Jump to content

Amaravati


Recommended Posts

హౌసింగ్‌ ప్రాజెక్టుల పరిశీలన
14-10-2018 11:31:26
 
636751134732654398.jpg
అమరావతి(ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో నిర్మాణంలో ఉన్న జ్యుడీ షియల్‌ కాంప్లెక్స్‌, ప్రభుత్వ హౌసింగ్‌ ప్రాజెక్టులను సీఆర్డీయే కమిషనర్‌ సి.హెచ్‌. శ్రీధర్‌ శనివారం పరిశీలించారు. జ్యుడీషియ ల్‌ కాంప్లెక్స్‌ పనుల్లో వేగం పెంచాల్సిందిగా కాంట్రాక్ట్‌ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులను ఈ సందర్భంగా ఆదేశించారు. స్ట్రక్చర్‌, స్టోన్‌ క్లాడింగ్‌, అంతర్గత, బాహ్య మౌలిక వసతుల కల్పనకు గడువు తేదీలను నిర్ణయించి, ఆలోగా ఆయా పనులు పూర్తయ్యేలా చూడా లన్నారు. సంబంధిత ఇంజినీర్లతో సమీక్ష జరిపి, తగు సూచనలిచ్చారు. వచ్చే నెల 20 వ తేదీనాటికి జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ స్ట్రక్చ రల్‌ పనులను పూర్తి చేస్తామని ఎల్‌ అండ్‌ టి సంస్థ ప్రతినిధులు శ్రీధర్‌కు తెలిపారు. దీనికి ప్రత్యేక ఆకర్షణ కానున్న 36మీటర్ల ఎత్తయిన క్లాక్‌ టవర్‌ పనులను వేగంగా పూర్తి చేశామని, సోమవారం నుంచి స్టోన్‌ క్లాడింగ్‌ ప్రారంభిస్తామని చెప్పారు. అనంత రం శ్రీధర్‌ షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తు న్న గెజిటెడ్‌ టైప్‌-1, టైప్‌-2, 4వ తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల పనులను పరిశీలించారు. నిర్మాణసంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లతో సమావేశమై అంతర్గత పనుల్లో భాగమైన తలుపులు, కిటికీలు, టైల్స్‌, స్విచ్‌ల కు అవసరమైన అనుమతులను మంజూరు చేశారు. ఆ తర్వాత ఎల్‌ అండ్‌ టి నిర్మిస్తున్న ఎన్జీవోల నివాసాలను కూడా శ్రీధర్‌ చూసి, వాటికి సంబంధించిన మెటీరియల్‌కు అను మతులిచ్చారు. అనంతరం సెక్రటేరియట్‌ టవర్ల కోసం జరుగుతున్న మట్టి పనులను పరిశీలించారు. ఈ పర్యట నలో సీఆర్డీయే అదనపు కమిషనర్‌ ఎస్‌. షణ్మోహన్‌, సీఈ ఎం.జక్రయ్య, ఎస్‌.ఇ. సీహెచ్‌ ధనుంజయ తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

44 నెలల్లోనే కీలక దశలు దాటేశాం
ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతం
రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి
అస్థానాలోనే మొదటి భవన నిర్మాణానికి ఏడేళ్లు పట్టింది
అమరావతిలో అమెరికా, ఐరోపా నగరాల స్థాయిలో వసతులు
ఆరోపణలన్నీ రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నవే
ఈటీవీ ‘చెప్పాలని ఉంది’లో  సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌
13ap-main12a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంలోని నాలుగు కీలక దశల్లో మూడింటిని 44 నెలల్లోనే అధిగమించామని, ప్రస్తుతం నిర్మాణ దశకు చేరుకున్నామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. ఒక నగర నిర్మాణంలో కీలక దశల్ని ఇంత త్వరగా పూర్తి చేసుకుని, శరవేగంగా నిర్మాణాలు చేయడం ప్రపంచంలోనే ఒక అద్భుతమన్నారు. రాజధాని ప్రాజెక్టుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోందని, అమరావతి బాండ్ల జారీలో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక చండీగఢ్‌, గాంధీనగర్‌, భువనేశ్వర్‌, జంషెడ్పూర్‌, నయారాయ్‌పూర్‌ వంటి నగరాల్ని ఒక నిర్దిష్ట అవసరం కోసం నిర్మించారన్నారు. పరిపాలన, ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగావకాశాలు, పర్యాటక కార్యకలాపాలకు వేదికగా, అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న మొదటి నగరం అమరావతేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లోని ప్రధాన నగరాల స్థాయిలో ఇక్కడ మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. అమరావతి ప్రపంచ నగరంగా, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందన్నారు. ‘ఈటీవీ’లో శనివారం ప్రసారమైన ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో శ్రీధర్‌ వెల్లడించిన అంశాలు ఇవీ..!

