Jump to content

Recommended Posts

రాజధానిలో ఐటీ టవర్లు, సివిల్ కోర్టు భవనం.. త్వరలో నిర్మాణాలు’
03-04-2018 23:03:46
 
636583934266915930.jpg
అమరావతి: రాజధానిలో 6 టవర్లలో 12 అంతస్తులుగా 144 క్వార్టర్స్ నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఐఏఎస్‌ల గృహ నిర్మాణాలను పరిశీలించారాయన. డిసెంబరు నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. రాజధానిలో రహదారుల పనులు వేగంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. త్వరలో ఐటీ టవర్లు, సివిల్ కోర్టు భవనం ప్రారంభిస్తామన్నారు. అత్యాధునికమైన రాజధాని నిర్మాణంలో ఇటుకలు వాడటం లేదని స్పష్టం చేశారు. రాజధాని నిధులకు యూసీలు ఇచ్చామని అన్నారు. ఎవరైనా కేంద్రం నుంచి ఆ వివరాలు తెప్పించుకోవచ్చని మంత్రి చెప్పారు.

Share this post


Link to post
Share on other sites

తుళ్ళూరు,న్యూస్‌టుడే: అమరావతి రాజధాని నగరంలో చేపట్టిన గృహసముదాయ ప్రాజెక్టుల పనులను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ డా.చెరుకూరి శ్రీధర్‌, అదనపు కమిషనర్‌ షణ్మోహన్‌లు మంగళవారం పరిశీలించారు.

ప్యాకేజీ-1లో చేపట్టిన ఎమ్మెల్యే, ఆలిండియా సర్వీసు అధికారుల నివాసాల పనులను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏఐఎస్‌ అధికారుల ఇళ్లకు సంబంధించిన 6 టవర్లుకు పైల్స్‌ పూర్తయ్యాయని, ఒక్క టవర్‌ స్టిల్డ్‌ శ్లాబు పూర్తయిందని, కాంట్రాక్టు సంస్థప్రతినిధులు వివరించారు. 5టవర్ల రాఫ్ట్‌ శ్లాబులు పూర్తయ్యాయని వీటిలో 4 శ్లాబులు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని వివరించారు. మే10లోగా 6వ టవర్‌స్టిల్డ్‌ శ్లాబు వేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలకు సంబంధించి 12 టవర్లకు  8 టవర్ల ఫైల్స్‌ను వారంలో పూర్తిచేస్తామని, మిగిలినవి ఈనెల22 లోపు పూర్తి చేస్తారని ప్రతినిధులు మంత్రి నారాయణకు చెప్పారు.

నేలపాడులో ప్యాకేజీ-2లో ఎల్‌అండ్‌టీ సంస్థ చేపట్టిన ఎన్‌జీవోల ఇళ్ల పనులను ప్యాకేజీ-3లో షాపూర్జీ పల్లోంజీసంస్థ చేపట్టిన గెజిటెడ్‌ అధికారులు, గ్రూప్‌-డి(క్లాసు-4)నివాసాల పనులు, ఎల్పీఎస్‌ ఇన్‌ఫ్రా పనులను సీఆర్‌డీఏ కమిషనర్‌ డా.చెరుకూరి శ్రీధర్‌ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, కార్మికులను అధికంగా తీసుకువచ్చి పనుల్లో వినియోగించాలని గుత్తేదారులకు ఆదేశాలు జారీచేశారు.

 

ప్యాకేజీ-2లో ఎల్‌అండ్‌టీ చేపట్టిన ఎన్జీవో అధికారుల నివాసాల పనుల్లో 22 టవర్లుకు 70 శాతం ఫైల్స్‌ పూర్తయ్యాయని ఈనెల 25లోగా మిగిలినవి పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థకు చెందిన ప్రతినిధులు తెలిపారు. ఎల్పీఎస్‌ జోన్‌-1,2,3 పనుల ప్రగతిని పరిశీలించారు.

 

మంత్రి వెంట సీఈలు టి.ఆంజనేయులు, ఎం.జక్రయ్య, జక్కా శ్రీనివాసరావు, ఎస్‌ఈ సీహెచ్‌ ధనుంజయ, ప్రాజెక్టు మేనేజరు దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this post


