Jump to content

Amaravati


Recommended Posts

 

రేపు అమరావతిలో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధుల పర్యటన

 

 
అమరావతి: రేపు విజయవాడకు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు వస్తారని మంత్రి నారాయణ అన్నారు. మూడు రోజులపాటు రాజధానిలో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు పర్యటిస్తారని మంత్రి నారాయణ చెప్పారు. చైనా, మలేషియా పర్యటనలో ఎలక్ట్రికల్‌ బస్సుల పనితీరును పరిశీలించామని నారాయణ వెల్లడించారు. సీఎం నిర్ణయం తర్వాత విజయవాడ మెట్రోపై ముందుకువెళ్తామని నారాయణ స్పష్టం చేశారు.

 

ee pariseelanalu paryatanalu inka chepthu unte ela mana batch,.. Amaravati lo raithulaki mellaga bhayam start avuthadi inka, 

Link to comment
Share on other sites

నేడు విజయవాడకు నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు

విజయవాడ: నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు మంగళవారం విజయవాడకు రానున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో వారు భేటీ కానున్నారు. అనంతరం అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై చర్చలు జరపనున్నారు. అలాగే బుధవారం ఉదయం పదిగంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ కానున్నారు. సీఎంతో భేటీ అనంతరం అసెంబ్లీ భవనం డిజైన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే.. ఉమ్మడి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, ఇతర న్యాయమూర్తులకు ఈనెల 13న హైకోర్టు భవనాల డిజైన్లను నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు వివరించనున్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ డిజైన్ల ఖరారు అనంతరం టెండర్లు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

ఏపీకి ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరులో మరో ముందడుగు
 
 
636353856088374109.jpg
న్యూఢిల్లీ: అమరావతిలో 7 రహదారుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరులో మరో ముందడుగు పడింది. రూ. 962 కోట్ల పనులకు ప్రపంచ బ్యాంక్ ప్రణాళిక విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 12 నాటికి పనులు పూర్తి చేయాలని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. ఉద్దండరాయపాలెం, నిడమానూరు, కృష్ణాయపాలెం, నెక్కళ్లు, వెంకటాయపాలెం, నవులూరు, బోరుపాలెం, శాఖమూరు, పెనుమాక, ఐనవోలు, మంగళగిరి, నీరుకొండ, అప్పరాజుపాలెం రహదారుల పనులకు ప్రణాళిక విడుదల చేసింది. రైతుల అభ్యంతరాల పరిశీలనకు తనిఖీ బృందం ఏర్పాటుపై ప్రపంచబ్యాంక్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Link to comment
Share on other sites

అమరావతికి రుణం ఖరారు
 
 
636354205401259201.jpg
  • రాజధాని రోడ్లకు ప్రపంచబ్యాంకు చేయూత
  • రూ.963 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక
  • ఈ నెలలోనే ఒప్పందం
  • ఫలించని అడ్డుపుల్లలు
 
 
న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని రోడ్లకు మహర్దశ పట్టనుంది. అమరావతి ప్రాంతంలో ఏడు రోడ్లు నిర్మించడానికి ప్రపంచబ్యాంకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ప్రణాళికలు, అంచనా వ్యయాన్ని విడుదల చేసింది. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొందరు లేవనెత్తిన ‘అభ్యంతరాలను’ తీసి పక్కన పెట్టింది. రాజధాని నిర్మాణంపై తమకు అభ్యంతరం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఇవ్వకూడదని రైతుల పేరుమీద కొందరు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ‘‘అమరావతికి అడ్డుపుల్ల’’ శీర్షికతో జూన్‌ 27న ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. రైతుల అభ్యంతరాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకు తనిఖీల బృందం చైర్మన్‌.. బ్యాంకు చైర్మన్‌కు లేఖ రాశారు. ఆ లేఖకు చైర్మన్‌ సమాధానం ఇవ్వకముందే ప్రపంచబ్యాంకు తాజాగా అమరావతి రోడ్ల ప్రణాళికను విడుదల చేసింది. ఫలితంగా అభ్యంతరాలను పక్కనబెట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రానికి రుణం ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం తనిఖీలు, కమిటీ ఏర్పాటు చేస్తారని ప్రపంచబ్యాంకువర్గాలు పేర్కొంటున్నాయి.
 
