Jump to content

Amaravati


Recommended Posts

అమరావతి’ పురోగతిపై మార్గ సూచీ సదస్సు..
14, 15 తేదీల్లో విజయవాడలో నిర్వహణ

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు సాధించిన పురోగతిపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడలో ఓ సదస్సును నిర్వహిస్తోంది. వివిధ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకునేందుకు దీనిని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇందులో పాల్గొంటారు. రాజధాని ప్రక్రియ ప్రారంభించి మూడేళ్లవుతోంది. భూసమీకరణ, రాజధాని ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన, నిధుల సమీకరణ, నైపుణ్యాభివృద్ధి, అమరావతి అభివృద్ధికి సింగపూర్‌ వంటి దేశాల సహకారం వంటి అంశాల్లో కొంత ముందడుగు పడింది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. లక్ష్యాల్ని చేరుకోవడంలో చాలా జాప్యం జరుగుతోంది. ప్రధాన మౌలిక వసతుల పనులూ అంత వేగంగా జరగలేదు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది.  సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ)తో కలసి పనిచేస్తున్న వివిధ దేశ, విదేశీ కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన 40-50 మంది అంతర్జాతీయస్థాయి నిపుణులతో సదస్సు నిర్వహించనున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక స్పష్టమైన మార్గసూచిని రూపొందించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

అద్భుతంగా అసెంబ్లీ!
11-12-2017 03:39:20
 
636485603649401558.jpg
  • సంస్కృతిని ప్రతిబింబించాలి.. చుట్టూ జలాల్లో ప్రతిఫలించాలి..! సీఎం సూచనలు
  • బాబుతో రాజమౌళి, అధికారుల భేటీ
  • తుది దశకు చేరిన డిజైన్లు ఖరారు
  • నేడు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధుల రాక
  • మంగళ, బుధవారాల్లో సవరించిన డిజైన్లలో
  • ఒకదానికి ఆమోదం తెలుపనున్న సీఎం
అమరావతి, డిసెంబరు 10((ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతికే తలమానికంగా నిర్మించనున్న శాసనసభకు సంబంధించిన ఆకృతి ఇంచుమించుగా ఖరారయ్యే దశకు చేరుకుంది. ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ డిజైన్‌ను ఓకే చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబరు 25న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ అసెంబ్లీ కోసం 2 డిజైన్లను సమర్పించగా, వాటిని మరింత మెరుగుపరచి, తీసుకురావాలని సీఎం సూచించిన సంగతి విదితమే. ఆ ప్రకారం సవరించిన డిజైన్లతో ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం అమరావతికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్న ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్.రాజమౌళి తదితరులతో సీఎం ఆదివారం సమావేశమయ్యారు.
 
హైదరాబాద్‌లో జరిగిన ఈ కీలక భేటీలో మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఆర్కిటెక్ట్‌ చంద్రశేఖర్‌ ప్రభృతులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అత్యున్నత చట్టసభలు కొలువు దీరనున్న భవంతి ఆకృతులపై తన ఆలోచనలను చంద్రబాబు మరోసారి వారికి వివరించారు.
 
 
అసెంబ్లీ భవనం అమరావతికే కాకుండా రాష్ట్రానికే మణిమకుటంగా భాసిల్లేలా ఉండాలన్న తన అభిలాషను ఆయన పునరుద్ఘాటించారు. అది మన ఘన చరిత్ర, వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూనే వైవిధ్యానికి, సృజనాత్మకతకూ నిలువెత్తు దర్పణంగా నిలిచి, తరతరాలపాటు తెలుగువారందరికీ గర్వకారణంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.
 
అసెంబ్లీ చుట్టూ చక్కటి కొలనును ఏర్పాటు చేసి, ఆ జలాల్లో ఉన్నత చట్టసభ వెలుగులు ప్రతిబింబించేలా చూడాలన్నారు. అసెంబ్లీ భవనం పగలు సూర్యకాంతిలో తళతళలాడాలని, రాత్రివేళల్లో వెన్నెల వెలుగుల్లో కాంతులీనాలని సూచించారు. ఏ కోణంలో చూసినా, ఎంత దూరంనుంచి చూసినా శాసనసభ సమున్నతంగా గోచరించి, చూపరులను ఆశ్చర్యచకితులను చేయాలన్నారు. ఇందుకోసం దీనికి సంబంధించి ప్రతి ఒక్క అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు.
 
