి అని మంత్రి చెప్పారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాలు గుర్తించామన్నారు. గవర్నర్‌ వ్యవస్థే వద్దని సీఎం చంద్రబాబు అంటున్నారని.. అంటే గవర్నర్‌ వద్దనే కదా? అని అడిగిన ఒక ప్రశ్నకు.. రాష్ట్రానికి సంబంధించి గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి సరైన సమాచారం ఇవ్వలేదని.. రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సినవి తీసుకురావడానికి ప్రయత్నించలేదని అన్నారు.
Link to comment
Share on other sites

10 ఎకరాల్లో భారీ వాణిజ్య సముదాయం
26-04-2018 03:11:25
 
అమరావతిలో పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు 10 ఎకరాల్లో భారీ వాణిజ్య సముదాయాన్ని ‘మాల్‌’ తరహాలో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, రిటైల్‌ షాపింగ్‌ సదుపాయాలుంటాయి. దీనిని సీఆర్డీయే నిర్మిస్తే ఆ తర్వాత దాని నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని భావించారు. ఈ మాల్‌ను వినూత్న విధానంలో నిర్మిస్తారు. తాత్కాలిక కట్టడాలతో స్ట్రీట్‌ మార్కెట్‌ను తలపించేలా, ఓపెన్‌గా నిర్మిస్తారు. అయితే ఇందులోని షోరూంలు మాత్రం సంప్రదాయ పైకప్పులు, గోడలతో ఉంటాయి. రాజధానిలో స్టార్‌ హోటళ్లను ఏర్పాటు చేయడానికి వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్‌ హోటళ్ల ఏర్పాటుకు అనుమతులివ్వాలని నిర్ణయించారు. ఈ హోటళ్ల స్థాపనపై విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్‌ గ్రూపు ఐటీసీతో కలసి కృషి చేస్తోంది.
Link to comment
Share on other sites

5 టవర్లు.. 50 అంతస్థులు
27-04-2018 02:05:15
 
636603915148262534.jpg
  • సచివాలయ టవర్లకు టెండర్లు ఆహ్వానం.. 2176 కోట్లు.. 3 ప్యాకేజీలు
  • 5 టవర్లలో ఒకటి సీఎంకు.. అందులో 50 అంతస్థులు.. మిగతావి 40
  • పాలవాగుకు ఒకవైపు 2, మరోవైపు 3 టవర్ల నిర్మాణం
  • దేశంలోనే తొలిసారిగా పిల్లర్లు లేని కట్టడాలు.. సీఎం టవర్‌పై హెలిప్యాడ్‌
అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత కీలక భవన సముదాయ నిర్మాణానికి ఏపీసీఆర్డీయే పూనుకుంటోంది. ముఖ్యమంత్రితో సహా సమస్త రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం కొలువుదీరే సచివాలయ సముదాయానికి రూ.2,176 కోట్లతో.. 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. పరిపాలనా నగరంలో పాలవాగుకు ఉత్తర, దక్షిణ దిశల్లో మొత్తం 5 టవర్లతో సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ ఆవిర్భవిస్తుంది. 32 ఎకరాల్లో, సుమారు 69 లక్షల చదరపుటడుగుల వైశాల్యంతో రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, జీఏడీ కొలువుదీరనున్న టవర్‌ 50 అంతస్థులతోనూ.. శాఖాధిపతులు, అధికారులు, ఉద్యోగులు ఆసీనులయ్యే మిగిలిన 4 టవర్లు ఒక్కొక్కటీ 40 అంతస్థులతోనూ నిర్మితమవనున్నాయి. సీఎం టవర్‌తోపాటు 3, 4 టవర్లుగా వ్యవహరించేవి పాలవాగుకు దక్షిణం వైపున, మిగిలిన 1, 2 టవర్లు ఉత్తరం వైపున రానున్నాయి. వీటిల్లో జీఏడీ టవర్‌ నిర్మాణ వ్యయం అంచనా రూ.530 కోట్లు కాగా, 1, 2 టవర్ల వ్యయం రూ.895 కోట్లు, 3, 4 టవర్ల అంచనా వ్యయం రూ.751 కోట్లుగా సీఆర్డీయే ప్రతిపాదనలు రూపొందించింది. టెండర్ల దాఖలుకు వచ్చేనెల 16 వరకు గడువు ఇచ్చింది.
 
