Jump to content

Amaravati


Recommended Posts

చంద్రబాబు ముంబైలో ఎవరెవరిని కలవబోతున్నారంటే...
26-08-2018 22:07:42
 
636709180601701456.jpg
అమరావతి క్యాపిటల్ బాండ్లను ముంబయ్ స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టింగ్ చేసేందుకు వెల్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పనిలో పనిగా ముంబాయిలో అనేక వ్యాపార దిగ్గజాలను కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేయడంతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించనున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో లంచ్ మీట్‌లో పాల్గొననున్నారు.
 
 
అమరావతి క్యాపిటల్ బాండ్లకు బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లోని ఎలక్ర్టానిక్ బిడ్డింగ్ ఫ్లాట్ ఫాంలో అపూర్వ ఆదరణ లభించడం, ఒకటిన్నర రెట్లు అధికంగా బాండ్లు ట్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ బాండ్లను బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో సోమవారం లిస్టింగ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత పదిన్నరకు చంద్రబాబు టాటా హౌస్‌కు వెళ్లి రతన్ టాటా, ఎన్.చంద్రశేఖరన్‌తో చర్చలు జరపుతారు. తర్వాత తాజ్ హోటల్‌కు చేరుకుని వ్యాపార వేత్తలతో ఒంటి గంట వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ర్టంలోని ఇతర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన అవకాశాల గురించి చర్చిస్తారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన అవకాశాలపై సియం పవర్ పాయింగ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
 
 
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ముఖ్యమంత్రి రిలయన్స్ ఇండ్రస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ర్టీస్ సీఈవో ప్రసాద్‌తో చర్చలు జరపనున్నారు. రాష్ర్టంలో రిలయన్స్ ఇండస్ర్టీస్ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై ఆయన చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి గోద్రెజ్ ఇండ్రస్ర్టీ ఛైర్మన్ నదీర్ గోద్రెజ్, మహీంద్రా, వరల్డ్ సిటీ డెవలపర్స్ సీఈవో సంగీత్ ప్రసాద్‌తోనూ, జి స్క్వేర్ గ్రూప్ అధినేత బాలన్, ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా, వెల్ స్పన్ గ్రూప్ అధినేత బి.కె. గోయంకా, పిరమల్ గ్రూప్ అధిపతి వికాస్ దీప్ గుప్తా, లోధా గ్రూప్ అధినేత మంగల్ ప్రభాత్ లోధా, ఎస్సెల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర, గ్రీజ్ కాటన్ లిమిటెడ్ సీఈవో నగేష్, రహేజా గ్రూప్ ఛైర్మన్ నీల్ రహేజా, టాటా ఇంటర్నేషనల్ యండి నోయల్ టాటా, హల్దియా పెట్రో కెమికల్స్ అధినేత పూర్ణేందు చటర్జీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటల వరకు వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై రాత్రికి ముంబాయి నుంచి బయలుదేరి అమరావతికి చేరుకోనున్నారు.
 
 
చంద్రబాబుతో రౌండ్ లేబుల్ సమావేశంలో ముంబాయ్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొని ఏపీలో ఉన్న వ్యాపార అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాల పై చర్చించనున్నారు. చంద్రబాబు ముంబాయి పర్యటనలో అనేకమంది పారిశ్రామిక దిగ్గజాలను కలుసుకుండుండటంతో ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ర్టం నుంచి పరిశ్రమల శాఖ, ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు, సి.ఆర్.డి.ఎ అధికారులు ముంబాయి బయలుదేరి వెళ్లారు.
Link to comment
Share on other sites

నవ్యాంధ్ర చరిత్రలో మరో కీలక అడుగు..
27-08-2018 09:18:04
 
636709582853017380.jpg
 
అమరావతి బాండ్ల క్రయ విక్రయాల ప్రస్థానంలో మరో కీలక అడుగు పడనుంది. రాజధాని బాండ్లకు రికార్డు స్థాయి డిమాండ్‌ను, భారీ నిధులు సాధించిన నవ్యాంధ్రప్రదేశ్.. ఈ బాండ్లను మరి కాసేపట్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టింగ్ చేయనుంది. ఆర్థిక రాజధాని ముంబైలో కోలాహలంగా సాగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు.
 
