Jump to content

Amaravati

Recommended Posts

ఆధునికత.. ఆకృతుల మేళవింపు
ఐదు టవర్లతో పరిపాలన కార్యాలయాలు
వాహనాల నిలుపుదలకు ప్రత్యేక నిర్మాణం
ఈనాడు-అమరావతి

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న పరిపాలన కార్యాలయాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. ఐదు టవర్లతో ప్రభుత్వ పాలన సముదాయాల నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో భవనాలకు పునాదులు నిర్మాణంలో ప్రత్యేక ప్రణాళిక అనుసరిస్తున్నారు. నల్లరేగడి నేల కావడంతోపాటు ఒక భవనం 50 అంతస్థులు, నాలుగు భవనాలు 40 అంతస్థులతో నిర్మిస్తుండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నల్లరేగడి నేలలు కావడం, భూగర్భజలాలు పైభాగంలో ఉండటంతో పునాదుల్లోకి నీరు వెళ్లకుండా జియో సింథటిక్‌ సామగ్రిని నిర్మాణంలో వినియోగిస్తున్నారు. పునాది నిర్మాణానికి 4మీటర్ల కంటే లోతుగా తవ్వి భూమిపై సింథటిక్‌ షీట్‌ వేసి దానిపై కాంక్రీటుతో నిర్మాణం ప్రారంభించారు. ఇలా పలులేయర్లుగా ఇనుము, కాంక్రీటుతో 4మీటర్ల మేర రాఫ్ట్‌ నిర్మిస్తున్నారు. రాఫ్ట్‌కు చుట్టూ సింథటిక్‌ షీట్‌ వేసి కాంక్రీటు నిర్మాణంలోకి భూగర్భజలాలు, డ్రైనేజీ, భూమిలోపలి నుంచి వచ్చే రసాయనాలు పునాదిలోకి వెళ్లకుండా అడ్డుకునేలా జియో సింథటిక్‌ విధానంలో నిర్మిస్తున్నారు. రాఫ్ట్‌పై భవన నిర్మాణం చేపట్టి బహుళ అంతస్థుల నిర్మాణాలు పూర్తిచేస్తారు. సింథటిక్‌ షీట్‌ నీటిని పునాదుల్లోకి రాకుండా అడ్డుకోవడం వల్ల నిర్మాణ సమయంలో ఉన్న నాణ్యత, సామర్థ్యం భవనం జీవితకాలం ఉండేలా కాపాడుతుందని ఇంజినీర్లు తెలిపారు. దీంతోపాటు పునాదులకు ఉపయోగిస్తున్న స్టీలు నీరు, రసాయనాల వల్ల త్వరగా తుప్పుపట్టకుండా ఉండే నాణ్యమైనవి వాడుతున్నారు. భవనానికి పునాది  కీలకం కావడం, భూగర్భజలాలు పైనే ఉండటంతో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లు చెప్పారు.

వాహనాల పార్కింగ్‌కు సదుపాయం
సాధారణంగా బహుళ అంతస్థుల భవనాల్లో నివసించేవారు వాహనాలు నిలుపుకోవడానికి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఖాళీ వదులుతారు. ఫిల్లర్ల మధ్య వాహనాలు పార్కింగ్‌ చేస్తారు. రాజధానిలో నిర్మిస్తున్న పరిపాలనా సముదాయంలో బహుళ అంతస్థుల భవనాల కింద పార్కింగ్‌ లేకుండా రాఫ్ట్‌పై భవనాల నిర్మాణం చేపడుతున్నారు. బహుళ అంతస్థుల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, సందర్శకులకు భవనానికి సమీపంలోనే వాహనాల నిలుపుదలకు ప్రత్యేక నిర్మాణం చేపడుతున్నారు. రాజధానిలో ఐదు టవర్లలో కొన్నింటికి ముందువైపు, కొన్నింటికి భవనం వెనుకవైపు భూగర్భంలో రెండు అంతస్థులు, పైన రెండు అంతస్థుల్లో వాహనాలు నిలుపుకునేలా సౌకర్యం కల్పిస్తారు. బహుళ అంతస్థుల భవనాల్లో పార్కింగ్‌కు సదుపాయం కల్పిస్తే ఫిల్లర్ల మధ్య ఖాళీ ప్రదేశం ఉండటం వల్ల భూకంపాల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్‌కు భవనం సమీపంలో ప్రత్యేక నిర్మాణం చేపడుతున్నారు.

Link to comment
Share on other sites

AmaravatiVerified account @PrajaRajadhani 6m6 minutes ago

To live in own house is everyone's dream. APCRDA assures the Dream Home and a happy life in Amaravati. Register your flat on our website (http://www.happynest.live ) on Dec.10, 2018 @9 am onwards. Bookings open for 900 flats at the base price of Rs-3492/ sq.ft.

DtKK_hCUUAAZ9Bn.jpg
Link to comment
Share on other sites

అటవీ భూములివ్వలేం 
రాష్ట్రానికి కేంద్రం మళ్లీ మొండిచేయి 
రాజధాని పరిధిలో 8 ప్రాజెక్టులకు భూములిచ్చేందుకు అనుమతి నిరాకరణ

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో వివిధ సంస్థల ఏర్పాటుకు అటవీ భూములు కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం మరోసారి మోకాలడ్డింది. ఏడాదిపాటు నాన్చి నాన్చి.. చివరకు సాధ్యం కాదనే కబురందించింది. గతేడాది నవంబరులో పంపిన ప్రాజెక్టు నివేదికలను ఈ ఏడాది అక్టోబరులో పరిశీలించి... రెండు రోజుల కిందట నిర్ణయాలు వెల్లడించింది.  మొత్తం రాజధాని ప్రాంతం పరిధిలో అటవీ విస్తీర్ణం 5 శాతం కంటే తక్కువగా ఉందని, ఇతర రాష్ట్రాల్లో ఇంత తక్కువ ఎక్కడా లేదని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఒక సలహా కూడా ఇచ్చింది. రాజధాని ప్రాంతం పరిధిలో వివిధ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం అటవీ భూములను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మధ్య దస్త్రాలు నడుస్తున్నాయి.

