Jump to content

Amaravati


Recommended Posts

చరిత్రాత్మక వంతెనకు నేడే శ్రీకారం
12-01-2019 03:06:39
 
636828592001800788.jpg
  • భారీ నీటిశుద్ధి ప్లాంట్‌కూ సీఎం శంకుస్థాపన
  • రెండు ప్రాజెక్టుల విలువ రూ.2,127 కోట్లు
అమరావతి/పవిత్ర సంగమం(ఇబ్రహీంపట్నం), జనవరి 11(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన మరో రెండు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శ్రీకారం చుట్టబోతున్నారు. వీటిల్లో ఒకటి అమరావతిని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమ ప్రదేశానికి కలిపే ఐకానిక్‌ వంతెన కాగా.. రాజధాని వాసులకు నాణ్యమైన మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన భారీ పథకం రెండోది. అమరావతి అభివృద్థి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో మొత్తం రూ.2127.65 కోట్లతో నిర్మించే ఈ రెండింటికీ పవిత్ర సంగమ ప్రదేశం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు సీఎంశంకుస్థాపన చేయనున్నారు. ఐకానిక్‌ వంతెన శంకుస్థాపన ఏర్పాట్లను మంత్రి దేవినేని ఉమామహేశ్వరారవు, జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం తదితరులు శుక్రవారం పరిశీలించారు.
 
 
ఐకానిక్‌ అనుసంధానం
ఉద్ధండరాయునిపాలెం నుంచి ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమ ప్రదేశాన్ని కలుపుతూ 3.2 కిలోమీటర్ల పొడవు, 125 మీటర్ల వెడల్పుతో ఐకానిక్‌ వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే మచిలీపట్నం-హైదరాబాద్‌, ఇబ్రహీపట్నం-జగదల్‌పూర్‌ హైవే (ఛత్తీస్‌గఢ్‌)ల మీదుగా అమరావతికి వయా విజయవాడ వచ్చే వాహనాలకు 40 కి.మీ. దూరం, 2 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. ట్రాఫిక్‌ రద్దీ నుంచి విజయవాడకు ఉపశమనం కలుగుతుంది. రాజధాని స్టార్టప్‌ ఏరియాతోపాటు సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులకు రాకపోకలు సాగించే వారికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మొత్తం 6 వరుసలతో ఏర్పాటయ్యే వంతెన నిర్మాణ వ్యయం రూ.1387 కోట్లు. 2.72 కిలోమీటర్లు మేర పిల్లర్లు ఉంటాయి. 480 మీటర్లు కేబుల్‌పై ఆధారపడి వంతెన ఉంటుంది. కూచిపూడి నృత్యభంగిమను తలపించే పైలాన్‌ 170 మీటర్ల ఎత్తుతో దేశంలోనే అత్యంత ఎత్తయినదిగా పేరొందనుంది. దీనికి నిర్మించబోయే పైల్స్‌ లోతు నదిలో 40 నుంచి 50 మీటర్ల వరకూ ఉంటుంది. ఇరువైపులా 2.50 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఉంటాయి. అంతర్గత జలరవాణా మార్గంగా అభివృద్ధి చెందనున్న కృష్ణానదిలో భవిష్యత్‌లో ప్రయాణించే భారీ సరుకు పడవలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాని రీతితో వంతెనను డిజైన్‌ చేశారు. ఎల్‌ అండ్‌ టీ దీనిని రెండేళ్లలో పూర్తి చేస్తుందని భావిస్తున్నారు.
 
 
35 లక్షల మందికి సరిపడేలా..!
అమరావతిలో 2050 నాటికి 35 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. వారికి అవసరమైన 950 ఎం.ఎల్‌.డి(మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే)ల కృష్ణానది నీటిని అధునాతన పద్ధతుల్లో శుద్ధి చేసి అందించేందుకు రూ.740.65 కోట్లతో భారీ నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం వెంకటపాలెం వద్ద ఉన్న మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమానికి సమీపంలో కృష్ణానదిలో 13 మీటర్ల వ్యాసార్థంతో ఉండే 2 ఇన్‌టేక్‌ వెల్‌ కం రా వాటర్‌ పంప్‌హౌస్‌లను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నదీజలాలను 2,000 మిల్లీమీటర్ల వ్యాసార్ధం, 2.1 కిలోమీటర్ల పొడవైన రా వాటర్‌ ట్రాన్స్‌మిషన్‌ మెయిన్‌ వ్యవస్థ ద్వారా కృష్ణాయపాలెం వద్ద ఏర్పాటు చేసే నీటి శుద్ధి ప్లాంట్‌ (ప్లేట్‌ సెట్లర్‌)కు చేరుస్తారు. ఈ పఽథకం కాంట్రాక్ట్‌ను ఎన్‌.సి.సి. సంస్థ దక్కించుకుంది. ఏడాదిన్నరలో ఇది పూర్తవ్వాల్సి ఉంది.
Link to comment
Share on other sites

