Jump to content

Amaravati


Recommended Posts

మెగా.. మెట్రో
24-02-2019 08:11:32
 
636865926907710826.jpg
  • లైట్‌ మెట్రో కారిడార్‌కు తుది డీపీఆర్‌ సిద్ధం
  • మొత్తం 80 కిలోమీటర్లు..
  • రూ.25 వేలకోట్ల వ్యయం?
  • 68 నుంచి 80 కిలోమీటర్లకు పెరిగిన నిడివి
  • జక్కంపూడికి రెండు కారిడార్లు
  • మూడు ఫేజుల్లో పనులకు ప్రణాళికలు
రాజధానికే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు.. ‘మెగా కారిడార్‌’గా అవతరించబోతోంది. మొత్తం 80 కిలోమీటర్ల నిడివిలో.. రూ.25వేలకోట్ల వ్యయంతో లైట్‌ మెట్రో ప్రాజెక్టు అంతిమ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది! ఈనెల 28న ఫైనల్‌ డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కి అందించబోతోంది! మరో నాలుగురోజుల్లో నగర, రాజధాని అనుసంధాన లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఏమిటన్నది బహిర్గతం కానుంది.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): మహా కారిడార్లతో రూ. 25 వేలకోట్ల వ్యయంతో కూడుకున్న లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు వ్యయ ప్రతిపాదనలతో ఫైనల్‌ డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ సిద్ధం చేసింది. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు రాజధాని ప్రాంత లైట్‌ మెట్రో కారిడార్ల నిడివి 80 కిలోమీటర్ల వరకు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రిలిమనరీ డీపీఆర్‌లో 68కిలోమీటర్ల నిడివి మేర పొం దుపరచగా.. తుది డీపీఆర్‌లో అదనంగా మరో 12 కిలోమీటర్లు పెరిగింది. రాజధాని ప్రాంతంలో ఆర్థిక నగరం జక్కంపూడి ప్రాంతానికి తుది డీపీఆర్‌లో రెండు కారిడార్లను ప్రతిపాదించటం విశేషం. భౌగోళికంగా ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్‌కు ఈస్ట్‌ వైపు నుంచి ఒక కారిడార్‌ను, వెస్ట్‌ నుంచి రెండవ కారిడార్‌ను జక్కంపూడికి తీసుకువెళ్లాలన్నది శిస్ర్టా అంచనాగా ఉంది. దీనికి సంబంధించి రెండు డిజైన్లను ఆ సంస్థ సిద్ధం చేసినట్టు సమాచారం. జక్కంపూడికి రెండు కారిడార్లతో పాటు అసలు ఈ ప్రాంతానికి లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్‌ ఎంతవరకు అవసరమన్న దానిపై కూడా ప్రత్యా మ్నాయ నివేదికను తుది డీ పీఆర్‌లో పొందు పరిచినట్టు సమాచారం. దీని ప్రకారం లైట్‌ మెట్రో కాకుండా సత్వర రవాణా వ్యవస్థలకు సంబంధించి ఏ విధానాన్ని అవలంబించవచ్చో సూచించినట్టు తెలిసింది. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించిందన్నది ఫైనల్‌ డీపీఆర్‌ పూర్తిగా బహిర్గతమయ్యే వరకు వేచి చూడాల్సిందే. జక్కంపూడికి కేవలం నాలుగువేల పీహెచ్‌పీడీటీ మాత్రమే ఉందని తె లుస్తోంది. పీహెచ్‌పీడీటీ అంటే పీక్‌ అవర్‌లో ప్రయాణీకుల సంఖ్య.
 
 
రూ. 25 వేలకోట్ల ప్రాజెక్టు వ్యయం
మెగా కారిడార్‌ నేపథ్యంలో, ప్రాజెక్టు వ్యయం కూడా తగ్గట్టుగానే పెరిగింది. మొత్తం 25 వేలకోట్ల వరకు ప్రాజెక్టు వ్యయం అవుతుందని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు సివిల్‌ కాస్ట్‌ తో పాటు, కాస్టింగ్‌, కోచెస్‌, ఎలక్ర్టిఫికేషన్‌ తదితరాలతోపాటు, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున భూసేకరణ కు వెచ్చించాల్సిన మొత్తానికి సంబంధించి అన్ని వ్యయాలను కలుపుకుని రూ.25 కోట్లుగా పేర్కొన్నట్టు తెలిసింది.
 
