Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో ‘వెల్‌కం గ్యాలరీ’కి సీఎం శంకుస్థాపన
10-01-2019 11:07:35
 
636827152558803189.jpg
అమరావతి: స్టార్టప్ ఏరియా ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు. లింగాయపాలెం స్టార్టప్‌ ఏరియాలో మొత్తం 50 ఎకరాలలో రూ.44 కోట్లతో వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు. బిజినెస్‌ ప్రమోషన్‌కు వీలుగా గ్యాలరీ భవన నిర్మాణం జరుగనుంది.
Link to comment
Share on other sites

అంకుర అభివృద్ధిలో భాగంగా వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణం: చంద్రబాబు
10-01-2019 13:52:33
 
636827251542774718.jpg
అమరావతి: స్టార్టప్ ఏరియా ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంకుర అభివృద్ధిలో భాగంగా వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారి రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. సింగపూర్‌ ప్రభుత్వం మద్దతుతో.. టెక్నాలజీ డెవలెప్‌ చేయాలన్నా, ప్రొజెక్టు చేయాలన్నా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. చాలా అంశాల్లో సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు.
 
టీడీపీ ప్రతిష్టాత్మంగా చేపట్టిన జన్మభూమి ప్రోగ్రెస్‌ రేపు (శుక్రవారం) ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి ఉండాలనే విధంగా నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. త్వరలోనే ప్రతి కుటుంబానికి స్మార్ట్‌ఫోన్‌ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో నదులను అనుసంధానం చేస్తున్నామని, ప్లాన్‌, నైపుణ్యం ఇతర అంశాల్లో సింగపూర్‌ సహకారం అందిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు. లింగాయపాలెం స్టార్టప్‌ ఏరియాలో మొత్తం 50 ఎకరాలలో రూ.44 కోట్లతో వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు.
Link to comment
Share on other sites

సింగపూర్ సహకారంతో గ్యాలరీ నిర్మాణం: చంద్రబాబు
10-01-2019 14:07:28
 
636827260487392838.jpg
అమరావతి: రాజధానిలో గ్యాలరీ నిర్మాణం సింగపూర్‌ సహకారంతో ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్టార్టప్ ఏరియా ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి సీఎం గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌, పరిపాలన వ్యవహారాల్లో సింగపూర్‌ సహకారం అందిస్తోందని అన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, నైపుణ్యంలో సింగపూర్‌ సహకరిస్తోందని, రాజధానిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ-ప్రగతి, రియల్‌ టైం గవర్నెన్స్‌ అమలు ద్వారా మంచి పాలన అందిస్తున్నామని, దాదాపు కోటిన్నర ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. బిగ్‌ డేటా సెంటర్‌ను ఏపీలో అదాని గ్రూప్‌ ఏర్పాటు చేస్తోందన్నారు. అందుబాటులో విస్తారమైన వనరులు, నీటి లభ్యత ఉందని చంద్రబాబు వెల్లడించారు. రాజధానిలో పరిపాలన భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ట్రంక్ ఇన్ఫ్రా అందుబాటులోకి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ సాయం చేస్తోందన్నారు.
Link to comment
Share on other sites

ఇది ప్రారంభం మాత్రమే: సింగపూర్ మంత్రి ఈశ్వరన్
10-01-2019 14:27:10
 
636827272310833823.jpg
అమరావతి: ఏపీ, సింగపూర్‌ సంబంధాల్లో కీలకమైన ముందడుగు పడిందని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అన్నారు. గురువారం వెలకం గ్యాలరీ శంకుస్థాపన కార్యక్రమంలో సింగపూర్ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీతో బంధం రోజురోజుకీ బలపడుతోందని తెలిపారు. మొదటి దశలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని,అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. వెల్‌కం గ్యాలరీ అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తుందని పేర్కొన్నారు. గ్యాలరీ ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని ఆయన అన్నారు. సింగపూర్‌, జపాన్‌, జర్మనీల నుంచి వెల్‌కం గ్యాలరీ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే అని.. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఉంటాయని ఈశ్వరన్‌ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

