Jump to content

Amaravati


Recommended Posts

రేపటి నుంచి అమరావతిలో ప్రపంచ బ్యాంక్‌ బృందం పర్యటన
21-10-2018 07:49:22
 
636757049602629900.jpg
అమరావతి: రాజధాని పర్యటన నిమిత్తం ఇంకొక పర్యాయం ప్రపంచ బ్యాంక్‌ బృందం ఇక్కడికి రాబోతోంది. అమరావతిలోని కొన్ని ప్రాధాన్య రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టులకు సుమారు రూ.7,000 కోట్ల రుణ సహాయం అందజేయాలన్న ఏపీసీఆర్డీయే అభ్యర్థన దరిమిలా ఇప్పటికే పలుసార్లు ఈ బ్యాంక్‌ ప్రతినిధులు రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే 4 రోజులపాటు అమరావతిలో గడపనున్న ప్రపంచ బ్యాంక్‌ బృంద సభ్యులు ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులతో చర్చలు జరపడంతోపాటు క్షేత్ర పరిశీలన కూడా చేయనున్నారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠాతోనూ వారు భేటీ అయ్యే అవకాశముంది.
 
కాగా.. తాజా బృందంలో సుమారు 20 మంది సభ్యులు ఉండబోతున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడికి వచ్చిన బృందాల్లో సభ్యుల సంఖ్య ఇంచుమించుగా 10కి అటూఇటూగా ఉండేది. ఈసారి వీరి సంఖ్య అధికం కావడానికి తాము రుణం అందజేయాలని భావిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలనూ మరింత కూలంకషంగా పరిశీలించాలని ప్రపంచ బ్యాంక్‌ భావిస్తుండడమే కారణమని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌ బృంద సభ్యులు సీఆర్డీయే రుణం కోరిన ప్రాజెక్టుల వల్ల ప్రభావితులవబోయే వివిధ వర్గాలకు కల్పిస్తున్న పునరావాస, సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనా మార్గాలతోపాటు ఆయా ప్రాజెక్టుల పరిసరాల్లోని పర్యావరణంపై అవి చూపబోయే ప్రభావం వంటి అంశాలను పరిశీలిస్తారని తెలిసింది.
 
అంతే కాకుండా సదరు ప్రాజెక్టుల్లో లింగవివక్షకు ఆస్కారం లేని విధంగా చర్యలేమైనా తీసుకున్నారా, పని చేస్తున్న కార్మికులందరికీ సరైన జీతభత్యాలు అందుతున్నాయా, వారు బస చేసేందుకు ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక గృహాలు ఆరోగ్యకరంగా, సౌకర్యవంతంగా ఉన్నాయా ఇత్యాది విషయాలపైనా దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా ఆయా వర్గాలకు చెందిన వారితో ముఖాముఖి మాట్లాడతారని తెలిసింది.
ఇప్పటికైనా తేలుస్తారో, లేదో..?!
 
ఇదిలా ఉండగా.. ప్రపంచ బ్యాంక్‌ బృందాలు ఇప్పటికే పలు పర్యాయాలు అమరావతిలో పర్యటించడం, ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులు సైతం అమెరికాలోని ఆ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, దాని ఉన్నతాధికారులతో చర్చలు జరపడం వంటివి జరిగినప్పటికీ రాజధాని ప్రాజెక్టులపై అది రుణమిచ్చే విషయంపై ఇంతవరకూ స్పష్టమైన ప్రకటన రాలేదు. తాము అడిగిన రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌ సూత్రప్రాయంగా అంగీకరించిందని, నేడో రేపో సదరు మొత్తం అందడం ఖాయమని సీఆర్డీయే అధికారులు చెప్పడమే తప్ప అటువైపు నుంచి మాత్రం ఆ దిశగా నిర్దిష్ట ప్రకటనేమీ వెలువడడం లేదు.
 
గత రెండేళ్లలో 3, 4 నెలలకోసారి ఈ బ్యాంక్‌ బృందాలు అమరావతికి వచ్చి, ‘పరిశీలన, చర్చోపచర్చలు’ జరిపి వెళ్లడమే కానీ రుణం మంజూరు చేస్తున్నామన్న ప్రకటన ప్రపంచ బ్యాంక్‌ నుంచి ఎంతకీ రాకపోవడం సీఆర్డీయే సహనానికి పరీక్ష పెడుతోందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి ఇంకొకసారి అమరావతి సందర్శనకు రాబోతున్న ప్రపంచ బ్యాంక్‌ బృందం పర్యటన పూర్తయిన తర్వాతైనా ఈ రుణంపై స్పష్టమైన ప్రకటన వస్తుందో లేక ఎడతెరిపి అన్నదే లేనట్లుగా సాగుతున్న సుదీర్ఘ పరిశీలనా ప్రక్రియ మరి కొంతకాలం కొనసాగుతుందో అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Link to comment
Share on other sites

3 ఏళ్లలో మైలురాళ్లివీ
21ap-main1a.jpg
అమరావతి కలల సాకారం దిశగా అడుగులు
వేగం పుంజుకున్న మౌలిక వసతులు, గృహ నిర్మాణాలు
తరగతులు ప్రారంభించిన రెండు యూనివర్సిటీలు
మరావతి... ఆంధ్రుల కలల రాజధాని. ఆధునిక భారతావనిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ నగరం అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగి సోమవారానికి సరిగ్గా మూడేళ్లు. ఆకృతిదాల్చుతున్న రాచనగరి కార్యాచరణను అవలోకిస్తే ఎన్నెన్నో ఆటుపోట్లు... ఆటంకాలు.      ఈ ప్రజా రాజధానిని విశ్వవిఖ్యాతం చేయాలన్న తపనకు.. కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తోన్న ఆర్థిక సహకారానికి పొంతనలేదు. ఈ పరిస్థితుల్లో మార్గాంతరాలను అన్వేషిస్తూ అవాంతరాలను అధిగమిస్తూ సాగుతున్న ఈ పయనంలో మైలురాళ్లను చూద్దాం..

