Jump to content

Amaravati


Recommended Posts

     

పర్యావరణానికి ముప్పు లేదు
18-11-2017 02:40:08

    కొండవీటి వాగు సమస్యే కాదు
    ఎన్‌జీటీ తీర్పుపై రాజధాని రైతుల హర్షం

తుళ్లూరు, నవంబరు 17: రాజధాని నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పుపై.. రాజధానికి భూములిచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. వెంకటపాలెంలో మిఠాయిలు పంచుకున్నారు. కొండవీటి వాగుతో ఆటంకాలు లేవని రైతు కమిటీలు ట్రైబ్యునల్‌ ఎదుట గట్టిగా వాదించిన సంగతి తెలిసిందే. ఎన్‌జీటీ తీర్పుతో అభివృద్ధి వేగవంతమవుతుంది. మాకు మేలు జరుగుతుందని వెంకటపాలేనికి చెంది రైతు లంకా సుధాకర్‌ అన్నారు. ఎన్‌జీటీ తీర్పుతో ఆనందం కలిగిందని, ప్లాట్లకు ఇంకా విలువ పెరుగుతుందని రైతు కాలా అప్పారావు చెప్పారు. ఈ తీర్పు ఎంతో సంతోషం కలిగించిందని, ఇక రాజధాని నిర్మాణం వేగవంతమవుతుందని రైతు పోతురాజు శ్రీనివాసరావు చెప్పారు.

Link to comment
Share on other sites

సమర్థంగా వాదనలు
18-11-2017 02:38:32

    ప్రతి అంశంపైనా సమగ్రంగా వివరణ
    ఫలితంగానే ఎన్‌జీటీలో ఏపీకి అనుకూల తీర్పు

న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణంలో పర్యావరణ పరంగా ఎదురయ్యే ఇబ్బందులు అనేకమున్నాయంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఏపీ ప్రభుత్వం వినిపించిన వాదనలతో ఏకీభవిస్తూ ఆ నాలుగు పిటిషన్లను కొట్టివేసింది.
 
ప్రస్తుతం రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతానికి వరదల భయం ఉందని, అడ్డగోలుగా నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో మరింత నష్టమని పిటిషనర్‌ అభ్యంతరం తెలిపారు. దీనికి సమాధానంగా గత వందేళ్లకు పైగా ఆ ప్రాంతంలో వచ్చిన వరదల వివరాలు తీసుకుని, అత్యధికంగా వరదలు వచ్చిన 1853లో పరిస్థితిపై అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం పేర్కొన్న అంశాలను ప్రభుత్వం ఎన్జీటీ ముందుంచింది. వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి ఇవతల కేవలం ఇబ్రహీంపట్నం వైపు మాత్రమే మునిగిందని, ప్రస్తుతం రాజధాని నిర్మించే ప్రాంతంలో ఎటువంటి వరద రాలేదని స్పష్టం చేసింది. అలాగే, భూకంప తీవ్రత జోన్‌-3లో ఉన్న అమరావతిలో రాజధాని నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ప్రాణనష్టం ఏర్పడొచ్చనే అంశాన్ని లేవనెత్తారు. అయితే ఇదే జోన్‌లో ఆగ్రా, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, కోయంబత్తూర్‌, చెన్నై, కోల్‌కతా, ముంబై, పుణే, లక్నో, వారణాసి వంటి రాజధానులు, నగరాలు ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది.
 
అహార భద్రతకు ముప్పులేదు
ఆమరావతి ప్రాంతంలో ఆహార ధాన్యాలు పండించే పంట భూములు తీసుకోవడంతో ఆహార సంక్షోభం ఏర్పడుతుందనే అంశానికి సమాధానంగా 2014-15లో అక్కడ సాగు చేసిన పంటల వివరాలు అందించారు. ఖరీఫ్‌లో 11242 హెక్టార్ల రాజధాని ప్రాంతంలో 1266 హెక్టార్లలో వరి సాగు చేశారని అది రాష్ట్రంలో జరిగే సాగులో కేవలం 0.027 శాతమేనని, దానివల్ల వరి ధాన్యానికి నష్టం వాటిల్లదని తేల్చింది.
 
మూడు దశల్లో రాజధాని నిర్మాణం
శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ప్రకారం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసేందుకు వీల్లేదని చెప్పడంపై ఏపీ వాదిస్తూ.. రోడ్డు, జల, వాయు రవాణాలో ఏపీలో అత్యుత్తమ ప్రాంతంగా అదే అనుకూలంగా ఉందని, నివేదిక కూడా ఈ కనెక్టివిటీ ఉండాలని పేర్కొందని తెలిపింది. అమరావతి నిర్మాణం మూడు దశల్లో జరుగుతుందని అప్పుడు ఏం చేపడతారో ఇప్పుడే నిర్ణయించి దానికి సవివరణాత్మక నివేదిక ఇవ్వలేమని పేర్కొంది. అప్పటి అవసరాలకు తగిన విధంగా మార్పులు, అనుమతులు ఉంటాయని తెలిపింది.
 
ప్రభుత్వ ప్రతిపాదనలతో సానుకూలత
దేశంలో ఏ రాజధాని నగరంలో లేనివిధంగా వర్షానికి ప్రత్యేక డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వమే ముందుకు రావడం, సోలార్‌ వినియోగం 10శాతం ఉండేలా చూడటంలో స్వయంగా బాధ్యత తీసుకుంటున్నట్లు తెలపడం కూడా అనుకూలంగా మారింది. ఇలా ప్రతి అంశంపై పర్యావరణ హితంగా, ప్రజలకు అనుగుణంగా ఎలా ఉండాలనే దానిపై సమగ్ర వివరణ ఇవ్వడంతో అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Link to comment
Share on other sites

రావి-వేప మొక్కలకు ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
18-11-2017 12:12:44

    రాజధాని అమరావతిలో పచ్చదనం పథకానికి శ్రీకారం

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం రావి-వేప మొక్కలకు ప్రత్యేక పూజలు చేశారు. రాజధాని అమరావతిలో పచ్చదనం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా మందడంలోని సీడ్ యాక్సెల్ రోడ్డు దగ్గర మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు శ్రావణ్, రావెల కిషోర్‌బాబు, మహిళా కమిషన్ ఛైర్మన్ రాజకుమారి, ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పుష్పరాజ్, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ కోటేశ్వరరావు, జెడ్పీ వైస్ ఛైర్మన్ వడ్లమూడి పూర్ణ చంద్రరావు, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

5

 అమరావతి నిర్మాణం ఎవరూ ఆపలేరు
ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి: జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన తీర్పు తమ విజయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిని నిర్మించుకొనేందుకు అభ్యంతరాలు లేవంటూ ఎన్జీటీ తీర్పిచ్చిందన్నారు. నది పక్కన నిర్మాణం చేస్తామంటే కొందరు అనేక అడ్డంకులు పెడుతున్నారని సీఎం దుయ్యబట్టారు. యజ్ఞాన్ని అడ్డుకొనే రాక్షసుల్లా కొందరు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని నిర్మాణం మాత్రం ఆగదని తేల్చి చెప్పారు. అమరావతి ప్రాంతంలో పచ్చదనం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతిలో పచ్చదనం అభివృద్ధి పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం - మందడం గ్రామాల మధ్య సీడ్‌ యాక్సిస్‌ రహదారిని ఆనుకొని వున్న ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన ముఖ్యమంత్రి అక్కడి విద్యార్థులతో మమేకమయ్యారు. రాజధాని ఫలాలు ప్రజలకు అందించి తీరుతామన్నారు. 99శాతం మంది ఓ వైపు ఉంటే.. ఆ ఒక్కరు మరోవైపు ఉంటున్నారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మించి తీరతామని స్పష్టంచేశారు.
 

