Jump to content

Amaravati


Recommended Posts

‘హ్యాపీనెస్ట్‌’ బుకింగ్‌ రేపే!
09-12-2018 03:09:59
 
636799217974069034.jpg
  • అందుబాటులో 900 ఫ్లాట్లు.. విరివిగా హెల్ప్‌ డెస్క్‌లు
  • సీఆర్డీయే, బ్యాంకులు, మీ సేవా కేంద్రాల్లో ఏర్పాటు..
  • భారత కరెన్సీలోనే ఎన్నారైల చెల్లింపులు
అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్‌ గృహ సముదాయంలోని 900 ఫ్లాట్ల్లకు సోమవారం బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సహాయపడేందుకు ఏపీసీఆర్డీయే విస్తృత సన్నాహాలు చేస్తోంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ ప్రక్రియపై సరైన అవగాహన లేని వారితోపాటు ఇంటర్నెట్‌ సదుపాయం లేనివారి కోసం సహాయక కేంద్రాల(హెల్ప్‌ డెస్క్‌)ను ఏర్పాటు చేస్తోంది. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంతోపాటు వివిధ బ్యాంకులు, మీసేవా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఆయా కేంద్రాల వివరాలు హ్యాపీనెస్ట్‌ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. కాగా.. ఈ బుకింగ్‌ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీఆర్డీయే శుక్రవారం నుంచి నిర్వహిస్తున్న సదస్సులు శనివారంతో ముగిశాయి. హ్యాపీనె్‌స్టలోని 3 టవర్ల(ఏ, బీ, సీ)లో ఉన్న 300 ఫ్లాట్లకు నవంబరు 9న బుకింగ్‌ ప్రారంభించగా కేవలం కొన్ని గంటల్లోనే ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో మలివిడతగా ఈ ప్రాజెక్ట్‌లోని మరొక 9 టవర్ల(డీ, ఈ, ఎఫ్‌, జీ, హెచ్‌, ఐ, జే, కే, ఎల్‌)లోని 900 ఫ్లాట్లకు సోమవారం బుకింగ్‌ ప్రారంభించనున్నారు. అవగాహన సదస్సుల్లో ఆయా ఫ్లాట్లను బుక్‌ చేసుకునే విధానాన్ని సీఆర్డీయే అధికారులు వివరించారు.
 
 
కొన్ని సూచనలు..
  • బుకింగ్‌దారులకు సీఆర్డీయే హ్యాపీనెస్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా కొన్ని సూచనలు చేసింది. తాము బుక్‌ చేయాలనుకుంటున్న ఫ్లాట్లకు సంబంధించిన నగదు నెట్‌ బ్యాంకింగ్‌ లిమిట్‌లో లేనట్లయితే వాటిని పెంచాల్సిందిగా ఆయా బ్యాంకులను కోరాలి.
  • ప్రవాస భారతీయులు తమ చెల్లింపులను భారత కరెన్సీలోనే చెల్లించాలి.
  • నగదును తమ నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ(ఎన్‌ఆర్‌వో) అకౌంట్ల ద్వారా మాత్రమే చెల్లించాలి.
  • అంతర్జాతీయ బ్యాంకులకు చెందిన ఇంటర్నేషనల్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌ అకౌంట్ల ద్వారా జరిపే చెల్లింపులను స్వీకరించరు.
  • సులభంగా, త్వరగా బుక్‌ చేసుకునేందుకు ‘గూగుల్‌ క్రోమ్‌ 45, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ 46, ఎడ్జ్‌ 13, సఫారీ 10 ఉండే నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తే ఫలితాలుంటాయి.
Link to comment
Share on other sites

హ్యాపీనెస్టు ఫ్లాట్స్‌ బుకింగ్‌కు... బ్యాంకుల్లో హెల్ప్‌ డెస్కులు
10-12-2018 09:47:10
 
636800320319154095.jpg
గుంటూరు(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నగరం పరిధిలో సీఆర్‌డీఏ నిర్మాణం చేపట్టనున్న హ్యాపీ నెస్టు అపార్టుమెంట్‌ ఫ్లాట్స్‌ బుకింగ్‌ కోసం వివిధ బ్యాంకుల్లో హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేశారు. తొలిదశ బుకింగ్‌ సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన దృష్ట్యా ఈ దఫా హెల్ప్‌డెస్కుల ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 60 బ్యాంకు బ్రాంచ్‌లలో ఇవి సోమవారం ఉదయం నుంచి అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది అధికారులను నియమించి వారి మొబైల్‌ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు.
 
గుంటూరులో...
గుంటూరు నగరంలో ఆంధ్రాబ్యాంకు గుంటూరు మెయిన్‌, కొరిటెపాడు, హిందూ కళాశాల, అరండల్‌పేట, పట్టాభిపురం, బ్రాడీపేట, బృందావన్‌ గార్డెన్స్‌, ఏఎన్‌యూ క్యాంపస్‌, శ్రీనగర్‌ కాలనీ, ఎస్‌ఎంఈ, శ్యామలనగర్‌, జేకేసీ కళాశాల, రిటైల్‌ లోన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఏపీ సెక్రటేరియట్‌ వెలగపూడి, ఇండియన్‌ బ్యాంకు బ్రాడీపేట, ఎస్‌బీఐకి చెందిన కన్నవారితోట, లక్ష్మీపురం, అరండల్‌పేట, సుందరం హోం ఫైనాన్స్‌ గుంటూరు, మంగళగిరి శాఖల్లో హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేశారు.
 
