Jump to content

Amaravati


Recommended Posts

Govt. housing in Amaravati by March 2019’

author-deafault.png Staff Reporter
Vijayawada, September 18, 2018 00:00 IST
Updated: September 18, 2018 05:09 IST
 

‘Pace of work will further improve after rainy season’

Municipal Administration Minister P. Narayana said the construction of residential quarters for Ministers, MLAs, All India Service officers, non-gazetted officers and Class-IV employees would be completed by March 2019.

Addressing mediapersons during an inspection of the capital city works along with MLCs on Monday, Mr. Narayana said critics, including YSR Congress (YSRC) president Y.S. Jagan Mohan Reddy, should see for themselves before making comments that the Amaravati project came to a standstill and it was mired in corruption.

Infrastructure works

Infrastructure works costing Rs. 28,000 crore were in different stages and the government would have achieved a substantial progress by early 2019. The construction of Assembly, High Court and Heads of Departments office buildings was going on well. The overall project would gain further pace after the rainy season ended, Mr. Narayana said.

Shear-wall technology

MLC T.D. Janardhan said slabs were laid in just about a week compared to a fortnight in Singapore. Such was the speed at which infrastructure was being created and it was largely due to the deployment of shear-wall technology.

Link to comment
Share on other sites

అమరావతి పూర్తికి లక్ష కోట్లు!
19-09-2018 03:02:07
 
636729229239802177.jpg
రాజధాని అమరావతి పూర్తి నిర్మాణాలకు రూ.1,09,023 కోట్లు అవసరమవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌ సిద్ధమైందని మండలిలో చెప్పారు. కేంద్రం ఇచ్చిన రూ.1500 కోట్లకు సంబంధించి యూసీలు కూడా సమర్పించామన్నారు. నీతి ఆయోగ్‌ డైరెక్టర్‌ పరిశీలించి ఈ నిధులను పాదర్శకంగానే ఖర్చు చేశారని కేంద్రానికి లేఖ రాశారని, మరో రూ.660 కోట్లు ఇవ్వాలని సూచించారని, కానీ.. కేం
Link to comment
Share on other sites

అమరావతి విజ్ఞాన నగరం కావాలి
20-09-2018 07:50:15
 
636730266124511603.jpg
  • మీ జ్ఞానాన్ని ప్రభుత్వ శాఖలకు అందించండి
  • రాజధాని విద్యాసంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
అమరావతి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పేరు ప్రఖ్యాతులున్న పలు విద్యాసంస్థలు రాజధానికి రావడం రాష్ట్రానికి గర్వకారణ మని, అవి అమరావతిని ప్రపంచశ్రేణి విజ్ఞాన కేంద్రంగా మలచనున్నాయని ముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అయితే ఈ విద్యా సంస్థలన్నీ తరగతి గదుల్లో విద్యార్థులకు అందజేసే జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఉపయోగపడేలా ప్రభుత్వ శాఖలకు అందజేస్తే మరింత మెరుగైన పరిపాలనా ఫలితాలు ప్రజలకు అందుతాయని చెప్పారు. ఇందు కోసం వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం కుదుర్చుకుని, పరస్పరం విజ్ఞాన సమాచార మార్పిడికి కృషిచేయాలని సూచించారు.
 
రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పురోగతిని సీఎం బుధవారం రాత్రి వెలగపూడిలోని సచివాల యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అమరావతిలో భూములను పొందిన వివిధ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్టీజీ, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్తు వాహనాలు తదితర కీలకాంశాల్లో వినూత్న యోచనలు, ఆవిష్కరణల ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వారిని కోరారు. సింగపూర్‌లోని ప్రఖ్యాత లీ క్వాన్‌ యూ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ పరిపాలనలో పోటీతత్వం పెంచేలా పరిశోధన, శిక్షణాంశాల్లో రాష్ట్రానికి తోడ్పడేందుకు ముందుకు వచ్చిందని, ఇప్పటికే ఇక్కడ కొలువుదీరిన సంస్థ లు దానితో కలసి పనిచేసి వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించాలన్నా రు. రాజధానిలో భూములు పొందిన సుమారు 15 సంస్థల ప్రతినిధులు తమ నిర్మాణ పనుల్లో పురోగతిని, ప్రణాళికలను వివరించారు.
 
