Jump to content

Amaravati


Recommended Posts

 

 

an interesting comment below this video in YT.. 

but I couldn't find any evidence though..

This technology was developed by Late Meritorious G.D.Naidu Garu of Koyama Pudur (now, known as Coimbattore, Tamil Nadu) during early 1950's. Andhras never appreciate or recognise another Andhra-Man. This is a disease or TEGULU of Telugu people. I am sorry to say. Readers will forgive me.
 
But Mr. G.D.Naidu is also referred to as the Edison of India.
as per this wiki link..
 
Edited by AnnaGaru
Link to comment
Share on other sites

చకచకా నిర్మాణాలు 

రంగులద్దుకొంటున్న ఏఐఎస్‌ అధికారుల భవన సముదాయం 
తుళ్ళూరు, న్యూస్‌టుడే

amr-brk2a_50.jpg

రాజధాని గ్రామాల్లో తొలి సారిగా భారత ప్రభుత్వ సర్వీసు అధికారుల(ఏఐఎస్‌) నివాస భవనాలు వినియోగంలోకి రానున్నాయి. అమరావతిలో ప్రభుత్వ నివాస భవన సముదాయాల పరిధిలో నిర్మిస్తున్న ఐఏఎస్‌ల నివాస భవనాలు నిర్మాణం పూర్తి చేసుకొని రంగులద్దుకొంటున్నాయి. శాశ్వత సచివాలయం నిర్మాణాల పక్కనే నిర్మించిన భవనాలు ఈ నెలాఖరునాటికి అందుబాటులోకి రానున్నాయి. 
ఆరు టవర్లు... 144 ఫ్లాట్లు 
ఎన్‌సీసీ నిర్మిస్తున్న భవనాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఆరు టవర్లుగా భవనాలను నిర్మించారు. ఒక్కో టవర్‌లో 12 అంతస్థులు ఉన్నాయి. ఒక్కో అంతస్థులో రెండేసి ఫ్లాట్లు చొప్పున 24 ఫాట్లలో అధికారులు నివాసం ఉంటారు. ఇలా ఆరు టవర్లలో 144 మంది ఏఐఎస్‌ అధికారులు నివాసం ఉంటారు. 
నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో నిర్మాణం 
2017 నవంబరు 13న భూమి పూజ చేసుకున్న ఏఐఎస్‌ అధికారుల నివాస భవనాల నిర్మాణం ఈ నెల 12 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. నిర్మాణం మొదలు పెట్టిన నాటి నుంచి 15 నెలలలోపు పనులు పూర్తి చేస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ)తో గుత్తేదారు ఒప్పందం కుదుర్చు కున్నారు. పనుల్లో వేగాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు సార్లు నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్రమంత్రి పి.నారాయణ ఏడు ఇంతవరకూ ఏడు సార్లు పనులను పరిశీలించి పనుల్లో వేగం పెంచేదిశగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం భవనాలకు రంగులు వేస్తూ పనులను వేగవంతం చేశారు.

 

Link to comment
Share on other sites

మరో 8 సంస్థలకు స్థల కేటాయింపు
06-02-2019 08:49:22
 
అమరావతి,(ఆంధ్రజ్యోతి): అమరావతిలో మరొక 8 సంస్థలకు మొత్తం 51.15 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఉత్తర్వులను వెలువరించింది. డాక్టర్‌ ఎన్టీయార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 25 ఎకరాలను, ఎన్‌.ఎ్‌సటి. మ్యాథ్యూస్‌ పబ్లిక్‌ స్కూల్‌ (సెయింట్‌ గేబ్రియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ)కి 3 ఎకరాలను, శతికంఠ గుహా ఫౌండేషన్‌కు 3 ఎకరాలను ఎకరం రూ.50 లక్షల ధరకు కేటాయించింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి 12 ఎకరాలను, రామకృష్ణ మిషన్‌కు 2.50 ఎకరాలను ఎకరం రూ.10 లక్షలకు ఇచ్చింది. యంగ్‌మెన్స్‌ క్రిస్టియన్స్‌ అసోసియేషన్‌ (వై.ఎం.సి.ఎ.)కు 2.65 ఎకరాలను ఎకరం రూ.50 లక్షల ధరకు కేటాయించింది. జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జడ్‌.ఎ్‌స.ఐ.)కు 2 ఎకరాలను (60 సంవత్సరాలపాటు లీజు ప్రాతిపదికన) ఎకరానికి రూ.కోటి మరియు చదరపు మీటర్‌కు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దెకు కేటాయించింది. క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌కు చ.మీ.కు, ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దెకు, 33 సంవత్సరాలపాటు లీజు రూపేణా ఇచ్చింది. పైన పేర్కొన్న సంస్థలకు అనువైన ప్రదేశాల్లో స్థలాలను కేటాయించాల్సిందిగా ఏపీసీఆర్డీయే కమిషనర్‌ను ఆదేశించింది.
మరో 8 సంస్థలకు స్థల కేటాయింపు
06-02-2019 08:49:22
 