ఇప్పటిదాకా
* 27,956 మంది రైతుల నుంచి 33,920 ఎకరాల భూసమీకరణ
* సింగపూర్‌ సహకారంతో సీఆర్‌డీఏ ప్రాంతానికి, రాజధాని నగరానికి, సీడ్‌ కేపిటల్‌కి ప్రణాళిక
* రాజధానికి భూములిచ్చిన రైతులకు 63,771 ఫ్లాట్లు తిరిగి  అప్పగింత.
* ఏడు నెలల వ్యవధిలోనే 6 లక్షల చ.అడుగుల తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మాణం.
* కొండవీటివాగు వరద ముంపు నుంచి రాజధానిని కాపాడేందుకు రూ.222 కోట్లతో ఎత్తిపోతల.
* ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల కోసం 60 టవర్లలో 3840 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. డిసెంబరుకి పూర్తి చేయాలన్నది లక్ష్యం. మార్చి వరకు సమయం పట్టే అవకాశముంది.
* 1375 ఎకరాల్లో నిర్మించే పరిపాలన, న్యాయ నగరాల ప్రణాళిక, హైకోర్టు, శాసనసభ,   సచివాలయం ఆకృతుల రూపకల్పన.


అమరావతి అడుగులు ఉన్నంతలో వడివడిగా..
21ap-main1b.jpg

ప్రజా రాజధానిగా అమరావతిని ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి.  మూడేళ్ల క్రితం సరిగ్గా 2015 అక్టోబరు 22న రాజధాని నిర్మాణానికి ప్రధాని మోది శంకుస్థాపన చేశారు. రాజధాని నగర ప్రణాళిక, మౌలిక వసతుల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏడు నెలల వ్యవధిలోనే తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేసి, అమరావతి నుంచే పరిపాలన ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక ఘట్టానికి తెర తీసింది. బ్రిటన్‌కి చెందిన ప్రముఖ భవన నిర్మాణ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ ఆధ్వర్యంలో రాజధానిలో పరిపాలన నగర ప్రణాళిక, ఐకానిక్‌ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టుతో పాటు, సచివాలయ భవనాల ఆకృతులు దాదాపు సిద్ధమయ్యాయి. ఉన్నంతలో వడివడిగా పనులు జరుగున్నాయి. రాజధానికి శంకుస్థాపన జరిగి మూడేళ్లవుతున్న సందర్భంగా ఇంత వరకు సాధించిన పురోగతి, అధిగమించిన మైలు రాళ్లు ఎదురవుతున్న ఆటంకాలపై అవలోకనం.
21ap-main1c.jpg
320 కి.మీ.ల రహదారుల నిర్మాణం
* మొత్తం ప్రధాన రహదారులు: 34 పొడవు: 320 కి.మీ.లు.
* పనులు ప్రారంభమైనవి: 24 పొడవు: 238 కి.మీ.లు
* ఇంత వరకు జరిగిన పనులు: 4050 శాతం.
* లక్ష్యం: డిసెంబరు, కానీ మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది.
* ఇబ్రహీంపట్నం వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు ఖరారు.
* బ్రిడ్జి పొడవు: 3.2 కి.మీ.లు. నిర్మాణ వ్యయం: రూ.1387 కోట్లు. నిర్మాణ గడువు రెండేళ్లు.
* ఐకానిక్‌ బ్రిడ్జి, రహదారుల పనుల విలువ: రూ.13,229 కోట్లు.
21ap-main1h.jpg
హరిత-నీలి ప్రణాళిక
* రాజధానిలో 30 శాతం హరిత వనాలు, జలాశయాలు, కాలువలు ఉండాలన్నది లక్ష్యం. 80 కి.మీ. మేర అంతర్గత జల వనరులు, 100కిపైగా పార్కులు (కాలనీల్లో) అభివృద్ధికి ప్రణాళికలు.
* కొండవీటి వాగు, పాలవాగుల్ని వెడల్పు చేసి, సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.800 కోట్లతో టెండర్లు.
* 300 ఎకరాల్లో  పీపీపీ విధానంలో శాకమూరు పార్కు, మల్కాపురం వద్ద 15 ఎకరాల్లో, అనంతవరంలో 35 ఎకరాల్లో పార్కుల అభివృద్ధి పనులు ప్రారంభం.
21ap-main1i.jpg
భూముల కేటాయింపు
* రాజధానిలో వివిధ యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర సంస్థల నిర్మాణానికి సుమారు 1500 ఎకరాల్ని సీఆర్‌డీఏ కేటాయించింది.
* ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ యూనివర్సిటీలు తొలి దశ భవనాలు నిర్మించి, తరగతులూ ప్రారంభించాయి. సుమారు 4 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
* అమృత యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థల నిర్మాణాలు జరుగుతున్నాయి.
* పది పాఠశాలలు, ఎనిమిది స్టార్‌ హోటళ్లు, బీఆర్‌షెట్టి, ఇండోయూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌, బసవతారకం క్యాన్సర్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థల ఆస్పత్రులకు సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది.
21ap-main1d.jpg
21ap-main1e.jpg
లోటుపాట్లు
* ఐకానిక్‌ భవనాల ఆకృతులు, పరిపాలన నగర ప్రణాళిక రూపకల్పనలో జాప్యం జరుగుతోంది. మొదట జపాన్‌కి చెందిన మాకీ అసోసియేట్స్‌ని ఎంపిక చేశారు. మాకీని పక్కన పెట్టి, నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఆ ప్రక్రియకే ఏడాది పట్టింది. నార్మన్‌ ఫోస్టర్‌ని ఎంపిక చేసిన తర్వాత కూడా ఆకృతుల రూపకల్పనలో జాప్యం జరిగింది. 2018 డిసెంబరు నాటికే ఐకానిక్‌ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పేది. కానీ ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. పూర్తిస్థాయిలో ఆకృతులు సిద్ధమవడానికి మరికొంత సమయం పట్టే అవకాశమూ ఉంది.
* రాజధానిని విజయవాడ-హైదరాబాద్‌ రహదారితో అనుసంధానించే ఐకానిక్‌ బ్రిడ్జిని ఇబ్రహీంపట్నం వద్ద నిర్మించాలన్నది ప్రతిపాదన. ఇటీవలే టెండరు ఖరారు చేశారు.పనులు మొదలు పెట్టడానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది.
* 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌ సంస్థల కన్సార్టియం మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపికైంది. శంకుస్థాపన జరిగి ఏడాదిన్నరైనా పనులు మొదలవలేదు. బీఆర్‌షెట్టి, ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వంటి సంస్థలు స్థలాలు తీసుకుని ఏడాదిన్నర దాటినా ప్రాజెక్టులు ప్రారంభించలేదు.
* ప్రణాళికలు, ఆకృతుల విషయంలో జాప్యం కారణంగా నిర్మాణాలు ఆలస్యమయ్యే అవకాశముంది.
21ap-main1f.jpg
21ap-main1g.jpg