అమరావతి బాండ్ల లిస్టింగ్‌ ప్రక్రియ సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టుకోనుంది. ఈ కార్యక్రమం కోసం జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీలను ఆహ్వానించారు. అమరావతి బాండ్లు-2018 పేరిట ప్రతిష్ఠాత్మకంగా సాగే ఈ కార్యక్రమం వేదికగా, ఆ తరువాత రోజంతా ఈ కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస చర్చలు సాగించనున్నారు. రాష్ట్రానికి వారిని ఆహ్వానించడం ద్వారా భారీ పెట్టుబడులను రప్పించి, ప్రగతికి బాటలు పరచడమే లక్ష్యంగా టాటా, అంబానీ, బిర్లా మొదలు గోద్రెజ్‌, మహీంద్రా, గోయెంకా, లోథాల వరకూ ఎందరెందరో ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు.
 
ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగాను చంద్రబాబు హైదరాబాద్‌ మీదుగా ఆదివారం రాత్రి 11 గంటలకు ముంబై చేరుకున్నారు. సోమవారం ఉదయం బీఎస్‌ఈకి చేరుకుంటారు. అక్కడి ప్రఖ్యాత బుల్‌ కాంస్య విగ్రహం వద్ద ఉండే సంప్రదాయసిద్ధ గంటను 9.05 గంటలకు మోగించడం ద్వారా ఆ రోజు ట్రేడింగ్‌ను లాంఛనప్రాయంగా ప్రారంభిస్తారు. అనంతరం బీఎస్ ఈ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ హాలులో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ మధ్యలో బీఎస్‌ఈ సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌, ఏపీసీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ మాట్లాడతారు. లిస్టింగ్‌ సందర్భంగా తన ప్రసంగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కొంతసేపు విలేకరులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత అంటే దాదాపు 10.15 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పలు పేరొందిన సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులతో సీఎం ఎడతెరిపి లేకుండా చర్చల్లో పాల్గొంటారు. లైవ్ మీకోసం చూడండి...
Link to comment
Share on other sites

Amaravati bonds to be listed today

 
TNN | Updated: Aug 27, 2018, 00:04 IST
 
 
 
Vijayawada: Chief minister N Chandrababu Naidu will attend the listing of Amaravati bonds at the BSE on Monday.
 

Naidu is scheduled to address the invitees at 9.25 a.m. Bombay Stock Exchange managing director and CEO Ashishkumar Chauhan will meet the chief minister, officials said. Naidu will visit the Tata Experience Centre and interact with former chairman of Tata Sons, Ratan Tata, and chairman N Chandrasekharan. Later, the CM will attend a round-table conference with business leaders at the Taj Mahal Palace hotel. He will also attend a luncheon with Reliance Industries chairman Mukesh Ambani and CEO PMS Prasad.
 
 
 

The CM will also meet Nadir Godrej, chairman and MD of Godrej Industries. Later, he will meet industrial giants including Kumar Mangalam Birla, BK Goenka, Vikasdeep Gupta, Mangal Prabhat Lodha, and Subhash Chandra.
 
Link to comment
Share on other sites

సెరిమోనియల్‌ బెల్‌ మోగించి లిస్టింగ్‌ను ప్రారంభించిన చంద్రబాబు
27-08-2018 09:49:54
 
636709642086637821.jpg
 
ముంబై: అమరావతి బాండ్ల క్రయ విక్రయాల ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని బాండ్లకు రికార్డు స్థాయి డిమాండ్‌ను, భారీ నిధులు సాధించిన నవ్యాంధ్రప్రదేశ్ ఈ బాండ్లను బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టింగ్ చేసింది. ఆర్థిక రాజధాని ముంబైలో కోలాహలంగా సాగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం సెరిమోనియల్‌ బెల్‌ మోగించి లిస్టింగ్‌ను ప్రారంభించారు. బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌తో కలిసి...లిస్టింగ్‌ను ప్రారంభించారు. బీఎస్‌ఈలోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ హాలులో లిస్టింగ్‌ కార్యక్రమం జరిగింది. రాజధాని నిర్మాణానికి నిధుల కోసం బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ చేయడం జరిగింది.
 
