Jump to content

Amaravati


Recommended Posts

డయాగ్రిడ్‌ కాలమ్స్‌ రెడీ
16-04-2019 03:10:28
 
636909810372905115.jpg
  • సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణంలో మరో ప్రధాన ఘట్టం
  • జీఏడీ, 3వ నంబర్‌ టవర్లకు కాలమ్స్‌ అమరిక మొదలు
  • ప్రపంచ ప్రఖ్యాత సంస్థల నిపుణుల ఆధ్వర్యంలో పనులు
  • తొలుత ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌.. తాజాగా భారీ కాలమ్స్‌ ఏర్పాటు
అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి మకుటాయమానంగా నిలుస్తాయని భావిస్తున్న సచివాలయ టవర్ల నిర్మాణంలో మరొక బృహత్తర ఘట్టానికి అధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. మొత్తం 5 టవర్లలో రెండిండికి సంబంధించిన భారీ డయాగ్రిడ్‌ కాలమ్స్‌ ఏర్పాటు ప్రక్రియ ఏపీసీఆర్డీయే అధికారులు, ప్రపంచస్థాయి నిపుణుల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. సీఆర్డీయే సీఈ ఎం.వేంకటేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పూజాదికాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ ప్రభృతులు ఈ పనులు పర్యవేక్షించారు.
 
ఎవర్‌సెండాయ్‌ నేతృత్వంలో...
అమరావతిలోని హెచ్‌వోడీ అండ్‌ సెక్రటేరియల్‌ టవర్లలో 4 ఒక్కొక్కటి 40 అంతస్థులతోనూ, మిగిలిన ఒకటి 50 అంతస్థులతో (ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు కొలువు దీరే జీఏడీ టవర్‌) నిర్మితమవనున్న సంగతి తెలిసిందే. సాంప్రదాయక భవనాల్లోని పిల్లర్ల మాదిరి కాకుండా భారత్‌లోనే తొలిసారిగా డయాగ్రిడ్‌ విధానంలో నిర్మితమవుతున్న అత్యంత భారీ సౌధాలుగా ఇవి చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రక్రియను దిగ్విజయంగా ముగించిన సీఆర్డీయే ఇంజినీరింగ్‌ విభాగాధికారులు తదుపరి చర్యగా ఈ టవర్ల డయాగ్రిడ్‌ స్టీల్‌ కాలమ్స్‌ అమరిక పనులను చేపట్టారు. ఇందులో భాగంగా జీఏడీ (టవర్‌ నంబర్‌ 5) మరియు 3వ టవర్‌కు సంబంధించిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. స్ట్రక్చరల్‌ స్టీల్‌ ఫ్యాబ్రికేషన్‌లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎవర్‌సెండాయ్‌ సంస్థ ఈ పనులను చేపట్టింది. దుబాయ్‌కు చెందిన ఈ సంస్థకు బుర్జ్‌ ఖలీఫా, మలేసియాలోని పెట్రోనాస్‌ టవర్‌ 2, ఖతార్‌లోని ఖలీఫా ఒలింపిక్‌ స్టేడియం, సింగపూర్‌లోని రిపబ్లిక్‌ ప్లాజా, సౌదీలోని కింగ్‌డమ్‌ సెంటర్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలను చేపట్టిన అనుభవం ఉంది.
 
ఒక్కో కాలమ్‌ బరువు 17.80 టన్నులు..
సెక్రటేరియట్‌ టవర్లలో అమర్చిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ ఒక్కొక్క దాని బరువు 17.80 టన్నులు! ఈ350బీఆర్‌ గ్రేడ్‌ అనే అత్యంత నాణ్యమైన స్టీల్‌తో తమిళనాడులో వీటిని తయారు చేసి, అక్కడి నుంచి భారీ వాహనాల్లో అమరావతికి చేర్చారు. జీఏడీ టవర్‌లో ఇలాంటి భారీ కాలమ్స్‌ మొత్తం 512 అమర్చనున్నారు. కాగా.. మొత్తం 5 సెక్రటేరియట్‌ టవర్లలో మూడింటికి సంబంధించిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ అమరికను ఎవర్‌సెండాయ్‌ జరపనుండగా, మిగిలిన 2 టవర్లవి జేఎ్‌సడబ్ల్యూ సంస్థ చేపట్టనుంది.
Link to comment
Share on other sites

సీఎం కార్యాలయ భవనం..డయాగ్రిడ్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం ప్రారంభం