 
- ఈనాడు, అమరావతి

 
 
 
 

 

Link to comment
Share on other sites

మూడేళ్లలో అమరావతిలో జరిగిన అభివృద్ధి ఏంటో చూడండి !
23-10-2018 10:29:05
 
636758877245669329.jpg
  • గ్రామీణం నుంచి... ప్రపంచ నగరంగా
  • మూడేళ్లలో ప్రస్థానంలో ఎల్లెడలా అభివృద్ధి
  • ప్రగతి పథంలో రాజధాని గ్రామాలు
  • భూములిచ్చిన రైతుల త్యాగ ఫలం
  • సీఎం సంకల్పబలానికి ప్రతీక
  • మరి కొన్నేళ్లలోనే కలల రాజధాని సాకారం
అదో చారిత్రక సందర్భం.. అనతికాలంలోనే ఆవిష్కృతమైన మహత్తర ఘట్టం.. సొంత గడ్డపై నుంచే పరిపాలన సాగించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సంకల్పానికి పునాది రాయి పడిన వేళ.. రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగి మూడేళ్లు అయింది. ఇప్పుడు తరచి చూస్తే గ్రామాలు నగర కళను సంతరించుకున్నాయి. అంతర్జాతీయ స్థాయి సంస్థలు విద్యా సుగంధాలను వెదజల్లుతున్నాయి. అత్యాధునిక ప్రమాణాలతో విశాలమైన రోడ్లు రూపుదిద్దుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వేల మంది కార్మికులు రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నమైయి, వందలాది యంత్రాలు ఆ పనులలో అటూ ఇటూ తిరుగుతుంటే.. అదో యజ్ఞంలా కనిపిస్తుంది. రాజధాని గ్రామాల అభివృద్ధిపై ప్రగతి పథం కథనాల కొనసాగింపుగా.. మొత్తం అమరావతి నిర్మాణ విశేషాలపై ప్రత్యేక సమగ్ర కథనం..
 
మంగళగిరి/తుళ్ళూరు: అది లోటు బడ్జెట్‌తో అవశేష ఆంధ్రప్రదేశ్‌గా పాలన కొనసాగించాల్సిన కడు దయనీయ స్థితి. రాజధాని లేదు.. ఆదాయ వనరులు లేవు. ఆ సందర్భంలో ప్రజలు తనపై ఉంచిన నమ్మక్నాన్ని మనో బలంగా చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత రాష్ట్రం నుంచి బస్సులోంచే పాలనకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ఆంధ్రుల అలనాటి రాజధాని కృష్ణాతీర ప్రాంతాన్నే నేటి కలల రాజధాని అమరావతిగా ఎంచుకుని సుందరమైన అపురూప నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో ఇబ్బందులు.. ఇంకెన్నో అవరోధాలు.. అన్నింటినీ అధిగమిస్తూ సంకల్ప బలమే పెట్టుబడిగా రాజధాని అమరావతి నగరనిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకువెడుతున్నారు. చూస్తూ ఉండగానే కాలం పరిగెడుతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి మూడేళ్లయింది. ఈ మూడేళ్లలో రాజధాని అమరావతి ప్రస్థానం....
 
 
ఔరా అనేలా.. ప్రభుత్వ నగరం
రాష్ట్రప్రభుత్వం లింగాయపాలెం వద్ద 1,356 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ నగరాన్ని నిర్మించేందుకు తాజాగా టెండర్లను ఖరారు చేసింది. వీటికి సంబంధించిన డిజైన్లను ఈ నెలాఖరులోగా నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఐకానిక్‌ నిర్మాణాలైన శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
 
 
బ్రహ్మాండంగా ఎన్జీవో ఇళ్ల నిర్మాణం
నేలపాడు రెవెన్యూలో ఊరికి తూర్పు భాగంలో ఎన్జీవో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇందుకు 866.10 కోట్లను కేటాయించారు. 21 టవర్లను నిర్మించి అందులో 1,995 ప్లాట్లు వచ్చే విధంగా నిర్మాణం చేస్తున్నారు. 3,563,640 చదరపు అడుగుల్లో ఈ నిర్మాణాలను ఎల్‌అండ్‌టీ కంపెనీ చేస్తున్నది. 4625 ఫైల్స్‌ను వేసి టవర్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 13 టవర్లలో 348 ప్లాట్లు పూర్తి చేశారు.
 
