Jump to content

Amaravati


Recommended Posts

సచివాలయ స్ట్రక్చరల్‌ డిజైన్లపై వర్క్‌షాప్‌
05-10-2018 07:47:00
 
636743224199874558.jpg
  • పలు కన్సల్టెంట్‌ సంస్థల ప్రతినిధులు, నిపుణులతో అధికారుల చర్చలు
అమరావతి: రాజధాని లోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మించద లచిన సచివాలయ సముదాయపు స్ట్రక్చరల్‌ డ్రాయిం గ్‌లు, అంతర్గత డిజైన్లపై పలువురు నిపుణులు గత రెండు రోజులుగా ముమ్మర చర్చలు సాగిస్తున్నారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మూడురోజుల వర్క్‌షాప్‌ వీటికి వేదిక గా నిలుస్తోంది. శుక్రవారంతో ముగియనున్న ఈ కార్యశాలలో గవర్నమెంట్‌కాంప్లెక్స్‌ మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ఫోస్టర్‌ సంస్థతోపాటు సీఆర్డీయేకు కన్సల్టెంట్లు గా వ్యవహరిస్తున్న పలు కంపెనీలు, సెక్రటేరియట్‌ టవర్లకాంట్రాక్ట్‌ సంస్థలైన ఎల్‌అండ్‌టి, షాపూర్జీ పల్లోంజీ, ఎన్‌.సి.సి.ల ప్రతినిధులు, సీఆర్డీయే ఉన్న తాధికారులు, ఇంజినీర్లు పాల్గొంటున్నారు.
 
ఈ వర్క్‌ షాప్‌లో ప్రధానంగా సెక్రటేరియట్‌ టవర్లర్యాఫ్ట్‌ ఫౌం డేషన్‌కు సంబంధించిన స్ట్రక్చరల్‌ డ్రాయింగ్‌లను ఖరారు చేయడంపై చర్చ సాగుతున్నప్పటికీ ఆ టవ ర్లను కలిపే ఫుట్‌ బ్రిడ్జ్‌, వాటి మధ్యన ఉన్న పాల వాగుపై నిర్మించదలచిన వంతెన, అదే సదుపాయం లోని అమె నిటీ బ్లాక్‌లు, కనోపీ(పందిళ్లు)లపై కూడా నిపుణులు దృష్టి సారిస్తున్నారు. కన్సల్టెంట్లు,కాంట్రాక్ట్‌ సంస్థలు, నిపుణులందరి మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి, స్ట్రక్చరల్‌, అంతర్గత డిజైన్లను పూర్తి లోప రహితంగా రూపొందించేందుకుగాను నిర్వహించ దలచిన మొత్తం 5వర్క్‌ షాప్‌లలో ప్రస్తుతం జరు గుతున్నది మొదటిది అని తెలుస్తోంది.
 
స్ట్రక్చరల్‌ డిజైన్‌ డ్రాయింగ్‌లు ఏ విధంగా ఉంటే భవిష్యత్తులో ఎక్కడా, ఎటువంటి సమస్యలు తలెత్త కుండా ఉంటాయో గుర్తించి, వాటిని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయడం ఈ వర్క్‌ షాప్‌ నిర్వహణ వెనుక ఉన్న ఉద్దేశ్యం. వాస్తవానికి ఇవి ఇప్పటికే సుమారు 50శాతం వరకూ సిధ్ధమయ్యాయి. అయితే వాటిని 100శాతం సిద్ధం చేసిన తర్వాత నిపుణులు, అధికారులు నిశితంగా పరిశీలించి, ఏ అంశంలోనూ వేలెత్తి చూపలేని విధంగా అవి రూపొందాయని నిర్ధారిస్తే రూపొందే డ్రాయింగ్‌లను ‘గుడ్‌ ఫర్‌ కన్‌స్ట్ర క్షన్‌గా పేర్కొంటారు. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌, వివిధ కన్స ల్టెంట్‌ సంస్థలు, కాంట్రాక్ట్‌ కంపెనీలు, సీఆర్డీయే ఇంజినీర్లు, ఉన్నతాధికారులు ఇప్పటికే ఈ దిశగా నిర ంతరం సంప్రదింపులు జరుపుతున్నారు, గణనీయ ప్రగతినిసాధించారు కూడా.
 