రాజధాని వారధికి నేడు శంకుస్థాపన

 

కృష్ణా నదిపై రూ.1387 కోట్లతో ఐకానిక్‌ వంతెన
రూ.745.65 కోట్లతో తాగునీటి సరఫరా పనులకూ శ్రీకారం
ఈనాడు - అమరావతి

11ap-main2a_2.jpg

అమరావతికి సంబంధించిన రెండు కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం 10 గంటలకు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేయనున్నారు. వాటిల్లో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెన మొదటిది. ఇక్కడి తాగునీటి అవసరాలకు చేపడుతున్న నీటిశుద్ధి ప్లాంట్‌ నిర్మాణం రెండోది.

తగ్గనున్న దూరం... సమయం ఆదా
ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై రూ.1387 కోట్లతో 3.2కి.మీ.ల పొడవైన ఐకానిక్‌ వంతెనను నిర్మించనున్నారు. దీని మధ్యలో 0.48కి.మీ.ల భాగాన్ని ఐకానిక్‌గా నిర్మిస్తారు. ఈ భాగంలో యోగ భంగిమను పోలిన విధంగా పైలాన్‌ ఉంటుంది. దీనిని వంతెనతో అనుసంధానిస్తూ రెండు పక్కలా తీగల అమరిక ఉంటుంది. ఈ పైలాన్‌ ఎత్తు 170 మీటర్లు.

* ఆరు వరుసలుగా నిర్మిస్తారు. రెండు పక్కలా 2.5 మీటర్ల వెడల్పైన నడకదారి ఉంటుంది. నిర్మాణానికి పైల్‌ ఫౌండేషన్‌ వేస్తారు.

* ఈ వంతెనతో హైదరాబాద్‌, జగదల్‌పూర్‌ జాతీయ రహదారులు అమరావతితో అనుసంధానమవుతాయి. ఆ రెండు ప్రాంతాల నుంచి 40 కి.మీ.ల దూరంతో పాటు విజయవాడలో ట్రాఫిక్‌ కూడా తగ్గుతుంది. 2 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

* రాత్రి సమయాల్లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించేలా విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలు వివిధ కాలాలకు అనుగుణంగా వేర్వేరు రంగులు వెదజల్లుతాయి.

* జాతీయ జలమార్గం-4పై నిర్మిస్తున్నందున కింది నుంచి చిన్న చిన్న రవాణా నౌకలు ప్రయాణించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తారు.

* నిర్మాణ గడువు రెండేళ్లు. ఎల్‌ అండ్‌ టీ సంస్థ పనులు దక్కించుకుంది. శంకుస్థాపన పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

24 గంటలు తాగునీటి సరఫరా
* రాజధాని తాగునీటి అవసరాలకు రూ.745.65 కోట్లతో నిర్మించే వ్యవస్థలో భాగంగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వద్ద 13 మీటర్ల చుట్టు కొలత కలిగిన రెండు ఇన్‌టేక్‌ బావులు నిర్మిస్తారు.

* కృష్ణాయపాలెం వద్ద 190ఎంఎల్‌డీ సామర్థ్యంగల నీటి శుద్ధి కేంద్రం,  64ఎంఎల్‌ సామర్థ్యం గల... పాక్షికంగా భూగర్భంలో ఉండే... శుద్ధజల రిజర్వాయర్‌, క్లియర్‌ వాటర్‌ పంప్‌ ఏర్పాటవుతాయి.

* నీటి పంపిణీ కేంద్రం వద్ద పాక్షికంగా భూగర్భంలో ఉండే 8రిజర్వాయర్లు, ఏడు ఎలివేటెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు నిర్మిస్తారు. 1500-2000మి.మీ.ల చుట్టుకొలత కలిగిన 45కి.మీ.ల పొడవైన క్లియర్‌ వాటర్‌ రింగ్‌ మెయిన్‌ (పంపింగ్‌ మెయిన్‌) నిర్మిస్తారు. దీని నుంచి ఈ కేంద్రాలకు 58 కి.మీ.పొడవైన పైప్‌లైన్లు (500 నుంచి 1500 మి.మీ.ల చుట్టుకొలత కలిగిన) వేస్తారు. ఈ వ్యవస్థ పర్యవేక్షణకు స్కాడాను ఏర్పాటు చేస్తారు.