15AP-STATE5a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. 50 అంతస్తులుగా నిర్మిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి డయాగ్రిడ్‌ స్ట్రక్చర్‌ నిర్మాణంలో భాగంగా తొలి కాలమ్‌ను (మధ్యలో ఖాళీగా, చతురస్రాకారంలో రూపొందించిన పొడవైన ఇనుప స్తంభం) సోమవారం అమర్చారు. గుజరాత్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ విగ్రహానికి (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ) స్టీల్‌ ఫ్రేం వర్క్‌ పనులు చేసిన.... ఎవర్సెండాయ్‌ సంస్థ వీటిని సరఫరా చేస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలకు అమరావతిలో 5 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిలో 3, 4, 5 టవర్లకు ఎవర్సెండాయ్‌, 1, 2 టవర్లకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సంస్థలు ఈ కాలమ్‌లను సరఫరా చేస్తున్నాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఎవర్సెండాయ్‌ సంస్థ ప్రస్తుతం వెయ్యి టన్నుల బరువైన కాలమ్‌లను రూపొందిస్తోంది. ఇప్పటికే ఒకటి రాగా దాన్ని సోమవారం అమర్చారు. ఇకపై ప్రతి రోజూ తిరుచిరాపల్లి నుంచి కాలమ్‌లు వస్తాయని సీఆర్‌డీఏ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. సీఎం కార్యాలయ భవనంలో కాంక్రీట్‌ కోర్‌వాల్‌ నిర్మాణం బేస్‌మెంట్‌ లెవెల్‌ వరకు వచ్చింది. దానికి సమాంతరంగా డయాగ్రిడ్‌ కాలమ్‌లు అమర్చే పని ప్రారంభించారు.

 

Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణాల పూర్తికి సీఆర్‌డీఏ డెడ్ లైన్‌
18-04-2019 17:59:11
 
అమరావతి: అమరావతి నిర్మాణాల పూర్తికి సీఆర్‌డీఏ డెడ్ లైన్‌లు పెట్టుకుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌ నిర్మాణానికి ఆగస్ట్‌ 12 గడువుగా సీఆర్‌డీఏ పెట్టుకుంది. మంత్రులు, న్యాయమూర్తులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు విల్లాల నిర్మాణానికి ఆగస్ట్‌ 16 వరకు గడువు, సచివాలయం, టవర్ల నిర్మాణానికి వచ్చే ఏడాది జులై 18, హైకోర్టు ఐకానిక్ భవన తొలిదశ నిర్మాణం వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28 నాటికి పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రభావం అమరావతి పనులపై పడిందని సీఆర్‌డీఏ స్పష్టం చేసింది.
Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
18-04-2019 17:50:41
 
636912066507529853.jpg
అమరావతి: రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎమ్యెల్యే క్వార్టర్స్‌ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. కొత్త శాసనసభ కొలువుదీరాక నూతన సభ్యులు రాజధానిలో ఉండేందుకు భవనాలు సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. వర్షాకాలం నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్లను న్యాయ వివాదాలు లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. రహదారులు సిద్ధమైతే అమరావతికి రాకపోకలు పెరుగుతాయని బాబు అన్నారు.
 

Advertisement

Link to comment
Share on other sites

S.No. Notification Number Tender Initiated on Tender Valid up to Notification Description Download 1 102/PROC/CRDA-13023(37)/51/2018-AEE20-HB-APCRDA 18/02/2019 08/04/2019 Investigation, Design and construction of civil structure (sub structure & super structure) works for Legislative Assembly of Basement+ground+3 floors (B+G+3) including earth work, pile or raft foundations (including foundation for spire), RCC framed structure consisting of Retaining wall, shear/core wall, slabs, beam, PT slab & beam, inclined/Flared shear walls, columns, using modular/system formwork, reinforcement works, waterproofing and miscellaneous works complying to the requirements of GRIHA five star rating certification for Legislative Assembly building in Super block "E" of Amaravati Governmdent complex area in Amaravati, Andhra Pradesh on Design Build Item rate (Lumpsum) contract. Click Here 2 14/03/2019 Corrigendum, Extension of bid submission date Click Here 3 22/03/2019 Extension of Bid Submission

