Jump to content

Amaravati


Recommended Posts

Construction of High Court of Andhra Pradesh is almost in final stage? - Connecting road & Car Parking construction is over - Fencing & Elevation side works are going on which are expected to complete by month end Opening : February 3rd, 2019 PC : Sk Nayeem

DxrE8F1VYAA1CiK.jpg
DxrE_fGUUAEpKTi.jpg
DxrFGENUYAESgmk.jpg
Link to comment
Share on other sites

28 minutes ago, sonykongara said:

Construction of High Court of Andhra Pradesh is almost in final stage? - Connecting road & Car Parking construction is over - Fencing & Elevation side works are going on which are expected to complete by month end Opening : February 3rd, 2019 PC : Sk Nayeem

DxrE8F1VYAA1CiK.jpg
DxrE_fGUUAEpKTi.jpg
DxrFGENUYAESgmk.jpg

What about interiors ? 

Link to comment
Share on other sites

చక చకా.. కొత్తరూపు
25-01-2019 07:54:39
 
636839996802997383.jpg
రాజధానిలో జ్యుడీషియరీ భవన నిర్మాణ సముదాయాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. రేయింబవళ్లు వేలాదిమంది కార్మికులతో పనులు పూర్తి చేయిస్తున్నారు. అతి త్వరలో పూర్తి చేయాలనే సంకల్పంతో నిర్మాణ సంస్థలు పనుల్లో వేగాన్ని పెంచాయి. అంతర్గత పనులు కూడా పూర్తి చేస్తున్నారు. చుట్టూ గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు. కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల గదులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
                                                                                        - అమరావతి, ఆంధ్రజ్యోతి
Link to comment
Share on other sites

సొంతింటి కల సాకారం!
25-01-2019 03:14:16
 
636839828568358193.jpg
  • ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు లేదా ఫ్లాట్లు
  • సంఘాలు, సొసైటీల ద్వారా కేటాయింపు
  • ప్రభుత్వ భూమి లేకుంటే ప్రైవేటు భూమి
  • కలెక్టర్‌ నేతృత్వాన నోడల్‌ ఏజెన్సీ
  • ఇంట్లో ఇద్దరు ఉద్యోగులుంటే ఒక్కరికే
  • సొంత ఇల్లు, ఫ్లాట్‌ ఉన్నా అనర్హులే
  • 15 ఏళ్లపాటు అమ్ముకోవడానికి వీల్లేదు
  • హౌసింగ్‌ పాలసీ విడుదల చేసిన సర్కారు
అమరావతి, జనవరి 24(ఆంద్రజ్యోతి): నవ్యాంధ్రలో ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి భాగ్యం కల్పించేందుకు ముందడుగు పడింది. ఉద్యోగులకు ఇళ్ల కేటాయింపుపై విధివిధానాలు, మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం విధాన పత్రం(పాలసీ) విడుదల చేసింది. ఈ మేరకు గురువారం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఉత్తర్వులు(జీవో 43) జారీ చేశారు. ఇక్కడి ఉద్యోగుల (బార్న్‌ ఎంప్లాయీస్‌) తోపాటు రాష్ట్రానికి కేటాయించిన వారిని కూడా ఆంధ్రపదేశ్‌ ఉద్యోగస్తులుగానే పరిగిణించి అర్హులైన వారికి సొంతింటి అవకాశం కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వం పాలసీలో పేర్కొంది. 2008లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, 2011లో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా న్యాయ సలహా తీసుకొని ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది. భవిష్యత్తులో దీనిపై న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అనేక జాగ్రత్తలు తీసుకుని ఆదేశాలు జారీ చేసింది.
 
 
ఎవరు అర్హులు..
రాష్ట్ర ప్రభుత్వంలో జిల్లాలు, ప్రాంతీయంగా పనిచేస్తున్న ఉద్యోగులంతా ఇళ్లకు అర్హులే. సొంత ఉద్యోగులతోపాటు విభజన సందర్భంగా రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులను ఏపీ ఉద్యోగులుగా పరిగణిస్తునందున వారితోపాటు, ప్రస్తుతం పాలసీ వచ్చే నాటికి పనిచేస్తోన్న ఉద్యోగులు అర్హులు. అయితే ప్రస్తుతం పనిచేస్తోన్న నగరం లేదా పట్టణం పరిధిలో ఉద్యోగులు, వారి జీవితభాగస్వామి, పిల్లల పేరిట సొంతల్లు కలిగి ఉంటే ఈ పథకానికి అనర్హులు. ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులే అయితే ఒక్కరికే అవకాశం ఇస్తారు. ప్రభుత్వ భూమి ఉన్నమేరకు ఉద్యోగులకు ఇళ్లస్థలాలు ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే ప్రైవేటు భూములను సేకరిస్తారు. వాటిని బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు కేటాయిస్తారు.
 
 
భూములను గృహనిర్మాణ సొసైటీలు, సంఘాలకు మాత్రమే కేటాయించాలి. కాబట్టి ఉద్యోగులు సొంతంగా ఓ హౌసింగ్‌ సొసైటీని లేదా సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటేనే దీని కింద ఇళ్లు పొందగలరు. ఆయా సంఘాలు, సొసైటీల కింద సభ్యులుగా చేరిన వారు ప్రస్తుతం పనిచేస్తోన్న చోట తను, భార్య, పిల్లల పేరిట సొంత ఇళ్లు, ఫ్లాట్లు లేవని స్వీయ ధృవీకరణ (అఫిడవిట్‌) ఇవ్వాలి. ఇక జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని నోడల్‌ ఏజెన్సీకి హౌసింగ్‌ సొసైటీ లేదా సంఘాలు తమ సభ్యుల వివరాలు అందజేయాలి. తప్పుడు ధృవీకరణలు ఇస్తే దరఖాస్తులను తిరస్కరించి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ ప్రక్రియంతా ముగిశాక ఏపీ భూ నిర్వహణ సంస్థ (ఏపీ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) నిర్ణయం మేరకు నామమాత్రపు ధరలకు సొసైటీలు, సంఘాలకు భూములను కేటాయిస్తారు. కాగా, ఉద్యోగుల ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం ఎలా చేపట్టాలన్నదానిపై ప్రభుత్వం సొసైటీలు, సంఘాలకు వెసులుబాటు కల్పించింది.
 