వ్యాంధ్ర రాజధాని #అమరావతి లో జరుగుతున్న నిర్మాణాలను ఏపీ ముఖ్యమంత్రి @ncbn తో కలిసి పరిశీలించిన సింగపూర్ కమ్యూనికేషన్లు-ఇన్ఫర్మేషన్ మంత్రి ఎస్ ఈశ్వరన్. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, మీకు అన్నివిధాలా సింగపూర్ అండగా ఉంటుందని ఈశ్వరన్ తెలిపారు. #Amaravati #AndhraPradesh

DwjbKW9UYAA053L.jpg
DwjbRKmVYAEDynN.jpg
DwjbSnTUwAArAuA.jpg
Link to comment
Share on other sites

అమరావతికి స్వాగత తోరణం 

 

‘వెల్‌కం గ్యాలరీ’కి ముఖ్యమంత్రి శంకుస్థాపన 
  ‘సింగపూర్‌’ హామీని నిలబెట్టుకుంటున్నా 
  అతి త్వరలో ప్రపంచానికే ఆదర్శమవుతాం 
  చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు 
  అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా తీర్చిదిద్దుతాం: ఈశ్వరన్‌ 
ఈనాడు - అమరావతి, తుళ్లూరు - న్యూస్‌టుడే

10ap-main3a_3.jpg

రాజధాని అమరావతిని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అప్పటి ఆలోచనలన్నీ ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయని, రాజధాని ఒక రూపు సంతరించుకుంటోందని చెప్పారు. రాజధానిలోని అంకుర ప్రాంత అభివృద్ధి ప్రదేశంలో అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) చేపట్టే ‘వెల్‌కమ్‌ గ్యాలరీ’ నిర్మాణానికి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

‘అమరావతిలో రూ.40వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెల్‌కమ్‌ గ్యాలరీ రాజధానికి ముఖద్వారంగా ఉంటుంది. అత్యుత్తమ ఆచరణలు, అత్యాధునిక సాంకేతికతలను ఈ గ్యాలరీలో ప్రవేశపెట్టొచ్చు. సాంకేతికతను వినియోగించి పారదర్శక పరిపాలనను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. అతి త్వరలో ప్రపంచానికే ఆదర్శమవుతుంది.’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 
అదానీ గ్రూపుతో కలిసి ప్రపంచంలోనే అద్భుతమైన డేటా కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నాం. 
అతి తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రాల జాబితాలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం. 
సులభతర వాణిజ్యంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. 
ప్రజలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలను కల్పిస్తున్నాం. 
ప్రతి కుటుంబానికి త్వరలో స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వనున్నాం.

అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా చేస్తాం 
రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది? పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడున్న అవకాశాలేమిటనే అంశాలను ‘వెల్‌కమ్‌ గ్యాలరీ’లో చూపిస్తామని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ తెలిపారు. ‘అంకుర ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన సంస్థలు ముందుకొచ్చాయి. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా అనేక సంస్థలు వస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, సృజనాత్మక ఆలోచనల వల్లే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.

15 సంస్థలతో ఒప్పందాలు 
అంకుర ప్రాంత అభివృద్ధిలో భాగంగా అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) పలు సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. జర్మనీ, జపాన్‌, సింగపూర్‌తో పాటు భారత్‌కు చెందిన 15 సంస్థలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. చంద్రబాబు, ఈశ్వరన్‌ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

10ap-main3b_2.jpg

తక్కువ సమయంలో ఇంత అభివృద్ధా: ఈశ్వరన్‌ 
రాజధాని అమరావతిలో అతి తక్కువ సమయంలో చాలా అభివృద్ధి సాధించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అభినందించారు. ప్రభుత్వ భవన నిర్మాణ సముదాయాలను వారిద్దరు పరిశీలించారు. 5 టవర్లుగా నిర్మిస్తున్న సచివాలయ భవనాల 2 పిల్లర్లకు వేసిన రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను ఈశ్వరన్‌కు చంద్రబాబు చూపించారు. అంతకు ముందు చంద్రబాబుతో కలిసి రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని ఈశ్వరన్‌ సందర్శించారు. ఆర్టీజీ పనితీరు స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు. రాజధాని పనుల వేగాన్ని చూసి ఈశ్వరన్‌ ఆశ్చర్యపోయారని, ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయని అనుకోలేదని వ్యాఖ్యానించారని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు.

