Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో మిలటరీ స్థావరం
06-07-2018 02:38:45
 
636664415262044197.jpg
  • సీఎస్ తో మేజర్‌ జనరల్‌ భేటీ
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో త్వరలో ఆధునిక మిలటరీ స్థావరం ఏర్పాటు కానుంది. ఈ విషయమై ఏపీ, తెలంగాణ సబ్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు గురువారం వెలగపూడి సచివాలయంలో ఇన్‌చార్జి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఆరున్నర ఎకరాల భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే విజయవాడ, కర్నూల్‌లో ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కాంప్రహెన్సివ్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈసీహెచ్‌ఎస్) పాలీ క్లినిక్‌ల ఏర్పాటుకు తగిన స్థలాన్ని నామమాత్రపు ధరకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
 
గ్యాలంటరీ అవార్డులకు తెలంగాణ నుంచి ఎక్కువ ప్రతిపాదనలు వస్తున్నాయని, ఏపీ నుంచి కూడా వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్స్‌సర్వీ్‌సమెన్లు ఎక్కువగా ఉన్నారని, మిలటరీలో పని చేయడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య తెలంగాణతో పోల్చితే, ఏపీలోనే ఎక్కువగా ఉంటోందని చెప్పారు. కోరుకొండ సైనిక పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులను సకాలంలో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
Link to comment
Share on other sites

ఆంధ్రాలో ఆర్మీ బ్రిగేడ్‌!
07-07-2018 02:55:01
 
  • 3 బెటాలియన్లు...3వేల మంది సైన్యం
  • అమరావతి సమీపంలో... 300 ఎకరాల్లో!
అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర ప్రదేశ్‌లో సైనిక స్థావరం లేదన్న లోటు తీరనుంది. అమరావతికి చేరువలో సుమారు 300 ఎకరాల్లో ఆర్మీ బ్రిగేడ్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సికింద్రాబాద్‌లో భారీ సైనిక కేంద్రంతోపాటు అనేక శిక్షణ సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో సైనిక కేంద్రం ఏర్పాటు ఇప్పటిదాకా జరగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజధానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని అచ్చంపేట వద్ద ఉన్న వెంకటాయపాలెం అటవీ ప్రాంతంలో ఆర్మీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. రాజధానిలో ఆరున్నర ఎకరాల్లో ఆధునిక మిలిటరీ స్టేషన్‌ ఏర్పాటుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా 300 ఎకరాల్లో మూడు బెటాలియన్లతో 3వేల మంది సైన్యంతో ఆర్మీ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బెటాలియన్‌కు 55 నుంచి 65 ఎకరాలు అవసరమని, వీటితోపాటు ఇతర అవసరాలకు కలిపి మొత్తం 300 ఎకరాలు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఫైరింగ్‌ రేంజ్‌తోపాటు సైనికులకు ఇచ్చే సాధారణ శిక్షణకు అవసరమైన సదుపాయాలు ఇక్కడ కల్పిస్తారు.
 
స్థల పరిశీలన...
రాజధాని అవసరాల కోసం అటవీ మళ్లింపు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పొందబోతున్న వెంకటాయపాలెం అటవీ బ్లాక్‌లో ఆర్మీ బ్రిగేడ్‌ను స్థాపించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు అనువైన ప్రదేశాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉప ప్రాంతీయ కమాండింగ్‌ అధికారి శ్రీనివాసరావు తదితర అధికారులు శుక్రవారం ఈ స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు
Link to comment
Share on other sites

రైతులకు మూడో విడత ప్లాట్ల కేటాయింపు
07-07-2018 09:41:20
 
636665532819111555.jpg
అమరావతి: స్థానిక సీఆర్డీయే కార్యాలయంలో శుక్రవారం మూడో విడత ప్లాట్లు కేటాయించారు. ఐదుగురు రైతులకు 32 నివాస ప్లాట్లు, 5 వాణిజ్య ప్లాట్లను సీఆర్డీయే ల్యాండ్స్‌ డైరెక్టర్‌ చెన్నకేశవరావు కంప్యూటర్‌లో లాటరీ తీసి కేటాయించారు. గతంలో కొన్ని కారణాల చేత లాటరీల్లో ప్లాట్లు కేటాయింపు జరగని వారికి సమస్య పరిష్కారం అయిన వెంటనే కేటాయిస్తామని చెన్నకేశవరావు తెలిపారు.
Link to comment
Share on other sites

అమరావతిపై ‘అంతర్జాతీయ’ ఆసక్తి
07-07-2018 03:52:18
 
  •  6 అంచెల వ్యూహంతో నిర్మాణాలు
  •  నాణ్యత, గడువుపై రాజీ ప్రసక్తే లేదు
  •  2050 నాటికి 18లక్షల ఉద్యోగాలు
  •  సీఆర్‌డీఏ అధికారులతో సీఎం
అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు అమితాసక్తి కనబరుస్తున్నాయి. 21వ శతాబ్దంలో అమరావతి ఆర్థికశక్తిగా ఎదుగుతుందని, పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల నగరమని అంతర్జాతీయ పెట్టుబడిదారులు గుర్తించడం సంతోషకరం’’ అని సీఎం చెప్పారు. సింగపూర్‌లో 8, 9 తేదీల్లో జరిగే ప్రపంచ నగరాల సదస్సు(డబ్ల్యూసీఎస్)లో పాల్గొనాలంటూ సింగపూర్‌ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఆయన ప్రయాణమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధిసంస్థ(ఏడీసీ) అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధానిలో పెట్టబడులు వెల్లువెత్తుతున్నాయనీ, అమరావతి నిర్మాణపనులను వేగవంతం చేయాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. దీనికోసం ఆరంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు.
 
గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానిగా అంతర్జాతీయంగా ఎంతో మందిని ఆకర్షించిన రాజధానిలో ఐటీ, విద్య, ఇంధనం, వైద్యసంస్థలు, పర్యాటకం వంటి రంగాల్లో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని వివరించారు. అవకాశాల గని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది డిసెంబరు నాటికి ఒక మంచి రూపు తేవాలని అన్నారు. సమర్థ ప్రాజెక్టు నిర్వహణ, ప్రతి వారం సమీక్షల ద్వారా లక్ష్యాన్ని సాధించాలని ఆయన మార్గనిర్దేశన చేశారు. నాణ్యత, గడువుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కాంట్రాక్టర్లకు స్పష్టం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు.
 
అంతర్జాతీయ భాగస్వాములు, వ్యాపారులకు, పర్యాటకులకు, పౌరులకు అత్యున్నత శ్రేణి సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్నారు. 2050 నాటికి 18 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ, సింగపూర్‌లో జరిగే సదస్సులో సీఎం చంద్రబాబు ప్రపంచంలోని పలు నగరాలకు చెందిన నేతలతో సమావేశమవుతారని తెలిపారు. సింగపూర్‌ మంత్రులు లారెన్స్‌వాంగ్‌, ఈశ్వరన్‌, నగరా అభివృద్ధి సలహాదారు ప్రొఫెసర్‌ గ్రెగ్‌ క్లార్క్‌ తదితరులతో భేటీ కానున్నారని వివరించారు. చంద్రబాబుతో పాటు ఆర్థికశాఖ మంత్రి యనమల, ఏపీసీఆర్‌డీఏ, ఏపీఈడీబీ అధికారుల బృందం కూడా సింగపూర్‌ వెళ్తోంది. ఫోరం సంయుక్త ప్లీనరీ ప్రారంభ సమావేశంలో చంద్రబాబు నీరు, పర్యావరణ, రవాణా నిర్వహణపై ప్రసంగిస్తారు. ఈ ప్రారంభ ప్యానెల్‌లో చంద్రబాబుతో పాటు ప్రపంచబ్యాంకు గ్రూప్‌ సీఈఓ క్లిస్టలీనా జార్జివా, యూఏఈ పర్యావరణశాఖ మంత్రి థాని అహ్మద్‌ అల్‌ జౌదీ, చైనామంత్రి ఝవాంగ్‌ గౌతాయ్‌ వంటి ప్రముఖులు ఉన్నారు.
Link to comment
Share on other sites

మరావతి అభివృద్ధి దిశగా మరో ముందడుగు!
06-07-2018 08:24:59
 
636664623005921541.jpg
  • 8, 9, 10 తేదీల్లో ముఖ్యమంత్రి సింగపూర్‌ పర్యటన
  • ప్రపంచ నగరాల సదస్సుకు హాజరు
  • పలు దేశాల ప్రముఖులతో భేటీలు ఫ స్మార్ట్‌ సిటీలపై చర్చలు
  • పెట్టుబడుల ఆకర్షణకు విస్తృత ప్రయత్నాలు
  • సింగపూర్‌ సదస్సులో అమరావతి ప్రత్యేక పెవిలియన్‌
 
అమరావతి: రాజధాని అమరావతిని అత్యుత్తమ ప్రపంచ నగరాల సరసన నిలపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరొకసారి సింగపూర్‌ పర్యటన జరపబోతున్నారు. సింగపూర్‌లో ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచంలోని పలు నగరాల మేయర్లు, సంబంధిత రంగాల ప్రముఖులతో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ప్రపంచ నగరాల సదస్సు (డబ్ల్యు.సి.ఎస్‌.) ఈ నెల 8 నుంచి 12 వరకు జరగబోతోంది. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన సుమారు 120మంది మేయర్లు, శ్రీలంక ప్రధానమంత్రి రనిల్‌ విక్రమసింఘే ప్రభృతులు ఇందులో పాల్గొనబోతున్నారు. ఇటీవల రాజఽధానికి వచ్చిన సింగపూర్‌ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఈశ్వరన్‌ ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
 
మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణలతోపాటు సీఆర్డీయే, ఏడీసీ, ఈడీబీలకు చెందిన పలువురు ఉన్నతాధికారులతో కలసి శనివారం అమరావతి నుంచి సింగపూర్‌కు బయల్దేరనున్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో సదస్సులో పాల్గొంటారు. ఆ సదస్సులో కొన్ని ముఖ్యమైన సమావేశాలు, బృంద చర్చల్లో వీరు పాలుపంచుకుని పట్టణ, నగరీకరణకు సంబంధించిన పలు అంశాలపై కీలక ప్రసంగాలు చేయనున్నారు. గత విదేశీ పర్యటనల మాదిరిగానే వివిధ దేశాలకు చెందిన పలువురు వాణిజ్య, పారిశ్రామికరంగాలకు చెందిన ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతోనూ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రధానంగా అమరావతిలో పెట్టుబడులకు ఉన్న భారీ అవకాశాలను వారికి వివరించడంతోపాటు స్మార్ట్‌ సిటీల రూపకల్పన, వ్యవసాయరంగంలో వస్తున్న నూతన విధానాల గురించి ఆయా రంగాల నిపుణులు, ప్రముఖులతో చర్చిస్తారు.
 
ప్రసంగాలు, చర్చలతో సీఎం బిజీబిజీ..
8న ప్రారంభమయ్యే వరల్డ్‌ సిటీస్‌ సమిట్‌లో భాగంగా తొలుత జరగనున్న మేయర్స్‌ ఫోరం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజున ‘లివబుల్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీస్‌, ఎంబ్రాసింగ్‌ ది ఫ్యూచర్‌ త్రూ ఇన్నొవేషన్‌ అండ్‌ కొలాబరేషన్‌’ అనే అంశంపై జరిగే సదస్సులో ప్రసంగిస్తారు. ‘సాంకేతికతతో సమ్మిళిత వృద్ధి, రాష్ట్రం- నగరస్థాయి పాలనలో సమన్వయం’ తదితరాంశాలను ఆయన ప్రస్తావిస్తారు. ఆధునిక నగరాల్లో ఉండాల్సిన సమతుల్య అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు, రాష్ట్ర ప్రభుత్వం- స్థానిక పరిపాలనా సంస్థల మధ్య ఉండాల్సిన పరస్పర సమన్వయం, మౌలిక వసతుల కల్పన- అభివృద్ధికి అవసరమైన ఆర్ధిక వనరలను సమకూర్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు ఇత్యాది విషయాలు ఆయన ప్రసంగంలో చోటు చేసుకోనున్నాయి. అదే రోజు సాయంత్రం వివిధ దేశాల మేయర్లు, ప్రతినిధులతో జరిగే విందులో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.
 
9వ తేదీన జాయింట్‌ ఓపెనింగ్‌ ప్లీనరీ సదస్సులో శ్రీలంక ప్రధానమంత్రి రనిల్‌ విక్రమసింఘేతో కలసి పాల్గొంటారు. అనంతరం నగరీకరణకు సంబంధించిన వివిధ అంశాలపై జరిగే చర్చల్లో చంద్రబాబు పాలుపంచుకుంటారు. సింగపూర్‌ పెవిలియన్‌లో ‘అర్బనైజేషన్‌- వాటర్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌’ అనే అంశంపై ప్రపంచ బ్యాంక్‌ సీఈవో క్రిస్టాలినా జార్జివా, యూఏఈ పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్‌ థాని అల్‌ జియోదీ, జాకోబ్స్‌ ఛైర్మన్‌ స్టీవెన్‌ డెమెట్రూ, డస్సాల్ట్స్‌ సిస్టమ్స్‌ వైస్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఛార్లెస్‌లతో కలసి ప్యానల్‌ డిస్కషన్‌లో పాల్గొంటారు.
 
అనంతరం సింగపూర్‌ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌, ఉప ప్రధానమంత్రి ధర్మన్‌ షణ్ముగరత్నం, శ్రీలంక ప్రధానమంత్రి రనిల్‌ విక్రమసింఘేలతోపాటు సింగపూర్‌ ఆర్థిక మంత్రి హెంగ్‌ స్వీ కియెట్‌, జాతీయాభివృద్ధి శాఖ మంత్రి లారెన్స్‌ వోంగ్‌, కమ్యూనికేషన్ల మంత్రి ఈశ్వరన్‌, కుటుంబ, సామాజిక, జాతీయాభివృద్ధి శాఖ మంత్రి డెస్మండ్‌ లీ టీ సెంగ్‌తో సమావేశమవుతారు.
 
సింగపూర్‌లోని ప్రఖ్యాత లీ క్వాన్‌ యూ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే ‘లీ క్వాన్‌ యూ ప్రైజ్‌ అవార్డ్‌’ కార్యక్రమంలో ఆ దేశాధ్యక్షురా లు హలీమా యాకోబ్‌తో కలసి సీఎం పాల్గొంటారు. మేయర్స్‌ ఫోరం ముఖ్యుడు ప్రొఫెసర్‌ గ్రెగ్‌ క్లార్క్‌, ఏఐఐబీ డైరెక్టర్‌ జనరల్‌ పాంగ్‌ ఈ యాన్‌, ఫోర్టెస్‌క్యూ మెటల్స్‌ గ్రూపునకు చెందిన గౌతం వర్మ, రాయల్‌ హోల్డింగ్స్‌ ప్రతినిధి రాజ్‌కుమార్‌ హీరానందానీ, ఎలీ హజాజ్‌ ఎండీ సతీశ్‌, ఎన్‌ఈసీ లేబొరేటరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కత్సుమి ఎమురా, కెప్పెల్‌ల్యాండ్‌కు చెందిన లూయీస్‌ లిమ్‌లతోపాటు అభిషేక్‌ మంగళ్‌ప్రభాత్‌ లోథా, డస్సాల్ట్స్‌, మలేసియన్‌ రైల్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం సమావేశమై రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి ఉన్న సానుకూల తలను వివరించి, పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేయనున్నారు.
 