Link to post
Share on other sites
అమరావతిని ఆపలేరు
04-04-2018 02:55:00
 
636584080235666770.jpg
 • ప్రపంచంలో అత్యున్నత రాజధానిని నిర్మిస్తాం
 • ఎన్జీటీ అనుమతుల మేరకే నిర్మాణం
 • రాజధానికి నిధులివ్వకుండా నిందలా?
 • యూసీలన్నీ ఇచ్చేశాం.. చూసుకోండి
 • మండలిలో మంత్రి నారాయణ స్పష్టీకరణ
 • ఎన్జీటీ తీర్పులను తుంగలో తొక్కారు: బీజేపీ
అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘ఎవరి రాజధాని అమరావతి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎవరిదీ కాదు. 5 కోట్ల మంది ఆంధ్రుల సొత్తు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కు తగ్గేది లేదు. అమరావతిని నిర్మిస్తాం... ప్రపంచ అత్యున్నత రాజధానుల్లో ఒకటిగా నిలుపుతాం’ అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంపై మంగళవారం శాసన మండలిలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా మోదీ మోసం చేశారు. రాజధాని కట్టడం ఇష్టంలేకే వైసీపీ పంట పొలాలను తగులబెట్టించింది. వైసీపీ నేతలు కార్లు వేసుకుని తిరిగారు. కేసులు వేయించారు. అయినా రాజధాని నిర్మాణాన్ని ఆపలేకపోయారు. ఎన్జీటీ తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అంటున్నారు.
 
సీఆర్‌డీఏ అప్రూవల్‌ కూడా ఎన్జీటీ ప్రకారమే చేశాం. ఎన్జీటీ సూచనల ప్రకారం ఇంప్లిమెంట్‌ కమిటీ, సూపర్‌ విజ్‌ కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీ నివేదికను ఎన్జీటీకి పంపాం. స్విస్‌ చాలెంజ్‌లో రెండు కంపెనీలే ఉన్నాయని.. సింగపూర్‌ అమరావతి హోర్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చిందని, స్టార్ట్‌అప్‌ ఏరియా అభివృద్ధిలో ఈ కంపెనీకి ఎలా భాగస్వామ్యం కల్పించారంటూ జగన్‌ పత్రిక అసత్యపు రాతలు రాస్తోంది. ఇది కొత్త కంపెనీ కాదు. స్విస్‌ చాలెంజ్‌లో ఉన్న రెండు కంపెనీలే సింగపూర్‌, అమరావతి హోర్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా ఏర్పడ్డాయి. భవిష్యత్తులో రాజధాని ప్రాంతమే కాకుండా గుంటూరు, విజయవాడ నగరాలు కలిసి గ్రేటర్‌ అమరావతి నగరంగా ఏర్పాటవుతుంది’ అని మంత్రి వివరించారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నింటికీ యూసీలు ఇచ్చామని, అయినా ఇవ్వలేదంటూ బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు.
 
యూసీలన్నీ కేంద్రం వద్దే ఉన్నాయి... చూసుకోవచ్చు అని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి ఎంపికపై మంత్రి మాట్లాడుతూ.. ‘శివరామకృష్ణన్‌ కమిటీ రాజధానికి అనుకూలమంటూ గుంటూరు, విజయవాడ, ప్రకాశం ఇలా రకరకాలుగా చెప్పింది. చివరిగా సీఎం నిర్ణయించుకోవ్చని పేర్కొంది. 13 జిల్లాలకు సమాన దూరం కోసమే కృష్ణా, గుంటూరు మధ్య రాజధాని నిర్మిస్తున్నాం’ అని వివరణ ఇచ్చారు. ‘రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు ఇప్పటికే 1260 ఎకరాలు ఇచ్చాం. వీటి ద్వారా 22 వేల కోట్లు పెట్టుబడి వస్తోంది. రాజధాని నిర్మాణానికి అప్పులు చేయటం ఎందుకని బీజేపీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేయకుండా ఎలా జరుగుతుంది? కేంద్రం కూడా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటోంది. రాజధాని నిర్మాణానికి విరాళాలు, నిధులు ఇవ్వటానికి ప్రజలు ముందుకు రావటం శుభపరిణాం’ అన్నారు.
 
తొలుత టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఐవైఆర్‌ కృష్ణారావు రాజధాని ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎస్సీలది... ఎస్టీలది.. బీసీలది. ఎస్సీ నియోజకవర్గంలోనే రాజధాని ఉంది’ అని చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని చెడగొట్టటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి పైసా ఇవ్వకుండా ఢిల్లీ లాంటి రాజధాని నిర్మిస్తానని చెప్పారని.. ఎలా నిర్మిస్తారని టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు చాలా ఎక్కువని బీజేపీ మాట్లాడుతోందని బచ్చుల అర్జునుడు వ్యాఖ్యానించారు. అమ్మపెట్టదు.. అడుక్కోనివ్వదు అన్న చందంగా బీజేపీ ప్రవర్తిస్తోందని.. దీనిని తెలుగు జాతి క్షమించదన్నారు. రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ నరసింహారెడ్డి కోరారు.
 