మరోవైపు భారత్‌లోని ప్రతిభకు సింగపూర్‌ సామర్థ్యం తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ఈశ్వరన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సింగపూర్‌కు చెందిన సింక్రో స్కిల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో పెళ్లి కుమార్తెల అలంకరణ, ఫొటో గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు విజయవాడలో నిర్వహించిన పట్టభద్రుల వేడుకలో ఆయన మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినుల ఫ్యాషన్‌ షో, వస్త్రాలంకరణ ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.

విమాన సర్వీసులను పెంచాలి 
విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇకపై వారానికి 4 రోజులు విమానాలు నడిచేందుకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టాలని అమరావతి ప్రాజెక్టు సంయుక్త అమలు పర్యవేక్షణ కమిటీ (జేఐఎస్‌సీ) సమావేశం తీర్మానించింది. ఫిబ్రవరి నుంచి దుబాయ్‌- విజయవాడ మధ్య విమాన సర్వీసులకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు నాయుడు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ల సారథ్యంలో జేఐఎస్‌సీ నాలుగో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండాలో పేర్కొన్న 6 ప్రధానాంశాలపై చర్చించారు. వాటన్నింటినీ సంపూర్ణంగా ఆమోదిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణం 75 రోజుల్లో పూర్తి కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

వెల్‌కమ్‌ గ్యాలరీ విశేషాలు... 
విస్తీర్ణం: 5 ఎకరాలు (2.6 హెక్టార్లు) 
నిర్మిత ప్రాంతం: 4,080 చ.మీటర్లు 
కార్యకలాపాలు ప్రారంభమయ్యేది: 2019 అక్టోబరు చివరికి 
సందర్శకుల సామర్థ్యం: రోజుకు 2 వేల నుంచి 3వేల మంది

ఏమేం ఉంటాయి? 
సిటీ గ్యాలరీ: ఆంధ్రప్రదేశ్‌ ఔన్నత్యాన్ని, ఇక్కడి ప్రజల సంస్కృతిని గుర్తు చేసేలా.. 
ఎగ్జిబిషన్‌ జోన్‌: కళలు, వినూత్న సాంకేతికత, అర్బన్‌ సొల్యూషన్స్‌కు వేదిక. 
సామాజిక ప్రదేశాలు (కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ ఏరియా): కన్వెన్షన్‌ సెంటర్లు, వినోద, విహార జోన్లు, ఆరోగ్య కేంద్రాలు. 
పని ప్రదేశాలు (కో-వర్కింగ్‌ జోన్లు): రాజధానిలో అంకుర ప్రాంత అభివృద్ధిని ప్రోత్సహించే కేంద్రాలు.


రూ.600 కోట్లతో శ్రీసిటీలో యాంకర్‌ కంపెనీ

10ap-main3c.jpg

జపాన్‌కు చెందిన యాంకర్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీ శ్రీసిటీలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మొదటి విడత రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టి దశలవారీగా మరో రూ.350 కోట్లు వెచ్చించనుంది. గురువారం అమరావతి వెల్‌కం గ్యాలరీ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో యాంకర్‌ ఎలక్ట్రికల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టరు దినేశ్‌ అగర్వాల్‌, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) జాస్తి కృష్ణ కిశోర్‌తో ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమంలో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ కూడా పాల్గొన్నారు. దాదాపు 55ఏళ్ల క్రితం ఏర్పాటైన యాంకర్‌ కంపెనీని 2007లో జపాన్‌కు చెందిన పానాసోనిక్‌ కొనుగోలు చేసింది.

