Jump to content

Amaravati

Recommended Posts

కృష్ణా తీరంలో వి‘హారం’ 

రాజధానిలో ‘ఫిట్‌నెస్‌ అండ్‌ డ్రైవ్‌ ఇన్‌ ఏరియా’ ఏర్పాటుకు నిర్ణయం 
కొలువుదీరనున్న ఈత కొలను, జిమ్‌, క్రీడా ప్రాంగణాలు 
కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడిపేందుకు ప్రత్యేక వసతులు 
డిసెంబరు నెలాఖరుకి అందుబాటులోకి తెచ్చేందుకు సీఆర్‌డీఏ ప్రణాళిక 
2ap-story3a.jpg

చుట్టూ పచ్చని చెట్లు...వినవచ్చే పక్షుల కిలకిలరావాలు...సంధ్యవేళ కృష్ణమ్మపై తేలియాడే లేలేత బంగారు సూర్య కిరణాల దృశ్యాలు... ఎంతో ఆనందాన్ని ...ఆహ్లాదాన్ని కలిగించక మానవు.  కుటుంబసభ్యులతో పచ్చికబయళ్లపై ఆశీనులై వీటన్నింటిని ఆస్వాదిస్తూ... వీక్షిస్తూంటే ఎవరికైనా ఎక్కడో తేలిపోతున్నట్లుగానే ఉంటుంది. చెంతనే ఉన్న నదీ తీరం నుంచి వచ్చే చల్లటి గాలులతో మనసు పులకరించక మానదు. దీనికి తోడుగా యోగా, ఆహారం, ఈతకొలను, ఇతర కేంద్రాలు కూడా సమీపాన ఉంటే ఇంకా ఎంతో బాగుంటుంది కదా! అదిగో... ఆ కోణంలోనే ఈ అనుభూతుల సంగమాన్ని ఏర్పాటు చేసే దిశగా...రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ఒక కార్యాచరణను రూపొందించింది. ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా దీనిని ఆచరణ రూపంలోకి తేనుంది.

2ap-story3b.jpg

ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలు ఇవీ 
ఞ ఈ ఫిట్‌నెస్‌ కేంద్రంలో వివిధ క్రీడలకు సంబంధించిన వసతులు, ఆహారశాలలు ఏర్పాటవుతాయి. 
కృష్ణా నది ఒడ్డు నుంచి 20 మీటర్ల వెడల్పున ‘రివర్‌ ఫ్రంట్‌ ఏరియా’ అభివృద్ధి చేస్తారు. ప్రజలు నది ఒడ్డునే కూర్చుని సేద తీరేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. ‘ఫిషింగ్‌ డెక్‌’లు, యోగా కేంద్రం, వాలీబాల్‌ కోర్టు, వాచ్‌ టవర్‌ వంటివి ఈ ప్రాంతంలో వస్తాయి. 20 మీటర్ల వెడల్పున నడకదారి ఉంటుంది.

2ap-story3c.jpg

నడకదారిని ఆనుకుని 20 మీటర్ల వెడల్పున చెట్లు పెంచి బఫర్‌జోన్‌గా అభివృద్ధి చేస్తారు. 
బఫర్‌ జోన్‌కి, కరకట్టకు మధ్యలో పెద్దలకు, చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఈత కొలను, అవుట్‌డోర్‌ జిమ్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌ ప్రాక్టీస్‌కి నెట్‌లు, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబడ్డీ కోర్టులు వంటివి ఏర్పాటవుతాయి. 
వంపులు తిరిగిన సైకిల్‌ ట్రాక్‌ను నిర్మిస్తారు. 
ఇండోర్‌ గేమ్స్‌కు తాత్కాలిక షెడ్‌లు వంటివి ఏర్పాటు చేస్తారు. తాత్కాలిక నిర్మాణాలు, ఇతర సదుపాయాలను సీఆర్‌డీఏనే సమకూరుస్తుంది. ఆహార కేంద్రాల వంటివి ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు లీజుకి ఇస్తుంది. 
ఈ కేంద్రానికి పక్కనే పొలారిస్‌ సంస్థ మూడు ఎకరాల్లో ‘ఏటీవీ (ఆల్‌ టెరైన్‌ వెహికిల్‌) అడ్వెంచర్‌ పార్కు ఏర్పాటు చేయనుంది.

