Jump to content

Amaravati


Recommended Posts

అభ్యంతరాల వెల్లువ
20-03-2018 08:41:58
 
636571321178992235.jpg
  • ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై 1100కుపైగా అభ్యంతరాలు
  • పరిశీలించాకే ఫైనల్‌ నోటిఫికేషన్‌
అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 1,100 మందికిపైగా అభ్యంతరాలు, సూచనలు తెలియజేసినట్లు సమాచారం. గత నెల 17న సీఆర్డీయే ఈ ప్రతిపాదిత అంతర్‌ వలయ రహదారి మార్గానికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్నట్లయితే వాటిని తెలిపేందుకు ఈ నెల 19వ తేదీ వరకు గడువునిచ్చిన విషయమూ విదితమే. సోమవారం సాయంత్రంతో గడువు ముగిసేటప్పటికి లిఖితపూర్వకంగా, ఆన్‌లైన్‌ ద్వారా కలిపి సుమారు 1100 మంది తమ అభ్యంతరాలు, సూచనలు అందజేశారు.
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 1,100 మందికిపైగా అభ్యంతరాలు, సూచనలు తెలియజేసినట్లు సమాచారం. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్‌ ఫైనల్‌ది కాదని, కేవలం ముసాయిదా మాత్రమేనని సీఆర్డీయే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల సమయంలోనూ, ఆ తర్వాత కూడా స్పష్టం చేసినప్పటికీ దాని మార్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు మొదట్లో కొన్ని రోజులపాటు ఇదే ఖరారవుతుందేమోనన్న ఆందోళనకు గురయ్యారు. అయితే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై అందిన ప్రతి ఒక్క అభ్యంతరం లేదా సూచనను పరిశీలిస్తామని, అవి ఏమాత్రం అనుసరణీయంగా ఉన్నా వాటిని పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణంగా నోటిఫికేషన్‌లో మార్పు చేర్పులు చేసి, ఫైనల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని సీఆర్డీయే పేర్కొనడంతో వారిలో నెలకొన్న భయాందోళనలు చాలావరకూ తొలగాయి. రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలు, సూచనలను తెలియజేయలేని వారి నుంచి లిఖితపూర్వతంగా వాటిని సేకరించేందుకూ అధికారులు చర్యలు తీసుకోవడంతో పలువురికి ఉపశమనం లభించినట్లయింది.
 
ఐ.ఆర్‌.ఆర్‌. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు తెలిపిన వారిలో కొందరు ఈ రహదారి తమ భూములగుండా వెళ్తోందని, అందువల్ల దాని అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని కోరగా ఇంకొందరు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో, దానితోపాటు విడుదల చేసిన మ్యాప్‌లో ఐఆర్‌ఆర్‌ వెళ్లే సర్వే నెంబర్లు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప వాటిల్లోని సబ్‌ డివిజన్‌ నెంబర్ల గురించి లేనందున ఎవరెవరికి చెందిన భూముల్లో, ఎంతెంత విస్తీర్ణం ఈ రహదారి కోసం అవసరమనే విషయంపై స్పష్టత కొరవడిందన్నారు. మరొకపక్క.. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ప్రతిపాదించిన వివిధ రహదారులను పూర్తి చేసిన తర్వాతనే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలంటూ సీఆర్డీయేకు పెద్దసంఖ్యలో వినతిపత్రాలందాయి. ఈ అభిప్రాయంతో ఉన్న వారు శనివారం నాడు విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా సైతం నిర్వహించారు. సీపీఎం, వివిధ రైతుసంఘాలు, రాజకీయేతర సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఇందులో పాల్గొన్నారు. రాజధాని కోసం, పలు రహదారుల కోసం సమీకరించిన వేలాది ఎకరాల్లో సంకల్పించిన నిర్మాణాలు, కట్టడాలన్నీ పూర్తయిన తర్వాతనే ఐ.ఆర్‌.ఆర్‌. నిర్మాణానికి పూనుకోవాలని, అప్పుడు కూడా వేలాది ఎకరాలను కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలని వీరు సూచించారు. అలా కాదని ఏమాత్రం అవసరం లేని ప్రస్తుత తరుణంలో ఐ.ఆర్‌.ఆర్‌. కోసం ఇప్పుడే భారీఎత్తున భూములను తీసుకుంటే అవి కూడా రాజధానిలోని పంటపొలాల మాదిరిగా బీడు పడతాయని, ఫలితంగా ఎందరో రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఉపాధిని కోల్పోతారంటూ సీఆర్డీయేకు అభ్యర్థనలను అందజేశారు.
 