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

S.No. Notification Number Tender Initiated on Tender Valid up to Notification Description Download 1 102/PROC/CRDA-13023(37)/51/2018-AEE20-HB-APCRDA 18/02/2019 08/04/2019 Investigation, Design and construction of civil structure (sub structure & super structure) works for Legislative Assembly of Basement+ground+3 floors (B+G+3) including earth work, pile or raft foundations (including foundation for spire), RCC framed structure consisting of Retaining wall, shear/core wall, slabs, beam, PT slab & beam, inclined/Flared shear walls, columns, using modular/system formwork, reinforcement works, waterproofing and miscellaneous works complying to the requirements of GRIHA five star rating certification for Legislative Assembly building in Super block "E" of Amaravati Governmdent complex area in Amaravati, Andhra Pradesh on Design Build Item rate (Lumpsum) contract. Click Here 2 14/03/2019 Corrigendum, Extension of bid submission date Click Here 3 22/03/2019 Extension of Bid Submission

Assembly tender final ayyindha

Link to comment
Share on other sites

ఎమ్మెల్యేలకు నివాస భవనాలు

కొత్త సభ కొలువుతీరే నాటికి ఏర్పాటుచేయాలి
సీఆర్‌డీఏ అధికారులకు సీఎం ఆదేశం
ఆగస్టు 12కు సిద్ధమవుతాయన్న కమిషనర్‌
రాజధాని పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష

ap-main2a_14.jpg

ఈనాడు, అమరావతి: కొత్త శాసనసభ కొలువుదీరేనాటికి అమరావతిలో శాసనసభ్యులకు నివాస భవనాలు సిద్ధంగా ఉండాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవనాలు ఆగస్టు 12కు సిద్ధమవుతాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. మంత్రులు, న్యాయమూర్తులు, ముఖ్య కార్యదర్శుల బంగ్లాలు ఆగస్టు16 నాటికి సిద్ధమవుతాయని తెలిపారు. ఆ భవనాల బాహ్య స్వరూపం, వాటికి వేసే రంగులు విలక్షణంగా, అమరావతి ప్రత్యేకతను చాటిచెప్పేలా ఉండాలని సీఎం పేర్కొన్నారు. రాజధాని పనుల పురోగతిపై ఆయన గురువారం సచివాలయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు. ‘రాజధాని నిర్మాణ పనులు లక్ష్యం మేరకు జరుగుతున్నాయా? మేం ఎన్నికల హడావుడిలో ఉన్నామని మీరు కూడా తాపీగా ఉన్నారా?’ అని అధికారులనుద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో పనులు కొంత మందగించింది నిజమేనని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని నిర్మాణానికి రూ.ఐదు వేల కోట్ల వర కు బాండ్ల ద్వారా సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు.

వర్షాలు వచ్చేలోగా పనుల పూర్తి
రాజధానిలో నిర్మాణాల్ని ప్రాధాన్య క్రమంలో గుర్తించి వర్షాకాలం వచ్చేలోగా సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రాజధానిని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే రహదారుల్లో మొదట ఎలాంటి న్యాయవివాదాల్లేని వాటిని గుర్తించి శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ రహదారులు సిద్ధమైతే అమరావతికి సమగ్ర ఆకృతి వస్తుందని, ముఖ్యంగా రాజధానికి రాకపోకలు పెరుగుతాయని తెలిపారు. రాజధాని పనుల పురోగతిపై సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. ముఖ్యాంశాలివి.

* రాజధానిలో రూ.51,687 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉ న్నాయి. వాటిలో రూ.19,769 కోట్ల పనులు మౌలిక వసతులకు సంబంధించినవి కాగా రూ.15,414 కోట్ల పనులు(78%) కొనసాగుతున్నాయి.

* ఎల్‌పీఎస్‌ లేఅవుట్లలో మౌలిక వసతులకు సంబంధించి రూ.17,910 కోట్లతో పనులు చేపట్టగా రూ.15,414 కోట్ల పనులు(88%) పురోగతిలో ఉన్నాయి.

* ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించి రూ.14,008 కోట్ల విలువైన పనులకుగాను రూ.8,786 కోట్ల పనులు(66%) జరుగుతున్నాయి.

* పరిపాలన నగరంలో నిర్మిస్తున్న సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు 2020 జులై 18కి సిద్ధమవుతాయని శ్రీధర్‌ తెలిపారు. హైకోర్టు భవనానికి సంబంధించిన తొలి దశ నిర్మాణం 2020 సెప్టెంబరు 28నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

216 కి.మీ.ల రహదారుల నిర్మాణం పూర్తి
రాజధానిలో 216 కి.మీ.ల మేర రహదారుల నిర్మాణం పూర్తయిందని, భూసేకరణ సమస్యల కారణంగా 320 కి.మీ.ల మేర రహదారుల పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి వివరించారు. జులైనాటికి 36 వంతెనలు పూర్తి చేస్తామన్నారు.

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...