అయితే చాలా సందర్భా ల్లో వీరందరూ వేర్వేరు చోట్లకూర్చుని, ఈ కసరత్తును కొనసాగిస్తున్నారు. ఫలితంగా సమన్వయలోపమో లేదా సమాచారలోపమో కారణంగా ఎక్కడైనా కొన్ని లోటుపాట్లు దొర్లేందుకు ఆస్కారం ఉంటుందని భావించిన సీఆర్డీయే అందుకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా చూసేందుకు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి, ముఖాముఖి చర్చించుకునేందుకు ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ఈ చర్చల కారణం గా వీరందరి మధ్య ఏకాభిప్రాయం సాధ్యమై, అతి త్వరలోనే ‘గుడ్‌ ఫర్‌ కన్‌స్ట్రక్షన్‌’ డిజైన్‌ డ్రాయింగ్‌లు ఖరారయ్యే అవకాశముంది. బుధ, గురువారాల్లో జరిగిన చర్చలు ఆ దిశగా గణనీయ పురోగతిని సాధించినట్లు తెలు స్తోంది. శుక్రవారం అవి మరింత ముందుకు వెళ్లి, ఆశించిన ప్రయోజనం లభించగలదని అధికారులు భావిస్తున్నారు.
 
అమెనిటీ బ్లాక్‌లు, కనోపీలపై చర్చ..
ఈ వర్క్‌ షాప్‌లో సచివాలయ సముదాయంలో ప్రధానమైన 5టవర్లతోపాటు అమెనిటీ బ్లాక్‌లు, కనోపీ (పందిళ్లు)లపై కూడా చర్చలు జరుగుతు న్నాయి. బ్యాంకులు, సమావేశ మందిరాలు, క్యాంటీన్లు, గ్రీవెన్స్‌ హాల్స్‌, అసోసియేషన్‌ హాల్స్‌ ఇత్యాది వసతులన్నిం టినీ ఏర్పాటు చేసేందుకు ఈ కాంప్లెక్స్‌లో 7 అమెనిటీ బ్లాక్‌లను నిర్మించబోతు న్నారు. ఒక్కొక్కటి 3 అంతస్థులతో నిర్మితమయ్యే వీటికి సంబంధించిన స్ట్రక్చరల్‌ డిజైన్లు ఎలా ఉండాలి, నడకదారులు ఇత్యాదివి ఉండే కనోపీలు ఏ విధంగా రూపుదిద్దుకోవాలన్న అంశాలను కూడా నిపుణులు చర్చిస్తున్నారు. 4 టవర్లు ఒక్కొక్కటి 40 అంతస్థులతో, 1 టవర్‌ 50 అంతస్థులతో నిర్మిత మవనున్న సెక్రటేరియట్‌ టవర్ల కారణంగా అమెనిటీ బ్లాక్‌లు, కనోపీలు ఏ విధమైన ఇబ్బం దులు ఎదుర్కోకుండా చూడడమెలాగన్న దానిపై పరస్పరం అభిప్రాయాలను కలబోసుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక సముదాయంలో తీసుకోవాల్సిన అగ్ని మాపక చర్యలపై సంబంధిత ఉన్నతాధి కారులు ఇందులో సలహాలు, సూచనలను ఇచ్చారు.
 
కాగా.. సెక్రటేరియట్‌ టవర్లలో తమకు ఏమేర ఆఫీస్‌ స్పేస్‌ అవసరమవుతుంది, ఏమేం ఏర్పాట్లు కావాల్సి ఉంటుందన్న విషయాలను వ్యవసాయ, విద్యాశాఖల అధికారులు తెలిపారు. ఈ టవర్ల డిజైన్లను తెలిపే 3-డి నమూనాలను పరిశీలించిన అనంతరం వారు తమ అభిప్రాయాలను చెప్పారు.
Link to comment
Share on other sites

కృష్ణవేణి తీరాన స్పోర్ట్స్‌ ఎరీనా
06-10-2018 07:48:54
 
636744089338102803.jpg
  • డ్రైవ్‌ ఇన్‌, స్పోర్ట్స్‌ ఎరీనా ఏర్పాటుకు ప్రణాళిక
  • ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించిన సీఆర్డీయే
  • 16న విజయవాడలో ప్రి ఈవోఐ సమావేశం
 
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిలో మరొక ప్రజారంజక ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు ఏపీసీఆర్డీయే సంకల్పించింది. ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు 18 కిలోమీటర్ల మేర కృష్ణానదికి ఇరువైపులా ప్రపంచస్థాయి ప్రమాణాలతో పలు పర్యాటక ఆకర్షణలు, జలక్రీడలు ఇత్యాదివి అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇప్పటికే కృష్ణా జిల్లా వైపున బెరం పార్క్‌, భవానీ ద్వీపం, సంగమ ప్రదేశం తదితరాలు దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలను అలరిస్తుండడం కూడా విదితమే. ఇదే కోవలో నదీ తీరాన రాజధాని వైపు మెరీనా ఇత్యాది వాటి ఏర్పాటుకు ఇప్పటికే సీఆర్డీయే చర్యలు తీసుకుంటోంది.
 
