Jump to content

Amaravati


Recommended Posts

1 minute ago, mahesh1987 said:

enti oka maadhiri varshanike roads anni munigipoyay

nandigaama-tiruvuru lo padinattu padithe ika anthey sangathulu

Amaravathi Mandal-115mm

Tadepalli-65mm

Roads Anni kadhuu.. Oka sapta dagara munigindhi.. sapta lu 30 years back kattinavi.. pakkana height lo inkokati build chesi vaagu width penchithe saripothundhi..

Note:Vaagulu wide panulu Inka modhalu pettaledhu

Link to comment
Share on other sites

Jareebu lands ki regada (metta) lands ki oka difference vundhi..

Jareebu lands lo entha Varsham padini water inkipothai.. 

But Regada lands lo ala kadhuu.. oka limit varke inkutai remaining polallo nilva vuntai (AVG rainfall )

 

Pedha parimi, neerukonda side pade varshala water Anni capital region loke vasthai.. first Vaagulu Ippudu vunna dhanikante double wide cheyyali..

Edited by Raaz@NBK
Link to comment
Share on other sites

ఆ బాండ్లు లాభదాయకమే
21-08-2018 04:00:31
 
636704208330052481.jpg
 
  • గ్యారెంటీ కింద భూముల తాకట్టు అక్కర్లేదు
  • బాండ్లలో బ్లాక్‌మనీ ఎలా పెడతారు?
  • మీరు 10ు వడ్డీకి ఇప్పిస్తే.. అరేంజ్‌ ఫీ ఇస్తాం
  • ప్రతిపక్షం, ఐవైఆర్‌కు కుటుంబరావు సవాల్‌
 
అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): అమరావతి బాండ్ల ద్వారా నిధులు సేకరణ ప్రభుత్వానికి ముమ్మాటికీ లాభదాయకమేనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలూ ఇలాగే బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకుంటున్నాయని తెలిపారు. ఇప్పుడు తాము తెచ్చిన దాని కన్నా తక్కువ వడ్డీరేటుకు అంటే 10 శాతానికి ఇప్పిస్తే అరేంజ్‌ ఫీ ఇప్పిస్తామని ప్రతిపక్ష నేతలకు, మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుకు, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సోమవారం సచివాలయంలో కుటుంబరావు విలేకరులతో మాట్లాడారు. ‘ప్రతిపక్షం చేసే ఆరోపణల్లో నిజం లేదు. కొన్ని పత్రికల రాతలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. కొంత మంది రిటైర్డ్‌ అధికారులు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.1,500 కోట్లే ఇచ్చింది. ప్రపంచబ్యాంకు రుణం మంజూరు ఆలస్యం చేస్తోంది.
 
ఈ నేపథ్యంలో పనులు ఆగకుండా.. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో సీఆర్డీఏ నిధులు సేకరిస్తోంది. సంస్థ ఆదాయ మార్గాలు, వడ్డీ, అసలు చెల్లింపుల సామర్థ్యం వంటి పలు అంశాల ఆధారంగా వడ్డీరేటు నిర్ణయిస్తారు. ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ అయితే ఒక రేటు, డబుల్‌ ఏ రేటింగ్‌ అయితే ఒక రేటు ఉంటుంది. మనకు ఏ ప్లస్‌ రేటింగ్‌ వచ్చింది. ఈ రేటింగ్‌కు ఈ రోజు వడ్డీరేటు 10.48 శాతంగా ఉంది. మనం చెల్లించేది 10.32 శాతమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరఽథ ప్రాజెక్టు నిధులకు 10.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తోంది. దేశంలోని పలు ప్రభుత్వాలు ఈ విధంగా బాండ్లు విడుదల చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌, జీహెచ్‌ఎంసీ వంటివి కూడా బాండ్ల ద్వారా రుణం తీసుకున్నాయి. యూపీ బాండ్లకు ప్రభుత్వ సబ్సిడీలను కూడా సెక్యూరిటీగా పెట్టారు.
 
