Jump to content

Amaravati


Recommended Posts

ప్రవాసాంధ్రుల నుంచి రాజధానికి నిధులు..!
విధాన రూపకల్పనకు కమిటీ ఏర్పాటు
ఐటీ టవర్‌కు ప్రాథమికంగా ఐదు ఆకృతులు
ప్రజాభిప్రాయాన్ని అనుసరించి తుది ఆకృతి ఎంపిక
రాజధాని పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
సకాలంలో చేయలేకపోతే వెళ్లిపోవాలని గుత్తేదారులకు స్పష్టీకరణ
28ap-main8d.jpg
ఈనాడు అమరావతి: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అనుమానమేనని, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాజధాని పనుల పురోగతిపై బుధవారం సచివాలయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో ఆయన సమీక్షించారు. రాజధాని ప్రాజెక్టులకు నిధుల పరిస్థితిపై వాకబు చేశారు. బాండ్లు, ఇతర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఇటీవల తాను అమెరికాలో పర్యటించినప్పుడు అక్కడి ప్రవాసాంధ్రులు, కొన్ని సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యానని, రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తిగా ఉన్నారని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ చెప్పారు. అమెరికాలో బ్యాంకులు ఇచ్చే వడ్డీ శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. హడ్కో వంటి సంస్థల నుంచి రుణం తీసుకుంటే 8.5 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తోందని, ప్రవాసాంధ్రులు, ఇతరుల నుంచి బాండ్ల రూపంలో సమీకరిస్తే 5-6 శాతం వడ్డీకే నిధులు సమకూరే అవకాశం ఉందని ఆయన వివరించారు. దీనిపై ఒక విధానాన్ని రూపొందించేందుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌తో ఒక కమిటీని నియమించాలని ఆదేశించారు. రాజధానిలో రహదారులు, అధికారులు, ప్రజాప్రతినిధుల నివాస గృహాల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి గుత్తేదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం పనులు చేయడం సాధ్యంకాని వాళ్లు, ప్రాజెక్టుని విడిచి పెట్టి వెళ్లిపోవచ్చని ఆయన ఘాటుగానే హెచ్చరించారు. పనులన్నీ గడువులోగా పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. నివాస గృహాల కోసం నిర్మిస్తున్న 62 టవర్లలో అక్టోబరు నాటికి 17, నవంబరు నాటికి మరో 17, 2019 జనవరికి మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ పనుల పురోగతికి సంబంధించి డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన వీడియోలను ఆయన తిలకించారు. రాజధానిలో ప్రస్తుతం చాలా పనులు జరుగుతున్నా, ప్రజలకు ఆ విషయాలు తెలియడం లేదని, డ్రోన్‌ చిత్రాలను, ఇతర సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచాలని చెప్పారు. రాజధానిలో సీఆర్‌డీఏ నిర్మించే ఐటీ టవర్‌కి సంబంధించి ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ, జెనిసిస్‌ సంస్థలు రూపొందించిన కొన్ని ఆకృతుల్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఐదు ఆకృతుల్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు. వాటిని సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని సూచించారు. నీరుకొండ వద్ద కొండపై నిర్మించతలపెట్టిన ఎన్టీఆర్‌ స్మృతివనం ప్రాజెక్టుకి సంబంధించిన మరికొన్ని ఆకృతుల్ని పరిశీలించారు. వాణిజ్యపరంగా ఈ ప్రాజెక్టుని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. ఎల్పీఎస్‌ లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి పనుల్ని సమీక్షించారు. రాజధాని పరిపాలన నగరంలో నిర్మించే సచివాలయం ఆకృతులు సిద్ధమయ్యాయని, మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని ముఖ్యమంత్రికి కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు.  పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఉన్నతాధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు.
28ap-main8c.jpg
10 లక్షల చ.అడుగుల ఐటీ టవర్‌
రాజధాని అమరావతిలో 10 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన ఐటీ టవర్‌ని సీఆర్‌డీఏ నిర్మించనుంది. జంట టవర్లు, ఒకే టవర్‌... ఇలా పలు ఆకృతులు సిద్ధం చేసింది. పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని ఐదు టవర్లుగా నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. భవనాల్లో స్తంభాలు లేకుండా, డయాగ్రిడ్‌ విధానంలో వీటిని నిర్మించనున్నారు. వాటి బాహ్య స్వరూపం ఎలా ఉండాలో ఖరారు చేశారు. త్వరలో టెండర్లు పిలవనున్నారు.
28ap-main8a.jpg
 

28ap-main8b.jpg

Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణంలో పాల్గొనండి
29-03-2018 04:30:19
 
