Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో హరిత భవనాలకు ‘తెరి’ సహకారం

త్వరలో సీఎం సమక్షంలో ఒప్పందం

ఈనాడు, అమరావతి: అమరావతిలో హరిత భవనాలు, సుస్థిర ఆవాసాల నిర్మాణంలో సహకరించేందుకు తెరి(ది ఎనర్జీ అండ్‌ రీసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌) ముందుకొచ్చిందని విద్యుత్తు శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ మేరకు త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టబోతున్న విద్యుత్తు, నీటి సంరక్షణ కార్యక్రమాలను వివరించారు. ఒప్పందంలో భాగంగా తెరి ఆధ్వర్యంలోని ప్రత్యేక సెల్‌ ఏర్పాటుచేసి సూచనలు చేస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాలన్నీ ఈ నిబంధనలు పాటించడం వల్ల 30 నుంచి 40శాతం వరకు విద్యుత్తు ఆదా చేయవచ్చన్నారు. రూ.5కోట్లతో నమూనా భవన నిర్మాణం చేపట్టనున్నామన్నారు. రాజధానిలోని 217 కిలోమీటర్ల పరిధిలో హరిత వనాలు, కొండవీటివాగు, పాలవాగును సుందరంగా తీర్చిదిద్దుతామని అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ లక్ష్మీపార్థసారథి పేర్కొన్నారు. చిన్న భవనం నుంచి ఆకాశహార్మ్యాల దాకా అన్నిటిని రేటింగ్‌ ప్రకారం ఉండేలా చూడటంలో తెరి సహకారం తీసుకుంటున్నామని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ చెప్పారు. సమావేశంలో తెరి సీఈఓ సంజయ్‌సేథ్‌, సీఆర్‌డీఏ ఇంధన వనరుల మీడియా సలహాదారు చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమరావతిలో హరిత భవనాల పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.

Link to comment
Share on other sites

స్టార్టప్‌ ప్రణాళికకు సింగపూర్‌ బృందం రాక

ఈనాడు-అమరావతి: రాజధాని అమరావతిలో అంకుర ప్రాంతం (స్టార్టప్‌ ఏరియా) అభివృద్ధి ప్రణాళిక తయారు చేసే నిమిత్తం అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జ్‌-సెంబ్‌కార్ప్‌, సింగపూర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖల నుంచి 13 మందితో కూడిన బృందం సోమవారం విజయవాడకు విచ్చేసింది. సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో చర్చించింది. అంకుర ప్రాంతాన్ని సందర్శించనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి దీని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనుంది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అంకుర ప్రాంత అభివృద్ధి చేసే పనిని సింగపూర్‌కి చెందిన సంస్థలు తీసుకున్న విషయం విదితమే. ఒకటి, రెండు నెలల్లోనే విజయవాడలో కార్యాలయాన్ని ప్రారంభించనుంది.

 
Link to comment
Share on other sites

ఇక నుంచి ఏడుపులు పెడబొబ్బలు ఒక రేంజ్ లో ఉంటాయి.... ఓదార్పు యాత్ర పెట్టాలి మల్లి

 

Exactly three weeks after the Government of Andhra Pradesh (GoAP) presented the Letter of Award for the development of Amaravati start-up area, a delegation of the Singapore consortium consisting of Ascendas-Singbridge and Sembcorp Pte. Ltd started dwelling into the finer details of master planning and infrastructure in what the Capital Region Development Authority officials described as a take-off meeting on Monday.

 

They will draw up plans for integrated development of the Amaravati core area, in consultation with the CRDA officials over the next couple of days.

Principal Secretary (Energy, CRDA and Infrastructure and Investment) Ajay Jain told mediapersons on Monday that the Singapore team took stock of the master planning exercise and enquired about the infrastructure to be created and other technical aspects to be prepared to call for tenders once the Singapore Government gives its approvals.

 

CM review tomorrow

It was on May 15 that the GoAP and Amaravati Development Partners (ADP), a joint venture floated by the Singapore consortium consisting of Ascendas-Singbridge and Sembcorp Pte Ltd., and Amaravati Development Corporation (ADC), signed the MoU for the development of 6.84 square kilometres of start-up area on the southern banks of River Krishna.

Meanwhile, Chief Minister N. Chandrababu Naidu is going to review the status of master planning by Foster + Partners (F+P) at a high-level meeting on Wednesday. The London-based firm is expected to submit finals designs of the core government complex by the month-end.

