Jump to content

Amaravati


Recommended Posts

వెలిగిపోనున్న అమరావతి
 
 
636344971124550020.jpg
  • అమరావతిలో త్వరలో విద్యుత్తు లైన్లకు టెండర్లు
  • రాజధాని అందాలను దెబ్బ తీయకుండా ఉండేలా జాగ్రత్తలు
  • ఎన్‌- 13 రహదారికి ఇరువైపులా 400, 220 కేవీ లైన్లు
  • తక్కువ స్థలం ఆక్రమించే మోనో పోల్స్‌
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
రాజధాని అందాలకు అడ్డు పడకుండా ఉండడంతోపాటు నాణ్యమైన సరఫరా కోసం ఉద్దేశించిన అమరావతి అత్యధునాతన విద్యుత్తు కారిడార్‌ టెండర్ల ప్రక్రియను కొద్ది వారాల్లో ప్రారంభించాలని ఏపీ ట్రాన్స్‌కోను ఉన్నతాధికారులు ఆదేశించారు. 2 నుంచి 3 వారాల్లో 220 కేవీ, 5 నుంచి 6 వారాల్లో 400 కేవీ లైన్ల క్రమబద్ధీకరణకు టెండర్లు పిలవాలన్నారు. రాజధానిలోని విద్యుత్తు లైన్లు ఇప్పటి మాదిరిగా గజిబిజిగా ఉండి, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకుండా చూడడం, ఒక క్రమపద్ధతిలో సాగుతూ నగర సౌందర్యాన్ని ఇనుమడింపజేసేలా ఉండడం తప్పనిసరన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రస్తుతమున్న విద్యుత్తు లైన్లను ఎవరికీ, ఎటువంటి ఇబ్బంది కలుగని రీతిలో మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నిర్మాణాలతోపాటు వివిధ కారిడార్లకు వాటి వల్ల ఎలాంటి అవాంతరాలు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఈ లైన్ల మార్గాలను మార్చడం (రీ రూటింగ్‌) అవశ్యమన్నారు.
 
రాజధాని నగరంలో విద్యుత్తు లైన్ల క్రమబద్ధీకరణపై విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో నిర్మించబోయే సుందర నిర్మాణాలకు విద్యుత్తు లైన్లు ఏ విధంగానూ ఆటంకం కలిగించని రీతిలో వాటిని ఒక క్రమపద్ధతిలోకి మార్చాల్సి ఉందని ఏడీసీ, సీఆర్డీయే, ట్రాన్స్‌కో, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లకు చెందిన అధికారులు అభిప్రాయపడ్డారు. ఆకర్షణీయంగా రూపుదిద్దుకోనున్న అమరావతికి దీటుగా అందులోని 400 కేవీ, 220 కేవీ లైన్లను రూపొందించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై వారు విస్తృతంగా చర్చించారు.
 
ఎన్‌-13 రహదారికి ఇరువైపులా లైన్లు..
రాజధానిలోని కొండవీటి వాగు, గ్రీన్‌, మెట్రో కారిడార్లకు ఏమాత్రం ఆటంకం కలుగని రీతిలో ఎన్‌-13 రహదారికి ఇరువైపులా ఉండే గ్రీన్‌ బెల్ట్‌ పైగుండా 220 కేవీ, 400 కేవీ విద్యుత్తు లైన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా వీటి వల్ల భవనాలకు, ఇతర నిర్మాణాలకు ఎటువంటి అసౌకర్యం కలుగదన్నారు. దీంతోపాటు తక్కువ స్థలం ఆక్రమించే మోనో పోల్స్‌ ఏర్పాటు చేస్తే మరింత బాగా ఉంటుందని భావించారు. కృష్ణా నది అవతి వైపు నుంచి దీపంలో నుంచి రాజధాని నగరంలోకి విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పై కూడా చర్చించారు.
 