అప్పులు చేసి నిర్మాణమా?: మాధవ్‌ ధ్వజం
‘రాజధానిని అప్పులతో నిర్మించాలని ప్రభుత్వం చూస్తోంది. అప్పులు చేసి రాజధాని నిర్మించిన చరిత్ర ఎక్కడా లేదు’ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ విమర్శించారు. రాజధాని అనుమతుల కోసం సస్యశ్యామలంగా ఉండే ప్రాంతాన్ని డ్రైల్యాండ్‌గా రాష్ట్ర ప్రభుత్వం చూపించిందని ఆరోపించారు. డిజైన్లు పూర్తికాకుండా డీపీఆర్‌ ఎలా పంపుతారని ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని ఎన్జీటీ చెప్పిందని.. ఎన్జీటీ తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని, మాస్టర్‌ ప్లాన్‌ను మార్చాలని కోరారు. మోదీని అతిథిగా పిలిచి.. ఇప్పుడు నీరు.. మట్టి ఇచ్చారని అవమానిస్తున్నారని.. అతిథిని అవమానించడం తగదని చెప్పారు.

Share this post


Link to post
Share on other sites
అమరావతికి ఐదు దారులు!
05-04-2018 03:05:05
 
 • ఆ రోడ్లను విస్తరించి సంధానించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి
 • రాష్ట్ర సర్కారు ప్రతిపాదన
అమరావతి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానికి రహదారులను కనెక్టివిటీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో పేర్కొన్న హామీని నెరవేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. అమరావతికి ఐదురోడ్లను అనుసంధానం చేయాలని, ఆయా రోడ్లను విస్తరించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఐదురోడ్ల విస్తరణకు, అనుసంధానం కోసం అవసరమైన భూసేకరణలో 25శాతం భరిస్తామని, మిగతా భూసేకరణ ఖర్చు కేంద్రం భరించాలని కోరింది. సాధారణంగా జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఖర్చు విషయంలో ఇలాగే చేస్తారన్న విషయాన్ని గుర్తుచేసింది. పైగా చట్టంలో ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొంది. ఈ ఐదు రహదారులను జాతీయ రహదారులుగా పరిగణించి, వాటిని పీపీపీ పద్ధతిలో లేక టోల్‌ పద్ధతిలో కేంద్రం నిర్మిస్తుంది. కాబట్టి కేంద్రంపై కూడా పెద్దగా భారం ఉండదని, కావాల్సిందల్లా ఏపీకి ఇచ్చిన హామీని అమలుచేయాలన్న దృక్పథమేనని రాష్ట్రప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
 
ఆ ఐదురోడ్లు ఇవే..
1) 180 కిలోమీటర్ల పొడవైన ఔటర్‌ రింగురోడ్డుని అమరావతి పరిధి చుట్టూ వేస్తారు.
2) రాయలసీమ నుంచి రాజధానికి అనుసంధానం చేస్తూ అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తారు.
3) హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో ఇంకా కొంతభాగం ఆరులేన్లుగా నిర్మాణం జరగలేదు. దాన్ని విస్తరించి, అమరావతికి అనుసంధానించాలి.
4) విజయవాడ-ఇబ్రహీంపట్నం-తిరువూరు-భధ్రాచలం రోడ్డు...రాజధానికి వచ్చేందుకు ముఖ్యమైన మార్గమే. దీన్ని అనుసంధానం చేయాలి.
5) నాగార్జునసాగర్‌-మాచర్ల-రెంటచింతల-సత్తెనపల్లి-గుంటూరు రహదారిని విస్తరించి అమరావతికి అనుసంధానం చేయాలి.
 
 
నాలుగు కాదు.. ఆరే కావాలి..
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేను తొలుత ఆరులైన్లుగా పేర్కొనగా...కేంద్రం 4వరుసలే వేస్తామని తాజాగా ప్రతిపాదించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పంపిన ప్రతిపాదనలో ఆ రహదారిని ఆరువరుసలుగానే చేయాలని పునరుద్ఘాటించింది. రాజధానికి అభివృద్ది బాటలు పడేందుకు, అభివృద్ది చెందేందుకు కనీస అవసరాలైన రహదారులనైనా అనుసంధానించాలని పేర్కొంది. అమరావతికి ప్రతిపాదించిన 5రహదారులను అనుసంధానం చేస్తేనే రాజధానికి వచ్చేందుకు అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని వివరించింది. నూతన రాజధానికి మౌలిక సదుపాయాల కల్పన చేస్తామన్న అంశాన్నీ, రోడ్లను విస్తరించి, అనుసంధానం చేస్తామన్న హామీనీ నెరవేరినట్లు అవుతుందని పేర్కొంది. ఈ హామీని అమలుపరిచే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది.