2dXURtr.jpg

అమరావతి రాజధాని ప్రాంతంలో నిత్యం రణగొణ ధ్వనులతో సతమతమయ్యే ప్రజానీకం కొంతసేపైనా సేదతీరేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)చర్యలు చేపడుతోంది. కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని ఆనందంగా గడిపేలా కృష్ణా నదీ తీరంలో ‘ఫిట్‌నెస్‌ సెంటర్‌ అండ్‌ డ్రైవ్‌ ఇన్‌ ఏరియా’ పేరుతో సీఆర్‌డీఏ ఒక వినోద, విహార కేంద్రాన్ని అభివృద్ధి చేయనుంది. వెంకటపాలెం సమీపంలో మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమానికి పక్కనే... కృష్ణా నదికి, కరకట్టకు మధ్య 12 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటుకానుంది. కుటుంబసభ్యులతో వెళ్లి కాసేపు సేద తీరేందుకు ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఒక్క వినోద, విహార కేంద్రం కూడా లేదు. పలు రిసార్టులు, హోటళ్లకు స్థలాలు కేటాయిస్తున్నా... అవి అందుబాటులోకి వచ్చేసరికి కనీసం మరో రెండేళ్లు పడుతుంది. ఆలోగా సీఆర్‌డీఏనే స్వయంగా రంగంలోకి దిగి ఈ వినోద, విహార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొన్ని వసతులతో దీన్ని ప్రారంభించి... క్రమంగా మిగతావి సమకూర్చాలని భావిస్తోంది. ‘‘ప్రస్తుతం రాజధానిని సందర్శించేందుకు వచ్చే వారు...సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు... విజయవాడలో నివాసం ఉండేవారు కాసేపు కూర్చుని మంచి భోజనం చేసేందుకు, కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు సరైన ప్రదేశం లేదు. ఆ లోటును భర్తీ చేసేందుకే ఈ ఫిట్‌నెస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం...’’ అని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ తెలిపారు.

-ఈనాడు, అమరావతి

Link to comment
Share on other sites

తలదన్నేలా! తలెత్తుకునేలా!! 

కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాల నిర్మాణం

ఐదు టవర్లలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు 
50వ అంతస్తులో సీఎం  ఛాంబర్‌ 
ప్రారంభమైన నిర్మాణ పనులు

ktXmxJC.jpg

అమరావతి రాజధానిగానే కాక పర్యాటక కేంద్రంగానూ మారనుంది. అత్యాధునిక హంగులు...  ఆకట్టుకునే ఇంటీరియర్‌తో...  అబ్బురపరిచే రీతిలో సచివాలయ భవనాలను  నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారికి ఓ అనుభూతిని మిగిల్చేలా పూర్తిస్థాయి ఆకృతులు సిద్ధమయ్యాయి. పనులు కూడా మొదలయ్యాయి. రెండేళ్లలో వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యం. సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాలకు భిన్నంగా... సమున్నతంగా... ఈ భవనాలను తీర్చిదిద్దనున్నారు. రాష్ట్ర సచివాలయంతో పాటు, విభాగాధిపతుల కార్యాలయాలూ వీటిలోనే ఏర్పాటవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన సచివాలయం ఇలా అనేక విశేషాల సమాహారంగా నిలవనుంది.

wov4Kai.jpg

ప్రపంచంలోని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాలను తలదన్నేలా... ఆధునిక హంగులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో... శాసనసభ భవనానికి పశ్చిమ దిశలో ఆధునికత, సౌలభ్యాల కలబోతగా ఐదు టవర్లు నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా మొత్తం పరిపాలనా యంత్రాంగం కొలువుతీరే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం పరిపాలన నగరంలో ఇప్పటికే మొదలైంది.  ఇప్పటిలా సచివాలయం ఒక చోట, విభాగాధిపతుల కార్యాలయాలు మరో చోట ఉండకూడదన్న ఉద్దేశంతో, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా ఆకృతులు తీర్చిదిద్దారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌కి చెందిన ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ వీటిని సిద్ధం చేసింది. అంతర్గత వసతులకు సంబంధించిన డిజైన్లను తాజాగా ప్రభుత్వం ప్రదర్శించింది. కేవలం పరిపాలనా సౌధాలుగానే కాకుండా... సందర్శనీయ స్థలాలుగా, రాజధాని నగరానికే కళ తెచ్చేలా ఈ భవనాల్ని తీర్చిదిద్దనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయ భవనాలుగా, దేశంలోనే మొదటి డయాగ్రిడ్‌ భవనాలుగా... ఇంకా పలు విశేషాలతో ఇవి వన్నె తేనున్నాయి.

nOKtvcq.jpg

ముఖ్యాంశాలు...! 
212 మీటర్ల ఎత్తు..! 
మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనాలు నిర్మిస్తారు. 
ఐదు టవర్లతో పాటు, అదే ప్రాంగణంలో తొమ్మిది పోడియంలు కూడా ఉంటాయి. 
ముఖ్యమంత్రి కార్యాలయ భవనంలో 50 అంతస్తులు ఉంటాయి. దీని ఎత్తు 212 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ భవనంగా నిలుస్తుంది. 
మిగతా నాలుగు టవర్లలో (టీ1, టీ2, టీ3, టీ4) 40 అంతస్తుల చొప్పున ఉంటాయి. 
ముఖ్యమంత్రి కార్యాలయం 50వ అంతస్తులో ఉంటుంది. ఈ భవనంపైనే హెలిపాడ్‌ ఉంటుంది. దేశంలో మరే రాష్ట్రంలోను సచివాలయంపైన హెలిపాడ్‌ లేదు. 
తొమ్మిది పోడియంలలో.. ఒక్కో దానిలో మూడు అంతస్తులు ఉంటాయి. సందర్శకులు వేచి ఉండటానికి వసతులు, రెస్టారెంట్లు వంటి సదుపాయాలు కల్పిస్తారు. 
మొత్తం సచివాలయ భవనాల నిర్మిత ప్రాంతం: 69.8 లక్షల చ.అడుగులు. 
ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.4 వేల కోట్లు. 
ప్రస్తుతం జరుగుతున్న పనుల విలువ: రూ.2271 కోట్లు.

