Jump to content

Amaravati


Recommended Posts

16 hours ago, Vulavacharu said:

Future expansions, railway line and greenary kosam

ORR lo railway line ento bro. too much. nenu roju travel chese road 16 lanes plus lot of space left for emergency traffic on both sides is 75 meters. mere emaina cheppandi, manollu land acquisitions vishayam lo matram over chestunnaru.

 

Screen_Shot_2018-07-08_at_5.36.20_PM.png

 

Link to comment
Share on other sites

రాజధాని రాజసం
అమరావతిలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ప్రముఖ సంస్థలు
వినోద రంగంలో ‘లోథా’
మెట్రో రైలు తయారీకి ఎస్‌ఎంహెచ్‌ రైల్‌ కార్పొరేషన్‌
ఏరో హబ్‌ కేంద్రం ఏర్పాటుకు ఎలి హజాజ్‌ సంస్థ
గృహ నిర్మాణ రంగంలో రాయల్‌ హోల్డింగ్స్‌
బ్యాటరీల తయారీ యూనిట్లకు ఫోర్టెస్కు మెటల్స్‌ ఆసక్తి
అభివృద్ధికి నిధులిచ్చేందుకు ఏఐఐబీ హామీ
సింగపూర్‌లో ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
8ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన ప్రాంతమని పేర్కొన్నాయి. స్థిరాస్తి వ్యాపార సంస్థ ‘లోథా గ్రూపు’, ‘ఎస్‌ఎంహెచ్‌ రైల్‌ కార్పొరేషన్‌ గ్రూపు’లు అమరావతిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా, మరికొన్ని ఆసక్తి కనబరిచాయి. మూడు రోజుల సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆయా సంస్థల ఛైర్మన్లు, ఎండీలు, సీఈవోలు, ముఖ్యప్రతినిధుల బృందాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందుంచారు. మాల్స్‌, ఓపెన్‌స్పేస్‌ వంటి వినోద రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు లోథా సంస్థ ఎండీ, సీఈవో అభిషేక్‌ లోథా ముందుకు వచ్చారు. పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు, ప్రణాళికలతో సెప్టెంబరులో రాష్ట్రానికి వస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అపార అవకాశాలు, అభివృద్ధి తనను ఎంతో ఆకట్టుకున్నాయని అభిషేక్‌ లోథా.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. స్థిరాస్తి అభివృద్ధిదారులతో సంప్రదించి రాజధాని నిర్మాణానికి ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నామని, ప్రపంచ స్థాయి నిర్మాణదారుల భాగస్వామ్యం తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. భారత్‌లో మెట్రో రైలు తయారీ కర్మాగారాలను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామని మలేషియాకు చెందిన ఎస్‌ఎంహెచ్‌ రైల్‌ కార్పొరేషన్‌ గ్రూపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జహ్రీన్‌ జమాన్‌ తెలిపారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ అనువైన ప్రాంతంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రైలు ఇంజిన్ల తయారీ, పాత లోకోమోటివ్‌లను కొత్త యూనిట్లుగా మార్చడం, రైళ్ల చక్రాలు, ఇరుసు, ఎలక్ట్రిక్‌ రైళ్లభాగాల తయారీలో సంస్థకు మంచి పేరుందని వివరించారు. జీఈ, సీమెన్స్‌, హ్యుండాయ్‌ తదితర సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు.

భూమిస్తే ఆరు నెలల్లో ఏరో హబ్‌ కేంద్రం: ఎలి హజాజ్‌ సంస్థ: విమాన విడిభాగాలు తయారు చేసే ఏరో హబ్‌ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఇజ్రాయిల్‌కు చెందిన ఎలి హజాజ్‌ సంస్థ ఎండీ ఓఫర్‌ గ్యాబినెట్‌.. సీఎం చంద్రబాబుకు తెలిపారు. భూమిని ప్రభుత్వం సమకూరిస్తే తొలి దశ ఉత్పత్తిని ఆరు నెలల్లోగా ప్రారంభిస్తామని వెల్లడించారు. 30 నుంచి 40 పరిశ్రమల స్థాపనకు సరిపడా సదుపాయాలు, ఉత్పాదనకు సరిపోయే సాంకేతిక సామర్థ్యం, సానుకూల వాతావరణం ఏర్పరిచే శక్తి తమకుందని వివరించారు. సంస్థకు బెంగళూరులో ఉత్పాదక సదుపాయ యూనిట్‌ ఉందని.. ఇప్పటికే పలు ఆర్డర్లు సొంతం చేసుకున్నామని చెప్పారు. అమరావతి వచ్చి అధికారులను సంప్రదించాలని సీఎం ఆయనకు సూచించారు.