Share this post


Link to post
Share on other sites
అభివృద్ధిని చూసి మాట్లాడండి
4ap-state3a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో జరుగుతున్న మౌలిక వసతుల పనులు; గృహ సముదాయాల నిర్మాణాన్ని.. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. బుధవారం శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు బస్సుల్లో వీరంతా అభివృద్ధి పనుల్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పురపాలక మంత్రి పి.నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేలపాడు, రాయపూడి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్ని సందర్శించారు. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా ఈ బృందంలో ఉన్నారు. తొలి విడతలో నిర్మాణ పనులు మొదలు పెట్టిన ఏడు ప్రాధాన్య రహదారుల పురోగతిని పరిశీలించారు. రాయపూడి వద్ద జరుగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారుల నివాస భవనాల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ సంస్థ సిబ్బంది పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ప్రాజెక్టు పురోగతిని వివరించారు.

Share this post


Link to post
Share on other sites
రాజధాని రహదారులకు హరిత శోభ
06-04-2018 08:02:48
 
636585985694877712.jpg
మంగళగిరి: రాజధాని అమరావతికి సమీపంలో వున్న జాతీయ రహదార్లను సీఆర్డీయే అతి సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే గన్నవరం-విజయవాడ, ఇబ్రహీంపట్నం-విజయవాడ, విజయవాడ-గుంటూరు మధ్య వున్న హైవే స్ట్రెచ్‌లను గ్రీనరీతో అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దింది. జాతీయ రహదారుల నడుమ వున్న సెంట్రల్‌ వెర్జ్‌లో పలు రకాల పుష్పజాతులకు చెందిన అందమైన మొక్కలతోపాటు మరికొన్ని క్రోటాన్స్‌ను ఏర్పాటు చేశారు. వీటికితోడు అమరావతికి దారితీసే హైవేల నడుమ సెంట్రల్‌ లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కనకదుర్గ వారధి నుంచి మంగళగిరి జంక్షన్‌ వరకు రూ.2.14 కోట్ల వ్యయంతో సీఆర్డీయే సెంట్రల్‌ లైటింగ్‌ పనులను జరిపిస్తోంది.
 
    ఇంచుమించు ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. వీటితోపాటు తాజాగా హైవే సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణ కోసం మరికొన్ని చర్యలను కూడా చేపట్టింది. విజయవాడ నుంచి గుంటూరు ఆవలి వరకు ఆరు లేన్ల జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను సైతం నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సర్వీసు రోడ్లకు, హైవేకు నడుమ వున్న ఖాళీ స్థలాల్లో పలు రకాల మొక్కలను నాటుతున్నారు. ఈ మొక్కలు వృక్షాలుగా ఎదిగితే హైవేపై కాలుష్యం తీవ్రత తగ్గడంతోపాటు రహదారి పొడవునా చల్లని గాలులు, సేదతీర్చే నీడ అమరినట్టవుతుంది. అలాగే, పలుచోట్ల సర్వీసు రోడ్లను హైవేలతో అనుసంధానించే కూడళ్ల వద్ద వున్న ఐలాండ్స్‌ను కూడా అందంగా సుందరీకరిస్తున్నారు. ఐలాండ్స్‌ను పచ్చని గడ్డితోను, పలు రకాల క్రోటాన్స్‌తోను నింపుతూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.

Share this post


Link to post
Share on other sites
నాడు హైదరాబాద్‌.. నేడు అమరావతి
07-04-2018 07:45:01
 
636586839025352669.jpg
 • సత్తా చాటుదాం
 • రాజధానిపై డాక్యుమెంటరీ విడుదల చేసిన టీడీపీ
అమరావతి: రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి శ్రమను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేక వీడియోను శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లో రాళ్ల గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని ఐటీ నగరంగా ఆయన ఎలా తీర్చిదిద్దారు... దానికి ఎంత కష్టపడ్డారు... దానివల్ల హైదరాబాద్‌ రూపు రేఖలు ఎలా మారాయి... ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఆయన ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు... దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలతో ‘మన చంద్రబాబు... మన అమరావతి’ పేరుతో ఈ వీడియో రూపొందింది. చాలా చక్కగా ఈ వీడియో రూపొందిందని, కొత్త రాజధాని నిర్మాణ అవసరం, దాని ప్రణాళికలపై ఇది మంచి అవగాహన కలిగిస్తోందని కొందరు మంత్రులు పేర్కొన్నారు.