విచారించనున్న కమిటీ
గడువులోగా అందిన అభ్యంతరాలు, సూచనలన్నింటినీ సీఆర్డీయే కమిషనర్‌ ఏర్పాటు చేయబోయే ఐ.ఆర్‌.ఆర్‌. అబ్జెక్షన్స్‌ స్కూృటినీ కమిటీ పరిశీలించనుంది. అనుభవజ్ఞులైన అధికారులు సభ్యులుగా ఉండే కమిటీ అభ్యంతరాలు, సూచనలను అందజేసిన ప్రతి ఒక్కరినీ తన ముందుకు రప్పించుకుని, విచారిస్తుంది. వారి వాదనలను బలపరిచే ఆధారాలను స్వీకరిస్తుంది. అనంతరం వాటన్నింటినీ క్రోడీకరించి, మార్పు చేర్పులు (ఏమన్నా అవసరమని భావిస్తే) వాటితో కూడిన ఒక సమగ్ర నివేదికను సీఆర్డీయే అథారిటీకి సమర్పిస్తే, అది దానిని సునిశితంగా పరిశీలించి, వాటిల్లో సహేతుకమైన అభ్యంతరాలు, అనుసరించదగిన సూచనలేమిటన్నది నిర్ధారిస్తుంది.
ఆ ప్రకారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో అవసరమైన మార్పుచేర్పులు చేసి, ఫైనల్‌ నోటిఫికేషన్‌ను సీఆర్డీయే విడుదల చేస్తుంది. ఇదంతా జరిగి, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ విడుదలయ్యేందుకు మరో 3 నుంచి 4 మాసాలు పట్టవచ్చు.
 
ఇదీ ఐఆర్‌ఆర్‌ స్వరూపం..
అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐ.ఆర్‌.ఆర్‌.) కోసం సీఆర్డీయే విడుదల చేసిన ముసాయిదా ప్రణాళిక ప్రకారం అది కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 10 మండలాల (అమరావతి, దుగ్గిరాల, మంగళగిరి, పెనమలూరు, గన్నవరం, విజయవాడ గ్రామీణ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, తుళ్లూరు, తాడికొండ)కు చెందిన 42 గ్రామాలతోపాటు కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ గుండా వెళ్తుంది. 8 వరుసలతో నిర్మితమయ్యే ఈ భారీ రహదారి పొడవు 96.16 కిలోమీటర్లు కాగా వెడల్పు 246 అడుగులు. దీనిని అమరావతితో అనుసంధానించేందుకు రాఽజధాని నగరంలోని గ్రిడ్‌ రోడ్లలో 27 రహదారులను పొడిగించనున్నారు. ఐ.ఆర్‌.ఆర్‌. నిర్మాణం కోసం వివిధ గ్రామాల్లో 3556.10 ఎకరాలు అవసరం కాగా రాజధాని రోడ్ల పొడిగింపునకు మరో 1362.30 ఎకరాలు కావాలని ప్రతిపాదించారు.
 
