Jump to content

Amaravati


Recommended Posts

ఎస్‌ఆర్‌ఎంలో రూ.500 కోట్లతో నూతన ప్రాజెక్టు
22-04-2018 00:31:41
 
నీరుకొండ (మంగళగిరి రూరల్‌) ఏప్రిల్‌ 21: ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, అమరావతి ప్రాంగణంలో నూతన ప్రాజెక్టులను తీసుకువస్తున్నట్టు ప్రొ-వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ నారాయణరావు శనివారం తెలిపారు. రూ.500 కోట్లతో సెకండ్‌ ఫేజ్‌లో భవన నిర్మాణానికి ఈ నెల 25న శంకుస్థాపన చేస్తునట్టు, 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయనున్నట్టు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతి అంతర్జాతీయ ముఖం...వెనూజియా
21-04-2018 03:56:01
 
636598797632347520.jpg
  • రూ.2,000 కోట్లతో తొలి దశ నిర్మాణ పనులు
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సమీపంలో రూపుదిద్దుకుంటున్న రామకృష్ణ హౌజింగ్‌ ప్రాజెక్టు విజయవాడ, గుంటూరు ప్రాంత రియల్టీ ముఖ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లనుంది. ఇది మొత్తం 170 ఎకరాల భారీ వెంచర్‌. ఇందులో రెసిడెన్షియల్‌ కమ్‌ ఆఫీస్‌ ప్రాజెక్ట్‌ వెనూజియా పనులు వేలాది మంది కార్మికులతో అత్యాధునిక టెక్నాలజీతో శరవేగంగా సాగుతున్నాయి. ఇటాలియన్‌ ఆర్కిటెక్చర్‌ను మరిపించేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని భారీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో ప్రధానమైంది. ఈ ప్రాజెక్టు విశేషాలను కంపెనీ ఎండి అంజనీ కుమార్‌ (బాబీ) ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
 
ప్రాజెక్టు విశేషాలు
విజయవాడ-గుంటూరుల మధ్య నాగార్జున యూనివర్సిటీకి చేరువలో జాతీయ రహదారి పక్కన 45 ఎకరాల్లో భారీ గృహ, ఐటి భవంతుల సముదాయం నిర్మాణం చేపట్టాం. ఇందులో 40 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో 25 రెసిడెన్షియల్‌ టవర్లు నిర్మిస్తున్నాం. ఒక్కో టవర్‌ 22 నుంచి 31 అంతస్తులు ఉంటుంది. మొత్తం 6,000 ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు ఉంటాయి. మిగతా ఐదు ఎకరాల్లో 25 ఫ్లోర్లతో ‘టెక్నో ట్విన్‌ టవర్జ్‌’ ఏర్పాటుచేస్తున్నాం. వాక్‌ టు వర్క్‌ కాన్సె్‌ప్టతో చేపట్టిన ఈ వెంచర్‌ మొత్తం స్థలంలో కేవలం 14 శాతంలోనే నిర్మాణాలు ఉంటాయి. 86 శాతం స్థలం ఓపెన్‌ స్పేస్‌ ఉంటుంది. 40 నుంచి 100 అడుగుల రోడ్లు ఉంటాయి. నీటి కొలనులు, ఉద్యానవనాలు, క్రీడాస్థలాలు, క్లబ్‌హౌస్‌ ఏర్పాటుచేస్తున్నాం. ప్రాజెక్టు తొలి దశలో రూ.2,000 కోట్ల అంచనాతో ఎనిమిది రెసిడెన్షియల్‌ టవర్లను, టెక్నో ట్విన్‌ టవర్స్‌ను నిర్మిస్తున్నాం. రెసిడెన్షియల్‌ టవర్లు వచ్చే ఏడాది, టెక్నో టవర్లు ఈ సంవత్సరం డిసెంబరునాటికి పూర్తవుతాయి.
 
