Jump to content

Amaravati


Recommended Posts

ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌కు నేడు శంకుస్థాపన
21ap-main15a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి, తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిలోని రాయపూడి వద్ద  ప్రవాసాంధ్రులకు నిర్మించ తలపెట్టిన ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌ నిర్మాణానికి శుక్రవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసం నుంచి నేరుగా రహదారి మార్గంలో శంకుస్థాపన ప్రదేశానికి చేరుకొంటారు. 10.45నిమిషాలకు కార్యక్రమాన్ని ముగించుకొని సచివాలయానికి వెళతారు. రాజధానిలోని పరిపాలన నగరంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐకాన్‌ టవర్‌ను నిర్మించనున్నారు. సుమారు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో 36 అంతస్తులుగా భవనాన్ని ఏపీఎన్‌ఆర్‌టీ నిర్మించనుంది. అమరావతి నగరానికి అద్దం పట్టేలా అంగ్ల అక్షరం ‘ఏ’ తరహాలో ఆకృతిని రూపొందించారు. రెండు టవర్ల మధ్యలో గ్లోబ్‌ ఆకృతిని నిర్మించనున్నారు. కొరియాకు చెందిన స్పేస్‌ కార్పొరేషన్‌ సంస్థ ఈ భవన ఆకృతిని రూపొందించింది. అధునాతనమైన ఎక్సో స్కెల్టెన్‌ విధానంలో నిర్మిస్తున్న ఈ భవనంలో అంతస్తుల మధ్యలో కాంక్రీటు పిల్లర్లు ఉండకపోవడంతో ఆరు శాతం ఎక్కువ స్థల లభ్యత ఉంటుందని ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు, నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, ఇన్ఫినిటీ స్విమ్మింగ్‌పూల్‌, వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లతో కూడిన ఈ భవనం అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ఈ టవర్‌ వల్ల ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి

Link to comment
Share on other sites

దేశంలోనే ప్రప్రథమంగా అమరావతిలో...
22-06-2018 11:09:36
 
636652625908606036.jpg
  • జూ ప్లస్‌ నైట్‌ సఫారీ.. మన చెంతకే వన్యప్రాణులు...!
  • దేశంలోనే ప్రప్రథమంగా అమరావతిలో ఏర్పాటుకు సన్నాహాలు
  • తాడేపల్లి వద్ద సుమారు 620 ఎకరాల్లో ప్రతిపాదనలు
  • సింగపూర్‌ నైట్‌ సఫారీ కంటే దాదాపు 6 రెట్లు పెద్దది!
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో జూ, నైట్‌ సఫారీ కోసం అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ లక్ష్మీ పార్థసారధి చేసిన ప్రతిపాదనకు బుధవారం జరిగిన సీఆర్డీయే సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆమోదముద్ర పడింది. దీంతో తదుపరి దశలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. కొన్ని నెలల్లోనే పులులు, ఏనుగులు మొదలుకుని జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు వంటి ఎన్నెన్నో రకాల అడవి జంతువులను రాజధాని, పరిసరాల ప్రజలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు పగలు (జూ), రాత్రి వేళల్లో (నైట్‌ సఫారీ) ప్రత్యక్షంగా చూసే అద్భుత అవకాశాన్ని పొందబోతున్నారు.
 
 
జూలకు అనుబంధంగా, వన్యప్రాణులను వాటికి అలవాటైన పరిసరాలు, సహజ వాతావరణంలో ఉంచి, ప్రత్యేక వాహనాల్లో సందర్శకులను వాటి సమీపంలోకి తీసుకు వెళ్లే సఫారీ బెంగళూరు సమీపంలోని బన్నేరుఘట్టలో ఇప్పటికే ఉంది. ఇందులో సింహాలు, పులులను అతి దగ్గరినుంచి చూసే వీలు కల్పిస్తారు. ఏనుగులు, ఎలుగుబంట్లు, జింకలు తదితరాలూ ఇక్కడ ఉంటాయి. అయితే ఇందులో సఫారీని పగటి వేళల్లోనే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో స్థాపించిన నైట్‌ సఫారీ లాంటిదానిని అమరావతిలోనూ అభివృద్ధి పరిస్తే వైవిధ్యంగా ఉండి, సందర్శకులకు వినూత్న అనుభూతిని కలిగించవచ్చుననే ఉద్దేశ్యంతో ఏడీసీ ఈ ప్రతిపాదన చేసింది. అయితే సింగపూర్‌ జూ, నైట్‌ సఫారీ విస్తీర్ణం 99 ఎకరాలు మాత్రమే కాగా అమరావతిలో ఏర్పాటు చేయబోయేది అంతకు 6 రెట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో రూపుదాల్చబోతోంది!
 