 

 
 
Link to comment
Share on other sites

అత్యుత్తమ నగరంగా.. అమరావతి
11-01-2019 09:24:01
 
636827954424964587.jpg
  • స్టార్టప్‌ ఏరియాలో వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన
  • హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌
  • రాజధాని అభివృద్ధికి సింగపూర్‌ సహకారం మరువలేం: సీఎం ఫ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం..: ఈశ్వరన్‌
తుళ్లూరు: రాజధాని అమరావతి అభివృద్ధికి సింగపూర్‌ అందిస్తున్న సహకారం మరువలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లింగాయపాలెం రెవెన్యూలోని స్టార్టప్‌ ప్రాంతంలో గురువారం వెల్‌కం గ్యారీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రూ.48 వేల కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని మాటిచ్చాను.. ఇప్పుడు ఆమాట నిలబెట్టుకుంటున్నాను అని అన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిని మనం నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని ఐదు నగరాల్లో రాజధాని ఒక అత్యుత్తమ నగరం కావాలన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన డేటా సెంటర్‌ హబ్‌ విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డేటా సెంటర్‌ పార్క్‌తో పాటు, సోలార్‌ పార్క్‌లు వస్తున్నాయని చెప్పారు. రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు. లక్షా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగతాయన్నారు. సాంకేతికత ద్వారా పారదర్శకంగా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ సింగపూర్‌ మధ్య గట్టి బంధం ఏర్పడిందని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ పేర్కొన్నారు.
 
bwerawere.jpgఅందువల్లే వివిధ రంగాల్లో అద్భుత సహకారం సాధ్యమైందన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు ముందు చూపు, సృజనాత్మక ఆలోచనల వల్లే ఇది సాధ్యం అయ్యిందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో ఇది తొలి అడుగు మాత్రమేనని పేర్కొన్నారు. ఇదే రకమైన సహకారం ముందు కూడా ఉంటుందన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌కి సహకరించిన రైతులకు సీఎం చంద్రబాబు, ఈశ్వరన్‌ ధన్యవాదాలు చెప్పారు. రైతుల ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని నగరం నిర్మిస్తామని చెప్పారు. ఉదయం 9.30 గంటలకు వెల్‌కం గ్యాలరీ శంకుస్థాపన అని తొలుత ప్రకటించారు. కాని పొగమంచు వలన సింగపూర్‌ మంత్రి రావటంలో ఆలస్యమైంది. 12.45 గంటలకి వేదిక ప్రదేశానికి చేరుకున్నారు. తొలుత ఫొటో గ్యాలరీని సీఎం పరిశీలించారు.
 
tertert.jpgకార్యక్రమంలో రాజధాని రైతులు, సింగపూర్‌ కంపెనీ, జర్మన్‌ , జపాన్‌ కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు పాల్గొని స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందాలు సీఎం సమక్షంలో చేసుకున్నాయి. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి రాజధాని నిర్మాణాల పనులు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, సీఎం చంద్రబాబు పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, ఎంపీపీ పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారధి, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌, ల్యాండ్సు డైరెక్టర్‌ చెన్నకేశవరావు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జానీమూన్‌మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి, , గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌, రూరల్‌ ఎస్పీ శేఖర్‌బాబు, సింగపూర్‌ కంపెనీల ప్రతినిధుల బృందాలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ల సాకారం!
11-01-2019 02:53:57
 