తాజాగా నది ఒడ్డున డ్రైవ్‌ ఇన్‌ మరియు స్పోర్ట్స్‌ ఎరీనా ప్రాజెక్టును స్థాపించేందుకు సీఆర్డీయే నిర్ణయించింది. ఆహ్లాదకరంగా ఉండి, మనోల్లాసాన్ని కలిగించే కృష్ణా నదీతీరానికి ఈ ప్రాజెక్ట్‌ మరింత శోభను చేకూర్చగలదని ఈ సంస్థ ఆశిస్తోంది. వాహనాలతో సహా నది ఒడ్డుకు వెళ్లి, అక్కడ ఏర్పాటయ్యే రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలతోపాటు అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా పలు క్రీడా సదుపాయాలనూ ఇక్కడ కల్పించనున్నారు. ఇవి అన్ని వయస్సుల వారినీ అలరించేలా చూడనున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ రివర్‌ ఫ్రంట్‌ టూరిజం ప్రాజెక్టులతో పోల్చితే మరింత విభిన్నంగా, వినూత్నంగా అమరావతిలో రాబోయే ప్రాజెక్ట్‌ రూపు దిద్దుకుని, దేశ విదేశాలకు చెందిన పర్యా టకులను విశేషంగా ఆక ట్టుకోవాలని సీఆర్డీయే అధికారులు భావి స్తున్నారు.
 
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇలాంటి ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణలో అనుభవమున్న సుప్రసిద్ధ సంస్థలను రాజధానికి రప్పించాలని భావిస్తున్న సీఆర్డీయే వాటిని గుర్తించేందుకుగాను ‘ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌- ఈవోఐ)’లను కోరుతూ నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఈ ప్రాజెక్టును గనుక తాము చేపడితే దానిని ఏ విధంగా రూపొందిస్తామో, అందులో ఏమేం అంశాలు, ఆకర్షణలను ఏర్పాటు చేస్తామో ఇత్యాది వివరాలను పేర్కొంటూ ఈ ఈవోఐలను తనకు సమర్పించేందుకు ఈ నెల 25వ తేదీవరకు గడువునిచ్చింది. ఈ విషయంలో సదరు సంస్థలకు ఏమైనా అనుమానాలు, సందేహాలు కలిగితే వాటిని నివృత్తి చేసేందుకు ఈ నెల 16న విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ప్రి ఈవోఐ సమావేశాన్ని నిర్వహించనుంది.
Link to comment
Share on other sites

అభివృద్ధి బాటలో మరో రాజధాని గ్రామం
06-10-2018 07:51:36
 
636744090959950635.jpg
  • ఊరంతా సిమెంటు రోడ్లు
  • ఒకప్పుడు కాకతీయుల ఏలుబడి
  • నేడు మోడల్‌ గ్రామంగా రూపు
 
కాకతీయుల ఏలుబడిలో సాగి.. చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది మల్కాపురం గ్రామం. ఘన చరిత్ర కలిగిన ఈ గ్రామం రాజధాని నిర్మాణంలో భాగంగా నేడు అభివృద్ధిలోనూ ముందుంది. ఈ గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు సీఆర్డీయే కృషి చేస్తోంది.
 