636578946206542195.jpg
  • బాండ్ల ద్వారా నిధుల సమీకరణ
  • ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు
అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతిలో ప్రతి ఒక్కరూ ఒక ఇటుకైనా భాగస్వామ్యం ఉందని చెప్పుకోవాలి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కష్టపడాలి. అమరావతి కోసం ప్రత్యేక బాండ్ల ద్వారా నిధులు సేకరిస్తాం’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రవాసాంధ్రులు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే బదులు అమరావతి కోసం జారీ చేసే బాండ్లలో పెట్టాలని కోరారు. ఆయన బుధవారం శాసనసభలో భావోద్వేగంతో ప్రసంగించారు. ‘‘కేంద్రానిది దుర్మార్గమని ఈ గడ్డపై పుట్టిన వాళ్లంతా అంటున్నారు. ఎందుకు ఏపీపై కక్ష? న్యాయం చేయాలని అడిగితే ఎదురు దాడికి దిగుతున్నారు’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
Link to comment
Share on other sites

ఆకర్షణీయంగా.. అమరావతి మెరీనా
30-03-2018 07:35:30
 
636579921316069077.jpg
  •  రూ.40 కోట్లతో ఏర్పాటు
  •  మెరీనా బే తరహాలో రూపకల్పన
  •  8.38 ఎకరాల కేటాయింపు
  •  వెంకటపాలెం వద్ద కృష్ణా ఒడ్డున లాహిరి..లాహిరిలో
 
 
 
 
నవ్యాంధ్ర రాజధానికి ప్రత్యేక ఆకర్షణగా ఓ నూతన ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. సింగపూర్‌లోని మెరీనా బే తరహాలో వెంకటపాలెం వద్ద రూ.40 కోట్ల వ్యయంతో అమరావతి మెరీనా పేరుతో ప్రత్యేక రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కరకట్ట నుంచి కృష్ణా నది వైపు 8.38 ఎకరాలను కేటాయించింది. ఏప్రిల్‌ నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని జల సంబంఽధిత క్రీడలతో పాటు పలు రీజనల్‌, జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించేందుకు అనువుగా అభివృద్ధి చేస్తారు.
 
 
(మంగళగిరి): ప్రపంచంలోని నాలుగు చెరగులా వున్న ప్రత్యేక ఆకర్షణలకు నెలవుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపుదిద్దుకోనుంది. అమరావతికి సెంట్రల్‌ పార్కు ఓ ప్రత్యేక హరితాభరణం కానుండగా.. రాజధానికి 25 కిలోమీటర్ల పొడవున వుండే కృష్ణాతీరాన్ని పలురకాల పార్కులు, గ్రీనరీలతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సీడ్‌ క్యాపిటల్‌కు ఉత్తర ఈశాన్యంలో వెంకటపాలెం వద్ద అందమైన రిక్రియేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ప్రపంచంలో అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్న సింగపూర్‌లోని మెరీనా బే తరహాలో వెంకటపాలెం వద్ద రూ.40 కోట్ల వ్యయంతో అమరావతి మెరీనా పేరుతో ప్రత్యేక రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును చేపడుతోంది. ఇందుకోసం వెంకటపాలెం వద్ద కరకట్ట నుంచి కృష్ణానది వైపు 8.38 ఎకరాలను కేటాయించింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను కూడ ప్రభుత్వం చేపట్టింది. ఏప్రిల్‌ నెలాఖరులోగా టెండర్లను ఖరారు చేసే అవకాశం వుంది. ఏపీ సీఆర్డీయే ఆఽధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. డీబీఎఫ్‌వోటీ విధానంలో పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును రెండేళ్లలో రెండు దశలుగా పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసమై ప్రభుత్వం మొత్తం 8.38 ఎకరాలను కేటాయించింది. ఇందులో 7.38 ఎకరాలను కరకట్ట నుంచి కృష్ణానదివైపు, మరో ఎకరాన్ని కరకట్టకు ఈవలివైపు కేటాయించారు. తొలిదశ పనులను ఏడాదిలోగా, రెండోదశ పనులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా బోటింగ్‌ కేంద్రం వుంటుంది. లాంచింగ్‌ స్టేషన్‌లో నాలుగు రకాలైన బోట్లు ఇరవై వరకు అందుబాటులో వుంటాయి. ఈ ప్రాంతాన్ని జల సంబంఽధిత క్రీడలతో పాటు పలు రీజనల్‌, జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించేందుకు అనువుగా అభివృద్ధి చేస్తారు. వీటితోపాటు రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులను ఏర్పాటుచేస్తారు. ఈ ప్రాజెక్టును కాంట్రాక్టు సంస్థ 33 ఏళ్లపాటు సొంతంగా నిర్వహించుకోవచ్చు. లీజు పీరియడ్‌ ముగిశాక సీఆర్డీయేకు తిరిగి అప్పగించాల్సివుంటుంది. సీఆర్డీయే నుంచి లీజుకు తీసుకున్న 8.38 ఎకరాల భూమికిగాను ఎకరాకు ఏడాదికి రూ.లక్ష వంతున ఏటా ఐదుశాతం పెంపుదలతో కాంట్రాక్టు సంస్థ చెల్లించాల్సివుంటుంది.
 