మిడిల్‌ క్లాస్‌కూ అందుబాటులో..
ఆకాశహర్మ్యాలంటే సాధారణంగా ఉన్నతాదాయవర్గాలకే పరిమితమన్న భావన ఉంది. వెనూజియా టవర్లలో సంపన్న వర్గాలతో పాటు మధ్య తరగతి వారినీ దృష్టిలో ఉంచుకుని రెసిడెన్షియల్‌ ఫ్లాట్లను 1275, 1425, 1700, 1900 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం. తొలి దశలో భాగంగా నిర్మిస్తున్న 1800 ఫ్లాట్ల ధరను చదరపు అడుగు రూ.4,600 చొప్పున నిర్ణయించాం. కొనుగోలుదారుల పెట్టుబడులకు మరింత భరోసా ఇచ్చేందుకు త్వరలో ‘రెంటల్‌ స్కీం’ను ప్రవేశపెట్టనున్నాం.
 
సౌకర్యాలు ఎలా ఉంటాయి ?
ప్రతి టవర్‌ను నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాస్తుకు అనుగుణంగా తూర్పు, పడమర ఫేసింగ్‌లతో నిర్మిస్తున్నాం. ఒక్కొక్క అంతస్తులో ఎనిమిది అపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఒక్కొక్క టవర్‌కు ఎనిమిది లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఎక్స్‌క్లూజివ్‌గా ఉండేలా అపార్ట్‌మెంట్లను డిజైన్‌ చేశాం. ప్రతి టవర్‌ ప్రవేశద్వారం 20 అడుగులకుపైగా ఎత్తుతో ‘గ్రాండ్‌ ఎంట్రీ లాబీ’గా ఉంటుంది, విజిటర్లకు వెయిటింగ్‌ లాంజ్‌లు, 24 గంటల హైటెక్‌ సెక్యూరిటీ ఉంటుంది. లిఫ్ట్‌లతోపాటు టవర్లలోకి స్మార్ట్‌ యాక్సెస్‌ కార్డులుంటేనే ప్రవేశం లభిస్తుంది.
 
ఫుట్‌బాల్‌ కోర్టు, విశాల ఉద్యానవనాలు
ఫుల్‌సైజ్‌ ఫుట్‌బాల్‌ కోర్టు వెనూజియా మరో విశిష్టత. మినీ గోల్ఫ్‌ కోర్స్‌, వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌ కోర్టులతోపాటు జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. పార్క్‌లు, ల్యాండ్‌స్కేపింగ్‌, వెనిస్‌ నగరాన్ని తలపించేలా నీటి కొలనులు, ఫౌంటెన్లు ఉంటాయి. 
 
 
క్లబ్‌ హౌస్‌
వెనూజియా మరొక ప్రధానాకర్షణ లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణముండే భారీ క్లబ్‌ హౌజ్‌. ఇందులో పార్టీ, యోగా హాల్‌, జిమ్‌, ఇండోర్‌ గేమ్స్‌, కాఫీ షాప్‌, క్రష్‌, ఎటిఎం, సూపర్‌ మార్కెట్‌, షాపులు, లైబ్రరీ, మినీ థియేటర్‌, మందుల షాఫు, క్లినిక్‌, స్పా-వెల్‌నెస్‌ సెంటర్‌, యూనిసెక్స్‌ సెలూన్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ సెంటర్‌, బాంక్వెట్‌ హాల్‌, రెస్టారెంట్‌, స్క్వాష్ట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టులు ఉంటాయి. త్రీ లెవెల్‌ స్విమ్మింగ్‌పూల్‌, క్లబ్‌ హౌస్‌ పైభాగంలో పచ్చిక ఇతర ప్రత్యేకతలు.
 
ఐటి కంపెనీల కోసం 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ‘టెక్నో ట్విన్‌ టవర్జ్‌’ లో కనీసం 13,000 మంది ఐటి నిపుణులు పనిచేసే సౌకర్యాలుంటాయి. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో అభివృద్ధి పరుస్తున్న ఇందులోని ఆఫీస్‌ స్పేస్‌ను చదరపు అడుగు రూ.5,500 చొప్పున విక్రయిస్తున్నాం. ఇందులో ఇప్పటికే ఎనిమిది లక్షల అడుగులకుపైగా ఆఫీస్‌ స్పేస్‌ అమ్ముడైంది. ఈ రెండు టవర్లను కలుపుతూ 10వ అంతస్థులో స్కై బ్రిడ్జి నిర్మిస్తున్నాం. గ్రౌండ్‌ ఫ్లోర్‌ మొత్తాన్నీ ఫుడ్‌ కోర్టులు, బ్యాంక్‌, జిమ్‌, మినీ కాన్ఫరెన్స్‌ హాల్స్‌కు కేటాయించాం. వాహనాలకు 2 లెవెల్‌ పార్కింగ్‌ ఇస్తున్నాం. ఇందులో పని చేసే ఉద్యోగులు సేద తీరేందుకు మూడో అంతస్తులో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రీనరీని అభివృద్ధి పరుస్తాం. ప్రతి అంతస్థులో మూడు వైపులా బాల్కనీలు ఉంటాయి. ఇండోర్‌ గేమ్స్‌కు వీలు కల్పిస్తాం.
 