కలంకారీ డిజైన్‌లో డయాగ్రిడ్‌
దేశంలోనే తొలిసారిగా వీటిని డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించనున్నారు. అమెరికా, దుబాయ్‌ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో ఆకాశహార్మ్యాల నిర్మాణంలో మాత్రమే వినియోగించే ఈ పద్ధతి చాలా వినూత్నమైనది. సాధారణ భవనాల్లో మాదిరిగా ఇందులో పిల్లర్లు (స్తంభాలు) ఉండవు. ఫలితంగా ఎంతో స్థలం ఆదా అవుతుంది. ఇంటీరియర్‌ డెకరేషన్‌ను ఆకర్షణీయంగా చేసుకోవచ్చు. భవన భారాన్ని పిల్లర్లకు బదులుగా డయాగ్రిడ్‌ డిజైన్లు మోస్తాయి. వాటిని ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) నిబంధనలను అనుసరించి కట్టనున్నారు. సీఎం టవర్‌ పైభాగాన హెలిప్యాడ్‌ నిర్మిస్తారు.
Link to comment
Share on other sites

సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు
 మొత్తం ఐదు టవర్ల నిర్మాణం అంచనా వ్యయం రూ.2176 కోట్లు

ఈనాడు అమరావతి: అమరావతిలోని పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) గురువారం టెండరు ప్రకటనలు జారీ చేసింది. మొత్తం ఐదు ప్రధాన టవర్లు, వాటికి అనుబంధంగా వివిధ వసతుల కల్పనకు భవనాల నిర్మాణానికి మూడు ప్యాకేజీలుగా సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. మూడు ప్యాకేజీల మొత్తం అంచనా విలువ రూ.2176 కోట్లు. వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి రూ.530 కోట్లు, 1, 2 టవర్ల నిర్మాణానికి రూ.895 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.751 కోట్లతో సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. బిడ్‌లు దాఖలు చేయడానికి మే 16 తుది గడువుగా సీఆర్‌డీఏ పేర్కొంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలను మొత్తం ఐదు టవర్లుగా నిర్మించనున్నారు. పరిపాలన నగరంలో పాలవాగుకు ఒకపక్కన మూడు టవర్లు, మరో పక్కన రెండు టవర్లు వస్తాయి. ముఖ్యమంత్రి కార్యాలయ భవనం టవర్‌ 46 అంతస్తులు, మిగతా నాలుగు భవనాలు 40 అంతస్తులు ఉంటాయి. ప్రతి టవర్‌కు పక్కనే ఉద్యోగులు, సందర్శకులకు వివిధ వసతుల కల్పనకు రెండంతస్తుల భవనాలు నిర్మిస్తారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతుల్ని లండన్‌కు చెందిన నార్మన్‌ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించింది. ముఖ్యమంత్రి కార్యాలయం 46వ అంతస్తులో ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయ భవనంపైనే హెలిప్యాడ్‌ ఉంటుంది. ఐదు టవర్లను అనుసంధానిస్తూ ఒక ఎలివేటెడ్‌ మార్గం ఉంటుంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించనున్నారు. ఈ భవనాల్లో నిలువు స్తంభాలుండవు. సెంట్రల్‌కోర్‌ ఉంటుంది. దాని చుట్టూ స్ట్రక్చరల్‌ స్టీల్‌ డయాగ్రిడ్‌ ఉంటుంది. భవనం బరువంతా డయాగ్రిడ్‌పైనే ఉంటుంది. నిలువు స్తంభాలు లేకపోవడం వల్ల సంప్రదాయ భవనాలకంటే వీటిలో ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుంది.

Link to comment
Share on other sites

అమరావతి’పై ఎన్జీటీ ప్రత్యేక బెంచ్‌

ఈనాడు, దిల్లీ: అమరావతి నిర్మాణంపై దాఖలైన పునర్‌ సమీక్ష పిటిషన్‌కు సంబంధించి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేస్తామని జాతీయ హరిత ధర్మాసనం పేర్కొంది. అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ గతంలో ఇచ్చిన తీర్పును పునర్‌ సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ జావేద్ ర‌హీం ధర్మాసనం విచారించింది. గతంలో తీర్పును ఇచ్చిన న్యాయమూర్తులు పదవీ విరమణ పొందారని, దీంతో కొత్త బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది.

