Jump to content

Amaravati


Recommended Posts

Naidu accepts final designs of Amaravati

By Sambasiva Rao | THE HANS INDIA |   Nov 22,2018 , 07:31 PM IST
   

 
 
Naidu accepts final designs of Amaravati
Naidu accepts final designs of Amaravati
 
 
The Chief Minister Nara Chandrababu Naidu has approved the final designs of the Amaravati capital city, on Thursday here in Secretariat.
 
The Minister for Urban Development P Narayana is scheduled to release the designs within a short span of time in Secretariat in a press conference.
 
 
 
After carefully examining the designs at Secretariat brought by the Foster +Partners, Chandrababu Naidu approved. 
 
 
 
The designs including Assembly, Secretariat, High Court buildings and the blue and green concept designs of the capital city.
 
After a marathon exercise, the Chief Minister accepted these designs.  
 
One can go through the virtual design of the Amaravati through this Youtube link.
 
 
 
Link to comment
Share on other sites

అమరావతిలో మరో 6సంస్థలకు భూములు
23-11-2018 03:01:12
 
అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కొత్తగా మరో ఆరు సంస్థలకు ప్రభుత్వం 98.35 ఎకరాలు కేటాయించింది. సవిత విశ్వవిద్యాలయానికి 40ఎకరాల చొప్పున రెండు విడతలుగా 80ఎకరాలు, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి 10.2ఎకరాలు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు 2ఎకరాలు, ఏపీపీఎస్సీకి 1.5ఎకరాలు, ఏపీ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌, రాజన్న ట్రస్ట్‌కు ఒక్కో ఎకరం చొప్పున, యంగ్‌మెన్స్‌ క్రిస్ట్రియన్‌ అసోసియేషన్‌ (వైఎంసీఏ)కు 2.65ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. కాగా, భూములు కేటాయించినా నిర్ణీత కాలంలో నిర్మాణాలు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది.
 
దొనకొండ పారిశ్రామిక హబ్‌కు 2395 ఎకరాలు
ప్రకాశం జిల్లా దొనకొండ కేంద్రంగా ఏర్పాటుకానున్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌కు 2,395.98 ఎకరాలు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దొనకొండ మండలం రాగమక్కపల్లిలో 481.19 ఎకరాలు, భూమన్‌పల్లిలో 140.59ఎకరాలు, రుద్రసముద్రంలో 1,555.57ఎకరాలు, ఇండ్లచెరువు గ్రామంలో 218.63ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో 38.53 ఎకరాల పోరంబోకు భూమిని మత్స్యశాఖకు కేటాయించారు. తుఫాన్‌లు, ఇతర విపత్తుల సమయంలో మత్స్యకారులు తమ సామగ్రి, విలువైన పరికరాలను కాపాడుకునేందుకు ఇక్కడ ఫిషింగ్‌ హర్బర్‌ను ఏర్పాటు చేస్తారు. కాగా, కృష్ణాజిల్లా అగిరిపల్లి మండలం తాడేపల్లిలో 2.75ఎకరాల భూమిని హ్యాపీవ్యాలీ పాఠశాలకు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Link to comment
Share on other sites

చురుగ్గా పార్కు అభివృద్ధి పనులు
25-11-2018 10:17:17
 
అమరావతి(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని అమరావతి సెంట్రల్‌ పార్క్‌ (శాఖమూరు ఉద్యానవనం) చుట్టూ 4.50 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేస్తున్న జాగింగ్‌ ట్రాక్‌ వెంబడి ఆకర్షణీయమైన విద్యుత్తు దీపాలను అమర్చే పనిని వెంటనే పూర్తి చేయాల్సిందిగా ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి అధికారులను ఆదేశించారు. ఈ పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారంనాడామె పరిశీలించారు. అందులోని ప్రగతి రిసార్ట్‌, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, వైల్డర్‌నెస్‌ పార్క్‌, క్రాఫ్ట్‌ బజార్‌ నిర్మాణాలు జరుగుతున్న తీరును చూశారు. అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లోని సరస్వతి, పంచభూత, పంచవటి వనాలకు సంబంధించిన పనులను ఈ నెలాఖర్లోగా పూర్తి చేయాలన్నారు. ప్రగతి రిసార్ట్‌లో అంతర్గత రహదారులు, పాత్‌ వే పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు.
 