Link to comment
Share on other sites

నందనవనంగా అమరావతి
నెలకోసారి మొక్కల పెంపకంపై   ప్రత్యేక దృష్టి
సమాజసేవకు 5 మార్కులు: సీఎం
ఈనాడు - గుంటూరు
ప్రణాళిక ప్రకారం మొక్కలు పెంచి రాజధాని అమరావతిని నందనవనంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పర్యావరణంలోనే కాకుండా అన్ని విషయాల్లోనూ అమరావతి దేశంలో అగ్రస్థానంలో ఉండేలా నిర్మిస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో 9వేల ఎకరాల్లో 5.50లక్షల మొక్కలు పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం రాజధాని ప్రాంతమైన మందడం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.  చదువుకునేటప్పుడే విద్యార్థులు బాధ్యతలు అలవరుచుకోవాలని, ట్రాఫిక్‌, మొక్కలు, స్వచ్ఛత కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. నాలుగో శనివారం ప్రతిఒక్కరూ సమాజం కోసం పనిచేయాలన్నారు. ఇందుకు 5శాతం మార్కులు పెట్టి సమాజంలో మంచి వ్యక్తులను తయారుచేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో నెలకు ఒకరోజు మొక్కల పెంపకంపై దృష్టిసారిస్తామన్నారు. సింగపూర్‌ దేశం చిన్నదైనా అచంచలమైన విశ్వాసంతో మనుషులు నివసించడానికి అనుకూలమైన ఉత్తమ దేశంగా ఎదిగిందన్నారు. అమరావతిలో అలాంటి వ్యవస్థ ఏర్పాటుకు ఈ మొక్కలు నాటే కార్యక్రమంతో నాంది పలుకుతున్నామన్నారు. నగరంలో 330 కిలోమీటర్ల ప్రధాన రహదారికి ఇరువైపులా 15మీటర్ల వెడల్పులో వివిధ రకాల పూలమొక్కలు పెంచుతామని చెప్పారు. 3 వేల కిలోమీటర్ల సైకిల్‌ట్రాక్‌ నిర్మిస్తామని తెలిపారు. అంతకుముందు కార్తీకమాసం చివరిరోజు సందర్భంగా బహిరంగసభ పక్కనే నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఉసిరి చెట్టుకు పూజలు చేసి మొక్కను నాటి అమరావతిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సౌరవిద్యుత్తు ఉత్పత్తిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, అన్ని పనులు విద్యుత్తుతో నడిచేలా చూస్తామని చెప్పారు. మున్ముందు విద్యుత్తు ఛార్జీలు తగ్గుతాయని, పెంచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. రాజధాని ప్రాంతంలో ఒకరిద్దరు హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారని, అయితే నిబంధనలు పాటించి రాజధాని నిర్మించుకోవాలని ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు.
సాగర్‌ ఆయకట్టు మెట్టపంటలకు సాగునీరు
నాగార్జునసాగర్‌ కుడికాలువ కింద వరి పంటకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రైతులు ఎవరో చెప్పిన మాటలు విని నష్టపోకుండా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో కూడా మెట్ట పంటలు సాగుచేసి నీరు పొదుపు చేసుకుంటే రబీ సీజన్‌లో ఏ పంట సాగుచేసినా నీరు ఇచ్చే వెసులుబాటు కలుగుతుందన్నారు. వరి కంటే మెట్ట, పండ్లతోటల ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని రైతులు ఆదిశగా ఆలోచించాలన్నారు. సాగు, తాగునీటి అవసరాలకు అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాలకు రైతులు సహకరించాలని కోరారు. జనవరిలో ప్రతి గ్రామంలో నీటి లభ్యత, అవసరాలపై చర్చించి అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు.  కార్యక్రమంలో మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, రావెల కిషోర్‌బాబు, మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ నన్నపనేని రాజకుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

రాజధానికి శీతలీకరణ ఛత్రం!
అమరావతిలో కేంద్రీకృత వ్యవస్థ
తొలి దశలో ప్రభుత్వ భవనాలకు అంచనా వ్యయం రూ.150 కోట్లు
త్వరలో టెండర్లు పిలవనున్న సీఆర్‌డీఏ
సింగపూర్‌, దుబాయి సంస్థల ఆసక్తి
ఈనాడు - అమరావతి
రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలన్నిటికీ కలిపి కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ(డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం-డీసీఎస్‌)ను ఏర్పాటుచేయనున్నారు. భవనాల్లోపలే కాన, పరిసర ప్రాంతాలనూ కొంతమేర చల్లబరిచేలా ఇది నిర్మితమవుతుంది. సింగపూర్‌కి చెందిన సింగపూర్‌ పవర్‌, అబుదాబీకి చెందిన టాబ్‌రీడ్‌ సంస్థలు అమరావతిలో డీసీఎస్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. సింగపూర్‌లోని మెరీనా బే ప్రాంతంలో భూగర్భంలో తాము ఏర్పాటుచేసిన డీసీఎస్‌ గురించి శుక్రవారం జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ(జేఐఎస్‌సీ) సమావేశంలో సింగపూర్‌ పవర్‌ సంస్థ వివరించింది. పరిపాలన నగరంలో డీసీఎస్‌ ఏర్పాటుకు 15రోజుల్లో సీఆర్‌డీఏ టెండర్లు పిలవనుంది.
ఇదీ ప్రాజెక్టు: శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మిత ప్రాతం సుమారు 70లక్షల చ.అడుగులు. వీటిలో గదిగదికీ ఏసీ యూనిట్లు అవసరం లేకుండా అన్ని భవనాలకు కలిపి కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ ఏర్పాటుచేస్తారు. పైపుల ద్వారా శీతలీకరించిన జలాల్ని భవనాలకు పంపించి, లోపలి వాతావరణాన్ని చల్లబరుస్తారు. ఫలితంగా 40శాతం వరకు ఇంధనం ఆదాతో పాటు, నిర్వహణ వ్యయం తగ్గుతుందని చెబుతున్నారు. డీసీఎస్‌ నెలకొల్పేందుకు రూ.150కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. యూనిట్‌ ఏర్పాటుకి సీఆర్‌డీఏ స్థలం ఇస్తుంది. బిడ్డింగ్‌ ప్రక్రియలో ఎంపికైన సంస్థే మొత్తం ఖర్చు భరిస్తుంది. 25-30 ఏళ్లపాటు నిర్వహిస్తుంది. ఈ వ్యవస్థను వినియోగించుకున్నందుకు ప్రతి నెలా నిర్దేశిత మొత్తాన్ని ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లిస్తుంది. గడువు ముగిశాక యూనిట్‌ని ప్రభుత్వానికి అప్పగిస్తుంది.

పరిసరాలూ: డీసీఎస్‌లో శీతలీకరించిన జలాల్ని లేదా శీతల వాయువుల్ని పంపించి గదుల్ని చల్లబరుస్తారు. పక్కనే కృష్ణానది ఉండటంతో అమరావతిలో నీటికి కొరత లేదు కాబట్టి, శీతల జలాలతోనే ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ విధానంలో బాగా శీతలీకరించిన జలాల్ని పైపులైన్ల ద్వారా భవనాల్లోకి పంపించి, లోపలి పరిసరాల్ని చల్లబరుస్తారు. ఈ క్రమంలో గదుల్లోని వేడిని గ్రహించడం వల్ల పైపులైన్లలోని నీటి ఉష్ణోగ్రత 14డిగ్రీల వరకు పెరుగుతుంది. ఈ నీటిని మళ్లీ యూనిట్‌కి పంపించి చల్లబరుస్తారు. అలా పంపకముందు.. 14డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని ఉపయోగించి భవనాల వెలుపలి పరిసరాల్ని, కారిడార్లు వంటి ప్రాంతాల్ని చల్లబరుస్తారు. దీనివల్ల బయట 35-40 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు 20-25 డిగ్రీలకు తగ్గుతాయి. ఈ విధానం వినూత్నంగా ఉన్నందున, పరిపాలన నగరంలో ప్రయోగాత్మకంగా అమలుచేయాలని నిర్ణయించారు

మొత్తం సిటీకి చేయండి: కొన్ని భవనాలకే పరిమితం కాకుండా.. పరిపాలన నగరంలోని ఒక థీమ్‌ సిటీ మొత్తానికి డీసీఎస్‌ ఏర్పాటు సాధ్యమేనా? అని సింగపూర్‌ ప్రతినిధుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో నిర్మిస్తున్న తొమ్మిది థీమ్‌ సిటీల్లో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని.. మొత్తానికి ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేయాలని ఆయన సూచించారు.