 
అమరావతి: వెలగపూడి సచివాలయానికి ఆనుకొని ఉన్న మల్కాపురం గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దేందకుఉ సీఆర్డీయే నిధులు అందిస్తోంది. ఇప్పటికే రూ.10 లక్షలు సీఆర్డీయే నిధులతో ఎస్సీ కాలనీలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. న్యూ ఎస్టీ కాలనీలో కూడా రూ.84 లక్షల సీఆర్డీయే నిధులతో రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేయటానికి అనుమతులొచ్చాయి. రూ.17 లక్షలతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మించారు. గృహ నిర్మాణ పథకం కింద గ్రామంలో 44 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. అందులో 17 ఇళ్లను లబ్ధిదారులు నిర్మించుకున్నారు. గతంలో సామాజిక పింఛన్లు 152 మందికి అందిస్తుంటే.. ఈ ప్రభుత్వంలో 60 మందికి అదనంగా పంపిణీ చేస్తున్నారు. రేషన్‌కార్డులు మల్కాపురంలో గతంలో 421 ఉంటే ఇప్పుడు 506 కార్డులకు రేషన్‌ అందుతుంది. అమరావతి జీవన భృతి ఫింఛన్లు నెల నెలా రూ.2,500 మొత్తం 350 కుటుంబాలకు అందుతున్నాయి.
 
కొన్ని సమస్యలు ఉన్నాయి..
మల్కాపురం గ్రామంలో కొన్ని సమస్యలున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అంగన్‌వాడీ రెండు కేంద్రాలకు బిల్డింగ్‌లు అవసరం ఉంది. మరొక పాఠశాలకు ప్రహరీ అవసరం ఉంది. ఎస్సీ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధాన రోడ్డులో సైడు డ్రైన్స్‌ నిర్మించాలి. ఇక్కడి చెరువును అభివృద్ధి చేయాలి. శివాలయం పక్కనే సుగాలీలు ఆక్రమించి నివాసాలుంటున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాల్సి ఉంది. రైతుల ప్లాట్లలో అభివృద్ధి జరగాల్సి ఉంది.
 
 
సీఆర్డీయే సహకారంతో..
గ్రామ అభివృద్ధికి సీఆర్డీయే సహకరిస్తోంది. సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి మాల్కాపురాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎన్టీఆర్‌ సుజల పథకం ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే.
- వేజళ్ల శివప్రసాద్‌, మల్కాపురం మాజీ సర్పంచ్‌
 
 
ప్రగతి పథంలో గ్రామం..
ఎస్సీకాలనీలో అన్నీ రోడ్లు సిమెంటు రోడ్లు వేశారు. గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అధికారులు సహకరించారు. సీఎం చంద్రబాబుతోనే అభివద్ధి సాధ్యమని ఇక్కడ గ్రామాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
- గోచిపాత కుటుంబరావు, మాజీ ఉప సర్పంచ్‌
Link to comment
Share on other sites

అమరావతిలో ఓపెన్‌ మాల్‌!
07-10-2018 08:02:11
 
636744961279685003.jpg
  • కమర్షియల్‌ మాల్‌తో కూడిన వినోదాత్మక కేంద్రం
  • డెవలపర్స్‌ని ఆహ్వానించిన ఏపీసీఆర్‌డీఏ
  • త్వరలో ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం
 
గుంటూరు: అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నగరంలో కమర్షియల్‌ మాల్‌తో కూడిన భారీ వినోదాత్మక కేంద్రాన్ని నిర్మించేందుకు సీఆర్డీయే సన్నాహకాలు ప్రారంభించింది. సువిశాలమైన ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని ప్రముఖ దేశాల్లో ఉన్న వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అంతర్జాతీయంగా డెవలపర్స్‌ నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ నెలలోనే బిడ్‌లు పరిశీలించి డెవలపర్‌ని ఎంపిక చేసేందుకు సన్నద్ధమౌతున్నది. సాధ్యమైనంత త్వరగా ఒప్పందం చేసుకొని నిర్మాణాన్ని ప్రారంభింప చేయాలన్న ధృక్పథంతో సీఆర్‌డీఏ వర్గాలు ఉన్నాయి.
 
రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, విద్యుత్‌ కేబుల్స్‌, పైపులైన్లు, క్వార్టర్లు, బ్లూ, గ్రీన్‌ నెట్‌వర్కు పనులు కొనసాగుతున్నాయి. విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటి సంస్థలు ఇప్పటికే తొలి దశ నిర్మాణాలు పూర్తి చేసి తరగతులను ప్రారంభించాయి. అమృత, బీఎం షెట్టీ సంస్థలకు చెందిన వర్సిటీల నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ మెగా ప్రాజెక్టులపై దృష్టి సారించింది. గత నెలలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా కమర్షియల్‌మాల్‌-కమ్‌-ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌పై దృష్టి సారించింది.
 