చెక్‌బౌన్స్‌ అయితే రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే విధంగా నిబంధనలు విధించారు. మనకు అటువంటి నిబంధనలు ఏమీ లేవు. సాధారణంగా బ్యాంకులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంతోపాటు భూములు కూడా తాకట్టు పెట్టాలి. అమరావతి బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీ మాత్రమే ఇస్తోంది. భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. బాండ్ల జారీలో సీఆర్డీఏ ఎటువంటి తప్పూ చేయలేదు. అప్పు చేయకుండా కేంద్రంలో కూడా ఏ పనులూ జరగవు. జాతీయ రహదారుల నిర్మాణానికి అప్పు తీసుకుంది. ప్రపంచబ్యాంకు వడ్డీ 4 శాతమేనని చెబుతారు. వాస్తవానికి దానికి ఎక్కువ ఖర్చవుతుంది. ఇబ్బందులు కూడా ఎక్కువే. ప్రపంచ బ్యాంకు వద్ద రుణం తీసుకుంటే గ్యారెంటీ ఇచ్చినందుకు కేంద్రానికి రెండు శాతం అదనంగా చెల్లించాలి. విదేశీ కరెన్సీ విలువ పెరిగితే దానిని రాష్ట్రమే భరించాలి. ఈ విధంగా ఎక్కువ ఖర్చులవుతాయి’ అని వివరించారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ.3,253 కోట్లు రుణం ఇస్తే.. కేంద్రం రూ.1,394 కోట్లు సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి నిరోధకులు ఫిర్యాదు చేయడంతో ఆ రుణాన్ని ప్రపంచ బ్యాంకు ఇంత వరకు విడుదల చేయలేదని గుర్తుచేశారు.
 
కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో నుంచి రుణం తీసుకుంటే ఏడాదికైతే 10.15 శాతం, రెండేళ్లకైతే 10.25 శాతం, మూడేళ్లకైతే 10.3 శాతం వడ్డీరేటు చెల్లించాలని తెలిపారు. అమరావతి బాండ్లకు మనం చెల్లించేది 10.32 శాతం వడ్డీయేనని చెప్పారు. రూ.2 వేల కోట్ల విలువైన ఈ బాండ్లకు పదేళ్లలో చెల్లించే వడ్డీ రూ.1,573 కోట్లేనని.. ఐదేళ్ల వరకే వడ్డీ చెల్లిస్తామని, ఆ తర్వాత వడ్డీతోపాటు ఏడాదికి 20 శాతం చొప్పున అసలు కూడా చెల్లిస్తామని, ఆ విధంగా వడ్డీ చెల్లింపు ఏటా తగ్గుతూ ఉంటుందన్నారు.
 
‘పన్ను రహిత బాండ్లకు కేంద్రం నో’
2015 నుంచి పన్ను రహిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల కోసం ప్రయత్నిస్తున్నాం. కేంద్రం అనుమతించలేదు. అన్ని రకాలుగా ఆలోచన చేసే సీఆర్డీఏ ఈ బాండ్లు విడుదల చేసింది. ఇందులో పెట్టుబడిపెట్టే వారిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌మనీ అని అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. బ్లాక్‌మనీని బాండ్లలో పెట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఈ నెల 27న బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో పెట్టుబడి పెట్టినవారి అందరి పేర్లు ఉంటాయి. అందరూ చూడవచ్చు. అరేంజ్‌ ఫీ 0.85 శాతం ఇస్తున్నామని చేస్తున్న ఆరోపణల్లో కూడా వాస్తవం లేదు. దీనికి సంబంధించి టెండర్ల ప్రాసెసింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. సెబీలో టాప్‌ 20 రిజిస్టర్‌ మర్కెంటైల్‌ బ్యాంకులకు పంపాం. 16 బ్యాంకులు టెండర్‌ ప్రక్రియకు హాజరయ్యాయి. గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ 1.5 శాతం, కృష్ణా బోర్డు 1.6 శాతం అరేంజ్‌ ఫీ చెల్లిస్తే మనం 0.85 శాతమే ఇచ్చాం’ అని కుటుంబరావు తెలిపారు. అమరావతి బాండ్ల ద్వారా సేకరించిన నిధులను సీఆర్డీఏ పరిధిలో అంటే అమరావతి అభివృద్ధికి రోడ్లు, ఎలక్ర్టిసిటీ, డ్రైనేజీ.. వంటి వాటికి వినియోగించుకోవచ్చన్నారు.
 