విజయవాడలో...
విజయవాడ నగరంలో ఆంధ్రాబ్యాంకుకు చెందిన రింగురోడ్డు, లబ్బీపేట, పటమట, సూర్యారావుపేట, రామవరప్పాడులో హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేశారు. అలానే, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన విజయవాడ మెయిన్‌, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర వన్‌టౌన్‌, హెచ్‌డీఎ్‌ఫసీ వన్‌టౌన్‌, ఇండియన్‌ బ్యాంకు ఎంఎం పాడు, ఎస్‌బీఏ ఏవో, ఎన్‌ఆర్‌ఐ, ఎస్‌పీబీ, పోరంకి, గొల్లపూడి, సుందరం హోం లోన్స్‌ విజయవాడ శాఖల్లో హెల్ప్‌డెస్కులు అందుబాటులో ఉంచారు.
 
ఇదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం, అనపర్తిలోని ఆంధ్రాబ్యాంకు, నెల్లూరు దర్గామిట్ట, ఒంగోలు కోర్టు వీధి, విశాఖపట్నం సీతమ్మధార, మధురవాడ, పశ్చిమగోదావరి ఏలూరు మెయిన్‌, భీమవరం మెయిన్‌, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మెయిన్‌, రాజాం, కర్నూలులో బుధవారపేట, అనంతపురంలోని రామనగర్‌, తిరుపతిలో బాలాజీనగర్‌, కడప మెయిన్‌ ఆంధ్రాబ్యాంకు శాఖల్లోనూ హెల్ప్‌డెస్కులు ఏర్పాటుచేశారు. ఇండియన్‌ బ్యాంకు జోనల్‌ ఆఫీసు తిరుపతి, విశాఖపట్నం, సుందరం హోం గాజువాక, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్‌, హైదరాబాద్‌, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌ శాఖల్లోనూ హెల్ప్‌డెస్కులు పనిచేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. హ్యాపీనెస్టులో ఫ్లాట్‌ బుకింగ్‌ అయిన తర్వాత నిర్ణీత నగదు చెల్లింపులో ఎలాంటి అసౌకర్యం కలగకుండా హెల్ప్‌డెస్కులు సేవలు అందిస్తాయని వివరించాయి.
Link to comment
Share on other sites

నేడు హ్యాపీనెస్ట్‌ మలి విడత బుకింగ్‌ 
ఉదయం తొమ్మిదింటి నుంచి ప్రారంభం 
రాష్ట్రవ్యాప్తంగా 60 సహాయ కేంద్రాల ఏర్పాటు 
9ap-main6a.jpg

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: అమరావతిలో సీఆర్‌డీఏ నిర్మిస్తున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్‌’లో రెండో విడత ఫ్లాట్ల బుకింగ్‌ ప్రక్రియను సోమవారం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా 300 ఫ్లాట్లకు గత నవంబరు 9న సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో బుకింగ్‌ నిర్వహించింది. తొలివిడతలో అనూహ్య స్పందన రావడంతో మిగతా 900 ఫ్లాట్లకు ఒకే విడతలో బుకింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా చేపడుతుంది. తొలివిడతలో వచ్చిన సాంకేతిక ఇబ్బందులు పునరావృతం కాకుండా సీఆర్‌డీఏ ఏర్పాట్లు చేసింది. నాలుగు లక్షల మంది ఏకకాలంలో ఉపయోగించుకునేలా సర్వర్‌ సామర్థ్యాన్ని పెంచింది. అంతకుమించి ప్రయత్నించినా ఇబ్బంది లేకుండా దానంతటదే సామర్థ్యం పెరిగేలా రూపొందించింది. దీంతో పాటు అన్ని జిల్లాల్లో ప్రజలు సులువుగా ఫ్లాట్లను బుక్‌ చేసుకునేందుకు, హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చిన బ్యాంకులన్నీ తమ బ్రాంచిల్లో 60 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటి ద్వారా అంతర్జాలం వినియోగంపై అవగాహన లేని సాధారణ ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ద్వారా ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన కేటాయిస్తామని అన్నారు. అందరికీ ఈ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని, సహాయ కేంద్రాలకు వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని భావించాల్సిన పని లేదని అన్నారు. అయితే ఫ్లాట్‌ బుక్‌ చేసుకునే విధానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

Link to comment
Share on other sites

23 hours ago, sonykongara said:

The #AndhraPradesh's 40 storeys #Secretariat tower is being constructed at a rapid pace. Raft Foundation Reinforcement (52m×52m×4m) work was undertaken today #Amaravati @ncbn

Dt-qQMyUcAE3125.jpg
Dt-qQMvUwAEIKq4.jpg
Dt-qQMwV4AI2U_S.jpg
Dt-qQM2VsAUQQsp.jpg
0 replies 0 retweets 1 like
 
 
 
 
 
 
 

 

23 hours ago, sonykongara said:

The #AndhraPradesh's 40 storeys #Secretariat tower is being constructed at a rapid pace. Raft Foundation Reinforcement (52m×52m×4m) work was undertaken today #Amaravati @ncbn

Dt-qhM0U0AMmrpx.jpg
Dt-qhMhUwAAjhVI.jpg
Dt-qhMiVsAEaJDq.jpg
Dt-qhMsVYAAi20y.jpg

CzUEkST.jpg

Edited by sonykongara
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...