Jump to content

Amaravati


Recommended Posts

I hated the word Bhramaravati. Akkada inthaku mundu Amaresvaruni temple ki badhulu Bhramaramba temple emanna kanipinchidemo YCP vallaki? Meeru "From Bhramaravati ..." anatam  em  baga ledu.

Edited by Kumbk
Link to comment
Share on other sites

నవ్యాంధ్ర‌లో న్యాయ శకం 

 

హైకోర్టు భవనం ప్రారంభం 
శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన 
సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ రంజన్‌ గొగొయి చేతుల మీదుగా కీలక ఘట్టం ఆవిష్కరణ 
పాల్గొన్న సుప్రీం న్యాయమూర్తులు ఏపీ, తెలంగాణ హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌లు 
చరిత్రాత్మక రోజు: ముఖ్యమంత్రి చంద్రబాబు

3ap-main1a_5.jpg

హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవ శిలాఫలకం వద్ద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి దంపతులు, చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు


మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రరాష్ట్రం వేరుపడిన తర్వాత... రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉన్నప్పుడు గుంటూరు కేంద్రంగా హైకోర్టు ఏర్పాటైంది. 1954 జులై 5న గుంటూరులో ఏర్పాటైన హైకోర్టు... 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరించే వరకు అక్కడే కొనసాగింది. ఆ తర్వాత హైదరాబాద్‌కి మారింది. 

 

3ap-main1b_3.jpg

3ap-main1c_1.jpg

3ap-main1d.jpg

వ్యాంధ్ర చరిత్రలో నవ శకానికి నాందీ ప్రస్తావన జరిగింది. రాజధాని అమరావతి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి మెరిసింది. న్యాయపాలనలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రుల సాంస్కృతిక వారసత్వం, ఆధునికతల కలబోతగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలోని నేలపాడు వద్ద అత్యంత సుందరంగా నిర్మించిన రాష్ట్ర హైకోర్టు భవనం (జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌) వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆదివారం ప్రారంభమైంది. సమీపంలోనే హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికీ అంకురార్పణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌  టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌, ఉత్తరాఖండ్‌ సీజే జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, ఏపీ హైకోర్టు ఏసీజే జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, ఉభయ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

3ap-main1e.jpg

చరిత్రాత్మక రోజు 
ఘనంగా హైకోర్టు శాశ్వత భవనానికి శంకుస్థాపన

3ap-main1f.jpg

వేదమంత్రోచ్చరణ, మంగళవాయిద్యాల మధ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత అర్చకులు జస్టిస్‌ గొగొయికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ రంజన్‌ గొగొయి సతీమణి రూపాంజలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌, ఉత్తరాఖండ్‌ సీజే జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పురపాలకశాఖ మంత్రి నారాయణ, ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఏపీ, తెలంగాణ హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు హాజరయ్యారు. జస్టిస్‌ ఎన్వీ రమణ సతీమణి శివమాల, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ సతీమణి సుష్మితరెడ్డి, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జస్టిస్‌ గొగొయి.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు. జస్టిస్‌ సిటీ, అమరావతి రాజధాని నిర్మాణ వివరాల్ని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, ఇతర అధికారులు జస్టిస్‌ గొగొయి దంపతులకు వివరించారు.

అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న లిటిగేషన్లు తగ్గాలి: సీఎం

