Jump to content

Amaravati


Recommended Posts

రాజధానిలో హరిత శోభిత రవాణా వ్యవస్థ

ఈనాడు, అమరావతి : అమరావతిలో హరితశోభిత రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంగళవారం జరిగిన ఏపీ రాజధాని ప్రాంత యూనిఫైడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఏపీ సీఆర్‌యూటీఏ) సమావేశంలో ఆదేశించారు. సెన్సార్‌ ఆధారిత ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ విధానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ అధిగమించేందుకు బైపాస్‌ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా ట్రాఫిక్‌ మళ్లింపు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రాజధానిలో రహదారులు, రవాణా వ్యవస్థల తీరును సీఆర్డీయే కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. 2050 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన ప్రణాళిక రూపొందించామని చెప్పారు. సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, పట్టణ ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్‌, మెట్రోరైలు ఎండీ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతికి నాతవరం మొక్కలు

గాంధీనగరం (నాతవరం) న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతానికి విశాఖ జిల్లా నాతవరం మండలంలోని గాంధీనగరం కేంద్ర నర్సరీ నుంచి మొక్కలను పంపించనున్నారు. అటవీ శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి అందిన సమాచారం అందిన మేరకు ఇప్పటికి 50వేల మొక్కలను సిద్ధం చేశారు. అక్కడి వాతావరణం ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన రోజ్‌వుడ్‌, నల్లమద్ది, పంట, తెల్లమద్ది, వెదురు, వేప, నేరేడు, తదితర రకాల మొక్కలను రవాణాకు సిద్ధం చేశామని అటవీ శాఖ సెక్షను అధికారి సత్యనారాయణ వెల్లడించారు. వీటిని స్వయంగా తాము తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. మరొక కేంద్రంలో ఇతర ప్రాంతాలకు పంపించేందుకు 75 వేల మొక్కలను సిద్ధం చేస్తున్నట్టు ఆయన ‘న్యూస్‌టుడే’కు వెల్లడించారు. అలాగే వర్షాలు పడిన వెంటనే జిల్లాలో మొక్కలు పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కంటే భారీ కార్యక్రమం చేపట్టి, పాఠశాలలు ఖాళీ స్థలాలు, ప్రధాన రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా అవకాశమున్న ప్రతిచోటా మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సత్యనారాయణ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతిలో సరస్వతీ ఆలయం
 
 
  •  గత ప్రభుత్వ డిపాజిట్‌ రూ.2500 కోట్లు ఎక్కడున్నాయి: సీఎం
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): అమరావతిలో సరస్వతీ దేవాలయం నిర్మించాలని ఆ శాఖాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తెలంగాణలోని బాసర తరహాలో అక్షరాభ్యాసాలకు నెలవుగా అమరావతి సరస్వతీ ఆలయం ఉండాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో శుక్రవారం దేవాదాయ, ఆర్థిక, రెవెన్యూ శాఖలపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం కార్యక్రమాలు అమలు చేసే ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఆర్థికశాఖపై సమీక్షలో మాట్లాడుతూ... ‘‘గత ప్రభుత్వాల హయాల్లో వివిధ శాఖలకు చెందిన సొమ్మును పలు బ్యాంకులు, ఖాతాల్లో డిపాజిట్‌ చేశారు. అది రూ.2,500 కోట్ల వరకూ ఉంటుందని అంటున్నారు. ఆ డిపాజిట్లన్నీ అసలు ఏయే బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయో కనుక్కోండి’’ అని సీఎం సూచించారు.
Link to comment
Share on other sites

వైకుంఠపురం వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి త్వరలో సర్వే

అమరావతి రాజధానికి సరిపడా తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద ప్రతిపాదించిన రిజర్వాయర్‌కు సంబంధించి సర్వే త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కలెక్టర్ల సదస్సులో తెలిపారు. గోదావరి నుంచి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు అందిస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణానదికి వరద ఒకేసారి వస్తే పులిచింతల ప్రాజెక్టు తర్వాత నీటిని నిల్వ చేసుకొనే అవకాశం లేదన్నారు. దీని దృష్ట్యా అమరావతి రాజధాని మాస్టర్‌ప్లానులో పొందుపరిచిన వైకుంఠపురం రిజర్వాయర్‌ సర్వే పూర్తి చేసి త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.

Link to comment
Share on other sites

అమరావతికి ‘నక్షత్ర’ కాంతి!
 