 
గత కొన్ని నెలలుగా డిజైన్ల రూపకల్పనకు తాము జరుపుతున్న కృషి, తద్వారా లభించిన ఫలితాల గురించి రాజమౌళి తదితరులు సీఎంకు వివరించారు. వాటిని విన్న చంద్రబాబు మరిన్ని సూచనలిచ్చారు. కాగా, సోమవారం నారాయణ, రాజమౌళి, శ్రీధర్‌, చంద్రశేఖర్‌ ప్రభృతులతో ఫోస్టర్‌ బృందం విజయవాడలో సమావేశమై, తాము రివైజ్‌ చేసి, తెచ్చిన డిజైన్లను చూపనుంది. ఈ సందర్భంగా సీఎం చేసిన సూచనలను కూడా పొందుపరుస్తూ మార్పుచేర్పులు చేయాల్సిందిగా సూచిస్తారు.
 
మంగళ, బుధవారాల్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నిపుణులతో కలసి ఈ డిజైన్లను కూలంకషంగా పరిశీలించనున్న చంద్రబాబు వాటిల్లో మెరుగైనదాన్ని ఖరారు చేస్తారు. ప్రజాభిప్రాయం కనుగొనేందుకు ఈ ఆకృతులను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచే అవకాశం కూడా ఉందని తెలిసింది. మొత్తంమీద ఈ బుధవారానికల్లా అసెంబ్లీ డిజైన్‌ ఖరారు కావడం దాదాపుగా తథ్యమేనని భావిస్తున్నారు. ఆ వెంటనే అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన చర్యలను ఏపీసీఆర్డీయే చేపట్టనుంది.
Link to comment
Share on other sites

శాసనసభ ఆకృతిపై తుది నిర్ణయం 13న
సీఎంతో రాజమౌళి సమావేశం
10ap-main3a.jpg

ఈనాడు అమరావతి: అమరావతి పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవనం తుది ఆకృతిని ఈ నెల 13న ఖరారు చేయనున్నారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ సిద్ధం చేసిన ఆకృతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సమీక్షించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య  కార్యదర్శి అజయ్‌జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన ఆకృతుల విశేషాలను రాజమౌళి సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు మంగళవారం అమరావతికి వస్తున్నారు. 12, 13 తేదీల్లో ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. ఆ సందర్భంగా శాసనసభ భవనం తుది ఆకృతిని ఖరారుచేసే అవకాశం ఉంది. అక్టోబరు చివరి వారంలో ముఖ్యమంత్రి లండన్‌ వెళ్లి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన హైకోర్టు, శాసనసభ ఆకృతులను పరిశీలించారు. ఆ బృందంలో రాజమౌళి కూడా ఉన్నారు. హైకోర్టుకు బౌద్ధ స్ధూపాన్ని పోలినట్టు రూపొందించిన ఆకృతిని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. దాని ముఖద్వారంలోను, భవనం లోపలి భాగాల్లోనూ కొన్ని మార్పులు సూచించారు. ఆ విధంగా మార్పులు చేసిన ఆకృతుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ బృందం తీసుకురానుంది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మరోసారి సమావేశమై తాము చేసిన మార్పులను ఆయనకు వివరించి ఆయన అనుమతి తీసుకుంటారు. శాసనసభకు సంబంధించి ముఖ్యమంత్రి లండన్‌ వెళ్లినప్పుడు రెండు ఆకృతుల్ని ఎంపిక చేశారు. చతురస్రాకారంలో ఉన్న ఆకృతితో పాటు భవనంపై పొడవైన స్తంభం (టవర్‌)తో ఉన్న ఆకృతిని ఎంపిక చేశారు. ఆ రెండు ఆకృతులను మరింత మెరుగుపరిచి తీసుకురావాలని, వాటిలో ఉత్తమైనదాన్ని ఎంపిక చేద్దామని చెప్పారు. ఆకృతులు తెలుగుదనం ఉట్టిపడేలా, ఆంధ్రుల సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలని సూచించారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ తగిన  సూచనలిచ్చే బాధ్యతను రాజమౌళికి అప్పగించారు.