 
అమరావతి ఉద్యోగుల హౌసింగ్‌ పాలసీ ఖరారు
అఖిల భారత సర్వీస్‌ (ఏఐఎస్‌) అధికారులతోపాటు రాష్ట్ర రాజధానిలో పనిచేస్తున్న ఉద్యోగులకు అమరావతిలో గృహ వసతికి సంబంధించిన హౌసింగ్‌ పాలసీని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీచేసింది. అందులో వివిధ కేడర్లకు నిర్ణీత అర్హతలను నిర్దేశించింది. ఏఐఎస్‌ అధికారులకు 500 చదరపు గజాల చొప్పున ఇస్తామని, గెజిటెడ్‌-నాన్‌గెజిటెడ్‌ అధికారులు, ఉద్యోగులకు మాత్రం స్థల లభ్యతను బట్టి ఇళ్ల స్థలాలు లేదా ఫ్లాట్లను కేటాయిస్తామని పేర్కొంది.
 
అయితే ఇందుకుగాను వీరందరూ సొసైటీలుగా ఏర్పడాల్సి ఉంటుందని వెల్లడించింది. ఏపీ కేడర్‌ ఏఐఎస్‌ అధికారులు, డిప్యుటేషన్‌ అధికారులను అర్హులుగా పేర్కొన్నారు. వారందరికీ ఒక్కొక్కరికి 500 చదరపు గజాల చొప్పున రాజధాని నగరంలో ఇళ్ల స్థలం కేటాయిస్తారు. అందుకోసం వారు సొసైటీలు లేదా సంఘాలుగా ఏర్పడాలి. అలాగే రాష్ట్రానికి కేటాయించిన లేక నియమితులై, ప్రస్తుతం రాజధానిలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వోద్యోగులు, అధికారులు కూడా దీనికి అర్హులే. వారికి ఇళ్లస్థలాలు లేదా ఫ్లాట్లను కేటాయిస్తారు.
 
 
భూమి కేటాయింపుల్లో షరతులు
ఇళ్లస్ధలాలకోసం ఉద్యోగుల సొసైటీ, సంఘాలకు భూములు కేటాయించిన తర్వాత ఏం చేయాలి? ఎలా చేయాలన్న దానిపై పలు నియమనిబంధనలు, షరతులు విధించారు. భూమి కేటాయింపుల ఉత్తర్వులు వెలువడ్డాక సొసైటీలు, సంఘాలు ఆరు నెలల్లోగా సభ్యులకు డ్రా ద్వారా వ్యక్తిగతంగా ఇళ్లస్థలాలు కేటాయించాలి. సభ్యులు ఇంటిస్థలం పొందిన తర్వాత మూడేళ్లలో ఇళ్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణం పూర్తిచేయాలి. లబ్ధి పొందిన ఉద్యోగులు కనీసం పదిహేనేళ్లపాటు దాన్ని ఇతరులకు విక్రయించడానికి వీల్లేదు. ఉద్యోగులు రెండు, అంతకన్నా ఎక్కువ సొసైటీలు, సంఘాల్లో సభ్యులుగా ఉంటూ ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందాలనుకుంటే కుదరదు. కాబట్టి ఒక ఉద్యోగికి రాష్ట్రంలో ఒక సొసైటీ తరపున ఒక్కసారే ఇంటిస్థలం లేదా ప్లాట్‌ కేటాయిస్తారు. ఇక, అది కూడా ఉద్యోగ సర్వీసులో ఒక్కసారికే పరిమితం.
 
 
ఉద్యోగుల ఇళ్ల పాలసీపై హర్షం
ఉద్యోగుల ఇళ్ల కేటాయింపు కోసం నూతన విధానాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చినందుకు సీఎం చంద్రబాబుకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. చిరుద్యోగులకు సొంతింటి కలను సాకారం చేయాలని పలు దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసిన తర్వాత వివిధ స్థాయిల్లో చర్చించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
Link to comment
Share on other sites

16 నెలల్లో బాబూ జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తివనం

 

ఈనాడు డిజిటల్‌- అమరావతి: రాజధాని అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ‘బాబూ జగ్జీవన్‌రామ్‌ సమతా స్ఫూర్తి వనం’ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీని నిర్మాణానికి ఏపీఐఐసీని ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా నియమించింది. నిర్మాణాన్ని 4 దశల్లో చేపట్టాలని, మొత్తం 16 నెలల్లో పూర్తిచేయాలని  సూచించింది. నిర్మాణాల ఆకృతుల ఖరారు, ప్రాజెక్టు అంచనాలను రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు నోడల్‌ అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు వ్యవహరిస్తారని పేర్కొంది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

ప్రాజెక్టులో భాగంగా నిర్మించేవి:
* బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం
* వివిధ కళాకృతులతో కూడిన మెమోరియల్‌ పార్క్‌, ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్‌
* ‘సమతాసదన్‌’ పేరుతో వెయ్యి మంది ఒకేసారి వీక్షించేందుకు వీలుగా బహుళప్రయోజన సమావేశ మందిరం
* ‘స్ఫూర్తిభవన్‌’ పేరుతో బహుళ ప్రయోజన భవంతి

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...