 
620 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో..
అమరావతికి ముఖద్వారమని అభివర్ణించదగిన తాడేపల్లి పరిధిలో సుమారు 620 ఎకరాల్లో ఈ జూ, నైట్‌ సఫారీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 370 ఎకరాలు సమతులమైన ప్రదేశంలో ఉండగా, మిగిలిన 250 ఎకరాలు కొండప్రాంతం. ఈ మొత్తం ప్రదేశంలో దట్టమైన అడవిని తలపించేలా పలు రకాల వృక్షజాతులను పెంచుతారు. నిజమైన అడవిలోనే ఉన్న భావన వన్యప్రాణులకు కలిగేలా కొలనులు, ఇతర నీటి వనరులను ఏర్పాటు చేస్తారు. వన్యప్రాణులు చుట్టుపక్కల ఉన్న జనావాసాల్లోకి ప్రవేశించడాన్నీ, అదే సమయంలో ప్రజల్లో ఎవరైనా జూలోకి చొరబడడాన్నీ నిరోధించేందుకుగాను దాని చుట్టూ భారీ కందకాలను, కంచెలను ఏర్పాటు చేస్తారు.
 
 
సాధారణంగా జంతు ప్రదర్శన శాలల్లో ఉండే వన్య ప్రాణులను ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో ఉంచి, కొంత దూరం నుంచి వాటిని ప్రజలు చూసే వీలు కల్పిస్తారు. అయితే సఫారీల్లో సందర్శకులు ప్రత్యేక (పులుల వంటి క్రూర జంతువుల నుంచి హాని వాటిల్లకుండా చుట్టూ ఫెన్సింగ్‌ లేదా అద్దాలతో రూపొందించిన) వాహనాల్లో ప్రయాణిస్తుంటే వన్యప్రాణులు వాటి చుట్టూ స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి! అవి తమ ప్రపంచంలో తాముంటే, వాటికి అంతగా చికాకు కలిగించని, ధ్వని, కాలుష్యరహితమైన వాహనాల్లో సందర్శకులు నెమ్మదిగా ప్రయాణిస్తూ ప్రకృతిసిద్ధంగా జీవిస్తున్న వన్యప్రాణులను అతి సమీపంలో నుంచి చూడగలుగుతారు.
 
 
అందరికీ అందుబాటులో..
దేశంలోని పలు నగరాల్లో మాదిరిగా ఈ జంతు ప్రదర్శనశాలను జనావాసాలకు సుదూరంగా కాకుండా, అమరావతిలోనే ఏర్పాటు చేస్తుండడంతో అందరికీ అందుబాటులో ఉండనుంది. ఇక్కడికి అటు విజయవాడ, ఇటు మంగళగిరి, గుంటూరు ఇత్యాది ప్రదేశాల నుంచి సులభంగా చేరుకునే వీలుంది.
 
దీంతోపాటు సహజసిద్ధమైన అడవిని తలపించే వాతావరణాన్ని సృష్టించేందుకు అవసరమైన నైసర్గిక, భౌగోళిక పరిస్థితులు తాడేపల్లి వద్ద ఉండడమూ ఈ ప్రదేశాన్ని ఎంచుకునేందుకు మరొక ప్రధాన కారణం.
 
