Jump to content

Amaravati


Recommended Posts

ఆ గట్టు నుంచి ఈ గట్టు
 

రాజధానితో 12 జాతీయ, రాష్ట్ర రహదారుల అనుసంధానం
ఐకానిక్‌ వంతెనకు ముఖ్యమంత్రి భూమిపూజ

amr-top1a_52.jpg

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: రాజధానితో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ.. నిర్మిస్తున్న ఐకానిక్‌ బ్రిడ్జ్‌ శంకుస్థాపనతో మరోచరిత్రకు నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి రెండు కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనతో పాటు.. రాజధాని తాగునీటి అవసరాలకు చేపడుతున్న నీటిశుద్ధి ప్లాంట్‌కు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై రూ.1387 కోట్లతో 3.2కి.మీల పొడవైన ఐకానిక్‌ వంతెనను నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దీని మధ్యలో 0.48 కి.మీల భాగాన్ని ఐకానిక్‌(కేబుల్‌ స్ట్రే)గా నిర్మిస్తాం. ఈ భాగంలో 170మీటర్ల ఎత్తైన కూచిపూడి భంగిమను పోలిన విధంగా పైలాన్‌ ఉంటుంది. దీనిని వంతెనతో అనుసంధానిస్తూ రెండు పక్కలా తీగల అమరిక ఉంటుంది. ఈ వంతెనతో హైదరాబాద్‌, జగదల్‌పూర్‌ జాతీయరహదారులు అమరావతిలో అనుసంధానమవుతాయి. తద్వారా 40 కి.మీల దూరంతో పాటు విజయవాడలో ట్రాఫిక్‌ తగ్గుతుంది. 2 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంద’ని ముఖ్యమంత్రి తెలిపారు. తద్వారా ఈ ప్రాంతం భవిష్యత్తులో ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే కూడలిగా మారుతోందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ఇందులో ఆరు లక్షలమంది రైతులు 6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని చెప్పారు. ఈ సేద్యంలో పండించిన పంటలతో అనారోగ్య సమస్యలు ఉండవని, పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆక్సిజన్‌ ఎక్కువగా ఉంటే శక్తి ఎక్కువగా వస్తుందన్నారు. అమరావతి భవిష్యత్తులో సుందరమైన 5 మహానగరాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని, అది బ్రౌన్‌ఫీల్డ్‌ సిటీ అయితే.. అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ అన్నారు. ప్రపంచంలో ఇంతవేగంగా రాజధాని నిర్మాణం ఎక్కడ జరగలేదన్నారు. కార్పొరేట్‌ భవనాలకు ధీటుగా ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. రాజధానిలో నిమిషాల వ్యవధిలో కార్యాలయాలు, పార్కులు, అత్యవసర సర్వీసులకు చేరుకునేలా రోడ్లను వేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రికల్‌ వాహనాలను వాడేలా చర్యలు తీసుకుంటామని, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన భోజనాలను అందజేస్తున్నామని గుర్తుచేశారు. కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని 15-18 నెలల్లో పూర్తిచేయాలని, తాగునీటి శుద్ధిప్లాట్‌ను ఏడాదిలో పూర్తిచేయాలని గుత్తేదారులను ఆదేశించారు. వివేకానందుడి జన్మదినం సందర్భంగా ఆయన జీవితాశయాలను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. గత జన్మభూమిలో లక్షల సంఖ్యలో ప్రజల నుంచి విన్నపాలు వచ్చేవని, ఈ జన్మభూమిలో అవి పదుల సంఖ్యకు చేరాయన్నారు.

Link to comment
Share on other sites

Amaravati Welcome Gallery to showcase AP potential

THE HANS INDIA |   Jan 11,2019 , 03:18 AM IST
   

 
 
Amaravati Welcome Gallery to showcase AP potential
Amaravati Welcome Gallery to showcase AP potential
 
 
Amaravati: Andhra Pradesh and Singapore have taken the first step towards developing an exhibition- cum- community centre called the “Welcome Gallery” which will be the commercial core of the upcoming capital city of Amaravati.
 
Singapore Minister-in- charge of Trade Relations S Iswaran and Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu flicked the ignition switch as they unveiled the commemorative plaque as part of the foundation-laying ceremony.
 
 
 
The Amaravati Development Partners (ADP) Private Limited, the joint venture between Singapore Amaravati Investment Holdings (SAIH) and Amaravati Development Corporation (ADC), will construct the Welcome Gallery on 2.6 hectares land at Lingayapalem in Amaravati.
 
 
 
Stating that the capital construction works have taken a shape, Chief Minister N Chandrababu Naidu on Thursday said that the administrative capital region works are continuing at a brisk space and hoped Amaravati will be one of the best five cities in the world. The capital region has many advantages like beautiful river front and the government is using the best technology for the construction works, he said.
 
Stating that AP government was using the best practices and best knowledge for the development of the state, Naidu hoped the proposed Welcome Gallery will play very important role in the development of the capital because international companies can showcase their technology at the Gallery.
 