Link to comment
Share on other sites

మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా అర్కాప్‌

రాజధానిలో ప్రముఖుల గృహ నిర్మాణానికి ఎంపిక

ఈనాడు, అమరావతి: రాజధానిలోని పరిపాలనా నగరంలో ప్రముఖుల గృహ నిర్మాణానికి (వీఐపీ హౌసింగ్‌) సంబంధించిన ఆకృతుల రూపకల్పనకు మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా అర్కాప్‌ అసోసియేట్స్‌ను కార్యనిర్వాహక కమిటీ ఎంపిక చేసింది. మూడు నెలల్లో ప్రాథమిక ఆకృతులు, ఆరు నెలల్లో సమగ్ర ఆకృతులు అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. రాజధానిలోని ఈ-6, ఈ-12, ఎన్‌-11 రహదారులకు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని ఈ సందర్భంగా ఏడీసీ అధికారులు కమిటీకి నివేదించారు. కొండవీటి వాగు, పాలవాగు, మంచినీటి జలాశయాల నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, సీఆర్‌డీఏ కమిషనరు సీహెచ్‌.శ్రీధర్‌, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిపై చర్చలు

కేంద్ర రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై సింగపూర్‌ కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థల (ఏడీసీ) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ చర్చల్లో భాగంగా తొలిరోజైన మంగళవారం ముఖ్యమైన, ఆకర్షణీయ మౌలిక సదుపాయాల బృహత్తర ప్రణాళికల గురించి కన్షార్టియం ప్రతినిధులకు ఏడీసీ అధికారులు వివరించారు. అమరావతి రాజధాని నగరంలోని అన్ని ప్రాంతాలను స్టార్టప్‌ ఏరియాతో అనుసంధానించేందుకు కల్పించే మౌలిక సదుపాయాలపైనా చర్చించారు.

Link to comment
Share on other sites

కొండవీటి వాగు వెడల్పు పనులకు వారంలో టెండర్లు
 
 
  • పాలవాగు విస్తరణ,2 జలాశయాలు, 3 రోడ్ల నిర్మాణానికీ..
అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలోని కొండవీటి వాగుకు కళ్లెం వేసేందుకు ఉద్దేశించిన పథకానికి వచ్చే వారంలో టెండర్లు పిలవనున్నారు. తరచుగా గ్రామాలు, పొలాలను ముంచెత్తే ఈ వాగు ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా దానిని వెడల్పు చేయనున్నారు. దీంతోపాటు రాజధాని ప్రాంతంలో ప్రవహించే పాలవాగు విస్తరణ, అమరావతి తాగునీటి అవసరాలను తీర్చేందుకు నీరుకొండ, కృష్ణాయపాలెం వద్ద నిర్మించదలచిన రెండు మంచినీటి రిజర్వాయర్ల నిర్మాణం కోసం కూడా టెండర్లను ఆహ్వానించనున్నారు.
 
ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టనున్న రహదారుల్లో భాగమైన ఈ-6, ఈ-12, ఎన-11 రోడ్లకు సైతం వారంలోగా బిడ్లను పిలవనున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు తెలిపారు. రాజధాని నిర్మాణ పనులపై మంగళవారం సచివాలయంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం జరిగింది. అమరావతిలో జరుగుతున్న రహదారుల నిర్మాణం, ముఖ్యమైన మౌలిక సదుపాయాల కల్పన తదితరాల్లో పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు. రానున్న రోజుల్లో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథిఽ సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌ జైన, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏడీసీ ఈడీ బి.నాగరాజు, సీఈ టి.మోజె్‌సకుమార్‌, మౌలిక సదుపాయాల విభాగాధిపతి డాక్టర్‌ కె.వి.గణేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఆకృతికి అడుగు దూరంలో..
 
 
  • కొత్త-పాత కలయికగా అమరావతి
  • వనరులు, వసతులు లేని చోట
  • మూడేళ్లలోనే సొంత పరిపాలన
  • తొలి సభని జరుపుకొన్న ప్రభుత్వం
  • 2 నెలల్లో శాశ్వత నిర్మాణాల దిశగా వచ్చే ఏడాది చివరికల్లా సాకారం
అమరావతి, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : దేశంలో, ఆమాటకొస్తే ప్రపంచంలో ఎన్నెన్నో రాజధాని నగరాల నిర్మాణం జరిగింది, జరుగుతున్నాయి. సాధారణంగా ఏ కేపిటల్‌ సిటీ నిర్మాణం ప్రారంభించినా అందుకు కావలసిన వనరులు..భూమి, నిధులు, మౌలిక వసతులు ఎంతో కొంత అమరి ఉంటాయి. అయితే అమరావతి నిర్మాణ ఆలోచనని మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు ఇవేవీ లేవు! ఉన్నదల్లా అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ దివ్యమైన, భవ్యమైన అమరావతిని ఖచ్చితంగా నిర్మించి తీరుతామన్న ఆత్మవిశ్వాసం, మొక్కవోని పట్టుదల మాత్రమే! పరిపాలనా రాజధానిగానే మిగిలిపోకుండా, ‘ప్రజా రాజధాని’నీ అందించాలన్న సంకల్పం కల్పనగానే మిగిలిపోనుందా, మూడేళ్లయినా ‘తాత్కాలిక’ నిర్మాణాలకే పరిమితం అయితే, నగర సౌధాలు ఎప్పటికి పైకి లేస్తాయన్న సందేహాలు, అనుమానాలు, అపనమ్మకాల మధ్యనే.. రాజధాని నిర్మాణ క్రతువు నిర్విఘ్నంగా సాగుతోంది.
 