రాజధానికి వాణిజ్య, వినోద కేంద్రంగా ఉండబోయే ఈ ప్రాజెక్టుని ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు నిర్ణయించింది. ఏదైనా సంస్థకి 60 ఏళ్ల పాటు లీజుకు దీనిని కేటాయించబోతోంది. ఓపెన్‌మాల్‌ కాన్సెప్ట్‌ విధానంలో దీనిని నిర్మించేందుకు ప్రతిపాదనలను ఆహ్వానించింది. సింగపూర్‌, బ్యాంకాంక్‌, హాంకాంగ్‌, బీజింగ్‌, మలేషియా వంటి ప్రదేశాల్లో ఇలాంటి వినోదాత్మక వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. వీటికి స్థానిక ప్రజల నుంచే కాకుండా అంతర్జాతీయంగా పర్యాటకుల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఆయా ప్రదేశాలకు పర్యాటకం నిమిత్తం వెళ్లిన వారు కచ్ఛితంగా వీటిని సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో రాజధానికి వచ్చే ప్రతీ ఒక్కరూ సందర్శించే విధంగా కమర్షియల్‌ మాల్‌తో కూడిన వినోదాత్మక కేంద్రం ఉండాలన్నది సీఆర్‌డీఏ ఆలోచనగా ఉన్నది. ఈ నెల 12వ తేదీతో ప్రతిపాదనలు/బిడ్‌ల స్వీకరణ ఆన్‌లైన్‌లో ముగియనుండటంతో ప్రముఖ అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రపోజల్స్‌ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారవర్గాలు అంచనా వేస్తోన్నాయి.
Link to comment
Share on other sites

11 hours ago, sonykongara said:

 

Singapore consortium Assam aitheee it will be huge blow to Amaravati 

High-tech city construct chestham ani evo designs kuda final chesaru kada adi emayyindi.any clue?

As of now except govt buildings,SRM,VIT thappa evadu Amaravati lo invest cheyyadam ledu

Link to comment
Share on other sites

3 minutes ago, krish2015 said:

As of now except govt buildings,SRM,VIT thappa evadu Amaravati lo invest cheyyadam ledu

enduku cheyytala amrutha vadu kadutunnadu, xlri di e month lone unnadi, chinna chinnavi vasthayi avi sari chesukoni cbn munduku potadu

Link to comment
Share on other sites

ప్రగతి పథాన వెంకటపాలెం..!
08-10-2018 08:51:30
 
636745854908843651.jpg
  • విజయవాడకు అతి సమీప గ్రామం
  • నగరాన్నే తలదన్నే రీతిలో అభివృద్ధి
  • ఎస్సీ కాలనీ మొత్తం సిమెంటు రోడ్లు
  • గ్రామానికి ఆనుకొని సీడ్‌ యాక్సెస్‌
రాజధాని గ్రామాల్లో ఒకటైన వెంకటపాలెం అభివృద్ధికి చిరునామాగా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటపాలెం నేడు నగరాలనే తలదన్నే రీతిలో ప్రగతిపథాన నడుస్తోంది. గ్రామానికి ఆనుకొని రాజధానికే తలమానికమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఉండటంతో వెంకటపాలెం మరింత అభివృద్ధి చెందుతుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. విజయవాడకు సమీపంలో ఉన్న వెంకటపాలెం భూములు రాజధాని రాక ముందే ఎంతో విలువైనవిగా పేరొందాయి.
 
 
తుళ్లూరు: మొదట వెంకటపాలెం రైతులు రాజధానికి భూములివ్వాలంటే సంకోచించారు. మెరుగైన ప్యాకేజీ అమలు చేయాలని... అప్పుడే ల్యాండ్‌ పూలింగ్‌కు భూములిస్తామని పేర్కొన్నారు. రైతుల గోడు ఆలకించిన సీఎం చంద్రబాబునాయుడు ఒక ఎకరా జరీబుకు 1450గజాల ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో 1000 గజాలు నివాసానికి, 450గజాలు వాణిజ్యానికి కేటాయించారు. దీంతో రైతులు స్వచ్ఛందంగా మెట్ట జరీబు కలపి 1350 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చారు. విజయవాడ నగరానికి అతిసమీప గ్రామం కావడంతో మంతెన సత్యనారాయణ ఆశ్రమం కూడా గతంలో వెంకటపాలెం రెవెన్యూలో ఏర్పాటుచేశారు.
 