వ్యవసాయ రంగాభివృద్ధి కోసం..
సింగపూర్‌ పర్యటనలో రాష్ట్రంలో వ్యవసాయరంగా భివృద్ధిపై కూడా సీఎం దృష్టి పెట్టనున్నారు. జర్మన్‌ అగ్రి బిజినెస్‌ ప్రతినిధులతో ఇందుకోసం ఆయన సమావేశమవనున్నారు.జర్మనీ టెక్నాలజీతో సేద్యరంగంలో వినూత్న విధానాలను అనుసరించడం ద్వారా సింగపూర్‌ సత్ఫలితాలను సాధిస్తున్న నేపథ్యంలో సింగపూర్‌ తోడ్పాటుతో వ్యవసాయ దిగుబడులను పెంచడమెలాగన్న దానిపై చర్చిస్తారు.
 
అమరావతి ప్రత్యేక పెవిలియన్‌..!
రాజధానిలో పెట్టుబడులకు అవకాశం ఉన్న వివిధ ప్రాజెక్టులు, అమరావతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న కృషిలో భాగస్వాములవ్వా లన్న ఆసక్తి ఉన్న సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో సదస్సులో భాగంగా సీఆర్డీయే, ఏపీడీఈడీబీలు ఏర్పాటు చేసిన ‘అమరావతి ప్రత్యేక పెవిలియన్‌’కు మంచి స్పందన లభించగలదన్న ఆశాభావాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
 
 
నిర్మాణరంగ నగరం ఏర్పాటు దిశగా..
ప్రకాశం జిల్లా దొనకొండలో నెలకొల్పదలచిన నిర్మాణ నగరానికి కూడా సింగపూర్‌ సదస్సు దోహదపడనుంది. సింగపూర్‌ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. చైనాలో ఉన్నట్లుగా నిర్మాణ రంగానికి సంబంధించిన సమస్త వస్తు సామగ్రి, సాంకేతికత ఒకే ప్రదేశంలో లభ్యమయ్యేలా దొనకొండలో నిర్మాణ నగరం రూపొందనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నిర్మాణ రంగ ప్రముఖులతో కూడిన ఒక ప్రత్యేక బృందం తమ సొంత ఖర్చులతో సీఎం వెంట సింగపూర్‌ వెళ్లనుంది. రాష్ట్రంలో పెద్దఎత్తున నిర్మాణ కార్యకలాపాలు సాగుతున్న తరుణంలో ఆ రంగంలో అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన అత్యాఽధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త నిర్మాణ విధానాలపై వారికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఆ బృందాన్ని తనవెంట తోడ్కొని వెళ్తున్నారు. ఇందులో 15 మంది ప్రముఖ నిర్మాణదారులే కాకుండా సుమారు 30 నుంచి 40 మంది ప్రికాస్ట్‌ తయారీదారులు, కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు ఉండబోతున్నారు.
 
  ఈ బృందాన్ని మేయర్ల సదస్సులో పరిచయం చేసిన అనంతరం సీఎం వారితో కలసి ఆ రంగంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధిని పరిశీలిస్తారు. సింగపూర్‌లోని అఫర్డబుల్‌ హౌసింగ్‌ యూనిట్లను చస్తారు. సింగపూర్‌ ప్రభుత్వ సంస్థ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ అథారిటీ కార్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అనంతరం సింగపూర్‌లో నిర్మాణ రంగానికి చెందిన దాదాపు 40 మంది ప్రతినిధులతో రాష్ట్రానికి చెందిన నిర్మాణ రంగ ప్రతినిధులు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో చంద్రబాబు దొనకొండలో ఏర్పాటు కానున్న నిర్మాణ నగరంలో తమ యూనిట్లను ప్రారంభించాల్సిందిగా సింగపూర్‌లోని వాణిజ్య, పారిశ్రామిక ప్రతినిధులను కోరతారు. 10వ తేదీన కూడా నిర్మాణ రంగ ప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రి సింగపూర్‌లోని ప్రఖ్యాత పియోంగ్‌ స్టాంగ్‌ ప్రికాస్ట్‌ మెటీరియల్‌ ప్లాంట్‌ను, సింగపూర్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్లాంట్‌ను సందర్శించి, అక్కడి అత్యాధునిక నిర్మాణ యంత్రసామగ్రిని పరిశీలించనున్నారు.
Link to comment
Share on other sites

అమరావతికి రూపు
డిసెంబరు నాటికి..
నిర్మాణంలో నాణ్యత నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
ఈనాడు డిజిటల్‌, అమరావతి: సమర్థ ప్రాజెక్టు నిర్వహణ, వారంవారం సమీక్షల ద్వారా ఈ ఏడాది డిసెంబరు నాటికి రాజధాని అమరావతికి ఒక రూపు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని గుత్తేదారులకు స్పష్టం చేయాలని సూచించారు. నాణ్యత, గడువు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) అధికారులతో శుక్రవారం సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో జరిగే ఆర్థికాభివృద్ధితో రాష్ట్రమంతటికీ లబ్ధి చేకూరాలని సూచించారు. ప్రతి విషయంలోనూ మనం ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తించి పని చేయాలన్నారు.