iv83xCo.jpg

దేశంలో మొదటి డయాగ్రిడ్‌ భవనం 
సచివాలయ టవర్లను దేశంలోనే మొదటిసారిగా డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించనున్నారు. ఈ భవనాల్లో నిలువు స్తంభాలు ఉండవు. సెంట్రల్‌ కోర్‌పైనా, చుట్టూ ఉండే ఇనుప ఫ్రేంపైనా భవనం ఆధారపడి ఉంటుంది. నిలువు స్తంభాలు లేకపోవడం వల్ల సాధారణ భవనాలతో పోలిస్తే ‘ఫ్లోర్‌ స్పేస్‌’ ఎక్కువగా ఉండటంతో పాటు, సౌలభ్యంగాను ఉంటుంది. నిర్మాణంలో ఉక్కు వినియోగం 30 శాతం వరకు తగ్గుతుంది. 
* భూకంపాలు, తుపానులను తట్టుకుని నిలబడే సామర్థ్యం డయాగ్రిడ్‌ భవనాలకు మరింత ఎక్కువగా ఉంటుంది. 
డయాగ్రిడ్‌ ఫ్రేంకి బిగించిన అద్దాల్లోంచి సూర్యరశ్మి ఎక్కువగా భవనం లోపలికి రావడం వల్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. డయాగ్రిడ్‌ షేడ్‌లా ఉపయోగపడటం వల్ల భవనంలో ఉన్న వారిపై ఎండ తీవ్రత ఎక్కువగా పడదు.

Tj3XXaz.jpg

ట్విన్‌ లిఫ్ట్‌లు..! 
సచివాలయ భవనాల్లో దేశంలోనే మొదటిసారి ట్విన్‌ లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 
ప్రతి లిఫ్ట్‌ మార్గంలోను రెండు లిఫ్ట్‌ కార్లు ఉంటాయి. సగం అంతస్తుల వరకు ఒకటి, ఆ తర్వాత మరొకటి ఉంటుంది. 
ప్రతి టవర్‌లో 15 హైస్పీడ్‌ లిఫ్ట్‌ కార్లు ఏర్పాటు చేస్తారు. 
పరిపాలన నగరం మధ్యలోంచి వెళుతున్న పాలవాగుకి ఒక పక్క మూడు టవర్లు, రెండో పక్క రెండు టవర్లు నిర్మిస్తున్నారు. 
3ap-main2F.jpgమొత్తం ఐదు టవర్లను అనుసంధానిస్తూ ఎత్తైన కాలినడక మార్గం (కనెక్టింగ్‌ స్పైన్‌) ఉంటుంది. 
సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసే సదుపాయాలు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, ఉద్యోగ సంఘాలకు ప్రత్యేక సమావేశ మందిరం, రెస్టారెంట్‌లు/కెఫెటేరియాలు, బ్యాంకులు, ఈ-సేవ కేంద్రాలు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌, లైబ్రరీ, ప్లేస్కూల్‌ వంటివి ఉంటాయి. 
ప్రతి టవర్‌లో కల్పించే సదుపాయాలు బ్రేకౌట్‌ ఏరియా, 200, 125, 75 మంది కూర్చునేలా సమావేశమందిరాలు. కెఫెటేరియా, క్రెచ్‌, జిమ్‌. 
ప్రస్తుత పరిస్థితి ఐదు టవర్ల పునాదుల నిర్మాణానికి తవ్వకాలు జరిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ భవనం టవర్‌కు ర్యాఫ్ట్‌ నిర్మాణం మొదలైంది. డిసెంబరు 15కి పునాదులు పూర్తి చేసి, భవనం పనులు ప్రారంభిస్తారు.

RpxGuQf.jpg

ఆధునిక వసతులు..! 
సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి భిన్నంగా, ఆధునిక వసతులతో ఉంటాయి. విశాలమైన ఎంట్రెన్స్‌ లాబీలు, మంత్రులు, సీనియర్‌ అధికారులకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, ప్రతి అంతస్తులో విశాలమైన వెయిటింగ్‌ లాంజ్‌, మంత్రులు, ఉన్నతాధికారులకు విశాలమైన ఛాంబర్లు ఉంటాయి. విరామ సమయంలో సేద తీరేందుకు లాబీలు, జిమ్‌లు  ఏర్పాటు చేస్తున్నారు. 
ప్రతి 15 అంతస్తులకు ఒక ‘బ్రేకవుట్‌ ప్లేస్‌’ ఉంటుంది. అక్కడ కెఫెటేరియా వంటి వసతులు ఉంటాయి. 
సచివాలయ ప్రాంగణంలో విశాలమైన ఆడిటోరియం ఉంటుంది. 
* ప్రతి టవర్‌లో, ప్రతి అంతస్తులో సమావేశమందిరాలు ఉంటాయి.