3ap-main1g.jpg

ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ పరిపాలనలో ఈ రోజు చరిత్రాత్మకమైనది. రాష్ట్ర విభజన జరిగిన నాలుగున్నరేళ్ల తర్వాత అమరావతి కేంద్రంగా హైకోర్టు ప్రారంభం కావటం గర్వకారణం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం అమరావతిలో శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన, జ్యుడిషియల్‌ కాంప్లెక్స్‌ భవన (హైకోర్టు తాత్కాలికంగా దీనిలోనే కొనసాగుతుంది) ప్రారంభ కార్యక్రమాల అనంతరం ఆయన ప్రసంగించారు. అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న లిటిగేషన్లను ఎలా తగ్గించాలనేదానిపై న్యాయస్థానాలు దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. అవి తగ్గితేనే మెరుగైన వృద్ధిరేటు సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి ద్వారా సంపద సృష్టించకపోతే పేదరిక నిర్మూలన సాధ్యం కాదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ అవసరమేనని, అదే సమయంలో ప్రకృతి రమణీయ ప్రదేశాలను పర్యాటకంగా వినియోగించుకునేందుకు వీలు ఉండాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ‘‘అమరావతిలో ఏర్పాటు చేసే నవనగరాల్లో ఒకటైన న్యాయనగరం (జస్టిస్‌ సిటీ)లో నల్సార్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు సహకరించాలి. అందుకు అవసరసమైన భూమి, కావాల్సిన నిధులు ఇస్తాం. సింగపూర్‌, హాంకాంగ్‌, లండన్‌ల తరహాలో మధ్యవర్తిత్వ, వివాద పరిష్కార కేంద్రాలు (ఆర్బిట్రేషన్‌, డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ సెంటర్‌)లను ఏర్పాటు చేయాలి. న్యాయ విద్యాలయాలను నెలకొల్పేందుకూ తోడ్పాటు అందించాలి.  హైకోర్టు ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాం. వారికి ఉచిత వసతి, రవాణా సదుపాయాలూ కల్పిస్తాం. రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 1.70 లక్షల పరిష్కారానికి సాంకేతికత వినియోగించుకోవొచ్చు’’ అని చంద్రబాబు సూచించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వారు భూములివ్వకపోతే ఈరోజు ఈ నిర్మాణాలేవీ సాధ్యమయ్యేవి కాదన్నారు. రాజధానిలో మౌలిక వసతులకు రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

3ap-main1h.jpg

Link to comment
Share on other sites

నైతికతే గీటురాయి 

 

ప్రజలకు న్యాయం చేయడంలో అదే కీలకం 
పేరుకున్న పెండింగ్‌ కేసులు న్యాయవ్యవస్థకు మచ్చే 
25లక్షల కేసుల్ని వెంటనే పరిష్కరించాలి 
392 హైకోర్టు జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి వెల్లడి 
సీఎం రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించారని వ్యాఖ్య 
రాష్ట్ర ప్రజలకు ఏపీ హైకోర్టు అంకితం