 
ప్రజా మద్దతుతో.. భూసమీకరణ
రాజధాని నగరాన్ని నిర్మించాలంటే ముందు బోలెడంత భూమి కావాలి. ఆ భూమిని ప్రజామద్ధతుతోనే సేకరించాలన్న చంద్రబాబు మదిలో మెదిలిన వ్యూహమే భూ సమీకరణ. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో మొత్తం 38,581 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని 32,637 ఎక్జరాలను తీసుకోగలిగారు. మిగిలిన 5,533 ఎకరాలను 2013 భూసేకరణ చట్టం ప్రకారం తీసుకునేందుకు కార్యాచరణ ఆరంభించారు.
 
 
సచివాలయ నిర్మాణంతో శుభారంభం
అనకున్నదే తడవుగా కార్యాచరణ ప్రారంభించి ఏడు నెలల్లో వెలగపూడి రెవెన్యూలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించడం ఓ విశేషం. నవ్యాంధ్రలో తొలి పాలనా సౌధంగా వెలగపూడి వద్ద 45 ఎకరాల విస్తీర్ణంలో ఆరు బ్లాకులుగా దీనిని నిర్మించారు. రూ.500 కోట్లకు పైగా వ్యయంతో రికార్డు కాలంలో పూర్తి చేశారు. నాలుగు భవనాల్లో మొదటి భవనంలో సీఎం కార్యాలయం, జనరల్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ కొలువుతీరగా, రెండుమూడు, నాలుగు, ఐదు భవనాలు మంత్రులు ప్రిన్సిపల్‌ సెక్రటరీలు కార్యాలయాలు నిర్మించారు. ఆరోది అసెంబ్లీ, శాసన మండలి వ ్యవహారాలు నిర్వహించుకునే విధంగా నిర్మించారు.
 
 
ఎయిమ్స్ చకచక
రాష్ట్రానికి విభజన వరాల్లో ఒకటిగా ప్రాప్తించిన ఎయిమ్స్‌ను మంగళగిరి వద్ద 193 ఎకరాల విస్తీర్ణంలో రూ.1684 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
 
 
పూర్తయిన కొండవీటి వాగు ఎత్తిపోతల
రాజధాని అమరావతి నగరానికి కొండవీటివాగు రూపంలో పొంచివున్న ముప్పును శాశ్వత ప్రాతిపదికన తప్పించేందుకు రూ.237 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి అనకున్న సమయానికి పూర్తి చేశారు. దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు.
 
 
బ్లూ అండ్ గ్రీన్ సిటీగా...
రాజధానిలో నర్సరీలను 14 ప్రదేశాల్లో ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. వెంకటపాలెం ప్రధాన నర్సరీలో అన్నీ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఆయా నర్సరీలలో పెరిగే మొక్కలను రాజధాని రోడ్ల పక్కన నాటుతున్నారు. బ్లూ అండ్‌ గ్రీన్‌ సీటీగా రాజధాని అమరావతి ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు అధికారులు గ్రీనరీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.
 
 
శరవేగంగా ఎమ్మెల్యే, ఏఐఎస్ క్వార్టర్స్
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కనే ఎమ్మెల్యే, ఏఐఎస్‌ క్వార్టర్స్‌ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఇందుకు 635 కోట్లను కేటాయించారు. 18 టవర్లలో 434 ప్లాట్ల నిర్మాణం చేస్తున్నారు. 21,169,358 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్ల నిర్మాణం జరుగున్నాయి. 18 టవర్లకు.. 16 టవర్ల నిర్మాణాలు ఐదు అంతస్థుల నుంచి 12 అంతస్తుల వరకు నిర్మాణం చేప డుతున్నారు.
 
 
సీడ్‌ సీడ్‌ యాక్సెస్‌ రహదారులు
రాజధానిలో ప్రధాన మౌలిక సదుపాయల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. ముఖ్యంగా కలకత్తా-చెన్నై హైవే నుంచి రాజధాని అమరావతిని కలుపుతూ కనకదుర్గా వారధి నుంచి అమరావతి (దొండపాడు)కి ప్రతిష్టాత్మకమైన సీడ్‌యాక్సెస్‌ రోడ్డును రూ.600 కోట్ల వ్యయంతో 21.26 కి.మీల పొడవున రెండు దశలుగా నిర్మిస్తున్నారు. ఇందులో మొదటిదశ కింద 18.30 కి.మీ నాలుగు వరుసల రహదారిని పూర్తి చేశారు. దీంతోపాటు రాజధానిలో అత్యంత కీలకమైన 64 కి.మీల పొడవైన ఏడు రహదార్లను నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.995 కోట్ల వ్యయంతో పనులను ప్రారంభించారు. రాజధాని అమరావతి చుట్టూ రూ.6,878 కోట్ల వ్యయంతో 97.5 కి.మీల నిడివి గల ఇన్నర్‌ రింగురోడ్డు, 210 కి.మీల నిడివికల అవుటర్‌ రింగురోడ్డును రూ.20వేల కోట్లకుపైగా వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
 
 
అద్భుతంగా అంబేద్కర్‌ స్మృతివనం
రాజధాని అమరావతి ఏరియా శాఖమూరు వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల వ్యయంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. 125 అడుగుల అంబేద్కర్‌ భారీ విగ్రహంతో పాటు చక్కని ఉద్యానవనం, కన్వెన్షన్‌ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.
Link to comment
Share on other sites

రాజధానిలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన
23-10-2018 09:50:14
 
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వాల్సిందిగా సీఆర్డీయే చేసుకున్న దరఖాస్తు పరిశీలన, మదింపులో భాగంగా ప్రపంచ బ్యాంక్‌ తన ప్రతినిధి బృందాన్ని మరోసారి పంపింది. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి సోమవారం చేరుకున్న ఈ బ్యాంక్‌ బృంద సభ్యులు రాజధానిలో నాలుగు రోజులపాటు గడపనున్నారు. ఇందులో భాగంగా తొలి రోజున వారు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఆర్డీయే రుణరూపేణా కోరిన సుమారు రూ.7300 కోట్ల మంజూరుకు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాలు, విధివిధానాలపై విస్తృత చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే పలు పర్యాయాలు ఇదే అంశంపై ఇక్కడికి వచ్చిన ప్రపంచ బ్యాంక్‌ బృందాలు ఈ దిశగా ఇప్పటి వరకు సాధించిన పురోగతిని సమీక్షించడంతోపాటు సీఆర్డీయే పరంగా తీసుకోవాల్సిన ఇతర చర్యలపై సూచించినట్లు సమాచారం.
 