దశల వారీగా రుణం
అమరావతి నగరాభివృద్ధి కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సంయుక్తంగా రూ.4,606 కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో ప్రపంచబ్యాంకు వాటా రూ.1,932 కోట్లు. ప్రతిపాదిత 10 రోడ్లలో ఏడు రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. పనులు ప్రారంభమయ్యాక ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణాన్ని దశల వారీగా విడుదల చేస్తుంది. ఈ రోడ్ల పనులు జరుగుతున్న క్రమంలో రూ.962 కోట్లను విడుదల చేస్తూ.. మిగిలిన రూ.1000 కోట్లు తర్వాత విడుదల చేస్తుంది.
 
anchana.jpg
Link to comment
Share on other sites

భవానీ ద్వీపంలో...ఫ్లాగ్‌ పార్క్‌..
12-07-2017 09:06:39
 
636354472192106677.jpg
  • 150 ఎకరాల్లో డిజైన్లు సిద్ధం చేసిన ఎల్‌అండ్‌టీ
 
భవానీ ఐలాండ్‌లో అద్భుతమైన మెగాపార్కు రూపుదిద్దుకోనుంది. ఫ్లాగ్‌పార్కు పేరుతో 150ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ఇది దేశంలోనే ఒక ఉత్తమ పర్యాటక కేంద్రంగా నిలువనుంది. ఎల్‌అండ్‌టీ సంస్థ రూపొందించిన ఈ ఫ్లాగ్‌ పార్కు డిజైన్లు కళ్లుమిరుమిట్లుగొలిపేలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో పబ్లిక్‌ పార్కు, గడ్డి మైదానాలు, వనాలు, ఫుడ్‌కోర్టులు, వాక్‌వేలు, వీవీఐపీ విశ్రాంతి గదులు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ తదితరాలు ఉంటాయి. మరోవైపు కృష్ణా నదీ తీరాన్ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. నది ఒడ్డునుంచి ఫ్లాగ్‌పార్కు వరకు ఒక సుందరమైన ప్రాంతంగా, మళ్లీ మళ్లీ చూడాలనిపించే పర్యాటక ప్రాంతంగా ప్రణాళిక సిద్ధమవుతోంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

ee pariseelanalu paryatanalu inka chepthu unte ela mana batch,.. Amaravati lo raithulaki mellaga bhayam start avuthadi inka,

August nunchi starts antunnaru ga

Ika appatiki..start cheyyakapothey God bless us

Link to comment
Share on other sites

 

భవానీ ద్వీపంలో...ఫ్లాగ్‌ పార్క్‌..

12-07-2017 09:06:39

 
636354472192106677.jpg
  • 150 ఎకరాల్లో డిజైన్లు సిద్ధం చేసిన ఎల్‌అండ్‌టీ
 
భవానీ ఐలాండ్‌లో అద్భుతమైన మెగాపార్కు రూపుదిద్దుకోనుంది. ఫ్లాగ్‌పార్కు పేరుతో 150ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ఇది దేశంలోనే ఒక ఉత్తమ పర్యాటక కేంద్రంగా నిలువనుంది. ఎల్‌అండ్‌టీ సంస్థ రూపొందించిన ఈ ఫ్లాగ్‌ పార్కు డిజైన్లు కళ్లుమిరుమిట్లుగొలిపేలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో పబ్లిక్‌ పార్కు, గడ్డి మైదానాలు, వనాలు, ఫుడ్‌కోర్టులు, వాక్‌వేలు, వీవీఐపీ విశ్రాంతి గదులు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ తదితరాలు ఉంటాయి. మరోవైపు కృష్ణా నదీ తీరాన్ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. నది ఒడ్డునుంచి ఫ్లాగ్‌పార్కు వరకు ఒక సుందరమైన ప్రాంతంగా, మళ్లీ మళ్లీ చూడాలనిపించే పర్యాటక ప్రాంతంగా ప్రణాళిక సిద్ధమవుతోంది.

 

 