 
636315454454843722.jpg
  • తరలివస్తున్న స్టార్‌ హోటళ్లు
  • ఒక్కో హోటల్‌లో 200 గదులు ఉండేలా నవ్యరీతుల్లో 5 స్టార్లు
  • విజయవాడ,గుంటూరు సిటీ, అమరావతిలో తొమ్మిది ఏర్పాటు
అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంతం మరికొన్నేళ్లలోనే స్టార్‌ హోటళ్లకు నెలవు కాబోతోంది. అమరావతి నిర్మాణ కార్యకలాపాలు అంతకంతకూ ఊపందుకుంటుండటం, వివిధ పనులపై ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించే వారి సంఖ్య మరింతగా పెరుగుతుండడంతో ఆ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. అమరావతి, విజయవాడ, గుంటూరుల్లో కొత్తగా స్టార్‌ హోటళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి.
 
ఏవి.. ఎంత దూరంలో..
విజయవాడ, గుంటూరుల్లో చాలానే స్టార్‌ హోటళ్లు ఉన్నాయి. కాకపోతే అవన్నీ 3 లేదా 4 స్టార్‌లే. ఒక్కటీ 5 స్టార్‌ హోటల్‌ లేదు. ఈ లోటును తీర్చుతూ భవిష్యత్తులో ఈ రెండు నగరాల్లో, వాటి మధ్యనా, ఇంకా అమరావతిలో..మొత్తం తొమ్మిది పంచ నక్షత్రాల హోటళ్లు రానున్నాయి. 200 గదులు ఉండేలా ఒక్కో హోటల్‌ రూ.170 కోట్ల వ్యయంతో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇందులో రెండు హోటళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. విజయవాడ భారతీనగర్‌లోని నోవోటెల్‌ డిసెంబరుకల్లా, గుంటూరు విద్యానగర్‌లోని ఐటీసీ- మై ఫార్స్యూన హోటల్‌ 2019 డిసెంబరుకల్లా పూర్తి కానున్నాయి. ఇక.. మిగతవాటిలో మూడు డీపీఆర్‌ల దశలో, మరో నాలుగు హోటల్‌ ఎంవోయూల దశలో ఉన్నాయి. ఇందులో మానస సరోవర్‌ గ్రూప్‌, ఎన్ ఏసీ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రహేజా డెవలపర్స్‌ తలపెట్టిన నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. విజయవాడలో సరోవర్‌ హోటల్‌ నిర్మాణానికి మానస సరోవర్‌ గ్రూప్‌, షెరటన్ హోటల్‌ కోసం ఎన్ ఏసీ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌ నిర్మించేందుకు రహేజా డెవలపర్స్‌ ప్రభుత్వానికి డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు)లను సమర్పించాయి. షెరటన హోటల్‌ను డెవలపర్లు తమ స్వంత స్థలంలో నిర్మించనుండగా, సరోవర్‌, మారియట్‌ల కోసం ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులలో భూమిని కేటాయించనుంది. ఇక.. విజయవాడ- గుంటూరుల మధ్య ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు నిర్మించేందుకు హిల్టన, హయత, మాడిసన తదితర గ్రూపులు ఎంవోయూలు చేసుకుంటున్నాయి. ఇవి కాకుండా.. అమరావతిలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ కడతామంటూ మరొక గ్రూపు ఏపీసీఆర్డీయేతో సంప్రదింపులు జరుపుతోంది.
 
మనమూ సభలు చేయొచ్చు!
రాజధాని ప్రాంతంలో భారీ సదస్సులు, కార్యక్రమాలు జరుపుకునేందుకు సరైన వేదికలు లేని కొరత తీరిపోనుంది. విజయవాడ- గుంటూరు మధ్యలో 5.50 ఎకరాల్లో సీకే కన్వెన్షన్  సెంటర్‌ రూపుదిద్దుకొంటోంది. ఇక్కడి చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పక్కన నిర్మాణమవుతున్న ఈ సెంటర్‌కు 4,400 సీటింగ్‌ సామర్థ్యం ఉంది. వేర్వేరు పరిణామాల్లో ఉండే నాలుగు కన్వెన్షన్ హాళ్లతో ఇది నిర్మితమవుతోంది. ఇందులో స్టార్‌ హోటళ్లను తలపించే 20 రూమ్‌లు కూడా ఉంటాయి. తొలి దశ నిర్మాణం వచ్చే ఆగస్టుకల్లా పూర్తవనుంది. ఆ తర్వాత రెండో దశలో సుమారు ఐదు నుంచి ఆరు ఎకరాల్లో ఒకటే సువిశాలమైన మరో కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తారు. ఇందులో ఫైవ్‌స్టార్‌ సౌకర్యాలతో 25 రూమ్స్‌ ఉంటాయి. దీనికి అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించిన వెంటనే రెండో దశని ప్రారంభించనున్నారు. కాగా, ఇప్పటికే ఉన్నవి కాక, మరో పది 3, 4 స్టార్‌ హోటళ్లు విజయవాడ, గుంటూరు, అమరావతిలలో కొత్తగా నిర్మాణం కానున్నాయి. వీటిలో ఎనిమిది విజయవాడలో, ఒక్కొక్కటి గుంటూరు, అమరావతిలో ఏర్పాటవుతాయి.
Link to comment
Share on other sites