మొదట్లో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం వివిధ గ్రామాల్లోని పలు భవనాలను ఐ.ఆర్‌.ఆర్‌., అనుసంధాన రోడ్ల నిర్మాణం కోసం తీసుకోవాల్సి ఉంది. పైగా గుంటూరు జిల్లాలోని పెదపరిమి గుండా ఐ.ఆర్‌.ఆర్‌. వెళ్లేది. అయితే సాధ్యమైనంత తక్కువ కట్టడాలనే తీసుకోవడంతోపాటు ఏ గ్రామస్థులనూ ఇబ్బంది పెట్టరాదన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆదేశానుసారం వాటిని సవరించారు. దీంతో పెదపరిమిలోని నిర్మాణాలకు మినహాయింపు లభించింది, ఇతర గ్రామాల్లోనూ తీసుకోవాల్సిన నిర్మాణాల సంఖ్య బాగా తక్కువకే పరిమితమైంది.
 
8 లేన్ల ప్రధాన రహదారికి అటూ ఇటూ సర్వీస్‌ రోడ్లు, నడక, సైక్లింగ్‌ మార్గాలు, పచ్చదనం ఉంటాయి. ఈ రోడ్డును 2 దశల్లో (తొలి దశను 68.08 కి.మీ., మలి దశను 28.08 కి.మీ.) పొడవుతో నిర్మించాలని ప్రతిపాదించారు. తొలి దశ నిర్మాణంలో భాగంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం- కృష్ణా జిల్లాలోని కొటికలపూడిల మధ్య కృష్ణానదిపై 3.1 కి.మీ. పొడవుతో ఒకటి, బ్యారేజీకి దిగువన గుంటూరు జిల్లాలోని రామచంద్రాపురం- కృష్ణా జిల్లాలోని చోడవరంల మధ్య 1.4 కి.మీ. పొడవుతో మరొక వంతెనను నిర్మిస్తారు.
 
2వ దశలో భాగంగా ఈ రహదారి కొండపల్లి రిజర్వ్‌ ఫారె్‌స్టలో 9 కి.మీ. మేర వెళ్లనుండగా అందులో 8 కి.మీ. సొరంగమార్గం! సొరంగం తవ్వకానికి కొంత అధిక వ్యయమైనప్పటికీ అటవీ ప్రాంతాన్ని ధ్వసం చేయరాదన్న అభిప్రాయంతో దానిని ప్రతిపాదించారు.
 
ఐఆర్‌ఆర్‌మార్గంలోని గ్రామాలు
ఐఆర్‌ఆర్‌ రాజధాని ఆవల ఉన్న 41 గ్రామాలతోపాటు రాజధాని పరిధిలోని అనంతవరంలో కొంతమేర వెళ్లనుంది. దానికి, దానితో అనుసంధానించే రాజధాని గ్రిడ్‌ రోడ్ల కోసం అమరావతి మండలంలోని ఎండ్రాయిలో 10.59 ఎకరాలు అవసరమవగా, కర్లపూడిలో 150.47 ఎకరాలు, వైకుంఠపురంలో 60.97 ఎ. కావాల్సి ఉంటుంది. ఇంకా దీని కోసం.. దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి (18.8 ఎ.), మంగళగిరి మండలంలోని చినకాకాని (166.22 ఎ.), చినవడ్లపూడి (19.96 ఎ.), కాజ (112.47 ఎ.), నూతక్కి (56.15 ఎ.), పెదవడ్లపూడి (58.69 ఎ.), రామచంద్రాపురం (55 ఎ.), తాడికొండలోని కంతేరు (103.26 ఎ.), మోతడక (7.1 ఎ.), తాడికొండ (634.13 ఎ.), తుళ్లూరులోని హరిశ్చంద్రాపురం (100.51 ఎ.), పెదపరిమి (662.49), వడ్డమాను (174.16 ఎ.), అనంతవరం (11.43 ఎ.), జి.కొండూరు మండలంలోని కవులూరు (73.95 ఎ.), వెలగలేరు (3.25 ఎ.), గన్నవరంలోని రామచంద్రపురం (5.23 ఎ.), సవారగూడెం (18.71 ఎ.), వెదురుపావులూరు (132.7 ఎ.), ఇబ్రహీంపట్నంలోని దామలూరు (29.90 ఎ.), ఇబ్రహీంపట్నం (7.17 ఎ.), జూపూడి (0.23 ఎ.), కేతనకొండ (58.41 ఎ.), కొండపల్లి (95.40 ఎ.), కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ (100.66 ఎ.), కొటికలపూడి (36.94 ఎ.), నవీపోతవరం (30.34 ఎ.), త్రిలోచనపురం (20.15 ఎ.), జమీ మాధవరం (3.31 ఎ.), పెనమలూరులోని చోడవరం (85.90 ఎ.), గంగూరు (4.94 ఎ.), పెనమలూరు (48.85 ఎ.), పోరంకి (39.19 ఎ.), విజయవాడ గ్రామీణ మండలంలోని దోనేఆత్కూరు (20.48 ఎ.), కొత్తూరు (35.17 ఎ.), నిడమానూరు (71.56 ఎ.), నున్న (96.83 ఎ.), పాతపాడు (48.56 ఎ.), కొత్తూరు తాడేపల్లి లో 35.94 ఎకరాలు అవసరం.
Link to comment
Share on other sites