- ఈనాడు , అమరావతి

Edited by sonykongara
Link to comment
Share on other sites

అమరావతికి సోనీ!
04-11-2018 02:38:43
 
636768959219646038.jpg
  • ముంబై తరువాత ఏపీని కేంద్రం చేసుకోవాలని యోచన
  • స్టూడియో నిర్మిస్తే వచ్చే ఆలోచన
  • ఇక్కడే సీరియల్‌, సినిమా నిర్మాణం
  • త్వరలో రాష్ట్రానికి సోనీ ప్రతినిధులు
అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): అమరావతికి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ రానుందని సమాచారం. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాలు, సీరియళ్లు, మ్యూజిక్‌ తదితర రంగాల్లో సోనీ అగ్రగామిగా ఉంది. మన దేశంలో ముంబై కేంద్రంగా సినిమాలు, సీరియళ్లను నిర్మిస్తోంది. వినోదరంగంలో సోనీ అంటే ఒక బ్రాండ్‌. అంత పెద్ద బ్రాండ్‌ రాష్ట్రానికి వస్తే అది గేమ్‌ చేంజర్‌గా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఒకసారి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ నెలలోనే మరోసారి ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. ఈసారి ఏదో ఒక ఒప్పందం జరిగే దిశగా చర్చలు ఉంటాయని తెలుస్తోంది.
 
అమరావతిలో ఒక స్టూడియో నిర్మిస్తే, దానికి పూర్తి సహకారం అందించేందుకు సోనీ ఆసక్తి కనబరుస్తోంది. సాంకేతికంగా, వ్యాపారపరంగా అవకాశాలను తీసుకొచ్చేందుకు సహకరిస్తానంటోంది. ముంబై స్టూడియోల్లో తమ సంస్థ నిర్మిస్తున్న సినిమాలు, సీరియళ్లను కూడా ఇక్కడికే తీసుకొస్తామంటోంది. సోనీ లాంటి సంస్థ వ్యాపార అవకాశాలు ఇచ్చేందుకు, సాంకేతిక సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే...స్టూడియో నిర్మాణం తాము చేపడతామని తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు ముందుకొస్తున్నట్లు తెలిసింది.
 
‘హెచ్‌సీఎల్‌’లో మరో 500 ఉద్యోగాలు
గన్నవరం మేథాటవర్స్‌లో ప్రారంభించిన హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ర్టీట్‌ నెలరోజుల్లోనే విస్తరణకు సిద్ధమైంది. ప్రారంభ సమయంలో సుమారు 900 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ క్రమంలో చాలా త్వరలోనే అది విస్తరణ బాటకు సిద్ధమైంది. మరో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు త్వరలోనే నియామకాలు చేపడతామని ప్రభుత్వానికి మాటిచ్చింది.

Link to comment
Share on other sites

హ్యాపీనెస్ట్‌కు.. అపూర్వ స్పందన
04-11-2018 08:57:10
 
636769186283699420.jpg
 
  • బుకింగ్‌పై పలువురి ఆసక్తి
  • సీఆర్డీయే వెబ్‌సైట్‌ వీక్షకులు.. రోజుకు 10వేలమందికి పైగా..
  • తొలుత 3 టవర్లలోని 300 ఫ్లాట్లకే బుకింగ్‌లు
  • ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లింపులు
  • 12 సైజుల్లో ఫ్లాట్లు.. ఈ నెల 9 నుంచి బుకింగ్‌లు..
రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌తోపాటు పలు విద్య, వైద్య సంస్థలు, కార్యాలయాలకు సమీపంలో సీఆర్డీయే నిర్మించబోతున్న హ్యాపీనెస్ట్‌ అపార్ట్‌మెంట్ల సముదాయానికి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. రాజధాని పరిసరాలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి, అమెరికా, గల్ఫ్‌ తదితర దేశాల నుంచి ఎందరెందరినుంచో సీఆర్డీయేకు ఎంక్వైరీలు వెల్లువెత్తుతున్నాయి! బ్రోచర్‌ను ఆవిష్కరించిన కేవలం మూడు రోజుల్లోనే ఎక్కడెక్కడి నుంచో వేలాదిమంది హ్యాపీనెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను, బుకింగ్‌ ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు సీఆర్డీయే వెబ్‌సైట్‌ను, ఫోన్లను ఆశ్రయిస్తున్నారు.
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతిలో మొట్టమొదటి ప్రజా నివాస సముదాయంగా అవతరించనున్న ఈ భారీ టవర్లను ఎన్నో ప్రత్యేకతలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామన్న సీఆర్డీయే ప్రకటనతోపాటు వీటిల్లోని అపార్ట్‌మెంట్ల ధరను (ప్రాథమికంగా) చదరపు అడుగుకు రూ.3,500గా నిర్ణయించడం (వెబ్‌సైట్‌లో దీనిని రూ.3,492గా పేర్కొన్నారు)ఇందుకు ప్రధాన కారణాలు. మెట్రోపాలిటన్‌ నగరాల్లో కనిపించే విలాసవంతమైన, సకల అధునాతన వసతులతో కూడిన ఆకాశహర్మ్యాలకు దీటుగా హ్యాపీనెస్ట్‌ను.. అదీ పలు ఆదాయవర్గాలకు అందుబాటు ధరల్లో నిర్మించబోవడం ఎందరినో ఆకర్షిస్తోంది. ఈ సంస్థ వెబ్‌సైట్‌లో హ్యాపీనెస్ట్‌కు సంబంఽధించిన వివరాలను చూస్తున్న వారి సంఖ్య రోజుకు 10,000కు అటూఇటూగా ఉండడం ఇది ప్రజలను ఎంతగా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.
 