ఎస్సీ కాలనీ మొత్తం సిమెంటు రోడ్లే...
వెంకటపాలెం ఎస్సీ కాలనీ అంతటా సిమెంటు రోడ్లు వేశారు. 40 లక్షల సీఆర్డీయే నిధులతో గ్రామంలోని ఎన్టీఆర్‌ కాలనీకి సిమెంటు రోడ్లు వేశారు. చెరువు సుందరీకరణ, వాకింగ్‌ ట్రాక్‌కు రూ.38 లక్షలు ఖర్చుచేశారు. సైడుకాల్వలు, సిమెంటు రోడ్ల అభివృద్ధికి సీఆర్డీయే రూ.60 లక్షలు కేటాయించింది. ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నాలుగేళ్లలో ఎంపీపీ గ్రాంటు కింద 9 లక్షలు కేటాయించారు. గ్రామంలో పరిశుభ్రతకు 20మంది పారిశుధ్య కార్మికులను కేటాయించారు. గ్రామ పంచాయతీ నిధులు 64 లక్షలు పెటి ్ట సిమెంటు రోడ్లు పూర్తిచేశారు. విజయవాడకు సీడ్‌ క్యాపిటల్‌కు మధ్యలో వెంకటపాలెం గ్రామం ఉండటంతో అభివృద్ధి జెట్‌ స్పీడ్‌తో జరుగుతోంది.
 
మోడల్‌ స్కూల్‌గా...
వెంకటపాలెంలోని ప్రభుత్వ పాఠశాలను మోడల్‌ స్కూల్‌గా రూపొందించటానికి సీఆర్డీయే సిద్ధమవుతోంది. అందుకు అదనపు తరగతి గదులు, ప్రహరీ, భోజనశాలకు 70 లక్షలు కేటాయించారు. పాఠశాల ఆవరణలోనే అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్మించే ఆలోచన చేస్తున్నారు. గ్రామంలో ఎన్టీఆర్‌ సుజల పథకాన్ని ఏర్పాటుచేశారు. 13, 14 ఆర్థిక సంఘ నిధులు 20 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తిచేశారు. మొత్తం మీద పంచాయతీ నిధులు కాని సీఆర్డీయే నిధులు కాని 3 కోట్లకు పైగా ఖర్చుచేశారు.
 
గతంలో కంటే పింఛన్లు, రేషన్‌ కార్డులు అదనం
గత ప్రభుత్వంలో కంటే రేషన్‌కార్డులు, సామాజిక ఫింఛన్లు అదనంగా అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నారు. గతంలో 203 మంది పింఛన్లు పొందుతుంటే.. ఈ ప్రభుత్వంలో మూడు రకాల పింఛన్లు 388 మంది పొందుతున్నారు. రేషన్‌ కార్డుదారులు గతంలో 1300 ఉంటే.. ప్రస్తుతం 1732 కార్డులకు రేషన్‌ అందుతోంది. భూమిలేని నిరుపేదలకు ఇచ్చే అమరావతి జీవన్‌ భృతి పింఛన్‌ను 832కుంటుబాలు ప్రతి నెలా రూ. 2500 వంతున అందుకుంటున్నాయి.
 
వైద్యం, విద్య మెరుగ్గా ఉండాలి...
రైతులకు ఉచిత వైద్యం అందించాలి. వారి పిల్లలకు మంచి విద్యను అందించేవిధంగా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రత్యేక గుర్తింపుకార్డులను అందజేసి ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలలో రాజధాని గ్రామాల రైతుల పిల్లలకు అవకాశం ఇవ్వాలి. కార్పొరేట్‌ విద్య రాజధాని గ్రామంలోనే అందించాలి. చంద్రబాబు మీద నమ్మకంతో భూములు ఇచ్చాం. అంతేవిధంగా అభివృద్ధి జరుగుతోంది. రైతుల ప్లాట్లలో కూడా అభివృద్ధి వేగంగా జరగాలి.
 - బెల్లంకొండ నరసింహారావు, మాజీ ఎంపీటీసీ, తాడికొండ ఏఎంసీ మాజీ చైర్మన్‌
 
అభివృద్ధి టీడీపీతోనే..
 సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరిగేది టీడీపీ ప్రభుత్వంలోనే. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకోగలుగుతున్నాం. సీఆర్డీయే నిధులతో గ్రామం మరింత అభివృద్ధి సాధించింది. సీఎం చంద్రబాబు మీద నమ్మకంతో రాజధానికి భూములిచ్చాం. అభి వృద్ధి అంటే ఇలా ఉంటుందని ఈ నాలుగేళ్లలో చూపించాం.
-చేకూరి రవి, తాజా మాజీ సర్పంచ్‌, వెంకటపాలెం
Link to comment
Share on other sites