దీంతోపాటు ప్రపంచ బ్యాంక్‌ రుణం కోరిన రాజధానిలోని ప్రాధాన్య రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టుల వల్ల ప్రభావితులయ్యే వివిధ వర్గాల వారికి కల్పిస్తున్న పునరావాసం, సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన, లింగవివక్షకు తావు లేకుండా తీసుకున్న చర్యలు ఇత్యాది అంశాలపై కూడా చర్చ జరిగిందని తెలిసింది. ఇవే కాకుండా పైన పేర్కొన్న ప్రాజెక్టులపై సంబంధిత గ్రామాల ప్రజలు వివిధ రూపాల్లో చేసిన ఫిర్యాదుల పరిష్కారం ఏ విధంగా ఉందని కూడా ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు సీఆర్డీయే ఉన్నతాధికారులను వాకబు చేశారు. కాగా.. తమ పర్యటనలో 2వ రోజైన మంగళవారంనాడు ప్రపంచ బ్యాంక్‌ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించి, అందులోని ప్రాజెక్ట్‌ల ప్రభావిత వర్గాలను కలుసుకోనున్నట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

తమ పర్యటనలో 2వ రోజైన మంగళవారంనాడు ప్రపంచ బ్యాంక్‌ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించి, అందులోని ప్రాజెక్ట్‌ల ప్రభావిత వర్గాలను కలుసుకోనున్నట్లు తెలిసింది.

saripoyindi. enduku inni tiapplu, direct ga aa Mangalagiri MLA ni adigithe fake ITI telivithetalatho correct feed back istadu ga. ellu loan icchedi ledu sacchedi ledu. 

Link to comment
Share on other sites

రాజధాని రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు..
24-10-2018 10:48:54
 
636759749356515002.jpg
  • ఫ అధికారులపై మండిపడిన ఎమ్మెల్యే శ్రావణ్‌
  • ఫ సమస్యలు ఏకరువు పెట్టిన మందడం రైతులు
  • ఫ మూడు రోజుల్లో పరిష్కరిస్తామని ఫోన్‌లో సీఆర్డీయే కమిషనర్‌ హామీ
 తుళ్లూరు: రాజధానిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా సహించేంది లేదని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ అధికారులకు హెచ్చరించారు. మందడం సీఆర్డీయే ల్యాండు పూలింగ్‌ కార్యాలయంలో రైతులకు న్యాయం జరగటం లేదని పలుమార్లు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఆయన మంగళవారం మందండం సీఆర్డీయే కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 50 మంది రైతులకు కౌలు అకౌంటులో పడలేదని చెప్పారు. ల్యాండు పూలింగ్‌ కార్యాలయానికి వస్తే తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయానికి వెళ్లమంటున్నారని తెలిపారు. ల్యాండు పూలింగ్‌కు భూమినిస్తే ఐనవోలు గ్రామ పరిధి తనకు ప్లాట్లు కేటాయించారని ఏ ఒక్క ప్లాటు కూడా తూర్పు ముఖం లేదని ఆలూరి సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబరు 455 బై సి3 లో పది సెంటు తనకు పూర్తి హక్కులతో ఉంటే దానిని సీఆర్డీయే బడా రైతుకు కేటాయించారని గ్రామానికి చెందిన గుడిసె డేవిడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
 
స్థానిక రైతులకు, అసైన్డ్‌ రైతులకు శ్మశానం పక్కన ప్లాట్లు ఇచ్చి గన్నవరంలో కొనుగోలు చేసిన రైతులకు మందడం రెవెన్యూ ప్లాట్లు కేటాయించారని రైతులు మండి పడ్డారు. దీనిపై ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ మందడం సీఆర్డీయే అధికారులతో మాట్లాడారు. భూములిచ్చిన రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతారా.. కార్యాలయం మూసుకుంటారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి అపవాదు రాకుడదన్నారు. సర్వే ప్రకారం ప్లాట్లు ఎందుకు కేటాయించటం లేదని డిప్యూటీ కలెక్టర్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీని పై సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. సమస్యలు పరిష్కారం చేయటానికి ప్రత్యేక అధికారిని నియమించి మూడు రోజుల్లో పరిష్కరిస్తానని కమిషనర్‌ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
 
అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్‌ విలేకరులతో మాట్లాడుతూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లింగాయపాలెం లంక రైతుల నిరాహారదీక్ష చేస్తున్న అంశాన్ని ఎమ్మెల్యేని అడగగా, ప్యాకేజీ వ్యత్యాసాలుడటంతో వారి సమస్య తలెత్తిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ధనేకుల సుబ్బారావు, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, రైతు నాయకులు నూతక్కి కొండయ్య, మాదాల శ్రీనివాసరావు, ఆలేరి వెంకటేశ్వరరావు మాదల పున్నయ్య, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఆలూరి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు వాకచర్ల వీరాంజనేయులు, ఎస్సీ నాయకులు మార్టిన్‌, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