Link to comment
Share on other sites

అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన
11-12-2017 10:53:00
 
అమరావతి: మంత్రి నారాయణ అమరావతిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాయపూడి వద్ద నూతనంగా నిర్మిస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారుల వసతిగృహ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్ ఎక్కి స్వయంగా నడిపారు. అనంతరం నేలపాడు వద్ద నిర్మిస్తున్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల వసతి గృహ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు.
Link to comment
Share on other sites

రాజధానిలో 3,840 అపార్ట్‌మెంట్లు నిర్మిస్తాం: మంత్రి నారాయణ
11-12-2017 11:56:34
 
636485901991305311.jpg
అమరావతి: రాజధానిలో 3,840 అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. సోమవారం రాయపూడిలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లకు క్వార్టర్స్‌ నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో 85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 61 టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్యెల్యేలకు 12 అపార్ట్‌మెంట్లు, 432 ఫ్లాట్స్, అలాగే ఐఏఎస్ అధికారులకు 132 ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని పరిధిలో 10 గ్రామాల్లో పేదలకు 5వేల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, వాస్తు సమస్యలు లేకుండా రైతులకు ప్లాట్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
Link to comment
Share on other sites

తుది దశకు చేరిన ఏపీ అసెంబ్లీ డిజైన్లు...
11-12-2017 11:21:08
636485880724945094.jpg
విజయవాడ: అమరావతికే తలమానికంగా నిర్మించనున్న ఏపీ అసెంబ్లీ డిజైన్లు దాదాపు ఖరారయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు అసెంబ్లీ డిజైన్‌ను ఓకే చేయనున్నారు. కొత్త డిజైన్లను ఇవాళ నార్మన్‌ ఫోస్టర్స్‌ అమరావతికి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 25న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ అసెంబ్లీ కోసం రెండు డిజైన్లను సమర్పించింది. ఆ డిజైన్లను మరింత మెరుగుపరచి, తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో సవరించిన డిజైన్లను ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం అమరావతికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్న దర్శకుడు ఎస్‌.ఎస్.రాజమౌళి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఆర్కిటెక్ట్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
అసెంబ్లీ భవనం అమరావతికే కాకుండా రాష్ట్రానికే మణిమకుటంగా ఉండాలన్న తన అభిలాషను చంద్రబాబు పునరుద్ఘాటించారు. అది మన ఘన చరిత్ర, వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూనే వైవిధ్యానికి, సృజనాత్మకతకూ నిలువెత్తు దర్పణంగా నిలిచి, తరతరాలపాటు తెలుగువారందరికీ గర్వకారణంగా నిలవాలని సీఎం తెలిపారు.
 
అసెంబ్లీ చుట్టూ చక్కటి కొలనును ఏర్పాటు చేసి, ఆ జలాల్లో ఉన్నత చట్ట సభ వెలుగులు ప్రతిబింబించేలా చూడాలన్నారు. అసెంబ్లీ భవనం పగలు సూర్యకాంతిలో తళతళలాడాలని, రాత్రివేళల్లో వెన్నెల వెలుగుల్లో కాంతులీనాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఒక్క అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు. గత కొన్ని నెలలుగా డిజైన్ల రూపకల్పనకు తాము జరుపుతున్న కృషి, తద్వారా లభించిన ఫలితాల గురించి రాజమౌళి తదితరులు సీఎంకు వివరించారు. వాటిని విన్న చంద్రబాబు మరిన్ని సూచనలిచ్చారు. కాగా, సోమవారం నారాయణ, రాజమౌళి, శ్రీధర్‌, చంద్రశేఖర్‌ ప్రభృతులతో ఫోస్టర్‌ బృందం విజయవాడలో సమావేశమై, రివైజ్‌ చేసి, తెచ్చిన డిజైన్లను చూపనుంది. ఈ సందర్భంగా సీఎం చేసిన సూచనలను కూడా పొందుపరుస్తూ మార్పుచేర్పులు చేయాల్సిందిగా సూచిస్తారు. మంగళ, బుధవారాల్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నిపుణులతో కలసి ఈ డిజైన్లను పరిశీలించనున్న చంద్రబాబు వాటిల్లో మెరుగైనదాన్ని ఖరారు చేస్తారు. ప్రజాభిప్రాయం కనుగొనేందుకు ఈ ఆకృతులను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచే అవకాశం కూడా ఉందని తెలిసింది.
Link to comment
Share on other sites