* భూ సమీకరణ, రాజధాని ప్రణాళిక, మౌలిక వసతుల ప్రణాళికల్ని మూడున్నరేళ్లలోపే పూర్తి చేశాం. ప్రస్తుతం నగరం నలుమూలలా పనులు జరుగుతున్నాయి. 15 వేలకుపైగా కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. 12 నెలల్లో ప్రధాన, టయర్‌-2 మౌలిక వసతుల నిర్మాణం పూర్తయి...అమరావతి పూర్తిస్థాయిలో నివాస యోగ్యానికి సిద్ధమవుతుంది.

* రాజధానిని ఆనుకుని ఉన్న మిగతా గ్రామాల్లోను భూ సమీకరణ ప్రణాళికలు ఉన్నా..ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజధానిని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు అవసరమైన మౌలిక వసతులు, అంతర్‌, బాహ్య వలయ, రేడియల్‌ రహదారుల నిర్మాణానికి భూమి అవసరం.  ప్రణాళికలు సిద్ధమయ్యాక సమీకరణపై నిర్ణయం తీసుకుంటాం.

* 35 ఏళ్లలో 35 లక్షల మంది నివసించేలా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యం. ఆ స్థాయిలో అవసరమైన మౌలిక వసతులన్నీ ఇప్పుడే కల్పిస్తున్నాం.

పకడ్బందీ ప్రణాళికతో..
ఐటీ సంస్థలు, వ్యాపార సంస్థలు వంటివి దేశంలోని ఇతర నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలంటే... వాటర్‌ ప్లాంట్‌, మురుగునీటి శుద్ధి కేంద్రం, సబ్‌స్టేషన్‌ వంటివి వాళ్లే ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ల రోడ్డు వాళ్లే వేసుకోవాలి. అమరావతిలో అలాంటి వసతులన్నీ మేమే కల్పిస్తున్నాం. ఐదు నిమిషాల నడకతో అత్యవసర సర్వీసులకు, 10 నిమిషాలలో సామాజిక వసతులకు, 15 నిమిషాల్లో కార్యాలయానికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించాం. ఇవన్నీ దేశ, విదేశీ కంపెనీలు, సంస్థలు అమరావతికి వచ్చేలా చేస్తాయి.

అమరావతిని అత్యంత నివాస యోగ్యమైన, ఆనందకరమైన, హరిత-నీలి నగరంగా తీర్చిదిద్దుతున్నాం. 30 శాతం భూ భాగంలోనే నిర్మాణాలు జరుగుతాయి. 70 శాతంలో హరిత వనాలు, ఖాళీ స్థలాలు ఉంటాయి. ఇందులో 10 శాతం కాలువలు, జలాశయాలు ఉంటాయి.

నిర్మాణ వ్యయంలో తేడా రాకుండా..
అమరావతి పరిధిలో 40 శాతం భూమిలో పైల్స్‌ వేయాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలలు ఉన్నచోటే భూమిలో చాలా లోతు వరకు పైల్స్‌ వేసి నిర్మాణాలు చేయాల్సి వస్తోంది. దీని వల్ల చ.అడుగుకి రూ.100-150 వరకు అదనంగా ఖర్చవుతుంది. ఇతర నగరాల్లో 200-300 గజాల్లో ఇల్లు కట్టుకోవాలంటే మురుగునీరు, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ వంటి వాటిపై రూ.లక్ష వరకు ఖర్చు పెట్టాలి. రాజధానిలో ఆ అవసరం లేదు. కాబట్టి నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదు.

వేగంగానే పనులు
రాజధానిలో పనులు జరగడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. మొదటి భవనం కట్టడానికి నయా రాయ్‌పూర్‌లో ఏడేళ్లు, గాంధీనగర్‌లో 9-10 ఏళ్లు పట్టింది. కజకిస్థాన్‌ రాజధాని అస్థానాలో మొదటి భవనం నిర్మాణానికి ఏడేళ్లు తీసుకున్నారు. ప్రస్తుతం రాజధానిలో 3 కోట్ల చ.అడుగుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం.

* ఇబ్రహీంపట్నం వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి పనులు నెల రోజుల్లో మొదలవుతాయి. 24 నెలల్లో పూర్తవుతాయి.

* తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చ.అడుగుకి రూ.5,940 మాత్రమే ఖర్చయింది. తాత్కాలిక సచివాలయం నిర్మించే సమయానికి అక్కడ కనీస వసతుల్లేవు. జీ+8కి తగ్గట్టుగా పునాదులు నిర్మించాం. అనుసంధాన రహదారి, తాగునీరు, మురుగునీటి శుద్ధి కేంద్రం వంటి మౌలిక వసతులన్నీ నిర్మించాం. 42 ఎకరాల్లో పార్కింగ్‌ వంటి వసతులు కల్పించాం. అవన్నీ కలిపితేనే అంత ఖర్చయింది. భారీ ఎత్తున వెచ్చించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు.