 
సీఎంకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ సత్కారం
బ్రాహ్మణ కార్పొరేషన్‌ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా సంస్థ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య ఆధ్వర్యంలో సోమవారం చంద్రబాబును ఘనంగా సత్కరించారు. పేద బ్రాహ్మణులకు చేయూతనిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాల్లో భాగంగా కర్నూలు, కడప, మదనపల్లి, మచిలీపట్నం, కాకినాడ తదితర ప్రాంతాల్లో బాబు కటౌట్లకు పాలాభిషేకం చేశారు.
Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Roads Anni kadhuu.. Oka sapta dagara munigindhi.. sapta lu 30 years back kattinavi.. pakkana height lo inkokati build chesi vaagu width penchithe saripothundhi..

Note:Vaagulu wide panulu Inka modhalu pettaledhu

Seed access road mungipoindi gaa ekkado paper lo vesad

Link to comment
Share on other sites

4 minutes ago, mahesh1987 said:

Seed access road mungipoindi gaa ekkado paper lo vesad

Seed access road Ela munuguddhi bro..  almost normal ground kante 3 feets height lo vesaru aa road.. that too Jareebu lands side vuntadhi.. 

Dondapadu metta land side vuntadhi...

Adhi Internal road ayi vuntadhi not seed access road

Link to comment
Share on other sites

33 minutes ago, Raaz@NBK said:

Seed access road Ela munuguddhi bro..  almost normal ground kante 3 feets height lo vesaru aa road.. that too Jareebu lands side vuntadhi.. 

Dondapadu metta land side vuntadhi...

Adhi Internal road ayi vuntadhi not seed access road

Seed access ani vesadu correct gaa gurthu ledu which paper anedi

Link to comment
Share on other sites

గుంటూరు జిల్లా ముసురు ముంపు..
21-08-2018 10:48:54
 
636704453367509112.jpg
  • తెరిపివ్వకుండా కురుస్తున్న వాన
  • గుంటూరులో అధ్వానంగా రోడ్లు
  • నిండుకుండలా కొండవీటి వాగు
  • అమరావతిలో అత్యధికంగా 115.8 మి.మీ.వర్షం
  • బ్యారేజి గేట్లన్నీ ఎత్తివేయడంతో తీరంలో అలజడి
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం కూడా ముసురు వాతావరణం కొనసాగింది. ఎడతెరిపిలేని వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు, డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. బ్యారేజి వద్ద 70 గేట్లు ఎత్తివేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సాగరం దిశగా పరుగులు పెడుతుంది. గుం టూ రు నగరంలో గత కొద్ది రోజు లు గా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా మారా యి. శివారు ప్రాంతాల్లో, విలీన గ్రామాల్లో కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకుంది. ఎడతెరిపి లేకుండా కు రుస్తున్న వర్షాలకు కొండవీటివాగు నిండు కుండలా మారింది. మరో రెండురోజులు వర్షాలు కురిస్తే వాగు పూర్తిస్థాయిలో పొంగే ప్రమాదం ఉందని రైతులు ఆం దోళన చెందుతున్నారు.
 