ఆరంచెల వ్యూహం: అమరావతి నిర్మాణ పనులను వేగిరం చేయడానికి ఆరంచెల వ్యూహాన్ని అమలుచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రజల భాగస్వామ్యం, సంతోషం, సుస్థిరత- సమర్థత, అత్యున్నత స్థాయి సౌకర్యాలు, డిజిటలీకరణ, ఇన్నోవేషన్‌ వ్యాలీ.. ఈ ఆరు అంశాలు కేంద్రంగా రాజధాని రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు వేచి చూస్తున్నారని, వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రపంచ నగరాల సదస్సులో: సింగపూర్‌లో ఈ నెల 8నుంచి 12 వరకు నిర్వహించనున్న ప్రపంచ నగరాల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి గురించి ప్రధానంగా చర్చిస్తారని పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. ఫోరం సంయుక్త ప్లీనరీ ప్రారంభ సమావేశంలో నీరు, పర్యావరణం, రవాణా నిర్వహణపై ప్రసంగిస్తారని వివరించారు. ఈ ప్రారంభ ప్యానెల్‌లో సీఎంతో పాటు ప్రపంచ బ్యాంకు సీఈవో క్రిస్టలీనా జార్జివా, యూఏఈ పర్యావరణ మంత్రి థానీఅహ్మద్‌ అల్‌జౌదీ, చైనా మంత్రి ఝవాంగ్‌ గౌతాయ్‌ తదితరులు పాల్గొననున్నారు. 9న జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకున్న అవకాశాలపై ముఖ్యమంత్రి వివరిస్తారని సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ వెల్లడించారు.

 
Link to comment
Share on other sites

పీఆర్ టెండర్లకు పోటాపోటీ
08-07-2018 08:30:30
 
636666354291677102.jpg
  • విజయవాడ బైపాస్‌, ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణాలకు..
  • బిడ్లు సమర్పించిన ఎనిమిది కన్సల్టెన్సీ సంస్థలు
  • ఆరు నెలల్లో డీపీఆర్‌ రిపోర్టు సమర్పణ
  • పెద అవుటపల్లి, గుండుగొలను పనుల టెండర్ల 18న ఖరారు
 
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): విజయవాడ బైపాస్‌ రోడ్డు, కృష్ణానదిలపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించటానికి కన్సల్టెన్సీ సంస్థలు పోటీలు పడుతున్నాయి. మొత్తం ఎనిమిది సంస్థలు బిడ్లను సమర్పించాయి. ఈ సంస్థల వివరాలను జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌) బయట పెట్టడం లేదు. స్ర్కూటినీ పూర్తి కాగానే పాల్గొన్న సంస్థలు, ఎంపిక చేసిన సంస్థల వివరాలను ఎన్‌హెచ్‌ అధికారులు ప్రకటిస్తారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయటానికి ఆరునెలల సమయాన్ని నిర్దేశించనున్నారు. ఈ లెక్కన డిసెంబర్‌, జనవరి నాటికి డీపీఆర్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. డీపీఆర్‌ రాగానే కేంద్రానికి ఎన్‌హెచ్‌ అధికారులు పంపిస్తారు. కేంద్రం అమోదించిన తర్వాత టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు.
 
 
విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెనల నిర్మాణానికి బిట్‌ ప్యాకేజీ ప్రాతిపదికన డీపీఆర్‌ రూపొందించటానికి ఎన్‌హెచ్‌ సన్నాహాలు చేయటంతో మొదట్లో కన్సల్టెన్సీ సంస్థల నుంచి స్పందన రాని సంగతి తెలిసిందే! దీంతో ఎన్‌హెచ్‌ టెండర్లను రద్దు చేసి తిరిగి మళ్ళీ టెండర్లు పిలిచింది. గతంలో ఒకే ప్రాజెక్టుగా ఉన్నదానిని బిట్‌ ప్యాకేజీ పద్ధతిన నాలుగు భాగాలుగా విభజించటం, రెండు ఫేజుల్లో పూర్తి చేయాల్సి రావటంతో కన్సల్టెన్సీ సంస్థలు ఆసక్తి చూపించటం లేదని అధికారులు భావించారు. ఫేజ్‌ - 2 లో ప్యాకేజీ 3గా విజయవాడ బైపాస్‌, ప్యాకేజీ 4 గా కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెనకు ఇంతకు ముందు డీపీఆర్‌ కోసం పిలిచిన టెండర్లలో ఒకే ఒక సంస్థ బిడ్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో, ఈ సారి కూడా అనుమానంగానే టెండర్లు పిలిచారు. ఈ దఫా టెండర్లకు అనూహ్య స్పందన రావటంతో ఎన్‌హెచ్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏడు సంస్థలు రావటంతో ఎన్‌హెచ్‌ అధికారులుస్ర్కూటినీ ప్రక్రియను ప్రారంభించారు.
 