పచ్చదనం అభివృద్ధి పనులను సైతం..
విజయవాడలో ఏడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన పచ్చదనం అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయని లక్ష్మీ పార్థసారధి అన్నారు. నగరంలోని గులాబీతోట, కనకదుర్గమ్మ వారధి కూడలి, కృష్ణవేణి ఘాట్‌, ఇంద్రకీలాద్రి ప్రాంతాల్లోని గ్రీనరీ పెంపకం పనులను ఆమె పరిశీలించారు. గులాబీ తోట వద్ద రైవస్‌ కాలువ వెంబడి చేస్తున్న సుందరీకరణ పనుల్లో భాగంగా ఆకర్షణీయమైన మొక్కలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. కాలువ వెంబడి ఇప్పటికే ఉన్న వృక్షాల వద్ద చక్కటి ల్యాండ్‌స్కేపింగ్‌, ఆకర్షణీయమైన లాన్లను అభివృద్ధి పరచాలన్నారు. కనకదుర్గమ్మ వారధి కూడలిలో ఏర్పాటు చేస్తున్న ధమ్మచక్ర పనులు పూర్తయ్యేలోగా ఆ ప్రాంతంలో అందమైన మొక్కలను పెంచాలని చెప్పారు. కృష్ణవేణి ఘాట్‌కు వచ్చే సందర్శకులకు నేత్రానందం కలిగించే వ్యూ గ్యాలరీలను నిర్మించాలని సూచించారు. పర్యటనలో ఏడీసీ సీఈ టి.మోజె్‌సకుమార్‌, ఎస్‌.ఇ. ఎం.వి.సూర్యనారాయణ, ఉద్యాన విభాగం ఉప సంచాలకుడు బి.శ్రీనివాసులు, పట్టణ ప్రణాళికా విభాగాధికారులు పి.సురే్‌షబాబు తదితరులు కూడా పాల్గొన్నారు
Link to comment
Share on other sites

The design of the three-floor assembly building includes a 250-meter tower, which will make it taller than the 182-metre Statue of Unity in Gujarat.
  • TNM Staff
  •  
  • Friday, November 23, 2018 - 09:26
 
 
MplFkmi.jpg

Apparently, politicians in India are fighting to reach monumental heights -- quite literally. Joining the list of tall structures in India would be the Andhra Pradesh Assembly building that will come up at Amaravati. The proposed design that has almost been finalised by Chief Minister Chandrababu Naidu will make the Andhra Pradesh Assembly building taller than the Statue of Unity by 68 meters.

The three-floor Assembly building will have a 250-meter tower making it taller than the 182-metre Statue of Unity in Gujarat. The proposed structure will be shaped like an upside-down lily flower, said Minister for municipal administration P Narayana, speaking to media. The tending process for the construction of the proposed assembly will begin by the end of November.

The AP government expects the tendering process alone to take two years to finalise, he added.

N Chandrababu Naidu, the Andhra Pradesh Chief Minister has almost finalised the design by UK based architects Norma Fosters.

Earlier in October, there was sharp criticism from all quarters over the Rs 2,989 crore spent on the construction of the Statue of Unity. The statue was inaugurated by the Prime Minister Narendra Modi, who said that the statue will be a reminder to the nation of Sardar Vallabhai Patel's efforts to unify India shortly after the country gained independence from the British.

However, shortly after the Statue of Unity was inaugurated two states made announcements about building grand statues.

The Uttar Pradesh chief minister Adithyanath announced that his state would build a 201-metre tall statue of Lord Ram. This announcement was followed by the Karnataka government’s announcement to build a 125 feet (38.1 meters) statue of Mother Cauvery. 

Earlier, the PM had laid the foundation stone for Chhatrapati Shivaji’s memorial statue that was expected to be 210 meters tall costing Rs 3,600 crore. However, the height of the statue was shortened by 7.5 meters to save costs.

