Jump to content

Amaravati


Recommended Posts

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిలో ప్రతి నిర్మాణం నిత్యనూతనం, వినూత్నమైనదే. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమరావతి నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు, భవనాలు ఇక్కడ కొలువుదీరాయి.

రాజధానికి మణిహారంగా భావిస్తున్నసీడ్‌యాక్సిస్‌ రహదారి తుది దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉండవల్లి నుంచి దొండపాడు గ్రామం వరకు సుమారు 21 కిలోమీటర్ల మేరకు.. ఆరు వరుసలతో అత్యంత నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలతో పటిష్ఠంగా దీనిని నిర్మిస్తున్నారు.

అమరావతిని గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా రహదారికిరువైపులా భారీగా మొక్కలను నాటారు. నీరు చుక్క కూడా నిలవకుండా రోడ్డుకిరువైపులా ప్రత్యేక డ్రైనేజీల నిర్మాణంతోపాటు భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు, వివిధ కేబుళ్ల నిమిత్తం రహదారిని తవ్వకుండా పవర్‌డక్టులనూ ఏర్పాటు చేస్తున్నారు

https://pbs.twimg.com/media/DzvnIsjU8AEfifF.jpg:large

Link to comment
Share on other sites

5 hours ago, Yaswanth526 said:

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిలో ప్రతి నిర్మాణం నిత్యనూతనం, వినూత్నమైనదే. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమరావతి నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు, భవనాలు ఇక్కడ కొలువుదీరాయి.

రాజధానికి మణిహారంగా భావిస్తున్నసీడ్‌యాక్సిస్‌ రహదారి తుది దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉండవల్లి నుంచి దొండపాడు గ్రామం వరకు సుమారు 21 కిలోమీటర్ల మేరకు.. ఆరు వరుసలతో అత్యంత నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలతో పటిష్ఠంగా దీనిని నిర్మిస్తున్నారు.

అమరావతిని గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా రహదారికిరువైపులా భారీగా మొక్కలను నాటారు. నీరు చుక్క కూడా నిలవకుండా రోడ్డుకిరువైపులా ప్రత్యేక డ్రైనేజీల నిర్మాణంతోపాటు భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు, వివిధ కేబుళ్ల నిమిత్తం రహదారిని తవ్వకుండా పవర్‌డక్టులనూ ఏర్పాటు చేస్తున్నారు

https://pbs.twimg.com/media/DzvnIsjU8AEfifF.jpg:large

Super,expected completion date eppduu

Link to comment
Share on other sites

రాజధానిలో నీటి సరఫరాకు ప్రణాళిక

kri-brk3a_55.jpg

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: నవ్యాంధ్ర రాజధానిలో ఆధునిక స్మార్ట్‌ వాటర్‌ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.లక్ష్మీపార్థసారథి తెలిపారు. స్మార్ట్‌ వాటర్‌ అండ్‌ వేస్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం తమిళనాడులోని మహాబలిపురంలో రక్షితనీటిపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో  పాల్గొన్న లక్ష్మీపార్థసారథి.. అమరావతిలో ఏడీసీ చేపడుతున్న రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టుపై ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం రాజధాని నగరంలో 2050 నాటికి 3 మిలియన్ల జనాభాకు అనుగుణంగా 24్ఠ7 తరహాలో నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఈ సభలో వివిధ రాష్ట్రాల నుంచి పట్టణాభివృద్ధి సంస్థల  ప్రతినిధులు, ఏడీసీ ముఖ్య ఇంజినీర్‌ టి.మోజెస్‌ కుమార్‌ పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

ఫైబర్‌నెట్‌లో రాజధాని నిర్మాణ పనుల ప్రసారం

 

19ap-state1a_3.jpg

ఈనాడు- విజయవాడ: ప్రభుత్వ కార్యక్రమాలను ఏపీ ఫైబర్‌నెట్‌ ప్రజల వద్దకు చేర్చుతోంది. అమరావతి పనులు జరిగే ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటుచేసింది. ఇక్కడికి వచ్చి చూడలేని వారి కోసం కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా చూసే ఆప్షన్‌ను ఫైబర్‌నెట్‌ టీవీ ద్వారా ప్రభుత్వం కల్పించింది. ఇటీవల ఇది ప్రారంభమైంది. ఫైబర్‌టీవీలో సర్విలెన్స్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే నిర్మాణాలను చూడొచ్చు. ప్రస్తుతానికి తాత్కాలిక హైకోర్టు పనులు, అఖిలభారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్జీవోలు, పేదల గృహసముదాయాల నిర్మాణాల ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటుచేశారు. వీటిని ఫైబర్‌నెట్‌కు అనుసంధానించారు. దీంతో పనులు ప్రత్యక్షంగా ప్రసారమవుతున్నాయి. మొత్తం 6 కెమెరాల ద్వారా అమరావతి పనుల దృశ్యాలను అందిస్తున్నారు.