ముంపు సమస్య లేకుండా..
కొండవీటి వాగు వరదల వల్ల అమరావతికి ముంపు సమస్య ఏర్పడకుండా 5,200 క్యూసెక్కుల సామర్థ్యంతో లిఫ్ట్‌ పథకం పూర్తి చేశాం. ఇలాంటి మరో రెండు ప్రాజెక్టులు వస్తాయి. మొత్తం 22 వేల క్యూసెక్కుల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం.

ధరలు పెరగకుండా చొరవ..
* రైతుల చేతుల్లో ఉన్న స్థలాల ధరల్ని సీఆర్‌డీఏ నియంత్రించలేదు. మార్కెట్‌ డిమాండుని బట్టి ఆ ధరలు పెరుగుతాయి. అమరావతిలో స్థలాలు, అపార్ట్‌మెంట్‌లు పూర్తిగా స్థిరాస్తి సంస్థలు, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయి, సామాన్యులకు అందనంత ఎత్తులోకి వెళ్లకుండా... సీఆర్‌డీఏ చొరవ తీసుకుంటోంది. 1200 ఫ్లాట్లు నిర్మించి...చ.అడుగు మార్కెట్‌ ధర కంటే రూ.800-1000 తక్కువకే ప్రజలకు విక్రయిస్తాం.

* 40 అంతస్తుల వరకు భవనాలకు అనుమతులిస్తున్నాం. రాజధాని ప్రాంతం సీస్మిక్‌ జోన్‌-3లో ఉంది. భూకంపాల ప్రమాదం లేదు.

రాజధాని రైతులను ఆదుకుంటున్నాం..
రాజధాని రైతులకు పదేళ్లపాటు కౌలు, భూమిలేని పేదలకు నెలకు రూ.2,500 చొప్పున పింఛను చెల్లిస్తున్నాం. రైతులకు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నాం. రైతుల్ని పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. రాజధాని ప్రాంతానికి చెందిన 2,500 మందికి ప్రస్తుతం వివిధ ప్రాజెక్టుల్లో ఉపాధి లభించింది.  ప్రతినెలా జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నాం. వాటి ద్వారా సుమారు 1400 మందికి ఉద్యోగాలు లభించాయి.

Link to comment
Share on other sites

300 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు
కాలుష్య రహిత పరిశ్రమలకే  అమరావతిలో అనుమతి
సీఆర్‌డీఏ కసరత్తు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా తొలి దశలో 300 ఎకరాల్లో సమీకృత బహుళ ఉత్పాదక పారిశ్రామిక పార్కు (ఇంటిగ్రేటెడ్‌ మల్టీ ప్రొడక్ట్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌) ఏర్పాటుచేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) నిర్ణయించింది. పూర్తిగా కాలుష్యరహిత పరిశ్రమల్ని మాత్రమే ఇక్కడ ఏర్పాటుచేస్తారు. రాజధాని సామాజిక, ఆర్థిక బృహత్‌ ప్రణాళికలో భాగంగా 2038 నాటికి 1500 ఎకరాల్లో పారిశ్రామికవాడలు అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. దీన్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో 300 ఎకరాల్లో అభివృద్ధి- నిర్వహణ ప్రాతిపదికన పారిశ్రామికవాడను సీఆర్‌డీఏ ఏర్పాటుచేస్తుంది. పారిశ్రామిక పార్కు అభివృద్ధి, మార్కెటింగ్‌, నిర్వహణవంటి బాధ్యతలను నిర్వహించేందుకు వ్యూహాత్మక భాగస్వామిని నియమించనుంది. ప్రాజెక్టు ముఖ్యాంశాలివి..

నమూనా
పారిశ్రామికవాడలో రహదారులు, నీటి సరఫరా, విద్యుత్‌లైన్లు వంటి మౌలిక సదుపాయాలను సీఆర్‌డీఏ సమకూరుస్తుంది. మొత్తం 300 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకుపోగా మిగిలిన భూమిని వేర్వేరు పరిమాణాల్లో ఫ్లాట్లుగా విభజిస్తారు. ఈ ఫ్లాట్లను ఫ్రీహోల్డ్‌  లేదా లీజ్‌ హోల్డ్‌ (నిర్దిష్ట కాలానికి లీజుకివ్వడం) విధానాల్లో కేటాయిస్తారు.

ఫ్లాట్ల పరిమాణం, ధర
వ్యూహాత్మక భాగస్వామి ఎంపికకు సీఆర్‌డీఏ ఆసక్తి అభివ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయి? ఏ తరహా యూనిట్‌ ఏర్పాటుకు ఎంత స్థలం అవసరమవుతుంది? పెట్టుబడి ఎంత?వంటి అంశాలన్నీ ఈఓఐకి వివిధ సంస్థల నుంచి వచ్చిన స్పందనను మదింపు చేశాక తెలుస్తుందని సీఆర్‌డీఏ వర్గాలు పేర్కొన్నాయి.