 
భూగర్భమార్గం
అమరావతి రాజధానిలోకి వెళ్ళే కారిడార్‌ను పూర్తిగా భూగర్భ కారిడార్‌గా ఏర్పాటు చేయాలని కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ సూచించింది. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ నుంచి రాజధాని ప్రాంతంలో పోల్కంపాడు, ఉండవల్లి సెంటర్‌, ఇస్కాన్‌ టెంపుల్‌. ఉండవల్లి, వెంకటపాలెం (ఈస్ట్‌), వెంకటపాలెం (వెస్ట్‌), తాళ్లాయపాలెం, మందడం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెంల వరకు భూగర్భ మార్గంలోనే లైట్‌మెట్రో రైల్‌కారిడార్‌ వెళుతుంది. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విమానాలకు ఇబ్బందిగా లేకుండా ఉండటానికి లోపల వరకు పూర్తిగా అండర్‌ గ్రౌండ్‌ విధానంలోనే నిర్మించేందుకు ప్రతిపాదించింది.
 
 
మూడు ఫేజుల్లో ..
తుది డీపీఆర్‌ చేతికి రాగానే.. అత్యున్నత కమిటీ ముందు చర్చించిన తర్వాత ఏ విధానంలో వెళ్లాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తగిన గైడ్‌లెన్స్‌ తీసుకోనున్నారు. మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించటమా? లేకపోతే ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ముందుకు వెళ్లటమా? అన్నది నిర్ణయం తీసుకున్నాక ఆ మేరకు అడుగులు వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే జాప్యమౌతుందనుకుంటే ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇన్నోవేటివ్‌ పీపీపీ విఽధానంలో అయితే సివిల్‌ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేయించే అవకాశం ఉంది. నిర్వహణ ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి. ప్రత్యేక ప్యాకేజీ కింద విదేశీ రుణ సంస్థల నుంచి తీసుకునే అప్పులను కేంద్రం భరించాల్సి ఉంటుంది కాబట్టి.. ఆ పద్దతిలో వెళ్ళే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ఈ విధానంలో వెళితే రెడీగా ఆర్థిక సంస్థలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన కేఎ్‌ఫడబ్లూ సంస్థ ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తితో ఉంది. ఇప్పటికే ఈ సంస్థ తన సొంత ఖర్చుతో ఉచితంగా డీపీఆర్‌ రూపకల్పనకు కృషి చేసింది. ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే!
 
 
కారిడార్ల నిడివి..
ప్రిలిమనరీ డీపీఆర్‌లో కారిడార్ల నిడివి మొత్తంగా 68 కిలోమీటర్ల మేర ఉండగా.. తుది డీపీఆర్‌లో అది 80 కిలోమీటర్లకు పెరగటం గమనార్హం. ఇంతకు ముందు ఏలూరు కారిడార్‌ను గన్నవరం బస్‌స్టేషన్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు, తిరిగి అక్కడి నుంచి కేసరపల్లి, నిడమానూరు వరకు 12 కిలోమీటర్లు, తిరిగి నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్‌, ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌ నుంచి బస్‌స్టేషన్‌ వరకు 13 కిలోమీటర్లు, బస్‌స్టేషన్‌ నుంచి ఇదే కారిడార్‌ను అమరావతికి తీసుకు వెళ్ళటానికి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు 14 కిలోమీటర్లు, తిరిగి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ అమరావతి వరకు 24 కిలోమీటర్ల మేర పొందు పరిచారు. జక్కంపూడికి నిర్దిష్టంగా సూచించలేదు. ఫైనల్‌ డీపీఆర్‌లో మాత్రం జక్కంపూడికి రెండు మార్గాలను సూచించింది. రైల్వేస్టేషన్‌కు వెస్ట్‌ నుంచి వెళ్ళే కారిడార్‌ను 6.3 కిలోమీటర్లు, ఈస్ట్‌ వైపు నుంచి వెళ్ళే కారిడార్‌ను 8.2 కిలోమీటర్ల మేర ప్రతిపాదించటం గమనార్హం.
Link to comment
Share on other sites

జలాభిముఖం.. అమరావతి నగరం

 

జలసిరులతో అలరారనున్న రాజధాని
3 బ్యారేజిలు... 97 కిలోమీటర్ల పొడవునా గలగలలు
దాదాపు 16 టీఎంసీల నీటి నిల్వలు
పైన పులిచింతల.. అందులో 45 టీఎంసీల నీటి నిల్వ