పోలవరం నిర్మాణం 65 శాతం పూర్తయిందని ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టును చూసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి నిత్యం ఆర్టీసీ బస్సులను నడిపిస్తోంది. దీని నిర్మాణానికి సంబంధించిన దృశ్యాలను గతేడాది నుంచి ఫైబర్‌నెట్‌ ద్వారా ప్రసారం చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లోని 5 కెమెరాలనుంచి వచ్చే దృశ్యాలను ప్రసారం చేస్తున్నారు. స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌, స్పిల్‌ఛానల్‌ 2, ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ రిగ్‌, కాఫర్‌డ్యామ్‌ తదితర పనుల తీరును టీవీ ద్వారా లక్షలాది ప్రజలు వీక్షిస్తున్నారు.

 

Link to comment
Share on other sites

ఐడీఎస్‌ ఏర్పాటుకు 10 ఎకరాల కేటాయింపు

 

ఈనాడు, అమరావతి: ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం తరహాలో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న అభివృద్ధి అధ్యయన సంస్థ (ఐడీఎస్‌)కు 10ఎకరాలను కేటాయిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి నగరానికి అవతల కేటాయించేలా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ సొసైటీ రిజిస్ట్రేషన్‌ చట్టం కింద ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

Link to comment
Share on other sites

ఫ్లాటు 3.5 కోట్లు
21-02-2019 03:47:36
 
636863176577176235.jpg
  • గంటల్లోనే 142 ఫ్లాట్ల బుకింగ్‌ పూర్తి
  • అమరావతిపై ప్రవాసుల క్రేజ్‌
  • రూ.500 కోట్లతో ‘ఎన్నార్టీ ఐకాన్‌’
  • 33 అంతస్తుల్లో అత్యాధునిక నిర్మాణం
  • వాణిజ్య అవసరాలకూ వినియోగం
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం ఐదువేల చదరపు అడుగులు! ధర దాదాపు రూ.3.5 కోట్లు! మొత్తం 142 ఫ్లాట్లు! ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే అమ్మకం! అయినా సరే... గంటల్లోనే మొత్తం ఫ్లాట్లు అయిపోయాయి. ఇది అమరావతి మహిమ! అమరావతిలో ఏపీఎన్నార్టీ నిర్మిస్తున్న ‘ఎన్నార్టీ ఐకాన్‌’లోని ఫ్లాట్లను బుధవారం ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. భారీ డిమాండ్‌ నేపథ్యంలో ఒకేసారి ఎక్కువమంది లాగిన్‌ కావడానికి ప్రయత్నించడంతో సర్వర్‌ డౌన్‌ అయిపోయింది. సర్వర్‌ను పునరుద్ధరించిన కొన్ని నిమిషాల్లో ఫ్లాట్లన్నీ బుక్‌ అయిపోయాయి. అమరావతిలో అత్యంత కీలకమైన పరిపాలనా నగరి సమీపంలో ఏపీఎన్నార్టీ రూ.500 కోట్లతో, అత్యాధునిక హంగులతో ‘ఎన్నార్టీ ఐకాన్‌’ పేరిట 33 అంతస్థుల భవనం నిర్మిస్తోంది. ఏపీఎన్నార్టీ సొసైటీ ఆఽధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇందులో 150 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఈ ఫ్లాట్‌ను వాణిజ్యపరంగా కార్యాలయాలకు, నివాసం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులోనే రివాల్వింగ్‌ హోటల్‌, స్విమ్మింగ్‌ పూల్‌లాంటి సదుపాయాలు ఉంటాయి. రాయపూడి సమీపంలో కృష్ణా నదికి దగ్గరలో ఐదెకరాల్లో ఈ ఐకాన్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు.
 
రాజధానిలో అత్యధిక ధర ఇదే
ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్‌ను ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మొత్తం 150 ఫ్లాట్లలో 142 ఫ్లాట్లు మాత్రం బుకింగ్‌కు పెట్టారు. ఒక్కో చదరపు అడుగు ధర రూ.5500గా నిర్ణయించారు. ఇది బేసిక్‌ ధర. ఫ్లోర్‌ పెరిగే కొద్దీ రేటు పెరుగుతుంది. అదే సమయంలో ఇతరత్రా సౌకర్యాల కోసం కొంత సొమ్ము చెల్లించాలి. మొత్తంగా చూస్తే సగటున ఒక్కో చదరపు అడుగు రూ.7వేల వరకు పడుతుంది. రాజధానిలోనే ఇది అత్యధిక ధర. ఇటీవల సంచలనం సృష్టించిన హ్యాపీనె్‌స్టలో బేసిక్‌ ధర, ఇతర సౌకర్యాల మొత్తం అన్నీ కలిపితే రూ.4,500వరకు నిర్ణయించారు.
 