అమరావతి,(ఆంధ్రజ్యోతి): అమరావతిలో మరొక 8 సంస్థలకు మొత్తం 51.15 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఉత్తర్వులను వెలువరించింది. డాక్టర్‌ ఎన్టీయార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 25 ఎకరాలను, ఎన్‌.ఎ్‌సటి. మ్యాథ్యూస్‌ పబ్లిక్‌ స్కూల్‌ (సెయింట్‌ గేబ్రియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ)కి 3 ఎకరాలను, శతికంఠ గుహా ఫౌండేషన్‌కు 3 ఎకరాలను ఎకరం రూ.50 లక్షల ధరకు కేటాయించింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి 12 ఎకరాలను, రామకృష్ణ మిషన్‌కు 2.50 ఎకరాలను ఎకరం రూ.10 లక్షలకు ఇచ్చింది. యంగ్‌మెన్స్‌ క్రిస్టియన్స్‌ అసోసియేషన్‌ (వై.ఎం.సి.ఎ.)కు 2.65 ఎకరాలను ఎకరం రూ.50 లక్షల ధరకు కేటాయించింది. జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జడ్‌.ఎ్‌స.ఐ.)కు 2 ఎకరాలను (60 సంవత్సరాలపాటు లీజు ప్రాతిపదికన) ఎకరానికి రూ.కోటి మరియు చదరపు మీటర్‌కు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దెకు కేటాయించింది. క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌కు చ.మీ.కు, ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దెకు, 33 సంవత్సరాలపాటు లీజు రూపేణా ఇచ్చింది. పైన పేర్కొన్న సంస్థలకు అనువైన ప్రదేశాల్లో స్థలాలను కేటాయించాల్సిందిగా ఏపీసీఆర్డీయే కమిషనర్‌ను ఆదేశించింది.

 

Link to comment
Share on other sites

అమరావతికి 51,687 కోట్లు
06-02-2019 04:08:12
 
636850228932426585.jpg
  • రుణంగా రూ. 37,112 కోట్లు సేకరణ..
  • ఏటా రూ.1800 కోట్లు చొప్పున ఏడేళ్లు
  • 812,600 కోట్లు ఇవ్వనున్న సర్కారు
  • బాండ్లద్వారా 500 కోట్ల సమీకరణ
  • సీఆర్డీయేకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ
  • సమగ్ర ఆర్థిక ప్రణాళికకు ఆమోదం
 
అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రణాళికను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించుకుంటూ, అవసరమైన సందర్భాల్లో సీఆర్డీయే అథారిటీ అనుమతితో ముందుకు సాగాలని సీఆర్డీయే కమిషనర్‌ను ఈ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ ఉత్తర్వులను అనుసరించి..
 