* ప్రాజెక్టు గడువు 18 నెలలు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో కూడిన పరిపాలన భవనం, సిబ్బంది నివాస గృహాలు కూడా నిర్మిస్తారు.

* అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 24 గంటలు తాగునీటి సరఫరా చేయాలన్నది లక్ష్యం.

* గృహ, పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత అవసరాలకు శుద్ధి చేసిన, రక్షిత జలాలను పంపిణీ చేస్తారు.

* కృష్ణాయపాలెం వద్ద 380 ఎంఎల్‌డీ సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రాలు, రాజధాని పరిధిలో మొత్తం 61 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. భవిష్యత్తులో మరో 190ఎంఎల్‌డీ సామర్థ్యం గల శుద్ధి కేంద్రం నిర్మిస్తారు.

* ప్రతి కేంద్రం 60వేల మంది తాగునీటి అవసరాలను తీర్చనుంది. వీటి నుంచి వినియోగదారులకు ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా ఏర్పాటయ్యే లైన్ల ద్వారా నీటి సరఫరా చేస్తారు.

Link to comment
Share on other sites

ఇబ్రహింపట్నంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు
12-01-2019 10:45:02
 
636828867028064140.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లి నివాసం నుంచి విజయవాడ ఇబ్రహింపట్నంకు బయలుదేరి వెళ్లారు. ఇబ్రహింపట్నంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకాన్ బ్రిడ్జ్‌కి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు.
Link to comment
Share on other sites

Most Awaited Bridge Construction on River Krishna will have Foundation ceremony on Jan 12 Bridge Connects Pavitra Sangamam (Ibrahimpatnam) to N10 Road (Amaravati) Designs have been changed (Pic 1 to 2) to accommodate Ships beneath the Bridge as it comes under National Waterways

DwhWSmzV4AAAzUh.jpg
DwhWVSFUwAAuqQX.jpg
ravikia reacted to this
  •  
Link to comment
Share on other sites

ఏపీలో రెండు కీలక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన
12-01-2019 11:50:07
 
636828906082266074.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం శంకుస్థాన చేశారు. రూ.1387 కోట్లతో 3.2 కిలోమీటర్ల మేర ఐకానిక్ వంతెన నిర్మాణం జరుగనుంది. ఇబ్రహీంపట్నం-ఉద్దండరాయునిపాలెంను కలుపుతూ కేబుల్‌ వంతెనను నిర్మించనున్నారు. హైదరాబాద్‌, భద్రాచలం హైవేల మీదుగా నేరుగా అమరావతి వెళ్లేలా వంతెన రూపకల్పన చేస్తున్నారు. భారతీయ యోగముద్రతో ఎల్‌అండ్‌టీ సంస్థ వంతెన డిజైన్‌ రూపొందించింది. తక్కువ పిల్లర్లు, ఎక్కువ కేబుళ్లతో ఐకానిక్‌ వంతెన నిర్మాణం జరుగనుంది. అలాగే రూ.750 కోట్లతో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు.
Link to comment
Share on other sites

ఐకానిక్ బ్రిడ్జ్‌కు నామకరణం చేసిన సీఎం చంద్రబాబు
12-01-2019 12:13:02
 
636828919835391890.jpg
 
విజయవాడ: పవిత్రసంగమంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో విజయవాడను అభివృద్ధి చేస్తామన్నారు. పెన్షన్లు రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలకు పెంచామని తెలిపారు. పేదల కోసం సంపదను సృష్టిస్తున్నామన్నారు. రాజధానిలో నిర్మాణాలు జరగడం లేదంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కూచిపూడి మన వారసత్వ సంపద అని, కూచిపూడి నాట్యాన్ని ప్రతిబింబించేలా బ్రిడ్జి నిర్మాణం చేపట్టున్నట్లు తెలిపారు. కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టామని, 6 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని టూరిజానికి హబ్‌గా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