ఎంపిక దశ నుంచీ...
రాజధానిగా మా ప్రాంతాన్ని ఎంపిక చేయాలంటే, మా ప్రాంతాన్నంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆ ప్రభావాలకు లోనవకుండా, సరిగ్గా రాష్ట్రానికి నడిమధ్యన ఉన్న అమరావతిని కేపిటల్‌ సిటీగా ప్రకటించడంతో తొలి అడుగు పడింది. ‘శుభారంభం జరిగితే సగం పనైనట్లేన’నేది నానుడి! అలా..మరొక పెద్ద ముందడుగు భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం- ఎల్పీఎస్‌) దిశగా పడింది. నిజానికి, అప్పటికి భూనిర్వాసికత్వంపై దేశమంతటా ఉద్యమాలు జరుగుతున్నాయి. భూ సమీకరణ అనేది ఒక విఫల ప్రయత్నమని భావిస్తున్న కాలం అది. అలాంటి సమయంలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో 29 గ్రామాల్లోని 38,581 ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు.. నిపుణులు పెదవివిరిచారు. బల ప్రయోగానికే లొంగని రైతులు, స్వచ్ఛందంగా వారికి వారుగా ముందుకొచ్చి తమ భూములను ఇస్తారని ఎలా అనుకొంటారని బుద్ధిజీవులు సందేహపడ్డారు. ఆ తరువాతి పరిణామాలు వారి అనుమానాలను పటాపంటలు చేసేశాయి. ఒకనాడు ఎక్కడ ఉన్నదో తెలియని ప్రాంతం, రాజధాని ప్రకటనతో పూర్వ, నవ్య ప్రాశస్త్యం పొందగా, కరువుబెడ్డల్లో ముద్దని వెతుక్కొన్న ఇక్కడి రైతులు ఇప్పుడు బతుకు చింతలు తీరి, ఖరీదైన కలలు కంటున్నారు.
 
నవ నవోన్మేషంగా..
అటు నిర్మాణపరంగా, ఇటు పర్యావరణపరంగా, ఒకవైపు అత్యాధునికంగా, అదే సమయంలో మన తరతరాల ఉత్కృష్ట సంస్కృతీ సంప్రదాయాలకు కాణాచిగా.. అమరావతిని రూపుదిద్దాలనే బృహత్‌ ఆలోచనలకు ఆకృతినివ్వగల సంస్థల కోసం అన్వేషణ మొదలయింది. సింగపూర్‌ ప్రభుత్వ సహకారంతో రూపొందింపజేసిన మాస్టర్‌ప్లాన్‌ ఈ దిశగా మరొక కీలక ముందడుగు. 35 లక్షల జనాభా, 15 లక్షల ఉద్యోగాల కల్పన, 600 కిలోమీటర్ల అత్యుత్తమ రోడ్‌ నెట్‌వర్క్‌, తొమ్మిది థీమ్‌ సిటీలు..ఇలా పలు ప్రత్యేకతల సమాహారంగా మాస్టర్‌ప్లాన్‌ రూపుదిద్దుకుంది. గవర్నర్‌ మొదలుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు కొలువుదీరే, నివాసముండే ‘గవర్నమెంట్‌ సిటీ’ మొదలుకొని.. ‘నాలెడ్జ్‌ - ఎడ్యుకేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, హెల్త్‌, ఫైనాన్స్‌, జస్టిస్‌, టూరిజం, స్పోర్ట్స్‌, మీడియా’ అనేవే ఈ నవ నగరాలు. 2015, జూన్‌ 6న అమరావతికి భూమిపూజ జరగ్గా, అక్టోబర్‌ 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా శంకుస్థాపన నిర్వహించారు. 2016, ఫిబ్రవరి 17న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని చేపట్టి, 192 రోజులరికార్డు సమయంలో సొంతపాలనను ప్రారంభించారు. అంతేవేగంగా.. హైదరాబాద్‌ నుంచి వెలగపూడికి శాసనసభని తరలించి, తొలి సభని జరిపారు.
 