పచ్చని నేల రాజధాని కళ
24-10-2018 11:14:50
 
636759764909440318.jpg
 
  • ప్రగతి పథంలో ఉండవల్లి
  • 237 కోట్ల ఎత్తిపోతల పథకం ఏర్పాటు
  • మారిన గ్రామ రూపురేఖలు
  • రూ.35 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు
ఉండవల్లి (తాడేపల్లి): రాజ ధాని రాకతో రాజధాని ముఖద్వార గ్రామం, సీఎం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి గ్రామం రూపురేఖలు మారి ప్రగతి పథంలో పయనిస్తోంది. గతంలో ఇరుకు గాఉండే రహ దారులు నేడు విస్తరణకు నోచుకోవడం, చిన్న చిన్న ఇళ్లు సైతం నేడు భవంతులుగా మారా యి. పలు అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు, వ్యక్తిగత గృహనిర్మాణాలు పెరిగాయి. ఉండవల్లి సారవంతమైన వ్యవసాయ భూములుకలిగి ఉన్న గ్రామం. గ్రామంలో 14వార్డులు ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 9,743 మంది జనాభా ఉండగా నేడు దాదాపు జనాభా 15 వేలకు చేరుకుంది. 2011లో పంచాయతీకి పన్నుల రూపేణ సుమారు రూ.15లక్షల ఆదా యం వచ్చేది. నేడు గ్రామపంచాయతీ ఆదా యం పలుపన్నులతో కలిపి సుమారు రూ.47 లక్షలకు చేరుకుంది. గ్రామంలో రూ.2,500, పెన్షన్లు 1,850 మందికి ఇస్తుండగా, రూ.1000 పెన్షన్లు 625 మందికి పంపిణీ చేస్తున్నారు.
 
రూ.35 కోట్లతో ప్రతిపాదనలు
aefefe.jpgరాజధానిలోని గ్రామాలను అభివృద్ధి చేయాల ని సీఆర్డీయే సంకల్పించినదరిమిలా ఉండవల్లి గ్రామం నుంచి కూడా అభివృద్ధి పనులకు దా దాపు రూ.35కోట్లతో ప్రతిపాదనలు పంపారు. గ్రామ పరిధిలో నూతనంగా సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, శానిటేషన్‌కు సంబంధించి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉండ వల్లి కూడలి నుంచి గ్రామ ప్రధానరహదారి ఇప్పటికే విస్తరణకు నోచుకుంది.
 
రూ.237 కోట్లతో ఎత్తిపోతల పథకం
gdfgdfg.jpgమంగళగిరి - తాడికొండ నియోజకవర్గంలోని రైతాంగానికి వరదరూపంలో శాపంగా పరిణమించిన కొండవీటివాగు వరద ముంపునకుశాశ్వత పరిష్కారం లభించింది. ప్రభుత్వం రూ.237 కోట్లతో ఉండవల్లి పరిధిలోవాగు ముంపు నివారణ కోసం కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి రైతాంగానికి బాసటగా నిలిచింది. రాజధానికి వెళ్లేందుకు ప్రజలు, ఉద్యోగులు, వీఐపీలు,ప్రజాప్రతినిధులు, ఇటుగా వెళ్లే గ్రామం కావడంతో అటు సీఎం నివాస మార్గంలోని కరకట్ట, ఇటు ఉండవల్లి గ్రామ రహదారులు అభివృద్ధికి నోచుకున్నాయి. ఉండవల్లి కూడలి నుంచి గ్రా మానికి వెళ్లే మార్గంలో గుంటూరు ఛానల్‌పై నూతన వంతెన ఏర్పాటు చేశారు. గుంటూరు చానల్‌కు సంబ ంధించి అభివృద్ధి పనులకు ప్రభు త్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉండవల్లి గుహాలయాలకు ఎదు రుగా సందర్శకుల కోసం పార్కును అభివృద్ధి చేశారు. ఉండవల్లి దళితవాడకు వెళ్లే రహదారి త్వరలో అభి వృద్ధికి నోచుకోనుంది.
 
సీఆర్డీయేకు ప్రతిపాదనలు పంపాం..
egesgef.jpgఉండవల్లి గ్రామ అభివృద్ధి పనుల విషయమై సీఆర్డీయే అధికారులకు దాదాపు రూ.35 కోట్లకు సంబంధించి పనుల కోసం ప్రణాళికలు అందజేశాం. అవసరాలన ప్రాతిపదికన ముఖ్య పనులన్నీ ప్రారంభమౌతాయి. రహదారులు, డ్రెయిన్లు, వాటర్‌ ట్యాంక్‌లు తదితరాలు ఇందులో ఉన్నాయి. శానిటేషన్‌ సిబ్బందిని పెంచాల్సి ఉంది.
- బాలూనాయక్‌, ఎంపీడీవో, ఉండవల్లి ప్రత్యేక అధికారి
 
 
భూములిచ్చే ప్రసక్తే లేదు..
hsheryr.jpgభూసమీకరణకు భూములిచ్చిన వారి కన్నా ఇవ్వని వారే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. సారవంతమైన మూడు పంటలు పండే భూములను రాజధానికి ఇచ్చే ప్రసక్తే లేదు. వ్యవసాయ మే జీవనాధారంగా ఉండి ఎకరం, అరెకరం పం టలు ఉన్న చిన్నా, సన్నకారు రైతులు ఇక్కడ ఎక్కువ. ఏనాడో కమర్షియల్‌ ప్రాంతంగా పేరుండి, విజయవాడకు దగ్గరలో ఉన్న ఉండవల్లిలో ఇప్పటి కంటే గతంలోనే భూముల రేట్లు చాలా ఎక్కువగా ఉండేవి.
- కె.ఈశ్వరరెడ్డి, రైతు
 