636827720382431732.jpg
  • రైతులు, సింగపూర్‌ సహకారంతోనే ఘన అమరావతి
  • విశ్వనగరం దిశగా వడిగా అడుగు
  • ఇలలోనే సుందర రాజధాని ఇది
  • నాగరిక నగరాలకు జలమే బలం
  • కృష్ణా రూపంలో పుష్కలం: సీఎం
  • వెల్‌కమ్‌ గ్యాలరీకి ఈశ్వరన్‌తో
  • కలసి ముఖ్యమంత్రి శంకుస్థాపన
  • స్టార్టప్‌ ఏరియాలో ఐదు ఎకరాల్లో
  • వెల్ కమ్ గ్యాలరీ శంకుస్థాపనలో చంద్రబాబు
  • ఈశ్వరన్ సమక్షంలో ఒప్పందాల మార్పిడి
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): నిన్నమొన్నటి వరకూ ఒక స్వప్నంలా అనిపించిన అమరావతి నిర్మాణం ప్రస్తుతం పరుగులు పెడుతోందని, ఆ వేగం చూస్తుంటే అతి త్వరలోనే అది తెలుగు ప్రజలు ఆకాంక్షిస్తున్న విధంగా ప్రపంచస్థాయి అగ్ర నగరాల్లో ఒకటిగా అవతరించడం ఖాయమనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సుమారు 40,000 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులు రాజధానిలో వివిధ దశల్లో ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని వస్తాయని పేర్కొన్నారు. అమరావతిలోని లింగాయపాలెం వద్ద స్టార్టప్‌ ఏరియాలోని 5 ఎకరాల్లో నిర్మించనున్న వెల్‌కమ్‌ గ్యాలరీకి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. దట్టమైన మంచు కారణంగా సింగపూర్‌ కమ్యూనికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ మంత్రి ఈశ్వరన్‌ వస్తున్న విమానం ఆలస్యం కావడంతో నిర్ణీత సమయం కంటే సుమారు మూడున్నరగంటల ఆలస్యంగా వెల్‌కమ్‌ గ్యాలరీ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈశ్వరన్‌ ప్రసంగించిన అనంతరం వారిద్దరూ కలసి శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించారు.
 
ఆ తర్వాత ఈ గ్యాలరీ నిర్మాణంలో భాగస్వాములవుతున్న వివిధ దేశాలకు చెందిన సుమారు 15 కంపెనీలతోను, రూ.600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి ఏపీఈడీబీతోను ఏడీపీ, సింగపూర్‌ సంస్థలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. రాజధాని రైతుల త్యాగాల ఫలితంగా సమకూరిన వేలాది ఎకరాల్లో అమరావతి నిర్మాణం చురుగ్గా సాగుతోందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ‘పలు కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. ఈ తరుణంలో రాజధాని ప్రగతికి మరింత ఊతమిచ్చేందుకు స్టార్టప్‌ ఏరియాలో ఇప్పుడీ వెల్‌కం గ్యాలరీ నిర్మాణం జరగబోతుండడం హర్షణీయం.
 
చిత్తశుద్ధితో, ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుండడం వల్లనే ప్రస్తుతం అమరావతిలో సుమారు రూ.40,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. మరిన్ని రాబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం అమరావతి అభివృద్ధి ఫాస్ట్‌ ట్రాక్‌పై పరుగులు పెడుతోంది. సింగపూర్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ అమలయ్యేలా ఈ పనులు జరుగుతున్నాయి’ అని చంద్రబాబు వివరించారు. నాగరిక నగరాలకు జలమే బలమని, జల వనరులు పుష్కలంగా కలిగిన పవిత్ర కృష్ణ వేణమ్మ తీరాన వెలియనుండడం అమరావతికి ఎప్పటికీ కొండంత అండ అని సీఎం వ్యాఖ్యానించారు. కృష్ణా - గోదావరితోపాటు రాష్ట్రంలోని వివిధ నదుల అనుసంఽధానానికి ఈ ప్రాంతం వేదికగా నిలవనుందన్నారు.
 