చేదు అనుభవాలూ ఉన్నాయ్‌..
గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ ప్లాన్‌తోపాటు అందులోని రెండు ఐకానిక్‌ బిల్డింగులైన అసెంబ్లీ, హైకోర్టుల డిజైన్లను రూపొందించే మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక ప్రక్రియను రెండుసార్లు చేపట్టాల్సి వచ్చింది. ఇది డిజైన్లలో ఏడాదికిపైగా జాప్యానికి కారణమయింది. జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్‌ గత ఏడాది మార్చిలో డిజైన్లను ఇచ్చింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరగా, అవి బాగోలేదని అత్యధికులు అభిప్రాయపడ్డారు. దీంతో ఇంగ్లండ్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ని మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ ఫైనల్‌ డిజైన్లను ఈ నెలాఖర్లోగా సమర్పించనుంది. అలాగే, ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో రాజధాని రైతులకు లెక్కకు మిక్కిలిగా ఇచ్చిన హామీల్లో కొన్నింటిని తూతూమంత్రంగా నెరవేర్చారని, గ్రామకంఠాల సమస్యను పరిష్కరించలేదని, అసైన్డ్‌, లంకభూములకు ప్యాకేజీని ప్రకటించడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
నిర్మాణాలకు వేళాయె!
రాజధాని నగరాన్ని 1356 ఎకరాల్లో నిర్మించాలని తలపెట్టారు. గత ఏప్రిల్‌ 22న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ మాస్టర్‌ప్లాన్‌ను, అందులోని ఐకానిక్‌ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టుల డిజైన్లను సమర్పించింది. వచ్చే రెండునెలల్లో నిర్మాణం ప్రారంభించి.. 2018 చివరికల్లా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక, అమరావతి స్టార్టప్‌ ఏరియా 1691 ఎకరాల్లో సింగపూర్‌ కన్సార్షియం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనుంది. భావి రాజధాని వాసులు ఎండలకు కాగిపోకుండా, ఉక్కపోతతో ఉడికిపోకుండా కాపాడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించడంతోపాటు పర్యావరణానికి మేలు చేకూర్చే పచ్చదనం, ఉద్యానవనాల కోసం రాజధాని విస్తీర్ణంలో సింహభాగం కేటాయించారు. రాజధానికి చేరువలో కృష్ణానదిపై రెండు ఐకానిక్‌ వంతెనలను సైతం నిర్మించబోతున్నారు. దీనికంతా అయ్యే వ్యయాన్ని సమకూర్చడానికి పలు దేశ, విదేశ బ్యాంకులు, ద్రవ్యసంస్థలు ముందుకొచ్చాయి. ఆర్థిక సంస్కరణలను బలంగా అమలుచేసిన పార్టీయే ఇప్పుడు అధికారంలో ఉండటం, వేలమంది రైతాంగం ప్రభుత్వానికి సహకరిస్తున్న తీరు ప్రపంచాన్ని ఆకర్షించడం వంటి కారణాలతో.. రుణసేకరణ తేలిక అయింది.
 
చరిత్ర చెక్కిట చిరు నగవు
పాత- కొత్తల మేలు కలయికగా అమరావతి రూపుదిద్దుకోనుంది. ఒకవైపు అత్యాధునిక డిజెన్లు, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిస్తూనే, మరొకపక్క అమరావతిలో గతంలో వెలుగొందిన రాజవంశాల ఖ్యాతికీ, అలరాలిన శిల్పకళారీతులకీ ప్రాణం పోయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, ప్రముఖ వ్యక్తులూ, సంఘటనలకూ చోటు ఇవ్వనున్నారు. కొన్ని శతాబ్దాలకు పూర్వమే అంతర్జాతీయ విద్యాకేంద్రంగా పరిఢవిల్లిన చరిత్ర అమరావతిది. తిరిగి ఆ స్థాయిని అందుకునేలా, ఎన్నెన్నో విఖ్యాత విద్యాసంస్థలను రప్పిస్తున్నారు. రూ.3700 కోట్లతో ఐనవోలు వద్ద విట్‌, రూ.3,400 కోట్లతో నీరుకొండ వద్ద ఎస్‌.ఆర్‌.ఎం. యూనివర్సిటీలు చురుగ్గా నిర్మాణం జరుపుకుంటున్నాయి.
Link to comment
Share on other sites