రేపు అమరావతికి దర్శకుడు రాజమౌళి
11-12-2017 14:15:29
 
636485985339736130.jpg
అమరావతి: మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, హైకోర్టు తుది డిజైన్లపై చర్చించనున్నారు. మంగళవారం ఉదయమే రాజమౌళి అమరావతికి రానున్నారు. ఉదయం నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో సమావేశంకానున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో రాజమౌళి భేటీ కానున్నారు. బుధవారం అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను ప్రభుత్వం ఫైనల్ చేయనుంది. డిజైన్లపై ప్రజల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకోనుంది.
 
 
ఈ ఏడాది అక్టోబరు 25న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ అసెంబ్లీ కోసం రెండు డిజైన్లను సమర్పించింది. ఆ డిజైన్లను మరింత మెరుగుపరచి, తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో సవరించిన డిజైన్లను ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం అమరావతికి రానున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్న దర్శకుడు రాజమౌళి తదితరులతో సీఎం ఆదివారం సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఆర్కిటెక్ట్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

14,15 తేదీల్లో సీఆర్డీఏ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌..
11-12-2017 21:06:05
 
అమరావతి: ఈ నెల 14, 15 తేదీల్లో సీఆర్డీఏ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. అమరావతి నిర్మాణం ప్రణాళిక దశ దాటిన సందర్భంగా వర్క్‌షాప్‌, తొలిరోజు వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. వర్క్‌షాప్‌లో నిర్వహించాల్సిన చర్చలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు, ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేసేవారిని సీఆర్డీఏ ఆహ్వానించింది.
Link to comment
Share on other sites

2036కి ఆనంద నగరంగా అమరావతి
14, 15 తేదిల్లో అమరావతి డీప్‌డైవ్‌ కార్యశాల

ఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని 2036 నాటికి ప్రపంచంలో ప్రజలు అత్యంత ఆనంద జీవనం గడుపుతున్న మూడు నగరాల్లో (హ్యాపీయెస్ట్‌ సిటీస్‌) ఒకటిగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన దిశగా ఏం చేయాలి? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపై ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న ‘అమరావతి డీప్‌ డైవ్‌’ కార్యశాలలో కూలంకషంగా చర్చించనున్నారు. అమరావతి ఆర్థికాభివృద్ధి, నాణ్యమైన జీవన ప్రమాణాలు, ఆకర్షణీయ, సుస్థిర మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన అన్న నాలుగు లక్ష్యాలను చేరుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహ రచనే ప్రాతిపదికగా ఈ సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సుకి వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ నిపుణుల్ని ఆహ్వానించారు. అమరావతిని 2035 నాటికి తలసరి ఆదాయంలో 20 అగ్రశ్రేణి నగరాల సరసన చేర్చడం, 65 శాతానికిపైగా ప్రజలు ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకునేలా వసతులు కల్పించడం, ఎలాంటి ట్రాఫిక్‌ బాదరబందీ లేని రహదారుల నిర్మాణం, అందరికీ గృహ వసతి కల్పించి... అమరావతిని మురికివాడల రహితంగా ఉంచడం, ఎలాంటి నేరాలకు తావులేని ప్రశాంత నగరంగా తీర్చిదిద్దడం, కాలుష్య రహిత పరిశ్రమల్నే ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిక్‌, డ్రైవర్‌ రహిత కార్లు వంటి అత్యాధునిక రవాణా సాధనాల్ని వినియోగించడం ద్వారా కర్బన ఉద్గారాలు లేకుండా చూడటం వంటి పలు లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ సదస్సులో అన్ని అంశాలపై చర్చించి ఒక వ్యూహ ప్రణాళిక సిద్ధం చేస్తామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