సింగపూర్‌ సహకారం మరవలేం..
ప్రపంచమే నివ్వెరబోయి చూసేలా రాజధాని నిర్మితమవుతోందంటే అందుకు సహకరిస్తున్న సింగపూర్‌ ప్రభుత్వపు చేయూతా కలిసి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ‘మాస్టర్‌ ప్లాన్‌ తయారీ దగ్గర నుంచి అమరావతిలో మౌలిక వసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తదితరాలతోపాటు ఇప్పుడీ స్టార్టప్‌ ఏరియా ద్వారా సింగపూర్‌ మనకు ఎంతో తోడ్పడుతోంది. వీటన్నింట్లో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ పాత్ర మరింత ప్రశంసార్హం. ఈ-ప్రగతి, ఆర్టీజీఎస్‌, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోంది. నాలుగేళ్ల క్రితం జన్మభూమి గ్రామసభలు నిర్వహించినప్పుడు చేతికి అందిన దరఖాస్తుల సంఖ్య సుమారు 5 కోట్లుండగా, తాజాగా జరుగుతున్న సభల్లో వాటి సంఖ్య 4 లక్షలకు తగ్గిపోయిందంటే ఇదే కారణం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌- సింగపూర్‌ మధ్య కుదిరిన వివిధ అవగాహన ఒప్పందాల అమలు పురోగతిని సమీక్షించేందుకు ఆరు నెలలకోసారి నిర్వహించే జేఐఎ్‌ససీ (జాయిం ట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ) సమావేశంలో ముఖ్యమంత్రి, ఈశ్వరన్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
నూతన శకం ఆరంభం: ఈశ్వరన్‌
అమరావతి రూపకల్పనలో సహకరించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌-సింగపూర్‌ మధ్య బంధం వెల్‌కమ్‌ గ్యాలరీకి శంకుస్థాపనతో మరింత పటిష్టమైందని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అన్నారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారుల సృజన, ముందుచూపు వల్లనే అమరావతి ఇంత వేగంగా నిర్మితమవుతోంది. వెల్‌కం గ్యాలరీ వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఒనగూరుతాయి. అమరావతిలోని అపారావకాశాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకుని వెళ్లి, పెద్దఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వచ్చేలా చూడడం వాటిల్లో ఒకటి. ఈ గ్యాలరీ నిర్మాణంలో పలు దేశాలకు చెందిన 15కుపైగా సుప్రసిద్ధ సంస్థలు పాలుపంచుకోవడం ద్వారా ఇప్పటికే అమరావతికి రావడం మొదలైన కంపెనీల ఆగమనం మరింత ఊపందుకోవడం రెండో ప్రయోజనం. అమరావతి పురోగతికి ఇకపై కూడా ఇదే విధంగా సింగపూర్‌ తోడ్పడుతుంది.
 
మీ ఆర్టీజీ.. స్ఫూర్తిదాయకం: గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న పలు కట్టడాల పనులను ఈశ్వరన్‌ పరిశీలించారు. చంద్రబాబు వెంట రాగా ఆయన ఆర్టీజీని సందర్శించారు. ఇటీవలి తుఫాను గమనాన్ని, అనంతర సహాయక చర్యలను ఈ కేంద్రం నుంచే పర్యవేక్షించినట్లు ఆయనకు సీఎం తెలియజేశారు. ఆర్టీజీ పని విధానం స్ఫూర్తిదాయకంగా ఉందని ఈశ్వరన్‌ ప్రసంశించారు. అనంతరం ప్రభుత్వ నివాస సముదాయాలు, జ్యుడీషియల్‌ కాంప్లె క్స్‌ తదితరాలను బయటి నుంచే తిలకించారు. సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోని 5 టవర్లలో ఒకటైన జీఏడీ టవర్‌కు ఇటీవల ముగిసిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను చూశారు. ఆ తర్వాత వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు పీ నారాయణ, నక్కా ఆనందబాబు, ఏడీసీ సీఎండీ డీ లక్ష్మీ పార్థసారథి, ఏపీసీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, స్పెషల్‌ కమిషనర్‌ వీ రామమనోహరరావు, అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌, ఏపీ టిడ్కో చైర్‌పర్సన్‌ రామనాథ్‌, ఏడీపీ ఉన్నతాఽధికారులు డాక్టర్‌ ఫ్రాన్సిస్‌ చాంగ్‌, బెంజమిన్‌ యాప్‌, రాజధాని రైతులు, పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 
గ్యాలరీ ప్రత్యేకతలు..
సింగపూర్‌ కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) భాగస్వాములుగా ఉన్న ఏడీపీ (అమరావతి డెవల్‌పమెంట్‌ పార్ట్‌నర్స్‌) ఆధ్వర్యంలో ఈ గ్యాలరీ నిర్మితమవనుంది. స్టార్టప్‌ ఏరియా విస్తీర్ణం 1691 ఎకరాలు కాగా అందులోని 50 ఎకరాల్లో రానున్న క్యాటలిటిక్‌ డెవల్‌పమెంట్‌ జోన్‌లోని 5 ఎకరాల్లో, 75,000 చదరపుటడుగుల విస్తీర్ణంతో దీనిని నిర్మిస్తున్నారు. శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన అమరావతి గతం, వర్తమానం, భవిష్యత్తుల గురించి సందర్శకులకు స్పష్టంగా తెలియజేసేలా ఈ గ్యాలరీని సుమారు రూ.40 కోట్లతో నిర్మించబోతున్నారు. అమరావతిలో వస్తున్న ప్రాజెక్టులపై సమాచారమివ్వడమే కాకుండా అందులో పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉన్న విస్తృతావకాశాలను దేశ విదేశాల వారికి తెలిపేలా ఇది ఉండబోతోంది.
Link to comment
Share on other sites