త్వరలోనే విజయవాడలో సింగపూర్‌ కన్సార్టియం కార్యాలయం

భవనాన్ని ఎంపిక చేసిన ప్రతినిధులు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో 1691 ఎకరాల అంకుర ప్రాంత (స్టార్టప్‌ ఏరియా) అభివృద్ధికి మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపికైన సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియం ప్రతినిధులు వీలైనంత త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో తమ కార్యాలయం ఏర్పాటుకు ఒక భవనాన్ని ఎంపిక చేసుకున్నారు. బెంజ్‌ సర్కిల్‌కి సమీపంలోని ఆ భవనంలో వీలైనంత త్వరలోనే సింగపూర్‌ కన్సార్టియం తమ కార్యాలయాన్ని ప్రారంభించనుంది. మరోపక్క ప్రాజెక్టు పర్యవేక్షణకు సింగపూర్‌ ప్రభుత్వం తరపున కూడా మరో కార్యాలయం ఏర్పాటు కానుంది. మూడు రోజులుగా విజయవాడలోనే మకాం వేసిన 13 మంది సింగపూర్‌ ప్రతినిధులు బుధవారం కూడా సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ బృందంలో సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రతినిధులు ఇద్దరు, కన్సార్టియం ప్రతినిధులు 11 మంది ఉన్నారు. రాజధాని అమరావతి భౌగోళిక స్వరూపం, సింగపూర్‌కి చెందిన సుర్బానా-జురాంగ్‌ సంస్థలు రూపొందించిన రాజధాని బృహత్‌ ప్రణాళిక, కేంద్ర రాజధాని ప్రాంత ప్రణాళికలపై అవగాహన తెచ్చుకోవడం, రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏడీసీ రూపొందించిన ప్రణాళికను అధ్యయనం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. గురువారం క్షేత్ర పర్యటనకు వెళతారు. రాజధానిలో స్టార్టప్‌ ప్రాంతం కోసం కేటాయించిన ప్రదేశాన్ని పరిశీలిస్తారు.

Link to comment
Share on other sites

boya.jpg

రాజధాని నిర్మాణానికి బోయపాటి సూచనలు

ఈనాడు, అమరావతి:రాష్ట్ర నూతన రాజధానిలో తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేందుకు ఏం చేయాలనే అంశంపై సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రితో బోయపాటి భేటీ అయ్యారు. అమరావతి నగరం నిర్మాణ దశ నుంచే ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆధ్మాత్మికత ఉట్టిపడేలా చేయడంపై వివిధ రంగాల నిపుణుల సూచనలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగా బోయపాటి కలిసినట్లు సమాచారం. పావుగంటసేపు సంబంధిత విషయాలపై మాట్లాడుకొన్నారు.

Link to comment
Share on other sites

చదరపు అడుగు ధర రూపాయి!

అమరావతి అంకుర ప్రాంతంలో 50 ఎకరాలు నామమాత్రపు ధరకు

ఉత్ప్రేరకాభివృద్ధి కోసం కేటాయింపు

మొదట 8 లక్షల చదరపు అడుగుల టవర్‌ నిర్మాణం

ఈనాడు - అమరావతి

అమరావతిలోని అంకుర ప్రాంత (స్టార్టప్‌ ఏరియా) ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపికైన సింగపూర్‌ సంస్థల కన్సార్టియం మొదట ఉత్ప్రేరకాభివృద్ధి (కేటలైటిక్‌ డెవలప్‌మెంట్‌) కింద 50 ఎకరాల్ని అభివృద్ధి చేయనుంది. ఈ 50 ఎకరాల్ని నామమాత్రపు ధరకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 50 ఎకరాలకు చదరపు అడుగుకి రూపాయి చొప్పున ధర నిర్ణయించారు. ఒక ఎకరం అంటే 43,560 చదరపు అడుగులు. ఆ లెక్కన ఎకరం రూ.43,560 చొప్పున సింగపూర్‌ సంస్థల కన్సార్టియానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అందజేస్తుంది. 50 ఎకరాల్లో ఉత్ప్రేరకాభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి ప్రాజెక్టుగా 8 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన టవర్‌ నిర్మించనుంది. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది నిబంధన. రెండో దశలో మరో 8 లక్షల చదరపు అడుగుల టవర్‌ నిర్మిస్తుంది. మొత్తం 1,691 ఎకరాల స్టార్టప్‌ ప్రాంతంలో ఉత్ప్రేరకాభివృద్ధి కింద చేపట్టే 50 ఎకరాలు ఎక్కడన్నది ఇంకాగుర్తించలేదు. దీనిలో నిర్మించే టవర్లు ఎంత ఎత్తు ఉంటాయి? ఎన్ని అంతస్తులు ఉంటాయి? జంట టవర్లలా పక్కపక్కన ఉంటాయా? టవర్లతో పాటు 50 ఎకరాల్లో ఇంకా ఎలాంటి నిర్మాణాలు చేపడతారు? వంటి విషయాల్లోను స్పష్టత లేదు. అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థలతో కూడిన సింగపూర్‌ కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ)తో కలసి ఏర్పాటు చేసే.. అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) సంస్థ స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనుంది. ఉత్ప్రేరకాభివృద్ధిలో భాగంగా 50 ఎకరాల్లో మాత్రమే ఏడీపీ నిర్మాణాలు చేపడుతుంది. మిగతా 1641 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి, స్థలాలను అభివృద్ధి చేసి...వాటిని ఇతరసంస్థలకు, కంపెనీలకు విక్రయిస్తుంది. 1641 ఎకరాల్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలన్నది నిబంధన. ఈ మొత్తం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మొదట 15 ఏళ్ల గడువు పెట్టారు. తాజాగా దాన్ని 20 ఏళ్లకు పొడిగించినట్లు సీఆర్‌డీఏ వర్గాల సమాచారం.