గవర్నమెంట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌ వచ్చే డిసెంబరుకల్లా పూర్తి
12-12-2017 05:33:23
 
636486536076171768.jpg
  • మంత్రి నారాయణ స్పష్టీకరణ
అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణంలో ఏమాత్రం పురోగతి లేదని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు గట్టి సమాధానమిస్తామని రాష్ట్ర పురపాలక మంత్రి, సీఆర్‌డీఏ ఉపాధ్యక్షుడు పి.నారాయణ తెలిపారు. రాజధానిలోని గవర్నమెంట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబరుకల్లా పూర్తవుతుందని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతిని ప్రకటించి మూడున్నరేళ్లు దాటినా ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పడలేదంటున్న కువిమర్శకుల నోళ్లు మూయించేలా మొత్తం 61 టవర్లలో.. 85 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో, 3,840 అపార్ట్‌మెంట్లు 12 నెలల్లోగా రూపుదాల్చుతాయని వెల్లడించారు.
 
ప్రభుత్వ హౌసింగ్‌ ప్రాజెక్టులు నిర్మితమవుతున్న వివిధ సైట్లను సీఆర్‌డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల అధికారులతో కలసి సోమవారం ఆయన పరిశీలించారు. పైల్‌ ఫౌండేషన్‌ వేసే రిగ్గులు, ఇతర యంత్రాలను చూశారు.
 
శాసనసభ్యులు, అఖిల భారత సర్వీసు అధికారులు మొదలుకుని గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగులకు వీటిలో నివాసవసతి కల్పిస్తామన్నారు. ఇటుకలే అవసరం లేని అత్యధునాతన షియర్‌వాల్‌ టెక్నాలజీతో సుప్రసిద్ధ కంపెనీలు నిర్మాణం చేపడుతున్నాయని పేర్కొన్నారు.
 
ఈ పనులు చురుగ్గా సాగేలా చూసేందుకు ఇకపై తాను వారానికి 2 సార్లు అమరావతిలో పర్యటిస్తానని, ప్రతి సోమవారం ప్రభుత్వ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లను, ప్రతి మంగళవారం రాజధాని రహదారుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలిస్తానని ప్రకటించారు.
Link to comment
Share on other sites

రాజధానిలో నిర్మాణాలు వేగవంతం
12-12-2017 07:12:52
 
636486595770398302.jpg
  •  1,450 ఎకరాల్లో ప్రభుత్వ భవన సముదాయం
  •  85 లక్షల చదరపు అడుగులలో 3,840 అపార్ట్‌మెంట్ల నిర్మాణం
  •  ఆధునిక టెక్నాలజీతో నిర్మాణాలు.. రైతుల ప్లాట్లలో సిమెంటు రోడ్లు
  •  మంత్రి నారాయణ
 