Link to comment
Share on other sites

స్టార్టప్‌ పనులపై..కాలయాపన!
26-11-2018 07:24:07
 
636788138489172852.jpg
  • శంకుస్థాపన జరిగి ఏడాదిన్నర
  • నేటికీ మొదలు కాని పనులు
  • జనవరి 11న స్టార్టప్‌ ఏరియా పనులు ప్రారంభం?
  • ఈసారి మాత్రం ఖాయమేనంటున్న సింగపూర్‌ ప్రతినిధులు
అమరావతి(ఆంధ్రజ్యోతి): రేపోమాపో అంటూ నెలల తరబడి ఊరిస్తూ, చివరికి ఉసూరుమనిపిస్తున్న రాజధానిలోని స్టార్టప్‌ ఏరియా (సీడ్‌ క్యాపిటల్‌) అభివృద్ధి పనులు వచ్చే ఏడాది జనవరి 11న ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈమేరకు సింగపూర్‌ కన్సార్షియం ప్రభుత్వానికి తెలియజేసిందని సమాచారం. జనవరి 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ల మధ్య జరగనున్న సంయుక్త కార్యాచరణ సారధ్య కమిటీ భేటీ తర్వాత అమరావతిలో ప్రతిపాదించిన స్టార్టప్‌ ఏరియా పనులకు శ్రీకారం చుడతామని చెప్పినట్లు భోగట్టా. నిజంగానే గనుక ఇలా జరిగితే ఒప్పంద ప్రకారం ఎంతకీ పనులు ప్రారంభించని సింగపూర్‌ కన్సార్షియాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షిస్తుండడంతో ఆ ప్రభావం రాజధాని పురోగతిపై పడుతోందన్న పలువురి విమర్శలకు అడ్డుకట్ట పడినట్లవుతుంది.
 
అమరావతి ఆర్ధికాభ్యున్నతికి చోదకశక్తిలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో ఏపీసీఆర్డీయే స్టార్టప్‌ ఏరియాను ప్రతిపాదించింది. రాజధానిలోని అత్యంత కీలక ప్రదేశంలో, కృష్ణానదీ తీరాన, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు- గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లకు సమీపాన దీనికోసం 1691 ఎకరాలను నిర్దేశించింది. ఈ భూమిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పరచడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సంస్థలను ఇక్కడికి రప్పించి ఆర్ధిక లావాదేవీలకు కేంద్రంగా చేయాలన్నది లక్ష్యం. దీని వల్ల రాజధాని ఆదాయం పెరగడమే కాకుండా పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. పైగా ఇందులోని భూములను ఆకర్షణీయమైన రీతిలో అభివృద్ధి పరచి, మంచి ధరలకు విక్రయించే బాధ్యత కూడా స్టార్టప్‌ ఏరియా డెవలపర్‌దే. ఈ రూపంలో లభించే ఆదాయంలో 42 శాతాన్ని సింగపూర్‌ కన్సార్షియం మనకు ఇవ్వనుంది. స్టార్టప్‌ ఏరియా రాకతో ఒక్క అందులోనే కాకుండా అమరావతి వ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ అంశాలన్నింటితో అమరావతి సత్వర, సమగ్రాభ్యున్నతికి స్టార్టప్‌ ఏరియా చక్కటి చోదక శక్తిలా ఉపకరిస్తుందని అంతా అనుకున్నారు.
 
ఎప్పటికప్పుడు ఏవేవో సాకులు చెప్పి, కాలక్షేపం చేయడమే తప్ప స్టార్టప్‌ ఏరియాను ఇప్పట్లో అభివృద్ధి పరచాలన్న ఆలోచనేదీ సింగపూర్‌ కన్సార్షియానికి ఉన్నట్లు లేదని ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న పలువురు వ్యాఖ్యానించడం పరిపాటైంది. దీనిని అనుకున్న తర్వాత చేపట్టిన పలు ఇతర ప్రాజెక్టుల పనులు నెలల క్రితమే మొదలై, చురుగ్గా సాగుతుండగా సింగపూర్‌ కన్సార్షియం మాత్రం ఆ ఊసే ఎత్తకపోవడంలోని ఆంతర్యమేమిటన్న దానిపై పలు ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఎప్పుడు మొదలవుతాయన్న ప్రశ్నలను సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రి పి.నారాయణ తరచుగా ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా జా ప్యం చేస్తున్న సింగపూర్‌ కన్సార్షియాన్ని ఎం దుకు ఉపేక్షిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.
 