ఈనెల 14న బీఎస్‌ఈ బిడ్డింగ్‌లో అమరావతి బాండ్లకు రూ. 2వేల కోట్ల నిధులు సమకూరిన విషయం తెలిసిందే. 1.53 శాతం అమరావతి బాండ్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. మరో మూడు, నాలుగు నెలల్లో... రిటైల్‌ బాండ్లు విడుదల చేసే యోచనలో సీఆర్డీఏ ఉంది. అమరావతి బాండ్ల కాలపరిమితి పదేళ్లు. ఐదేళ్ల వరకు సీఆర్డీఏ వడ్డీచెల్లించనుంది. ఐదేళ్ల తర్వాత వడ్డీ, అసలు కలిపి చెల్లింపులు జరపనుంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend
58 minutes ago, Saichandra said:

:terrific: 

 

Clear ga ap crda youtube lo till 21-aug-2018 ani rasindhi e page run cheseodu 27 ani veyyatam ento , 1 week matter ah kaadha ani kaadhu ella pani teeru ila vundhi 

 

Link to comment
Share on other sites

చంద్రబాబు అమరావతిని పరుగులు పెట్టించబోతున్నారా?
27-08-2018 21:39:07
 
636710027482778866.jpg
నవ్యాంధ్రకు అమరావతిని ఓ అస్త్రంగా మార్చుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజారాజధానిగా అవకాశాల గనిగా అమరావతి ప్రజల ముందుకు రావడాని కన్నా ముందుగానే పెట్టుబడుల స్వర్గంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారా? కేంద్రం నుంచి సహకారం లేకపోయినా విభిన్న మార్గాలతో నిధులు సేకరిస్తూ రాజధానిని పరుగులు పెట్టించబోతున్నారా?. రాజధాని బాండ్లు, అనుబంధాలు ఏపీని ఎలా నడిపించబోతున్నాయి?. 
 
 
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి మహానగరాలు ఉన్నాయి. ఉపాధి కోసం ఏపీ యువత ఆ రాష్ట్రాలకు తరలిపోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్ చుట్టుపక్కల సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించిన నేతగా చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించారు. అలాంటి మహానగరాన్ని నిర్మించాలని తలపెట్టారు. ఆయన ఆలోచనల్లోనుంచి పుట్టిన నగరం అమరావతి. రాజధాని అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఉంటే చాలు అని ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు. కానీ చంద్రబాబు ఆలోచన అంతకుమించి ఉంటుంది.
 
రాజధాని అంటే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గనిగా ఉండాలని సంకల్పించారు. ఆ ప్రయత్నంలో రైతులు సంపూర్ణంగా సహకరించారు. కానీ అడుగడుగునా నిధుల అడ్డంకులు ఢిల్లీని మించిన రాజధాని అన్న ప్రధానమంత్రి 1500 కోట్లతో సరిపెట్టారు. కానీ చంద్రబాబు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన పాలనా అనుభవాన్నంతా ఉపయోగించి అమరావతి కోసం నిధులు సేకరిస్తున్నారు. ఎక్కడా నిర్మాణాల్లో వేగం తగ్గనీయడం లేదు.
 
 
మూడేళ్ల కిందట అమరావతిని రాజధానిగా గుర్తించినప్పటికీ ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయింది. రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్లు శరవేగంగా నిర్మాణం అవుతున్నాయి. ఇక రెండు ప్రతిష్టాత్మక ప్రైవేటు యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లు నిర్మాణం పూర్తి చేశాయి. క్లాసులు కూడా ప్రారంభిచారు. మరికొన్ని జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు పనులు ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నాయి.
 