ఆ రెండు గ్రామాలూ స్టార్టప్‌ ప్రాంత స్థాయికి!

రాజధానిలోని ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలు అంకురప్రాంతం పరిధిలోకి వస్తున్నాయి. ఈ గ్రామాల్ని కదిలించబోమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసింది. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఈ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యతను కూడా ఏడీపీ తీసుకోనుంది. స్టార్టప్‌ ప్రాంతంలో ఆధునిక ప్రమాణాలతో మౌలిక వసతులు నిర్మించనున్న నేపథ్యంలో.. దీని పరిధిలోని గ్రామాల్ని కూడా ఆ స్థాయికి తేవడం, స్టార్టప్‌ ప్రాంతంలో రెండు గ్రామాలు చక్కగా ఇమిడిపోయేలా చూడడం దీని ముఖ్య ఉద్దేశం.

సంవత్సరంలోగా ప్రాజెక్టు మొదలవ్వాలి!

స్టార్టప్‌ ప్రాంతంలో మొదటి దశలో 650 ఎకరాల్లో ఏడాదిలోగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలన్నది ఒప్పందం. సింగపూర్‌ సంస్థల కన్సార్టియంను ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక చేస్తూ సీఆర్‌డీఏ ఇప్పటికే లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ అందజేసింది. తదుపరి ప్రక్రియలో భాగంగా ఏడీసీతో సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ఒక ఒప్పందం చేసుకోవాలి. ఇవి రెండూ కలసి ఒక కంపెనీ (ఏడీపీ) ఏర్పాటు చేయాలి. ఏడీపీ, సింగపూర్‌ సంస్థల కన్సార్టియంతో సీఆర్‌డీఏ రాయితీ, అభివృద్ధి ఒప్పందం (కాడా) చేసుకోవాలి. ఏడాదిలోగా ప్రాజెక్టు ప్రణాళికలు, ఆకృతుల రూపకల్పన, నిధుల సమీకరణ, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ సంస్థ ఎంపిక వంటి కార్యక్రమాల్ని కన్సార్టియం పూర్తి చేయాలి. అదే సమయంలో రెండు గ్రామాల సరిహద్దులకు వెలుపల, స్టార్టప్‌ ప్రాంతం పరిధిలోకి వచ్చే భూభాగాన్ని ఎలాంటి అడ్డంకులూ లేకుండా కన్సార్టియంకి సీఆర్‌డీఏ అప్పగించాలి.

Link to comment
Share on other sites

అమరావతి సత్వర రూపకల్పన దిశగా మరొ ముందడుగు
 
 
636325984242430447.jpg
  • రాజధానిలోని ప్రభుత్వ భూమి త్వరలో సీఆర్డీయేకు
  • గతంలోనే అడ్వాన్స్‌ పొసెషన్‌ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం
  • తదనుగుణంగా రికార్డుల తయారీకి సన్నాహాలు
(ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధాని అమరావతి సత్వర రూపకల్పన దిశగా మరొక ముందడుగు పడుతోంది. ఇందులోని 29 గ్రామాల్లో ఉన్న దాదాపు 15,000 ఎకరాల ప్రభుత్వ భూమిని సకల హక్కుభుక్తాలతో ఏపీసీఆర్డీయేకు అప్పగించేందుకు చురుగ్గా సన్నాహాలు సాగుతున్నాయి. రాజధానిలోని 29 గ్రామాల్లో ఒక్కొక్కదాంట్లో రెవెన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్‌ తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన వందలాది ఎకరాల చొప్పున భూములున్నాయి.
 