బ్రోచర్‌ ఆవిష్కరించిననాటి నుంచే..
గత నెల 31వ తేదీన వెలగపూడిలో జరిగిన సీఆర్డీయే సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హ్యాపీనెస్ట్‌కు సంబంధించిన బ్రోచర్‌, లోగోను ఆవిష్కరించిన సంగతి విదితమే. అయితే అంతకు కొద్దిరోజుల క్రితమే సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తాము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌ గురించి తొలిసారిగా వెల్లడించారు. అప్పటి నుంచే దీనిపై పలు వర్గాల్లో ఆసక్తి వ్యక్తమైంది. ఆ తర్వాత సీఆర్డీయే తన వెబ్‌సైట్‌లో హ్యాపీనెస్ట్‌ విశిష్టతలు, అందులోని అపార్ట్‌మెంట్ల సైజులు, వాటి ధరవరలు ఇత్యాది వివరాలను చూడగానే ఆకట్టుకునే డిజైన్లు, 3డీ వాక్‌వే ద్వారా ఉంచడం దీనిపై ఆసక్తిని మరింతగా పెంచింది.
 
ఇదీ విశిష్టత
హ్యాపీనెస్ట్‌లో మొత్తం 12 టవర్లలో 1,200 అపార్ట్‌మెంట్లు రానున్నాయి. ఇవి 12 సైజుల్లో ఉంటాయి. అన్నీ తూర్పు లేదా పడమర ముఖంతో మాత్రమే ఉండే ఈ ఫ్లాట్లలో తొలి దశలో 3 టవర్ల (ఏ, బీ, సీ)లో 300 నిర్మించాలని సీఆర్డీయే భావిస్తోంది. ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి వీటి ఆన్‌లైన్‌ బుకింగ్‌లను ప్రారంభించనుంది. ఒకవేళ వీటిల్లో 80 శాతానికిపైగా బుకింగ్‌ అయినట్లయితే ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మరో 3 టవర్లలోని 300 అపార్ట్‌మెంట్లకు బుకింగ్‌లు నిర్వహిస్తారు. అయితే హ్యాపీనెస్ట్‌కు ప్రస్తుతం లభిస్తున్న ప్రతిస్పందన దృష్ట్యా తొలి 300 ఫ్లాట్లకు బుకింగ్‌ అది ప్రారంభమైన తొలి రోజు (ఈ నెల 9)నే అయిపోతుందని సీఆర్డీయే అధికారులు ఆశాభావంతో ఉన్నారు.
 
బుక్‌ చేసుకునే విధానం..
1225, 1295 చదరపుటడుగుల ఫ్లాట్లకు రూ.2.50 లక్షల చొప్పున, 1510, 1590 చ.అ.లకు రూ.3 లక్షల చొప్పున, 1630, 1710 చ.అ. ఫ్లాట్లకు రూ.3.50 లక్షల చొప్పున, 1870, 1980 చ.అ.లకు రూ.4 లక్షల లెక్కన, 2120, 2245 చ.అ.లకు రూ. 5 లక్షల చొప్పున, 2635, 2750 చదరపుటడుగుల విస్తీర్ణం ఉండే వాటికి రూ.7 లక్షల చొప్పున బుకింగ్‌ అమౌంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆ తర్వాత దశలవారీగా జరిపే చెల్లింపుల మొత్తం నుంచి మినహాయిస్తారు.
  • ఈ మొత్తాలను ఆన్‌లైన్‌లో దాఖలు చేసే అప్లికేషన్లతోపాటే నెట్‌ బ్యాంకింగ్‌ లేదా క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లించాలి. డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు, చెక్కులు, నగదు రూపంలో చెల్లించేందుకు వీలుండదు. ఈ విషయంలో కొనుగోలుదారులకు ఏమన్నా సందేహాలు కలిగితే నివృత్తి చేసేందుకు సీఆర్డీయే ప్రాంగణంలో ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.
  • ఇందులో ఫ్లాట్‌ కొనుగోలు చేయాలనుకునే వారు చదరపుటడుగుకు రూ.3492తోపాటు కార్‌ పార్కింగ్‌ (ఒకదానికి) రూ.2 లక్షలు, క్లబ్‌ హౌస్‌కు రూ.1.75 లక్షలు, కార్పస్‌ ఫండ్‌గా చ.అ.కు రూ.100 చొప్పున, మెయింటెనెన్స్‌ ఛార్జీలుగా చదరపుటడుగుకు రూ.3 చొప్పున (ఈ రుసుములు 24 నెలలపాటు వర్తిస్తాయి) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తూర్పు ఫేసింగ్‌ కావాలనుకుంటే అదనంగా చ.అ.కు 50 చొప్పున, 5వ అంతస్థు నుంచి పైకి వెళ్లేకొద్దీ ఫ్లోర్‌కు చ.అ.కు 20 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
 