మరో సాంకేతిక వర్సిటీ!
12-01-2019 03:18:01
 
  • సీఆర్‌డీఏ పరిధిలో 150-200ఎకరాల్లో
  • కొత్త కోర్సులు, అత్యున్నత ఫ్యాకల్టీ
  • జేఎన్‌టీయూకే పరిధి తగ్గింపు!
  • త్వరలోనే కేబినెట్‌ ముందుకు డీపీఆర్‌
అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌లో మరో సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 150-200 ఎకరాల్లో ఈ కొత్త వర్సిటీ రూపుదిద్దుకోనుంది. ఐఎ్‌సబీ తరహాలో అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచ స్థాయి వర్సిటీగా దీన్ని తీర్చిదిద్దేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు మొత్తం 8జిల్లాలకు కలిపి జేఎన్‌టీయూకే ఒక్కటే టెక్నాలజీ వర్సిటీగా పని చేస్తోంది. కళాశాలల పరిధి ఎక్కువగా ఉండటం, దీని పరిధిలో 250కి పైగా అనుబంధ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండటంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూకే పరిధిని తగ్గించి మరో సాంకేతిక వర్సిటీ నెలకొల్పేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. ఆర్‌జీయూకేటీ వీసీ రామచంద్రరాజు, డైరెక్టర్‌ సుదర్శనరావు, జేఎన్‌టీయూ మాజీ రిజిస్ట్రార్‌ ప్రసాదరాజు, ఏఎన్‌యూ లా ప్రొఫెసర్‌ రంగయ్య, ఎం.వి.ఎన్‌. శర్మ దీనిలో సభ్యులు.
 
 
శుక్రవారం తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో సమావేశమైన ఈ కమిటీ, కొత్త వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ రూపకల్పనకు కసరత్తు ప్రారంభించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీలను కొత్త వర్సిటీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న కోర్సులతో పాటు భావితరాల విద్యార్థులకు ఉపాధినిచ్చే కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆర్కిటెక్చర్‌, ఫార్మసీ, పెట్రోలియం, ఏరోనాటిక్స్‌, విండ్‌ టెక్నాలజీ, శాటిలైట్‌ టెక్నాలజీ, లాజిస్టిక్స్‌, వాటర్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, ఆధునిక వ్యవసాయ సాంకేతిక కోర్సులను కమిటీ ప్రతిపాదించనుంది. ఫ్యాకల్టీ నియామకాలూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలని సూచించనుంది. అలాగే ప్రముఖ ఐఐటీల నుంచి సబ్జెక్టుల వారీగా విజిటింగ్‌ ఫ్యాకల్టీని తీసుకోవాలని, కొత్త వర్సిటీలో కేవలం ఆచరణాత్మక విధానంలో మాత్రమే శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు. విశ్వవిద్యాలయ చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ కొత్త చట్టం రూపొందించాలని కమిటీ సిఫారసు చేయనుంది. త్వరలోనే ఈ కమిటీ సమర్పించే డీపీఆర్‌ కేబినెట్‌ ముందుకు రానుంది. అన్నీ కుదిరతే 2019-20 విద్యా సంవత్సరం నుంచే కొత్త వర్సిటీ ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది.
Link to comment
Share on other sites