ఈ సమావేశంలో సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారధి, సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ట్రాన్స్‌కో సంచాలకుడు (ప్రాజెక్ట్స్‌) ఎస్‌. సుబ్రహ్మణ్యం, ఎస్పీడీసీఎల్‌ సంచాలకుడు పుల్లారెడ్డి, ట్రాన్స్‌కో ముఖ్య ఇంజినీర్లు దేవానంద్‌, ప్రవీణ్‌కుమార్‌, డిస్కం సీఈ రాజబాపయ్య, ట్రాన్స్‌కో ఎస్‌.ఈ (ప్రాజెక్ట్‌ అభివృద్ధి ప్రాధికార సంస్థ) బి.శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో డిజైన్స్‌ ఇంజినీర్‌ కె.శ్రీనివాసరావు, ఏడీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.వి.గణేష్‌బాబు, సీఆర్డీయే ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అదనపు సంచాలకుడు టి.ఆంజనేయులు, ఇన్‌ఫ్రా ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.వి.ఆర్‌.కె.ప్రసాద్‌, సీనియర్‌ ప్లానింగ్‌ అధికారి జి.నాగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

విజయవాడ నుంచి అరగంటలో గుంటూరు..!

amr-top1a.jpg

అమరావతి: విజయవాడ- గుంటూరు నగరాల మధ్య దూరం కేవలం 40 కిలోమీటర్లు. ప్రయాణ సమయం గంటకు పైగా పడుతోంది. కొన్ని సందర్భాల్లో జాతీయ రహదారి మీదుగా వెళ్లినా గంట సమయం మించుతోంది. ఇక ముందు ఈ దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకునే విధంగా రవాణా వ్యవస్థ రూపొందబోతోంది. అంతే కాదు గుంటూరు-అమరావతి, అమరావతి- విజయవాడ మధ్య వేగవంతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కాలం చెల్లిన రవాణా సదుపాయాలు కాకుండా అధునాతన వ్యవస్థ, ఆధునిక సాంకేతిక మేళవించి ఏర్పాటు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్‌, రవాణాపై ఏపీ సీఆర్‌డీఏ జపాన్‌ దేశానికి చెందిన ‘జైకా’ సంస్థతో అవగాహన కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూనిఫైడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్‌డీఏ, జైకా ప్రతినిధులతో పాటు రవాణా, రహదారులశాఖకు చెందిన అధికారులు సమాలోచనలు జరిపారు. 2015 నాటి జనాభా, రవాణా రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018 నాటికి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం ఒక రూపు దాల్చాలని, పూర్తి స్థాయి పాలన ప్రారంభం కావాలని, మౌలిక వసతులు ఏర్పాటు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా సీఆర్‌డీఏ, ఏడీబీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఏకీకృత రవాణా విధానాన్ని దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2050 రద్దీని, జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించనున్నారు.

ప్రస్తుతం సీఆర్డీఏ పరిధిలో మొత్తం సుమారు 60 లక్షల జనాభా ఉంది. రాజధాని పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగితే ఇది రెండింతలు అవుతుందని అంచనా. అమరావతి నగరం పరిధిలో ప్రస్తుతం లక్ష జనాభా మాత్రమే ఉన్నారు. భవిష్యత్తులో రానున్న పదేళ్లలో దాదాపు 20లక్షల నుంచి 30లక్షలకు చేరుకొనే అవకాశం ఉందని అంచనా. విద్యాసంస్థలు, వైద్య సంస్థలు వివిధ వాణిజ్య సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు పెరగనున్నాయి. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు నగరాలు, వాటి శివారు ప్రాంతాల్లో జనసాంద్రత పెరిగింది. రానున్న రోజుల్లో ఈప్రాంతాల్లోనూ జనాభా పెరగనుందని అంచనా దీనికి అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.

* ప్రస్తుతం మొదటి దశలో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. రోడ్లను విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆకృతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఇతర ఏడు ప్రధాన రహదారులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేయనున్నారు. వీటికి దాదాపు రూ.1215 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

* విజయవాడ, తెనాలి, గుంటూరు, అమరావతి నగరాన్ని కలుపుతూ వలయ రహదారి నిర్మాణం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను వస్తున్న ప్రధాన, జాతీయ రహదారులను కలుపుతూ బాహ్యవలయ రహదారిగా ఇది ఉంటుంది. ఈ వలయ రహదారిపై ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా బస్సులను నడుపుతారు.

* విజయవాడ నుంచి బయలుదేరి తిరిగి విజయవాడ చేరుకొనే విధంగా తెనాలి, గుంటూరు, అమరావతిలను కలుపుతూ రైల్వే ట్రాక్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ అధ్యయనం చేస్తోంది. సీఆర్డీఏతో కలిసి ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక.