చెల్లింపులు జరపాల్సిన క్రమం..
బుకింగ్‌ అడ్వాన్స్‌ చెల్లించిన తర్వాత బిల్డర్‌- బయ్యర్‌ అగ్రిమెంట్‌ (అగ్రిమెంట్‌ టు సేల్‌) సమయంలో ఫ్లాట్‌ మొత్తం ఖర్చులో 10 ఽశాతం, పోడియం ఫ్లోర్‌ శ్లాబ్‌ పూర్తయిన తర్వాత 15 శాతం, 5, 10, 15, 19 అంతస్థుల శ్లాబ్‌లు పూర్తయిన తర్వాత 15 శాతం చొప్పున, 10వ ఫ్లోర్‌ శ్లాబ్‌ తర్వాత 15 శాతం, ఫ్లాట్‌ నిర్మాణం పూర్తయి దానిని అప్పగించేటప్పుడు మిగిలిన 15 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుందని సీఆర్డీయే పేర్కొంది. మొదట బుక్‌ చేసుకున్న వారికి మొదటగా ఈ ఫ్లాట్లు కేటా యిస్తారు.
 
ప్రస్తుతం నిర్ణయించిన ధరలు బుకింగ్‌లు మొదలయ్యే ఈ నెల 9నాటికి సంబంధించినవని, అవసరమైతే వీటిని పెంచే విచక్షణాధికారం సీఆర్డీయేకు ఉంటుంది. యూనిట్లను బుక్‌ చేసినంతనే వాటిని కేటాయించినట్లుగా భావించరాదని, బుకింగ్‌ అమౌం ట్‌ను చెల్లించిన 30 రోజుల్లోగా అగ్రిమెంట్‌ టు సేల్‌ను చేసుకుంటేనే ఫ్లాట్లను కేటాయించినట్లని నియ మ నిబంధనల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఎవరన్నా నిర్ణీత గడు వులోగా సేల్‌ అగ్రిమెంట్‌ను చేసుకోలేని పక్షంలో వారు చెల్లించిన బుకింగ్‌ అమౌంట్‌ నుంచి 50 శాతాన్ని మిన హాయించుకుని, మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
Link to comment
Share on other sites

9 minutes ago, sonykongara said:

ఎక్కువ మంది interest chupisthe ఎలా select chestharu buyer ni, also construction company ఏది kattedi.. 

Link to comment
Share on other sites

7 minutes ago, ramntr said:

ఎక్కువ మంది interest chupisthe ఎలా select chestharu buyer ni, also construction company ఏది kattedi.. 

evaru mundu vasthe vallaki cm cheppadu , online evaru mundu book chesukunte valla ke anii

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

Registration amount entha avutundhi ?

Link to comment
Share on other sites

కొత్త ఏడాదిలో హైకోర్టు
జనవరి 1 కల్లా నోటిఫికేషన్‌ జారీ చేయండి
  కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
  హైకోర్టు విభజనకు  అడ్డంకులేమీ లేవని స్పష్టీకరణ
5ap-main2a.jpg