అమరావతిలో.. అలరించేలా..
09-10-2018 09:11:52
 
636746731127156987.jpg
  •  జపాన్‌ భాగస్వామ్యంతో హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌
  • 2న ముఖ్యమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన
  • 2 ఎకరాల్లో, రూ.6 కోట్లతో భారత, జపాన్‌ సంస్కృతుల ప్రదర్శన
  • 300- 500 మంది ఆసీనులయ్యేలా ఆడిటోరియం
  • కాగితపు గుజ్జుతో రూపొందే పిల్లర్లు ప్రత్యేక ఆకర్షణ
అమరావతి, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): రాజధానిలో భారత, జపాన్‌ దేశాల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ‘హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌’కు ఈ నెల 12న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. మానవీయత, వైవిధ్యం, ఆవిష్కరణ (హ్యుమానిటీ, డైవర్సిటీ, ఇన్నొవేషన్‌)లకు చిహ్నంగా ఇది నిలవనుంది. ఇండో- జపాన్‌ సంయుక్త భాగస్వామ్యంతో అమరావతిలోని లింగాయపాలెం- కొండమరాజుపాలెంకు సమీపంలో రెండు ఎకరాల్లో ఇది రూపుదిద్దుకోనుంది. రూ.6 కోట్ల నిర్మాణ వ్యయంతో, ఒక అంతస్థుతో నిర్మితమయ్యే ఈ పెవిలియన్‌లోని ఒక భాగంలో భారతదేశం, జపాన్‌ సంస్కృతులను, ఈ రెండు దేశాల మధ్య చిరకాలంగా వర్థిల్లుతున్న స్నేహసంబంధాలను కళ్లకు కట్టే వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. ఇంకొక భాగంలో 300 నుంచి 500 మంది వరకు ఆసీనులయ్యేందుకు వీలుగా చక్కటి ఆడిటోరియంను నిర్మిస్తారు. భారతదేశంతోపాటు జపాన్‌కు చెందిన కళాకారుల ప్రదర్శనలను ఇందులో ఏర్పాటు చేస్తారు. కాగితపు గుజ్జుతో రూపొంది, కనువిందు చేసే వినూత్న పిల్లర్లు ఈ పెవిలియన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
 
ప్రిట్జ్‌కర్‌ పురస్కార గ్రహీతతో డిజైన్‌..
అమరావతిని భవిష్యత్తులో సందర్శించే జపాన్‌ దేశ ప్రజలతోపాటు మన దేశీయులనూ అలరించేలా రూపొందబోతున్న ఈ పెవిలియన్‌ డిజైన్‌ను జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ షిగురు బన్‌ రూపొందించారు. పలు సుప్రసిద్ధ కట్టడాల ఆకృతులను రూపొందించిన షిగురు ఆర్కిటెక్చర్‌లో నోబెల్‌ బహుమతిగా అభివర్ణించదగిన ప్రిట్జ్‌కర్‌ ఆర్కిటెక్చర్‌ పురస్కార గ్రహీత! విశాలంగా, ప్రశాంతతకు నెలవుగా ఉండబోయే ఈ పెవిలియన్‌ను జపాన్‌కే చెందిన కుని ఉమి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నిర్మించబోతోంది.
 
శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన
అమరావతిలోని ఏపీసీఆర్డీయే ప్రాజెక్ట్‌ కార్యాలయానికి సమీపంలో ఈ నెల 12వ తేదీన ఈ పెవిలియన్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కుని ఉమి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యసుయో యమజకి ప్రభృత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పెవిలియన్‌కు కేటాయించిన ప్రదేశాన్ని సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ ఎస్‌.షణ్మోహన్‌, ఉన్నతాధికారులు బి.ఎల్‌.చెన్నకేశవరావు, సీఈ ఎం.జక్రయ్య, ఎస్‌.ఇ. సీహెచ్‌ ధనుంజయ, జేడీ వి.శ్రీనివాసరావు, సీసీడీపీ జేడీ జిలానీ, తుళ్లూరు ఏఎస్పీ బి.కృష్ణారావు, తుళ్లూరు ఎంపీడీవో బి.శ్రీనివాసరావు సోమవారంనాడు పరిశీలించారు. శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...