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి/తుళ్లూరు): రాజధాని అమరావతిలో 1,450 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం ఆయన రాయపూడి, లింగాయపాలెం, నేలపాడు రెవెన్యూలలో ఐఏఎస్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజిటెడ్‌ ఆఫీసర్ల హౌస్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్‌ బంగ్లా, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలతో పాటు ఈ 1,450 ఎకరాలలో ఉద్యోగుల నివాసాలు ఉంటాయన్నారు. వాటితో ప్రైవేటు నివాసాలుంటాయన్నారు. మొత్తం 3,840 అపార్ట్‌మెంటులు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 61 టవర్ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 18 టవర్లు ఎమ్మెల్యే, ఐఏఎస్‌లకి, 21 టవర్లు ఎన్‌జీవోస్‌కి, 22 టవర్లు గెజిటెడ్‌ ఆఫీసర్లకి కేటాయింపు ఉంటుందన్నారు. 65 ఎకరాల్లో ఈ టవర్ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. జీ ప్లస్‌ 12 అంతస్థులతో నిర్మాణాలుంటాయన్నారు. వీటిని 2019 జనవరికి పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 37 రిగ్గులతో ఫైల్స్‌ వేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 97 రిగ్గులతో రోజుకు 220 ఫైల్స్‌(పిల్లర్‌లు) పూర్తి చేస్తామని చెప్పారు. 22 రిగ్గులతో తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి చేశామన్నారు. ఎక్కడా ఇటుక పెట్టలేదని ప్రతి పక్షం వాళ్ళు గోల చేయటం తప్పన్నారు. ఆధునిక టెక్నాలజీతో నిర్మాణాలు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు కల్లా 85 లక్షల చదరపు అడుగులలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. రైతులకిచ్చిన ప్లాట్లలో అండర్‌ గ్రౌండు డ్రెయినేజీ, విద్యుత్‌, ఇతర మౌలిక సదుపాయాలు ఇదే సమయానికి పూర్తి చేస్తామన్నారు. ప్లాట్లలో ముందు గ్రావెల్‌ రోడ్లు వేసి, నాణ్యతతో సిమెంటు రోడ్లు పూర్తి చేస్తామన్నారు. రాజధాని నగరం 2017 చదరపు కిలోమీటర్లలో, రైతుల ప్లాట్లలో రోడ్లను కలుపుకుని, 10,660 కిలోమీటర్ల మేర రోడ్ల లెంత్‌ ఉంటుందన్నారు. అంత విస్తీర్ణంలో విద్యుత్‌ అండర్‌ గ్రౌండు డ్రెయినేజీ ఇతర మౌలిక సదుపాయాలు కల్పిసున్నట్లు తెలిపారు. రాజధానిలో 29 గ్రామాల్లో పది గ్రామాల్లో పేదల కోసం గ్రూపు ఇళ్ళు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. పది నుంచి పదిహేను శాతం జూలై నుంచి ఇళ్లు మంజూరు చేస్తామని అక్కడ నుంచి ప్రతి నెలా లబ్థిదారులకు ఇళ్ళు కేటాయింపు చేస్తూ 2018 డిసెంబర్‌ కల్లా ఐదు వేల ఇళ్ళను పేదలకు ఇందిస్తామని చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు డిజైన్‌లు త్వరలో ఫైనలైజ్‌ అవుతాయన్నారు. వీటిపై ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అనంతవరం గ్రావెల్‌ క్వారీని మంత్రి పరిశీలించారు. గ్రావెల్‌ లభ్యత ఇంకా ఎంత వరకు ఉంటుందని మైనింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా రిగ్గు వేసే మిషన్‌ ఎక్కి ఆపేరేట్‌ చేశారు. సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ షణ్ముఖ, ఇంజనీర్‌ విభాగ అధికారులు మంత్రితో పాటున్నారు.
 
ఎల్పీఎస్‌ ప్లాట్లెలా చూపారు!
తమ పొలాలను రాజధానికి భూ సమీకరణ కింద ఇవ్వనప్పటికీ, పూలింగ్‌కు భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన ప్లాట్లను వాటిల్లో చూప డమేమిటంటూ నేలపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు మంత్రి పి.నారాయణను ప్రశ్నించారు. సోమవారం ఆ గ్రామం వెళ్లినప్పుడు ఈ ఉదంతం చోటు చేసుకుంది. పరిశీలనను ముగించి, మీడియాతో నారాయణ ప్రసంగిస్తుండగా, పూలింగ్‌కు తమ భూములను ఇవ్వని రైతులు పైన పేర్కొన్న అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ‘పరిశీలిస్తా’మని ఆయన చెప్పినప్పటికీ వారు సమాధానపడలేదు. నిబంధనలు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా తమ భూముల్లో ఎల్పీఎస్‌ ప్లాట్లను చూపడం వల్ల తాము తీవ్ర మనోవే దనకు గురవుతు న్నామన్నారు. వారిని సముదాయించేందుకు మంత్రి చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించకపోవడంతో, ఆయన పక్కనే ఉన్న నేలపాడుకు చెందిన నేత ధనేకుల రామారావు వారిని మందలించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని తాను ఇప్పటికే సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ దృష్టికి తీసుకువెళ్లానని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని రామారావు చెప్పినప్పటికీ రైతులు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో మరి కొందరు రైతులు తమకు లాటరీలో వచ్చిన రోడ్డు శూల రిటర్నబుల్‌ ప్లాట్లను మార్చాల్సిందిగా తాము పదేపదే చేసుకున్న అభ్యర్థనలు ఏమాత్రం ఫలితాన్నివ్వలేదని నారాయణకు ఫిర్యాదు చేశారు. రైతులు లేవనెత్తిన సమస్య లన్నింటినీ ‘నోట్‌’ చేసుకోవాల్సిందిగా నారా యణ తమ సిబ్బందిని ఆదేశించి, ప్రెస్‌ మీట్‌ను ముగించారు. కాగా.. తమ సమస్యలను తెలుపుకుందామంటే సీఆర్డీయే ఉన్నతా ధికారులు అవకాశమివ్వరని వాపోతూ రైతులు వెనుదిరిగారు.
 