Link to comment
Share on other sites

ఆకుపచ్చ అమరావతి!
19-11-2017 01:32:13

    9 వేల ఎకరాల్లో మొక్కల పెంపకం
    రాష్ట్రాన్ని నందనవనం చేస్తాం
    2029కి 50ు మొక్కలే: సీఎం

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రమంతా పచ్చని తివాచీ పరుస్తాం. ప్రస్తుతం రాష్ట్ర విస్తీర్ణంలో సుమారు 23 శాతంలోనే మొక్కలు ఉన్నాయి. 2029 నాటికి దాన్ని 50 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆకుపచ్చ అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యమని, బ్లూ-గ్రీన్‌ కాన్సె్‌ప్టతో రాజధానిని అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో శనివారం రాజధాని ప్రాంతంలో పచ్చదనం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా మందడం వద్ద, సీడ్‌ యాక్సెస్‌ రహదారికి పక్కన 26 విద్యాసంస్థలకు చెందిన సుమారు 5 వేల మంది విద్యార్థులతో కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా అమరావతిలో 5.50 లక్షల మొక్కలు నాటనున్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్న సీఎం, అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘సంపదను సృష్టించవచ్చు కానీ వర్షాలను సృష్టించలేం.
 
ఆక్సిజన్‌ను సృష్టించలేం. ఈ విషయాన్ని అందరూ గుర్తించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. ఎంత అభివృద్ధి సాధించినా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతే మనిషి మనుడగ దుర్భరమవుతుందన్నారు. ప్రకృతి పరిరక్షణ బాధ్యతలో యువత కీలకపాత్ర పోషించాలన్నారు. పవిత్రమైన కార్తీకమాసంలో అమరావతిని అపర నందనవనంలా మార్చే పర్యావరణహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ నెలలో 4వ శనివారం మొక్కల పెంపకంలో నిమగ్నం కావాలని సీఎం కోరారు. అమరావతిలో 9 వేల ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రోడ్లు పూర్తయ్యేసరికల్లా వాటి వెంబడి నాటే మొక్కలు మానులుగా ఎదగాలన్న ఉద్దేశంతో రహదారి పనులు సాగుతుండగానే మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
 
రాజధానిని కాలుష్యరహితంగా ఉంచేందుకు సుమారు 3 వేల కిలోమీటర్ల పొడవైన సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేసి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే కార్యాలయాలకు ఉద్యోగులు సైకిళ్లపై వెళ్లేలా ప్రోత్సహిస్తామన్నారు. దీనివల్ల వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చెప్పారు. ‘వాక్‌ టు వర్క్‌’ కాన్సె్‌ప్టలో భాగంగా నడకమార్గాలనూ వేస్తామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అంతర్గత జలరవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, సౌర విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటామని, విద్యుత్తు వినియోగాన్ని 30 నుంచి 40 శాతం మేర తగ్గించే డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థను నెలకొల్పుతామని పేర్కొన్నారు. సభావేదికపై నుంచి పలువురు విద్యార్థులు మాట్లాడిన తీరు తనను ఆకట్టుకుందని, యువతపై తనకున్న నమ్మకం ద్విగుణీకృతమైందని అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సామాజికస్పృహ కూడా ఎంతో అవసరమని, ఈ విషయంలో వారు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ సేవానిరతిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
 
కేవలం మార్కుల కోసమని అయిష్టంగా చదివితే ప్రయోజనం ఉండదని, ఆసక్తిని పెంచుకుని ఇష్టంగా చదివి, భవితకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా అభివృద్ధిలో మాత్రం వేగం తగ్గడం లేదని, ఈ ఘనత చంద్రబాబుదే అన్నారు. రానున్న 12 నెలల్లో రాజధాని రోడ్లు పూర్తి చేస్తామన్నారు. రాజధానిలో మొత్తం 15 లక్షల చెట్లను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు.
 
సాగర్‌ కుడి కాల్వ ఆయకట్టుకు త్వరలో నీరు
నాగార్జునసాగర్‌ కుడి కాల్వ ఆయకట్టుకు త్వరలోనే సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది అదృష్టం తెచ్చే చెట్లూ పెంచుతాం!

    రాజధానిలో ఎన్నో రకాల మొక్కలను నాటుతున్నామని, వాటిలో అదృష్టాన్ని తెచ్చేవి కూడా ఉన్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినప్పుడు సభలో నవ్వులు విరిశాయి. శాఖమూరు ఉద్యానవనంలో ఏర్పాటు చేసే నక్షత్రవనంలో ఇలాంటివి ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వివరించారు.
    అమరావతి ఇప్పుడెలా ఉందో ఫొటోలు తీసుకోండి, మళ్లీ 5, 10 ఏళ్ల తర్వాత అమరావతి ఎంత అద్భుతంగా తయారైందో మీకే తెలుస్తుందని సీఆర్డీయే ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
    వేదికపైనుంచి ప్రసంగించిన విద్యార్థుల్లో ఒకరైన ఆకుల వనజారాణి..ప్రసంగం చివర్లో తండ్రితోసహా అందరికీ కృతజ్ఞతలు తెలిపి, తల్లిని మర్చిపోవడంతో చంద్రబాబు నవ్వుతూ ఆ విషయాన్ని గుర్తు చేశారు. ‘ముందు తల్లిదండ్రులు, ఆ తర్వాతే ఎవరైనా’ అన్న ఆయన మాటలు సభికులను ఆకట్టుకున్నాయి.
    తనకు రాజకీయాలంటే అయిష్టమని, కానీ చంద్రబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని యు.రాధ అనే విద్యార్థిని సభావేదికపై నుంచి చెప్పగా సీఎం స్వాగతించారు. అయితే పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి రావాలని, అప్పుడే ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు.

రాక్షసులు రాజధానికి అడ్డుపడుతున్నారు
హరిత ట్రిబ్యునల్‌ తీర్పుతోనైనా తీరు మారాలి: సీఎం
రాజధాని అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతి నిర్మాణాన్ని నిబంధనల మేరకే నిర్మిస్తున్నా కొందరు పనిగట్టుకుని కోర్టులకు ఎక్కుతున్నారని విమర్శించారు. శుక్రవారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పుతోనైనా రాజధాని నిర్మాణాన్ని తాము పర్యావరణహితంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తున్న విషయాన్ని వారు తెలుసుకోవాలని కోరారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా, వాటిని అధిగమించి ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మిస్తామన్నారు. పదేపదే తగులుతున్న ఎదురుదెబ్బల తర్వాతనైనా రాజధానిని అడ్డుకోవాలని చూసేవారు తమ ధోరణిని మార్చుకుని, మిగిలిన ప్రజలతో కలసి రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవాలని హితవు పలికారు.
 
సీఎంని అబ్బురపరచిన విద్యార్థులు!
రాజధాని గ్రీనరీ ప్రాజెక్టుకు శ్రీకారం సందర్భంగా పలువురు విద్యార్థులు వేదికపై నుంచి ప్రసంగించారు. వారు చేసిన ప్రసంగాలు సీఎం చంద్రబాబును అమితంగా ఆకట్టుకున్నాయి. కొందరు విద్యార్థుల ప్రసంగాలివీ..
 
