Jump to content

Amaravati


Recommended Posts

ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌లో రికార్డు?
04-01-2019 03:54:35
 
  • నేడు పూర్తికానున్న 2 టవర్ల పనులు
అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో సెక్రటేరియట్‌ టవర్లలోని రెండింటి(3, జీఏడీ) ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు శుక్రవారం పూర్తవనున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే జీఏడీ టవర్‌ ఫౌండేషన్‌ సుమారు 60 గంటల రికార్టు సమయంలోనే పూర్తయిన ఘనత దక్కనుంది! 3వ టవర్‌ ఫౌండేషన్‌ పనులు గత మంగళవారం మొదలవగా, జీఏడీ టవర్‌ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. వీటి పరిమాణాన్ని బట్టి ఒక్కొక్క టవర్‌ ఫౌండేషన్‌ పనులు పూర్తవ్వాలంటే 3 రోజులు అవసరం. అది కూడా ఒక్క క్షణం కూడా పనులు ఆపకుండా చేపట్టాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే 5 టవర్లతో కూడిన సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లో మొట్టమొదటగా గత నెల 27వ తేదీన ప్రారంభమైన తొలి టవర్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు 65 గంటల్లోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత 3, జీఏడీ టవర్‌ల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు వరుసగా మంగళ, బుధవారాల్లో మొదలయ్యాయి.
 
షెడ్యూల్‌ ప్రకారం 3వ టవర్‌ పనులు శుక్రవారమే పూర్తి కానున్నాయి. కాగా, జీఏడీ టవర్‌ పనులు శనివారం నాటికి ముగియాల్సి ఉండగా, శుక్రవారం రాత్రి లేదా అర్ధరాత్రి కల్లా పూర్తవనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటి వరకూ ఈ భారీ ఫౌండేషన్‌ పనులు చేపట్టిన 3 టవర్లలోకెల్లా అత్యంత వేగంగా పూర్తయిన టవర్‌గా జీఏడీ టవర్‌ నిలవనుంది. కాగా, శాశ్వత సచివాలయ సముదాయంలోని మిగిలిన రెండు(1, 4) టవర్ల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనుల్లో ఒక దాన్ని సంక్రాంతి తర్వాత, మిగిలిన దాని పనులు ఈ నెలాఖర్లో చేపట్టనున్నట్టు సమాచారం.
Link to comment
Share on other sites

పచ్చందనమే... పచ్చదనమే!
04-01-2019 03:02:46
 
636821677670681098.jpg
తవ్వకాల తంటాకు టాటా!
రోడ్డు వేయడం... ఆ తర్వాత అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, కేబుళ్లు, వాటర్‌ పైప్‌లైన్లు ఇలా రకరకాల పేర్లతో ఎడాపెడా తవ్వడం! అమరావతి పరిధిలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి రానే రాదు! విద్యుత్తు, నీరు, వంటగ్యాస్‌, సమాచార వ్యవస్థ ఇలా అన్ని అవసరాలకోసం ప్రత్యేకంగా భూగర్భంలోనే ‘డక్ట్‌’లు నిర్మిస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ పొడవునా ఏకంగా ఆరు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తుతో డక్ట్‌లు నిర్మిస్తున్నారు. ఇలా అన్ని రోడ్ల వెంట ఇలాంటి డక్ట్‌లు ఉంటాయి. అన్నిరకాల ‘కనెక్షన్ల’కు సంబంధించిన పైప్‌లైన్‌లు అందులోనే ఉంటాయి. వర్షపునీటి ప్రవాహానికీ ప్రత్యేకంగా కాల్వలు ముందుగానే తవ్వేస్తున్నారు. అంటే... ఒకసారి వేసిన రోడ్డుమీద మళ్లీ గునపం పడే ప్రసక్తే లేదు! మొత్తం రాజధాని తాగునీటి అవసరాలకోసం భూగర్భంలో భారీ పైప్‌లైన్ల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది.
 