పుష్కల జల వనరులు అందుబాటులో ఉన్నందున వీటన్నింటి ప్రాంగణాలను ఫౌంటెన్లు, ఇతర జలక్రీడావసతుల ఏర్పాటుతో ఆహ్లాద భరితంగా తీర్చిదిద్దుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రతి సంస్థ తన ప్రాంగణంలో అత్యధిక విస్తీర్ణాన్ని పచ్చ దనానికి కేటాయించాలని, విద్యార్థుల శారీరక వ్యాయా మానికి వీలు కల్పించేలా తగిన క్రీడాసదుపాయాలను కలిగి ఉండాలన్నారు. తద్వారా విద్యార్థులు భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు, నాయకులుగా ఎదిగేందుకు అనువై న వాతావరణాన్ని సృష్టించాలని చెప్పారు.
 
తమ క్యాంప స్‌లో 7 లక్షల చదరపుటడుగుల మేర నిర్మించిన భవం తుల్లో ఈ విద్యా సంవత్సరంలో 20 రాష్ట్రాలకు చెందిన సుమారు 1200మంది చదువుకుం టున్నారని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రొ వీసీ సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ శాఖలకు తమవంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వి.ఐ.టి. ప్రతినిధి చెప్పారు.
 
అమరావతిలో మరో 2 విశ్వవిద్యాలయాలు
జంషెడ్‌పూర్‌కు చెందిన ప్రఖ్యాత గ్జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అమరావతిలో ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ. వర్సిటీని ఏర్పాటు చేయబోతోంది. ఇందులో 2,500 మంది విద్యార్థులు పీజీ కోర్సులు, మరో 2,500 మంది అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చేసేందు కు కావలసిన వసతులు కల్పిస్తామని ఆ సంస్థ ప్రతినిధి సీఎంకు తెలిపారు. నీరుకొండ సమీపం లో 50 ఎకరాల్లో భవనాలను నిర్మిస్తామని, విస్తీర్ణంలో 47 శాతాన్ని ఓపెన్‌ స్పేస్‌గా ఉంచుతా మని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని సీఎం కోరారు.
 
నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించిన తాము సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేసి, తరగతులను ప్రారంభించనున్నట్లు అమృత యూనివర్సిటీ ప్రతినిధి తెలిపారు. వచ్చే నెలలో పునాదిరాయి వేయనున్నట్లు, ఏడాది లోగా మొత్తం నిర్మాణాన్ని పూర్తిచేసి వైద్యసేవలు ప్రారంభిస్తామని ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి చెప్పారు. వచ్చే జనవరిలో నిర్మాణాన్ని మొదలుపెట్టి, 18 మాసాల్లోగా పూర్తిచేయాలని దసపల్లా హోటల్‌ ప్రతినిధికి సీఎం సూచించారు. భవనాలను త్వరగా పూర్తిచేసి, 2019 విద్యా సంవత్సరంలో తరగతులను ప్రారంభిస్తామని ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రతినిధి చెప్పారు. మొత్తం 9బ్లాక్‌లుగా తమ ఆస్పత్రిని నిర్మించను న్నట్లు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు. ఆస్పత్రి ఆర్కిటెక్చరల్‌ ప్లాన్‌ను చంద్రబాబు పరిశీలించారు.
 
పచ్చదనం అభివృద్ధికి ప్రత్యేక బృందం
రాజధానిలో పచ్చదనాన్ని అభివృద్ధి పరచేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని నియమించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణ ప్రాంత గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలన్న ఆయన ఆయా ప్రదేశాల్లో ప్రభుత్వ భూములు ఉంటే ముందు వాటిల్లో గృహాలను నిర్మించాలని, ఆ తర్వాత అవసరమైతేనే ప్రైవేట్‌ భూములను కొనుగోలు చేయాలని సూచించారు.
 
‘అమరావతి హ్యాపీనెస్‌’ పేరిట 1200 ఫ్లాట్ల నిర్మాణం
వాణిజ్యావసరాలకు ‘అమరావతి హ్యాపీనెస్‌’ పేరిట 1200 ఫ్లాట్లను నిర్మించనున్నట్లు ఏపీసీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సీఎంకు తెలిపారు. 14 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.
సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర, సీఆర్డీయే కార్యదర్శి అజయ్‌జైన్‌, పురపాలక శాఖ కార్యదర్శి కరికాల వలవన్‌, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారధి తదితర అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతిలో 300 కోట్లతో నిఫ్ట్‌
20-09-2018 03:52:53
 