లక్ష్యం
వచ్చే 25 ఏళ్లలో కాలుష్యరహిత, అత్యధిక విలువ కలిగిన తయారీ, సేవారంగానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుద్వారా రాజధానిలో 7-8 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో ఏర్పాటు చేయబోయే పార్కులో సుమారు 15వేల నుంచి 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

ఎక్కడ వస్తుంది?:
రాజధాని దక్షిణ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు బృహత్‌ ప్రణాళికలో కొంత భాగాన్ని ఐ3 జోన్‌గా గుర్తించారు. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక పార్కు కూడా అక్కడే వస్తుంది.

ఎలాంటి పరిశ్రమలు?:
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వైట్‌, గ్రీన్‌ కేటగిరీల్లో పేర్కొన్న, ఎలాంటి పారిశ్రామిక వ్యర్థాలు వెలువడని కాలుష్యరహిత పరిశ్రమలకే అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్‌, సెమీకండక్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్లు, అపెరల్‌, నిట్టింగ్‌ వంటి పరిశ్రమలు ఏర్పాటవుతాయి.

Link to comment
Share on other sites

రాజధానిలో ‘మీడియా’ ఇన్‌స్టిట్యూట్‌
16-10-2018 02:31:21
 
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): అమరావతిలో మీడియా సిటీ స్థాపన దిశగా ఏపీసీఆర్డీయే ముందడుగు వేసింది. రాజధాని ఆర్థికాభ్యున్నతికి ప్రతిపాదించిన 9 థీమ్‌ సిటీల్లో ఒకటైన దీనిద్వారా 2036 నాటికి 60,000 నుంచి 65,000 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో దాదాపు 40వేల పోస్టులకు సుశిక్షితులైన ప్రొఫెషనల్స్‌ అవసరమవుతారని అంచనా. ఇందులో భాగంగా రాజధానిలో మీడియా రంగానికి సంబంధించి ఉత్తమ శిక్షణను ఇచ్చే అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పాలని సీఆర్‌డీయే భావించింది. ఇందుకోసం సుప్రసిద్ధ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌- ఈవోఐ)లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను ఇచ్చింది. ఈనెల 25న విజయవాడలోని సీఆర్డీయే కార్యాలయంలో ప్రి-ఈవోఐ సమావేశం నిర్వహించనున్నారు.
Link to comment
Share on other sites

10,000 కోట్ల సీఆర్డీయే రుణాలకు ప్రభుత్వ హామీ
16-10-2018 03:02:28
 
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): రాజధానిలో తొలి దశ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల్లో రూ.10,000 కోట్లను వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి ఏపీసీఆర్డీయే రుణాలు తీసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. సోమవారం జీవో జారీ చేసింది.
 
 
Link to comment
Share on other sites

స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
16-10-2018 11:03:59
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతిని ఆకర్షణీయ నగరం (స్మార్ట్‌ సిటీ) గా తీర్చిదిద్దేందుకు ఆవిర్భవించిన అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌ఎస్‌సీసీఎల్‌)కు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయం నుంచి పనిచేస్తున్న ఈ సంస్థ కార్యకలాపాలు అంతకంతకూ పెరు గుతున్నందున ఈ 2 కీలక స్థానాల్లో సమర్ధులను నియమించుకోవాలని నిర్ణయించారు.
 
వీటికి దరఖాస్తు చేసుకునేందుకు ఐఐటీల వంటి పేరొందిన విద్యాసంస్థల నుంచి ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ లేదా బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ను కనీసం 75 శాతం మా ర్కులు లేదా తత్సమానమైన గ్రేడ్‌పాయింట్లతో పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. అర్బన్‌ సెక్టార్‌లో కనీసం రెండేళ్లయినా పనిచేసిన అనుభవం తప్పనిసరి. అంతర్జాతీయ సంస్థలు లేదా ఏజన్సీలతో కలసి పనిచేసిన అనుభవం ఉన్నట్లయితే దానిని అదనపు అర్హతగా పరిగ ణిస్తారు. సాంకేతికపరమైన శక్తిసామర్ధ్యాలే కాకుండా వ్యూహాత్మకంగా ఆలోచించగలగడం, సకారాత్మక ఆలోచనా ధోరణి వంటి లక్షణాలను కూడా కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించేందుకు వచ్చే నెల 2వ తేదీ వరకు గడువునిచ్చారు.
Link to comment
Share on other sites