* ప్రజా రవాణా వ్యవస్థకు అవసరమైన పెట్టుబడిని జైకా అందించాలనేది ప్రణాళిక. ఆధునిక బస్సులను, మెట్రో రైలును వలయ రైళ్లను కొనుగోలు చేస్తారు.

* అమరావతి ప్రాంతంలో దాదాపు 9వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయనున్నారు. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పురపాలక పట్టణాలు ఉన్నాయి.

* వచ్చే ఏడాది ప్రారంభంలో జైకా దీనిపై అధ్యయన నివేదిక అందించనున్నట్లు తెలిసింది.

* బస్సులు, రైళ్లలో ప్రయాణించినా ఒకే కార్డు చెల్లుబాటు అయ్యేవిధంగా ఏకీకృత రవాణా విధానం రూపొందించనున్నారు. దీనికి గాను ఆర్టీసీ, రైల్వేతోనూ అంగీకారం కుదరాల్సి ఉంటుందని చెబుతున్నారు.

* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏపీ రాజధాని ప్రాంత ఏకీకృత రవాణా అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. అధ్యయనం ప్రగతిని సమీక్షించేందుకు సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో సంయుక్త సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనేది నిర్ణయం.

Link to comment
Share on other sites

12న పరిపాలన, న్యాయ నగరాల తుది ప్రణాళిక

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో 1,365 ఎకరాల్లో నిర్మించే పరిపాలన, న్యాయ నగరాల తుది ప్రణాళికను లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఈ నెల 12న అందజేయనుంది. శాసనసభ, శాసనమండలి భవన తుది ఆకృతుల్ని కూడా సమర్పిస్తుంది. హైకోర్టు భవనానికి సంబంధించిన మూడు ప్రాథమిక ఆకృతుల్ని కూడా ఆ రోజు అందజేస్తుంది. వాటిలో ఒక దానిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. 900 ఎకరాల్లో పరిపాలన నగరాన్ని, దానికి కొనసాగింపుగా 465 ఎకరాల్లో న్యాయ నగరాన్ని నిర్మించనున్నారు. వచ్చే బుధవారం అందజేసే తుది ప్రణాళికకు ప్రభుత్వం మోదముద్ర వేస్తే... నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ వివరణాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. దీనికి నవంబరు 17 వరకు సీఆర్‌డీఏ గడువు పెట్టింది. శాసనసభ భవనం తుది ఆకృతికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే... వివరణాత్మక ఆకృతుల్ని దశలవారీగా అందజేస్తుంది. మొదటి పునాది వరకు (పైల్‌ ఫౌండేషన్‌) డ్రాయింగ్‌లు అందజేస్తుంది. హైకోర్టు భవనానికి సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇది వరకు కొన్ని ప్రాథమిక ఆకృతులు ఇవ్వగా... వాటితో ముఖ్యమంత్రి సంతృప్తి చెందలేదు. దాంతో ఆ సంస్థ మరో మూడు ఆకృతుల్ని సిద్ధం చేస్తోంది. వాటిని కూడా బుధవారం అందజేయనుంది

Link to comment
Share on other sites

తుళ్లూరులో న్యాక్‌ కేంద్రం ఏర్పాటు

సీఆర్‌డీఏ వెల్లడి

ఈనాడు అమరావతి: రాజధాని పరిధిలోని తుళ్లూరు గ్రామంలో ఎకరం విస్తీర్ణంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ (న్యాక్‌) అమరావతి విభాగం త్వరలో ఏర్పాటు కానుంది. రాజధానిలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జరిగే నిర్మాణాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా... వారికి నిర్మాణరంగంలో అవసరమైన శిక్షణనిచ్చేందుకు న్యాక్‌ విభాగాన్ని రాజధానిలో ఏర్పాటు చేయనున్నారు. ‘జీవనభారం’ శీర్షికతో రాజధాని రైతులు, యువత, వ్యవసాయ కూలీల ప్రస్తుత స్థితిగతులకు సంబంధించి గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. ఇంత వరకు రాజధాని గ్రామాలకు చెందిన 736 మంది యువతకు నైపుణ్యశిక్షణ ఇచ్చామని, తాము నిర్వహించిన జాబ్‌ మేళాలో,్ల ఇతరత్రా 1440 మందికి ఉద్యోగాలొచ్చాయని తెలిపింది. ఎన్టీఆర్‌ క్యాంటిన్‌ ప్రాజెక్టులో 89 మందికి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రాజెక్టులో 40 మందికి, సచివాలయంలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 140 మందికి సీఆర్‌డీఏ ద్వారా ఉద్యోగాలు లభించినట్టు తెలిపింది. 1500 మంది మహిళలకు కుట్టు, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఉద్యానవనాల నిర్వహణలో శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. రైతులు రాజధానిలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకుని పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ‘రైతులే ముందు’ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. వారి కోసం ఇప్పటికే ‘మన అమరావతి’ పేరుతో ప్రత్యేక యాప్‌ రూపొందించినట్టు తెలిపింది.