హైఎండ్‌ విల్లాలు, కమర్షియల్‌ టవర్లు
మా ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే 55 ఎకరాల్లో ప్లాట్లు, 15 ఎకరాల్లో 100 విల్లాలను నిర్మించి విక్రయించాం. ప్రస్తుత 45 ఎకరాల రెసిడెన్షియల్‌, టెక్నో టవర్జ్‌ ప్రాజెక్ట్‌ పోను మిగిలిన 55 ఎకరాల్లో 25 ఎకరాల్లో ప్రీమియం విల్లాల(ట్రై విల్లాలు) నిర్మిస్తాం. మరో 30 ఎకరాల్లో కమర్షియల్‌ టవర్లు (ఆఫీసులు, బ్యాంకుల బ్యాక్‌ఎండ్‌ ఆఫీసులు, 5 స్టార్‌ హోటల్‌, సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, హాస్పిటల్‌, స్కూల్‌ ఇత్యాదివి) దశలవారీగా నిర్మించనున్నాం.
 
హైదరాబాద్‌, వైజాగ్‌, కంచికచర్లల్లోనూ..
స్థిరాస్తి రంగానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఐదు ఎకరాల్లో 45 ఫ్లోర్లతో, 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కమర్షియల్‌ టవర్‌ను నిర్మించనున్నాం. విశాఖపట్నంలోని పరవాడ, అచ్యుతాపురంలలో 450 ఎకరాలు, కృష్ణా జిల్లాలోని కంచికచర్ల- చెవిటికల్లుల మధ్య 400 ఎకరాల్లో ప్లాటింగ్‌ను అభివృద్ధి పరుస్తున్నాం.
Link to comment
Share on other sites

The only difference between Amaravati & a sci-fi film is one of them will soon be real

Amaravati

The design for what Amaravati will look like, along the banks of the river Krishna

The first phase of the dream capital city of Andhra Pradesh will be complete by the end of 2018, it is hoped. But delays, doubts & fears hang like a cloud.

Amaravati: Construction work on Andhra Pradesh’s new capital Amaravati has finally begun, and officials say the first phase of Chief Minister Chandrababu Naidu’s dream project will be complete by the end of this year.

Spread across 53,000 acres of land, Amaravati is being built virtually from scratch. Inspired by what looks like a mix of Singapore and cities that feature in sci-fi films, Naidu says he aims to make it the most “futuristic” capital city in the world.

The model for the entire city

The master plan includes a government complex modelled on New York’s Central Park, 27 townships, navigable waterways and nine themed “mini-cities”. It is projected to house 3.5 million people by 2050.

DhzSMsVr7Y_BbNKkNVs4E2cZdAz8DTKzxW53v2nC The Central Park-inspired government complex

However, that vision has only just began to take shape. As ThePrint reported previously, Amaravati has been battling problems over design, environmental clearances and acquisition of 33,500 acres of land through a unique land-pooling scheme.

A ‘futuristic’ project

Announced on 1 January 2015, Amaravati has been designed by the high-profile architect Norman Foster, of Foster + Partners, after researching and analysing cities and countries around the world, most notably Singapore.

AQ6Z_HIHCl5mL1d0BoeMYCgFP_bSav27Vdr9k635The High Court

IMG_20180410_102244-e1524326311267-734x1

The legislature

Engineering and design are complete, and physical construction has begun. The Singaporean firms Ascendas-Singbridge Pvt. Ltd. and SembCorp Development Pvt. Ltd. have been given the rights to construct. Over the last three years and four months, 95 percent of the land required for the project has been acquired.