ప్రాజెక్ట్‌ అమరావతికి అయ్యే మొత్తం వ్యయం రూ.51,687 కోట్లుగా ఏపీసీఆర్డీయే అంచనా వేసింది. ఇందులో టైర్‌-1 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం (రాజధానిలో రహదారులు- యుటిలిటీలు, గ్రామాల్లో వసతుల కల్పన, హైవోల్టేజ్‌ విద్యుత్తు టవర్ల మళ్లింపునకు) రూ.18,769 కోట్లు, టైర్‌-2 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం(రాజధాని నగరంలోని అన్ని ప్రాంతాలు, ఎల్పీఎస్‌ లేఅవుట్లలో సకల మౌలిక వసతుల అభివృద్ధి) రూ.17,910 కోట్లు, అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తోపాటు బీఆర్టీఎ్‌సతో కూడిన అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు రూ.14,008 కోట్లు అవసరం. ఈ మొత్తంలో రూ.37,112 కోట్లను వివిధ మార్గాల ద్వారా రుణరూపేణా సమీకరించనున్నారు. ఈ రుణాల కోసం వివిధ ఆర్థిక సంస్థలు, వాణిజ్య బ్యాంకులను ఆశ్రయించేందుకు ఏపీసీఆర్డీయే కమిషనర్‌కు అధికారమిచ్చింది. ఇందుకోసం అమరావతిలోని ఆస్తులు, భూములను వాటికి తనఖా (సీఆర్డీయే అథారిటీ ఆమోదంతో ) పెట్టేందుకు అనుమతించింది. రాజధాని నిర్మాణానికి 2036-37 వరకు అవసరమైన రుణాలను సమకూర్చుకునేందుకు 3709 ఎకరాలను తనఖా పెట్టేందుకు అనుమతినిచ్చింది. అమరావతిలో ఆర్థికాభ్యున్నతికి దోహదపడేందుకుగాను 3254 ఎకరాలను రిజర్వ్‌ చేసింది.
 
 
ప్రాజెక్ట్‌ వ్యయంలో తనవంతుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదలుకుని 2026 వరకు, ఏడు సంవత్సరాలపాటు రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీయేకు ఏటా రూ.1,800 కోట్ల చొప్పున మొత్తం రూ.12,600 కోట్లను ఇవ్వనుంది. అయితే ఇది రుణరూపేణా ఉంటుంది. ఈ మొత్తాన్ని తదుపరి దశల్లో సీఆర్డీయే తనకు ఉన్న వాణిజ్య భూములను ఉపయోగించుకోవడం ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పబ్లిక్‌ బాండ్ల జారీ ద్వారా రూ.500 కోట్లను సమీకరించేందుకుగాను, వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. ఈ బాండ్లకు ఇవ్వాల్సిన వడ్డీరేటును (సీఆర్డీయే అథారిటీ ఆమోదముద్రతో) నిర్ణయించేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు అనుమతినిచ్చింది.
 
ఎస్‌ఐఐడీపీకి అనుమతి
అమరావతి సస్టెయినబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్‌కు(ఏఎ్‌సఐఐడీపీ) అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. విదేశీ ఆర్థిక సహాయంతో నడిచే పథకం (ఈఏపీ) అయినందున దీని అమలుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ఈ పథకానికి అయ్యే మొత్తం ఖర్చు 71.50 కోట్ల అమెరికన్‌ డాలర్లు. ఇందులో ప్రపంచ బ్యాంక్‌, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సంయుక్తంగా 50 కోట్ల డాలర్లను రుణంగా ఇస్తుండగా, మిగిలిన 21.50 కోట్ల యూఎస్‌ డాలర్లను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా భరించనుంది. ఈ పథకం ఏపీసీఆర్డీయే, ఏడీసీల ద్వారా అమలవుతుంది.
 