ఈనాడు, దిల్లీ: కొత్త ఏడాదిలో అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటు కానుంది. ఉమ్మడి హైకోర్టును విభజించి ఏపీ, తెలంగాణలకు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అడ్డంకులూ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో కొత్త హైకోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. వచ్చే జనవరి 1 కల్లా ఏపీ హైకోర్టు ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్రానికి సూచిస్తూ.. వీలైనంత త్వరగా నూతన భవనాల్లో హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబరు 29న తుది విచారణ జరిపిన జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలను వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులను త్వరగా ఏర్పాటు చేయాలని గతంలో ఉమ్మడి హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై 2015 మే 1న ఉమ్మడి హైకోర్టు విచారణను ముగిస్తూ హైకోర్టు ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. దీనిని సవాలు చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న భవనంలోనే రెండు హైకోర్టులను వేర్వేరుగా ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. సుప్రీంలో ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ తరఫు సీనియరు న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. అమరావతిలో ఏపీ హైకోర్టు నూతన భవనాలు సిద్ధమయ్యేవరకు హైదరాబాద్‌లో ప్రత్యేక భవనం కేటాయిస్తామని తెలిపారు. 2018 డిసెంబరు 15కల్లా అమరావతిలో తాత్కాలిక భవనాలను సిద్ధం చేస్తామని, హైదరాబాద్‌ నుంచి కోర్టును ఏపీకి తరలించవచ్చని ఏపీ తరఫు సీనియరు న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ ప్రమాణపత్రం దాఖలు చేశారు. దీంతో విచారణను ముగిస్తూ సుప్రీంకోర్టు తరలింపు నోటిఫికేషన్‌పై ఆదేశాలిచ్చింది. ‘ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. సంబంధిత నోటిఫికేషన్‌ను జనవరి 1 కల్లా జారీ చేయాలి. రెండు హైకోర్టులు వేర్వేరుగా కార్యకలాపాలు ప్రారంభించాలి. కొత్త భవనాల్లో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభం కావాలి’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

5ap-main2b.jpg
Link to comment
Share on other sites

నవ్యాంధ్ర హైకోర్టు జనవరి ఫస్టుకు రెడీ!
06-11-2018 02:38:53
 
636770687349062503.jpg
  • ఉమ్మడి హైకోర్టు ప్రాంగణంలో 2 కోర్టుల ఏర్పాటు కుదరదు
  • విభజన చట్టానికి విరుద్ధం.. కేంద్రానికి సుప్రీం స్పష్టీకరణ
  • డిసెంబరు 15కల్లా తాత్కాలిక భవనం సిద్ధం
  • వసతులన్నీ సమకూరితే విభజనకు నోటిఫికేషన్‌: బెంచ్‌
న్యూఢిల్లీ, అమరావతి,హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు సిద్ధమైతే నోటిఫికేషన్‌ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 2019 జనవరి 1 నాటికి ఈ నోటిఫికేషన్‌ వస్తుందని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా హైకోర్టు విభజన జరిగి రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా కార్యకలాపాలు ప్రారంభించాలని అభిప్రాయపడింది. హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయడం చట్టసమ్మతం కాదని స్పష్టం చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు ప్రాంగణంలోనే రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయడం విభజన చట్టానికి విరుద్ధమని ఉమ్మడి హైకోర్టు 2015 మే 1న ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ ఏడాది ఆగస్టులో పిటిషన్‌ దాఖలుచేసిన సంగతి తెలిసిందే.
 
ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌భూషన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రెండు రాష్ట్రాల వాదనలు అక్టోబరు 29న ముగిశాయి. హైకోర్టు విభజనపై సోమవారం 8 పేజీల ఉత్తర్వులను ధర్మాసనం జారీ చేసింది. ‘కేంద్ర పిటిషన్‌ మేరకు రెండు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చాం. నవ్యాంధ్ర హైకోర్టుకు భవనాలు సిద్ధమయ్యేవరకు హైదరాబాద్‌లోనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు భవనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. అయితే హైకోర్టు తాత్కాలిక భవనం నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని.. డిసెంబరు 15కల్లా అందుబాటులోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ నివేదించారు.
 
ఆ మేరకు అఫిడవిట్‌ కూడా దాఖల్జేశారు.ప్రస్తుతం ఉన్న హైకోర్టు ప్రారంగణంలోనే రెండు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేయడం ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 30, 31 ప్రకారం వీలుపడదు. డిసెంబరు 15 నాటికి ఏపీలో తాత్కాలిక హైకోర్టు సిద్ధమవుతోంది. హైకోర్టు భవనాల నిర్మాణం, సౌకర్యాలపై న్యాయమూర్తుల తనిఖీల కమిటీ ఇచ్చిన నివేదిక, ప్రతిపాదనలను హైకోర్టు ఫుల్‌ కోర్టు ఆమోదించింది. అక్కడ సౌకర్యాలపై ఏపీకి కేటాయించిన న్యాయమూర్తులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలో న్యాయమూర్తుల నివాస అవసరాల కోసం విల్లాలను అద్దెకు తీసుకుంటామని ఏపీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. అమరావతిలో హైకోర్టుతోపాటు ఇతర కింది కోర్టులు, ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు జస్టిస్‌ సిటీ నిర్మిస్తున్నారు. అందులోనే న్యాయమూర్తులకు నివాస సముదాయాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ జస్టిస్‌ సిటీ నిర్మాణం పూర్తయ్యేదాకా తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
చురుగ్గా కాంప్లెక్స్‌ నిర్మాణం
నవ్యాంధ్ర హైకోర్టు తాత్కాలికంగా కొలువు తీరడానికి వీలుగా అమరావతి ప్రభుత్వ సముదాయంలో నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్రం నోటిఫికేషన్‌ ఇస్తే.. జనవరి 1న నవ్యాంధ్రకు కొత్త హైకోర్టును ప్రారంభించే అవకాశముంది. పేరుకు తాత్కాలిక భవనమే అయినప్పటికీ హైకోర్టు నిర్వహణకు అన్ని విధాలుగా అనువుగా ఉండేలా సువిశాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. జీ ప్లస్‌ 2 అంతస్థులతో రూపుదిద్దుకునే ఈ భవంతి విస్తీర్ణం సుమా రు 2.50 లక్షల చ.అడుగులు. శాశ్వత భవంతి సిద్ధమై హైకోర్టు అందులోకి తరలిపోయాక ఈ కాంప్లెక్స్‌ సిటీ సివిల్‌ కోర్టుగా రూపాంతరం చెందుతుంది.
 