అమరావతిలో టెక్నో టవర్స్ నిర్మాణం, ఎంత వేగంగా జరుగుతుందో చూడండి...

Super User
21 March 2018
Hits: 95
 
tech-21032018-1.jpg
share.png

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ రామకృష్ణ హౌజింగ్‌ మంగళగిరిలోని ఖాజా గ్రామంలో రామకృష్ణ టెక్నో టవర్జ్‌ పేరిట అధునాతన వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తోంది... 11 లక్షల చ.అ.ల్లో 25 అంతస్తుల్లోని ఈ భవన సముదాయంలో 500 చ.అ. నుంచి 20 వేల చ.అ. స్థలాన్ని కొనుగోలు చేసుకోవచ్చు, లేకపోతే రెంట్ కు తీసుకోవచ్చు. 973 కార్లు పెట్టుకునే విధంగా 5 హై లెవల్స్‌ పార్కింగ్, 18 ఎలివేటర్స్, ఫిట్‌నెస్, లైఫ్‌ స్టయిల్‌ సెంటర్స్, ఫుడ్‌ కోర్ట్స్, రెస్టారెంట్లు, షాపింగ్‌ కేంద్రాలతో పాటూ ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక ఫర్నీచర్, లైటింగ్, ఔట్‌డోర్‌ వ్యూ, హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ వంటి అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారు..

 

tech 21032018 2

అయితే, ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టటానికి ప్రధాన కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన DTP Policy... దీని ప్రకారం, మొదటి మూడు సంవత్సరాలకు ప్రభుత్వమే, ఈ ఐటి కంపనీలకు అద్దె చెల్లిస్తుంది... ఐటి కంపెనీలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం ఈ పాలసీ తీసుకుంది... దానికి అనుగుణంగా, ఈ వెంచర్ మొదలు పెట్టారు... ప్లగ్ అండ్ ప్లే, వాక్ తో వర్క్, రెంటల్ గ్యారెంటీతో, ఇక్కడ ఐటి కంపెనీలు మొదలు పెట్టుకోవచ్చు...

tech 21032018 3

రామకృష్ణ టెక్నో టవర్జ్‌, అధినేత రామకృష్ణ చెప్పిన ప్రకారం, హైదరాబాద్ కు హై టేక్ సిటీ ఎలా ఉందో, మన అమరావతిలో అలాంటి టవర్ నిర్మాణం కోసం, ఇది చేపట్టామని, ప్రభుత్వం కూడా ఐటి ని ఇక్కడ ప్రోత్సహిస్తుంది కాబట్టి, ఇక్కడ ఈ టవర్స్ నిర్మాణం చేపడుతునట్టు చెప్పారు... అక్టోబర్ 2017లో పనులు మొదలు పెట్టామని, పనులు వేగంగా జరుగుతున్నాయని, నవంబర్ 2018 నాటికి ప్రభుత్వానికి అప్పచేప్తామని చెప్పారు... ప్రభుత్వం ప్లగ్ అండ్ ప్లే కోసం, ప్రభుత్వం డిజైన్ ఫైనల్ చేస్తున్నారని, దాదాపు 100 కంపనీలు ఈ టవర్ లో వస్తాయని, 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఇప్పటికే 80 శాతం కంపెనీలు ఇప్పటికే బుక్ చేసుకున్నట్టు చెప్పారు...