లేమల్లెలో గ్రావెల్‌ పరిశీలన..
అమరావతి: రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు, రహదారుల నిర్మాణానికి కావల్సిన గ్రావెల్‌ సేకరించేందుకు సోమవారం నారాయణ అమరావతి మండల పరిధిలోని కర్లపూడి, లేమల్లె గ్రామాలలో ఉన్న కొండపోరంబోకు, అసైన్డ్‌ భూములను పరిశీలించారు. ఆయన వెంట ఇంజనీరింగ్‌ అదికారులు ఉన్నారు.
Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణ వ్యవహారాలపై వర్క్‌షాప్‌
12-12-2017 07:07:11
 
636486592354660885.jpg
  •  జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో 14, 15 తేదీల్లో సీఆర్డీయే నిర్వహణ
  •  దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి
(ఆంధ్రజ్యోతి, అమరావతి): విశ్వనగరంగా అమరావతిని నిర్మించే క్రమంలో ఇప్పటి వరకు జరిగిన కృషి, కసరత్తుపై ప్రపంచవ్యాప్తంగా ఆయా అంశాల్లో గుర్తింపు పొందిన నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుని, మెరుగుదలకు ఉపకరించే సలహాలు, సూచనలు స్వీకరించి, భవిష్యత్తులో వాటిని అమలు పరచే లక్ష్యంతో ఏపీసీఆర్డీయే పెద్దఎత్తున మేథోమఽధనానికి సంకల్పించింది. ఈ నెల 14, 15 తేదీల్లో, 2 రోజులపాటు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించనున్న ఇందులో సుమారు 15 అంశాల్లో విశేష అవగాహన కలిగిన పలువురు జాతీయ, అంతర్జా తీయస్థాయి నిపుణులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలిరోజు ఇందులో పాల్గొని, అమరావతిపై తమ ఆలోచనలు, ఆకాంక్షలను నిపుణులకు వివరించడంతోపాటు ఆయా అంశాలపై ఏ దిశలో చర్చలు నిర్వహించాలన్నదానిపై దిశానిర్దేశం చేయనున్నారు. 9 థీమ్‌ సిటీల సమాహారంగా రాజధానిని నిర్మించడం తోపాటు ప్రపంచంలోనే అత్యధు నాతన మౌలిక వసతులకు నెలవుగా, అత్యంత నివాసయోగ్యమైన ప్రదేశంగా దానిని మలచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మరింత సమర్ధంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు ఏం చేయాలన్న దానిపై నిపుణుల సలహాలను కోరనున్నారు.
 