ఆ టవరెక్కి చూస్తే అమరావతి మొత్తం కనపడుతుంది: చంద్రబాబు

636315706993457291.jpg

విశాఖపట్నం: అమరావతి నడిబొడ్డున ఓ వైపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, మరోవైపు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. బ్రహ్మాండమైన పార్క్ పెట్టి అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ్నుంచే దగ్గర్లో పరిపాలన నగరం ఉంటుంది.. అందులోనే మధ్యలో అసెంబ్లీ వస్తుంది.. ఆ పక్కనే ఒక టవర్ వస్తుంది.. ఆ టవర్ పైకి ఎక్కితే అమరావతి మొత్తం కనిపిస్తుందని చంద్రబాబు తెలిపారు.

 

అదే మాదిరిగా ఇంకోవైపు తెలుగు జాతి చిహ్నమైన ఎన్టీఆర్ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నామని బాబు చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారికి హక్కులు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అయితే వాటిని ఆచరణలో చూపిన వ్యక్తి ఎన్టీఆర్.. అందుకే ఆ ఇద్దరి విగ్రహాలను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Link to comment
Share on other sites

అమరావతిలో నా పాత్ర గర్వకారణమే!
 
 
636316249780838045.jpg
  • చంద్రబాబు పిలిచి మాట్లాడారు
  • రాజధానికి సేవలు అందించాలన్నారు
  • నాది సినిమా నాలెడ్జ్‌ మాత్రమే అన్నాను
  • నా ఐడియా నచ్చి అమలు చేస్తే ‘గ్రేట్‌’
  • ‘ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే’లో రాజమౌళి
హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘‘సినిమాల్లో బాహుబలి ఒక చరిత్ర సృష్టించింది. అదే విధంగా... అమరావతి కూడా చరిత్ర సృష్టిస్తుంది’’... ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చేసే ప్రకటన ఇది! అంతేకాదు, తెరపై బాహుబలిని అద్భుతంగా చిత్రీకరించిన దర్శకుడు రాజమౌళిని... అమరావతి నిర్మాణంలో భాగస్వామి కావాలని చంద్రబాబు కోరారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే’లో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు! ‘‘అమరావతి నిర్మాణంలో మీ సహాయ సహకారాలు తీసుకోవాలని సీఎం తపన పడుతున్నారు. మరి మీరు ఒక చెయ్యేస్తారా?’’ అని రాధాకృష్ణ నవ్వుతూ అడిగిన ప్రశ్నకు... రాజమౌళి గట్టిగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘నా వద్దకు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ వచ్చారు. చంద్రబాబు ఫోన్‌ చేశారు. అమరావతి విషయంలో సహాయం చేయాలని అడిగారు. నేను చదివింది ఇంటర్‌. చేసేది సినిమాల్లో. అమరావతికి నేనేం చేయగలనండీ అని అడిగాను. కానీ... ‘నో’ చెప్పగానే సులువుగా వదిలేస్తే, ఆ స్థాయికి వెళ్లరు కదా! చంద్రబాబు కూడా వదల్లేదు. ఆంధ్రప్రదేశ్‌ మీరు పుట్టిన రాష్ట్రం... మీ రాష్ట్రం కోసం ఏం చేయరా? అని అడిగారు. (నవ్వుతూ) ఏమీ చేయనని ఎందుకు అంటానండీ, చేయగలిగింది తప్పకుండా చేస్తానని అన్నాను. అయితే... నా కెపాసిటీ అది కాదని కూడా చెప్పాను. ఒక్కసారి వచ్చి తనను కలవాలన్నారు. నేను వెళ్లాను. ఒక గంట సేపు ఉన్నాను. ఆ గంటలో 40 నిమిషాలు నేను అమరావతికి ఎందుకు పని చేయలేను అనే విషయమే నేను చెప్పాను. కానీ... నా నుంచి ‘నో’ అనే సమాధానాన్ని స్వీకరించడానికి వారు సిద్ధంగా లేరని అర్థమైంది’’ అని రాజమౌళి వివరించారు. ఆ తర్వాత... బాహుబలిలోని మాహిష్మతిని ఎలా డిజైన్‌ చేశారని చంద్రబాబు అడిగారని తెలిపారు. ‘‘మేం సినిమా కోసం రాజుతోపాటు... రాజ్యాన్ని (కింగ్‌డమ్‌) కూడా డిజైన్‌ చేశాం. అక్కడ ఏం పండుతాయి, ఎలాంటి ఖనిజాలు ఉంటాయి, ఏం తింటారు, ఏం కట్టుకుంటారు... ఇలాంటివన్నీ రాసుకున్నాం. ప్రతి ఆర్కిటెక్చర్‌కు ఒక ఫిలాసఫీ ఉంటుంది. పెద్ద భవనాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఎందుకు ఉండాలి? దానికి కారణాలేమిటి అనేది కూడా రాసుకున్నాం. మాహిష్మతి రాజులు సుపీరియర్‌గా ఉండాలనుకుంటారు. అందరికన్నా గొప్పగా కనిపించాలి. వాళ్లవద్దకు ఎవరైనా వేరే రాజులు, దూతలు వస్తే... తల ఎత్తి పైకి చూడాలి. అయ్‌బాబోయ్‌ వీళ్లేంటి ఇంత గొప్ప... అని అనుకోవాలి. సైకలాజికల్‌గా భయపెట్టాలనే ఉద్దేశం! అందుకు ఇలా డిజైన్‌ చేశామని చంద్రబాబుకు చెప్పాను. ఆ కాన్సెప్ట్‌ ఆయనకు బాగా నచ్చింది’’ అని రాజమౌళి వివరించారు. ‘‘మేం అమరావతిని పీపుల్స్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం.
 