Link to comment
Share on other sites

Guest Urban Legend

Amaravati Devp Corpn has invited bids in two separate packages for construction of roads with
utility infrastructure on EPC basis in Amaravati, capital city of Guntur district in Andhra Pradesh.
The scope of work includes:
1. Investigation, detail design and construction of smart trunk infrastructure with roads, storm
water drains, water supply network, sewerage network, utility ducts for power and ICT,
pedestrian tracks, avenue plantation & street furniture, etc in major arterial roads, N6 road and
E13 road (excluding the elevated corridor) (Package-XVII). The estimated value of the project is
Rs 684.65 crore.
2. Investigation, detail design and construction of smart trunk infrastructure with roads, storm
water drains, utility ducts for power & ICT, reuse water line, pedestrian tracks, cycle tracks,
avenue plantation and street furniture, etc in major arterial roads, N13 road & E5 road
(excluding the elevated corridor) (Package-XVIII). The estimated value of the project is Rs
708.39crore

Link to comment
Share on other sites

ఇన్నర్‌’ అభ్యంతరాల పరిశీలనకు కమిటీ
21-03-2018 08:19:00
 
636572171400709225.jpg
అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐ.ఆర్‌.ఆర్‌.) డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై అందిన అభ్యంతరాలు, సూచనల పరిశీలనకు సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సంస్థ అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ ఆధ్వర్యంలో ఒక స్కూృటినీ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. భూవ్యవహారాల్లో అనుభవజ్ఞులైన ఆరుగురు అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారని సమాచారం. వీరందరూ కలసి ఐ.ఆర్‌.ఆర్‌. ముసాయిదా నోటిఫికేషన్‌పై కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు మండలాలకు చెందిన సుమారు 1100 మంది వెలిబుచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పరిశీలిస్తారు.
 
   ఇందుకుగాను వాటిని దాఖలు చేసిన ప్రతి ఒక్కరికీ (అభ్యంతరపత్రాలపై వారు తమ ఫోన్‌ నెంబర్లను ఇచ్చినట్లయితే) వారు కమిటీ ముందు ఎప్పుడు హాజరవ్వాల్సిందీ తెలుపుతూ సెల్‌ఫోన్‌ ద్వారా సంక్షిప్త సందేశాలివ్వనున్నారు. కమిటీ ఎదుట హాజరయ్యే సమయంలో తమ అభ్యంతరాలు, సలహాలను బలపరిచే అంశాలు, ఆధారాలతో రావాల్సి ఉంటుందని సూచిస్తారు. ఆ విధంగా వచ్చిన అందరితో మాట్లాడి, వారి వద్ద ఉన్న ఆధారాలను సేకరించి, అభిప్రాయాలను తెలుసుకుంటారు. అనంతరం అందిన మొత్తం అభ్యంతరాలు, సూచనల్లో పరిగణనలోకి తీసుకోవాల్సినవి ఏమిటి, తిరస్కరించాల్సినవి ఏమిటన్నది గుర్తిస్తారు. పరిగణనలోకి తీసుకున్న అంశాలతో సమగ్ర నివేదికను రూపొందించి, సీఆర్డీయే కమిషనర్‌కు అందజేస్తారు. ఆయన పరిశీలనానంతరం ఏమన్నా మార్పుచేర్పులుంటే చేసి, సవరించిన నివే దికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నేతృ త్వంలో జరిగే సీఆర్డీయే అథారిటీ సమావేశంలో ప్రవే శపెడతారు. అది తీసుకున్న నిర్ణయాలకు అనుగు ణంగా ఫైనల్‌ నోటిఫికేషన్‌ను మూడు నుంచి నాలుగు మాసాల్లో విడుదల చేస్తారని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...