చంద్రబాబుకు మద్దతుగా నిలుద్దాం
భవిష్యత్తు తరాల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న చంద్రబాబు లాంటి విజన్‌ ఉన్న సీఎంకి యువత అండగా నిలవాలని నర్సరావుపేట సాయితిరుమల ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని ఆకుల వనజారాణి పేర్కొన్నారు. సీఎం చేస్తున్న కృషికి మనవంతు సహకారంగా జన్మదినం తదితర శుభదినాల్లో మొక్కలు నాటాలని సహచర విద్యార్థులకు సూచించారు. హరితాంధ్రప్రదేశ్‌ కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు అభినవ అశోకుడని గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థిని దీనాశర్మ అభివర్ణించారు. చాలామంది వర్షాలు కురిస్తే చెట్లు పెరుగుతాయనుకుంటారని, కానీ ఎక్కడైతే వృక్షాలు మెండుగా ఉంటాయో అక్కడే వానలు పుష్కలంగా పడుతాయన్నారు.

Link to comment
Share on other sites

అమరావతికి.. హరిత శోభ
19-11-2017 09:25:11

    నందన వనంలా రాజధాని
    మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు మహాయజ్ఞంలా భావించాలి
    సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన మొక్కలు నాటిన సీఎం
    ఐదు వేల మంది విద్యార్థుల రాక

తుళ్లూరు/విజయవాడ: రాజధాని అమరావతిలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తుళ్లూరు మండలంలోని మందడం గ్రామం వద్ద సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఒకేసారి విద్యార్థులతో ఐదు వేల మొక్కలను నాటించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏడీసీ, సీఆర్డీయే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. నందన వనంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్లు ఆయన ప్రకటించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా భావించి ముందుకు పోతున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రసంగానికి ముందు పలువురు మట్లాడారు. కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, జాయింటు కలెక్టర్‌ కృతికా శుక్లా, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జానీమూన్‌, వైస్‌ చైర్మన్‌ వడ్లమూడి పూర్ణచందరావు, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌, అదనపు కమిషనర్‌ చెన్నకేశవరావు, ఏడీసీ చైర్మన్‌ లక్ష్మీ పార్థసారధి, మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, ఫుడ్‌ కార్పొరేషన్‌ కమి షన్‌ చైర్మన్‌ జీఆర్‌ పుష్పరాజ్‌, రాజధాని రైతులు, అధికారులు పాల్గొన్నారు.

అడ్డంకులు తొలగి పోతున్నాయి..
రాజధాని నిర్మాణంలో అడ్డంకులు తొలగిపోతున్నాయి. కొందమంది వ్యక్తులు కోర్టులకు వెళ్లి రాజధాని నిర్మాణాన్ని ఆపాలని చూశారు. ఎన్టీటీలో రైతులు తమ వాదన వినిపించినందుకు ధన్యవాదాలు. మంచి పని చేస్తుండటంతో, ఎన్టీటీలో ప్రభుత్వ చర్యలను ఆమోదించింది. ముఖ్యమంత్రి నిరంతరం రాష్ట్రంకోసం పనిచేస్తున్న మంచి నాయకుడు.
- తెనాలి శ్రావణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే
అభివృద్ధి వైపు పరుగులు..
అప్పులతో విడిపోయిన ఏపీ నేడు అభివృద్ధి వైపు పయనిస్తోంది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనతే. రోడ్లు, మౌలిక వసతులకు 75 శాంత టెండర్లు పూర్తి చేశాం. 12 నెలలో రాజధాని రోడ్లు పూర్తి చేస్తాం. 27 శాతం గ్రీనరీ ఉండే ందుకు చర్యలు తీసుకుంటున్నాం. 2029కి 50 శాతం గ్రీనరీ ఉంటుంది. 18.2 కిలోమీటర్ల సీడ్‌ రోడ్డు పక్కన 15 మీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటుతున్నాం. 15 లక్షల చెట్లను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసాం.
- నారాయణ, మున్సిపల్‌ శాఖ మంత్రి

పవిత్ర కార్యం..
మాట్లాడడుతూ, కార్తీక మాసంలో మొక్కలు నాటటం పవిత్ర కార్యమన్నారు. ఎన్జీటీ అమరావతికి అనుమతినిచ్చింది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఫొటోలు భద్రపరుచుకోవాలి.
- అజయ్‌ జైన్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ

Link to comment
Share on other sites

భూములకు భలే డిమాండ్‌
22-11-2017 02:20:52

    అమరావతిలో వివిధ సంస్థలకు
    ఇచ్చింది 41%.. మిగిలింది 59%
    ఇకపై అవసరాన్ని బట్టే భూ కేటాయింపులు
    దూరదృష్టితో సీఆర్డీయే ఆచితూచి నిర్ణయాలు
    అర్హతల నిర్ధారణలో సునిశిత పరిశీలన

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): నిన్న మొన్నటి వరకు అమరావతికి రావాలంటే వెనుకాడిన పలుసంస్థలు నేడు ఇక్కడికి రావాలన్న ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పుడే ఇక్కడికి వస్తే ఆశించిన స్థాయిలో స్పందన ఉంటుందా, లావాదేవీలు అనుకున్న విధంగా సాగుతాయా అనే సంశయం నుంచి బయటపడుతున్నాయి. అమరావతి నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాల్లో వేగం పెరగడం, న్యాయపరమైన ప్రతిబంధకాలూ తొలగిపోతుండడం, ఇప్పటికే ఇక్కడ నిర్మాణ కార్యకలాపాలు జరుపుకుంటున్న విద్యాసంస్థలకు మంచి ప్రతిస్పందన లభిస్తోంది.
 
ఇక్కడికి వచ్చే సంస్థలకు వాటి అర్హతలను బట్టి భూమి ధరల్లో భారీ రాయితీలు కల్పించడం, ఇతర ప్రోత్సాహకాలనూ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఆయా సంస్థల దృక్పథంలో మార్పు వచ్చింది. అమరావతిలో క్యాంప్‌సలు, హోటళ్లు తదిరత సంస్థలు తమ శాఖలు కలిగి ఉండాలని భావిస్తున్నాయి. ఫలితంగా తమకూ భూములను కేటాయించాలని కోరుతున్నాయి.
 
ఇప్పటికే 4 వేల ఎకరాలకుపైగా కేటాయింపులు!
సీఆర్డీయే సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 43 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు, బ్యాంకులతోపాటు విట్‌, ఎస్‌.ఆర్‌.ఎం., అమృత, నిఫ్ట్‌, ఎన్‌.ఐ.డి. తదితర ప్రముఖ విద్యాసంస్థలకు కలిపి మొత్తం 1,236.84 ఎకరాలను కేటాయించింది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి నిమిత్తం సింగపూర్‌ కన్సార్షియానికి 1,691 ఎకరాలను ఇస్తోంది. ఇవి కాకుండా.. రాజధానిలో పేరొందిన జాతీయ, అంతర్జాతీయస్థాయి పాఠశాలలు, ప్రసిద్ధ గ్రూపులకు చెందిన స్టార్‌ హోటళ్లు కొలువు దీరేలా చూసేందుకు కనీసం 100 ఎకరాలనైనా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రమారమి 4,400 ఎకరాలకు సంబంధించి కేటాయింపులు దాదాపుగా ఖరారైనట్లే.
 