ఇది పూర్తిగా నివాసానికి ఉద్దేశించిన ప్రాజెక్టు. ఎన్నార్టీ ఐకాన్‌ను అటు నివాసపరంగా, ఇటు వాణిజ్యపరంగా కూడా ఉపయోగపడేలా నిర్మిస్తున్నారు. ఇందులో ఐటీ కంపెనీలు పెట్టుకునే కమర్షియల్‌ స్థలం కూడా ఉంటుంది. కృష్ణా నది సమీపంలో... సహజమైన గాలి, వెలుతురు ఉండేలా విదేశీ ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు రూపొందించారు. అమరావతిని సూచించే విధంగా ఆంగ్ల అక్షరం ‘ఎ’ ఆకారంలో ఈ భవన నిర్మాణం చేపడతారు. ‘ఎ’ అక్షరం మధ్యలో పెద్ద గ్లోబ్‌ ఏర్పాటు చేస్తారు. ఎన్నార్టీ ఐకాన్‌లో కొన్ని ఐటీ కంపెనీలకు కూడా స్పేస్‌ ఉంచుతున్నారు. పెద్దగా ప్రచారం కూడా చేయకుండానే ఫ్లాట్ల బుకింగ్‌కు వెళ్లారు. అయినప్పటికీ అమరావతి బ్రాండ్‌, వాణిజ్యపరంగా ఉపయోగించుకునే వెసులుబాటు, కృష్ణా నదికి అభిముఖంగా ఉండడంతో ఎన్నారైలు పోటీ పడి బుక్‌ చేసేసుకున్నారు. ఈ ప్రాజెక్టులో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల వల్ల సుమారు ఐదువేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఎన్నార్టీ అధ్యక్షుడు రవికుమార్‌ వేమూరి తెలిపారు.
Link to comment
Share on other sites

ఏపీఎన్‌ఆర్‌టీ చుట్టూ 100 ఫ్లాట్లు 

 

‘యు’ ఆకారంలో నిర్మాణం... నెల రోజుల్లో అమ్మకానికి 
ఐకాన్‌ భవనం కింద సర్వీస్‌ అపార్టుమెంట్లు... వాణిజ్య సముదాయాలు 
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

21ap-main2a_3.jpg

ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) భవనం చుట్టూ ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో కొత్తగా 100 ఫ్లాట్లు రానున్నాయి. ఒక్కొక్క ఫ్లాటు విస్తీర్ణం 3000- 4000 చదరపు అడుగులు ఉంటుంది. డిజైన్‌ను రెండ్రోజుల క్రితమే ఆమోదించారు. వీటిని నెల రోజుల్లో బుకింగ్‌కు ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కేవలం ఎన్‌ఆర్‌ఐల ద్వారా సేకరించిన మొత్తంతోనే ఏపీఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనాన్ని అత్యాధునిక హంగులతో కృష్ణా నదికి సమీపంలో నిర్మించనున్నారు. అమరావతి పరిపాలన నగరికి చేరువగా రూ.500 కోట్లతో 33 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు ఈ భవనం చుట్టూ కొత్తగా నిర్మించే వంద ఫ్లాట్లను ఎన్‌ఆర్‌ఐలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భవనం కింది భాగంలో సర్వీస్‌ అపార్టుమెంట్లు (హోటళ్లు), వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకువస్తారు. ఒక్కొక్కటి వెయ్యి నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి. వీటిని వారం రోజుల్లో బుకింగ్‌కు ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో చ.అ. కనీస ధర రూ.7,000కి మించి ఉండే అవకాశం ఉంది. 
హాట్‌ కేకుల్లా 124 ఫ్లాట్ల అమ్మకం 
ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ప్రారంభించిన గంట వ్యవధిలోనే ఏపీఎన్‌ఆర్‌టీ భవనంలో 124 ఫ్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆంగ్ల ఆక్షరం ‘ఎ’ అకారంలో ఉండే ఐకాన్‌ భవనంలో మొత్తం 132 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్కటి 5,000 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తారు. వీటిని నివాసాలుగానే కాకుండా కార్యాలయాలకూ వినియోగించుకోవచ్చు. ఇందులోనే రివాల్వింగ్‌ హోటల్‌, ఈత కొలను వంటివీ ఉంటాయి. ఒక్కో చ.అ. కనీస ధర రూ.5,500గా నిర్ణయించారు. 80 శాతం మేర ప్రవాసాంధ్రులు అమెరికా నుంచే బుకింగ్‌ చేసుకున్నారు. కువైట్‌, యూకే, ఆస్ట్రేలియాలలో ఉన్నవారి నుంచి కూడా ఆసక్తి వ్యక్తమయింది. అమరావతి సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు ఐకాన్‌ భవన డిజైన్‌ను తీర్చిదిద్దారు. భవనం మధ్యలో గ్లోబ్‌ ఆకారంలో నిర్మాణాన్ని ఎల్‌ఈడీ బల్బులతో నింపనున్నారు. గ్లోబ్‌ కింది భాగంలో లేజర్‌ దీపాలను ఏర్పాటు చేస్తారు. వీటి సాయంతో అత్యాధునిక 7డీ సాంకేతికతను ఉపయోగించి ప్రతిరోజూ రాత్రి 7:30, 9:30 గంటలకు లేజర్‌ షోను సందర్శకులు తిలకించేలా ఏర్పాటు చేస్తారు.

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...