Jump to content

Amaravati

Recommended Posts

1 minute ago, sonykongara said:

ledu bro vadu baffa gadu anukunata apedu

hmmm...BR shetty kuda aapadu kada. inka vere hospitals evi construction levu anukunta. only balayya babu di cancer hospital mathrame starting kada ayithe amaravati lo...chaa. CBN elagaina aa BR shetty ni bathimaladi kaneesam 500 bed hospital start cheyinchina bavundu.. :angry2:

Link to comment
Share on other sites

12 minutes ago, LuvNTR said:

hmmm...BR shetty kuda aapadu kada. inka vere hospitals evi construction levu anukunta. only balayya babu di cancer hospital mathrame starting kada ayithe amaravati lo...chaa. CBN elagaina aa BR shetty ni bathimaladi kaneesam 500 bed hospital start cheyinchina bavundu.. :angry2:

br shetty kuda rss vade kochem doubt naku athani meda Modi agde apichadu ani

Link to comment
Share on other sites

14 minutes ago, LuvNTR said:

hmmm...BR shetty kuda aapadu kada. inka vere hospitals evi construction levu anukunta. only balayya babu di cancer hospital mathrame starting kada ayithe amaravati lo...chaa. CBN elagaina aa BR shetty ni bathimaladi kaneesam 500 bed hospital start cheyinchina bavundu.. :angry2:

amurtha,srm vi kuda unnayi

Link to comment
Share on other sites

నెలాఖరుకు 13 కోర్టు హాళ్ల పనులు పూర్తి

20AP-main2a_1.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: ఈ నెలాఖరు నాటికి తాత్కాలిక హైకోర్టు భవనాల్లో 13 కోర్టు హాళ్ల నిర్మాణ పనులు పూర్తవుతాయని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ షణ్ముగం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌కు వివరించారు. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణ పనులను జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలోని న్యాయమూర్తుల బృందం ఆదివారం సాయంత్రం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలుతో పాటు మరో 12 హాళ్లు పూర్తవుతాయని షణ్ముగం వివరించారు.

Link to comment
Share on other sites

హైకోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌
21-01-2019 10:05:35
 
636836619356974609.jpg
తుళ్లూరు: రాజధాని అమరావతిలో సిద్ధమవుతున్న తాత్కాలిక హైకోర్టును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆదివారం పరిశీలించారు. కోర్టు హాళ్ళను, ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌, కోర్టు హాలును ఆయన పరిశీలించారు. పార్కింగ్‌ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. ఎప్పటిలోగా పనులు పూర్తి అవుతాయని కంపెనీ ప్రతినిధులను, సీఆర్డీయే అడిషనల్‌ కమిషనర్‌ షణ్ముఖను అడిగి తెలుసుకున్నారు.
 
13 కోర్టు హాళ్లు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీకల్లా కోర్టు హాళ్లు పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌కు వివరించారు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాళ్లు, సిద్ధమవుతున్న మరో 12 కోర్టు హాళ్ళను ఆయన పరిశీలించారు. ఫిబ్రవరి మూడో తేదీకల్లా 13 కోర్టు హాళ్లు ప్రారంభించే విధంగా చూడాలని జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించినట్టు సమాచారం. పలువురు హైకోర్టు జడ్జీలు కోర్టు హాళ్లను, జడ్జీల చాంబర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

భూకర్షణ కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు
 
తుళ్ళూరు,న్యూస్‌టుడే: రాష్ట్రరాజధాని అమరావతిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఈనెల 31వ తేదీన భూకర్షణం, బీజావాపనం చేపట్టే కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 31వ తేదీ ఉదయం 9.15 నిమిషాలకు భూకర్షణ కార్యక్రమం జరగుతుంది. అయితే ఈనెల 28 నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 28వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు అంకురార్పణతో భూకర్షణకు శ్రీకారం చుడతారు. 29న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమాలు, శ్రీవారి నూతన ఆలయ ప్రదేశంలో భూపరీక్ష ఉంటుంది. 30న గోపూజ, శ్రీవారి ఆలయ ప్రదేశంలో వాస్తుహోమం, 31న యుగళంగల హలసహిత వృషభపూజ, 9.40నిమిషాలకు భూకర్షణ, బీజావాపన, మహాపూర్ణాహుతి, వేదాశీర్వాదం ఉంటుంది. 10.30 నిమిషాల నుంచి 12.30 వరకు శ్రీనివాసకల్యాణం ఉంటుంది. వచ్చే నెల 1నుంచి 10వ తేదీ వరకు నిత్యపూజలు 10వ తేదీన శిలేష్టకాన్యాసం, పూర్ణాహుతి, వేదాశీర్వాదం కార్యక్రమాలను తితితే నిర్వహిస్తుంది.

Link to comment
Share on other sites

కొత్త హైకోర్టు భవనం 3న ప్రారంభం

 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం

ఈనాడు, దిల్లీ: ఫిబ్రవరి 3న అమరావతిలో  జరిగే హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. ప్రధాన న్యాయమూర్తి నివాసానికి మంగళవారం వెళ్లి ఆయనను రావాలని కోరారు. వారి మధ్య సుమారు అరగంటసేపు ముఖాముఖి సమావేశం జరిగింది. అనంతరం సుప్రీంకోర్టులో సేవలందిస్తున్న జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎన్‌వీ రమణ నివాసాలకు వెళ్లి వారిని కూడా ఆహ్వానించారు. ఇది కేవలం అధికార స్థాయి సమావేశం మాత్రమేనని, మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలకడానికి మాత్రమే ముఖ్యమంత్రి దిల్లీకి వచ్చారని అధికారవర్గాలు తెలిపాయి. తొలుత దిల్లీ విమానాశ్రయం నుంచే దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సును ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. సుమారు గంటన్నరపాటు అక్కడి ప్రతినిధులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. ఈ సమావేశాల అనంతరం అమరావతికి ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.

Link to comment
Share on other sites

భవనాలు చూసి.. మన అభివృద్ధి అని మురిసి..

geGhyHd.jpg

రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను చూసేందుకు జిల్లాల నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు. సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం గైడ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఒక్కో ఒస్సుకు ఒకరి చొప్పున నియమించి వారికి వివరించే ఏర్పాట్లు చేసింది. అంతస్తుల  ప్రత్యేకతలు, పగలూ రాత్రి వేలాది కార్మికులు పనిచేసే విధానం, అత్యాధునిక పరిజ్ఞానం వంటి విషయాలను నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా గైడ్‌లు వివరిస్తుండటంతో సందర్శకులు ప్రత్యక్షానుభూతి పొందుతున్నారు. ఎంతో సంతృప్తితో  తిరుగుపయనం అవుతున్నారు.

- ఈనాడు, విజయవాడ

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

Good to see plantation, 1 yr lo better grown trees ga manchi peaceful ga vuntadi.. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...