రాజధానిలో వివిధ ప్రభుత్వ శాఖలకు ఉన్న సుమారు 3,500 ఎకరాలను కలుపుకుంటే సీఆర్డీయే చేతిలో దాదాపు 10,640 ఎకరాలుంటాయి. పైన పేర్కొన్న కేటాయింపులు పోగా సీఆర్డీయేకు మిగలబోయేది 6,240 ఎకరాలు మాత్రమే. వీటినే రాజధానిలోని ప్రతిపాదిత 9 థీమ్‌ సిటీల్లో ప్రఖ్యాత సంస్థలు కొలువుదీరేందుకు వీలుగా కేటాయించాలి.
 
పూలింగ్‌ భూముల్లో దక్కేది 21 శాతమే..!
రైతులు సుమారు 34వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇచ్చారు. ఈ అంకెను చూస్తే రాజధానిలో వేల ఎకరాల భూములు సీఆర్డీయే అధీనంలో ఉన్నాయని, అందువల్ల ఎన్ని సంస్థలొచ్చినా వాటికి ఉదారంగా స్థలాలను కేటాయించగలదని అనిపిస్తుంది. అయితే పూలింగ్‌ విధానం ద్వారా అందిన భూముల్లో సీఆర్డీయేకు మిగిలేది ఎకరాకు కేవలం 21 శాతమే! మౌలిక వసతుల కల్పన కోసం ఎకరాలో సగటున 50 శాతం భూమి అవసరం కాగా పొలాలిచ్చిన రైతులకు ఎల్పీఎస్‌ ప్యాకేజీలో భాగంగా రిటర్నబుల్‌ ప్లాట్ల రూపంలో ఎకరాకు 29 శాతం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇవి పోను సీఆర్డీయేకు మిగిలేది 21 శాతం మాత్రమే!
 
సీఆర్డీయే జాగ్రత్తలు!
అమరావతిలో భూముల కేటాయింపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ భూములివ్వాలని కోరుతూ అందే దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, సదరు సంస్థలకు తాము నిర్దేశించిన అర్హతలున్నాయా, ఒకవేళ ఉన్నా అవి కోరినంత భూమిని కేటాయించాల్సినంత అవసరముందా అనే అంశాలపై సీఆర్డీయే ఇచ్చే నివేదికల ఆధారంగానే కేటాయింపులు జరుగుతాయి. ప్రస్తుతం నివేదికల రూపకల్పనలో సీఆర్డీయే ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. పూలింగ్‌ ద్వారా తనకు అందిన భూముల్లో రిటర్నబుల్‌ ప్లాట్లు, మౌలిక వసతుల కల్పనకు పోగా మిగిలిన భూమిలోనే గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ (పరిపాలనా నగరం) నిర్మాణాలను జరపాలి. అమరావతి సత్వరాభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు భూములను కేటాయించాలి.
 
స్టార్టప్‌ ఏరియా వంటి రాజధాని ప్రగతికి చుక్కానిలా నిలిచే పథకాలకూ స్థలాలివ్వాలి. ఇవన్నీ చేస్తూనే భవిష్యత్తు అవసరాల కోసం తగినంత భూమిని అట్టేపెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే తన వద్ద భూమిలో అయిదింట రెండు వంతులు (సుమారు 41 శాతం) వివిధ ప్రయోజనాల కోసం కేటాయించిన నేపథ్యంలో మిగిలిన 59 శాతం భూమితోనే భవిష్యత్తు అవసరాలన్నీ తీరాలి కాబట్టి సీఆర్డీయే జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది.
 
భవిష్యత్‌లో కొరత లేకుండా చర్యలు!
ఇప్పుడే స్థలాలన్నింటికీ పందేరం చేసేస్తే, భవిష్యత్‌లో అమరావతిలో భూములకు తీవ్రకొరత ఏర్పడడం తథ్యమని సీఆర్డీయే భావిస్తోంది. దీంతో స్థలాలు కోరుతూ తనకు అందిన, అందుతున్న దరఖాస్తులను ఒకటికి రెండుసార్లు నిశితంగా పరిశీలించి, వాటిల్లో ఏవేవి అర్హమైనవో గుర్తించే ప్రక్రియను పకడ్బంధీగా చేపడుతోంది. అవి అడిగినంత కాకుండా స్థానిక అవసరాలనుబట్టి ఎంత భూమి అవసరమవుతుందో అంతే కేటాయించేందుకు చర్యలు తీసుకుంటోంది. 

Link to comment
Share on other sites

ఎన్నికల్లోగా అమరావతికి హైకోర్టు తరలింపు!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కసరత్తు
వసతి ఖరారయ్యాక ఉమ్మడి హైకోర్టుకు లేఖ
ఈనాడు, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో(2019)గా హైకోర్టును తరలించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు అమరావతిలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అమరావతిలో పరిపాలనా భవనాలతోపాటు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ‘న్యాయ నగరం’ (జస్టిస్‌ సిటీ) నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే న్యాయనగరం నిర్మాణానికి ముందే హైకోర్టును తరలించాలన్న లక్ష్యంతో తాత్కాలిక వసతుల కోసం అన్వేషిస్తోంది. సుమారు 2 లక్షల చదరపు అడుగుల వసతి ఉన్న తాత్కాలిక భవనం కోసం చూస్తోంది. ఇప్పటికే రెండు, మూడు భవనాలను గుర్తించిందని.. అందులో ఒక దాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. వసతులను గుర్తించాక ఏపీ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాయనుంది. 10 నుంచి 15 రోజుల్లో ఈ మేరకు లేఖ రాసే అవకాశాలున్నాయని తెలిసింది. ఉమ్మడి హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 61 కాగా అందులో ఏపీకి 37 మంది న్యాయమూర్తుల కేటాయింపు జరిగింది. అయితే ప్రస్తుతం 31 మంది పనిచేస్తుండగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు 29 మంది, ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇందులో 17 మంది ఏపీకి ఐచ్ఛికాలను ఇవ్వగా కేంద్రం ఆమోదించింది. ఆ సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Link to comment
Share on other sites

 26న తెదేపా జాతీయ కార్యాలయం శంకుస్థాపన
అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం శంకుస్థాపన ముహూర్తం ఖరారైంది. ఈనెల 26న ఉదయం 5.17 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని ఆనుకుని నిర్మించనున్నారు. మొత్తం నాలుగు బ్లాక్‌లుగా నూతన పార్టీ కార్యాలయం నిర్మాణం జరగనుంది.

Link to comment
Share on other sites

చేతల్లో చూపండి!
23-11-2017 02:11:45

    రాజధాని ప్రాజెక్టులు పరుగులు పెట్టాల్సిందే
    అధికారులను ఆదేశించిన చంద్రబాబు
    గాంధీ స్మారక ఉద్యానవనంగా శాఖమూరు పార్కు!

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను. ప్రతి వారం ఎన్నో గంటల సమయాన్ని అమరావతికి కేటాయిస్తున్నాను. దీనిని గమనించకుండా ఇంకా మీరు మాటలతో కాలం గడుపుదామనుకుంటే లాభం లేదు. పనులు కనిపించేలా కార్యాచరణలోకి దిగకుండా ఇంకా మాటలు చెబుతూ పోతూంటే ఎలా?’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ప్రశ్నించారు.
 
తాను ఈ మాటలను ఆగ్రహంతో అనడం లేదని, పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదన్న ఆవేదనతో అంటున్నానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణపనులు ఇకపై పరుగులు తీయాలని ఆదేశించారు. వెలగపూడిలోని తన కార్యాలయంలో సీఆర్డీయేపై బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికల రూపకల్పన, అమలుకు సంబంధించి సింగపూర్‌, దుబాయ్‌ వంటి దేశాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ఆ బాటలో సాగి అమరావతినీ అనుకున్నట్లుగా నిర్మించాలని అధికారులను కోరారు.
 