నిబంధనలను సడలించాలి..
ltyjsrj.jpgపంచాయతీ పరిధిలో బిల్డింగ్‌ నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్‌ అధికారాలు పంచాయతీకే బదలాయించాలి. సీఆర్డీయే పరిధి నుంచి తప్పించాలి. పైౖగా రాజధాని గ్రామాలలో జీ ప్లస్‌-1 సంబంధించి మాత్రమే నిర్మాణాలకు అనుమతిస్తున్నారు. రాజధాని రాకతో మాత్రం అభివృద్ధి జరుగుతున్న విషయం సుస్పష్టం.
- లింగంశెట్టి కృష్ణకిషోర్‌, బిల్డర్‌, ఉండవల్
Link to comment
Share on other sites

జుడీషియల్‌ సముదాయం పరిశీలన
amr-brk6a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న జుడీషియల్‌ సముదాయం పనులను ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ డా.చెరుకూరి శ్రీధర్‌ మంగళవారం రాత్రి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి అధికారులు, గుత్తేదారులతో సమీక్షించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ డిసెంబరు 15లోగా జుడీషియల్‌ సుముదాయం పనులన్నీ పూర్తిచేయాలని కమిషనర్‌ ఆదేశించారు. అనంతరం ఎన్జీవో అధికారుల నివాస భవనాల నిర్మాణ పనులు పరిశీలించారు. రాఫ్ట్‌ ఫౌండేషన్‌కు ముందుగా వేస్తున్న ప్లెయిన్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఐఏఎస్‌ అధికారుల నివాసాలకు సంబంధించిన పనులను పరిశీలించి అంతర్గత ఫినిషింగ్‌కు తగు సూచనలు చేశారు. ఏపీసీఆర్‌డీఏ సీఈ ఎం.జక్రయ్య, ఎస్‌ఈ సీహెచ్‌ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతిలో 20 సంస్థలకు.. 126 ఎకరాలు కేటాయింపు
25-10-2018 04:02:34
 
  • మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయం
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పరిధిలో 20 సంస్థలకు 126 ఎకరాలు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలోని ఆర్థిక మంత్రి చాంబర్‌లో బుధవారం మంత్రిమండలి ఉపసంఘం సమావేశం జరిగింది. అనంతరం మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి 50 ఎకరాలు, అక్రిడిటేటెడ్‌ జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 25 ఎకరాలు, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు 5.56 ఎకరాలు, రామకృష్ణ మిషన్‌కి 5 ఎకరాలు, ఇండియన్‌ వాటర్‌ వేర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకి 0.57 ఎకరాలు, ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకి 4.23 ఎకరాలు, పబ్లిక్‌ లైబ్రరీ్‌సకి 4 ఎకరాలు, స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కి 3 ఎకరాలు, ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌కి 2.97 ఎకరాలు, విజయా బ్యాంక్‌కి 1.55 ఎకరాలు, కెనరా బ్యాంక్‌కు 0.5, ఎల్‌ అండ్‌ టి ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కి 5 ఎకరాలు.. ఇలా మొత్తం 20 సంస్థలకు 126 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు.
 
ఈ భూముల ధరను ఎకరా రూ. 10 లక్షల నుంచి రూ. 4 కోట్ల వరకు నిర్ణయించినట్లు చెప్పారు. గతంలో పది విభాగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మొత్తం కలిపి 85 సంస్థలకు 1374.96 ఎకరాలు కేటాయించినట్లు వివరించారు. ఆ భూములకు సంబంధించి ఆయా సంస్థలు రూ. 506 కోట్లకు రూ. 386 కోట్లు సీఆర్డీఏకు చెల్లించినట్టు తెలిపారు. మొత్తం సంస్థల నిర్మాణం, పెట్టుబడుల విలువ రూ. 45,675 కోట్లని తెలిపారు. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నోటీసులకు స్పందించకపోతే భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు సమానంగా అభివృద్ధి చెందేలా భూకేటాయింపులు జరిపామని తెలిపారు.
Link to comment
Share on other sites

యర్రబాలెం.. కొత్తరూపం
25-10-2018 07:50:14
 
636760506150338979.jpg
  • వేగవంతంగా అభివృద్ధి
  • పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు
  • ఉద్యోగస్తులకు అనుకూల ప్రాంతం
 
రాజధాని గ్రామమైన యర్రబాలెం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. మంగళగి రి పట్టణానికి అతి చేరువగా ఉన్న యర్రబాలెం న గరీకరణ దిశగా పరుగులు పెడుతోంది. ఎత్తయిన నూ తన నిర్మాణాలతో కొత్తరూపు సంతరించుకుంటోంది. మండలంలోనే ఎక్కువ శాతం మంది విద్యుత్‌ ఉద్యోగులు ఈ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర ఉద్యోగులు కూడా సొంత నిర్మాణాలను చేసుకున్నారు.
 
 
యర్రబాలెం (మంగళగిరి రూరల్‌): యర్రబాలెం గ్రామం నుంచి రాజధాని నిర్మాణానికి 2,393 ఎకరాల భూమిని పూలింగ్‌లో రైతులు అందజేశారు. గ్రామవిస్తీర్ణం 7.5చదరపు కిలోమీటర్లు. గ్రామ జనాభా 11,216. గ్రామంలోని వార్డులు 16. గృహాలు 3,547 ఉన్నాయి. వ్యవసాయ వృత్తితోపాటు వివిధశాఖలకు చెందిన ఉద్యోగులు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. గ్రామంలో ఎన్టీఆర్‌ సుజల పథకం ఏర్పాటుచేసి ప్రజలకు శుద్ధమైన జలాన్ని అందిస్తున్నారు. మండలంలోనే  ప్రథమంగా ఎన్టీఆర్‌ క్యాంటీన్‌ను ఈ గ్రామంలోనే ఏర్పాటుచేసి అతి తక్కువ ధరకు ఆహార పదార్థాలను గ్రామస్తులకు అందజేస్తున్నారు.
 