రాజధానిలో..
రాజధానిలో జంతు ప్రదర్శనశాల లేదనే కొరతను దూరం చేయడమే కాదు.. అసలిలాంటి జూ భారతదేశంలోనే అరుదైనదని అనిపించే ఆకర్షణీయ ప్రతిపాదన త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఒక్క జూకే పరిమితం కాకుండా అందులోని వన్యప్రాణులను రాత్రి వేళల్లో, ప్రత్యేక వాహనాల్లో తిరుగుతూ అతి దగ్గరి నుంచి సందర్శకులు చూసే వీలు కల్పించే ‘నైట్‌ సఫారీ’ని కూడా నెలకొల్పడం ద్వారా ప్రజలకు నిశిరాత్రివేళల్లో, దట్టమైన అడవిలో విహరించిన అనుభూతిని కల్పించనున్నారు. అమరావతిలో ఏర్పాటవబోతున్న నైట్‌ సఫారీ యావత్తు భారతదేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం!
 
 
2, 3 వారాల్లో అంచనాలు సిద్ధం..
ఏడీసీ ఉన్నతాధికారులు చేసిన జూ, నైట్‌ సఫారీ పార్కు ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలుపడంతో అటవీ శాఖాధికారులు అందుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయబోతున్నారు. దీనికి అనుబంధంగా బొటానికల్‌ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాన్నీ వారు ఈ సందర్భంగా పాటించనున్నారు. సుమారు 2, 3 వారాల్లో ఈ అంచనాలు సిద్ధమవుతాయని, అనంతరం వాటిని మళ్లీ సీఎం ముందుంచి, ఆయన ఆదేశాలమేరకు తదుపరి కార్యాచరణను రూపొందిస్తారని తెలుస్తోంది.
 
 
 
Link to comment
Share on other sites

NCBN today laid the foundation for Icon Tower to be constructed by Andhra Pradesh Non-Resident Telugu (APNRT) Society. The NRT Icon Tower is located in Amaravati's Rayapudi village. It will become a centre for many NRT owned IT industries. Icon Tower will have features like revolving restaurants, NRT club, world class auditorium, high end class rooms with state of the art audio video equipment, sustainability features with water and energy conservation etc

https://pbs.twimg.com/media/DgSQROwUYAAG-Fx.jpg

https://pbs.twimg.com/media/DgSQroJUwAIZS7q.jpg

Link to comment
Share on other sites

Icon Tower: Establishment of about 100 software companies resulting in more than 5000 direct & several 1000 indirect jobs. It will be built with an exoskeleton weight bearing structure minimising the need for interior columns resulting in increase of usable office space by 6%. The promoter APNRT is planning to raise the entire finance from NRTs avoiding burden to the state exchequer.

https://pbs.twimg.com/media/DgSR8l4UcAARoBO.jpg

https://pbs.twimg.com/media/DgSR8nhUcAAm96B.jpg

Link to comment
Share on other sites

వారంలో శాశ్వత సచివాలయ పనులు!
23-06-2018 03:16:53
 
636653206277037289.jpg
  •  వర్క్‌ ఆర్డర్లు అందజేసిన సీఆర్డీయే
  •  నేడో, రేపో హైకోర్టు భవనానికీ టెండర్లు
అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో కీలకమైన శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు వారం, పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మొత్తం 70లక్షల చ.అ. విస్తీర్ణంలో, 5 టవర్లుగా, సుమారు రూ.2600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భారీ కాంప్లెక్స్‌ టెండర్లను 3 సుప్రసిద్ధ నిర్మాణ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలకు ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ శుక్రవారం వర్క్‌ ఆర్డర్లను అందజేశారు. ఒక వారంలోగా ఈ కంపెనీలు సీఆర్డీయేతో అంగీకారపత్రాలను కుదుర్చుకుని వెంటనే పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 26న టెండర్లు పిలవగా ఆ సంస్థలు తక్కువ మొత్తాలను కోట్‌ చేశాయి. ఈ నెల 20న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబుకి సీఆర్డీయే అధికారులు ఈ విషయం తెలియజేయగా.. వెంటనే ఆయా సంస్థలకు వర్క్‌ ఆర్డర్లు ఇచ్చి, పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు. కాగా, 2 ఐకానిక్‌ భవంతుల్లో ఒకటైన రాష్ట్ర హైకోర్టు భవన నిర్మాణానికి నేడో, రేపో టెండర్లు పిలిచేందుకు సీఆర్డీయే సన్నద్ధమవుతోంది. బౌద్ధ స్థూపాకృతిలో రూపొందనున్న ఈ భవనానికి రూ.1168 కోట్ల వ్యయం కాగలదని అంచనా. తొలిదశగా ఫౌండేషన్‌, స్ట్రక్చరల్‌ టెండర్లను రూ.700 కోట్ల అంచనా వ్యయంతో పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ పనులు జరుగుతుండగానే అంతర్గత, ఇతర పనుల కోసం రూ.468 కోట్లతో మరొక టెండర్‌ను ఆహ్వానిస్తారని సమాచారం. మొత్తంమీద హైకోర్టు శాశ్వత భవనం పూర్తయ్యేందుకు రెండేళ్ల నుంచి రెండున్నరేళ్లు పట్టవచ్చునని సమాచారం.
Link to comment
Share on other sites

రాజధానిపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
23-06-2018 08:22:08
 
636653389426262563.jpg
  • రాజధానికే తలమానికంగా ఎన్‌ఆర్టీ టవర్స్‌
  • అమరావతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి..
  • జన్మభూమి రుణం తీర్చుకోవడం శుభ పరిణామం-చంద్రబాబు
  •  ఎన్‌ఆర్టీ టవర్ల నిర్మాణ శంకుస్థాపన
  • సీఎంను సత్కరించిన రాయపూడి రైతులు
 
 
 విదేశాల్లో నివాసం ఉంటున్న తెలుగువారు జన్మభూమి రుణం తీర్చుకోవాలని ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధానిలోని రాయపూడి సమీపంలో ఎన్‌ఆర్టీ (నాన్‌ రెసిడెంట్‌ తెలుగు అసోసియేషన్‌) తలపెట్టిన 33 అంతస్థులతో రెండు టవర్ల నిర్మాణానికి శుక్రవారం సీఎం శంకుస్థాప చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిలో భాగస్వాములవడానికి ఎన్‌ఆర్టీ సభ్యు లు ముందుకు రావటం అభినందనీయమన్నారు. రాజధానికి స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు రైతులు ఇవ్వ బట్టే మనం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా మని.. వారికి ధన్యవాదాలు తెలిపారు.
 
 
గుంటూరు, తుళ్ళూరు: విదేశాల్లో నివాసం ఉంటున్న తెలుగువారు జన్మభూమి రుణం తీర్చుకోవాలని ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధానిలోని రాయపూడి సమీపంలో ఎన్‌ఆర్టీ(నాన్‌రెసిడెంట్‌ తెలుగు అసోసియేషన్‌)తలపెట్టిన 33 అతంస్థులతో రెండు టవర్ల నిర్మాణానికి శుక్రవారం సీఎం శంకుస్థాప చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిలో భాగస్వాములవడానికి ఎన్‌ఆర్టీ సభ్యులు ముందుకు రావటం అభినందనీయమన్నారు. రాజధానికి స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు రైతులు ఇవ్వబట్టే మనం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్‌ఆర్టీ టవర్స్‌ ది బెస్ట్‌ టవర్స్‌గా ఉంటాయన్నారు. వీటి గురించి ప్రపంచ దేశాలలో ప్రచారం జరగాలని సూచించారు.
 
కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమానికి రైతులు, ఎన్‌ఆర్టీ సభ్యులు, విద్యార్థులు హాజరయ్యారు. సీఎం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎం వేదిక పైకి వస్తున్న సమయంలో సభికులు కేరింతలు కొట్టారు. ఉదయం 9.36 గంటలకు సీఎం కార్యక్రమానికి వచ్చారు. 11 గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి కావటంతో సభ ముగిసింది. రాయపూడికి చెందిన రైతులు సీఎం చంద్రబాబు ను గజమాలతో సత్కరించారు. సభకు వచ్చినవారికి అల్పాహారం, మంచినీటిని అందించారు. ఎన్‌ఆర్టీ సభ్యులు వివిధ దేశాల జెండాలతో సభలో ఆశీనులయ్యారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ కోన శశిధర్‌, ఎమ్మెల్యే లు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జీవీ ఆంజనేయులు, జెడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌, మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌్‌ గంజి చిరంజీవి, మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎన్‌ఆర్టీ అధ్యక్షుడు రవి వేమూరి, విద్యార్థులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సీఆర్‌డీఏ బాండ్లకు క్రిసిల్‌ ఏ+ రేటింగ్‌
పెట్టుబడుల ఆకర్షణకు ప్రయోజనకరం!