‘హ్యాం’ విధానంలో ‘హైవే’ మోడల్‌
రాజధాని రైతులకు కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధికి ‘హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యాం)’ విధానాన్ని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో దీని అమలు కోసం సీఆర్డీయే కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొత్తం రూ.10 వేల కోట్ల విలువైన పనులను ఈ విధానంలో చేపట్టనున్నట్లు సీఎంకు తెలిపిన ఉన్నతాధికారులు తద్వారా ఈ విధానాన్ని అమలు పరుస్తున్న రాష్ట్రాల్లో మనం ద్వితీయస్థానంలో నిలవనున్నట్లు చెప్పారు.
 
వారు సూచించిన ప్రతిపాదనల్లో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌.హెచ్‌.ఎ.ఐ.) అనుసరిస్తున్న పద్ధతే సమర్ధమైనదిగా నిరూపితమైనందున దానినే అమరావతిలోనూ అనుసరించి అత్యంత పారదర్శకంగా, వేగంగా ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సుమారు 300 ఎకరాల్లో శాఖమూరు వద్ద అభివృద్ధి పరుస్తున్న అమరావతి సెంట్రల్‌ పార్కును జాతిపిత మహాత్మాగాంధీ స్మారక ఉద్యానవనంగా మారుద్దామంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. అయితే శాసనసభకు దగ్గర్లో ఏర్పాటు చేయబోయే ఉద్యానవనానికి గాంధీ పార్కు అనే పేరు పెడదామని మంత్రి నారాయణ సూచించారు. దీంతో ఈ అంశంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు.
 
‘అన్నగారి’ ఘనత చాటేలా విగ్రహం
రాజధాని గ్రామమైన నీరుకొండ వద్ద ఉన్న పర్వతంపై సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆరాధ్య కథానాయకుడైన నందమూరి తారక రామారావు 108 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించిన అధికారులు దానికి సంబంధించిన కాన్సెప్ట్‌ డిజైన్‌ను సీఎంకు చూపించారు. ఈ విగ్రహం చేతులమీదుగా వ్యూ పాయింట్లను ఏర్పాటు చేయాలని, అన్నగారి జీవన ప్రస్థానాన్ని కళ్లకు కట్టే విశేషాలతోపాటు రోప్‌వే కేబుల్‌కార్‌, జెయింట్‌ వీల్‌, ఇతర పర్యాటక ఆకర్షణలతో తీర్చిదిద్దాలని చెప్పారు.
 
మంత్రుల బంగళాలన్నీ ఒకేలా..
అమరావతిలో నిర్మించనున్న మంత్రులు, ఇతర ప్రముఖుల నివాస భవంతులన్నీ ఒకే ఆకృతిలో ఉండాలని సమావేశం అభిప్రాయపడింది. వీటి డిజైన్లపై మంత్రులతో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. సచివాలయం, హెచ్‌వోడీల డిజైన్లను అధికారులు చంద్రబాబుకు చూపి, ఒక్కొక్కటి 35 లేదా 36 అంతస్థులతో మొత్తం 5 టవర్లను వీటి కోసం నిర్మించనున్నామని చెప్పారు. నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించిన ఈ డిజైన్ల విశేషాలను వివరించారు. ఈ టవర్లు అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్న సీఎం అవసరమైతే 5 టవర్లను 4 టవర్లుగా మార్చి, అంతస్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. కాగా, ప్రపంచంలోని నలుమూలల నుంచి ఇన్వెస్టర్లు, ఔత్సాహికులు, వ్యాపారవేత్తలను అమరావతికి రప్పించేందుకు దుబాయ్‌ యాన్యువల్‌ ఫెస్టివల్‌ తరహాలో రాజధానిలోనూ ఒక వార్షిక కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.
 
సైకిళ్ల వాడకం పెంచండి
సచివాలయ ప్రాంగణంలో సైకిళ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేసినట్లు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలుపగా, అక్కడితో సరిపుచ్చరాదని, రాజధాని ప్రాంతమంతా సైకిల్‌ మార్గాలను నిర్మించి, ప్రజలు వాటిని వాడేలా చూడాలని చంద్రబాబు చెప్పారు. విజయవాడ నుంచి వెలగపూడికి సైకిళ్లపై రాకపోకలు సాగించడానికి అవసరమైన ఏర్పాట్లను సాధ్యమైనంత త్వరగా చేయాలన్నారు. 

Link to comment
Share on other sites

మాటలే తప్ప పనులేవీ..!
పురోగతి కనిపించకపోతే ఊరుకోను
ఈనాడు - అమరావతి
రాజధాని నిర్మాణ పనుల్లో ఆశించిన పురోగతి లేకపోవడంపై సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మూడున్నరేళ్లయింది. రాజధాని పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. రహదారుల పనుల్లో పురోగతి లేదు. పాఠశాలలు, హోటళ్లకు స్థలాల కేటాయించడం పూర్తవలేదు. నేను అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తుంటే... మీ ఆలోచనలు మాత్రం గ్రామస్థాయిలోనే ఉంటున్నాయి...’’ అని మండిపడ్డారు. ఇక సంవత్సరమే గడువు ఉందని స్పష్టం చేశారు. పనులు వేగంగా జరిగేలా చూడాలని మంత్రి నారాయణను ఆదేశించారు. సచివాలయం ఆవరణలో మూడు నాలుగు సైకిల్‌ స్టాప్‌లు ఏర్పాటు చేస్తే చాలదని, విజయవాడ నుంచి వెలగపూడికి రావడానికి వీలుగా, రాజధాని ప్రాంతమంతా సైకిల్‌ మార్గాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల్లో సైకిల్‌పై ప్రయాణించే సంస్కృతి పెంచాలని చెప్పారు. దుబాయి, సింగపూర్‌, చైనా వంటి దేశాలకు వెళ్లి ఏం నేర్చుకుని వస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు వల్ల 120 ఎకరాల్లో ఉన్న నీరుకొండ ప్రాంతం రాజధానికే ముఖ్య ఆకర్షణగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముఖ్య వినోద, విహార కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఎన్టీఆర్‌లోని మహానటుడిని, గొప్ప రాజకీయవేత్తను, ఆయన సిద్ధాంతాలను ప్రతిబింబించేలా విగ్రహం ప్రాజెక్టు రూపొందించాలని సూచించారు.

ముఖ్యమైన అంశాలు ఇవీ...!
*రైతులకు ప్లాట్లు ఇచ్చే లేఅవుట్‌లలో రూ.10 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పన పనులు హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో చేపట్టాలని నిర్ణయం.
* సచివాలయం, హెచ్‌ఓడీ భవనాల వ్యూహ ప్రణాళికలను వివరించిన ఆర్కిటెక్ట్‌లు. ఇవి ఆకట్టుకునేలా ఉండాలని, అవసరమైతే నాలుగు టవర్లకే పరిమితం చేసి ఎత్తు మరింత పెంచుకోవాలని సూచన.
* దుబాయి ఎక్స్‌పో తరహాలో భారీ స్థాయిలో వార్షిక ఎగ్జిబిషన్‌ నిర్వహించాలని, వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనేలా దీన్ని తీర్చిదిద్దాలని సూచన.

కార్పొరేట్‌ స్థాయికి పురపాలక పాఠశాలలు
పురపాలక పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయికి చేర్చి పదో తరగతిలో ఈ ఏడాది 500 మంది విద్యార్థులు పది పాయింట్లు సాధించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. బుధవారం పురపాలక పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. డిసెంబరు నాటికి అన్ని పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రవేశాలు లేవనే బోర్డులు పెట్టే స్థాయికి తీసుకెళ్లాలన్నారు.  మంత్రి నారాయణ పురపాలక పాఠశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకుంటున్న చర్యలు, సదుపాయాల కల్పనకు రూపొందించిన కార్యాచరణను వివరించారు.