4,900 కోట్లతో శాశ్వత సెక్రటేరియట్‌
అమరావతికే మకుటాయమానంగా నిర్మించదలచిన శాశ్వత సచివాలయం- శాఖాధిపతుల కార్యాలయాలుండే ఐదు టవర్లను రూ.4,900 కోట్ల అంచనా వ్యయంతో తన తరపున నిర్మించేందుకు ఏపీసీఆర్డీయేకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) విధానంలో జరిగే ఈ టవర్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయేల మధ్య అవగాహన ఒప్పందం కుదరాల్సి ఉంది. ప్రతిపాదించిన ఎంవోయూ ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కు అయ్యే మొత్తం వ్యయంలో 20 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తుండగా, మిగిలిన 80 శాతం నిధులను హడ్కో, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలి. ఈ రుణాలకు 8.28 శాతం వడ్డీని ఇవ్వాలి. ఆ ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కు అయ్యే వ్యయం రూ.5404.20 కోట్లు కానుంది. రుణాలను తిరిగి చెల్లించేందుకు 12 సంవత్సరాల కాలవ్యవధిని నిర్దేశించిన ప్రభుత్వం అందులో ప్రిన్సిపల్‌ మారటోరియం పీరియడ్‌ మూడేళ్లని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమయ్యే రుణాలను టర్మ్‌ లోన్లుగా తీసుకునే సీఆర్డీయే, అందుకు ప్రభుత్వం తనకు చెల్లించే యాన్యుటీని గ్యారంటీగా చూపనుంది. 12 ఏళ్లపాటు ప్రభుత్వం ఏడాదికి రూ.582 కోట్లను (3 నెలలకోమారు రూ.145.70 కోట్ల చొప్పున) చెల్లిస్తుంది.
 
12 సంవత్సరాల తర్వాత సీఆర్డీయే సచివాలయ టవర్లను ప్రభుత్వానికి బదలాయిస్తుంది. ఈ టవర్ల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటిల్లోని కొంత స్థలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, ఇతర సంస్థలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై పడే రుణభారాన్ని తగ్గించాల్సిందిగా సీఆర్డీయేను ఆదేశించింది. రాజధాని వనరులను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు అన్ని అంచనాల తయారీ లోపరహితంగా జరిగేలా చూసేందుకు ఆర్‌అండ్‌బీ సహా వివిధ ప్రభుత్వ శాఖల సీఈలతో కూడిన టెక్నికల్‌ ఇవాల్యుయేషన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని, థర్డ్‌ పార్టీ ఏజన్సీలు, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్లను నియమించుకోవాలని కోరింది. తద్వారా ప్రపంచంలో, భారతదేశంలో ఇలాంటి ఆఫీస్‌ స్పేస్‌ల నిర్మాణానికి అయ్యే వ్యయానికి సమానంగా ఇక్కడి ఖర్చూ ఉండేలా చూడాలని ఆదేశించింది.
Link to comment
Share on other sites

14న బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు శంకుస్థాపన
06-02-2019 08:48:19
 
తుళ్లూరు: తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు ప్రాంతంలో ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం నేడు(బుధవారం) నుంచి భూమి చదును చేయనున్నారు. సీఆర్డీయే అధికారులు, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో మంగళవారం స్థల పరిశీలన చేశారు. ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి సీఆర్డీయే 15 ఎకరాలు కేటాయించింది. గతంలో బసవతారకం ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ ప్రదేశానికి పరిశీలించి వెళ్ళారు
Link to comment
Share on other sites

55,343 కోట్లతో రాజధాని ఆర్థిక ప్రణాళిక

 

ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలన నగర నిర్మాణానికి రూ.55,343 కోట్లతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) రూపొందించిన సమగ్ర ఆర్థిక ప్రణాళికను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మొత్తంలో రూ.51,687 కోట్లు మూలధన వ్యయం కాగా, రూ.3,656 కోట్లు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన వడ్డీ. మూలధన వ్యయంలో ప్రధాన రహదారులు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి,    రాజధాని మీదుగా వెళుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లను దారి మళ్లించడంవంటి పనులకు రూ.19,769 కోట్లు, రాజధాని రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.17,910 కోట్లు, అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయానికి రూ.14,008 కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. ఈ మొత్తంలో రూ.37,112 కోట్లను వివిధ ఆర్థిక సంస్థలు, వాణిజ్యబ్యాంకుల నుంచి సీఆర్‌డీఏ రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. రాజధానిలో సీఆర్‌డీఏ వాటాకు వచ్చే భూమిలో వివిధ సంస్థలకు కేటాయించగా మిగిలిన 5020 ఎకరాలను తనఖాగా ఉంచి రుణం తెచ్చుకోవాలన్నది ప్రతిపాదన. రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2018-19 నుంచి 2025-26 వరకు రూ.12,600 కోట్లను ఈక్విటీ, గ్రాంటు రూపంలో సమకూర్చనుంది. రీటెయిల్‌ బాండ్ల ద్వారా సీఆర్‌డీఏ  రూ.500 కోట్లు సమీకరించేందుకూ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.