ఏపీతో కలిసి పనిచేస్తాం: ఏఐఐబీ: రహదారులు, నీటి పారుదల, ఇంధన రంగాల్లో ఏపీకి ఆర్థికసాయం అందించేందుకు ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకు(ఏఐఐబీ) ముందుకొచ్చింది. అభివృద్ధి పనులకు అత్యంత వేగంగా నిధులు సమకూరుస్తామని ఆ బ్యాంకు డైరెక్టర్‌ జనరల్‌ పాంగ్‌ యీ ఇయాన్‌.. సీఎం చంద్రబాబుతో చెప్పారు. ఇప్పటికే గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ఏఐఐబీ ప్రతినిధులు ఏపీ బృందంతో కలిసి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో భాగస్వాములమవుతామని చెప్పారు. భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. కెపాసిటీ ఫండింగ్‌ విషయంలో సాయపడాలని ముఖ్యమంత్రి కోరగా..ఆయా ప్రాజెక్టుల వివరాలు అందించాలని పాంగ్‌ అన్నారు. వివిధ ప్రాజెక్టు పనులపై తాను ఎక్కువ సమయం ఏపీలోనే గడుపుతుండటంతో రాష్ట్ర పౌరుడిగానే తనను తాను భావించుకుంటున్నానని అన్నారు. అమరావతిలో అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు సింగపూర్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని...రాజధాని నగర బృహత్తర ప్రణాళిక తయారీలో తాను వ్యక్తిగతంగా పాలుపంచుకున్నానని సీఎం దృష్టికి పాంగ్‌ తీసుకొచ్చారు. ఏపీ గృహనిర్మాణ ప్రాజెక్టులోనూ భాగస్వామ్యమవుతామన్నారు.

8ap-main5b.jpg

అమరావతి నిర్మాణంలో కలిసి పనిచేస్తాం: రాయల్‌ హోల్డింగ్స్‌ సంస్థ: అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆ సంస్థ ప్రతినిధి రాజ్‌కుమార్‌ హీరానందానీ చంద్రబాబుతో చెప్పారు. గృహనిర్మాణం, హెల్త్‌ రిసార్ట్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని వెల్లడించారు.

సింగపూర్‌ రాయబారితో భేటీ: ప్రతి మూడు నెలలకోసారి భారత్‌, సింగపూర్‌ దేశాల మధ్య సంబంధాలతో పాటు వివిధ అంశాలపై సమీక్షిస్తున్నామని సింగపూర్‌ రాయబారి గోపీనాథ్‌ పిళ్లై.. చంద్రబాబుకు వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు ఇది మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు విజయవంతంగా నడిస్తే అది రైతాంగానికి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ దిగుబడుల్లో భారత్‌లో ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఈ రంగంలో దేశం మొత్తం మీద వృద్ధి రేటు అధికంగా ఉన్న రాష్ట్రం తమదేనని చంద్రబాబు వివరించారు.

డస్సాల్ట్‌ 3డీ ప్రయోగశాలను పరిశీలించిన చంద్రబాబు: డస్సాల్ట్‌ థర్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్రయోగశాల ఏర్పాటు అంశంలో చైనా, సియోల్‌, సింగపూర్‌లతో కలిసి పనిచేస్తున్నామని.. ఈ అనుభవంతో అమరావతిలో మరింత మెరుగ్గా పనిచేస్తామని డస్సాల్ట్‌ థర్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్రయోగశాల సీఈవో బెర్నార్డ్‌ ఛార్లెస్‌ అన్నారు. సీఎం చంద్రబాబు ఈ ప్రయోగశాలను సందర్శించారు. డ్రోన్లను ఉపయోగించి సమాచారం, ఛాయాచిత్రాలను సేకరించే వ్యవస్థను, నగర నిఘాలో అత్యాధునిక, ప్రతిభావంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నామని వివరించారు. గాలి వాలును బట్టి అంచనా వేసి నగరంలో ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే సాంకేతికను అభివృద్ధి చేశామని, జల వనరుల సంరక్షణకు, నగరాన్ని ఆకుపచ్చగా ఉంచేందుకు ఈ సాంకేతికత ఎంతో దోహదపడుతుందన్నారు. ఏపీ విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టడంలో సహకరించాలని కోరారు. సెప్టెంబరులో అమరావతికి వచ్చి డిసెంబరు నాటికి అన్ని అంశాలపై ఉపయుక్తమైన నమూనాను సిద్ధం చేస్తామన్నారు. అమరావతిలో ఈ తరహా వ్యవస్థను ప్రవేశపెట్టి గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా మార్చాలని భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. స్మార్ట్‌ నగరాల రూపకలప్పనలో ఈ సాంకేతికను వినియోగించుకుంటామన్నారు.

