Jump to content

Amaravati


Recommended Posts

 

 
 

Foundation Stone for Permanent High Court Building will be laid by Chief Justice of Supreme Court Ranjan Gogoi Tomorrow Morning? Designs : Fosters + Partners Floors : B+G+7 Area : 42 Acre Project Cost : Rs 732 Cr Time Period : 30 Months Contractor : Shapoorji & Pallonji Group

DyawR3BUcAAY_Ze.jpg
DyawTYEUYAATTje.jpg
Link to comment
Share on other sites

Vijayawada City @BZAUpdates 9m9 minutes ago

 
 

The Interiors of Permanent High Court Structure?? Present Graphics antaru, oka 30 Months ayaka madladukundham? One of the Most Complex Construction & Best ICONIC Structure in INDIA ?? తెలుగు వాడి సత్తా ప్రపంచం మొత్తం చాటేలా ఈ హై కోర్ట్ ఉండబోతుంది ??

Dyaz4qtU8AAn17k.jpg
Dyaz53OVAAAIgSz.jpg
Dyaz8M0U8AAQ97n.jpg
Dyaz9dZUYAA0OoM.jpg
Link to comment
Share on other sites

9 hours ago, ask678 said:

TG public kullu tho suicide chesukune days entho duram lo levu....asale free food batch...

నిజం. వాళ్ళ ఏడుపులతో అమరావతికి వచ్చే దిష్ఠి పోతుందిలే. 

Link to comment
Share on other sites

అమరావతి సిగలో మరో మణిపూస

 

8 నెలల్లోనే జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణం
అత్యంత ఆధునిక వసతులు.. రాజస్థాన్‌ శాండ్‌స్టోన్‌తో తాపడం
నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రారంభం

2ap-main6a_1.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంలో ఇది మరో మైలురాయి. ఆధునిక వసతులతో, అత్యంత ఆకర్షణీయంగా నిర్మించిన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ (హైకోర్టు) భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభిస్తున్నారు. ఈ భవన నిర్మాణాన్ని సీఆర్‌డీఏ ఎనిమిది నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాజస్థాన్‌ నుంచి తెప్పించిన శాండ్‌స్టోన్‌తో తాపడం చేసి భవనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. రాజధానిలోని న్యాయనగరంలో నిర్మించిన ఈ జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఏర్పాటుచేస్తారు. ఈ భవనానికి పక్కనే శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికీ ఆదివారం శంకుస్థాపన చేస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టును దానిలోకి తరలిస్తారు. అప్పుడు జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనంలో సిటీ సివిల్‌ కోర్టులు, ట్రైబ్యునళ్లు వంటివి ఏర్పాటవుతాయి. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని జీ+2 విధానంలో నిర్మించారు. భవిష్యత్తులో జీ+5కి విస్తరించేలా దీని ఆకృతి రూపొందించారు. ఎత్తైన క్లాక్‌టవర్‌ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనం పనుల్ని 2018 జూన్‌లో ప్రారంభించారు. అప్పటినుంచి కొన్ని వందల మంది కార్మికులు, ఇంజినీర్లు ఈ భవన నిర్మాణంలో రాత్రింబవళ్లు శ్రమించారు. సాధారణంగా ఇలాంటి భవనాల నిర్మాణానికి రెండేళ్లు పడుతుందని, తాము ఎనిమిది నెలల రికార్డు సమయంలోనే నిర్మాణం పూర్తి చేశామని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. నాణ్యత, సదుపాయాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ఆధునిక వసతులతో నిర్మించారు. భవన నిర్మాణం, ఇంటీరియర్స్‌, పార్కింగ్‌ వసతి వంటి వాటితో కలిపి ఒక్కో చ.అడుగుకు సుమారు రూ.6,100 ఖర్చయింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు.

ప్రారంభ కార్యక్రమం ఇలా..
అమరావతిలోని నేలపాడు వద్ద హైకోర్టు శాశ్వత భవన శంకుస్థాపన, సమీపంలో నిర్మించిన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి పాల్గొంటారు. విజయవాడ నుంచి 10:55కు శంకుస్థాపన జరిగే ప్రాంతానికి చేరుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. గ్యాలరీని పరిశీలిస్తారు. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ వద్ద పోలీసు గౌరవవందనాన్ని స్వీకరించి జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు. ఆ తర్వాత కోర్టు హాళ్లను పరిశీలిస్తారు. 12:25 గంటలకు సభా కార్యక్రమంలో పాల్గొంటారు. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయితో పాటు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నభోజనం తర్వాత హెలికాప్టర్‌లో అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనం విశేషాలివి..