మీ ఫిలాసఫీని దీనికి అప్లై చేయండి’’ అని చంద్రబాబు చెప్పారన్నారు. అంటే... మొత్తం అమరావతికి కాదని... సచివాలయం, హైకోర్టు భవనాల అప్పియరెన్స్‌ కోసమని తెలిపారు. ‘‘నేను ఎంత చేయగలనో నాకు తెలియదు. అది చేయడానికి తలలు పండిన ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్‌లు ఎందరో ఉన్నారు. నాకు ఆ నాలెడ్జ్‌ లేదు. సినిమా నాలెడ్జ్‌ ఉంది. మేం వేసిన సెట్‌ ఎన్ని రోజులు ఉంటుంది! కానీ... రాజధాని కొన్ని వందల సంవత్సరాలు నిలిచిపోతుంది. ఇదంతా చంద్రబాబుకు చెప్పాను. అయితే, మీకు ఇంత నాలెడ్జ్‌ ఉందికదా... అమరావతికి ఎంత కాంట్రిబ్యూట్‌ చేయగలిగితే అంత చేయండి అని అన్నారు. సరే సర్‌ అని బదులిచ్చాను’’ అని రాజమౌళి చెప్పారు. ‘‘ఆయన (సీఎం) మిమ్మల్ని వదలరు. ఏదోరకంగా ఇన్‌వాల్వ్‌ చేయాలని చూస్తారు. మీకు కూడా కొంత తృప్తి ఉంటుంది కదా’ అని వేమూరి రాధాకృష్ణ పేర్కొనగా, ‘‘అమరావతి కోసం నేను ఏదైనా ఒక ఐడియా ఇవ్వగలిగి, అది అందరికీ నచ్చి, నిర్మాణంలో అదీ ఒక భాగమైతే అంతకంటే గర్వకారణం ఏముంటుంది! అది పెద్ద గౌరవం. గ్రేట్‌ ఫీలింగ్‌. కొన్ని వందల సంవత్సరాలపాటు నిలిచే కట్టడమది. మనం పోయిన తర్వాత కూడా మన పాత్ర మాత్రం నిలిచిపోతుంది. ఇది నిజంగా గొప్పే!’’ అని రాజమౌళి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...