అగ్రి బిజినెస్‌ బృందంతో భేటీ: జర్మనీకి చెందిన అగ్రి బిజినెస్‌ బృందం చంద్రబాబుతో సమావేశమైంది. చీఫ్‌ కస్టమర్‌ సొల్యూషన్‌ ఆఫీసర్‌ ఐల్విన్‌ టాన్‌ నేతృత్వంలో ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సారథ్యంలో ఈ చర్చలు జరిగాయి. ఏపీఈడీబీతో ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న అగ్రి బిజినెస్‌ సంస్థ పది ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. వీటిపై ఈ సమావేశంలో చర్చించారు.


ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయండి: చంద్రబాబు

ఇనుప ఖనిజం, తీర ప్రాంత సహజవాయు వెలికితీత రంగాల్లో అనుభవం దృష్ట్యా ఏపీలో ఉక్కుకర్మాగారం ఏర్పాటు చేయాలని ఫోర్టెస్కు మెటల్స్‌ సంస్థ దక్షిణాసియా ముఖ్య ప్రతినిధి గౌతమ్‌వర్మను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన ఉక్కు తయారీలో అనుభవం ఉన్న తమ అనుబంధ సంస్థతో సంప్రదిస్తానని తెలిపారు. బ్యాటరీల తయారీ, ఇంధన నిల్వ రంగంతో సహా ఫ్లోటింగ్‌ స్టోరేజ్‌ రీ గ్యాషిఫికేషన్‌కు సంబంధించిన వివిధ యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఇస్రో సహకారంతో లిథియమ్‌ ఇయోన్‌ బ్యాటరీల తయారీ కేంద్రాన్ని భారత్‌లో నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చంద్రబాబుతో చెప్పారు. వన్‌డియమ్‌ బ్యాటరీల తయారీపైన దృష్టిపెట్టామన్నారు. పరిశ్రమలకు భూమి కేటాయించాలని కోరారు. సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఉపక్రమించామని, గ్రిడ్‌ నిర్వహణ ఇప్పుడు తమ ముందున్న సవాల్‌ అని ఇంధన నిల్వ, బ్యాటరీల తయారీకి ప్రాధాన్యతనిస్తున్నామని గౌతమ్‌ వర్మతో అన్నారు.

Link to comment
Share on other sites

ద్భుతాల అమరావతి!
10-07-2018 02:19:05
 
636667859440035794.jpg
  •  ప్రజాకాంక్షకు అనుగుణంగా నిర్మాణం
  •  అందులో మీరూ భాగస్వాములు కండి
  •  రాష్ట్రాన్ని రెండో ఇల్లుగా మార్చుకోండి
  •  అభివృద్ధిలో సింగపూర్‌ మాకు స్ఫూర్తి
  •  విభజన కష్టాలనుంచి బయటపడుతున్నాం
  •  అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తోంది
  •  సింగపూర్‌లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
  •  ఏపీ-సింగపూర్‌ సంస్థల ఉమ్మడి వేదికలో చర్చ
మలేషియా నుంచి విడిపోయిన సింగపూర్‌... విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా సీమాంధ్ర! ఇప్పుడు సింగపూర్‌ ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శం! సింగపూర్‌ అభివృద్ధి పాఠాలే స్ఫూర్తిగా ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని సింగపూర్‌ నిర్మాణ సంస్థలు, కంపెనీలను కోరారు.
 