26న తెదేపా కేంద్ర కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
తెదేపా కేంద్ర కార్యాలయ నిర్మాణానికి ముహూర్తం ఖారారైంది. ఈనెల 26న వేకువజామున గం.5.17లకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణపనులు త్వరితగతిన పూర్తిచేసి ఏడాదిలోగా కార్యాలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళగిరి సమీపంలో తెదేపా కేంద్ర కార్యాలయం నిమిత్తం నాలుగు ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన సంగతి విదితమే.

Link to comment
Share on other sites

సీఆర్‌డీఏకు భూబదలాయింపు జీవో నిలిపివేత
ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్‌: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లు-1 గ్రామంలో 581.09 ఎకరాల భూములను సీఆర్‌డీఏకు బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 548 అమలును నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూములను సాగు చేసుకుంటున్న వారికి భూసేకరణ కింద ప్రయోజనాలు కల్పించకుండా, పరిహారం చెల్లించకుండా సీఆర్‌డీఏకు బదలాయించాలన్న నిర్ణయం సరికాదంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతోపాటు కలెక్టర్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌డీఏకు 581 ఎకరాల భూములను బదలాయిస్తూ ఈనెల 15న ప్రభుత్వం జారీ చేసిన జీవో 548ని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన ఆర్‌.శ్రీనివాసరావు మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు విచారణ చేపట్టగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పి.రాయ్‌రెడ్డి, సూర్యకిరణ్‌లు వాదనలు వినిపిస్తూ స్వాతంత్య్రానికి పూర్వం అసైన్‌ చేశారని, వీటి క్రయవిక్రయాలు చట్టబద్ధమని, అలాంటి లావాదేవీల ద్వారా పిటిషనర్లు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వీటిని భూసేకరణ చట్ట ప్రకారం లేదంటే ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా ప్రయోజనాలు చేకూర్చాల్సి ఉండగా, దీనికి విరుద్ధంగా బదలాయింపు జరిగిందని అన్నారు. కలెక్టర్‌ సిఫారసుల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Link to comment
Share on other sites

ప్రపంచబ్యాంకు రుణం ఇప్పించండి
కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ఆర్థిక శాఖ
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక శాఖ విజ్ఞప్తి చేసింది. ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల(ఈఏపీ)పై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల సమావేశాన్ని గురువారం దిల్లీలో నిర్వహించింది. అమరావతి ప్రాజెక్టు చాలా ప్రతిష్ఠాత్మకమైనదని దానికి ఏదో ఫిర్యాదుల నెపంతో రుణం మంజూరు చేయకుండా ఉండటం సమంజసంకాదని రాష్ట్రం తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అమరావతికి భూసేకరణ చేపట్టలేదని, భూసమీకరణ ఒక స్వచ్ఛంద పథకమని, రైతులు భూములు ఇచ్చారని తెలిపింది. అలాంటి పథకానికి వెంటనే రుణం మంజూరయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది.

Link to comment
Share on other sites

త్వరలో అమరావతికి ముకేష్‌ అంబానీ
అమరావతి: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ త్వరలో అమరావతిని సందర్శించనున్నారు. పది రోజుల్లో అంబానీ రాష్ట్రానికి రానున్నట్టు బుధవారం జరిగిన సీఆర్‌డీఏ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై చంద్రబాబు, అంబానీల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నట్టు సమాచారం.

Link to comment
Share on other sites

     

అమరావతిలో 8 అంతర్జాతీయ స్కూళ్లు
24-11-2017 00:58:37

    నేషనల్‌, ఇంటర్నేషనల్‌ కేటగిరీలుగా భూమి కేటాయించాలన్న యాజమాన్యాలు

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రను నాలెడ్జి స్టేట్‌గా.. ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి పిలుపు మేరకు దేశంలోని పలు ప్రముఖ విద్యాసంస్థలు రాష్ట్రంలో కాలు మోపేందుకు ఆసక్తి చూపుతుండగా... తమిళనాడుకి చెందిన ఎస్‌ఆర్‌ఎం, విట్‌ వంటి వర్సిటీలు ఇప్పటికే అమరావతిలో సొంత భవనాలు నిర్మించుకుని ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభించాయి. అమరావతి పరిధిలో మొత్తం 9 సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా... అందులో నాలెడ్జి సిటీ కూడా ఉంది. నాలెడ్జి సిటీలో విశ్వవిద్యాలయాలు, బిజినెస్‌ స్కూళ్లు, కాలేజీలు, నేషనల్‌- ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, ఆర్‌అండ్‌డి సెంటర్లు, నేషనల్‌ లైబ్రరీ, స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది.
ఈ నాలెడ్జి సీటీ 8,547 ఎకరాల భూమిలో విస్తరించనుంది. ఇప్పటికే ప్రముఖ వర్సిటీల కోసం 650 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో విట్‌-ఏపీ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, అమృతా యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (డీఐటీడీ)లు ఉన్నాయి. అమరావతిలో 2 కేంద్రీయ విద్యాలయాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి.
 
ఈ కోవలోనే అమరావతి పరిధిలో 8 అంతర్జాతీయ స్కూళ్ల ఏర్పాటుకు పూర్వరంగం సిద్ధమవుతోంది. తమకు భూమిని కేటాయించాలంటూ ఆయా యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోగా... సీఆర్‌డీఏ వాటికి కేటాయించదలచుకున్న భూములపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఆయా పాఠశాలల వివరాలను తాజాగా విద్యాశాఖకు పంపి అభిప్రాయం కోరింది. ఈ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
 
 

Link to comment
Share on other sites


గుంటూరు: మంగళగిరిలో ఐటీ సంస్థలకు మంత్రి లోకేష్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్షర ఎంటర్ ప్రైజెస్, కె.జె. సిస్టమ్స్‌ సంస్థలకు లోకేష్‌ శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. ఐటీలో లక్ష..ఎలక్ట్రానిక్స్ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, గత పాలకులు అమరావతి ప్రాంతంలో ఐటీని నిర్లక్ష్యం చేశారన్నారు. గన్నవరం మేధా టవర్స్ 2010లో పూర్తయినా ఒక్క సంస్థ కూడా రాలేదన్నారు. మేం వచ్చాక మేధా టవర్స్ నిండింది..రెండో దశకు శంకుస్థాపన చేశామని మంత్రి చెప్పారు. గన్నవరం ఐటీ సెజ్‌లో 50వేలు, మంగళగిరిలో 10వేల ఐటీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఐటీ సంస్థలను ప్రోత్సహించేందుకు 50శాతం అద్దె ప్రభుత్వం చెల్లిస్తోందని, కంపెనీలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు.

Link to comment
Share on other sites

ప్రాధాన్య రహదారుల పరుగు
26-11-2017 07:20:45
 
636472776432096150.jpg
  •  దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్ల నిర్మాణంతోపాటే ప్రపంచస్థాయి మౌలిక వసతులు
  •  సీడ్‌ యాక్సెస్‌ సహా మొత్తం 8 రహదారులు- పొడవు 85.17 కి.మీ., వ్యయం రూ.1306 కోట్లు
  •  ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న ఏడీసీ, నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు
 
 
అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు సహా మొత్తం 8 ప్రాధాన్య రహదారులు వచ్చే ఏడాది జనవరి ఆఖరుకల్లా పూర్తయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఆ శాఖ అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఈ రహదారులు ఎక్కడా మలుపులు లేకుండా సువిశాలంగా నిర్మితమవుతుండడం విశేషం.
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి)  రాజధానిలో నిర్మితమవుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు సహా మొత్తం 8 ప్రాధాన్య రహదారులు వచ్చే ఏడాది జనవరి ఆఖరుకల్లా పూర్తి కానున్నాయి. ఈ రోడ్లను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తుం డడంతోపాటు ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా లేని విధంగా, నిర్మాణ సమయంలోనే వాటి వెంబడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్ల పక్కన పలు రకాలకు చెందిన వేలాది మొక్కలను పెంచనుండడం ఓ ప్రత్యేకత! దాదాపు ఎక్కడా మలుపుల్లేకుండా, సువిశా లంగా రూపుదాల్చుతుండడం ఇంకో విశేషం! జనవరి ఆఖరుకల్లా పూర్తి చేయడం ద్వారా అమరావతి నిర్మాణానికి మేలుబాటలు పరవాలన్న లక్ష్యంతో ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి ఆధ్వర్యంలో ఆ సంస్థ అధికారులు, కాంట్రాక్టు సంస్థలు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి.
 