ocean park /wonderla lanti games pettandi 

Link to comment
Share on other sites

వజ్రం ఆకృతిలో హైకోర్టు భవనం

నేడు పరిపాలన, న్యాయ నగరాల తుది ప్రణాళిక

శాసనసభ భవన తుది ఆకృతి అందజేయనున్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని న్యాయ నగరంలో నిర్మించే హైకోర్టు భవన ఆకృతిని వజ్రంను పోలిన విధంగా లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించింది. అమరావతిలో పరిపాలన, న్యాయ నగరాల తుది ప్రణాళిక, శాసనసభ భవన తుది ఆకృతులను ఆ సంస్థ బుధవారం అందజేయనుంది. హైకోర్టు భవనానికి సంబంధించి ఇది వరకు రెండు ప్రాథమిక ఆకృతులు రూపొందించింది. అవి సంతృప్తికరంగా లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో... ఇప్పుడు డైమండ్‌(వజ్రం)ను పోలిన విధంగా మరో ఆకృతిని సిద్ధం చేసింది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమవుతారు. అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలన నగరం, దానికి కొనసాగింపుగా 465 ఎకరాల్లో నిర్మించే న్యాయనగరం కలిపి మొత్తం... 1,365 ఎకరాలకు ఈ సంస్థ మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తోంది. ప్రాథమిక ప్రణాళికకు ముఖ్యమంత్రి సూచనల మేరకు మార్పులు, చేర్పులతో తుది ప్రణాళిక సిద్ధం చేసింది. మకుటాయమాన భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల్నీ ఈ సంస్థే రూపొందిస్తోంది. బౌద్ధ స్తూపాన్ని స్ఫూర్తిగా తీసుకుని... ఆ సంస్థ రూపొందించిన శాసనసభ భవన ఆకృతికి ఇది వరకే ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. దాని వివరణాత్మక తుది ఆకృతిని ఇప్పుడు అందజేయనుంది. శాసనసభ, శాసన మండలి భవనం లోపల... ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు ఎక్కడుండాలి? పరిపాలనా విభాగం ఎక్కడుండాలి? వంటి సమగ్ర వివరాలను తీసుకువచ్చింది. శాసనసభ భవనానికి ప్రహరీ లేకుండా చుట్టూ జలాశయం ఉండేలా... భవనం ప్రాంగణంలోకి వంతెనల మీదుగా ప్రవేశించేలా ఆ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇప్పుడు తీసుకువచ్చిన హైకోర్టు భవన ఆకృతితో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితే... దాని వివరణాత్మక ఆకృతుల్ని రూపొందిస్తుంది. పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతుల రూపకల్పనకు కూడా మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థే ఎంపికైంది. ఆ భవనాలకు సంబంధించిన ప్రాథమిక ఆకృతుల్ని కూడా బుధవారం అందజేసే అవకాశం ఉన్నట్టు సీఆర్‌డీఏ వర్గాల సమాచారం. సంస్థ ప్రతినిధులు మంగళవారమే పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమై చర్చించారు.

Link to comment
Share on other sites

అమరావతికి జపాన్‌ సహకారం

నేడు సీఎం చంద్రబాబుతో చర్చలు

70 మంది ప్రతినిధుల బృందం రాక

ఈనాడు అమరావతి: జపాన్‌ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (మేటి) మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలో 70 మంది పారిశ్రామిక ప్రతినిధుల బృందం బుధవారం రాష్ట్రానికి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి జపాన్‌ సహకారం వంటి అంశాలపై ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఇరు పక్షాల మధ్య కొన్ని అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. బుధవారం మధ్యాహ్నం విజయవాడలోని ఒక హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. జపాన్‌ నుంచి వచ్చిన ప్రతినిధులకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు, పారిశ్రామిక వేత్తలకు మధ్య చర్చలు జరుగుతాయి. రాజధాని అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ వివరిస్తారు. అమరావతికి జపాన్‌ సహకారంపై ఈ సందర్భంగా ‘మేటి’కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరగనుంది. రాజధాని అమరావతికి ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) మాస్టర్‌ ప్లాన్‌, ఎలక్ట్రానిక్‌, స్పోర్ట్స్‌, సిటీ మాస్టర్‌ ప్లాన్‌ల రూపకల్పన, రాజధాని ప్రాంతానికి డేటా సెంటర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫాం, రాడార్‌ ద్వారా విపత్తుల నిరోధక వ్యవస్థ, ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు జపాన్‌ సహకారం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉంటాయి. సీఆర్‌డీఏ ప్రాంతానికి సమీకృత ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థపై అధ్యయనానికి అవసరమైన సహకారం అందించేందుకు జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) ఇప్పటికే అంగీకరించింది. దీన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్న అంశాన్నీ ఈ ఒప్పందంలో పొందుపర్చుతారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులకు జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ (జెబిక్‌), ఆంధ్రప్రదేశ్‌ మధ్య సహకారానికి సంబంధించిన అంశాలపైనా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌, అమరావతి అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు జపాన్‌ మొదటి నుంచి సానుకూలంగానే ఉంది. మేటి, జెబిక్‌లతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి శంకుస్థాపన సందర్భంగా (2015 అక్టోబరు 22న) ఎంఓయూలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఆర్‌డీఏ అధికారులు 2016 డిసెంబరులో జపాన్‌లో పర్యటించారు. ఆ తర్వాత మేటి, సీఆర్‌డీఏ అధికారుల మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.920 కోట్లు ఇవ్వాల్సిందిగా జైకాకి సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. జపాన్‌ 2020లో ఒలింపిక్స్‌ నిర్వహణకు సిద్ధమవుతోంది. అదే పద్ధతిలో అమరావతిలోను క్రీడా సదుపాయాల కల్పనకు సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిని స్మార్ట్‌ సిటీగా రూపొందించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాల కోసం సీఆర్‌డీఏ జపాన్‌ సహకారం కోరుతోంది.