5-10-15
ప్రజలకు మెరుగైన సేవ పరిపాలన అందించాలని, మరిన్ని సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో రాజధానిలో సరికొత్త విధానాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అక్కడ ‘5-10-15’ అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తున్నామని వివరించారు. ‘‘ అత్యవసర గమ్యాలను చేరుకోవడానికి ఐదు నిమిషాలు, సామాజిక అవసరాలను 10 నిమిషాలు, ఆఫీసులకు చేరుకోవడానికి 15 నిమిషాలు అనే భావనను అమలు చేస్తున్నాం’’ అని తెలిపారు. 
 
 
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో పాల్పంచుకునే అద్భుత అవకాశం అందరికీ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలన్నింటికీ ఆహ్వానం పలికారు. ‘‘జల, హరిత నగరంగా భాసిల్లే అమరావతి ఆరోగ్యకర జీవన విధానానికి చిరునామాగా నిలవబోతోంది. ఇందుకు మీ అందరి సహకారం, సూచనలు అవసరం. సింగపూర్‌లోని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఏపీని రెండో ఇల్లుగా మార్చుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. సింగపూర్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సింగపూర్‌ - ఏపీ ఇండస్ర్టీ నెట్‌వర్కింగ్‌, ప్రపంచ నగరాల ప్లీనరీల్లో ప్రసంగించారు. ‘అమరావతి’ ఘనతను చాటి చెప్పారు. ‘‘భారతదేశ చరిత్రలో అమరావతికి ఘనమైన స్థానం ఉంది. రాజధాని నిర్మాణం అంత సులువైన పని కాదు. ఒకవైపు ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబిస్తూనే మరోవైపు ఆధునికతను అద్దాలి’’ అని తెలిపారు. ఐదున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా దీనిని నిర్మిస్తున్నామన్నారు. నవ నగరాల సమాహారంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం కోరుతున్నట్లు తెలిపారు.
 
‘ఉమ్మడి’గా నిర్మాణం
సింగపూర్‌ మంత్రి డెస్మండ్‌ లీతోపాటు సింగపూర్‌, ఏపీకి చెందిన పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ‘ఏపీ-సింగపూర్‌ ఇండస్ట్రీ’ నెట్‌వర్కింగ్‌ సమావేశంలోనూ చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఏపీ, సింగపూర్‌లలో ఉన్న భవన నిర్మాణదారులు, తయారీదారుల మధ్య పరస్పర సహకారానికి ఇది ముందడుగు. వీరందరినీ ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో చొరవ చూపిన డెస్మండ్‌ లీని అభినందిస్తున్నా. నైపుణ్యాలున్న మానవ వనరులను మేం పెంపొందించుకుంటున్నాం. నిర్మాణరంగంలో మరింత అత్యాధునిక యంత్ర పరికరాలు, వస్తు సామగ్రిని సమకూర్చుకునేందుకు కృషి చేస్తున్నాం. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, ఉత్తమ పనితీరులో సింగపూర్‌ అనేక మైలు రాళ్లను దాటింది. మీ నైపుణ్యం, మీ అత్యాధునిక నిర్మాణ శైలిని మాకు అందించండి’’ అని కోరారు.
 
సింగపూర్‌ మాకు స్ఫూర్తి...
ఇష్టం లేని విభజనను ఎదుర్కొని సంక్షోభాన్ని సానుకూల అవకాశాలుగా మార్చుకుంటున్న తమకు... కష్టపడి ఎదిగిన సింగపూర్‌ స్ఫూర్తి అని చంద్రబాబు తెలిపారు. ‘పెట్టుబడులకు ప్రబల అవకాశాలు - ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావవంతమైన ఆర్థికాభివృద్ధి’ అనే అంశంపై లీక్వాన్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. ‘‘రాజధాని లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు సింగపూర్‌ మమ్మల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. రాజధానికి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి సాయం చేసింది. 2029నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఎదగాలన్న మా లక్ష్య సాధనకు సహకరించండి’’ అని లీక్వాన్‌ విశ్వవిద్యాలయ ప్రతినిధులను కోరారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రథమ స్థానంలో నిలిచామని చంద్రబాబు చెప్పారు. పరిశ్రమలకు త్వరగా అనుమతుల మంజూరుకు ఏకగవాక్ష విధానం తీసుకొచ్చామని, అన్ని రంగాల్లో పురోగమిస్తున్నామని చంద్రబాబు వివరించారు. 30 కిలోమీటర్ల పొడవునా నదీ అభిముఖంగా నిర్మిస్తున్న అమరావతిని ప్రపంచ పెట్టుబడులకు ముఖ్య కేంద్రంగా మారుస్తున్నామని చెప్పారు.
 