పరిపాలనా నగరం నిర్మాణం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తోంది. ప్రపంచ బ్యాంక్ రుణం పెడింగ్‌లో ఉండటంతో ఇప్పటి వరకూ ముందడుగు పడలేదు. కానీ ఇప్పుడు బాండ్ల అమ్మకం ద్వారా పది వేల కోట్ల రూపాయలు సేకరించి రాజధాని నిర్మాణానికి ఉపయోగించబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ - మే కల్లా అంటే ఎన్నికల సమయానికి అటూఇటుగా పాలనా నగరానికి ఓ రూపు తీసుకువాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. నిర్మాణాలు ప్రారంభించడమే మిగిలి ఉంది.
 
 
ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరుగా అమరావతిగా నిలిపే విషయంలో చంద్రబాబు ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నారు. అమరావతిని చూపించే పెట్టుబడులను రాబడుతున్నారు. అదే అమరావతిని చూపించి ప్రపంచాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తున్నారు. అంటే.. ఇంకా పూర్తిగా ఓ రూపు రాని రాజధానిని చంద్రబాబు హాట్ టాపిక్ చేస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు. విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో అమరావతి నిలబడాలంటే కచ్చితంగా పెట్టుబడుల వరద పారాలి. కానీ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులు రావాలంటే అంతకు మించిన మౌలిక సదుపాయాలు కల్పించాలి. అవేమీ ఇంకా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోకపోయినా సీఎం అందరికీ అమరావతి అభివృద్ధిపై నమ్మకం పెట్టుకునేలా చేస్తున్నారు.
 
 
వచ్చే ఆరు నెలల్లో అమరావతి రూపు రేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. బాండ్ల అమ్మకంతో వస్తున్న నిధులతో ఇక నుంచి నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. ఇప్పటి వరకూ పేపర్ సాగిన ప్రణాళికలన్నీ ఇక నిర్మాణాల పరంగా కనిపించున్నాయి. ఒక్కసారి నిర్మాణాలు ప్రారంభమైతే అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే. ఒకప్పుడు హైదరాబాద్‌కు దూరంగా గుట్టల్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు అందరూ అదంతా ఎప్పుడు అభివృద్ధి చెందాలని తీసి పడేశారు. కానీ ఇప్పుడు అదే హైటెక్ సిటీ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం వరకూ ఆ అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నవారు ఉన్నారు. ఈ అభివృద్ధే ప్రజలకు అమరావతి అంటే ఓ సెంటిమెంట్‌గా మార్చింది.
 
 
ప్రస్తుతం అమరావతి అంటే ఆంధ్రుల సెంటిమంట్. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రత్యక్షగా చూసే అవకాశం ఆ చుట్టుపక్కల ఉన్న వారికే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే అక్కడ పెరుగుతున్న విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏపీలో ఉన్న పదమూడు జిల్లాల ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రారంభమయింది. ఇది ప్రారంభమే వచ్చే ఆరు నెలల్లో భవిష్యత్‌లో అమరావతి ఎలా ఉంటుందో తెలిసేలా అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. మన అమరావతి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా గర్వంగా చెప్పుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని ప్రభుత్వ వర్గాలు ధీమాతో ఉన్నాయి.
 