అమరావతిలో సాంకేతిక వర్సిటీ 

 

దీని పరిధిలోకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు 
నివేదిక రూపొందించేందుకుకమిటీ ఏర్పాటు

ఈనాడు, అమరావతి: అమరావతిలో కొత్తగా ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి నివేదికను రూపొందించేందుకు ఉన్నత విద్యామండలి ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్జీయూకేటీ ఉపకులపతి రామచంద్రరాజు, డైరెక్టర్‌ సుదర్శన్‌రావు, జేఎన్‌టీయూ కాకినాడ మాజీ రిజిస్ట్రార్‌ ప్రసాద్‌రాజు, నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్లు రంగయ్య, ఎం.వీ.ఎన్‌ శర్మ ఇందులో సభ్యులుగా ఉన్నారు. నూతన వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన నివేదికపై ఈ కమిటీ కసరత్తు చేస్తోంది. శుక్ర లేదా శనివారం ఈ నివేదిక కొలిక్కిరానున్నట్లు సమాచారం. జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను విడదీసి ఈ నూతన వర్సిటీ కిందకు తీసుకురానున్నారు. ఈ మూడు జిల్లాల్లోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ కళాశాలలు కొత్త వర్సిటీకి అనుబంధంగా ఉండనున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలో ఉన్నందున రిజర్వేషన్‌ సమస్య వస్తుందనే ఉద్దేశంతో దీన్ని కొత్త వర్సిటీ పరిధిలోకి తీసుకురావాలా? వద్దా? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నారు.

భారం తగ్గించేందుకు.. 
జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 275 వరకు కళాశాలలున్నాయి. వీటిలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు 178 ఉండగా.. వీటిల్లో 88,177 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాకినాడ, నర్సరావుపేట,  విజయనగరంలలో వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా.. వీటిల్లో 1,010 సీట్లు ఉన్నాయి. వర్సిటీకి అనుబంధ కళాశాలలు అధికంగా ఉండడంతో వీటి తనిఖీలు, పరిశీలనలు సమస్యగా మారుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ కాకినాడపై భారం తగ్గించేందుకు కొత్తగా అమరావతిలో వర్సిటీని ప్రతిపాదించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 140వరకు కళాశాలలు ఉన్నాయి.

ఏం పేరు పెట్టాలి? 
కొత్త విశ్వవిద్యాలయానికి ఏ పేరు పెట్టాలనే దానిపైనా కమిటీ కసరత్తు చేస్తోంది. జేఎన్‌టీయూ అమరావతి, అమరావతి సాంకేతిక విశ్వవిద్యాలయం, గౌతమబుద్ధ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం తదితర పేర్లను పరిశీలిస్తోంది.

 