 
ఈపీపీ విధానంలో..
విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో భాగంగా మొదట్లో కాజ - కృష్ణానది అమరావతి రాజధాని ప్రాంతంలో నాలుగు వరసల రహదారి. కృష్ణానది - పెద అవుటపల్లి వరకు విజయవాడ బైపాస్‌ కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసలుగాను, పెద అవుటపల్లి నుంచి జంక్షన్‌ వ రకు ఆరు వరసలుగా ఎన్‌హెచ్‌ - 16 విస్తరణ, జంక్షన్‌ నుంచి గుండుగొలను వరకు ఆరు లేన్లుగా జంక్షన్‌ బైపాస్‌ విస్తరణ వంటివి ఒకే ప్రాజెక్టుగా అంతర్భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టును బీఓటీ పద్ధతిని అప్పట్లో గామన్‌ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఈ సంస్థ పనులు ప్రారంభించకపోవటంతో రద్దు చేసీ ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈపీసీకి వచ్చేసరికి రెండు ఫేజులుగా నాలుగు ప్యాకేజీలకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా పెద అవుటపల్లి - జంక్షన్‌ హైవే విస్తరణ, జంక్షన్‌ - గుండుగొలను బైపాస్‌లకు ప్యాకేజీ - 1, ప్యాకేజీ - 2 లుగా టెండర్లు పిలిచారు. ఫేజ్‌ - 2 లో విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై వంతెనల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు మార్పులు, చేర్పులకు సూచనలు వచ్చాయి. విజయవాడ బైపాస్‌తో పాటు, కృష్ణానదిపై నిర్మించబోయే బ్రిడ్జిని కూడా ఆరు వరసలుగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. ఈక్రమంలో బైపాస్‌, ఆరు వరసల ఐకానిక్‌ బ్రిడ్జికి డీపీఆర్‌ తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం డీపీఆర్‌ టెండర్ల దశలో ఉంది. ఈ నెలాఖరు నాటికి కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయనున్నారు.
 
 
బెంజిసర్కిల్‌ ప్యాకేజీ - 1 ఫ్లై ఓవర్‌కు సంబంధించి అప్రోచ్‌ల దగ్గర భూ సేకరణకు సంబంధించి పూర్తి స్థాయి భూ ప్రతిపాదనలను ఎన్‌హెచ్‌ అధికారులు రూపొందించారు. ఈ భూ ప్రతిపాదనలను త్వరలో రెవెన్యూ శాఖకు ప్రతిపాదించనున్నారు. రెవెన్యూ శాఖ కూడా సర్వే నిర్వహించిన తర్వాత భూ సేకరణ నోటిఫికేషన్‌ వెలువరిస్తారు.
 
 
ఈ నెల 18న టెండర్లు
విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-1లో పిలిచిన పెద అవుటపల్లి - జంక్షన్‌, జంక్షన్‌ - గుండుగొలను బైపాస్‌ పనులకు సంబంధించి టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లను ఇప్పటివరకు ఖరారు చేయలేదు. కాంట్రాక్టు సంస్థలు గడువు కోరటం, సాంకేతికాంశాలకు సం బంధించి సమాచారాన్ని కోరుతుండటంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. చివరికి ఈ నెల 18కి చివరి వాయిదా వేశారు. ఈ నెల 18న పనులు చేప ట్టబోయే కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయ నున్నారు.
Link to comment
Share on other sites

రాజధాని ప్రాజెక్టులకు నిధుల వేట
08-07-2018 08:54:51
 
636666368898620866.jpg
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధానిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, త్వరలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల కోసం వచ్చే ఏడాది మార్చి వరకు ఏపీ సీర్డీయే, ఏడీసీలకు మొత్తం రూ.6331.58 కోట్లు అవసరమని తెలిసింది. ప్రాధాన్య రహదారులు, భవంతుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, వరద నియంత్రణ పథకాలతోపాటు పచ్చదనం అభివృద్ధి ఇత్యాది పనులకు ఇంత భారీగా నిధులు కావాలని అంచనా వేశారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు హడ్కో, ప్రపంచ బ్యాంకు, వివిధ బ్యాంకులతో కూడిన కన్సార్షియం, ద్రవ్య సంస్థల నుంచి ఆ నిధులు సమీకరించేందుకు ఏపీ సీఆర్డీయే విస్తృతంగా కసరత్తు చేస్తోంది. అదనంగా అతి త్వరలోనే (బహుశా ఈ నెలాఖర్లోగా) ‘అమరావతి బాండ్ల’ జారీ ద్వారా రెండు వేల కోట్ల సేకరణకూ సమాయత్తమవుతోంది.
 