 
Shapoorji-Pallonji-Group--s.jpgటవర్‌.. పవర్‌
మొత్తం రాజధాని పరిధిలో సమున్నతంగా నిలిచే భవనాలు... సచివాలయ టవర్లు! మొత్తం ఐదు ఆకాశ హర్మ్యాలను రూ.3,500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. వీటన్నింటి ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ దాదాపు ముగిసింది. సచివాలయంతోపాటు ఆయా శాఖల ప్రధాన కార్యాలయాలు కూడా ఒకేచోట కొలువుతీరుతుండటం దేశంలో ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి, సీఎస్‌ ఉండే జీఏడీ టవర్‌ను 50 అంతస్థులతో... ఇతర టవర్లను 40 అంతస్థులతో నిర్మిస్తున్నారు. జీఏడీ టవర్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన (225 మీటర్లు) సెక్రటేరియట్‌ బిల్డింగ్‌గానూ, దక్షిణ భారతంలో అతి ఎత్తయిన ఆఫీస్‌ బిల్డింగ్‌గా ఘనత సాధించనుంది. ఈ ఐదు టవర్ల విస్తీర్ణం 69 లక్షల చదరపు అడుగులు. ట్విన్‌ లిఫ్ట్‌లు, అత్యంత సౌకర్యవంతమైన ఆఫీస్‌ స్పేస్‌లు, సందర్శకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఈ టవర్లలో రానున్నాయి. వీటిని డయాగ్రిడ్‌ స్ట్రక్చరల్‌ విధానంలో నిర్మించనున్నారు. అంటే.. నిర్మాణంలో పిల్లర్లు ఉండవు. భవంతుల బాహ్యభాగంలో మాత్రమే వచ్చే ఫ్రేమ్‌ ఆధారంగా ఈ టవర్లు నిర్మితమవుతాయి.
 
 
Sand%20jpgss.jpgపంట్లపై హైలెస్స...
అమరావతి నిర్మాణంలో లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటీరియల్‌ను ఉపయోగిస్తున్నారు. గ్రావెల్‌, కంకరను ఇబ్రహీంపట్నం, మూలపాడు తదితర ప్రాంతాల క్వారీల నుంచి అమరావతికి చేర్చాలంటే విజయవాడ చుట్టుకుని వెళ్లాల్సి ఉంది. ఈ బాదరబందీ లేకుండా ఒక్క విడతలో పదికిపైగా టిప్పర్లను తీసుకెళ్లే భారీ పంటు నిర్మించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి కృష్ణా నది దాటి రాజధాని ప్రాంతానికి సులువుగా, వేగంగా చేర్చుతున్నారు.
 
 
ఏదైనా నిమిషాల్లోనే...
జన జీవనానికి సంబంధించి అమరావతిలో ‘5-10-15’ కాన్సెప్ట్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టారు! అంటే.. కేవలం ఐదు నిమిషాల్లో వైద్యం వంటి అత్యవసర సేవలు పొందడం! పది నిమిషాల్లో పాఠశాలలు, ఉద్యానవనాలు వంటి సామాజిక సదుపాయాలను చేరుకోవడం! అది కూడా కాలినడకన! ఇక... 15 నిమిషాల్లో ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని పనిచేసే ప్రదేశాలను చేరుకోగలగడం! హైకోర్టు న్యాయమూర్తులు ఇలా రోడ్డు దాటితే చాలు అలా కార్యక్షేత్రానికి చేరుకోవచ్చు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగళాలు సచివాలయ టవర్లకు అత్యంత సమీపంలో నిర్మితమవుతున్నాయి.
 
 
అమరావతికి ‘నీలి-హరిత’ విధానంలో రూపకల్పన చేశారు. అంటే... మొత్తం రాజధాని విస్తీర్ణంలో 30 శాతం జలవనరులు, పచ్చదనమే పరుచుకుని ఉంటుంది. 22 కిలోమీటర్ల పొడవునా కృష్ణా తీరం ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక ఆకర్షణీయమైన ప్రాజెక్టులు వస్తాయి.
 
 
సీడ్‌ యాక్సెస్‌.. స్పీడ్‌ యాక్సెస్‌
మొత్తం రాజధానిలో రవాణాకు అతి కీలకమైనది, ప్రత్యేకమైనది సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌! విజయవాడ-గుంటూరు దారిలో కనకదుర్గ వారధి నుంచి దొండపాడు వరకు... 21.2 కిలోమీటర్ల దారి దాదాపుగా పూర్తయింది. అమరావతిలోని ఇతర ‘నగరాలు’, ప్రాంతాలకు వెళ్లే దారులు ఇక్కడ కలుస్తాయి. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెడల్పు 60 మీటర్లు.. అంటే దాదాపు 200 అడుగులు! అటూ, ఇటూ రాకపోకలకు వదిలేస్తే... మధ్యలో రెండు లైన్లను బీఆర్‌టీఎస్‌, మెట్రో రైలు వ్యవస్థ కోసం వదిలేశారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు భూసమీకరణ/సేకరణ సమస్యల కారణంగా దాదాపు 3 కిలోమీటర్ల నిర్మాణం ఆగిపోయింది.
 