రాజధాని గ్రామాలకు.. మహర్దశ
16-10-2018 11:03:11
 
636752845924525913.jpg
  • రూ.133 కోట్లతో ప్రణాళికలు సిద్ధం
  • గ్రామాల్లో సౌకర్యాల కల్పన
  • ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రారంభం
  • గ్రామంలో చేయాల్సిన పనుల వివరాలు కోరిన సీఆర్డీయే
  • అంచనాలను రూపొందించే పనిలో ఇంజనీర్లు
  • పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
మంగళగిరి రూరల్‌(గుంటూరు జిల్లా): మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాలకు మహర్దశ పట్టనుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాల భూమిని ఇచ్చి పలువురు ఆదర్శంగా నిలిచిన 29 రాజధాని గ్రామాల వారికి సకల మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించిన ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. రాజధాని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైన్లు, రక్షిత మంచి నీటి పథకం, అంగన్‌వాడీ, పార్కు, స్కూల్స్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆసుపత్రి, ఇంటి ఇంటికి చెత్త సేకరణ వంటి పలు మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీయే నడుం బిగించింది. అంచనాలు పంపితే ప్రాధాన్యత క్రమంలో పనులు చేస్తామని సీఆర్డీయే అధికారులు సంబంధిత గ్రామ కార్యాదర్శులకు తెలిపారు. మంగళగిరి మండలంలో 14 గ్రామాలున్నాయి. అందులో 7 గ్రామాలు రాజధాని పరిధిలోకి వెళ్లాయి. ఆ గ్రామాల్లో చేయవల్సిన పనులను గుర్తించేందుకు సీఆర్డీయే గ్రామ కమిటీ సమక్షంలో గ్రామంలోని పెద్దలు, ముఖ్యమైన వారితో సమావేశం నిర్వహించి పనుల నివేదికను సీఆర్డీయే వారికి అందజేశారు. అత్యవసర పనులను 90 రోజుల్లో పూర్తి చేసేందుకు సీఆర్డీయే కసరత్తు ప్రారంభించింది.
 
అంచనాలు ఇలా..
మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, ఎర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచేటందుకు రూ.133కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తొలుత స్థానిక అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఉండవల్లికి రూ.36.5కోట్లు, పెనుమాకకు రూ.11.02కోట్లు, కృష్ణాయపాలెంకు రూ.3కోట్లు, నిడమర్రుకు రూ.12.2కోట్లు, కురగల్లుకు రూ.10.64కోట్లు, నీరుకొండకు రూ.3.92కోట్లు, ఎర్రబాలేనికి రూ.29.65కోట్లు, బేతపూడికి రూ.10.3కోట్లు, నవులూరుకు రూ.15.75కోట్లతో అంచనాలను రూపొందించారు. ముందుగా గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని గ్రామాలకు అందజేస్తారు. ప్రతి గ్రామానికి తొలుత రూ.20 లక్షల నుంచి రూ. 30లక్షల కేటాయింపు జరిగింది. సిబ్బందిని కూడా స్థానికంగానే తీసుకుంటున్నారు.
 
 
గ్రామాలు నగరాలుగా మార్పు
మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు సీఆర్డీయే రంగం సిద్ధం చేస్తుంది. గ్రామాలను కూడా నగరాలుగా మార్పు చేసే చర్యలు చేపట్టనున్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైన్లు, పాఠశాలలు, ట్రపభుత్వ భవనాలు, అంగన్‌వాడీలను అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఇంటింటికి తిరిగి చెత్తను స్వీకరించి అమరావతి నగరానికి దూరంగా ఏర్పాటు చేసే డంపింగ్‌ యార్డు తరలించే చర్యలు జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజలందరూ సహకరించాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది.
జి.వీరాంజనేయులు, మంగళగిరి ఎంపీడీవో
ప్రణాళికలు రూపొందించాం..
మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచేటందుకు రూ.133కోట్లతో ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. తొలుత స్థానిక అవసరాలకు ప్రాధాన్యంను ఇవ్వడం జరుగుతుంది. స్థానికంగా ప్రజలు సహకరించి స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగిస్తే 4 మీటర్లకు తక్కువ కాకుండా సీసీ రోడ్ల ఏర్పాటు జరుగుతుంది.
కె.మంగాపురనాథ్‌, డిప్యూటీ సిటీ డెవలప్‌మెంట్‌ అధికారి
Link to comment
Share on other sites