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులకు సంస్థాగత మదుపరుల నుంచి నిధులు సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) విడుదల చేయనున్న బాండ్లకు ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఎ+ రేటింగ్‌ ఇచ్చింది. రాజధాని బాండ్లలో సంస్థాగత మదుపరులు పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు క్రిసిల్‌ రేటింగ్‌ ఉపయోగపడుతుందని సీఆర్‌డీఏ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బాండ్ల ద్వారా రూ.రెండు వేల కోట్ల వరకు సమీకరించాలని సీఆర్‌డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే అరేంజర్ల నియామకం పూర్తి చేసి మార్కెట్‌లోకి వెళ్లాలని సీఆర్‌డీఏ యోచిస్తోంది. ఈ బాండ్లకు సంబంధించి సీఆర్‌డీఏ లోగడే బ్రిక్‌వర్క్‌, స్మెరా సంస్థలతో రేటింగ్‌ ప్రక్రియ నిర్వహించింది. ఆ రెండు సంస్థలూ ఏఏ- రేటింగ్‌ ఇచ్చాయి. క్రిసిల్‌ వంటి అగ్రశ్రేణి సంస్థల రేటింగ్‌ ఉంటే బాండ్లకు మార్కెట్‌లో మరింత ఆకర్షణ పెరుగుతుందన్న నిపుణుల సూచన మేరకు ఆ ప్రక్రియనూ సీఆర్‌డీఏ పూర్తి చేసింది. ఈ బాండ్లకు సంబంధించి గత నెలలో ముంబయిలో సీఆర్‌డీఏ నిర్వహించిన మదుపరుల సమావేశానికి సుమారు 70 మంది హాజరయ్యారు. మరోవైపు అరేంజర్ల ఎంపికకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. సీఆర్‌డీఏ విడుదల చేసే బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం హామీనిస్తోంది.

Link to comment
Share on other sites

ఇక దూకుడుగా ఏపీ రాజధాని పనులు
23-06-2018 09:58:07
 
636653447019538628.jpg
  •  పాలవాగుకు ఇరువైపులా అమరావతి
  • వర్క్‌ ఆర్డర్లు కొలిక్కి
  • అమరావతి పనులు వేగం
  • మొత్తం విస్తీర్ణం 70 లక్షల చ.అ.
  • అంచనా వ్యయం సుమారు రూ.2600 కోట్లు
  • రెండేళ్ల లోపు పూర్తి చేయాలన్నది లక్ష్యం
అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో ఐదు టవర్లతో కూడిన సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌కు సంబంధించిన వర్క్‌ ఆర్డర్లను  అందజేశారు. డయాగ్రిడ్‌ విధానంలో, పెడన కలంకారీ డిజైన్‌ను తలపించిన ఈ టవర్ల ఆకృతులను అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించింది. తుపాన్లు, భూకంపాల వంటి ప్రకృతి ఉత్పాతాలను తట్టుకునేలా అత్యధునాతనం, సురక్షితమైన డయాగ్రిడ్‌ విధానంలో భారతదేశంలో ఇంతటి భవంతులను నిర్మించడం ఇదే ప్రథమం!
 