GVN_6852.jpgssss.jpg
రోడ్లు.. 285 కిలో మీటర్లు
రాజధాని నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులువుగా, వేగంగా చేరుకునేలా మొత్తం 320 కి.మీ. ప్రాధాన్య రహదారులను నిర్మిస్తున్నారు. 285 కి.మీ. పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రతి రోడ్డు పక్కనే డక్ట్‌లు, తాగునీటి పైప్‌లైన్లూ వేస్తున్నారు. అటూ ఇటూ పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్చినాటికి దాదాపుగా ముగుస్తాయి.
 
5a5as5a.jpgకదిలింది కార్మిక శక్తి...
 
ప్రధాన కాంట్రాక్టు సంస్థలు, వాటికి అనుబంధంగా పనిచేసేవి... అన్నీ కలిపి 20కిపైగా సంస్థలు అమరావతి నిర్మాణంలో పాల్గొంటున్నాయి. వీటిలో 15 వేల నుంచి 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత చూస్తే... ఎటుచూసినా తిరిగి విధుల్లోకి వెళ్లే కార్మికులే కనిపిస్తారు. వీరందరి కోసం నిర్మాణ స్థలాల్లోనే నివాసాలు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా దుకాణాలు కూడా వెలిశాయి. 90 శాతానికిపైగా కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. వీరికోసం తుళ్లూరులో ఒక పాత థియేటర్‌ కొత్త సొబగులు దిద్దుకుంది. హిందీ చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఇక... ఆదివారం నిర్మాణ స్థలాల ఆవరణలోనే దుస్తులు, బూట్లు, ఇతర సరుకుల దుకాణాలతో ‘సంత’ జరుగుతోంది.
 
 
మరెన్నో...
  • ముఖ్యమంత్రి నివాసం, అసెంబ్లీ కు టెండర్లు పిలిచారు. ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
  • రాజ్‌భవన్‌ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది.
  • హైకోర్టు పునాదుల పనులు మొదలయ్యాయి.
  • హైదరాబాద్‌ వైపు నుంచి అమరావతిని అనుసంధానించే కీలకమైన ఐకానిక్‌ బ్రిడ్జికి టెండర్లు ఖరారయ్యాయి. సాయిల్‌ టెస్ట్‌ ముగిసిన వెంటనే పనులు మొదలవుతాయి.
  • నివాస, కార్యాలయ భవనాలన్నింటిపైనా సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
Link to comment
Share on other sites

వడివడిగా అమరావతి!
05-01-2019 04:07:17
 
636822580387212565.jpg
  • రూ.38 వేల కోట్ల విలువైన పనులు
  • మొత్తం 61 టవర్లలో 3,840 ఫ్లాట్లు..
  • ఇప్పటికి 1,200 ఫ్లాట్లు దాదాపు పూర్తి
  • ప్రతి నిర్మాణంలోనూ షియర్‌ వాల్‌ టెక్నాలజీ
  • 285 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
  • పాలనా నగరిలో హైటెన్షన్‌ టవర్ల తొలగింపు
అమరావతిలో ఏం జరుగుతోంది!? నిర్మాణాలు ప్రారంభమయ్యాయా!? టవర్లు ఎంత వరకూ వచ్చాయి!? ప్రతి ఒక్కరికీ ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలివి. ఇక్కడ వేలాదిమంది కార్మికులు పని చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భారీ క్రేన్లు, భారీ యంత్రాలు అలుపెరగకుండా తిరుగుతున్నాయి. అక్కడ ఒక నిర్మాణ యజ్ఞం జరుగుతోంది! నవ్యాంధ్రుల రాజధాని ‘అమరావతి’ కళ్ల ముందే ఆవిష్కృతమవుతోంది. ‘ఇన్ని పనులు జరుగుతున్నాయని ఇక్కడికి వచ్చి చూసేదాకా తెలియదు’ అని సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. అమరావతి పూర్తి నిర్మాణ వ్యయం దాదాపు లక్ష కోట్ల రూపాయలు. తొలి దశలో రూ.38 వేల కోట్ల విలువైన నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. మరో రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభం కానున్నాయి. రాజధానిలో జరుగుతున్న పనులపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సచిత్ర ప్రత్యేక కథనం..
- ఆంధ్రజ్యోతి, అమరావతి
 