Link to comment
Share on other sites

అమరావతిలో 7 రోడ్లకు రూ.962 కోట్లు

ఈనాడు, దిల్లీ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర పరిధిలో మొత్తం ఏడు రోడ్ల నిర్మాణానికి రూ.962 కోట్లు మంజూరుచేయడానికి ప్రపంచబ్యాంకు ప్రణాళికలు సిద్ధంచేసింది. వీటిని 2018 మార్చి కల్లా పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఒక షెడ్యూల్‌ తయారుచేసింది. త్వరలో వీటికి సంబంధించి ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం వీటికి రూ.962 కోట్లు ఖర్చవుతుందని అంచనాకు వచ్చింది. భవిష్యత్తులో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ ప్యాకేజీల్లో మార్పులుచేర్పులు చేయనుంది. అమరావతి సస్టెయినబుల్‌ కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కింద ఈ నిధులు మంజూరుచేయడానికి ప్రపంచబ్యాంకు అంగీకరించింది.

Link to comment
Share on other sites

ఆకృతుల్లో మార్పులు సూచించిన చంద్రబాబు 

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించే శాసనసభ శాశ్వత భవన నిర్మాణ ఆకృతులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖరారు చేసింది. నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు ప్రదర్శించిన ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో కీలక మార్పులను చంద్రబాబు సూచించారు. శాసనసభ కోసం సిద్ధం చేసిన బుద్ధస్థూపం ఆకృతిని హైకోర్టు కోసం మార్చాలని, అలాగే హైకోర్టు కోసం సిద్ధం చేసిన వజ్రాకార భవన ఆకృతిని శాసనసభ కోసం సిద్ధం చేయాలని సూచించారు. మార్చిన హైకోర్టు డిజైన్‌ను చీఫ్‌ జస్టిస్‌కు చూపించి తుది ఆకృతులు సిద్ధం చేయాలని కోరారు. హైకోర్టును 4 అంతస్తులుగా రూపకల్పన చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

Link to comment
Share on other sites

ఆకృతుల్లో మార్పులు సూచించిన చంద్రబాబు 

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించే శాసనసభ శాశ్వత భవన నిర్మాణ ఆకృతులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖరారు చేసింది. నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు ప్రదర్శించిన ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో కీలక మార్పులను చంద్రబాబు సూచించారు. శాసనసభ కోసం సిద్ధం చేసిన బుద్ధస్థూపం ఆకృతిని హైకోర్టు కోసం మార్చాలని, అలాగే హైకోర్టు కోసం సిద్ధం చేసిన వజ్రాకార భవన ఆకృతిని శాసనసభ కోసం సిద్ధం చేయాలని సూచించారు. మార్చిన హైకోర్టు డిజైన్‌ను చీఫ్‌ జస్టిస్‌కు చూపించి తుది ఆకృతులు సిద్ధం చేయాలని కోరారు. హైకోర్టును 4 అంతస్తులుగా రూపకల్పన చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

 

sachindi gorre.. itta ayithe 2018 ki kooda start ayyetattu ledu gaa :mellow:

Link to comment
Share on other sites

Assembly 1st,2nd floor-speaker,cm,ministers chambers

 

3rd floor-library,meeting hall

4th floor-central hall,peoples waiting hall

 

high court ground floor-administrative buldings

1st floor-meeting hall,library

2nd floor-16 courts,16 judges chambers

3rd floor-20 courts,20 judges chambers

4th floor-chief justice chamber,court,judges meeting hall

Link to comment
Share on other sites

చంద్రబాబుతో జపాన్‌ మంత్రి భేటీ, కీలక అంశాలపై చర్చ
 
 
636354729338561141.jpg
అమరావతి: సీఎం చంద్రబాబుతో జపాన్‌ ఆర్థిక, వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (మేటి)ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అమరావతి నిర్మాణానికి సహకారంపై సీఎంతో చర్చించారు. జపాన్ మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలో చంద్రబాబుతో 70 మంది ప్రతినిధులు సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ వివరించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...