Share this post


Link to post
Share on other sites
బహుళ వంతెనల నిర్మాణాలకు ప్రణాళిక
07-04-2018 07:52:19
 
636586843406598929.jpg
తుళ్లూరు: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి రాజధానిలోని ఉద్దండ్రాయునిపాలెం వరకు నిర్మించదలచిన ఐకానిక్‌ బ్రిడ్జీ ప్రదేశాలను శుక్రవారం అమరావతి డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ సంస్థ అధికారులతో కలసి ఏండీ లక్ష్మీ పార్థసారధి పరిశీలించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను అనుసంధానం చేస్తు కృష్ణానదిపై ఈ ఐకానిక్‌ బ్రిడ్జీ నిర్మాణం చేయటానికి ఏడీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్న ఈ బహుళ వంతెన నిర్మాణానికి అధికారులు సన్నద్ధం కావాలని ఆమె సూచించారు. ముందుగా ఐకానిక్‌ బ్రిడ్జీల మ్యాప్‌ను ఆమె పరిశీలించారు. ఈ పర్యటనలో ఏడీసీ అధికారులు జి.రత్నకుమార్‌, మోజెస్‌ కుమార్‌, బి.రామయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post


Link to post
Share on other sites

07ap-story3a.jpg

రాజధాని అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ నిర్మాణ పనులకు అవసరమైన కంకరను ఎల్‌ అండ్‌ టీ సంస్థ కృష్ణా నదిలో భారీ పంటుపై ఇలా టిప్పర్ల  ద్వారా తరలిస్తోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఫెర్రీ ఘాట్‌ నుంచి బయలుదేరే ఈ పంటు రాజధాని ప్రాంత సమీపంలోని ఉండవల్లికి  చేరుకుంటుంది. అనంతరం వాహనాలు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటాయి. సాధారణంగా ఈ వాహనాలు పూర్తిగా రహదారిపై ప్రయాణించి ఇక్కడికి చేరుకోవాలంటే.. విజయవాడ నగరం మీదుగా కృష్ణా నది చుట్టూ సుమారు 60 కి.మీ.ల దూరం తిరిగిరావాల్సి ఉంటుంది. ఇందుకు మూడు గంటల సమయం తీసుకోవడం సహా ట్రాఫిక్‌, కాలుష్యం తదితర సమస్యలు తలెత్తడంతో స్థానికులూ ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ అసౌకర్యాల నివారణకు నదీమార్గాన్ని ఎంచుకొని ఒకే దఫాలో 12 టిప్పర్లను తీసుకెళుతున్నారు. ప్రస్తుతం 20 నిమిషాల్లోనే వాహనాలు గమ్యస్థానానికి చేరుతుండటంతో దూరాభారం తగ్గి ఇంధనం కూడా ఆదా అవుతోందని ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

- ఈనాడు, అమరావతి

Share this post


Link to post
Share on other sites
1 hour ago, rk09 said:

07ap-story3a.jpg

రాజధాని అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ నిర్మాణ పనులకు అవసరమైన కంకరను ఎల్‌ అండ్‌ టీ సంస్థ కృష్ణా నదిలో భారీ పంటుపై ఇలా టిప్పర్ల  ద్వారా తరలిస్తోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఫెర్రీ ఘాట్‌ నుంచి బయలుదేరే ఈ పంటు రాజధాని ప్రాంత సమీపంలోని ఉండవల్లికి  చేరుకుంటుంది. అనంతరం వాహనాలు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటాయి. సాధారణంగా ఈ వాహనాలు పూర్తిగా రహదారిపై ప్రయాణించి ఇక్కడికి చేరుకోవాలంటే.. విజయవాడ నగరం మీదుగా కృష్ణా నది చుట్టూ సుమారు 60 కి.మీ.ల దూరం తిరిగిరావాల్సి ఉంటుంది. ఇందుకు మూడు గంటల సమయం తీసుకోవడం సహా ట్రాఫిక్‌, కాలుష్యం తదితర సమస్యలు తలెత్తడంతో స్థానికులూ ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ అసౌకర్యాల నివారణకు నదీమార్గాన్ని ఎంచుకొని ఒకే దఫాలో 12 టిప్పర్లను తీసుకెళుతున్నారు. ప్రస్తుతం 20 నిమిషాల్లోనే వాహనాలు గమ్యస్థానానికి చేరుతుండటంతో దూరాభారం తగ్గి ఇంధనం కూడా ఆదా అవుతోందని ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

- ఈనాడు, అమరావతి

bro, edi e roju news naku kanapadala

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×