మరింత మెరుగ్గా గృహ నిర్మాణాలు
పేదలకు ఒకేరోజు మూడు లక్షల ఎన్టీఆర్‌ గృహాలను ప్రారంభించి చరిత్ర సృష్టించామని... భవిష్యత్తులో నిర్మించే ఇళ్లు మరింత మెరుగైన పద్ధతిలో, అత్యధికులకు ఆవాసం కల్పించేలా ఉండాలని భావిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనికోసం సింగపూర్‌లోని నమూనాలు, ఆకృతులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సింగపూర్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిటీ సొల్యూషన్స్‌ సింగపూర్‌ ఎగ్జిబిషన్‌ను చంద్రబాబు సందర్శించారు. ఈ ప్రదర్శనలోని స్మార్ట్‌ అర్బన్‌ నివాసాల ఆకృతులను ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. పట్టణీకరణ - నీరు, పర్యావరణం, రవాణా, నిర్వహణ వ్యవస్థపై బృంద చర్చలో ఆయన పాల్గొన్నారు.
 
ఈ చర్చలో పాల్గొన్న ప్రపంచ బ్యాంకు సీఈవో క్రిస్టెలినా మాట్లాడుతూ... నిర్మాణ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తికావడానికి నీరు, పర్యావరణ రంగాల్లో వినూత్న ఆవిష్కారాలు, ఆలోచనలు కావాలన్నారు. ఏసియా వాటర్‌ వీక్‌ ప్రతినిధి సహానా సూద్‌ మాట్లాడుతూ... చంద్రబాబు సమర్థ నాయకుడని, సకారాత్మక దృక్పథంతో పనిచేసే నేత అని ప్రశంసించారు. మరోవైపు సింగపూర్‌లోని అత్యాధునిక ఎన్‌ఈసీ ల్యాబ్‌ను చంద్రబాబు సందర్శించారు. ఇప్పటికే ఆధార్‌, ఇతర గుర్తింపు కార్డులకు ఫింగర్‌ ప్రింట్‌, ఐరిస్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్న ఏపీ.... తర్వాత దశ టెక్నాలజీని అందిపుచ్చుకునే దశలో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 
ఎల్‌కేవై-ఏపీ మధ్య ఒప్పందం
ఎల్‌కేవై స్కూల్‌ ఆప్‌ పబ్లిక్‌ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, డానీ సంతకాలు చేశారు. పాలనలో పోటీతత్వం పెంచేలా పరిశోధన, శిక్షణ తదితర అంశాల్లో పరస్పర సహకారానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా వియత్నాం-సింగపూర్‌ మఽధ్య పారిశ్రామిక పోటీతత్వం అనే పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.
 
అవి సంపద సృష్టి కేంద్రాలు : రణిల్‌
ఒకప్పుడు కుగ్రామంలా ఉన్న సింగపూర్‌ నేడు బ్రహ్మాండమైన నగరంగా అభివృద్ధి చెందిందని, పౌరులకు సదుపాయాల కల్పనలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే ప్రశంసించారు. ‘ప్రపంచ నగరాల ప్లీనరీ’లో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో నగరీకరణ ధోరణి అత్యంత వేగంగా పెరిగిపోతోందన్నారు. నగరాలు ఇప్పుడు సంపద సృష్టించే వనరులుగా ఉన్నాయని... అదే సమయంలో కాలుష్యం, నేరాలు, నీటి కొరత వంటి సమస్యలూ ఎదురవుతున్నాయని రణిల్‌ విక్రమసింఘే పేర్కొన్నారు. కాగా, ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సీఈవో అహ్మద్‌ బాబు, సమాచార శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

కాలుష్యమనేదే ఉండదు
అమరావతికి రండి.. ఆయుష్షు పెరుగుతుంది
అన్నీ విద్యుత్‌ వాహనాలే వినియోగిస్తాం
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం
పునరుత్పాదక ఇంధనానికే ప్రాధాన్యం
ఏపీలో నిర్మాణ రంగంలో అద్భుత అవకాశాలున్నాయ్‌
ప్రపంచ నగరాల సదస్సులో చంద్రబాబు
ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న నాణ్యమైన జీవన ప్రమాణాలు, వసతులు రానున్న పదేళ్లలో కచ్చితంగా అమరావతిలో కల్పిస్తామని హామీ ఇస్తున్నా. మా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి..తయారీ, పారిశ్రామిక రంగాలకు హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చండి. ఏపీని మీ రెండో ఇల్లుగా మార్చుకోండి. మొదట ఒక పరిశ్రమ నెలకొల్పండి. నచ్చితే దాన్ని విస్తరించండి. మాపై సందేహాలుంటే సింగపూర్‌ ప్రభుత్వాన్ని అడిగి నివృత్తి చేసుకోండి.
9ap-main7a.jpg

