Jump to content

Amaravati


Recommended Posts

సచివాలయం టవర్‌-2 ర్యాఫ్ట్‌ పూర్తి
31-12-2018 03:19:00
 
636818231367472447.jpg
  • ఏడు రోజుల తర్వాత పరిశీలించి కోర్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రారంభం
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27న ప్రారంభించిన సచివాలయం రెండో టవర్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ఆదివారం ఉదయం 7 గంటలకు పూర్తయింది. 52 మీటర్లు పొడవు, 52 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతున్న ఈ ర్యాఫ్ట్‌ కోసం 8800 టన్నుల కాంక్రీట్‌ వాడారు. కాంక్రీట్‌ పూర్తయిన వెంటనే ఉపరితలంపై క్యూరింగ్‌ కాంపౌండ్‌ను పూశారు. క్యూరింగ్‌ ప్రక్రియ నీటితో కాకుండా 70 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో ఉంచుతారు. కాంక్రీట్‌ ఉపరితలంపై మూడు లేయర్లు ప్లాస్టిక్‌, థర్మాకోల్‌ షీట్లు కప్పారు. ఏడు రోజుల తర్వాత క్యూరింగ్‌ స్థితిని పరీక్షించి అది పూర్తియినట్టు నిర్ధారిస్తే కోర్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రారంభిస్తారు. సీఆర్డీయే అధికారుల సచివాలయం మూడో టవర్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులకు సోమవారం, జీఏడీ టవర్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులను బుధవారం ప్రారంభించనున్నారు.
Link to comment
Share on other sites

న్యాయమూర్తుల గదులు 15కి సిద్ధం

 

హైకోర్టు నిర్మాణ పనులను  పరిశీలించిన మంత్రి నారాయణ

30state5a.jpg

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయకుండా రాష్ట్రంపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి నారాయణ అన్నారు. విగ్రహాలకు రూ.3 వేల కోట్లు ఖర్చు చేసిన భాజపా, అమరావతికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ఆదివారం హైకోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవనం చుట్టూ పార్కింగ్‌, లాన్‌, ఫ్లోరింగ్‌ పనులు, న్యాయమూర్తుల గదులు జనవరి 15కి పూర్తవుతాయని తెలిపారు. మొదటి అంతస్తులో 12 గదులు, రెండో అంతస్తులో నాలుగు గదులు సిద్ధమవుతున్నాయన్నారు. జనవరి 1 నుంచి నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ నిర్మాణంపై కేసీఆర్‌ వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. రాఫ్ట్‌ టెక్నాలజీతో భవనాలు నిర్మించడం దేశంలో మరెక్కడా లేదని, అవగాహన లేకుండా కేసీఆర్‌ మాట్లాడటం తగదని నారాయణ హితవు పలికారు.

 

 
 
Link to comment
Share on other sites

హ్యపీనెస్ట్‌కు చేరువలో ఐటీ టవర్‌

 

5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
సీఎం చంద్రబాబు వద్ద సీఆర్‌డీఏ ప్రతిపాదన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించనున్న హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు సమీపంలో 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్‌ నిర్మించేందుకు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది. రాజధాని పరిధిలో కొత్తగా రాబోయే ఐటీ సంస్థలకు లీజు లేదా అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు ఈ టవర్‌ నిర్మించాలని యోచిస్తున్నట్లు సీఆర్‌డీఏ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంధన వనరులు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆదివారం సీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారని ప్రస్తావించింది. ‘అమరావతిలో 300 ఎకరాల పరిధిలో తలపెట్టిన ‘సమీకృత బహుళ ఉత్పత్తుల పార్కు’ ఏర్పాటు పనుల వేగం పెంచాలి. ఇవి పూర్తయితే దాదాపు 20వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. రాజధానిలో ఏర్పాటుచేసే పరిశ్రమలకు నీరు, విద్యుత్‌, మౌలిక వసతులతోపాటు నైపుణ్య మానవ వనరుల్నీ అందజేస్తాం. ఆర్థికంగా వెనకబడినవర్గాల వారికి అమరావతి పరిధిలో అందుబాటు ధరలో ఇళ్లు నిర్మించాల్సి ఉంది. రాజధాని ఆర్థిక ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలి’ అని సీఎం పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో పురపాలక మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ, ఇంధన వనరులశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

Chandrababu Naidu wants people to know rapid growth of Amaravati

THE HANS INDIA |   Dec 31,2018 , 02:06 AM IST
   

 
 
Chandrababu Naidu wants people to know rapid growth of Amaravati
Chandrababu Naidu wants people to know rapid growth of Amaravati
 
 
Vijayawada: Chief Minister N Chandrababu Naidu said the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA) needs to create awareness among the people over the ongoing fast track development of Amaravati and also establish a close emotional bond between every village and Amaravati, which is pride of Telugu people.
 
During a teleconference with the officials of APCRDA on Sunday, the Chief Minster said that the people across the state, especially in villages, were eager to visit their greenfield capital city and know the rapid progress here. 
 
 
 
“The bonding between people and Amaravati is very strong and emotional. As we were left without a capital city, we started building people’s capital. The people foresee the future of their children in Amaravati. Our government is committed to fulfil their aspirations by building one of the top five cities of the world,” he said.  
 
 
 
Stating that the people have lot of faith in his government, Naidu said thousands of people across the state had visited Polavaram irrigation project and expressed their happiness over the rapid progress of the project.
 
While expressing satisfaction over successful conducting of tours for thousands of people from villages to Amaravati, the Chief Minister emphasised the need to explain to people about the fast track progress in Amaravati and the efforts of the state government to bring capital city to a certain stage as soon as possible. “We promised to people that they can see a lot of progress in capital city in 2019,” he said.
 
Stressing the need to focus on economic development, he said that a city is not created just by constructing roads and buildings. The Amaravati city is envisaged to be a powerhouse for economic development and job-creation which could attract non-polluting high-value manufacturing and service industries.
 
CRDA commissioner Dr Cherukuri Sreedhar said an IT tower with a built-up area of five lakh sq ft would be built for sale or lease out to IT companies as part of the state government’s vision to make Andhra Pradesh the most preferred global destination by 2050.
 
Minister for municipal administration P Narayana, Chief Secretary Anil Chandra Punetha, CRDA principal secretary Ajay Jain and several senior officials of the CMO took part in the teleconference.
 
 
 
 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...