అభివృద్ధి పనులు
FSseseFeSfg.jpgగ్రామంలో ఇండస్ట్రియల్‌ ఏరియాలో సీఆర్‌డీఏ, గ్రామీణ ఉపాధి హామీ పఽథకంలో రూ.40 లక్షలను వెచ్చించి సీసీ రోడ్డు, యాదవపాలెంలో రూ.10లక్షలు వెచ్చించి మరో సీసీ రోడ్డు నిర్మించారు. గ్రామంలో ప్రతి ఏడాది రూ.60 లక్షల నిధులతో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నారు. 60 లింకుల రోడ్డుకు డ్రైన్ల నిర్మాణానికి రూ.80లక్షలతో అభివృద్ధి చేపట్టారు. ఎంపీ ల్యాడ్స్‌ రూ.25 లక్షలతో సీసీ రోడ్లు ఏర్పాటుచేశారు. గ్రామం అంతా వీధిలైట్లను ఆధునికీకరించారు. గ్రామ నీటి అవసరాలను తీర్చేందుకు రూ.3కోట్లతో ఓవర్‌ హెడ్‌ట్యాంక్‌ నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను అందజేశారు. గ్రామంలో తడిచెత్త, పొడిచెత్తను విడివిడిగా సేకరించేందుకు 7,094 డస్ట్‌బిన్లు పంపిణీచేశారు. 2 బ్యాటరీ ఆటోలను గ్రామ పంచాయతీకి అందించారు.
 
రాజధాని ప్రాంతమైన యర్రబాలెం గ్రామంలో ఇండో యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌ సంస్థను 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు. పెనుమాక, ఉండవల్లి, యర్రబాలెం గ్రామాల మధ్యలో జూపార్క్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామంలో చేపట్టవల్సిన అభివృద్ధి పనుల నిమిత్తం సీఆర్‌డీఏ గ్రామకమిటీ సమావేశంలో పలు ప్రతిపాదనలను చేశారు. రూ.29.65 కోట్ల ప్రతిపాదనలను పనుల ప్రాధాన్యాన్ని బట్టి చేపట్టనున్నారు. గ్రామంలో లైబ్రరీ నిర్మాణం చేయాలని, మరో అంగన్‌వాడీ స్కూల్‌ ఏర్పాటుచేయాలని, చెరువు చుట్టూ గ్రీనరీ ఏర్పాటుచేయడంతో పాటు డ్రైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
 
 
నగరీకరణ కళ వస్తోంది
ASDFAfA.jpgరాజధాని గ్రామమైన యర్రబాలేనికి నగరీకరణ కళ వస్తోంది. అభివృద్ధి పనులు గ్రామంలో వేగవంతంగా జరుగుతున్నాయి. గ్రామంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు మార్కెట్‌యార్డు రోడ్డుకు ట్రాఫిక్‌ను మళ్లించేందుకు కోటిన్నర రూపాయల అంచనాలతో అభివృద్ధి పరుస్తున్నారు. పలు నూతన నిర్మాణాలు, నూతన ఆఫీసులు ఈ ప్రాంతానికి రావడంతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోంది. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకుగాను రూ.29.65కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
- ఆకుల ఉమామహేశ్వరరావు,
 
గ్రామ దత్తత స్వీకర్త ప్రతిపాదనలు పంపాం
ffA.jpgగ్రామంలో జరుగుతున్న అభివృద్ధికి తోడుగా చేయవల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా అందజేశాం. గ్రామంలో వాటర్‌ సోర్స్‌ పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామవిస్తీర్ణం అధికంగా ఉంది. గృహాలు పెరిగాయి. 20ఏళ్ళ క్రితం ఏర్పాటుచేసిన నీటి వనరుల ద్వారానే నీటిని అందించాల్సి వస్తోంది. రాజధాని రాకతో గ్రామంలో అభివృద్ధి పనులు స్పీడ్‌ అందుకున్నాయి.
- ఎండీఏ రెహమాన్‌,
 
గ్రామ కార్యదర్శి శరవేగంగాఅభివృద్ధి
fasdd.jpgరాజధాని రాకతో యర్రబాలెం గ్రామంలో అభివృద్ధి వేగవంతం అయ్యింది. సీఆర్‌డీఏ నిధులు, గ్రామ పంచాయతీ నిధులతో పలు సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. రాజధాని రాకతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. గ్రామంలో జరగాల్సిన అభివృద్ది పనుల కోసం నూతన ప్రతిపాదనలను సీఆర్‌డీఏకు పంపారు.
-బొడ్డు వెంకటప్పయ్య, మాజీ సర్పంచ్‌
Link to comment
Share on other sites

20 సంస్థలకు 120 ఎకరాలు
ఇందులో అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల కోసం 25 ఎకరాలు

ఈనాడు, అమరావతి: అమరావతిలో భూకేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం 20 సంస్థలకు 120 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలోని ఈ కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఉప సంఘం సభ్యులైన మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్‌ శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. భూ కేటాయింపుల కోసం పలు సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదలను పరిశీలించిన ఉప సంఘం 20 సంస్థలకు 120 ఎకరాలు కేటాయించేందుకు అనుమతించింది. ఇందులో అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం 25 ఎకరాలు కేటాయించేందుకు సమ్మతించింది. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 60 ఎకరాలు, భారత్‌ స్కౌట్స్‌,గైడ్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఏర్పాటుకు 5.56, రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖకు 4.23, గ్రంథాలయాలకు 4, రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌కు 2.97, విజయాబ్యాంక్‌కు 1.55, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ గృహ సంస్థకు 5 ఎకరాలతో పాటు మరికొన్ని సంస్థలకు మొత్తంగా 120 ఎకరాలను కేటాయించేందుకు అనుమతించింది. ఈ భూకేటాయింపులు చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సమావేశం అనంతరం మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ విలేకరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...