The city aims to be completely environment friendly, and will be powered by solar energy. Traffic and vehicular pollution will be minimised through a “5-10-15” rule used in the city’s design — from any given house, all necessary and emergency services such hospitals and schools will be a 5-minute walk; open and recreational spaces will be a 10-minute walk; and work will be a 15-minute walk.

The Commissioner of the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA), Dr Sreedhar Cherukuri, says 53 percent of the first phase of the project is complete. Phase I includes government housing and basic infrastructure such as roads and power supply, and will cost around Rs 50,000 crore.

The entire city is expected to cost Rs 1 lakh crore to build, Cherukuri says.

The project’s promoters claim Amaravati will be one of the “happiest” cities in the world. The city hosted the Happy Cities Summit, an international conference on urban innovation and happiness, from 10-13 April. Naidu inaugurated the three-day summit attended by delegates from across the globe, including Finland and Bhutan, considered two of the happiest countries in the world.

“Make Amaravati your second home,” Naidu urged the participants, adding that the Andhra Pradesh government aims to use technology to enable participative governance and sustainable living to ensure a high happiness quotient.

Current status

A visit to the construction sites shows that while work has begun, not much has been accomplished yet, particularly in view of the project deadline of February 2019.

Construction work on government housing complexes — to be built using the ‘shear wall’ technology, which does not use bricks — has only just begun, but APCRDA says all complexes will be ready by the end of this year.

5eB59pS0cAUydoE0gYB9TQ9j4DnGfv7AuuvLtLW-The current stage of construction for the housing for MLAs and MLCs

In all, 3,840 apartments will be built by the end of 2018, according to Zachariah Madasu, the chief engineer for Housing & Building at APCRDA

APCRDA claims work on all the other parts of Amaravati has also begun, although the only structure standing is the temporary secretariat, from which the Andhra government has been functioning since 2015. The building was constructed in a record 139 days.

bl0r70Bx7dvFCDyskLcO9VpUjH1mjiRB8_9n7HNJHousing for the All India Staff

PLir9zpyBmd3dYg1LsORAFE6Ulg3koAy2vKI1xODHousing for the non-guested staffers

Environmental concerns

Although the project has been publicised as a marvel of sustainable engineering and design, local activists have raised concerns about its ecological viability.

Anumolu Gandhi, a local farmer and activist, says the land Amaravati will occupy is prone to floods. The city will be built on existing floodplains, setting the stage for future disasters, he fears.

The area has flooded twice in the last 20 years. In 2009, roughly 29,000 acres of the 53,000 acres going towards Amaravati’s development were flooded by the Kondaveeti Vagu, a tributary of the Krishna river.

APCRDA says it has taken measures to protect the region from floods by introducing a “lifting scheme” — Kondaveeti Vagu will be widened, and four reservoirs will be built to avoid flash-floods.

Cheruku, the commissioner, said the National Green Tribunal has reviewed the entire project and given it a green signal. “The city is completely floodproof,” he says.

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

అమరావతికి రూ.20 లక్షల విరాళమిచ్చిన సినీ నిర్మాత
23-04-2018 20:54:37
 
అమరావతి: సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 20 లక్షల విరాళం అందజేశారు. అంతేకాదు.. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది రూ. 10 లక్షల చొప్పున విరాళం ఇస్తానని నిర్మాత .. సీఎంకు చెప్పారు
Link to comment
Share on other sites

రాజధాని ప్లాట్ల రిజర్వేషన్‌లో అనాసక్తి
24-04-2018 09:10:52
 
636601578516230054.jpg
  • అంచనాలకు దూరంగా రాజధాని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు
  • అంచనాలకు దూరంగా రాజధాని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు
  • మొత్తం ప్లాట్లు 61,074
  • ఇంకా రిజిస్ట్రేషన్‌ అవ్వాల్సినవి 42,208..
  • ఫిబ్రవరిలో అత్యధికం, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం
  • అపరిష్కృత సమస్యలు, ప్లాట్లకు తగ్గిన డిమాండ్‌తో రైతుల్లో అనాసక్తి
  • సుమారు 7 నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 18,866 (30.89 శాతం)
 
రాజధానిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అత్యధిక ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరగ్గా, ఆ తర్వాతి నుంచి మాత్రం రిజిస్టరయ్యే ప్లాట్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. మొత్తంమీద ఇప్పటి వరకు కేవలం 30.89 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే పూర్తయింది. పూలింగ్‌ సమయంలో హామీలను నెరవేర్చక పోవడం.. దక్షిణ ముఖం, వీధిపోటున్న ప్లాట్లను మార్చాలన్న అభ్యర్థనలను అంతగా పట్టించుకోకపోవడం, రైతుల్లో కొన్ని విషయాలపై నెలకొన్న అనుమానాలను నివృత్తి పరచడంలో వైఫల్యం కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
 
అమరావతి(ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణార్ధం తమ భూములను పూలింగ్‌ ప్రాతిపదికన ఇచ్చిన రాజధాని రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లను వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు సీఆర్డీయే నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ మొదలైన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అత్యధిక ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరగ్గా, ఆ తర్వాతి నుంచి మాత్రం రిజిస్టరయ్యే ప్లాట్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. మొత్తంమీద ఇప్పటి వరకు కేవలం 30.89 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే పూర్తయింది. అదనపు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ప్రారంభంతో ఈ ప్రక్రియ వడివడిగా సాగి, త్వరలోనే ముగుస్తుందని అధికారవర్గాలు భావించగా తద్భిన్నంగా జరుగుతుండడానికి వివిధ కారణాలున్నాయి.
 
 
 
రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాలకు చెందిన రైతులకు కేటాయించిన నివాస, వాణిజ్య ప్లాట్ల మొత్తం సంఖ్య 61,074. వీటిని వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు సీఆర్డీయే విస్తృత ఏర్పాట్లు చేసింది. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక రిజిస్ట్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంది. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ గతేడాది అక్టోబర్‌తో ప్రారంభించి ఇప్పటి వరకూ అంటే సుమారు 7 నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 18,866 (30.89 శాతం), నెలకు సగటున 2700! అయితే ఈ సంఖ్యలో రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 14,560తోపాటు భూయజమానులు స్లాట్లు బుక్‌ చేసుకున్న మరొక 4306 ప్లాట్లు కూడా కలగలిపి ఉన్నాయి. అంటే స్లాట్లు పోను ఇప్పటి వరకూ సగటున నెలకు రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్ల సంఖ్య 2080 మాత్రమే! ఇవన్నీ పోను ఇంకా మరొక 42,208 (69.11 శాతం) ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరగాల్సి ఉంది. ఇప్పటి వరకూ సాగిన తీరునుబట్టి చూస్తే రాజధానిలోని ప్లాట్లన్నింటి రిజిస్ర్టేషన్‌ పూర్తయ్యేందుకు మరొక సంవత్సరంన్నర పట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
 
 
ఇవీ.. కారణాలు..
 లాటరీలో తమకు వచ్చిన ప్లాట్లను రిజిస్టర్‌ చేయించుకోవాల్సిందిగా సీఆర్డీయే రాజధాని రైతాంగాన్ని పదేపదే కోరుతున్నప్పటికీ, వారి సౌకర్యార్ధం అదనపు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయడం తదితర చర్యలను తీసుకున్నప్పటికీ ఈ పరిస్థితి నెలకొనడానికి వివిధ కారణాలున్నాయి.
 
పూలింగ్‌ సమయంలో హామీ ఇచ్చిన విధంగా గ్రామకంఠాలు, ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలను అధికారులు ఎంతకీ పరిష్కరించకపోవడం, దక్షిణ ముఖం, వీధిపోటున్న ప్లాట్లను మార్చాలన్న అభ్యర్థనలను అంతగా పట్టించుకోకపోవడం, రైతుల్లో కొన్ని విషయాలపై నెలకొన్న అనుమానాలను నివృత్తి పరచడంలో వైఫల్యం వీటిల్లో కొన్ని. ఇవి కాకుండా గతేడాది బడ్జెట్‌ ప్రకటన సమయంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ రాజధాని రైతులకు ప్రకటించిన క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను నుంచి మినహాయింపు కాలవ్యవధిని 2 సంవత్సరాల నుంచి పొడిగించాలన్న డిమాండ్‌కు స్పందన కొరవడడం, రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి మందకొడిగా సాగుతుండడం మరి కొన్ని కారణాలు. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తున్న నేపథ్యంలో అమరావతికి కేంద్ర ఆర్ధిక సహాయంపై ముప్పిరిగొన్న అనుమానాలతో రాజధాని ప్లాట్లను కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపకపోవడంతో రిజిస్ట్రేషన్లకు తొందరేముందన్న భావన ఇంకొక కారణం.
 