గత ఏడాది నవంబరులో దశలవారీగా అటవీ భూముల కేటాయింపునకు రాష్ట్రం ప్రతిపాదించింది. తొలిదశ కింద 9 ప్రాజెక్టులకు 4200 హెక్టార్లు కేటాయించాలని కోరింది. అందులో కొండపల్లిలోని ఒక ప్రాజెక్టుకు కేటాయింపును తిరస్కరిస్తున్నట్టు మూడు నెలల కిందటే కేంద్రం చెప్పింది. మిగిలిన 8 ప్రాజెక్టులకు సంబంధించి 3306 హెక్టార్లు ఇవ్వడం సాధ్యం కాదని రెండురోజుల కిందట వెబ్‌సైట్‌లో పెట్టింది. గతంలో ఒకసారి వివిధ ప్రాజెక్టులకు 24 బ్లాకుల్లో 12444 హెక్టార్లు కావాలని రాష్ట్రం కోరింది. అందులో వెంకటాయపాలెం, తాడేపల్లి అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు కలిపి 2086 హెక్టార్లు కేటాయించారు. మిగిలిన ప్రాజెక్టులకు తర్వాత దశలో ప్రతిపాదిస్తే అనుమతిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా వాటికి కూడా మొండిచేయే చూపారు.

29ap-story16a.jpg
Link to comment
Share on other sites

ఈ స్తంభం చాలా స్మార్ట్‌ 
29ap-story3a.jpg

ఈనాడు, అమరావతి: సచివాలయంలోని మూడో బ్లాక్‌ ఎదుట ప్రయోగాత్మకంగా స్మార్ట్‌ పోల్‌(స్తంభం)ను రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ విద్యుత్తు స్తంభానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ స్తంభానికి విద్యుత్తు ఛార్జీతో కూడిన బ్యాటరీతో పాటు   ఎల్‌ఈడీ బల్బు ఉంటుంది. విద్యుత్తు లేకపోయినా గంట పాటు ఎల్‌ఈడీ బల్బు వెలుగుతుంది. స్తంభానికి కింది భాగంలో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి మనుషుల ముఖకవళికలను గుర్తిస్తాయి. పోలీసుల వద్దనున్న నేరస్థుల డాటాను దీనికి అనుసంధానం చేస్తే ఈ పోల్‌ ముందు నుంచి వెళ్లగానే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇస్తుంది. కార్ల నంబర్‌ ప్లేట్లను కూడా ఈ సీసీ కెమెరాలు గుర్తిస్తాయి. వేడి, గాలిలో తేమ లాంటి వివరాలు స్తంభానికి ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్‌ తెరపై ప్రదర్శితమవుతాయి.

‘సచివాలయానికి’ కియా ఎలక్ట్రిక్‌ కార్ల సందడి

చివాలయంలో సాధారణ పరిపాలన విభాగ అవసరాల కోసం కియా మోటార్స్‌ నుంచి 3 ఎలక్ట్రిక్‌ కార్లు తెప్పించారు. వీటి కోసం ప్రత్యేకంగా రీఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం నుంచి విజయవాడ, విమానాశ్రయం మధ్య వీటిని వినియోగించనున్నారు.

- ఈనాడు, అమరావతి
29ap-story7a.jpg

29ap-story7b.jpg

Link to comment
Share on other sites

వచ్చే నెలాఖరుకు హైకోర్టు
01-12-2018 08:39:36
 
636792503740561979.jpg
  • రాజధానిలో శరవేగంగా నిర్మాణ పనులు
  • ప్రతిపక్షాల విమర్శలు సరికాదు: మంత్రి నారాయణ
తుళ్లూరు: డిసెంబరు నెలాఖరుకల్లా అమరావతిలో హైకోర్టు నిర్మాణం పూర్తిచేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రీకాస్ట్‌ టెక్నాలజీతో జరుగుతున్న హైకోర్టు భవన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జడ్జీల చాంబర్‌ పనులు చివరి దశకు చేరాయని, 36 జడ్జీ బంగ్లాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 5లక్షల 50 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకుగాను, ఇప్పటికే 3,50,00 క్యూబిక్‌ మీటర్ల పనులు జరిగాయని తెలిపారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎమ్మెల్యే గ్రూపు డి, ఎన్‌జీవో ఇళ్ల నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.
 
1143 ప్లాట్ల నిర్మాణం పూర్తిచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ కాప్లెక్స్‌ నిర్మాణ పనులు మార్చికల్లా పూర్తి చేస్తామన్నారు. 20 ఏళ్ల క్రితం విభజన జరిగిన రాష్ట్రాలతో పోల్చుకుంటే రాజధాని అమరావతి నిర్మాణ పనులు రికార్డు స్థాయిలో జరుగు తున్నట్లేనని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతుల ప్లాట్లలో 1600 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నట్లు వెల్లడించారు. కాగా, అమరావతిలో ఏ పనులూ జరగడంలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికాదని, ప్రత్యక్షంగా చూసి మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. సీఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ అధికారులు, ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...