అమరావతి టూరిజం సిటీతో 2 లక్షల మందికి ఉపాధి
12-01-2019 03:21:55
 
  • ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం
  • రాష్ట్రంలో మరో ఆరు టూరిస్టు హబ్‌లు
  • పెట్టుబడులకు ఆహ్వానం.. అన్నింటా భరోసా
  • ఢిల్లీలో సీఆర్‌డీఏ సదస్సు
న్యూఢిల్లీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో అభివృద్ధి చేస్తున్న టూరిజం సిటీతో 2.2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ ఎస్‌. షాన్‌మోహన్‌ స్పష్టం చేశారు. 2.7 లక్షల జనాభాకు సరిపడేలా 11573 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఆర్‌డీఏ, సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ డెవల్‌పమెంట్‌ లీడర్‌షిప్‌ (సీఎ్‌సఎల్‌) సంయుక్తంగా టూరిజం సిటీపై సదస్సు నిర్వహించాయి. ఇందులో షాన్‌మోహన్‌ మాట్లాడుతూ... రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌, హెల్త్‌, వెల్‌నెస్‌, సంస్కృతి, వారసత్వం ఆధారంగా సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ సంస్కృతి ఉట్టిపడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర టూరిజం శాఖ సంయుక్త కార్యదర్శి సుమన్‌ బిల్ల మాట్లాడుతూ...అభివృద్ధి, సందర్శకుల భద్రతలో ఏపీకి ఢోకా లేదని, అనతికాలంలోనే అంతర్జాతీయ పర్యాటకుల స్వర్గధామం (టూరిస్ట్‌ డెస్టినేషన్‌)గా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ... విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో మెగా కన్వెన్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైల్‌, రోడ్డు నెట్‌వర్క్‌ను అనుసంధానం చేయడంతో పాటు బీచ్‌ కారిడార్‌లో మరిన్ని జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సందర్శకులను ఆకర్శించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరు టూరిస్ట్‌ హబ్‌లను సృష్టిస్తున్నామని, అవి విశాఖ, శ్రీశైలం, రాజమహేంద్రవరం-కోనసీమ-కాకినాడ, విజయవాడ-అమరావతి, తిరుపతి, అనంతపురం-పుట్టపర్తి అని వివరించారు. రాష్ట్రంతో భాగస్వాములు కావడానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు ప్రత్యేక కమిషనర్‌ భావన సక్సేనా మాట్లాడుతూ.. పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు, పూర్తి మద్దతు ఉంటాయని భరోసా ఇచ్చారు. హోటల్స్‌, రిస్టార్స్‌, ఎంఐసీఈ కేంద్రాలు (మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, కాన్ఫరెన్సెస్‌, ఎగ్జిబిషన్స్‌), థీమ్‌ పార్కులు, సాంస్కృతిక కేంద్రాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు.సదస్సులో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఇన్‌ ఇండియన్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ చైర్మన్‌, ఐటీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నకుల్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతి ఐకానిక్‌ వంతెనకు శంకుస్థాపన 

6CxXrag.jpg

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి రెండు కీలకమైన ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు. తాగునీటి అవసరాలకు చేపడుతున్న నీటిశుద్ధి ప్లాంట్‌కు కూడా భూమిపూజ చేశారు. 

ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై రూ.1387 కోట్లతో 3.2కి.మీ.ల పొడవైన ఐకానిక్‌ వంతెనను నిర్మించనున్నారు. దీని మధ్యలో 0.48కి.మీ.ల భాగాన్ని ఐకానిక్‌గా నిర్మిస్తారు. ఈ భాగంలో యోగ భంగిమను పోలిన విధంగా పైలాన్‌ ఉంటుంది. దీనిని వంతెనతో అనుసంధానిస్తూ రెండు పక్కలా తీగల అమరిక ఉంటుంది. ఈ పైలాన్‌ ఎత్తు 170 మీటర్లు. ఆరు వరుసలుగా నిర్మిస్తారు. రెండు పక్కలా 2.5 మీటర్ల వెడల్పైన నడకదారి ఉంటుంది. నిర్మాణానికి పైల్‌ ఫౌండేషన్‌ వేస్తారు. ఈ వంతెనతో హైదరాబాద్‌, జగదల్‌పూర్‌ జాతీయ రహదారులు అమరావతితో అనుసంధానమవుతాయి. ఆ రెండు ప్రాంతాల నుంచి 40 కి.మీ.ల దూరంతో పాటు విజయవాడలో ట్రాఫిక్‌ కూడా తగ్గుతుంది. 2 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

రాజధాని తాగునీటి అవసరాలకు రూ.745.65 కోట్లతో నిర్మించే వ్యవస్థలో భాగంగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వద్ద 13 మీటర్ల చుట్టు కొలత కలిగిన రెండు ఇన్‌టేక్‌ బావులు నిర్మిస్తారు. కృష్ణాయపాలెం వద్ద 190ఎంఎల్‌డీ సామర్థ్యంగల నీటి శుద్ధి కేంద్రం, 64ఎంఎల్‌ సామర్థ్యం గల... పాక్షికంగా భూగర్భంలో ఉండే... శుద్ధజల రిజర్వాయర్‌, క్లియర్‌ వాటర్‌ పంప్‌ ఏర్పాటవుతాయి. * నీటి పంపిణీ కేంద్రం వద్ద పాక్షికంగా భూగర్భంలో ఉండే 8రిజర్వాయర్లు, ఏడు ఎలివేటెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు నిర్మిస్తారు. 1500-2000మి.మీ.ల చుట్టుకొలత కలిగిన 45కి.మీ.ల పొడవైన క్లియర్‌ వాటర్‌ రింగ్‌ మెయిన్‌ (పంపింగ్‌ మెయిన్‌) నిర్మిస్తారు. దీని నుంచి ఈ కేంద్రాలకు 58 కి.మీ.పొడవైన పైప్‌లైన్లు (500 నుంచి 1500 మి.మీ.ల చుట్టుకొలత కలిగిన) వేస్తారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...