  • స్థలాన్ని పరిశీలించిన సంస్థ డైరక్టర్‌ శివలింగం
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌) ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక్కడ త్వరలో రూ.300 కోట్లతో నిఫ్ట్‌ నిర్మాణాలను ప్రారంభించబోతోంది. సంస్థ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ శివలింగం ఆధ్వర్యంలో ఓ బృందం నిఫ్ట్‌కు కేటాయించనున్న స్థలాన్ని బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం, మంత్రి అచ్చెన్నాయుడుతో అసెంబ్లీ లాబీలో సమావేశమైంది. కార్యాలయ ఏర్పాటుకు రూ.300 కోట్లు కేటాయించామని, 9 కోర్సులు ప్రారంభిస్తామని శివలింగం తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు మిగిలిన వివరాలను ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
Link to comment
Share on other sites

27 minutes ago, Kondepati said:

complete design rakunda tender lu entaki quote chestaru ...ela istaru sodara

Vijayawada City @BZAUpdates 13m13 minutes ago

 
 

Tenders For Permanent High Court Structure Was Finalized #ShapoorjiPallonji Won the Bid For Constructing Mechanical Structure of the Building G+7 Construction Project Cost : 950+ Cr Area : 1.2 Million Sq. Ft Time : 2 Years

అమరావతిలో హైకోర్టు భవనం టెండర్లు ఖరారు
షాపూర్జీ పల్లోంజీ సంస్థకు పనులు

ఈనాడు, అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. హైకోర్టు నిర్మాణ పనులు దక్కించుకునేందుకు షాపూర్జీ-పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలు పోటీ పడ్డాయి. మిగతా రెండు సంస్థలకంటే తక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసిన షాపూర్జీ సంస్థ పనులు దక్కించుకుంది. హైకోర్టు నిర్మాణానికి రూ.996 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ టెండర్లు పిలవగా.. షాపూర్జీ సంస్థ 4.3 శాతం ఎక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా.. హైకోర్టు భవనం స్ట్రక్చర్‌ను మాత్రం షాపూర్జీ సంస్థ నిర్మిస్తుంది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ వంటి పనులకు విడిగా టెండర్లు పిలుస్తారు. భవనాన్ని బౌద్ధ స్థూపాన్ని పోలిన ఆకృతిలో నిర్మిస్తున్నారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఆకృతిని రూపొందించింది. జీ+7 విధానంలో నిర్మిస్తారు. మొత్తం 12 లక్షల చ.అ. నిర్మితప్రాంతం ఉంటుంది. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లను వాహనాలు నిలిపేందుకు కేటాయిస్తారు.

 
Link to comment
Share on other sites

రవేగంగా సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం
21-09-2018 08:15:07
 
636731145049462084.jpg
అమరావతి: తుళ్లూరులో సీఆర్డీయే నగర ప్రాం తీయ నూతన కార్యాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పాత భవనంలో తాత్కాలికంగా కొనసాగుతోంది. రాజధాని 29 గ్రామాల్లోని ల్యాండు పూలింగ్‌ సంబంధించిన కార్యాకలాపాలకు ఇక్కడ జరుగుతున్నాయి. నూతన భవనం మేరిమాత స్కూలు ఎదురుగా రూపుదిద్దుకుంటోంది. జీ ప్లస్‌ వన్‌లో ఇప్పటికే గ్రౌండు ఫ్లోర్‌ పూ ర్తయి, మొదటి ఫ్లోర్‌ శ్లాబు వేశారు. డిసెంబరు నాటికి సీఆర్డీయే నూతన భవనంలో కార్యాకలాపాలను నిర్వహించనుంది.
Link to comment
Share on other sites

ఇండో- యూకే హెల్త్‌ సిటీ’కి సీఆర్డీయే నోటీసులు?
21-09-2018 08:53:40
 
636731168178334082.jpg
అమరావతి: అమరావతిని వైద్య, ఆరోగ్య రంగాల్లో అగ్రస్థానంలో నిలపడంలో ఎంతైనా దోహదపడ గలదని ఆశించిన ‘ఇండో- యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెడిసిటీ ప్రాజెక్ట్‌’ యాజమాన్యానికి ఏపీసీఆర్డీయే నోటీసులు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సంస్థకు తాను కేటాయించిన మొత్తం 150 ఎకరాల్లోని 50 ఎకరాల్లో తొలిదశ పనులను ఎంతకీ ప్రారంభించకపోవడం ఇందుకు కారణం. గతేడాది ఆగస్టులో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో దీనికి శంకుస్థాపన జరగ్గా, ఇంతవరకూ పనులు మొదలవలేదు. ఒప్పందం ప్రకారం ఈ పనులు సుమారు 9, 10 నెలల క్రితమే మొదలవ్వాల్సి ఉండగా అలా జరగకపోవడంతో ఇంతకుముందు కూడా సీఆర్డీయే సదరు యాజమా న్యానికి నోటీసులు ఇచ్చిందని, ఇప్పుడు పంపినవి మరోవిడతవి అని సమాచారం.
 