ఈనాడు, అమరావతి: ‘‘అమరావతిని హరిత నగరంగా నిర్మిస్తున్నాం. పచ్చటి ఉద్యానవనాలు, సుందరమైన కాలువలతో అమరావతి శోభిల్లుతుంది. నూరుశాతం ఎలక్ట్రిక్‌ వాహనాలే వినియోగిస్తాం. ప్రమాణాల మేరకే కార్బన్‌ డయాక్సైడ్‌ ఉండే (సీఓ2 న్యూట్రల్‌) వాతావరణాన్ని నెలకొల్పుతున్నాం. అత్యవసర సేవలకు ఐదు నిమిషాల్లో, సామాజిక అవసరాలకు 10 నిమిషాల్లో, కార్యాలయాలకు 15 నిమిషాల్లో కాలినడకన చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్రంలో పెట్టుబడిలేని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ... ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడున్న ఎవరైనా సరే అమరావతికి వచ్చి స్థిరపడొచ్చు. అక్కడుంటే మీ ఆయుష్షు పెరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు సింగపూర్‌ వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం రెండో రోజు ‘‘పట్టణీకరణ-నీరు, పర్యావరణం, ప్రజా రవాణా నిర్వహణ’ అన్న అంశంపై జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్‌ ఉప ప్రధాని థర్మన్‌ షణ్ముగరత్నం ప్రారంభోపన్యాసం చేయగా, శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఘే కీలకోపన్యాసం చేశారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన నిపుణులతో జరిగిన ప్యానల్‌ చర్చలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పరిపాలనలో తీసుకువచ్చిన సంస్కరణలు, వినూత్న విధానాల్ని ఆయన వివరించారు. పునరుత్పాదక ఇంధన వనరులకే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ప్రస్తుతం వనరులకు కొరత లేదని, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటూ, తగిన ప్రణాళికతో ముందుకు వెళితే అద్భుతాలు సాధించగలమని ఈ చర్చలో పాల్గొన్న ప్రపంచంలోని వివిధ నగరాల మేయర్లకు ఆయన సూచించారు. సమావేశానికి హాజరైన వారు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు. అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న ఘనమైన చారిత్రక వారసత్వాన్ని, ఆధునికతను మేళవించి రాజధానిని నిర్మిస్తున్నట్టు వివరించారు. చర్చలో ప్రపంచబ్యాంకు ఈసీఓ క్రిస్టెలినా జార్జియెవా తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ నగరంలో భాగస్వాములుకండి
ఆంధ్రప్రదేశ్‌లో తలపెట్టిన నిర్మాణ నగరంలో భాగస్వాములు కావాలంటూ సింగపూర్‌కి చెందిన పారిశ్రామికవేత్తలు, నిర్మాణరంగ ప్రముఖులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ఏపీ-సింగపూర్‌ పారిశ్రామికవేత్తల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సింగపూర్‌కి చెందిన సుమారు 60 సంస్థల ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 30 మందికిపైగా నిర్మాణ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. అమరావతిలో అవకాశాలపై ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌ వాకృదృశ్య ప్రదర్శన ఇచ్చారు. సింగపూర్‌లోని నిర్మాణ పరిశ్రమకు, నిర్మాణరంగ ఉత్పత్తుల తయారీదారులకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతావకాశాలున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘మనం సంయుక్తంగా నిర్మాణ నగరాన్ని లేదా సెజ్‌ను ఏర్పాటు చేద్దాం. సింగపూర్‌లో మంచి సాంకేతిక పరిజ్ఞానాలు, ఉత్తమ విధానాలు, నైపుణ్యాలు ఉన్నాయి. భారత్‌లో నిర్మాణ రంగానికి సంబంధించి మంచి కంపెనీలున్నాయి. మనం కలసి పనిచేయడం ఉభయులకూ ప్రయోజనకరం. భారత్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. రాబోయే 10-15 ఏళ్లలో ఏపీలో లక్ష హోటల్‌ గదులు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మరోపక్క రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధిలోనూ విస్తృతావకాశాలున్నాయని’ సీఎం వివరించారు.