Link to comment
Share on other sites

7 hours ago, sonykongara said:
అమరావతి’పై ఎన్జీటీ ప్రత్యేక బెంచ్‌

ఈనాడు, దిల్లీ: అమరావతి నిర్మాణంపై దాఖలైన పునర్‌ సమీక్ష పిటిషన్‌కు సంబంధించి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేస్తామని జాతీయ హరిత ధర్మాసనం పేర్కొంది. అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ గతంలో ఇచ్చిన తీర్పును పునర్‌ సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ జావేద్ ర‌హీం ధర్మాసనం విచారించింది. గతంలో తీర్పును ఇచ్చిన న్యాయమూర్తులు పదవీ విరమణ పొందారని, దీంతో కొత్త బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది.

Malla na

Link to comment
Share on other sites

7 hours ago, sonykongara said:
అమరావతి’పై ఎన్జీటీ ప్రత్యేక బెంచ్‌

ఈనాడు, దిల్లీ: అమరావతి నిర్మాణంపై దాఖలైన పునర్‌ సమీక్ష పిటిషన్‌కు సంబంధించి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేస్తామని జాతీయ హరిత ధర్మాసనం పేర్కొంది. అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ గతంలో ఇచ్చిన తీర్పును పునర్‌ సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ జావేద్ ర‌హీం ధర్మాసనం విచారించింది. గతంలో తీర్పును ఇచ్చిన న్యాయమూర్తులు పదవీ విరమణ పొందారని, దీంతో కొత్త బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది.

BJP strikes

Link to comment
Share on other sites

శంకుస్థాపన చేసి ఏడాదవుతున్నా మొదలవని పనులు
  ఇంకా కొలిక్కిరాని ఒప్పందాల ప్రక్రియ
  జీపీఏ కోరుతున్న సింగపూర్‌ సంస్థల కన్సార్షియం
  ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో అంకురప్రాంత అభివృద్ధిలో అడుగు ముందుకు పడడంలేదు. శంకుస్థాపన జరిగి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నా కదలిక లేదు. మొత్తం 1691 ఎకరాల్లో దీనిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. సింగపూర్‌ సంస్థల కన్సార్షియం ప్రధాన అభివృద్ధిదారుగా ఉంది. 2018 జనవరి నాటికే పురోగతి కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నొక్కిచెప్పినా మార్పేమీ లేదు. రాజధానికి సంబంధించి అంకుర ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమైంది.

ఒక నిర్ణయం కోసం ఎనిమిది నెలలు..!
సింగపూర్‌ సంస్థల కన్సార్షియమే అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏడీసీ)తో కలసి జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలో పేర్కొన్నారు. దీనికి ఆ కన్సార్షియం నిరాకరించింది. తమ కన్సార్షియం తరఫున సింగపూర్‌-అమరావతి ఇన్వెస్టెమెంట్‌ హోల్డింగ్స్‌ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తామని అదే అంకుర ప్రాంత అభివృద్ధికి సంబంధించిన వివిధ ఒప్పందాలు చేసుకుంటుందని పేర్కొంది. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడానికి దాదాపు 8 నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు సింగపూర్‌ సంస్థల కన్సార్షియం ప్రతిపాదనకే రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్‌(ఏడీపీ) పేరుతో జాయింట్‌వెంచర్‌ కంపెనీ ఏర్పాటైంది.

కొలిక్కిరాని అంశాలు
అలాగే ఈ క్రమంలో రెండు ఒప్పందాలు ఎంతో కీలకం. వాటిలో ఒకటి ఏడీసీ, సింగపూర్‌-అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ మధ్య జరగాల్సిన భాగస్వాముల ఒప్పందం. దీనిపై ప్రస్తుతం ఆ రెండు సంస్థల మధ్యా చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. కన్సార్షియం చేసిన కొన్ని ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం కుదరనందునే ఒప్పందంలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ కొలిక్కి వస్తేనే సీఆర్‌డీఏ, ఏడీసీ, సింగపూర్‌-అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ మధ్య రాయితీ, అభివృద్ధి ఒప్పందం జరుగుతుంది. అందులో ఏడీపీకి సీఆర్‌డీఏ ఇచ్చే రాయితీలు, ఇతర విధివిధానాలు ఆ ఒప్పందంలో ఉంటాయి. ఇవి రెండూ ఎప్పటికి పూర్తవుతాయన్న విషయంలో ఇంకా స్పష్టతలేదు. మరోపక్క స్టార్టప్‌ ప్రాంతంలో తొలిదశలో అభివృద్ధి చేసే 656 ఎకరాలపై తమకు జీపీఏ కావాలని కన్సార్షియం కోరుతోంది. ఇది ఒప్పందంలో భాగమే. ఆ సంస్థకు జీపీఏ ఇవ్వడానికి సంబంధించిన పత్రాలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.