తెచ్చి... అతికించడం!
apcrda22.jpgఇటుక మీద ఇటుక పెట్టి, గోడలు కట్టి, స్లాబులు వేసి, క్యూరింగ్‌ చేసి... ఇది సంప్రదాయ పద్ధతి! పిల్లర్ల నుంచి స్లాబు వరకు ఎక్కడి నుంచో తెచ్చి... అతికించి... భవనాన్ని సిద్ధం చేయడం కొత్త పద్ధతి! దీనినే ‘ప్రికాస్ట్‌’ టెక్నాలజీ అంటారు. ఈ పద్ధతిలో చాలా వంతెనలను నిర్మించారు. అయితే, ఏపీ రాజధాని అమరావతి పరిధిలో సీఆర్డీయే ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రికాస్ట్‌ విధానంలోనే నిర్మిస్తున్నారు. మెట్లు, గోడలు, శ్లాబ్‌, చివరికి బాత్‌రూమ్‌ గోడలను కూడా ప్రికాస్ట్‌లోనే అమర్చుతారు. ఏడంతస్తుల సువిశాల భవంతిలో సీఆర్డీయేతోపాటు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ), ఏపీరెరా తదితర కార్యాలయాలు కొలువుతీరతాయి.
 
80 రోజుల్లో టవర్‌
ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌... ఇలా ప్రభుత్వ, ప్రజల సేవలో అనేకమంది అఖిల భారత సర్వీసు అధికారులు! వారి హోదా, హుందాకు తగిన విధంగా ‘అదరహో’ అనిపించేలా ప్రత్యేకమైన నివాస సముదాయాలు సిద్ధమవుతున్నాయి. వీరికోసం ప్రత్యేకంగా 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్‌లో 24 ఫ్లాట్లు! ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 3,500 చదరపు అడుగులు! మూడు బెడ్‌రూమ్‌లు, ఒక జిమ్‌, ప్రార్థనా మందిరం, అత్యాధునిక కిచెన్‌, ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు వీలుగా సువిశాలమైన బాల్కనీ, ఏసీలు, టచ్‌తో పనిచేసే స్విచ్‌లు... అంతా ఆధునికమే! ప్రతి ఫ్లాట్‌కూ అనుబంధంగా సర్వెంట్‌ రూమ్‌ అదనం! 12 అంతస్తుల టవర్‌ బేసిక్‌ స్ట్రక్చర్‌ను గరిష్ఠంగా 80 నుంచి 90 రోజుల్లో కట్టారు.
 
ఇదీ స్వరూపం
ఒక కిలోమీటరు వెడల్పు... 6.6 కిలోమీటర్ల పొడవు! ఇది అమరావతిలోని పాలనా నగరి భౌగోళిక విస్తీర్ణం! ఒకవైపు కృష్ణా నదిని ఆనుకుని ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్‌తో ఈ ‘నగరం’ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా... మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది గృహ సముదాయాలు ఒకవైపు, జడ్జిల బంగళాలు... హైకోర్టు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సచివాలయ టవర్లు మరోవైపు నిర్మితమవుతాయి. శాఖమూరు వరకు పరిపాలనా నగరి విస్తరిస్తుంది. ఇందులో ఎక్కడా గజిబిజితనం కనిపించదు. వీధి దీపాల స్తంభాలు మినహా తీగలు కూడా బయటికి కనిపించవు. ఈ ప్రాంతంలో ఉన్న హైటెన్షన్‌ టవర్లను మరో చోటికి (రీలొకేట్‌) చేస్తున్నారు.
 
61 టవర్లు... 3840 ఫ్లాట్లు
రాజధాని అంటేనే అఖిల భారత సర్వీసు అధికారులు, వివిధ స్థాయి ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కొలువు తీరే పరిపాలనా కేంద్రం. వీరందరి కోసం 61 టవర్లలో 3,840 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. అన్నిచోట్లా షియర్‌ వాల్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ టవర్లలో ఇప్పటికే 1,200కు పైగా ఫ్లాట్ల నిర్మాణం పూర్తయి, తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఫిబ్రవరికల్లా కొన్ని గృహ ప్రవేశాలు కూడా జరగనున్నాయి.
 
tree-plantation9.jpgఅమరావతిని ‘నీలి-హరిత’ విధానంలో రూపకల్పన చేశారు. అంటే... మొత్తం రాజధాని విస్తీర్ణంలో 30 శాతం జలవనరులు, పచ్చదనమే పరుచుకుని ఉంటుంది.
 