 
నెలవారీ లెక్క ఇదీ..
ప్రస్తుత నెలకు రూ.336.88 కోట్లు, ఆగస్టుకు రూ.483.70 కోట్లు, సెప్టెంబరుకు రూ.520.50 కోట్లు, అక్టోబరుకు రూ.664.70 కోట్లు, నవంబరుకు రూ.701.50 కోట్లు, డిసెంబరుకు రూ.844.80 కోట్లు, 2019 జనవరికి రూ.841.80 కోట్లు, ఫిబ్రవరికి రూ.956.70 కోట్లు, మార్చికి రూ.981 కోట్లు అవసరమని అంచనా వేశారు.
Link to comment
Share on other sites

ప్రైవేట్‌ సంస్థలకు దీటుగా రాజధానిలో సీఆర్డీయే అపార్ట్‌మెంట్లు!
08-07-2018 08:46:31
 
636666363898379165.jpg
  • మొత్తం 17.20 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియాలో వెయ్యి ఫ్లాట్ల నిర్మాణం
  • అమరావతిపై వివిధ వర్గాల ఆసక్తి దృష్ట్యా డిమాండ్‌ బాగుంటుందని అంచనా
  • రూ.500 కోట్ల వ్యయంపై రూ.42 కోట్లకుపైగా మిగులుతుందనుకుంటున్న సీఆర్డీయే
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధానిలో స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు వీలుగా అక్కడ స్వంత ఇళ్లను కలిగి ఉండాలనుకునే వారి సంఖ్య గణనీయంగా ఉన్నందున అమరావతిలో తొలివిడతగా తాను నిర్మించాలనుకుంటున్న 1,000 అపార్ట్‌మెంట్లకు గిరాకీ బాగానే ఉంటుందని ఏపీసీఆర్డీయే అంచనా వేస్తోంది. అధునాతన నిర్మాణ విధానాలతో, నాణ్యమైన బిల్డింగ్‌ మెటీరియల్‌తో, అనువైన ప్రదేశాల్లో నిర్మించనున్న దృష్ట్యా వీటిని కొనుగోలు చేసేందుకు పలువురు ముందుకు వస్తారని ఈ సంస్థ భావిస్తోంది. 4 సైజుల్లో (1285 చదరపు అడుగులు, 1580, 1880, 2150 చ.అ.) వీటిని ప్రతిపాదించడం ద్వారా మధ్య తరగతి ప్రజలతోపాటు ఎగువ మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాల వారు వీటిపై ఆసక్తి చూపుతారనుకుంటోంది. ఈ అపార్ట్‌మెంట్ల ధరను చదరపు అడుగుకు రూ.3 వేలుగా ప్రాథమికంగా నిర్ణయించడం కూడా కలసి వస్తోందని భావిస్తోంది. వీటికి లభించిన ప్రతిస్పందనపై ఆధారపడి భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని హౌసింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించి, సరసమైన ధరలకు వాటిని విక్రయించడం ద్వారా రాజధానిలో సొంత గూడు కావాలనుకునే వారి ఆకాంక్షను నెరవేర్చాలని ఈ సంస్థ తలపోస్తోంది.
 
15 ఎకరాలు.. 1,000 అపార్ట్‌మెంట్లు..
రాజధానిలోని 15 ఎకరాల్లో పైన పేర్కొన్నట్లుగా, 4 సైజుల్లో సీఆర్టీయే అపార్ట్‌మెంట్లను నిర్మించాలనుకుంటోంది. ఇవి మొత్తం 17.20 లక్షల చదరపుటడుగుల బిల్టప్‌ ఏరియాలో నిర్మితమవుతాయి. అయితే ఈ 15 ఎకరాలూ ఒకే చోట ఉంటాయా, లేక వేర్వేరు ప్రదేశాల్లోనా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ భూముల ధరను ఎకరానికి రూ.4.10 కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం. తొలి దశల్లో తక్కువ విస్తీర్ణముండే అపార్ట్‌మెంట్లపై అధికులు ఆసక్తి చూపుతారనే ఉద్దేశ్యంతో తాను నిర్మించబోతున్న మొత్తం 1,000 ఫ్లాట్లలో 800 అవే ఉండేలా సీఆర్డీయే ప్రతిపాదించింది. ఒక్కొక్కటి 1285, 1580 చ.అ. విస్తీర్ణంతో ఉండే అపార్ట్‌మెంట్లను 400 చొప్పున, 1880, 2150 చ.అ. అపార్ట్‌మెంట్లను వందేసి చొప్పున నిర్మించనుంది.
 