Link to comment
Share on other sites

గోపీ అకాడమీకి 12.5 ఎకరాలు?
 
 
636350203040275640.jpg
  •  వెంకటపాలెం వద్ద కేటాయింపునకు సూత్రప్రాయ నిర్ణయం?
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి): బ్యాడ్మింటన్‌లో పలువురు షట్లర్లను తీర్చిదిద్దిన గురు పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ అమరావతిలో కొద్ది నెలల్లోనే ప్రారంభమయ్యే దిశగా ముందడుగు పడింది. రాజధాని గ్రామాల్లో ఒకటైన వెంకటపాలెం పరిధిలో గోపీచంద్‌ అకాడమీకి 12.5 ఎకరాలను ఉచితంగా ఇచ్చేందుకు ఏపీసీఆర్డీయే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గోపీచంద్‌ గురువారం విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రభృత ఉన్నతాధికారులతో జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని గోపీచంద్‌ బుధవారం కలిసినప్పుడే ఈ అకాడమీకి స్థల కేటాయింపుపై స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ, గురువారం నాటి చర్చలతో స్థల విస్తీర్ణం, ఏ గ్రామంలో దీనిని నెలకొల్పాలనే అంశాలపై స్పష్టత వచ్చిందని తెలుస్తోంది.
 
వాస్తవానికి గోపీచంద్‌ అమరావతిలో తమ అకాడమీ స్థాపన కోసం ఇంతకంటే ఎక్కువ భూమినే కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే స్థల లభ్యత, పలు సంస్థలు భూమి కోసం చేసుకుంటున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని దానికి 12.50 ఎకరాలను మాత్రమే ఇస్తామని ప్రతిపాదించగా గోపీచంద్‌ అంగీకరించారని తెలిసింది. స్థల విస్తీర్ణంపై స్పష్టత వచ్చినందున అకాడమీ నిర్వాహకులు అందులో తాము నెలకొల్పబోయే శిక్షణ సంస్థకు సంబంధించిన వివరాలతో డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)ను సీఆర్డీయేకు సమర్పించాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

రోడ్ల నాణ్యతలో రాజీ వద్దు
 
 
  • నిర్దిష్ట గడువులోగా నిర్మించండి
  • కాంట్రాక్ట్‌ సంస్థలు, అధికారులకు లక్ష్మీ పార్థసారథి ఆదేశం
 
ఆంధ్రజ్యోతి, అమరావతి: అమరావతిలో చురుగ్గా నిర్మితమవుతున్న సీడ్‌ యాక్సెస్‌, 7 ప్రాధాన్యతా రహదారులను ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వాటి పనులను చేపట్టిన కాంట్రాక్ట్‌ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ రోడ్లను నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో, నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి వెంబడి 15 మీటర్ల వెడల్పున అభివృద్ధి పరచనున్న పచ్చదనం (గ్రీన్‌ బెల్ట్‌)లో ఎక్కువ మొక్కలు నాటేందుకు అనువుగా మట్టికట్టను పటిష్టంగా నిర్మింపజేయాలని సూచించారు. వర్షపు నీరు మొక్కలన్నింటికీ సక్రమంగా అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారిలో భాగంగా నిర్మించాల్సిన కల్వర్టుల పనులను వేగవంతం చేయాలని నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
కృష్ణాయపాలెం- అనంతవరం మధ్య నిర్మిస్తున్న ఈ-8 రహదారిని పరిశీలించిన ఆమె అందులోని లోబ్రిడ్జిలను అను కున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు. అబ్బరాజుపాలెం- శాఖమూరుల మధ్య నిర్మాణంలో ఉన్న ఎన్‌-14 రోడ్డును పరిశీలించి, దాని కోసం గుత్తేదారు బీఎస్‌సీపీఎల్‌ ఏర్పాటు చేసిన ప్రీకాస్ట్‌ నిర్మాణ యూనిట్‌ను సందర్శించారు.రాజధాని రోడ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, కాంట్రాక్ట్‌ సంస్థలకు తగు సలహాలివ్వడం ద్వారా అవి గడువుల్లోగా పూర్తయ్యేలా చూడాలని అధికా రులను ఆదేశించారు. ఏడీసీ అటవీ- పర్యావరణ విభాగాధిపతి బి.మురళీకృష్ణ, ఈఈ నరసి ంహమూర్తి, డీఈఈలు సుధాకర్‌, వై.కృష్ణయ్య, పద్మాకర్‌ ప్రసాద్‌, అటవీ విభాగాధికారులు వై.రమేష్‌, ఎం.ఓబుల్‌రెడ్డి, జె.సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఏపీడీఆర్‌ఐ ఏర్పాటు ప్రణాళిక సిద్ధం

ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలు

ఈనాడు, అమరావతి: అమరావతి ప్లానింగ్‌, డిజైన్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏపీడీఆర్‌ఐ)ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేసినట్లు సీఆర్‌డీఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా ఏపీడీఆర్‌ఐ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొంది. అత్యుత్తమ విధానాలను సరళమైన రీతిలో ఆచరణలోపెట్టడం, నగరీకరణ ప్రణాళికలను తయారుచేయడం తదితర బాధ్యతలను ఏపీడీఆర్‌ఐ చేపట్టనుందని వివరించింది. ‘ఏపీడీఆర్‌ఐను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత..లండన్‌లోని ఫ్యూచర్‌ క్యాటపుల్ట్‌, మలేషియాలోని పెమండు, కజకిస్థాన్‌కు చెందిన ఆస్తాన జెన్‌ప్లాన్‌, సింగపూర్‌కు చెందిన సీఎల్‌సీ తదితర అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరిపాం. దీని ఏర్పాటులో సింగపూర్‌ ప్రభుత్వానికి సంబంధించిన సీఎల్‌సీ సేవలనూ వినియోగించుకుంటాం. అమరావతి నగరాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించేందుకు దోహదపడటంతోపాటు..భవిష్యత్తులో నిర్మించే నగరాలకు దీన్ని వెలుగుదివ్వెలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీడీఆర్‌ఐను నెలకొల్పుతున్నాం.’ అని సీఆర్‌డీఏ ఆ ప్రకటనలో వివరించింది.

Link to comment
Share on other sites

 
 
 
విశ్వవిఖ్యాత నగరంగా అమరావతి
 
 
636352517209332992.jpg
  • ఎన్ని సవాళ్లయినా ఎదుర్కొంటాం...
  • రాజధానిని ప్రజలకు అంకితం చేస్తాం: సీఎం చంద్రబాబు
  • ప్రణాళిక సంస్థకు బ్లూ ప్రింట్‌ సిద్ధం
  •  
 
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): అద్భుతమైన అమరావతి నగర నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ఓ ప్రణాళిక సంస్థను ఏర్పాటు చేసేందుకు సీఆర్‌డీఏ బ్లూ ప్రింట్‌ సిద్ధం చేసింది. ప్రతిపాదిత అమరావతి ప్లానింగ్‌, డిజైన్‌ పరిశోధన సంస్థ (ఏపీడీఆర్‌ఐ)... ఓపెన్‌ డేటా విధానం ద్వారా అనునిత్యం ఆధునిక విధానాలను ఆవిష్కరిస్తూ ప్రజా జీవనానికి అనుగుణమైన అద్భుత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక. ప్రపంచంలో వివిధ నగరాల వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషిస్తూ, వాటిని అధిగమించేలా ప్రణాళికలను తయారుచేసి అమరావతిని ప్రపంచంలోనే అత్యంత ప్రజామోద నగరంగా తీర్చిదిద్దాలనేది సీఎం ఆలోచన. ఆయన సూచనల ప్రతిరూపమే ఈ సంస్థ.
 