ఫిబ్రవరిలో అత్యధికం.. 
గత 7 నెలలను పరిశీలిస్తే గతేడాది అక్టోబరులో 1256, నవంబరులో 1096, డిసెంబరులో 976 రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఆ తర్వాత ఈ సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఈ సంవత్సరం జనవరిలో 1644 నమోదయ్యాయి. అదే ఊపు కొనసాగి, ఫిబ్రవరిలో అంతకు రెట్టింపునకు పైగా.. అంటే 3605 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరిగింది. తద్వారా ఆ నెల అగ్రస్థానంలో నిలిచింది. కానీ మార్చి నుంచి మాత్రం క్షీణత ప్రారంభమైంది. ఆ నెలలో 2759 రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఏప్రిల్‌లో అవి మరింతగా తగ్గడంతో సుమారు 1500కే (23వ తేదీ వరకు) వాటి సంఖ్య పరిమితమైంది. ఈ నెల 30వ తేదీలోగా మరొక 400కు అటూఇటూగా మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగే సూచనలున్నాయి. దీనినిబట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పట్ల రాజధాని రైతుల ఆసక్తి అంతకంతకూ తగ్గుతోందన్న విషయం స్పష్టమవుతోంది.
Link to comment
Share on other sites

AP Infrastructure Official @APINFRA 48m48 minutes ago

 
 

The government of Singapore also made a commitment to create an 'Innovation Corridor' in Andhra Pradesh with the help of the State government to promote greater collaboration in the field of innovation. #APInfrastructure #Development #AndhraPradesh #INCAP

DbjhVM2XkAE1s9I.jpg
Link to comment
Share on other sites

రాజధానిలో మౌలిక వసతులకు రూ.51 వేల కోట్లు
భూముల విక్రయం ద్వారా నిధుల సమీకరణ
ఆర్థిక ప్రణాళిక రూపొందించిన సీఆర్‌డీఏ
24ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.51వేల కోట్లు వ్యయమవుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) తాజాగా అంచనా వేసింది. ఏ ప్రాజెక్టులకు ఎంత ఖర్చవుతుంది? నిధుల్ని ఎలా సమకూర్చుకోవాలి? వంటి అంశాలతో ఒక ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసింది. మెకన్సే, క్రిసిల్‌ సంస్థలు దీన్ని రూపొందించాయి. రాజధానిలో రైతులకు స్థలాలు కేటాయించగా, సీఆర్‌డీఏ వాటాకు నికరంగా వచ్చే భూమిలో కొంత విక్రయించడం లేదా లీజుకివ్వడం తదితరాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలన్నది ప్రధాన ప్రతిపాదన. ప్రస్తుతానికి బ్యాంకులు, ఇతర అంతర్జాతీయ, దేశీయ ఆర్థికసంస్థల నుంచి రాజధాని ప్రాజెక్టులకు తీసుకున్న రుణాల్ని భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులతో సీఆర్‌డీఏ తిరిగి చెల్లించనుంది. రాజధానిలో సీఆర్‌డీఏ వాటాకి నికరంగా 8274 ఎకరాల భూమి వస్తుందని అంచనా. ఈ భూమిలో కొంత భవిష్యత్‌ అవసరాలకు పక్కన పెట్టి, మిగతాది విక్రయించడం లేదా లీజుకివ్వాలన్నది ప్రతిపాదన. సీఆర్‌డీఏ వాటా భూమిలో భావి అవసరాల కోసం ఎంత ఉంచాలి? ఎంత విక్రయించాలి? అన్న విషయంలో మూడు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. 45% భూముల్ని విక్రయించడం ద్వారా మొత్తం రూ.55వేల కోట్లు వరకు సమకూర్చుకోవచ్చని కన్సల్టెన్నీ సంస్థలు సూచించాయి.