ఇవన్నీ కలిపితే సుమారు 15,000 ఎకరాలుంటాయని అంచనా. అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా, మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం జరగాలంటే అందుకు రైతుల నుంచి ల్యాండ్‌పూలింగ్‌ ప్రాతిపదికన సమీకరించిన భూములతోపాటు ప్రభుత్వ భూములు కూడా అవసరమైనందున వాటిని సీఆర్డీయేకు ముందుగానే అప్పగిస్తూ (అడ్వాన్స్‌ పొసెషన్‌) రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులిచ్చింది. వాటిల్లో పేర్కొన్న ప్రకారం వివిధ శాఖలకు చెందిన భూములను సీఆర్డీయేకు పూర్తిగా స్వాధీనపరుస్తున్నట్లుగా చూపే అధికారిక రికార్డుల తయారీకి అధికార యంత్రాంగం కొంతకాలంగా వడివడిగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజధాని గ్రామాలకు చెందిన 26,000 మందికి పైగా రైతుల నుంచి సుమారు 34,000 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాతిపదికన సేకరించిన సీఆర్డీయేకు పైన పేర్కొన్న ప్రభుత్వ భూములు కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే దాని అధీనంలో ఉండబోయే భూమి 49,000 ఎకరాలకు చేరనుంది.
 
ప్రతి గ్రామ పంచాయతీలోనూ పోరంబోకు భూములతోపాటు చెరువులు, కుంటలు, డొంకలు ఇత్యాది రూపాల్లో పదుల నుంచి వందలాది ఎకరాలుంటాయన్నది తెలిసిందే. గ్రామాల్లోనే కాకుండా పంచాయతీ పరిధుల మధ్య కూడా వివిధ రూపాల్లో, వేర్వేరు ప్రభుత్వ శాఖలకు చెందిన ఈ భూములుంటాయి. ఇవన్నీ కలిపి, రాజధాని నగర పరిధిలో మొత్తంమీద సుమారు 15,000 ఎకరాలుంటాయని తెలుస్తోంది. అమరావతి రూపకల్పనలో భాగంగా చేపట్టబోయే నూతన రహదారులు, భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణంతోపాటు వివిధ ప్రజోపయోగ వసతుల కల్పన కోసం పూలింగ్‌ కింద సేకరించిన భూములతోపాటు ప్రభుత్వ భూములూ అవసరమైనందున వాటిని సీఆర్డీయేకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు గతంలోనే ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
 
పత్రాలు పంపుతున్న రెవెన్యూ కార్యాలయాలు..
అయితే.. ఈ భూములను రికార్డుల సహితంగా సీఆర్డీయేకు అప్పగించాలంటే తొలుత ఆయా గ్రామాల్లోని రెవెన్యూ కార్యాలయాల నుంచి ఆర్డీవోకు, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌కు, ఆయన నుంచి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు అవసరమైన పత్రాలు అందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కొన్ని రోజులుగా గ్రామస్థాయుల్లోని రెవెన్యూ కార్యాలయాల నుంచి తమ పరిధిలోని ప్రభుత్వ భూములను సీఆర్డీయేకు అప్పగించడం సమ్మతమేనంటూ ఆర్డీవోకు పత్రాలు అందుతున్నాయి. వాటిని పరిశీలించిన అనంతరం త్వరలోనే ఆర్డీవో గుంటూరు జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. అక్కడి నుంచి అవి సీసీఎల్‌ఏకు చేరి, ఆ కార్యాలయం కూడా అందిన వివరాలతో సంతృప్తి చెందినట్లయితే రాజధానిలోని ప్రభుత్వ భూములన్నింటినీ సీఆర్డీయేకు అప్పగిస్తున్నట్లుగా చూపే రికార్డులను రూపొందిస్తారు.

కొద్ది వారాల్లోపే ప్రక్రియ పూర్తి?
రాజధానిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, స్టార్టప్‌ ఏరియాల్లో నిర్మాణ పనులు వచ్చే 2 నెలల్లో ప్రారంభం కాబోవడంతోపాటు అమరావతిలోని నలుదిశలను కలిపే పలు కీలక రహదారుల ఏర్పాటు పనులు కూడా రానురాను మరింత వేగం పుంజుకోనున్నాయి. దీంతో రాజధాని గ్రామాల్లోని ప్రభుత్వ భూములన్నీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సీఆర్డీయేకు దఖలు పడితేనే నిర్మాణ పనులన్నీ నిరాటంకంగా సాగి, అనుకున్న విధంగా పూర్తవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఈ భూములను కొద్ది వారాల వ్యవధిలోనే సీసీఎల్‌ఏ ద్వారా సీఆర్డీయేకు అధికారికంగా అప్పగించే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారని భోగట్టా.
Link to comment
Share on other sites

స్టార్టప్‌’ వడివడిగా..
 