రూ.4,900 కోట్లతో సచివాలయం, హెచ్‌వోడీ భవనాలు
రాజధానిలోని పరిపాలన నగరంలో రూ.4,900 కోట్ల వ్యయంతో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాల నిర్మాణానికి సీఆర్‌డీఏకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల కోసం ఐదు టవర్ల పనులు ఇప్పటికే మొదలయ్యాయి. వాటి నిర్మాణ వ్యయం రూ.4,900 కోట్లుగా, తెచ్చిన రుణాలపై ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన వడ్డీ రూ.504.20 కోట్లుగా సీఆర్‌డీఏ పేర్కొంది. ఈ మొత్తంలో 20 శాతం ప్రభుత్వ గ్రాంటుగా, మిగతా 80 శాతం రుణంగా పేర్కొంది.

ప్రపంచబ్యాంకు ప్రాజెక్టుకు ఆమోదం
అమరావతిలో ప్రపంచబ్యాంకు ఆర్థిక సహకారంలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టు అమలుకు సీఆర్‌డీఏకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రపంచబ్యాంకు నుంచి సీఆర్‌డీఏ 50 కోట్ల డాలర్ల రుణం తీసుకుంటోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌గ్రాంటుగా 21.5 కోట్ల డాలర్లు సమకూర్చనుంది. ఇది విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టు(ఈఏపీ) కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వంనుంచి సీఆర్‌డీఏ అనుమతి కోరింది.

 

Link to comment
Share on other sites

అమరావతిపై 39,937 కోట్ల ప్రతిపాదనలు

 

ఈనాడు, దిల్లీ: అమరావతిలో ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, ఇతర ముఖ్యమైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.39,937 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను నీతి ఆయోగ్‌ తమ అభిప్రాయం కోసం పంపించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో తెదేపా సభ్యుడు గల్లా జయదేవ్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు. ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను రాసి తిరిగి నీతి ఆయోగ్‌కు పంపినట్లు వెల్లడించారు.

Link to comment
Share on other sites

‘వెల్‌ బీయింగ్‌ సిటీ’ అవార్డుల పోటీలో అమరావతికి మొదటి ర్యాంక్‌

 

ఈనాడు, అమరావతి: కెనడాలోని మాంట్రియల్‌కి చెందిన ‘న్యూ సిటీస్‌’ సంస్థ నిర్వహిస్తున్న ‘వెల్‌ బీయింగ్‌ సిటీ’ అవార్డుల పోటీలో ఒక విభాగంలో తుది పోటీలో నిలిచిన నాలుగు నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మొదటి ర్యాంక్‌ దక్కించుకుంది. ‘ఆర్థికాభివృద్ధి- అవకాశాలు’ కేటగిరీలో అమరావతికి తొలి ర్యాంకు దక్కింది. తర్వాతి స్థానాల్లో షికాగో (అమెరికా), జుబ్‌జానా (స్లొవేనియా), పుణె(భారత్‌) ఉన్నాయి. ‘న్యూ సిటీస్‌’ సంస్థ మొదటిసారి ఈ పోటీలు నిర్వహిస్తోంది. మొత్తం నాలుగు కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలకు చెందిన 100 నగరాలు తలపడుతున్నాయి. ఈ విభాగాల్లో 16 నగరాల్ని తుది పోటీకి ఎంపిక చేశారు. ‘ఆర్థికాభివృద్ధి-అవకాశాలు’ కేటగిరీలో అమరాతి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. ఈ విభాగంలో అమరావతి మొదటి ర్యాంకులో నిలిచిందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతి కేటగిరీలో ఒక నగరాన్ని, మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఒక అత్యుత్తమ నగరాన్ని ఏప్రిల్‌లో ఎంపిక చేస్తారు. 2019 జూన్‌ లేదా జులైలో మాంట్రియల్‌లో జరిగే అంతర్జాతీయ వేడుకలో అవార్డులు అందజేస్తారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...