తెరపైకి ఫేజ్‌ జీరో
స్టార్టప్‌ ప్రాంతంలోని 1691 ఎకరాల్ని మూడు దశల్లో 15 ఏళ్లలో అభివృద్ధి చేయాలి. తొలి దశలో 656 ఎకరాల్ని ఏడీపీ అభివృద్ధి చేస్తుంది. దీనిలో కూడా మొదట 50 ఎకరాల్ని ఉత్ప్రేరాకాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, దానిలో 8 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం కలిగిన టవర్‌ నిర్మిస్తామని సింగపూర్‌ సంస్థల కన్సార్షియం పేర్కొంది. ఆ తర్వాత సైజ్‌ జీరో ప్రాజెక్టుని తెరపైకి తెచ్చింది. ఏడు ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని తెలిపింది. వచ్చే 15 ఏళ్లలో స్టార్టప్‌ ప్రాంతంలో వచ్చే అభివృద్ధి నమూనాల్ని ఇందులో ఏర్పాటు చేస్తారు. ఇదొక ప్రదర్శనశాలగా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, డిజైన్లను ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో సింగపూర్‌ ప్రతినిధులు అందజేశారు. ‘ఫేజ్‌ జీరో’తో అసలు ప్రాజెక్టు మొదలైనట్టు కాదు. ఆ పేరుతో ప్రాజెక్టులో జాప్యం చేయడం వల్ల ఉపయోగం లేదు. వీలైనంత త్వరగా ఉత్ప్రేరాకాభివృద్ధి ప్రాజెక్టు మొదలైతేనే రాజధాని నిర్మాణంలో పురోభివృద్ధి కనిపిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Link to comment
Share on other sites

అమరావతిలో సురక్షిత విద్యుత్..‌!
28-04-2018 07:55:29
 
636604989292033803.jpg
  • అమరావతిలో భూగర్భంలోనే ఎలక్ట్రిసిటీ కేబుళ్ల ఏర్పాటు
  • వీటితోపాటు నీరు, గ్యాస్‌, సీవరేజ్‌, స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ సిస్టంలు కూడా..
  • రహదారుల పక్కన భారీ డక్ట్‌ల తవ్వకం
  • అవసరమైతే మరమ్మతులు చేసే సిబ్బంది వాటిల్లోకి వెళ్లేంత పెద్దవిగా నిర్మాణం
  • ఏడీసీ, ట్రాన్స్‌కో, ఏపీఎస్పీడీసీఎల్‌, సీఎల్‌సీల ఆధ్వర్యంలో వడివడిగా పనులు
అమరావతి: కాస్త ఈదురుగాలులు వీచినా లేక ఇతరత్రా ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా జనావాసాల్లో మొదట ప్రభావితమయ్యేది విద్యుత్తు వ్యవస్థేనన్న విషయం మనందరికీ అనుభవమే. కరెంట్‌ తీగలు తెగిపడడం, స్తంభాలు విరిగిపోవడం, వాటి కారణంగా విద్యుదాఘాతాలు సంభవించి ప్రాణ, ఆస్తినష్టాలు చోటు చేసుకోవడమే కాకుండా వాటిని సరి చేసి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు చాలా సమయం పట్టడమూ తెలిసిందే. ఫలితంగా పలు అవస్థలు అనివార్యమవుతుండడం చూస్తూనే ఉన్నాం. అయితే... ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మితమవు తున్న అమరావతి నగరంలో మాత్రం పైన పేర్కొన్న ఇబ్బందులు, ప్రమాదాలకు ఏమాత్రం ఆస్కారం ఉండబోదు! ఎందుకంటే ఇందులో ఏర్పాటు చేయబోయే విద్యుత్తు సరఫరా వ్యవస్థ సమస్తం ఇప్పట్లాగా భూఉపరితలంపై స్తంభాలపై, తీగలపై ఆధారపడి ఉండదు! అందుకు బదులుగా విద్యుత్తు కేబుళ్లన్నీ భూగర్భంలో, టన్నెలింగ్‌ సిస్టంలో ఉంటాయి! రాజధాని రహదారుల వెంబడి తవ్వుతున్న భారీ గోతుల్లో ఏర్పాటు చేయబోయే డక్ట్‌లలో ఈ కేబుళ్లను ఉంచుతారు.
 