 
636325984983582493.jpg
  • తొలి దశకు వారంలో పెగ్‌ మార్కింగ్‌?
  • 656 ఎకరాలకు హద్దులు గుర్తించే ప్రక్రియ
  • పూర్తవగానే నిర్మాణ పనులు..
  • ప్రారంభిస్తామంటున్న సింగపూర్‌ కన్సార్షియం
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
రాజధాని నిర్మాణ ప్రక్రియకు చుక్కానిగా నిలుస్తుందని ఆశిస్తున్న స్టార్టప్‌ ఏరియాలో తొలి దశకు హద్దులు గుర్తించే ప్రక్రియ వారంలోగా ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మందడం వద్ద 1691 ఎకరాల్లో (6.84 చదరపు కిలోమీటర్లు) నిర్మితమవనున్న ప్రాంతంలో సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌తోపాటు పలు ఐటీ కంపెనీలు, స్టార్టప్‌ కంపెనీలు ఇత్యాదివి ఏర్పాటవుతాయన్న విషయం విదితమే. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) భాగస్వామ్యంతో అసెండాస్‌- సింగ్‌బ్రిడ్డ్‌, సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలతో కూడిన సింగపూర్‌ కన్సార్షియం ఆధ్వర్యంలో 3 దశల్లో, 15 సంవత్సరాల కాలవ్యవధిలో ఈ స్టార్టప్‌ ఏరియా రూపు దాల్చనుంది. దీనికి సంబంధించిన ఎంవోయూపై సింగపూర్‌, రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల 15వ తేదీన సంతకాలు చేయడం, అదే రోజున స్టార్టప్‌ ఏరియాకు శంకుస్థాపన కూడా జరగడం విదితమే.
 
స్టార్టప్‌ ఏరియాలోని తొలిదశ అయిన 656 ఎకరాల్లో నిర్మాణాలను త్వరలోనే చేపట్టాలనుకుంటున్న సింగపూర్‌ కన్సార్షియం దానికి సంబంధించిన పెగ్‌ మార్కింగ్‌ (సరిహద్దుల నిర్ధారణ)ను శీఘ్రంగా చేపడితే ఆ వెంటనే అందులో ప్రతిపాదిత నిర్మాణాలను ప్రారంభిస్తామని సీఆర్డీయేకు తెలియజేసింది. 3 రోజులపాటు అమరావతిలో గడిపి, సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరపడంతోపాటు స్టార్టప్‌ ఏరియాను గురువారంనాడు ప్రత్యక్షంగా పరిశీలించిన సింగపూర్‌ కన్సార్షియం ప్రతినిధులు ఈ మేరకు కోరినట్లు సమాచారం. స్పందించిన సీఆర్డీయే వారంలోపునే తొలి దశ స్టార్టప్‌ ఏరియాలో పెగ్‌ మార్కింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
20 తర్వాత మరోసారి వస్తాం..
స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి జరుపుతున్న కసరత్తులో భాగంగా తాము ఈ నెల 20వ తేదీన మరొకసారి అమరావతికి రానున్నామని కన్సార్షియం ప్రతినిధులు తెలిపినట్లు సమాచారం. ఆ పర్యటనలో భాగంగా వారికి, సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులకు మధ్య స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిపై మరొకసారి విస్తృత చర్చలు జరగనున్నాయి. ఆ సందర్భంగా ఉభయ పక్షాలు ఈ ప్రాంత తొలి దశలో పెగ్‌ మార్కింగ్‌ ప్రక్రియలో పురోగతిని సమీక్షించనున్నారని తెలుస్తోంది. దీని దృష్ట్యా ఆ లోపునే ఈ ప్రక్రియను సాధ్యమైనంత చురుగ్గా కొనసాగించేందుకు సీఆర్డీయే ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. సాధ్యమైనంత త్వరగానే పెగ్‌ మార్కింగ్‌ను పూర్తి చేసి, సదరు భూమిని సింగపూర్‌ కన్సార్షియం సారధ్యంలోని జాయింట్‌ పర్పస్‌ వెహికల్‌ (జేపీవీ)కి అప్పగించాలన్నది సీఆర్డీయే ఉద్దేశం.
 
విజయవాడలో కన్సార్షియం కార్యాలయం..
స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్న దృష్ట్యా వాటిని నిరంతరం నిశితంగా పర్యవేక్షించేందుకు సింగపూర్‌ కన్సార్షియం విజయవాడలో తన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. నిత్యం సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతోనూ, తరచుగా రాష్ట్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపడంతోపాటు నిర్మాణ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకోవాల్సి ఉన్నందున ఈ ఆఫీసును నెలకొల్పబోతున్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...