నీరు,వాననీటి వ్యవస్థలు, విద్యుత్తు- పునరుత్పత్తి చేయదగిన ఇంధన వనరులు, రవాణా, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ అండ్‌ స్మార్ట్‌ సిటీ, భవంతుల దీర్ఘకాల మన్నిక, ప్లానింగ్‌, హ్యాపీ సిటీ ప్లాన్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆరోగ్యం, విజ్ఞానం, పర్యాటకం, క్రీడలు, పరిపాలన తదితర పలు అంశాలపై ఏపీసీఆర్డీయే, ఏడీసీలతో కలసి పని చేస్తున్న పలు దేశ, విదేశ కన్సల్టెన్సీ సంస్థలకు చెందిన నిపుణులతోపాటు ఆయా రంగాల్లో గణనీయమైన కృషి చేసిన మేధావులు ఈ వర్క్‌షాపులో పాల్గొనను న్నారు. ఐఐటీ (రూర్కీ, బోంబే), ఎన్‌.ఐ.టి. (వరంగల్‌), సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ (సింగపూర్‌), సీహెచ్‌2ఎం, కోఆపరేటివ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ వాటర్‌ సెన్సిటివ్‌ సిటీస్‌ (ఆస్ట్రేలియా), ఆర్వీ కన్సల్టెంట్‌, ఫాస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌, ఏబీబీ, ఓజీసీ, తెరి, ఏఎంఆర్‌సీ, హెచ్‌సీఎం, సర్బానా జురాంగ్‌, మెకిన్సీ, పీడబ్ల్యూసీ, ఆక్టస్‌, ప్రపంచ బ్యాంక్‌, మీడియా డిజిటల్‌ స్పేస్‌, టూన్స్‌ యానిమేషన్‌ ఇండియా, ఎన్‌ఎస్‌ఎల్‌ ఇన్‌ఫ్రాటెక్‌, హిందుజా హాస్పిటల్స్‌, హెల్త్‌కేర్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌, కిమ్స్‌, మణిపాల్‌, పీపుల్‌ క్యాపిటల్‌, మైక్రోసాఫ్ట్‌ యాక్సిలరేటర్‌, ఎండియా పార్ట్‌నర్స్‌, తాజ్‌ హోటల్స్‌, రిసార్ట్స్‌ అండ్‌ ప్యాలెసెస్‌, పర్యాటక శాఖ, గోఇబిబో.కాం, మెక్‌ మనుస్‌, యెస్‌ జ్నోమె, జీఎంఆర్‌. వంటి ఎన్నెన్నో సంస్థలకు చెందిన నిపుణులు హాజరై, అమరావతి నిర్మాణంపై తమ అభిప్రాయాలను తెలియపరచనున్నారు.
 
రాజధాని నిర్మాణ ప్రక్రియ ప్రణాళికాదశను దాటి, కార్యాచరణ దశకు చేరుకున్న సమయంలో జరుపుతున్న ఈ వర్క్‌షాపునకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దీనిని ప్రతిష్టా త్మకంగా నిర్వహించేందుకు సీఆర్డీయే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Link to comment
Share on other sites

2019 నాటికి ఉద్యోగుల ఇళ్లు పూర్తి
పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ
11ap-state24a.jpg

ఈనాడు డిజిటల్‌, గుంటూరు: ‘ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే మూడు నెలల నుంచి ఏడాది పడుతుంది. బంధువులు, శ్రేయోభిలాషుల అభిప్రాయాలను తీసుకుని ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తారు. 5 కోట్ల తెలుగు ప్రజల రాజధాని నిర్మాణం చేపట్టేపుడు అందరి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొని నిర్మించాల్సి ఉంటుందని.. కంగారు పడకూడద’ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. పరిపాలనా నగరాన్ని 1,450 ఎకరాల్లో నిర్మిస్తున్నామన్నారు. దీంట్లో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌, గవర్నర్‌ బంగ్లా, ఉద్యోగుల ఇళ్లు ఉంటాయన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఐఏఎస్‌, ఎన్జీవోలు, గెజిటెడ్‌, నాలుగో తరగతి ఉద్యోగులకు రాయపూడి, నేలపాడు ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవన సముదాయాల పనులను ఆయన సోమవారం పరిశీలించారు. 85లక్షల చదరపు అడుగుల్లో.. 61 టవర్లను ఒక్కోటి 13 అంతస్తులతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఏడాదిలో రోడ్లు, 2019 జనవరికి ప్రజాప్రతినిధులు, అధికారుల ఇళ్లు పూర్తవుతాయన్నారు. ఇకపై వారంలో రెండు రోజులు పరిపాలనా నగరంలో జరగుతున్న పనుల ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...