 
Link to comment
Share on other sites

ఐకానిక్‌ బ్రిడ్జి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

అమరావతి: రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శనివారం ఈ వంతెనకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విజయవాడ శివారులోని పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిని అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని అమరావతి అభివృద్ధి కార్పోరేషన్ చేపట్టనుంది. 3.2 కిలోమీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జిగా నిర్మాణం చేపట్టనున్న ఐకానిక్ వంతెన కోసం 1387 కోట్ల రూపాయలు వ్యయం కానున్నాయి. ఆరు లేన్లుగా కృష్ణా నదిపై నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెనపై దేశంలోనే అత్యంత ఎత్తైన పైలాన్ కూడా నిర్మించనున్నారు. దీని ఎత్తును 170 మీటర్లుగా నిర్థరించారు. 125 మీటర్ల వెడల్పున నిర్మాణం చేయనున్న ఈ ఐకానిక్ వంతెనలో ఇరువైపులా 2.5 మీటర్ల ఫుట్ పాత్‌ను కూడా నిర్మిస్తున్నారు. పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిలోని తాళ్లాయపాలెం, రాయపూడి వద్ద ఈ వంతెన నిర్మాణం కోసం నదిలో 40 నుంచి 50 మీటర్ల లోతున పైల్స్ ను నిర్మించనున్నారు.

 
అదే సమయంలో 4వ నెంబరు జాతీయ జలమార్గంలో కార్గో రవాణా కోసం వీలుగా ఈ వంతెన నిర్మితం కానుంది. ఈ వంతెన నిర్మాణంతో హైదరాబాద్, జగదల్ పూర్‌లకు వెళ్లే మార్గం 40 మీటర్ల దూరం తగ్గనుంది. ప్రయాణికులు, రవాణాకు రెండు గంటల సమయం ఆదా కానుంది. అటు విజయవాడ ట్రాఫిక్ భారం కూడా ఈ వంతెన కారణంగా తగ్గిపోనుందని అంచనా వేస్తున్నారు. మొత్తం రెండేళ్లలో నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెన నిర్మాణ బాధ్యతను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. వంతెన నిర్మాణం కోసం నదిలో దాదాపు 36 పిల్లర్లను వేయనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారికి ఈ వంతెనను అనుసంధానం చేసేలా నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ వంతెన నిర్మాణాన్ని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ పర్యవేక్షించనుంది.
Link to comment
Share on other sites

6 hours ago, sonykongara said:

 

ఐకానిక్‌ బ్రిడ్జి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

అమరావతి: రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శనివారం ఈ వంతెనకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విజయవాడ శివారులోని పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిని అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని అమరావతి అభివృద్ధి కార్పోరేషన్ చేపట్టనుంది. 3.2 కిలోమీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జిగా నిర్మాణం చేపట్టనున్న ఐకానిక్ వంతెన కోసం 1387 కోట్ల రూపాయలు వ్యయం కానున్నాయి. ఆరు లేన్లుగా కృష్ణా నదిపై నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెనపై దేశంలోనే అత్యంత ఎత్తైన పైలాన్ కూడా నిర్మించనున్నారు. దీని ఎత్తును 170 మీటర్లుగా నిర్థరించారు. 125 మీటర్ల వెడల్పున నిర్మాణం చేయనున్న ఈ ఐకానిక్ వంతెనలో ఇరువైపులా 2.5 మీటర్ల ఫుట్ పాత్‌ను కూడా నిర్మిస్తున్నారు. పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిలోని తాళ్లాయపాలెం, రాయపూడి వద్ద ఈ వంతెన నిర్మాణం కోసం నదిలో 40 నుంచి 50 మీటర్ల లోతున పైల్స్ ను నిర్మించనున్నారు.

 
అదే సమయంలో 4వ నెంబరు జాతీయ జలమార్గంలో కార్గో రవాణా కోసం వీలుగా ఈ వంతెన నిర్మితం కానుంది. ఈ వంతెన నిర్మాణంతో హైదరాబాద్, జగదల్ పూర్‌లకు వెళ్లే మార్గం 40 మీటర్ల దూరం తగ్గనుంది. ప్రయాణికులు, రవాణాకు రెండు గంటల సమయం ఆదా కానుంది. అటు విజయవాడ ట్రాఫిక్ భారం కూడా ఈ వంతెన కారణంగా తగ్గిపోనుందని అంచనా వేస్తున్నారు. మొత్తం రెండేళ్లలో నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెన నిర్మాణ బాధ్యతను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. వంతెన నిర్మాణం కోసం నదిలో దాదాపు 36 పిల్లర్లను వేయనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారికి ఈ వంతెనను అనుసంధానం చేసేలా నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ వంతెన నిర్మాణాన్ని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ పర్యవేక్షించనుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...