 
అమరావతి, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలతోపాటు వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు ఒక్క చోటనే పని చేసుకునేందుకు వీలుగా అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో 5 టవర్లతో కూడిన సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ను నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన వర్క్‌ ఆర్డర్లను  అందజేశారు. ఈ టవర్లు పాలవాగుకు ఇరువైపులా రానున్నాయి. సీఎం, సీఎస్‌ల కార్యాలయాలుండే జీఏడీ టవర్‌, మరొకటి ఒకవైపున, మిగిలిన మూడూ మరొకవైపున నిర్మితమవుతాయి. వీటిల్లో జీఏడీ టవర్‌ జి ప్లస్‌ 49 అంతస్థులతోనూ, మిగిలిన 4 టవర్లు ఒక్కొక్కటి జి ప్లస్‌ 39 ఫ్లోర్లతోనూ నిర్మితం కానున్నాయి. వీటి మొత్తం విస్తీర్ణం సుమారు 70 లక్షల చదరపుటడుగులు! 900 మీటర్ల పొడవు, 138 మీటర్ల వెడల్పు ఉండే బేస్‌మెంట్‌పై ఈ టవర్లు రానున్నాయి. డయాగ్రిడ్‌ విధానంలో, పెడన కలంకారీ డిజైన్‌ను తలపించిన ఈ టవర్ల ఆకృతులను అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించింది. ఈ విషయంలో దానికి జెనెసిస్‌, డిజైన్‌ ట్రీ అనే ప్రసిద్ధ సంస్థలు సహకరించాయి.
 
పలు ప్రత్యేకతల సమాహారం..
తుపాన్లు, భూకంపాల వంటి ప్రకృతి ఉత్పాతాలను తట్టుకునేలా అత్యధునాతనం, సురక్షితమైన డయాగ్రిడ్‌ విధానంలో భారతదేశంలో ఇంతటి భవంతులను నిర్మించడం ఇదే ప్రథమం! ఎంతటి పెనుగాలులు వీచినప్పటికీ ఈ ఆకాశహర్మ్యాలకు ఎటువంటి ప్రమాదం ఉండకుండా చూసేం దుకుగాను వీటి డిజైన్లను ‘విండ్‌ టన్నెల్‌ అనాలిసిస్‌’ అనే అత్యధునాతన పద్ధతిలోనూ విశ్లేషిస్తున్నారు. ఒకవేళ.. ఈ విశ్లేషణలో మరికొన్ని జాగ్రత్తలుగానీ, డిజైన్లలో కొద్ది పాటి మార్పులుగానీ అవసరమని తేలిన పక్షంలో వాటినీ చేసేలా నిర్మాణసంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మధ్యలో ఎక్కడా పిల్లర్లు ఉండకపోవడం డయాగ్రిడ్‌ విధానం వల్ల ఒనగూరే మరొక ప్రధాన ప్రయోజనం. తద్వారా కనీసం 8 నుంచి 10 శాతం స్పేస్‌ కలసిరావడమే కాకుండా ఇంటీరియర్లను కావలసిన విధంగా, మరింత ఆకర్షణీయంగా మలుచుకునే వీలు కలుగు తుంది. పర్యావరణానికి పూర్తి అనుకూల మైన రీతిలో, ఐజీబీసీ (ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌) నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిం చేలా ఈ టవర్లు రూపుదిద్దుకోబోతుండడం మరొక విశేషం! జీఏడీ టవర్‌ పై భాగంలో అంటే 50 వ అంతస్థులో హెలిప్యాడ్‌ ఉంటుంది. ఈ సముదాయమంతటిలో దాదాపు 2,600 నుంచి 4,500కార్లను నిలుపగలిగిన సువిశా ల పార్కింగ్‌ ప్రదేశం రానుంది. ఈ 5 టవర్లను కలుపుతూ రెండంతస్థుల ఎత్తులో, సుమారు 900 మీటర్ల పొడవైన ఒక కాలిబాట వంతెనను నిర్మిస్తారు. దీంతో ఒక టవర్‌ నుంచి ఇంకొక టవర్‌కు సులభంగా రాకపోకలు సాగించే వీలు కలుగుతుంది.
 