కేసుల విభజన ఇప్పటికే పూర్తి..
ఉమ్మడి హైకోర్టు విభజనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కేసుల విభజన రాష్ర్టాల వారీగా పూర్తయింది. రెండేళ్ల క్రితమే న్యాయమూర్తులు తమ తమ ఐచ్ఛిక రాష్ట్రాల ఆప్షన్లు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విభజన ప్రక్రియ వేగంగా సాగుతుండంతో ఈ నెల 15 కల్లా హైకోర్టులోని అన్ని తరగతుల ఉద్యోగులు తమ ఆప్షన్లను ఆయా శాఖల అధిపతులకు ఇవ్వాలని, వాటిని సీల్డ్‌కవరులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని నవంబరు 1న హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ సర్క్యులర్‌ జారీచేసిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

హ్యాపీనెస్ట్ లో ప్లాట్ల బుకింగ్‌ ఇలా..
06-11-2018 08:22:10
 
636770893312067035.jpg
  • 9వ తేదీ నుంచి 3 టవర్లలోని 300 ప్లాట్లకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం
అమరావతి(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిలో ప్రప్రథమ ప్రజాగృహ సముదాయమైన ‘హ్యాపీనె్‌స్ట’లో అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు పలువురు ఆసక్తి చూపుతున్న తరుణంలో దానిని నిర్మించనున్న ఏపీసీఆర్డీయే వారికి ఉపకరించే వివిధ సూచనలు చేసింది. ఇందులోని మొత్తం 12 టవర్లలో రాబోయే 1200 ఫ్లాట్లలో తొలి దశగా ఏ, బీ, సీ టవర్లలోని 300 అపార్ట్‌మెంట్లకు ఈనెల 9వ తేదీన ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభించనున్న ఈ సంస్థ అందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది. రాజధానిలోని ప్రతిపాదిత సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లో, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు, పలు విద్య, వైద్య సంస్థలు, కార్యాలయాలు, వాణిజ్య, వినోద సముదాయాలకు చేరువగా, నేలపాడులో ఈ హ్యాపీనెస్ట్‌ అనే ప్రతిష్టాత్మక గేటెడ్‌ కమ్యూనిటీని సీఆర్డీయే నిర్మించబోతున్న సంగతి విదితమే.
 
rawerfaweirf.jpgకేటాయించిన 14.46 ఎకరాల్లో కేవలం 20 శాతంలో మాత్రమే నిర్మాణాలుండి, మిగిలిన దానిలో ఉద్యానవనాలు, బహిరంగస్థలాలు ఇత్యాది వాటితో ‘గ్రీన్‌’ భవన సముదాయంగా రూపొందే ఇందులోని ఫ్లాట్ల్లన్నీ తూర్పు, పడమర ఫేసింగ్‌లతో మాత్రమే ఉంటాయి, వాస్తుకు అనుగుణంగానూ ఉంటాయి. 50,000 చదరపుటడుగుల విస్తీర్ణం కలిగిన భారీ క్లబ్‌హౌస్‌, సేద తీరేందుకు, హాయిగా గడిపేందుకు అవసరమైన సకల వసతులతో ప్రపంచస్థాయి జీవన ప్రమాణాలను ఇది అందించనుందని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు.
 
ఈ ప్రాజెక్ట్‌కు ఆంధ్రా బ్యాంక్‌, ఎస్‌.బి.ఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, విజయా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ అప్రూవల్‌ ఇచ్చాయని చెప్పారు. 1225 చదరపుటడుగుల నుంచి 2750 చ.అ. విస్తీర్ణం కలిగిన 2 మరియు 3 బెడ్‌రూం అపార్ట్‌మెంట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చునన్నారు. www.happynest.liveలో ఫ్లోర్‌ ప్లాన్లు, యూనిట్‌ ప్లాన్‌ లేఅవుట్లు, ఖరీదు, దానిని చెల్లించే క్రమంతోపాటు బుకింగ్‌ ప్రక్రియకు సంబంధించిన సకల వివరాలూ పొందుపరిచినట్లు తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...