వచ్చే విజయదశమి అమరావతిలోనే!
17-10-2018 02:59:02
 
636753419436049247.jpg
  • వేల కుటుంబాలు జరుపుకోవాలి
  • లక్ష్యాలు, ప్రణాళికలతో నడవాలి
  • కాలంతో పోటీపడి పనిచేయాలి
  •  రాజధాని 5 కోట్ల మంది ఆకాంక్ష
  •  అది వెయ్యేళ్లు వర్ధిల్లాలి
  • దేశానికి భావి నగరమిదే
  • వచ్చే మూడేళ్లలో 70 వేల ఉద్యోగాలు
  • పాతికేళ్లలో 14 లక్షల మందికి ఉపాధి
  • సీఆర్‌డీఏ సమీక్షలో చంద్రబాబు వెల్లడి
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే వేల కుటుంబాలు విజయదశమి పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఎట్టి ్టపరిస్థితుల్లోనూ వాటిని చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిని ఆయన మంగళవారం సమీక్షించారు. ‘రాజధాని అమరావతి ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష. దీని సాకారానికి కాలంతో పోటీపడి పనిచేయాలి. రాజధాని నగరం వెయ్యేళ్లు వర్ధిల్లాలి. భావి తరాలకు ఇదొక కానుక కావాలి. నిర్మాణ నగరం కోసం ప్రభుత్వం 500 ఎకరాలు కేటాయించింది. ఇది నిర్మాణ రంగ అభివృద్ధికి తోడ్పడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
 
అమరావతి మన దేశ భావి నగరం అవుతుందని.. దేశాభివృద్ధికి చోదకశక్తిలా మారుతుందని, అన్ని ప్రధాన కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో అమరావతి రూ.1.2 లక్షల కోట్ల ఆర్థిక శక్తిగా మారి 11-14 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే మూడేళ్లలో కనీసం 70 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. అమరావతిని అత్యంత సంతోషకర నగరంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఏడు నెలల్లోనే తాత్కాలిక ప్రభుత్వ భవనాలను నిర్మించామని గుర్తుచేశారు. అడ్డగోలుగా రాష్ర్టాన్ని విభజించడంతో అనేక ఇబ్బందులు తలెత్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా వాటిని లెక్కచేయకుండా రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. ‘11శాతం వృద్ధిరేటు సాధించాం. తలసరి ఆదాయం పెంచుకున్నాం. వచ్చే 1000 సంవత్సరాల అవసరాలు తీర్చేలా రాజధాని నగరం నిర్మాణం కావాలి’ అని సీఎం అన్నారు.
 
వర్షాకాలం కావడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడిందని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. రాబోయే త్రైమాసికంలో పనుల్లో వేగం పెంచాలని, లక్ష్యాలు సాధించేందుకు అవసరమైతే ఎక్కువ మానవ వనరులు ఉపయోగించుకోవాలని కాంట్రాక్టర్లకు స్పష్టంచేయాలని ఆదేశించారు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములందరూ శరవేగంగా పనులు చేస్తున్నారని సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. రూ.48,115 కోట్ల విలువైన పనుల్లో 90ు పనులకు టెండర్ల ప్రక్రియ ముగిసిందని చెప్పారు. రూ.28,522 కోట్ల విలువైన పనుల్లో 9 శాతం పనులు కొనసాగుతున్నాయని కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. జనవరి కల్లా అన్ని ప్రధాన రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని, అధికారుల ఇళ్ల నిర్మాణం ఫిబ్రవరికి పూర్తవుతుందన్నారు. సమీక్షలో పురపాలక మంత్రి పి.నారాయణ, ఉన్నతాధికారులు జి.సాయిప్రసాద్‌, లక్ష్మీపార్థసారథి, రామ్మోహన్‌రావు, షన్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
 
సీఎం దుర్గాష్టమి, మహానవమి శుభాకాంక్షలు
దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ అందరికీ సదా స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దుర్గాష్టమి, మహర్నవమి పర్వదినాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Link to comment
Share on other sites

అడుగుపడలేదు 
అంగుళం కదిలితే ఒట్టు..! 
అభివృద్ధికి నోచుకోని అంకుర ప్రాంతం 
మీనమేషాలు లెక్కిస్తున్న సింగపూర్‌ కన్సార్టియం 
ముఖ్యమంత్రే చెప్పినా స్పందన కరవు 
ఎప్పటికప్పుడు ఏవో సాకులు చెబుతూ జాప్యం 
ఈనాడు - అమరావతి 
16ap-story1a.jpg

అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన అంకురప్రాంత (స్టార్టప్‌ ఏరియా) అభివృద్ధి అంగుళం కూడా ముందుకు కదల్లేదు. శంకుస్థాపన జరిగి ఏడాదిన్నర కావొస్తున్నా.. ఈ ప్రాజెక్టుకి ప్రధాన అభివృద్ధిదారు (మాస్టర్‌ డెవలపర్‌)గా ఎంపికైన సింగపూర్‌ సంస్థల కన్సార్టియంకు చీమకుట్టినట్టయినా లేదు. ఏవో సాకులు చెబుతూ ప్రాజెక్టుని వాయిదా వేస్తూ వస్తోంది.