The Gallery comprises exhibition zone, community zone, engagement zone as well as co-working spaces to house start-ups, he said.
The CM said that the Singapore government has extended great support to Andhra Pradesh during the last four years and drawn master plan for the capital free of cost. Singapore had given a shape to his vision of new capital city.
 
The master plan was designed in three phases as seed capital area, capital city area and finally the capital region and now the capital construction works took a shape, he said.
 
Minister for Communication and Information, Government of Singapore S Iswaran said the proposed Welcome Gallery would be very useful to showcase the world technology as many multinational companies can visit the Gallery and showcase their technology and products.
Link to comment
Share on other sites

నేడు అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు శంకుస్థాపన
17-01-2019 08:30:11
 
636833106123700461.jpg
అమరావతి: నేడు మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు శంకుస్థాపన జరుగనుంది. గ్జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. ఈ విద్యాసంస్థ కోసం తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
Link to comment
Share on other sites

నేడు ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ విద్యా సంస్థకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

 

HFh4ipO.jpg

విజయవాడ, న్యూస్‌టుడే: ఆసియాలో ప్రసిద్ధిగాంచిన జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ)కు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తామని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఫాదర్‌ కె.ఎస్‌.కాజిమిర్‌ బుధవారం విజయవాడలో వెల్లడించారు. అమరావతిలో తమ సంస్థ స్థాపించేందుకు ఎడ్యుకేషన్‌ హబ్‌లో 50 ఎకరాలను ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. ఐనవోలు గ్రామంలో నిర్మించే అధునాతన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ విద్యా సంస్థతో మేనేజ్‌మెంట్‌ రంగంలో నైపుణ్యం కలిగిన యువత రూపుదిద్దుకుంటుందన్నారు. 1949లో జెంషెడ్‌పూర్‌లో ప్రారంభమై ఈ ఏడాదికి 70 వసంతాలు పూర్తి చేసుకొని ప్లాటినం జూబ్లీ వేడుకలకు సమాయత్తమైందన్నారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు సీఎం శంకుస్థాపన
17-01-2019 12:57:19
 
636833267165579706.jpg
అమరావతి: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటుకానుంది. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భూమిపూజ నిర్వహించారు. జెస్యుట్ మిషనరీ నిర్వహణలో ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటవుతోంది. కాగా... ఈ విద్యాసంస్థకు తుళ్లూరు మండలం ఐనవోలు వద్ద 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మన దేశంలో నోయిడా, ముంబై తర్వాత అమరావతిలోనే తన నాలుగో క్యాంపస్‌ను ఆ విద్యాసంస్థ ఏర్పాటు చేస్తోంది.
 

 

Link to comment
Share on other sites

అమరావతిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ

17brk91a.jpg

అమరావతి: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ)కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అమరావతి క్యాంపస్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాలు కేటాయించింది. రెండేళ్లలో నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. పీజీ, యూజీ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో 5వేల మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేందుకు విద్యాసంస్థ సిద్ధమైంది. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు రాజధాని ప్రాంతంలో తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అత్యుత్తమ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో ఒకటిగా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ గుర్తింపు పొందింది. శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ మంత్రి నారాయణ, విజయవాడ, గుంటూరు బిషప్‌లతో పాటు పలు విద్యాసంస్థల ప్రముఖులు హాజరయ్యారు.

Link to comment
Share on other sites

HFh4ipO.jpgఅమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు సీఎం చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు ఆయన భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి పలు విద్యాసంస్థల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జెస్యుట్ మిషనరీ నిర్వహణలో ఏర్పాటవుతున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అని కొనియాడారు. దీని కోసం తుళ్లూరు మండలం, ఐనవోలులో ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. నోయిడా, ముంబై తర్వాత అమరావతిలో నాలుగో క్యాంపస్ అని ఆయన పేర్కొన్నారు.
 
దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఎక్స్‌ఎల్‌ఆర్ఐ‌ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈ సంస్థ ఏర్పాటు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. నాలెడ్జ్‌ ఎకానమీ రావాలనే ఏపీకి ఆహ్వానించామన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీకి అమరావతి కేంద్రం కావాలని, కొన్ని దేశాలు తమ పెట్టుబడులను నాలెడ్జ్‌ ఎకానమీపై పెట్టాయని తెలిపారు. మైక్రోసోఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, ఉబర్‌ వంటివన్నీ వినూత్న ఆలోచనలేనని చంద్రబాబు పేర్కన్నారు.
 
అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలన్నది కూడా ఓ ఆలోచనేనని, రైతుల నుంచి సమీకరించిన భూములు అభివృద్ధి చేసి.. రైతులకే ఇవ్వటంతో అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలోని రైతుల పిల్లలు బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ ఏర్పాటు చేసే పాఠశాల కోసం 8 ఎకరాల స్థలం ఇస్తామని చంద్రబాబు స్సష్టం చేశారు.
Edited by sonykongara
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...