అంతా సీఎం సూచనల మేరకే...
అమరావతి నగర నిర్మాణం కోసం ప్రణాళికలను సిద్ధం చేసేందుకు ఇతరులపై ఆధారపడకుండా, అధునాతన ప్రమాణాలతో కూడిన సొంత ప్రణాళిక రచన సంస్థ ఉంటే బాగుంటుందని, ఆ దిశగా ఆలోచించమని సీఆర్‌డీఏ అధికారులకు సీఎం సూచించారు. ఆ సూచనలకనుగుణంగా సీఆర్‌డీఏ అధికారులు, ఏపీడీఆర్‌ఐని స్థాపించేందుకు బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేశారు. ‘అమరావతిని విశ్వవిఖ్యాత నగరంగా నిర్మించే క్రమంలో ఎన్ని సవాళ్లనయినా ఎదుర్కొంటాం. ఎన్ని ఇక్కట్లనయినా భరిస్తాం. అంతిమంగా అమరావతిని ఐదుకోట్ల తెలుగువారికి అంకితం చేస్తాం. ప్రజారాజధాని నిర్మాణంలో ప్లానింగ్‌ డిజైన్‌ పరిశోధన సంస్థ ప్రధానమైంది.’ అని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. ప్రిన్సిపల్‌ సెకట్రరీ అజయ్‌జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, అడిసినల్‌ కమిషనర్‌ రామ్మోహనరావు, సింగపూర్‌కు చెందిన ఫ్రాన్సిస్‌ చోంగ్‌తో చర్చల అనంతరం ఏపీడీఆర్‌ఐకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించారు. త్వరలో వీటి ముసాయిదాను మంత్రి నారాయణకు వివరించి, ఆ తరువాత సీఎం సూచనల మేరకు ముందుకు సాగుతారు.
 
నిర్వర్తించే బాధ్యతలు ఇవే...
ఏపీడీఆర్‌ఐ ముందుగా సామాజిక ఆర్థిక సర్వే, ప్రణాళికల ద్వారా సంతోష సూచికను పర్యవేక్షించేందుకు పాదచారుల భద్రత, సైకిల్‌ సర్క్యులేషన్‌, దివ్యాంగుల కోసం నగరీకరణ మార్గదర్శకాలను సూచిస్తుంది. ఎలక్ట్రిక్‌, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాహనాలను ఉపయోగించేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేయనుంది. ప్రజలకు అనువయిన వాతావరణం కల్పించేందుకు అంకుర సంస్థల సహకారాన్ని పొందేందుకు క్లిష్టతరమయిన ఓపెన్‌ డేటా విధానాన్ని లేదా తత్సమానమైన విధానాన్ని రూపొందించనుంది. అత్యుత్తమయిన విధానాలను సరళమయిన రీతిలో ఆచరణలో పెట్టడం, నగరీకరణ ప్రణాళికలను తయారుచేయడం వంటి బాధ్యతలను వహిస్తుంది. అమరావతి నిర్మాణానికి ప్రణాళికలను పకడ్బందీగా తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అంకితభావంతో పనిచేసే ప్రణాళిక సంస్థ ఏర్పాటైతే, విశ్వవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి అంశాలను అమరావతిలో అమలు చేసేందుకు వీలుంటుందన్నారు. ఏపీడీఆర్‌ఐ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తరువాత ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో సీఆర్‌డీఏ సంప్రదింపులు జరిపింది. ఈ సంస్థ కేవలం అమరావతి నగరాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించడానికి దోహదపడటమే కాకుండా భవిష్యత్‌లో ఏర్పడనున్న నగరాలకు ఒక వెలుగుదివ్వెలా నిలిచి, అంతర్జాతీయ ఖ్యాతి పొందుతుందని సీఆర్‌డీఏ భావిస్తోంది.
Link to comment
Share on other sites

రేపు అమరావతిలో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధుల పర్యటన
 
 
అమరావతి: రేపు విజయవాడకు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు వస్తారని మంత్రి నారాయణ అన్నారు. మూడు రోజులపాటు రాజధానిలో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు పర్యటిస్తారని మంత్రి నారాయణ చెప్పారు. చైనా, మలేషియా పర్యటనలో ఎలక్ట్రికల్‌ బస్సుల పనితీరును పరిశీలించామని నారాయణ వెల్లడించారు. సీఎం నిర్ణయం తర్వాత విజయవాడ మెట్రోపై ముందుకువెళ్తామని నారాయణ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...