1691 ఎకరాల సార్టప్‌ ఏరియాలో 230 ఎకరాల వరకు నదికీ, కరకకట్టకు మధ్యలో ఉంది. నదీ పరిరక్షణ చట్టం ప్రకారం నదికీ, కరకట్టకు మధ్యలో బహుళ అంతస్తుల, శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు వీల్లేదు. ఈ నేపథ్యంలో మొత్తం ప్రాజెక్టుకి ప్రత్యామ్నాయ స్థలం చూడటమా? లేకపోతే ఫేజ్‌-1లో నదికీ, కరకట్టకు మధ్య ఉన్న 176 ఎకరాలకు బదులుగా, అంతే వైశాల్యంగల స్థలాన్ని ఫేజ్‌-2 నుంచి తీసుకుని ప్రాజెక్టు పనులు ప్రారంభించడమా అన్న మీమాంసలో కన్సార్టియం ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క మొదట 50 ఎకరాల్ని కేటాయిస్తే ఉత్ప్రేరకాభివృద్ధి (కేటలైటిక్‌ డెవలప్‌మెంట్‌) చేపడతామని సింగపూర్‌ కన్సార్షియం ఇటీవలే సీఆర్‌డీఏకి లేఖ అందజేయగా..డబ్బు కట్టమని సీఆర్‌డీఏ బదులిచ్చింది. దానికీ ఇంత వరకు జవాబులేదు. ఎన్నికలయ్యేంత వరకు సింగపూర్‌ కన్సార్టియం ప్రాజెక్టు ప్రారంభించకపోవచ్చన్న అనుమానాలు అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 
ఒప్పందం ప్రకారం తొలిదశలో అభివృద్ధి చేసే 656 ఎకరాలకు జీపీఏ ఇచ్చేందుకూ సీఆర్‌డీఏ సిద్ధంగా ఉన్నా.. వారి నుంచి మాత్రం స్పందన లేదు.

16ap-story1c.jpg
స్టార్టప్‌ ప్రాంతమంటే
అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల వేగం పుంజుకునేందుకు, పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు... 1691 ఎకరాల్లో వాణిజ్య, నివాస, వినోద, పర్యాటక వసతులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పరిపాలనా నగరాన్ని ఆనుకుని, సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (సీబీడీ)లో ఈ భూమిని కేటాయించింది. ఐటీ, ఐటీఈఎస్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలు, హోటళ్లు, మాల్స్‌, వాణిజ్య గృహ నిర్మాణం పెద్ద ఎత్తున తీసుకురావడమే దీని ఏర్పాటు లక్ష్యం.
ఏడీపీ ఏర్పాటైంది ఇలా 
16ap-story1d.jpg
సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియంని స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక చేశారు. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సంయుక్తంగా స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన. స్టార్టప్‌ ప్రాజెక్టు కోసం సింగపూర్‌-అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఏఐహెచ్‌) పేరుతో సింగపూర్‌ కన్సార్టియం అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఎస్‌ఏఐహెచ్‌, ఏడీసీ కలసి అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) పేరుతో సంయుక్తంగా కంపెనీని ఏర్పాటు చేశాయి.
పెట్టుబడి పెట్టాలిలా.. 
16ap-story1e.jpg
* ఏడీపీలో సింగపూర్‌ సంస్థల కన్సార్టియానికి 58 శాతం, ఏడీసీకి 42 శాతం వాటా ఉంటుంది. మూలధన పెట్టుబడిగా ఇరు సంస్థలు రూ.306, రూ.222 కోట్లు పెట్టాలి. 
* సీఆర్‌డీఏకి తొలి దశ ప్రాజెక్టులో వచ్చే స్థూల ఆదాయంలో 5 శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతం చొప్పున వాటా ఇవ్వాలి. 
* 15 ఏళ్లలో ప్రాజెక్టుని పూర్తిచేసి, మార్కెటింగ్‌, విక్రయాలను 20 ఏళ్లలోగా పూర్తి చేయాలి. 
* తొలి దశలో అభివృద్ధి చేసిన భూమిలో 70 శాతం విక్రయించాకే రెండో దశ పనులు ప్రారంభించాలి. 
* మొదటి దశలో అభివృద్ధి చేసిన భూమిని ఎకరం కనీసం రూ.4 కోట్లకు విక్రయించాలి. 
* ప్లాట్ల విక్రయాన్ని వేలం లేదా సంప్రదింపుల ద్వారా ప్రపంచంలోని అత్యుత్తమ, పెద్ద సంస్థలకే విక్రయించాలి. పెద్ద ఎత్తున ఉపాధి తీసుకొచ్చేవి అయి ఉండాలి.
ప్రాజెక్టు ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు 
16ap-story1f.jpg
* 1.25 లక్షల కుటుంబాలు రాజధానికి తరలి రావాలి 
* 2.50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించాలి. 
* ఈ ప్రాంతం నుంచి జీఎస్‌డీపీకి రూ.1.15 లక్షల కోట్లు రావాలి. 
* పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు సమకూరాలి. 
* ఆ ప్రాంతానికి చుట్టూ ఉన్న రైతుల భూములు, సీడ్‌ ఏరియాలోని ఇతర భూములకు విలువ పెరగాలి.
ప్రాజెక్టులో ముఖ్యాంశాలు 
16ap-story1g.jpg16ap-story1h.jpg
ఒప్పందం జరిగిన రోజు నుంచి (2018 జూన్‌) ఐదేళ్లలో తొలి దశను, ఆ తర్వాత ఐదేళ్లలో రెండో దశ, మరో ఐదేళ్లలో మూడో దశను అభివృద్ధి చేయాలి. 
తొలి దశలో 50 ఎకరాల్లో ప్రాజెక్టులు చేపట్టాలి. ఈ 50 ఎకరాల్ని ఏడీపీకి సీఆర్‌డీఏ పూర్తి హక్కులతో విక్రయిస్తుంది. దాని విలువ రూ.17.6 కోట్లు. ఈ 50 ఎకరాలలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, మూడేళ్లలో 8.07 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం కలిగిన భవనాల్ని ఏడీపీ నిర్మించాలి.
శంకుస్థాపన చేసి పదిహేను నెలలైనా.. 
16ap-story1i.jpg
2017 మే 15న సింగపూర్‌ కన్సార్టియానికి ఒప్పంద పత్రం అందజేశారు. రాజధానిలో స్టార్టప్‌ ప్రాంతానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ పాల్గొన్నారు. తీవ్ర జాప్యం తరువాత 
2018 జూన్‌లో ఏడీపీకి, సీఆర్‌డీఏకి మధ్య రాయితీ, అభివృద్ధి, వాటాదారుల ఒప్పందాలు జరిగాయి.
16ap-story1b.jpg
Link to comment
Share on other sites