భారీ కన్వెన్షన్‌ సెంటరు
ఈ ప్రాజెక్టుతోపాటు వెంకటపాలెం వద్దే ప్రభుత్వం మరో అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటరును నిర్మించబోతుంది. ఆరువేల సీటింగ్‌ సామర్ధ్యంతో కూడిన కన్వెన్షన్‌ సెంటరుతో పాటు అమరావతిని సందర్శించే విదేశీ పర్యాటకుల సౌకర్యార్ధం ఐదు నక్షత్రాల హోటళ్లు మూడింటిని నిర్మించాలని సీఆర్డీయే ప్రణాళికలను రూపొందించింది. దీనికితోడు ఓ పెద్ద షాపింగ్‌మాల్‌ను కూడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడే మరో నాలుగు వరకు ఐటీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ఇవన్నీ వెంకటపాలెం - మందడం మధ్య వున్న సీడ్‌ యాక్సిస్‌ రహదారి-కృష్ణా కరకట్ట మధ్యన ఏర్పాటు కానున్నాయి.
Link to comment
Share on other sites

ఏపీ అభివృద్ధికి రూ.10 లక్షలు
సీఎం పిలుపుతో రాజధాని సర్పంచి తొలి చేయూత
29ap-state2a.jpg

మందడం(తుళ్ళూరు), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రజలే పెట్టుబడి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపుతో రాజధాని పరిధిలోని గ్రామమైన మందడం సర్పంచి ముప్పవరపు పద్మావతి స్పందించారు. తనవంతుగా రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుగా ఇస్తున్నట్లు తెలిపారు. గురువారం మందడం గ్రామ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సర్పంచి పద్మావతి మాట్లాడుతూ.. ఏపీ సత్వర అభివృద్ధికి మరింత మంది చేయూత ఇచ్చే దిశగా కృషిచేస్తానని చెప్పారు. సంబంధిత పనులకు ప్రజలు అందజేసే పెట్టుబడి మొత్తంలో ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరుతున్నట్లు ఎంకేఆర్‌ ట్రస్టు ఛైర్మన్‌ డా.ముప్పవరపు కృష్ణారావు చెప్పారు. ఆదాయ పన్ను మినహాయింపును రాష్ట్రప్రభుత్వం భరిస్తే ముఖ్యమంత్రి ఆశించిన విధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

రాజధానికి మేముసైతం!
30-03-2018 02:54:33
 
636579752744034002.jpg
  • నవ్యాంధ్రకు ఎమ్మెల్సీ సూర్యారావు కోటి అప్పు
  • మందడం సర్పంచ్‌ రూ. 10 లక్షలు
  • సీఎం పిలుపునకు అనూహ్య స్పందన
కొయ్యలగూడెం/తుళ్లూరు, మార్చి 29: అప్పు చేసయినా సరే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి తీరతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు విశేష స్పందన వస్తోంది. మేముసైతం అంటూ పలువురు ముందుకొచ్చి రాష్ర్టాభివృద్ధికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నవ్యాంధ్ర నిర్మాణానికి కోటి రూపాయలు అప్పుగా ఇస్తున్నట్టు ఎమ్మెల్సీ రాము సూర్యారావు ప్రకటించారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం తోడవ్వాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నామ ని చెప్పారు. తన పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు కలిపి నవ్యాంధ్రకు ఈ డబ్బు అప్పుగా ఇస్తున్నామన్నారు. శాసనమండలిలో ఈ విషయాన్ని ప్రకటించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ధనికులు ఆర్థిక సహాయమందిస్తే నవ్యాంధ్రను ఎంతో గొప్పగా నిర్మించుకోవచ్చన్నారు.
 
మహిళా చైతన్యం..
రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం మందడం గ్రామ సర్పంచ్‌ ముప్పవరపు పద్మావతి ప్రభుత్వానికి రూ.10 లక్షలు అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు చెక్కును కూడా సిద్ధం చేసినట్లు పద్మావతి తనయుడు ముప్పవరపు కృష్ణారావు పేర్కొన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో తాము రాజధాని కోసం భూములు ఇచ్చినట్లు పద్మావతి తెలిపారు. కాగా.. రాజధాని నిర్మాణానికి, అభివృద్ధికి తోడ్పడేందుకు తొలుత మహిళలే ముందడుగు వేస్తున్నారు. భూసేకరణ సమయంలో నేలపాడుకు చెందిన కొమ్మినేని ఆదిలక్ష్మి అందరికంటే ముందు తన భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు కూడా రాష్ర్టాభివృద్ధికి అప్పు ఇవ్వాలన్న సీఎం పిలుపునకు మహిళా సర్పంచ్‌ పద్మావతి తొలుత స్పందించారు. ఈ కుటుంబానికి చెందినవారే రాజధాని భూమి పూజ సందర్భంగా రూ.10 లక్షలు విరాళం అందించడం విశేషం.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...