23ap-story1a_4.jpg

నవ్యాంధ్రకు రాజధానిగా మకుటాయమానంగా రూపుదిద్దుకుంటోన్న అమరావతి నగరం సమీప భవిష్యత్తులో జలసిరులతో అలరారనుంది. రాజధానికి ఆనుకుని ఇప్పటికే ప్రకాశం బ్యారేజి ఉంది. ఎగువన వైకుంఠపురం బ్యారేజికి శంకుస్థాపన జరిగింది. దిగువన త్వరలో  చోడవరం బ్యారేజి రానుంది. వీటికి ఎగువన పులిచింతల ప్రాజెక్టు సైతం ఉండనే ఉంది. రాజధానిని ఆనుకుని ఆపైన రమారమి 97 కిలోమీటర్ల పొడవునా కృష్ణమ్మ గలగలలు వినిపించనున్నాయి. దానికి అభిముఖంగా జలసిరులు కొత్తందాలు తేనున్నాయి. పర్యాటకానికి అదనపు హంగులు అద్దనున్నాయి.

నీరు ఎక్కడ నుంచి ఎలా..
పులిచింతల ప్రాజెక్టులో మిగులు జలాలతో పాటు, దానికి ఇవతల ఉన్న వాగులు, వంకల నుంచి వచ్చే నీరంతా ఈ మూడు బ్యారేజీలకు ప్రాణాధారమవుతుంది. పులిచింతల దిగువన పాలేరు, మున్నేరు, కట్టలేరు, వైరాల నుంచి ప్రవాహాలు వచ్చి కృష్ణా నదిలో చేరతాయి. కొండవీటి వాగూ ఒక ఆధారం. మరోవైపు కోతుల వాగు, కప్పలవాగు, ఇప్పలవాగు, గుర్రాల వాగు, ఏనుగుగడ్డ వాగు, పడమటి వాగు, నల్లవాగు తదితరాల నుంచి పై ఏరులకు ప్రవాహాలు చేరుతుంటాయి. గత 15 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి ప్రకాశం బ్యారేజిలో చుక్క కూడా మిగులు జలం లేని పరిస్థితి ఏర్పడింది.

అద్భుత వరం.. ఎన్టీఆర్‌ జలసాగరం
కృష్ణానదికి దిగువన చోడవరం బ్యారేజి నుంచి ఎగువన వైకుంఠపురం బ్యారేజి చివరి వరకు మొత్తం 97 కిలోమీటర్ల పొడవునా నీరు నిల్వ ఉంటుంది. దీనికి ఎన్టీఆర్‌ జలసాగరంగా నామకరణం చేస్తున్నాం. ఒక నగరం ఇంత విస్తృతంగా జలాభిముఖంగా ఎక్కడా రూపుదిద్దుకోలేదు. ఇది రాజధాని అమరావతి అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు లభించిన ఓ అద్భుత వరం.

- దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల మంత్రి

దిగువన చోడవరం బ్యారేజి నిర్మాణం

* ప్రకాశం బ్యారేజికి దిగువన
* అంచనా వ్యయం: రూ.899 కోట్లు
* నిల్వ: దాదాపు 2.70 టీఎంసీలు
నీటి విస్తరణ:
* ఎగువన ప్రకాశం బ్యారేజి
* వరకు 12కి.మీ. మేర

ప్రకాశం బ్యారేజి..

విజయవాడ నగరాన్ని ఆనుకుని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ప్రకాశం బ్యారేజి నిర్మించారు.
* నిల్వ సామర్థ్యం: 3 టీఎంసీలు
* ఉద్దేశం: కృష్ణా డెల్టా సాగు, తాగునీటి అవసరాలు తీర్చటం
* నీటి విస్తరణ: బ్యారేజీకి ఎగువన 23.22కి.మీ. వరకు

అక్కడే వైకుంఠపురం బ్యారేజి!

ప్రకాశం బ్యారేజి నిల్వ నీటి చివరి ప్రాంతం వైకుంఠపురం సమీపంలో కొత్తగా బ్యారేజి నిర్మిస్తున్నారు.
* అంచనా వ్యయం: రూ.2169 కోట్లు
* నిర్మాణం: దాములూరు, వైకుంఠపురం గ్రామాల మధ్య
* మొత్తం నిల్వ: 10 టీఎంసీలు
* ఉద్దేశం: రాజధాని తాగునీటి అవసరాలు తీర్చటం
* నీటి విస్తరణ: దాదాపు పులిచింతల ప్రాజెక్టు వరకు

23ap-story1b_2.jpg

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...