శంకుస్థాపన జరిగి ఏడాది
‘అంకుర ప్రాంతం’గా కూడా పేర్కొనే ఈ స్టార్టప్‌ ఏరియాను నిర్దేశిత లక్ష్యసాధనకు అనువుగా తీర్చిదిద్దేందుకు సరైన అనుభవం, నైపుణ్యమున్న సంస్థలను గుర్తించేందుకు నిర్వహించిన ప్రక్రియలో సింగపూర్‌ కన్సార్షియం ఎంపికైంది. దీంతో గతేడాది ప్రథమార్ధంలో దాంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం 3 దశల్లో, 15 సంవత్సరాల కాలవ్యవధిలో దీనిని అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఆ మేరకు తొలి దశలోని 650 ఎకరాలను 5 ఏళ్లలో తీర్చిదిద్దాల్సి ఉండగా, సుమారు ఏడాదిన్నర క్రితం ఆ పనులకు శంకుస్థాపన కూడా జరిపారు. ఒప్పందం ప్రకారం ఈ దశలో ఒక్కొక్కటి 8 లక్షల చదరపుటడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను కలిగి ఉండే ఆ వెంటనే పనులు మొదలై, చకచకా సాగుతాయని అందరూ భావించారు. కానీ సింగపూర్‌ కన్సార్షియం మాత్రం ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి, పనులను ప్రారంభించనే లేదు. దీనిపై ప్రభుత్వం, ఏపీసీఆర్డీయే, ఏడీసీ ఇత్యాదివి ఒత్తిడి చేసినప్పటికీ రేపుమాపంటూ కాలయాపన చేసిందే తప్ప రంగంలోకి దిగలేదు. పరస్పర సహాయ సహకారాలు, వాణిజ్య సంబంధాలపై రాష్ట్ర ప్రభుత్వం- సింగపూర్‌ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాల అమలు తీరు పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ, సంయుక్త పర్యవేక్షణ కమిటీల భేటీల్లో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినా ఒరిగింది శూన్యం.
 
ఈసారైనా పనులు మొదలవుతాయా..?
అనుకున్న ప్రకారం పనులు మొదలైనట్లయితే ఈపాటికి వాటిల్లో గణనీయ పురోగతి కనిపించి ఉండేదని, ఆ ప్రభావం అమరావతి ఇమేజ్‌ను మరింతగా పెంచేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వచ్చే ఏడాది జనవరి 11న స్టార్టప్‌ ఏరియా పనులను మొదలు పెడతామని సింగపూర్‌ కన్సార్షియం సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. అయితే గతానుభవాల దృష్ట్యా ఈ తాజా ముహూర్తానికి అది ఎంతవరకు కట్టుబడి ఉంటుందో వేచి చూడాలి!
Link to comment
Share on other sites

అరణ్య’ రోదనే!
27-11-2018 02:10:53
 
636788814549472291.jpg
  • అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం అడ్డుకట్ట
  • అటవీ భూముల మళ్లింపునకు తిరస్కరణ
  • అనుమతి నిరాకరించిన ఎఫ్‌ఏసీ కమిటీ
  • దరఖాస్తులు బుట్టదాఖలు మరింత పచ్చదనం పెంచాలని ‘సలహా’
  • సైన్స్‌ సిటీ, ఎయిరోస్పేస్‌ ప్రాజెక్టులకు బ్రేక్‌!
న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నిధులు ఇవ్వరు! అనుమతులూ ఇవ్వరు! చివరికి... అటవీ భూముల మళ్లింపునకూ సహకరించరు! నవ్యాంధ్రపై కేంద్ర ప్రభుత్వం మరోమారు వివక్ష ప్రదర్శించింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులకు అడ్డుకట్ట వేసింది. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన అటవీ భూముల మళ్లింపు ప్రతిపాదనలను ఆమోదించకుండా తిరస్కరించింది. అమరావతి అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్న వివిధ కీలక ప్రాజెక్టుల కోసం గుంటూరు అటవీ డివిజన్‌ పరిధిలోని 3307.27 హెక్టార్ల రిజర్వు ఫారెస్టు భూమిని సీఆర్డీయేకు మళ్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 8 దరఖాస్తులను పంపింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అనుమతులిచ్చే అటవీ సలహా సంఘం(ఎఫ్‌ఏసీ) వీటన్నింటినీ బుట్టదాఖలు చేసింది.
 