ఖర్చులు ఇలా..: రాజధాని నిర్మాణ అంచనా వ్యయం రూ.48,115 కోట్లు. ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో వడ్డీల రూపంలో రూ.3,093కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని, ఈ మొత్తం కలిపితే నిర్మాణ వ్యయం రూ.51వేల కోట్లు దాటుతుందని అంచనా. నిర్వహణ వ్యయం రూ.12,017 కోట్లు. బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తానికి దీర్ఘకాలంలో చెల్లించాల్సిన వడ్డీల మొత్తం విలువ సుమారు రూ.36,500 కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ కలిపితే మొత్తం రూ.99,724 కోట్లు అవసరమవుతుంది.

రాబడి ఇలా..: మొత్తం భూమిలో 45%(3709 ఎకరాలు) విక్రయించడం/లీజుకివ్వడం ద్వారా రూ.55,842 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూ.2,500కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ రూ.7,476 కోట్లు, అభివృద్ధి ఛార్జీల రూపంలో వచ్చేది రూ.315కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ పోగా.. ఇంకా సుమారు రూ.33వేల కోట్లకుపైగా లోటు ఉంటుంది. దీని నుంచి బయట పడేందుకు రాష్ట్రప్రభుత్వం ఏటా రూ.1,800కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకు బడ్జెటరీ కేటాయింపులు జరపాల్సి ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థలు ఆర్థిక ప్రణాళికలో పేర్కొన్నాయి. సీఆర్‌డీఏ తన భూముల్ని వేలం వేసి విక్రయించడం ద్వారాను, చదరపు గజాలుగా విభజించి వివిధ సంస్థలకు లీజుకివ్వడం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మాణాలు చేపట్టి, భవనాల్ని లీజుకివ్వడం ద్వారాను నిధులు సమకూర్చుకోవచ్చునని సూచించాయి. రాజధానిలో ఏర్పాటయ్యే సంస్థల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సీఆర్‌డీఏకి కొంత మొత్తం కేటాయించాలన్నది ఆర్థిక ప్రణాళికలో ఒక ప్రతిపాదన. దీనివల్ల బ్యాంకు రుణాల్ని తిరిగి చెల్లించేందుకు వెసులుబాటు కలుగుతుందని, నిర్దిష్ట ఆదాయ వనరులుంటే తక్కువ వడ్డీకి రుణాలిచ్చేలా బ్యాంకులపై ఒత్తిడి తెచ్చేందుకు అవకాశముంటుందని తెలిపాయి.

పరిపాలన నగరానికి ప్రత్యేక ప్రణాళిక..: రాజధాని అమరావతిలో విద్యుత్‌, సమాచార తంత్రులు(కమ్యూనికేషన్‌ వైర్లు), తాగునీరు, గ్యాస్‌, మురుగునీటి పారుదల మొదలైన వ్యవస్థలకు పైపులైన్లు వేసేందుకు డక్ట్‌లు నిర్మిస్తున్నారు. రాజధానిలో అన్ని కేబుళ్లూ, పైప్‌లైన్లు వీటి ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. రాజధానికి వచ్చే వాణిజ్య సంస్థలు వివిధ అవసరాల కోసం వీటిని వినియోగించుకున్నందుకు వాటి నుంచి ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున వసూలుచేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. తద్వారా వచ్చే ఆదాయం మున్ముందు చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా. రాజధానిలో 1350 ఎకరాల్లో నిర్మించే పరిపాలన నగరానికి ప్రత్యేకంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని సీఆర్‌డీఏ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇక్కడి పలు ప్రాంతాల్ని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దనున్నారు. పరిపాలన నగరంలోని కాలువల్లో జల విహారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి ఆదాయ మార్గాలు ఏమున్నాయో చూడాలని, పరిపాలన నగర నిర్మాణం, నిర్వహణకయ్యే ఖర్చుని వీలైనంతగా అక్కడి నుంచే రాబట్టేలా, భవిష్యత్తులో స్వయం సమృద్ధి సాధించేలా ఈ ప్రణాళిక ఉండాలన్నది ఆలోచన.