3ap-main5a_2.jpg

కోర్టు భవనాన్ని కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన నిర్మాణంగా మాత్రమే చూడకూడదు. న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే గొప్ప విలువైన చిహ్నంగా భావించాలి. ఏపీ హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అంకితం చేస్తున్నాను. 
న్యాయవ్యవస్థకు నల్లమచ్చగా తయారైన 25 లక్షల పెండింగ్‌ కేసుల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి.అందుకు కోర్టుల్లో ఖాళీల భర్తీ ఓ మార్గం. తగినంత మంది న్యాయమూర్తులు లేకుండా ప్రజలకు న్యాయం అందించలేం.
- సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం న్యాయవ్యవస్థపై ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో నైతికత, న్యాయ నిర్వహణ రెండూ కలిసి ప్రయాణం చేయాలంటూ... ప్రజలకు న్యాయం చేయడంలో నైతికతే గీటురాయిగా ఉండాలని సూచించారు. ఆధునిక 3ap-main5b.jpgసాంకేతిక హంగులతో హుందాతనం ఉట్టిపడుతున్న ఏపీ హైకోర్టు... న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారి సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. రాజధాని అమరావతిలోని జస్టిస్‌ సిటీలో నేలపాడు వద్ద ఆదివారం ఆయన ఏపీ హైకోర్టు శాశ్వత భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం సమీపంలోని జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని (హైకోర్టు తాత్కాలిక భవనం) ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్‌ గొగొయి ప్రసంగించారు. హైకోర్టు ప్రారంభం సంతోషకరమైనదంటూ... న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, ఏపీ ప్రజలుకు శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయవ్యవస్థ కొత్త పాత్ర, న్యాయవాదుల పాత్ర, పేరుకుపోతున్న పెండింగ్‌ కేసులు, భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ఇతర సవాళ్ల గురించి వివరించారు. 
‘‘న్యాయ నిర్ణయ ప్రక్రియలో న్యాయమూర్తులు భావోద్వేగాలు, వ్యక్తిగత కారణాలకు తావివ్వకూడదు. న్యాయవ్యవస్థ ధైర్యవంతగా ముందుకు తీసుకెళ్లడంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకం. వారు కోర్టుగదులకే పరిమితం కాకూడదు. ప్రభుత్వాలు ప్రజల పట్ల వివక్షత చూపుతున్నప్పుడు, అన్యాయంగా వ్యవహరించినప్పుడు, చెల్లుబాటు కాని చట్టాల విషయంలో, నైతిక నియమాల అంశంలో న్యాయమూర్తులకు పరీక్ష ఎదురవుతుంది. రాజ్యాంగ నియమాలకు లోబడి ఆదేశాలు, తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. 
దేశంలో పేరుకుపోయిన మూడు కోట్ల పెండింగ్‌ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఆ మూడు కోట్లలో... 81 లక్షల కేసులు ఏడాది కిందట దాఖలైనవి. వాటిని పెండింగ్‌ కేసులుగా చెప్పలేం. 50 లక్షల కేసులు మోటారు వాహనాల చట్ట ఉల్లంఘనలు, తూనికలు కొలతల చట్ట ఉల్లంఘనల లాంటి చిన్న కేసులు. ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, దేశంలోని ఇతర ప్రధాన న్యాయమూర్తులు ఇలాంటి  కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా 25 లక్షల కేసులు పదేళ్ల నాటివి. వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. న్యాయవ్యవస్థకు నల్లమచ్చగా తయారైన ఆ 25 లక్షల కేసుల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం తప్ప వేరేమార్గంలేదు. అందుకు నిబద్ధతతో పనిచేయాలి. ఆలోచనల పరంగానే కాకుండా న్యాయ సంబంధ నిర్మాణాల పరంగానూ... న్యాయవ్యవస్థ ప్రయాణం ముందుకు సాగుతోంది. 
పోస్టులు ఖాళీ... 
భర్తీ చేయాల్సిన న్యాయమూర్తుల పోస్టులు భారీగా ఉన్నాయి. జిల్లా స్థాయి న్యాయవ్యవస్థలో 5వేల మంది న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నాయి. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన నేపథ్యంలో ఆ 5వేల పోస్టుల్లో 75 శాతం త్వరలో భర్తీ కానున్నాయి. దేశవ్యాప్తంగా హైకోర్టు జడ్జీల విషయంలో 392 ఖాళీలున్నాయి. అందులో 270 పోస్టుల భర్తీకి దేశంలోని వివిధ హైకోర్టులు పేర్లు సిఫారసు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 130 పోస్టుల భర్తీ విషయంలో ప్రక్రియ కొనసాగుతోంది. 100 ఖాళీల విషయమై సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. రాబోయే రెండు మూడు వారాల్లో వీటిని పరిష్కరిస్తాం. మరో 14 జడ్జీ పోస్టుల అంశం కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. అపరిష్కృత వ్యాజ్యాల్ని పరిష్కరించడంలో ఖాళీల భర్తీ ఓ మార్గం. తగినంత మంది న్యాయమూర్తులు లేకుండా ప్రజలకు న్యాయం అందించలేం’’ అని జస్టిస్‌ గొగొయి పేర్కొన్నారు. 
జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం 
శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు. ఆ తర్వాత జస్టిస్‌ రంజన్‌ గొగొయి, సీఎం చంద్రబాబు జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ వద్ద పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అక్కడే జస్టిస్‌ గొగొయి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లో హైకోర్టు నిర్వహణకు ఏర్పాటు చేసిన కోర్టు గదులను ప్రారంభించి పరిశీలించారు.  అనంతరం అతిథులందరూ సభాప్రాంగణానికి చేరుకుని ప్రసంగించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అతిథులకు శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేశారు.

- ఈనాడు, అమరావతి

అభినందనలు...

జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణం కోసం నిరంతరం శ్రమించి, వేగంగా జరిపిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, భాగస్వాములైన అందరికీ జస్టిస్‌ గొగొయి అభినందనలు తెలిపారు. న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించిన నేపథ్యంలో అభినందన తెలపడంలేదన్నారు. అయితే రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చే పనిలో రాష్ట్రప్రభుత్వం చేసిన కృషిని తాను గుర్తిస్తున్నానని చెప్పారు. 