సమస్త కేబుళ్లు భూగర్భంలోనే...
అభివృద్ధి చెందిన దేశాలు, నగరాల్లో మాత్రమే కనిపించే ఇంతటి అత్యధునాతన అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌, హెచ్‌.డి.పి.ఇ. డక్ట్‌లలో కేవలం విద్యుత్తు తీగలు మాత్రమే కాకుండా ఇతర వ్యవస్థలైన నీరు, గ్యాస్‌, సీవరేజ్‌, స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ సిస్టంలకు సంబంధించిన కేబుళ్లు, పైపులను అమర్చుతారు.
 
ఇవి ఎంత భారీగా ఉంటాయంటే పూర్తయిన తర్వాత వీటిల్లోకి సంబంధిత సిబ్బంది సులభంగా ప్రవేశించడమే కాకుండా నడవగలుగుతారు. తద్వారా భూగర్భంలోని ఏ వ్యవస్థలో నైనా, ఎక్క డైనా, ఏమైనా అంతరాయాలు సంభవిస్తే తక్షణమే ఆ ప్రదేశాన్ని గుర్తించడంతోపాటు వెంటనే అక్కడికి చేరుకుని, దానిని సరి చేయగలుగుతారు.
 
 
పలు ప్రయోజనాలు..
అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో రాజధానిలో నిర్మితమవుతున్న వివిధ కీలక రహదారుల వెంబడి ప్రస్తుతం ఈ డక్ట్‌లకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అంటే.. అమరావతిలో ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగా రోడ్ల వెంబడి, పైకి కనిపించేటటువంటి ఎలక్ట్రిక్‌ స్తంభాలుగానీ, పైపులైన్లుగానీ, మురుగుకాల్వలు ఇత్యాదివి గానీ కనిపించవన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే వివిధ కేబుళ్లు, పైపులైన్ల పేరిట పదేపదే రోడ్లను తవ్వాల్సిన అగత్యంగానీ, ఆ రూపంలో ప్రజలకు ఎదురయ్యే అవస్థలుగానీ ఉండవు. పైగా ఎంతటి తీవ్రమైన పెనుగాలులు వీచినా, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా సరే ఆయా వ్యవస్థలకు ఎటువంటి విఘాతం సంభవించదు. దీంతో ప్రజోపయోగకరమైన, అత్యవసర సర్వీసులకు ఏమాత్రం అంతరాయం వాటిల్లదు. స్తంభాలపైగుండా వెళ్లే విద్యుత్తు తీగలకు కొక్కేలు వేసి, ఇతర మార్గాల ద్వారా విద్యుత్తు చౌర్యానికి ఎవరన్నా పాల్పడుదామనుకున్నా కుదరదు. మరొక ముఖ్యమైన విశేషమేమిటంటే.. భూఉపరితలంపై ఎటువంటి తీగలు, స్తంభాలు కనిపించనందున నగరం మరింత సుందరంగా కనిపిస్తుంది.
 
భవిష్యత్తులో ఎల్పీఎస్‌ జోన్లతో సహా రాజధాని మొత్తాన్నీ కవర్‌ చేసేలా ఈ భూగర్భ సొరంగాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి మాత్రం ట్రంక్‌ రోడ్ల వెంబడి 80 కిలోమీటర్ల పొడవున ఆర్‌.సి.సి. భూగర్భ సొరంగాలను, 230 కి.మీ. పొడవైన హెచ్‌.డి.పి.ఇ. డక్ట్‌లను నిర్మిస్తున్నారు. తర్వాత్తర్వాత ఎల్పీఎస్‌ జోన్లలోనూ సుమారు 1,000 కిలోమీటర్ల పొడవైన డక్ట్‌లను ఆయా జోన్లలోని రోడ్ల పక్కన నిర్మిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న భూగర్భ విద్యుత్తు కేబుల్‌ వ్యవస్థ పనుల్లో ఏడీసీకి ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఎస్పీడీసీఎల్‌తోపాటు సింగపూర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌కు చెందిన అధికారులు, నిపుణులు సహకరిస్తున్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...