 
 
 
సీడ్‌ యాక్సెస్‌.. స్పీడ్‌ యాక్సెస్‌
gvn_68521.jpgమొత్తం రాజధానిలో రవాణాకు కీలకమైనది, ప్రత్యేకమైనది సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌! విజయవాడ- గుంటూరు దారిలో కనకదుర్గ వారధి నుంచి దొండపాడు వరకు... 21.2 కిలోమీటర్ల దారి దాదాపుగా పూర్తయింది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెడల్పు 60 మీటర్లు.. అటూ, ఇటూ రాకపోకలకు వదిలేస్తే... మధ్యలో రెండు లైన్లను బీఆర్‌టీఎస్‌, మెట్రో రైలు వ్యవస్థ కోసం వదిలేశారు.
 
తవ్వకాల తంటాకు టాటా!
రోడ్డు వేయడం... ఆ తర్వాత అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, కేబుళ్లు, వాటర్‌ పైప్‌లైన్లు ఇలా రకరకాల పేర్లతో ఎడాపెడా తవ్వడం! అమరావతి పరిధిలో ఇలాంటి పరిస్థితి రాదు! విద్యుత్తు, నీరు, వంటగ్యాస్‌, సమాచార వ్యవస్థ ఇలా అన్ని అవసరాలకోసం ప్రత్యేకంగా భూగర్భంలోనే ‘డక్ట్‌’లు నిర్మిస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ పొడవునా ఏకంగా ఆరు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తుతో డక్ట్‌లు నిర్మిస్తున్నారు. ఇలా అన్ని రోడ్ల వెంట డక్ట్‌లు ఉంటాయి. అన్నిరకాల ‘కనెక్షన్ల’కు సంబంధించిన పైప్‌లైన్‌లు అందులోనే ఉంటాయి. వర్షపునీటి ప్రవాహానికీ ప్రత్యేకంగా కాల్వలు ముందుగానే తవ్వేస్తున్నారు. మొత్తం రాజధాని తాగునీటి అవసరాలకోసం భూగర్భంలో భారీ పైప్‌లైన్ల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది.
 
పేదలకు చక్కటి గూడు
అమరావతి ప్రజా రాజధాని! రాజధాని పరిధిలో భూమిలేని పేదల కోసం ప్రత్యేకంగా పీఎంఏవై-ఎన్టీఆర్‌ గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. చక్కటి ప్లానింగ్‌, నిర్మాణ ప్రమాణాలతో వీటిని నిర్మించారు. మొత్తం పది గ్రామాల్లో ఐదు వేల గృహాల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. చాలాచోట్ల ఇక లబ్ధిదారులకు వాటిని కేటాయించడమే మిగిలింది.
 
వచ్చేనెల 10న శ్రీవారి దివ్యక్షేత్రానికి శ్రీకారం
రాజధాని పరిధిలో 25 ఎకరాల్లో శ్రీవారి ఆలయం కొలువుతీరనుంది. ఆలయ నిర్మాణానికి ఫిబ్రవరి 10న భూమిపూజ చేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. 6న మహాశాంతి యాగం ప్రారంభించి, 10న పూర్ణాహుతితో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు.
 
సిద్ధమవుతున్న ‘హైకోర్టు’
judicial66.jpgపరిపాలనా నగరిలోని జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటు కానుంది. పూర్తిస్థాయి హైకోర్టు నిర్మించిన తర్వాత ఇందులో సిటీ సివిల్‌ కోర్టులను నిర్వహిస్తారు. 4 ఎకరాల్లో... 2.35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఇందులో మొత్తం 23 కోర్టు హాళ్లు ఉంటాయి. దీని నిర్మాణం దాదాపుగా పూర్తయింది. హైకోర్టు నిర్వహణకు వీలుగా అవసరమైన ఇంటీరియర్స్‌ పనులు సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు మొత్తం సిద్ధమవుతుంది.
Link to comment
Share on other sites

అమరావతిలో శ్రీవారి దివ్యక్షేత్రానికి వచ్చేనెల 10న భూమిపూజ
05-01-2019 03:15:58
 
  • 27న కన్యాకుమారి ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ: ఈవో
తిరుమల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి ఫిబ్రవరి 10న భూమిపూజ చేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. 6న మహాశాంతి యాగం ప్రారంభించి, 10న పూర్ణాహుతితో ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తామన్నారు. ఇప్పటికే రూ.35కోట్లతో ఆలయం, మాడవీధులు, మరో 35కోట్లతో ధ్యానమందిరం, కల్యాణమంటపం, అర్చకుల క్వార్టర్లు, తోట, ఫౌంటెన్‌, రోడ్ల పనులకు టెండర్లు ఖరారు చేసినట్లు ఆయన శుక్రవారం తిరుమలలో చెప్పారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...