అన్నీ మంచి శకునములే..!
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిలో ఐకానిక్‌ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టులకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలచిన సెక్రటేరియ ట్‌ సముదాయం కోసం సీఆర్డీయే నిర్వహిం పజేస్తున్న భూపరీక్షల్లో కేవలం 9 మీటర్ల నుంచి 14 మీటర్ల లోతునే గట్టి రాయి తగిలింది! వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సెక్రటేరియట్‌ కోసం జరిపిన సాయిల్‌ టెస్ట్‌ల్లో ఇలాంటి రాయి తగిలేందుకు 100 నుంచి 110 అడుగుల లోతు వరకూ వెళ్లాల్సిరాగా, పర్మనెం ట్‌ సెక్ర టేరియ ట్‌కు కేవలం 28 అడు గుల నుంచి 45 అడుగులలోపే రాయి తగలడం విశేషం! కృష్ణానదీ తీరం భారీ, బహుళ అంతస్థుల భవంతులకు ఏమాత్రం అను కూలం కాదన్న వాదనను ఈ ఫలితాలు వీగిపోయేలా చేశాయి. ‘షీట్‌ రాక్‌’గా ఫౌం డేషన్‌ నిపుణులు అభివర్ణించే దృఢమైన ఈ రాతి పొర 40 నుంచి 50అంతస్థులతో నిర్మితమవనున్న సచివాలయ సముదాయా న్ని స్వల్ప సమయంలోనే, సుదృఢంగా పూర్తి చేసేం దుకు ఎంతైనా దోహదపడగలదన్న విశ్వాసాన్ని అవి ఇచ్చాయి. ఇంతే కాకుండా తక్కువ లోతు వరకే ఫౌండేషన్‌ వేసే వీలుండడంతో నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది. తదను గుణంగానే కాంట్రాక్ట్‌ కంపెనీలకు చెల్లింపుల ను జరపాలన్న నిబంధనలను టెండర్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. కాగా.. నిర్దేశిత గడువైన 2సంవత్సరాల్లోపే ఈ టవర్ల నిర్మాణం పూర్తయ్యేలా చూసేందుకు గాను సీఆర్డీయే పైన పేర్కొన్న సాయిల్‌ టెస్ట్‌లతోపాటు ఇలాంటి హైరైజ్‌ బిల్డింగుల ను కట్టేటప్పుడు జరిపే సకల పరీక్షలనూ ఆయా రంగాల్లో నిపుణులైన వారితో నిర్వహింపజేస్తోంది, ఈజిస్‌ అనే సంస్థను ప్రాజెక్ట్‌ మేనేజ్‌ మెంట్‌ కన్సల్టెంట్‌గా నియమించుకుంది.
 
 
హైకోర్టు ఇలా..!
శాశ్వత హైకోర్టు భవనానికి కూడా రెండురోజుల్లో టెండర్లు పిలవబోతున్నారు. జి ప్లస్‌ 7 అంతస్థులతో నలు చదరంగా (పొడవు, వెడల్పు 187 మీటర్లే) ఉండనున్న హైకోర్టు భవనపు మొత్తం విస్తీర్ణం 16.85 లక్షల చదరపు అడుగులు కాగా ఇందులో బిల్టప్‌ ఏరియా విస్తీర్ణం 14.26 లక్షల చ.అ., బేస్‌మెంట్‌ విస్తీర్ణం 2.59 లక్షల చ.అ. ఇందులో ప్రస్తుతానికి ప్రధాన న్యాయమూర్తి కోర్టుతో కలిపి 37 కోర్టు హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో మరొక 24 కోర్టులను నెలకొల్పుకునే వీలుంటుంది. ఇవన్నీ కూడా డబుల్‌ స్టోరీ (8 మీటర్లకు పైగా ఎత్తు అంటే రెండంతస్థులంత పైకప్పు)తోనూ, ప్రస్తుత ఉమ్మడి హైకోర్టులోని కోర్టు హాళ్ల పరిమాణంతో పోల్చితే అధిక విస్తీర్ణంతో, మెరుగైన వసతులతోనూ రూపుదిద్దుకోనున్నాయి. కక్షిదారులు, ఉద్యోగులు, న్యాయవాదులకు అవసరమైన వసతులూ, వేర్వేరు ప్రవేశద్వారాలూ, సుమారు 2,400 వాహనాలు నిలుపుకోగల సువిశాల పార్కింగ్‌ ప్రదేశమూ దీని ప్రత్యేకతల్లో కొన్ని!
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...