 
Tags : ap cm chandrababu, Amaravati, World Class capital
Link to comment
Share on other sites

అమరావతి ‘బాండ్‌ బాజా’
28-08-2018 01:11:11
 
636710154720405252.jpg
  • గంట మోగించి లిస్టింగ్‌ ప్రారంభించిన సీఎం
అమరావతి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి ఉద్దేశించిన అమరావతి బాండ్ల లిస్టింగ్‌ ముఖ్యమంత్రి చేతులమీదుగా ఘనంగా జరిగింది. సోమవారం ముంబైలోని బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో ఉదయం సరిగ్గా 9.15 గంటలకు ‘సెరిమోనియల్‌ బెల్‌ (ట్రేడింగ్‌ ప్రారంభసూచికగా మోగించే గంట)’ను మోగించడం ద్వారా సీఎం ఈ ప్రక్రియను లాంఛనప్రాయంగా నిర్వహించారు. బీఎస్‌ఈలోని సర్‌ దిన్‌షా పెటిట్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ హాలులో కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీఎస్‌ఈ సీఈవో-ఎండీ ఆశిష్ కుమార్‌ చౌహాన్‌, పలువురు వ్యాపార, పారిశ్రామిక, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ దిగ్గజాలు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏపీఈడీబీ సీఈవో జె.కృష్ణకిశోర్‌ తదితర పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాండ్ల లిస్టింగ్‌ ద్వారా... వీటిని కొనుగోలు చేసిన సంస్థాగత ఇన్వెస్టర్లు వాటిని మరొకరికి విక్రయించుకోవచ్చు.
 
అమరావతి నిర్మాణానికి అవసరమైన మరిన్ని నిధుల సేకరణకు త్వరలోనే లండన్‌, సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లోనూ బాండ్లను విక్రయించాలని సీఆర్డీఏ భావిస్తోంది. అలాగే... దేశంలో సాధారణ ప్రజలూ వీటిని కొనుగోలు చేసేలా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వీటి లిస్టింగ్‌ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఈ సందర్భాన్ని వినియోగించుకుని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని రతన్‌టాటా, ముఖేశ్‌ అంబానీ, కుమారమంగళం బిర్లా వంటి పారిశ్రామికవేత్తలను కోరేందుకు ఈ అవకాశాన్ని ఆయన వినియోగించుకున్నారు.
 
ఆదివారం రాత్రే ముంబై చేరుకున్న చంద్రబాబు.. సోమవారం ఉదయం 8.45కి బీఎ్‌సఈకి చేరుకున్నారు. పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ బీఎ్‌సఈలోకి ప్రవేశించిన ఆయన.. అందులోని ‘బుల్‌’ వద్ద ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత ఇతర ప్రముఖులతో కలసి వేదికపై ఆశీనులయ్యారు. సరిగ్గా 9.15కి ‘గంట’ను మోగించడం ద్వారా అమరావతి బాండ్ల లిస్టింగ్‌ను ప్రారంభించారు. ఆయన 12 సార్లు గంట మోగించగా.. యనమల, నారాయణ చెరోమూడు సార్లు మోగించారు.
 
 
అద్భుతం.. అమరావతి నిర్మాణం: బీఎస్‌ఈ సీఈవో
బీఎస్‌ఈ కాఫీ టేబుల్‌ బుక్‌ను చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులకు సీఈవో చౌహాన్‌ అందజేశారు. స్వాతంత్య్ర దినానికి ఒక రోజు ముందు అమరావతి బాండ్లు ఒకటిన్నర రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అవడం, ఇప్పుడు రాఖీ పండుగ తర్వాతి రోజు లిస్టింగ్‌ కావడం శుభసూచకమని చౌహాన్‌ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే ముందున్న ఏపీ, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ దూసుకుపోతోందని, అమరావతి నిర్మాణం కోసం బాండ్ల జారీ భేషైన నిర్ణయమన్నారు.
 
సీఎంపై నమ్మకంతోనే బాండ్ల బిడ్డింగ్‌ ఇంతగా విజయవంతమైందని అజయ్‌ జైన్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ నగరంలో రూ.28 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, మరో రూ.28 వేల కోట్ల విలువైన పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి విశిష్టతలను కళ్లకు కట్టే వీడియో చిత్రాన్ని ప్రదర్శించారు. ఆశిష్ కుమార్‌ సీఎంకు, మంత్రులు, అధికారులకు మెమొంటోలను అందజేశారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...