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనదిగా పేరొందిన లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ హాస్పిటల్‌తో కలసి మన రాజధానిలో దీనిని స్థాపించేందుకు ఇండో- యూకే హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ముందుకు వచ్చింది. అత్యాధునిక 1,000 పడకల ఆస్పత్రి, వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, పారామెడిక్‌ ట్రైనింగ్‌ స్కూల్‌, అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్స- పునరావాస కేంద్రం, ఐబీఎం ఆసియా డేటా అనలిటిక్స్‌ సెంటర్‌, ఇంప్లాంట్ల తయారీ పరిశ్రమ, స్టెమ్‌ సెల్స్‌ పరిశోధనా కేంద్రంతోపాటు రోగులు, సందర్శకుల కోసం 5 స్టార్‌, 3 స్టార్‌ హోటళ్ల వంటివి నెలకొల్పుతాననడంతో సీఆర్డీయే దానికి మొత్తం 150 ఎకరాలను కేటాయించింది. ఇందులోని 50 ఎకరాలను తొలి దశగా అప్పగించింది. మిగిలిన 100 ఎకరాలను తర్వాత ఇవ్వనుంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగి 13 నెలలు పూర్తయినా ఇంతవరకూ నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదు. వాటిని వెంటనే చేపట్టాల్సిందిగా తాను ఎప్పటికప్పుడు చేస్తున్న హెచ్చరికలతో ఫలితం లేకపోవడంతో సీఆర్డీయే మరోసారి ఆ సంస్థకు నోటీసులిచ్చినట్లు తెలిసింది. మరి ఈసారైనా ప్రయోజనం ఉంటుందో, లేదో చూడాలి.
Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:
ఇండో- యూకే హెల్త్‌ సిటీ’కి సీఆర్డీయే నోటీసులు?
21-09-2018 08:53:40
 
636731168178334082.jpg
అమరావతి: అమరావతిని వైద్య, ఆరోగ్య రంగాల్లో అగ్రస్థానంలో నిలపడంలో ఎంతైనా దోహదపడ గలదని ఆశించిన ‘ఇండో- యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెడిసిటీ ప్రాజెక్ట్‌’ యాజమాన్యానికి ఏపీసీఆర్డీయే నోటీసులు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సంస్థకు తాను కేటాయించిన మొత్తం 150 ఎకరాల్లోని 50 ఎకరాల్లో తొలిదశ పనులను ఎంతకీ ప్రారంభించకపోవడం ఇందుకు కారణం. గతేడాది ఆగస్టులో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో దీనికి శంకుస్థాపన జరగ్గా, ఇంతవరకూ పనులు మొదలవలేదు. ఒప్పందం ప్రకారం ఈ పనులు సుమారు 9, 10 నెలల క్రితమే మొదలవ్వాల్సి ఉండగా అలా జరగకపోవడంతో ఇంతకుముందు కూడా సీఆర్డీయే సదరు యాజమా న్యానికి నోటీసులు ఇచ్చిందని, ఇప్పుడు పంపినవి మరోవిడతవి అని సమాచారం.
 
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనదిగా పేరొందిన లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ హాస్పిటల్‌తో కలసి మన రాజధానిలో దీనిని స్థాపించేందుకు ఇండో- యూకే హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ముందుకు వచ్చింది. అత్యాధునిక 1,000 పడకల ఆస్పత్రి, వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, పారామెడిక్‌ ట్రైనింగ్‌ స్కూల్‌, అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్స- పునరావాస కేంద్రం, ఐబీఎం ఆసియా డేటా అనలిటిక్స్‌ సెంటర్‌, ఇంప్లాంట్ల తయారీ పరిశ్రమ, స్టెమ్‌ సెల్స్‌ పరిశోధనా కేంద్రంతోపాటు రోగులు, సందర్శకుల కోసం 5 స్టార్‌, 3 స్టార్‌ హోటళ్ల వంటివి నెలకొల్పుతాననడంతో సీఆర్డీయే దానికి మొత్తం 150 ఎకరాలను కేటాయించింది. ఇందులోని 50 ఎకరాలను తొలి దశగా అప్పగించింది. మిగిలిన 100 ఎకరాలను తర్వాత ఇవ్వనుంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగి 13 నెలలు పూర్తయినా ఇంతవరకూ నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదు. వాటిని వెంటనే చేపట్టాల్సిందిగా తాను ఎప్పటికప్పుడు చేస్తున్న హెచ్చరికలతో ఫలితం లేకపోవడంతో సీఆర్డీయే మరోసారి ఆ సంస్థకు నోటీసులిచ్చినట్లు తెలిసింది. మరి ఈసారైనా ప్రయోజనం ఉంటుందో, లేదో చూడాలి.