ప్రాధాన్య రహదారులుగా వ్యవహరిస్తున్న ఈ 8 రోడ్లలో రాజధానికి జీవరేఖగా అభివ ర్ణితమవుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతోపాటు మరో 7 రహదా రులున్నాయి. వీటిల్లో సీడ్‌ యాక్సెస్‌ రహదారి అమ రావతిలోని తూ ర్పు- పడమర దిక్కులను కలు పుత ుండగా, మిగిలిన వాటిల్లో 4 ఉత్తరం నుంచి ద క్షిణ దిశ లను, 3 తూర్పు- పశ్చిమ ప్రాంతాలను అనుసం ధానిస్తున్నాయి. ఈ రోడ్లన్నింటి పొడవు మొత్తం 85.17 కిలో మీటర్లు కాగా, వీటి మొత్తం నిర్మాణ వ్యయం రూ.1,306 కోట్లు. ఈ రోడ్లన్నింటినీ అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించే రహదారుల మాదిరిగా నిర్మిస్తున్నారు. వర్షపు నీరు నిలిచి, రోడ్లు పాడవడాన్ని నిరోధించేందుకు స్మార్ట్‌ వాటర్‌ డ్రెయిన్లను ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే లీకులకు తద్వారా కలుషిత మయ్యేందుకు ఆస్కారం లేని విధంగా తాగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తు, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) కోసం యుటిలిటీ డక్టులను నిర్మించనున్నారు. వాడిన జలాలను రీసైక్లింగ్‌ చేసి టాయ్‌ లెట్‌ ఫ్లషింగ్‌, గార్డెనింగ్‌, ల్యాం డ్‌స్కేపింగ్‌ తదితర అవసరాలకు ఉప యో గించుకు నేందుకు వీలు కల్పించే రీయూజ్డ్‌ వాటర్‌ పైపులైన్లనూ నిర్మించనున్నారు. పాదచారులు, సైక్లిస్టుల కోసం వేర్వేరు మార్గాలు, నేత్రపర్వం కలిగించే అవెన్యూ ప్లాంటేషన్‌, నాణ్యమైన స్ట్రీట్‌ ఫర్నిచర్‌ తదితరాలూ ఈ రోడ్ల పక్కన కొలువు దీరనున్నాయి. భూఉపరితలంపై ఎక్కడా కనిపించకుండా, భూగర్భంగుండానే సాగే విద్యుత్తు సరఫరా వ్యవస్థను కల్పించనున్నారు. ఇందుకోసం ఎన్‌-4, ఎన్‌-14 రహదారుల మధ్య ప్రస్తుతమున్న విద్యుత్తు స్తంభాల తొలగింపునకు ఏపీ ట్రాన్స్‌కోకు ఇప్పటి వరకు రూ.4.90 కోట్లను చెల్లించారు. ఇతర ప్రదేశాల్లోనూ అక్కడక్కడ ఉన్న ఎలక్ట్రిక్‌ పోల్స్‌ తొలగింపునకు ఏడీసీ చర్యలు గైకొంటోంది.
 
రహదారుల వివరాలు..
  •  ఉండవల్లి నుంచి దొండపాడుల మధ్య నిర్మిస్తున్న 18.4 కిలోమీటర్ల పొడవైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు (ఈ-3) నిర్మాణ వ్యయం రూ.215 కోట్లు. 8 వరుసల ఈ రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. 14 నుంచి 18 కిలోమీటర్ల మధ్య అక్కడక్కడ భూసేకరణలో సమ స్యల కారణంగా పనులు ఆగడం (ఈ సమస్యను పరిష్కరిం చేందుకు ఏపీసీఆర్డీయే, గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కృతికా శుక్లా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు) మినహా మిగిలిన చోటంతా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయింది. రాయపూడి, అబ్బరాజుపాలెంల వద్ద ఈ రహదారిలో భాగంగా వంతెనల నిర్మాణం జరుగుతోంది. కొద్ది వారాల్లోనే ఈ రోడ్డుతోపాటు మిగిలిన 7 ప్రయారిటీ రోడ్ల పక్కన కూడా భారీ సంఖ్యలో పలు వృక్షజాతులకు చెందిన మొక్కలను నాటేందుకు ఏడీసీ సమాయత్తమవుతోంది.
  •  8.27 కిలోమీటర్ల పొడవున బోరుపాలెం- శాఖమూరుల మధ్య నిర్మిస్తున్న ఎన్‌-14, 7.17 కిలోమీటర్ల పొడవుతో వెంకటపాలెం- నవులూరుల మధ్య వేస్తున్న ఎన్‌-4 రోడ్ల మొత్తం అంచనా వ్యయం రూ.266 కోట్లు.
  •  14.95 కిలోమీటర్ల పొడవుతో కృష్ణాయపాలెం- నెక్కల్లు మధ్య నిర్మిస్తున్న ఈ-8 రోడ్డు నిర్మాణ వ్యయం రూ.272 కోట్లు. ఇందులో భాగంగా శాఖమూరు, నెక్కల్లుల వద్ద వంతెనలను నిర్మిస్తున్నారు.
  •  12.5 కి.మీ.ల ఎన్‌-9 రహదారి ఉద్ధండరాయునిపాలెం- నిడమర్రుల మధ్య నిర్మితమవుతోంది. దీని వ్యయం రూ.215 కోట్లు. దీని మార్గమధ్యంలో 2 వంతెనల నిర్మాణం చురుగ్గా సాగుతోంది.
  •  7.81 కి.మీ.ల ఈ-10 పెనుమాక నుంచి ఐనవోలు వరకు, 7.3 కి.మీ. ఈ-14 మంగళగిరి- నీరుకొండల మధ్య, 8.77 కి.మీ. ఎన్‌-16ను అబ్బరాజుపాలెం- నెక్కల్లుల మధ్య నిర్మిస్తున్నారు.
  • ఈ-10 రోడ్డులో కృష్ణాయపాలెం వద్ద, ఎన్‌-16లో నెక్కల్లు వద్ద నిర్మించాల్సిన వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ 3 రహ దారుల మొత్తం నిర్మాణ వ్యయం రూ.338 కోట్లు.
 
 
 
Link to comment
Share on other sites

అమరావతిలో హోటళ్లకు 10 సంస్థల బిడ్‌లు

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో హోటళ్ల నిర్మాణానికి 10 సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. అమరావతిలో తొలి దశలో 8 స్టార్‌ హోటళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వం ఆలోచన. 2 ఐదు నక్షత్రాలు, 2 నాలుగు నక్షత్రాలు, 4 మూడు నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకి సీఆర్‌డీఏ ఇటీవల టెండర్లు పిలవగా 10 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కొన్ని సంస్థలు రెండు కేటగిరీల్లో టెండర్లు వేశాయి. ఐదు నక్షత్రాల హోటల్‌కి 4, నాలుగు నక్షత్రాల హోటల్‌కి 2, మూడు నక్షత్రాల హోటల్‌కి ఎకరం చొప్పున సీఆర్‌డీఏ స్థలం కేటాయించనుంది. ఎకరం ధరను రూ.3 కోట్లుగా నిర్ణయించింది. టెండర్లు దాఖలు చేసిన సంస్థల అర్హతల్ని బట్టి భూకేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు.

25ap-state16a.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...