హైకోర్టు ఉన్నతిపై దృష్టి సారించాలి 
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

3ap-main5c.jpg

ఈనాడు, అమరావతి: సదుపాయాల లేమి గురించి కాకుండా...భవిష్యత్తులో హైకోర్టు ఎంత ఉన్నతంగా ఉండాలనేదానిపై న్యాయసమాజం దృష్టిసారించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రజల దగ్గరకు రావటం గర్వకారణమని అన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన జ్యుడీషియరీ కాంప్లెక్స్‌ భవనం వసతులు రాబోయే పది, పదిహేనేళ్ల వరకూ సరిపోయేలా ఉన్నాయన్నారు. జ్యుడీషియరీ కాంప్లెక్స్‌ భవనాల ప్రారంభం, శాశ్వత హైకోర్టు భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ..‘‘వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానాలున్నాయి. తమను ఆశ్రయించే సామాన్యుడికి న్యాయం చేయాలి. రాజ్యాంగపరమైన హక్కులను కాపాడాలి. న్యాయనిబంధన(రూల్‌ ఆఫ్‌ లా)ను రక్షించాలి. న్యాయసమాజం రాజ్యాంగ విలువలు కాపాడేందుకు అంకితం కావాలి. ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలి. న్యాయం అందించటంలో జాప్యం చేసి ప్రజల హక్కులు హరించటం సరికాదంటూ కింగ్‌జాన్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తించుకోవాలి. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు నా అభినందనలు. నేను ఈ ప్రాంతం వాడినే. గుంటూరు నుంచే నా న్యాయవాద వృత్తిని ప్రారంభించాను. 1953 నుంచి 1956 మధ్య గుంటూరులో హైకోర్టు ఉండేది’’ అని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు.

చంద్రబాబు దార్శనికత మరోసారి నిరూపితం 
అభినందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుభాష్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన దార్శనికతను మరోసారి నిరూపించుకున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుభాష్‌రెడ్డి అభినందించారు. ‘‘రాజధాని అభివృద్ధి ప్రణాళికలు త్వరలోనే కార్యరూపం దాల్చాలని, అవి పూర్తికావాలని కోరుకుంటున్నా. హైకోర్టు విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చెరో 1.70 లక్షల వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరితగతిన వాటిని పరిష్కరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంది’ అని జస్టిస్‌ సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు.

దేశంలోనే ఉత్తమమైనహైకోర్టుగా నిలుపుదాం 
- ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడి

‘దేశ చరిత్రలో అమరావతికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. హైకోర్టు ఏపీకి తరలిరావడంతో ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఈ గడ్డ నుంచి ఎంతోమంది గొప్పవారు న్యాయవ్యవస్థకు సేవలందించారు. హైకోర్టు భవన నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టింది. ఇక మీదట ఈ భవనాన్ని ఓ వ్యవస్థగా మార్చాల్సిన బాధ్యత తమపై ఉంది. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉద్యోగుల సమష్టి కృషి వల్ల హైకోర్టు పూర్తి స్థాయిలో పనిచేసే దశకు చేరింది. దేశంలోనే ఉన్నతంగా ఏపీ హైకోర్టును నిలపాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని అన్నారు.

ప్రభుత్వాల సహకారంతోనే విభజన 
- తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉమ్మడి హైకోర్టు విభజన చాలా సున్నితంగా జరిగిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వాల సహకారంతోనే ఆ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఏపీ హైకోర్టు ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు.

3ap-main5d.jpg

Link to comment
Share on other sites

 

 
 
 

Foundation Stone for Permanent High Court Building will be laid by Chief Justice of Supreme Court Ranjan Gogoi Tomorrow Morning? Designs : Fosters + Partners Floors : B+G+7 Area : 42 Acre Project Cost : Rs 732 Cr Time Period : 30 Months Contractor : Shapoorji & Pallonji Group

DyawR3BUcAAY_Ze.jpg
DyawTYEUYAATTje.jpg
Link to comment
Share on other sites

The Interiors of Permanent High Court Structure?? Present Graphics antaru, oka 30 Months ayaka madladukundham? One of the Most Complex Construction & Best ICONIC Structure in INDIA ?? తెలుగు వాడి సత్తా ప్రపంచం మొత్తం చాటేలా ఈ హై కోర్ట్ ఉండబోతుంది ??

Dyaz4qtU8AAn17k.jpg
Dyaz53OVAAAIgSz.jpg
Dyaz8M0U8AAQ97n.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...