 
గుంటూరు: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు కూడా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం 57 మండలాల్లో 32.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అమరావతిలో 115.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 30 వేల హెక్టార్లలో వేసిన వెద పద్ధతిలో వరి వాన నీటిలో ఉన్నట్లు వ్యవసాయశాఖ జిల్లా అధికారులు సోమవారం ప్రభుత్వానికి నివేదికలు పంపారు. 2,680 హెక్టార్లలో వరి నారు మళ్లు, 30,031 హెక్టార్లలో వేసిన వెద పద్ధతిలో వరి, 9,382 హెక్టార్లలో వేసిన వరి పంట పొలాల్లో వర్షపు నీరు చేరినట్లు అధికారులు నివేదికలో పొందుపరిచారు. జిల్లాలో వరి నారుమళ్లు 1,359 హెక్టార్లు, 6,004 హెక్టార్లలో వెద పద్ధతిలో వేసిన వరి, 840 హెక్టార్లలో వేసిన వరి నాట్లు మునిగి పోయాయి. 25 హెక్టార్లలో వరి నారుమళ్లు, 2,121 హెక్టార్లలో వెద పద్ధతిలో వేసిన వరి, 800 హెక్టార్లలో వరినాట్లు పూర్తిగా నీటిలో మునిగి పోయాయి. ఈ పంట నష్టపోయేదశకు చేరినట్లు జేడీ విజయభారతి ప్రభుత్వానికి నివేదిక పంపారు. వర్షాలతో పత్తి మొక్కలు, మిరప నారుమళ్లు కుళ్లిపోయేదశకు వచ్చాయి.
 
మిరపనారుకు వేరు కుళ్లు తెగులు సోకినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పొలాల్లో కూడా వరద నీరు వచ్చింది. జిల్లాలో 2- 3 రోజుల పా టు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫగుంటూరులో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు అతలాకుతలం అయ్యారు. పలు ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా మారాయి.
 
శివారు ప్రాంతాల్లో, విలీన గ్రామాల్లో కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకుంది. పైపులైన్‌, యూజీడీ పైప్‌లైన్‌ తవ్వకాలకు వర్షం తోడవడంతో ప్రజలు అనేక రకాలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రోడ్లన్నీ బురద మయంగా మారి ప్రమాద భరితంగా పరిణమించాయి. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాలు చిత్తడిగా మారాయి. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఈ అవస్తలు అంతా ఇంతా కాదు.
ఫవరుసగా కురుస్తున్న వర్షాలకు తోడు కృష్ణా నదిలోకి వరదనీరు చేరటంతో తెనాలి డివిజన్‌లోని మండలాలను అప్రమత్తం చేశారు. వరద పెరిగితే ఏ క్షణంలో అయినా లోతట్టుప్రాంత వాసులను తరలించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నదీతీర మండలాల్లో, తెనాలి ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. దుగ్గిరాల మండలం పెదకొండూరు మొదలుకుని, రేపల్లె మండలం లంకెవానిదిబ్బ వరకు నది, సముద్ర తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. డివిజన్‌లో 4 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిన చేలన్నీ నీటితో నిండాయి. సుమారు లక్ష ఎకరాల్లో వివిధ దశల్లో ఉన్న పంటలు దెబ్బతినే పరి స్థితి ఉందని వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది.
 
కృష్ణానదిలో మునేరు, ఎద్దువాగుతో పాటు పలు వాగుల నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణానదిలో నీటి మట్టం సుమారు 12 అడుగుల వరకు పెరిగింది. అమరావతి మండల పరిధిలోని మునగోడు, నరుకుళ్లపాడు, యండ్రాయి గ్రామాల సమీపంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అమరావతి క్రోసూరు మార్గంలోని ముత్తాయపాలెం సమీపంలోని వాగు లోచప్టాపై నీరు ప్రవహించడముతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తాడేపల్లి మండలంలోని కొండవీటివాగు నిండుకుండలా మారింది. మరో రెండురోజులు వర్షాలు కురిస్తే వాగు పూర్తిస్థాయిలో పొంగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో అరటి, దొండ, పూలతోటలు 80 శాతం మేర నీటమునిగాయి. కుంచనపల్లి, ప్రాతూరు వైపు ఆకుకూరలు నీట మునిగిపోయాయి.
Link to comment
Share on other sites