* స్థలం విస్తీర్ణం: 4.02 ఎకరాలు
* మొత్తం నిర్మిత ప్రాంతం: 2.5 లక్షల చ.అడుగులు
* పార్కింగ్‌: 400 కార్లు నిలిపేందుకు వీలుగా..
* కోర్టు హాళ్లు: 23 (చీఫ్‌జస్టిస్‌ కోర్టు హాల్‌తో కలిపి)
* చీఫ్‌జస్టిస్‌ కోర్టు హాల్‌, జడ్జి చాంబర్‌ వైశాల్యం: 2480 చ.అడుగులు
* ఇతర కోర్టు హాళ్లు, జడ్జి ఛాంబర్ల వైశాల్యం (ఒక్కొక్కటి): 1240 చ.అడుగులు.
న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ప్రవేశించేందుకు వేర్వేరు మార్గాలు.
* పరిపాలన వసతులు (సెక్షన్లు, రిజిస్ట్రీలు)
* అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ హాలు.మహిళా న్యాయవాదులకు ప్రత్యేక అసోసియేషన్‌ హాలు
* అడ్వొకేట్‌ చాంబర్‌
* ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం
* హైకోర్టు లైబ్రరీ
* భవనానికి ఎదురుగా ఐదెకరాల్లో ఉద్యానవనం
* భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తుల్లో అడ్వొకేట్‌ జనరల్‌ కార్యాలయం ఉంటుంది. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు ప్రత్యేక ఛాంబర్లు. ప్రభుత్వ న్యాయవాదులకు 21 కేబిన్లు ఉంటాయి.
* కారిడార్లలో తప్ప భవనంలో అన్ని చోట్లా ఎయిర్‌కండీషన్‌ సదుపాయం.
* రెండున్నర లక్షల దస్త్రాల్ని భద్రపరిచేలా ఆధునిక స్టోరేజి సదుపాయం.
* 500 మంది ఒకేసారి భోజనం చేసేందుకువీలుగా క్యాంటీన్‌ సదుపాయం (నిర్మాణం మొదలైంది).
* కోర్టు భవనంలో బ్యాంకు, తపాలా విభాగాలు. న్యాయశాస్త్ర సంబంధిత పుస్తకాల విక్రయ కేంద్రం.
* మొత్తం భవనానికి 12 లిఫ్ట్‌లు.

న్యాయవాదులకు ప్రత్యేక ఛాంబర్‌

రాజధాని అమరావతిలోని హైకోర్టు భవనం పక్కనే  జీ+4 విధానంలో న్యాయవాదులకు ప్రత్యేక భవనం నిర్మిస్తారు. 150 మంది సీనియర్‌ న్యాయవాదుల ఛాంబర్ల ఏర్పాటుకు వీలుంటుంది. 55 వేల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది. ఈ భవన నిర్మాణ పనులు ఇంకా మొదలవ్వాల్సి ఉంది.

విజయవాడకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

2ap-main6c_1.jpg

అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి శనివారం విజయవాడకు చేరుకున్నారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి తదితరులు వచ్చారు. దిల్లీ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న వీరికి రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, రాష్ట్ర మంత్రులు దేవినేని, నారాయణ, ఎంపీ రవీంద్రకుమార్‌, కృష్ణా జిల్లా న్యాయమూర్తి లక్ష్మణరావు, కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ద్వారకాతిరుమలరావు కూడా ఉన్నారు. అనంతరం ఆయన నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుని బస చేశారు.

సీజేఐను కలిసిన సీఎం: నగరానికి వచ్చిన సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయిను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోవాటెల్‌ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందించారు.

2ap-main6b_1.jpg
 

Link to comment
Share on other sites

రాజధానిలో హైకోర్టు నేడే శుభారంభం
03-02-2019 07:46:40
 
636847767988518547.jpg
  • తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించనున్న సుప్రీంకోర్టు సీజే
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
గుంటూరు/తుళ్లూరు: రాజధాని అమరావతిలో మరో అధ్యాయం ప్రారంభమవుతుంది. నేలపాడు రెవెన్యూలో నిర్మితమైన ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. హెలీకాఫ్టర్‌లో న్యాయమూర్తులు ఈ ప్రదేశానికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబునాయుడు రోడ్డుమార్గంలో వస్తారు. తొలుత జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కోర్టు ముందు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తాత్కాలిక హైకోర్టుకు రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభోత్సవం చేస్తారు. లోపల ఉన్న గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేస్తారు. తర్వాత ఛీప్‌ జస్టిస్‌ చాంబర్‌ను ప్రారంభిస్తారు. మొదటి అంతస్తులో ఉన్న కోర్టు హాళ్లను సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పరిశీలిస్తారు. అనతంరం సభాప్రాంగణం వద్దకు వచ్చి వేదిక పై నుంచి సందేశం అందిస్తారు.
 
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ బి.రాధాకృష్ణన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు 500 మంది న్యాయమూర్తులు, 1500 మంది న్యాయవాదులు రానున్నారు. ఈ క్రమంలో శనివారం హైకోర్టు ప్రారంభోతసవ ఏర్పాట్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్‌ కోన శశిధఽర్‌ శనివారం పర్యవేక్షించారు. మూడు హెలీప్యాడ్‌లను నిర్మించారు. రాజధానిలో నిర్మితమవుతున్న ఏఐఎస్‌, ఎమ్మెల్యే, ఎన్జీవో, గ్రూపు డి ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఆయా నిర్మాణాలకు సంబంధించిన ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటు చేశారు.
 
అందులో శాశ్వత సచివాలయ భవనాలు, హైకోర్టు నమూనాలను ఆర్ట్‌ గ్యాలరీలో ఉంచారు. రాజధాని రైతులకు కూడా సీఆర్డీయే ఆహ్వానాలు పంపించింది. ఈ నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హైకోర్టుతో పాటు సమీప ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేరకు ఆయన సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పరిశీలించి సిబ్బందికి తగు సూచలను చేశారు. వీఐపీలు వచ్చి వెళ్ళే రూట్లలో పెద్ద ఎత్తున పోలీసులను నియమించామన్నారు. బందోబస్తుకు వివిధ జిల్లాల నుంచి 1100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది హాజరైనట్లు ఎస్పీ తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...