Link to comment
Share on other sites

సీఆర్‌డీఏ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం సమీక్ష
25-04-2018 13:38:16
 
636602602959040462.jpg
అమరావతి: సీఆర్‌డీఏ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతి ఆర్థిక ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు రూ.166 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందుకోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్‌ఆర్ఐలను భాగస్వాములను చేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
 
రాజధానిలో మున్ముందు జనాభా పెరుగుతుంది: చంద్రబాబు
25-04-2018 13:48:51
 
636602609306071103.jpg
అమరావతి: రాజధానిలో 10 ఎకరాల్లో మాల్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధానిలో థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్‌ సదుపాయాలు కల్పించాలని తెలిపారు. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్మాణం, ప్రైవేట్ సంస్థల నిర్వహణలో మాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏడాదిలో 38 వేల కుటుంబాలు ఇక్కడికి వస్తాయని, ముందు ముందు రాజధానిలో జనాభా పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. మరోవైపు రాజధానిలో ప్రధాన రహదారుల వెంట కంటైనర్ హోటళ్ల ఏర్పాటుకు ఫార్య్చూన్, షెరటాన్ సంస్థలు ముందుకు వచ్చాయి.
Link to comment
Share on other sites

అమరావతి ఆర్థిక వనరుగా మారాలి: చంద్రబాబు

01542625BRK91A.JPG

అమరావతి: ఆదాయాన్ని పెంచడం ద్వారా రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రానికి వనరుగా మార్చాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చుకునే క్రమంలో మున్ముందు  ప్రభుత్వానికి ఉన్న అవకాశాలను జారవిడ్చుకోకూడదని సూచించారు. ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చునేప్పుడు ప్రభుత్వానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయేలా కాకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునేలా విధానాలు ఉండాలని స్పష్టం చేశారు.

సీఆర్‌డీఏ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కోసం రూ.166 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
బాండ్ల ద్వారా ఎన్‌ఆర్ఐలను భాగస్వాముల్ని చేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో ఈ సమావేశంలో చర్చించారు.
గ్యాస్ స్టేషన్లు, పైప్ లైన్ డక్టులు వంటివి రాజధానిలో ఏర్పాటుచేసి మౌలిక సదుపాయాల కోసం యూజర్ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవచ్చునని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ ప్రతిపాదించారు. ఇదే సమావేశంలో అన్న క్యాంటీన్లపై పురపాలక శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు మంజూరు అయ్యాయని.. ఇప్పటికే 187 క్యాంటీన్లకు స్థలాలు గుర్తించినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అందులో 39 స్థలాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఏజెన్సీల సంసిద్ధతను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
నిర్ణీత గడువులోగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇకపై వారం వారం అన్న క్యాంటీన్ల ఏర్పాటు పురోగతిపై సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

 

Link to comment
Share on other sites

అపార్టుమెంట్లు నిర్మించి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తాం: మంత్రి నారాయణ
25-04-2018 17:05:08
 
636602727077475887.jpg
అమరావతి: రాజధాని సచివాలయ భవనాల నిర్మాణానికి రెండు రోజుల్లో టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని రైతులు ఇంకా 1500 ఎకరాలు ఇవ్వాల్సి ఉందన్నారు.
 
అమరావతిలో 1000 అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. 1200, 1500, 1800 చదరపు అడుగుల్లో అపార్టుమెంట్ల నిర్మిస్తామని చెప్పారు. అపార్టుమెంట్లు నిర్మించి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తామని వెల్లడించారు. త్వరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. ఆనం వివేకా మృతికి నారాయణ సంతాపం తెలిపారు. నెల్లూరుకు ఆయన ఎంతో సేవ చేశారని గుర్తుచేశారు.
Link to comment
Share on other sites

9 hours ago, sonykongara said:

sMR47Pf.jpgopjqiGh.jpg

Chinnaavutupalli - Gollapudi crucial.

alage gollapudi - new bridge on Krishna river also

until then no use for public 

Chinnaavutupalli - Gundugolanu panulu matrame chestaru anipisthundi

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...