నెక్‌ ల్యాబ్స్‌ సందర్శన
ముఖాకృతి గుర్తింపు, సమాచార విశ్లేషణ, పరిశోధన కేంద్రాన్ని (నెక్‌ ల్యాబ్‌) ముఖ్యమంత్రి సందర్శించారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం, పారదర్శక పాలన నెలకొల్పడంలో నెక్‌ సాంకేతికత ఎంత వరకు తోడ్పడుతుందో అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తర్వాత సింగపూర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిటీ సొల్యూషన్స్‌ సింగపూర్‌ ఎగ్జిబిషన్‌’ను సందర్శించిన చంద్రబాబు.. పట్టణ జనాభా అవసరాలకు తగ్గట్టు..పరిమిత స్థలంలోనే ఎక్కువ ఇళ్లు నిర్మించే అత్యుత్తమ విధానాలను, నమూనాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు.

వర్చువల్‌ అమరావతి..!
ఐరోపాకు చెందిన ఇంజినీరింగ్‌ సంస్థ డసాల్ట్‌ సిస్టమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం ‘వర్చువల్‌ అమరావతి’ ప్రాజెక్టు రూపొందిస్తోందని చంద్రబాబు ఓ సందర్భంలో పేర్కొన్నారు. అమరావతికి సంబంధించి భవనాల స్వరూపం, గాలి నాణ్యత, దిశ, విపత్తుల నిర్వహణ వంటి అంశాలపై తగిన నమూనాల రూపకల్పనకు ఇది తోడ్పడుతుందన్నారు.

అమరావతి పెవిలియన్‌ ప్రారంభించిన సీఎం
ప్రపంచనగరాల సదస్సులో రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్‌డీఏ ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. దాన్ని ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. వర్చువల్‌ రియాలిటీ విధానంలో రూపొందించిన అమరావతి నమూనాల్ని ఆయన తిలకించారు.

Link to comment
Share on other sites

రాజధానిలో బసవ తారకం వెయ్యి పడకల ఆస్పత్రి
11-07-2018 07:01:37
 
636668892962915168.jpg
  • ఆరేడు మాసాల్లో శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటు
  • స్థలాన్ని పరిశీలించిన ప్రతినిధులు
అమరావతి: బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి స్థాపన కోసం రాజధానిలోని తుళ్లూరు- అనంతవరంల మధ్య ఈ-7 రహదారికి ఆనుకుని తమకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల్లో తొలి దశలో భాగంగా ఆరేడు నెలల్లో శాటిలైట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని బసవతారకం ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల గురించి వారు సీఆర్డీయే అధికారులకు వివరించారు. విజ యవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యా లయంలో మంగళవారంనాడు జరిగిన సమావేశంలో వారు ఆస్పత్రి స్థాపనకు అవసరమైన రహదారి సౌకర్యం, విద్యుత్తు, నీరు తదితర మౌలిక వసతుల కల్పన గురించి అధికారులతో చర్చించారు. హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి సామర్ధ్యం 500 పడకలు కాగా అమరావతిలో నెలకొల్పబోయే హాస్పిటల్‌లో మాత్రం 1,000 పడకల సామరఽ్ధ్యం కలిగిన పెద్ద ఆస్పత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి తమకు కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. సమావేశంలో బసవతారకం ట్రస్ట్‌ సీఈవో ప్రభాకరరావు, ప్రతినిధి శ్రీభరత్‌, ఆర్కిటెక్ట్‌ కిరణ్‌, సీఆర్డీయే ప్లానింగ్‌ విభాగపు డైరెక్టర్‌ జి.నాగేశ్వరరావు, డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌ విభాగపు డైరెక్టర్‌ కె.నాగసుందరి, ఇన్‌ఫ్రా ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.వి.ఆర్‌.కె.ప్రసాద్‌, క్యాపిటల్‌ సిటీ ఎస్టేట్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.విజయలక్ష్మి, ఎస్‌.ఇ. సీహెచ్‌ ధనుంజయ, అసోసియేట్‌ ప్లానర్‌ గౌరీ శాంతి తదితర అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...