Akkada mostly Central Govt ye yedo voka roopamlo addu padintundi. No doubt at all 

Link to comment
Share on other sites

అమరావతిలో భారీ ఇండస్ట్రియల్ పార్క్!
22-09-2018 09:37:41
 
636732058590605043.jpg
  • భారీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు యోచన
  • 1500 ఎకరాల్లో కాలుష్యరహిత పరిశ్రమలు
  • 2038 కల్లా 8 లక్షల ఉద్యోగాలు
  • 1.20 లక్షల కోట్ల ఆదాయమే లక్ష్యం
  • కీలక రంగాల కంపెనీలపై సీఆర్డీయే దృష్టి
  • ఆసక్తి వ్యక్తీకరణ నోటిషికేషన్‌ జారీ
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భారీ సమీకృత పారిశ్రామిక వాడ (ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ పార్కు) ఏర్పాటు చేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. పుష్కలంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు భవిష్యత్తులో అమరావతిని జాతీయ ఆర్థిక కేంద్రంగా మలచడం ఈ పార్కు ఉద్దేశం. ఇందులో కాలుష్యరహితంగా, పర్యావరణ హితంగా ఆధునిక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం తొమ్మిది ప్రధాన రంగాలను ఎంపిక చేశారు. అమరావతి విశిష్టతలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఈ పార్కు అభివృద్ధికి ఉపకరిస్తాయని సీఆర్డీయే అంచనా వేస్తోంది. ఈ బృహత్తర ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేస్తారు. 2038నాటికి 1500 ఎకరాలకు విస్తరించి.. వచ్చే 25 ఏళ్లలో మొత్తం 7 లక్షల నుంచి 8 లక్షల వరకూ ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, తద్వారా రూ.1.20 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చునని సీఆర్డీయే భావిస్తోంది. అందుకే ప్రపంచస్థాయిలో పేరొందిన నిపుణులను సైతం ఆకర్షించగలిగే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
 
ఇవీ లక్ష్యాలు..!
ఈ పార్కును స్థాపించడంలో తనతో కలిసి పనిచేసే వ్యూహాత్మక భాగస్వామిని ఎంపిక చేసుకొనేందుకు త్వరలో బిడ్లను ఆహ్వానించబోతుంది. అయితే బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌ను, అందులో పొందుపరచాల్సిన నియమ నిబంధనలను ఖరారు చేసేందుకు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ‘ఆసక్తి వ్యక్తీకరణ’(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌-ఈవోఐ)లను కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో ఇలాంటి భారీ పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణలో అనుభవం, నైపుణ్యమున్న సంస్థల నుంచి ఈవోఐ కోరింది. మార్కెట్‌ పరిస్థితులను ఆకళింపు చేసుకొని, ఆశించిన స్థాయిలో పార్కు ఏర్పాటుకు దోహద పడే సలహాలివ్వడానికి, అభిప్రాయాలు తెలియజేయడానికి వచ్చే నెల 8వ తేదీ వరకూ గడువిచ్చింది.
 
 
వీటికి ప్రాధాన్యం
పర్యావరణానికి హాని చేయని ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌, దుస్తుల తయారీ, పర్యాటకం, ఉన్నత విద్య, హెల్త్‌కేర్‌, హై ఎండ్‌ సర్వీసెస్‌(ఐటీ, ఆర్‌అండ్‌డీ తదితర), హైటెక్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌తోపాటు ప్రభుత్వ వ్యవస్థలు ఇందులో ఏర్పాటవుతాయి. వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణాన్ని కల్పించడం, ఆరోగ్యం-ఆనందాలకు నెలవుగా పార్కును తీర్చిదిద్దితే లక్ష్య సాధన సులువేనని విశ్వసిస్తున్నారు. తొలిదశలో భాగంగా రానున్న మూడేళ్లలో 300-500 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేస్తారు. ఫలితంగా 15వేల నుంచి 20 వేల వరకూ ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఇది పూర్తయిన తర్వాత దశలవారీగా 2038కల్లా 1500 ఎకరాల్లో పార్కును విస్తరిస్తారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...