ఏపీ సచివాలయంలో ఆర్థికశాఖ కీలక భేటీ
21-08-2018 14:30:44
 
 
అమరావతి నిధుల సేకరణపై సచివాలయంలో ఆర్థికశాఖ కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశానికి 10 ప్రధాన బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రుణాలు ఇవ్వడానికి బ్యాంక్లర్లు ముందుకు వచ్చారు. రూ.10 వేల కోట్ల రుణం కోరుతూ సీఆర్డీఏ బ్యాంకర్లకు లేఖలు రాసింది. కాగా ఇప్పటికే రూ.2వేల కోట్ల నిధుల కోసం సీఆర్డీఏ అమరావతి బాండ్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

అమరావతికి 10 వేల కోట్ల రుణం! 
బ్యాంకుల నుంచి సమీకరణకు ఏపీ ప్రభుత్వ యత్నం 
ప్రముఖ బ్యాంకర్లతో  ఆర్థికశాఖ, సీఆర్‌డీఏ సమావేశం 
తక్కువ వడ్డీకి రాబట్టేందుకు   చర్చలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో మౌలిక సౌకర్యాల కల్పనకు ఈ ఏడాది వివిధ బ్యాంకుల నుంచి రూ.10వేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని జాతీయ బ్యాంకులు, ముఖ్య బ్యాంకుల ప్రతినిధులతో వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆర్థికశాఖ, సీఆర్‌డీఏ అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ ఏడాదిలోనే రూ.10వేల కోట్ల రుణం అవసరమని, దీనిపై బ్యాంకులు తమ ఆసక్తి, సంసిద్ధత తెలియజేయాలని కోరారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ప్రత్యేక కమిషనర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్‌బీఐ ఆంధ్రాబ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, ఐఓబీ వంటి ప్రముఖ బ్యాంకుల ప్రతినిధులతో పాటు ఇతర చిన్న బ్యాంకుల ప్రతినిధులూ హాజరయ్యారు. అమరావతిలో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టే మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులన్నీ ఆర్థికంగా ఉపయుక్తమయ్యేవే అని, రుణాలు తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు ఉండబోవని బ్యాంకర్లకు అధికారులు స్పష్టం చేశారు. ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్నారు.

కన్సార్షియం కాకుండా.. అమరావతి పరిధిలో సీఆర్‌డీఏ ఏయే ప్రాజెక్టులు చేపట్టబోతోందో సవివర నివేదికలు సిద్ధం చేశారు. గతంలోలా కన్సార్షియం పద్ధతిలో కాకుండా టైర్‌-1, టైర్‌-2 పద్ధతుల్లో వీటిని విడగొట్టారు. ఎవరెవరు ఏ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారో తెలుసుకునేందుకు సంబంధిత ప్రాజెక్టు నివేదికలను ఆయా బ్యాంకులకు పంపామని అధికారులు తెలియజేశారు. తద్వారా తక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. టైర్‌ పద్ధతి వల్ల ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కొక్కరి నుంచి రుణం సమకూర్చుకోవచ్చన్నారు. ప్రాజెక్టు నివేదికలు పరిశీలించి వచ్చే వారం రోజుల్లోగా బ్యాంకులు తమ సంసిద్ధత, ఆసక్తి, ఏ మేరకు రుణం అందించేదీ తెలియజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ బ్యాంకర్లకు సూచించారు. తాము 8.1శాతం మించి వడ్డీ చెల్లించేందుకు సిద్ధంగా లేమని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ వడ్డీ రేటు విషయంలోనే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణానికి తొలగుతున్న అడ్డంకులు
22-08-2018 18:44:40
 
636705602831022036.jpg
 
ఆంధ్రజ్యోతి: ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఒక్కొక్క అడ్డంకిని అధిగమిస్తోంది. రాజధాని ముంపు ప్రాంతంలో ఉందని, ఆహార భద్రతకు అవరోధం కలుగుతోందని కొందరు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దానికి ఏపీ ప్రభుత్వం చక్కని పరిష్కారం చూపింది.
 