ఈ తిరస్కరణకు చెప్పిన కారణాలు ఏ మాత్రం సహేతుకంగా లేవని అధికారులు చెబుతున్నా రు. ‘‘రాజధాని ప్రాంతంలో మొత్తం విస్తీర్ణంతో పోల్చితే రిజర్వు ఫారెస్టు విస్తీర్ణం 5ు కూడా లేదు. ఇతర రాజధాని ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో తక్కువ పచ్చదనం ఉంటుంది. అలాగే, సీఆర్డీయే పరిధిలో ఉన్న భూముల్లో 95 శాతానికి పైగా అటవీయేతర భూమి ఉంది. అందులో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించలేదు’’ అనే రెండు ప్రధా న కారణాలను చూపిస్తూ ఎఫ్‌ఏసీ అనుమతులు నిరాకరించింది. చివర్లో.. ఒక ఉచిత సలహా కూడా ఇచ్చింది.
 
మొదటి నుంచీ అదే వివక్ష
అమరావతి అభివృద్ధికి అవసరమైన అటవీ భూముల మళ్లింపు విషయంలో మొదటి నుంచీ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తూనే ఉంది. ఈ విషయంలో ఎప్పుడూ ఉదారంగా వ్యవహరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం 8603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల భూమిని రాజధాని ప్రాంతంగా నోటిఫై చేయగా... అందులో 407.96 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు ఉంది. ఈ నేపథ్యంలో తొలుత 19526.6 హెక్టార్ల అటవీ భూములను సీఆర్డీయేకు మళ్లించాలని 2015లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. తర్వాత రెండు సార్లు భూ విస్తీర్ణాన్ని తగ్గించి చివరిగా 12,444.89 హెక్టార్లకు కుదించింది. ఈ ప్రతిపాదనలు ఎఫ్‌ఏసీ ముందుకు రాగా... భూములను ప్రత్యక్షంగా పరిశీలించడానికి 2017లో సీనియర్‌ అధికారి అజయ్‌ కుమార్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించింది.
 
రాజధాని ప్రాంతంలో పర్యటించి భూములను పరిశీలించిన నిపుణుల కమిటీ ఎఫ్‌ఏసీకి నివేదిక సమర్పించింది. నివేదిక అందిన తర్వాత 2017 ఆగస్టు 17న సమావేశమైన ఎఫ్‌ఏసీ... భూ మళ్లింపునకు ప్రతిపాదించిన 12,444.89 హెక్టార్లలో కేవలం 2087.09 హెక్టార్లకు మాత్రమే అనుమతించింది. అది కూడా భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. కాగా, మరోసారి 5229.69 హెక్టార్ల భూమి మళ్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు దరఖాస్తులు చేయగా... నిర్దిష్టంగా ఏ ప్రాజెక్టు కోసం భూమిని మళ్లించాలో చెప్పాలని ఆదేశించింది.
 
సైన్స్‌ సిటీ కీలకం..
అటవీ భూముల అనుమతుల కోసం రాష్ట్ర ప్ర భుత్వం చేసిన ప్రతిపాదనల్లో అన్నీ కీలక ప్రాజెక్టులే ఉ న్నాయి. సైన్స్‌ సిటీ, ఎకో థీమ్‌ పార్కు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టు వంటివి ప్రతిపాదించారు. ‘క్యాపిటల్‌ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌’ ప్రాజెక్టు కింద కొండవీడు ఫారెస్టు బ్లాక్‌ పరిధిలో అడ్వెంచర్‌ ఎకో థీ మ్‌ పార్కు ఏర్పాటుకు 150.84 హెక్టార్లు, ఇంటిగ్రేటెడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ కాంప్లెక్స్‌కు 434.85 హెక్టార్లు, ఫారెస్టు అకాడమీ, ఐఐఎఫ్‌ అండ్‌ సీసీ, ఏపీఎ్‌ఫడీ, ఏపీ ఎఫ్‌డీసీ, ఏపీపీసీబీ, ఎన్‌జీసీ సంస్థలను ఏర్పాటు చేయడానికి 250.08 హెక్టార్లను కేటాయించాలని కోరారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...