 

(EOI) for DEVELOPMENT OF MEDIA & ENTERTAINMENT FOCUSED ADVANCED INSTITUTE WITH SHARED PRODUCTION FACILITIES AT AMARAVATI, ANDHRA PRADESH. For more details Ms. Nidhi Aggarwal, Project Manager : +91 9654685014 Mr. Mohit Khemka, Investment Lead : +91 7095599833

Dp81nafXgAAv7Gy.jpg
Link to comment
Share on other sites

అమరావతిలో మరికొన్ని ప్రభుత్వ సంస్థలకు భూములు..?
21-10-2018 06:52:03
 
636757015212569689.jpg
అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మరికొన్ని సంస్థలు, శాఖలకు అమరావతిలో కార్యాలయాల స్థాపనకు అవసరమైన భూములను కేటాయించే అంశంపై త్వరలో జరగనున్న గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం చర్చించబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ భేటీలో జీవోఎం చేయబోయే సిఫార్సులను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వాటికి భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఇప్పటికే అమరావతిలో 65 ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు కలిపి మొత్తం 1312.35 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో కొన్ని సంస్థలకు 2 విడతలుగా భూములను ఇవ్వనున్నారు. తొలిదశలో కేటాయించిన భూముల్లో నిర్దేశిత నిర్మాణాలు జరిపి, కార్యకలాపాలు సాగించిన పక్షంలోనే వాటికి మలి దశలో భూములను కేటాయిస్తారు.
 
ఆ ప్రకారం మొదటి విడతగా 962.35 ఎకరాలు, రెండవ దఫా మిగిలిన 350 ఎకరాలను ఇవ్వ నున్నారు. ఈ నేపథ్యంలో తమకు కూడా రాజధానిలో భూములను ఇవ్వాలంటూ వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖలు సీఆర్డీయేకు గత కొంతకాలంగా దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉన్నాయని సమాచారం. దరఖాస్తుదారుల్లో పూర్తిగా కొత్తవే కాకుండా వివిధ కారణాల రీత్యా గత కేటాయింపుల్లో భూములను పొందలేకపోయినవీ ఉన్నట్లు తెలుస్తోంది. రాజధానిలో నెలకొల్పబోయే తమ కార్యాలయాల్లో ఎంతమంది పని చేయబోతు న్నారు, తమ అవసరాలేమిటో పేర్కొంటూ అందుకు అనుగుణంగా తమకు ఎంత స్థలం కావాలో అవి తమ దరఖాస్తుల్లో పేర్కొన్నాయి. ఆయా వివరాలను నిశితంగా మదింపు చేసిన సీఆర్డీయే అధికారులు దేనికి ఎంతెంత భూమిని కేటాయించవచ్చునో సూచిస్తూ సిద్ధం చేసిన ప్రతిపాదనలను మరి కొన్ని రోజుల్లో జరగనున్న జీవోఎం సమావేశం పరిశీలించనుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...