ఏపీ కొత్తరాజధాని అమరావతి ప్రాంతంలో నీరుకొండ, శాఖమూరు, ఐనవోలు, లాం, గోరంట్ల, తాడికొండలో 20వేల ఎకరాల పంట భూములు కొండవీటివాగు ముంపునకు గురయ్యేవి. దీనితో ఈ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే అధికవర్షాలకు వాగుపొంగి జలమయం అవుతుందని కొందరు హరితట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. ముంపు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హరితట్రిబ్యునల్‌ అప్పట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముంపు నివారణకు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా పరిష్కారం చేస్తామని ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందుంచింది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే పరిష్కారం చూపింది.
 
రాజధాని నిర్మాణం కంటే ముందే... కొండవీటి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామన్న ప్రభుత్వం... 237 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పనులు ప్రారంభించింది. ఉండవల్లి సమీపంలో కృష్ణా ప్రవాహానికి విఘాతం కలగకుండా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరి 1న పనులు ప్రారంభమయ్యాయి. ఈఎత్తిపోతల పతకం ట్రయల్‌రన్‌కు సిద్దమౌతోంది. మినీ పట్టిసీమగా భావిస్తున్న ఈప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్మిస్తోంది. 16 పంపులతో ఓక్కోపంపు 350 క్యూసెక్కుల సామర్థ్యంతో... 5వేల క్యూసెక్కుల నీటిని కొండవీటివాగు నుంచి కృష్ణానదిలోకి వదిలే ఏర్పాట్లు చేసింది.
 
కొండవీటి వాగుకు ప్రతీసారి వరద ఉధృతంగా వస్తుందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేశారు. నీటిని పంప్‌ చేసినా ఇంకా అదనంగా వరద వస్తే దానిని రెగ్యులేటర్‌ ద్వారా చెన్నై కాలువకు మళ్లించాలని నిర్ణయించారు. ఈ ఎత్తిపోతల పథకం పూర్తి ఆటోమిషన్‌తో పనిచేస్తుందని చెబుతున్నారు. విద్యుత్‌ సరఫరాను తాడేపల్లి సబ్‌స్టేషన్‌ నుంచి 132 కేవి సామర్థ్యంతో తీసుకుని దానిని 132/11 కేవికి రెండు ట్రాన్స్‌ఫార్మార్లు ఏర్పాటు చేస్తామని మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు చెప్పారు. అప్పటికీ పవర్‌కు ఇబ్బంది తలెత్తితే ఒక పంపు నిరంతరంగా పనిచేసేలా బ్యాకప్‌ ఉంటుందని వెల్లడిస్తున్నారు. కాబట్టి ఇకపై కొండవీటి వాగుతో ముంపు ప్రశ్నేతలెత్తదని వారు ధీమా వ్యక్తం చేశారు. కొండవీటి వాగు రాజధానికి శాపం కాదని.. ఒక వరమని ప్రభుత్వం చెబుతోంది. నీటిని నిల్వచేసేందుకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని నీటి అవసరాలకు కొండవీటి వాగు ఉపకరిస్తోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భవిష్యత్‌ నీటి అవసరాలకు ఈప్రాజెక్ట్‌ ఎంతో ఉపయోగకరమని చెబుతోంది.
 
గతంలోనూ కొండవీటి వాగు ముంపునకు పరిష్కారం చూసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉండవల్లి దగ్గర ఉన్న కొండకు టన్నెల్‌ ఏర్పాటు చేసి కొండ నుంచి వాగును ప్రకాశం బ్యారేజీకి దిగువభాగానికి తరలించాలనే ఆలోచన చేశారు. అయితే అది తర్వాత కార్యరూపం దాల్చలేదు. గ్రీన్‌ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించిన ప్రభుత్వం కొండవీటి వాగు ముంపునకు చక్కటి పరిష్కారం చూపింది. రాజధాని అమరావతికి ఎదురవుతున్న ఒక్కో అవరోధాన్ని అధిగమిస్తోన్న ప్రభుత్వం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం త్వరలో ప్రారంభించనుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...