ఆధునిక వసతులతో.. ఆకట్టుకునే రూపంతో..
తాను నిర్మించబోయే అపార్ట్‌మెంట్లు ప్రైవేట్‌ బిల్డర్లు, డెవలపర్లు కట్టే వాటికి దీటుగా ఉండాలనే అభిప్రాయంతో ఉన్న సీఆర్డీయే అందుకోసం వాటిని సకల ఆధునిక వసతులతో రూపుదిద్దాలనుకుంటోంది. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ సంస్థలతో ఈ గృహ సముదాయాలకు డిజైన్లు సిద్ధం చేయించడమే కాకుండా అందమైన పచ్చదనం, ల్యాండ్‌స్కేపింగ్‌, క్లబ్‌ హౌస్‌ ఇత్యాది వసతులతో వాటిని మరింత ఆకర్షణీయంగా మలచబోతోంది. ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ఫినిష్‌తో ఉండే గోడలు, విట్రిఫైడ్‌ టైల్స్‌తో గచ్చు, ప్రఖ్యాత కంపెనీల ఎలక్ట్రికల్‌, బాత్‌రూం ఫిట్టింగ్స్‌, దోమతెరలను అమర్చుకునే వీలుండే యూపీవీసీ కిటికీలు, టేకుతో చేసిన ద్వారబంధాలు, ప్రధాన ద్వారం తదితరాలతో ఈ అపార్ట్‌మెంట్లు ఉండబోతున్నాయి.
 
 
అంచనాలు ఇలా..
ఈ వెయ్యి అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి (పన్నులను మినహాయించి) మొత్తం రూ.500 కోట్ల వ్యయమవుతుందని సీఆర్డీయే ఇప్పటికే అంచనా వేసింది. 1285 చ.అ. అపార్ట్‌మెంట్లకు ఒక్కొక్కదానికి రూ.38.55 లక్షల చొప్పున మొత్తం రూ.154.20 కోట్లు, 1580 చ.అ.కు రూ.47.40 లక్షల లెక్కన రూ.189.60 కోట్లు, 1880 చ.అ.కు రూ.56.55 లక్షల చొప్పున రూ.56.50 కోట్లు, 2150 చ.అ. విస్తీర్ణముండే అపార్ట్‌మెంట్లకు రూ.64.50 లక్షల లెక్కన రూ.64.50 కోట్లతోపాటు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ (పీఎంసీ), ప్రోగ్రాం మేనేజర్‌, ఆర్కిటెక్ట్‌, కంటింజెన్సీ ఖర్చులు కలిపి మొత్తం రూ.500 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ అపార్ట్‌మెంట్లను చదరపు అడుగు రూ.3,500 చొప్పున విక్రయించడం (1285 చ.అ. అపార్ట్‌మెంట్‌ ధర రూ.45 లక్షలు, 1580 చ.అ.ది రూ.55.50 లక్షలు, 1880 చ.అ.ది రూ.66 లక్షల చొప్పున, 2150 చ.అ. అపార్ట్‌మెంట్‌ను రూ.75.50 లక్షల చొప్పున) ద్వారా మొత్తం రూ.542.32 కోట్లను పొందవచ్చునని సీఆర్డీయే భావిస్తోంది. అంటే.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా సీఆర్డీయే రూ.42.32 కోట్ల వరకూ లాభం ఆర్జించే అవకాశముంది.
Link to comment
Share on other sites

రాజధానిలో ‘స్మార్ట్‌ పోల్స్‌’!
ఎల్‌ఈడీ దీపాలతో పాటు ఏడెనిమిది సదుపాయాలు
7ap-story5a.jpg
ఈనాడు, అమరావతి: సాధారణంగా మనకు విద్యుత్‌ స్తంభాలంటే... వేలాడే తీగలు, వీధి దీపాలతో కనిపించేవే గుర్తుకొస్తాయి. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న కరెంటు స్తంభాలు (ఎలక్ట్రిక్‌ పోల్స్‌) సంప్రదాయ విద్యుత్‌ స్తంభాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఎల్‌ఈడీ వీధి దీపాలతోపాటు, మరో ఏడెనిమిది సేవలకు కేంద్రంగా ఈ విద్యుత్‌ స్తంభాల్ని వినియోగించనున్నారు. ఇవి నిఘా నేత్రాలుగా, సమాచార కేంద్రాలుగా కూడా ఉపయోగపడనున్న వీటిని ‘స్మార్ట్‌ పోల్స్‌’గా పిలుస్తున్నారు. వీటి ప్రణాళిక తుది దశలో ఉందని, త్వరలోనే ఆచరణలోకి తీసుకువస్తామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

ఇవీ సదుపాయాలు..
రాజధానిలో ఏర్పాటు చేయనున్న పోల్స్‌లో స్మార్ట్‌ ఎల్‌ఈడీ వీధి దీపాలు, వైఫై హాట్‌ స్పాట్‌లు, పర్యావరణ సెన్సర్లు, నిఘా కెమేరాలు, డిజిటల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డులు, ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ పాయింట్లు, వాయిస్‌ ఓవర్‌తో కూడిన ఇంట్రాక్టివ్‌ స్క్రీన్లు, పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, ఎమర్జెన్సీ కాల్‌బాక్స్‌లు వంటి సదుపాయాలుంటాయి.

పూర్తిగా ‘స్మార్ట్‌’...!
స్మార్ట్‌పోల్స్‌ ఆకృతి సంప్రదాయ విద్యుత్‌ స్తంభాలకంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి ఏ పోల్‌లో ఎన్ని రకాల వసతులు కల్పించాలో నిర్ణయిస్తారు. ఉదాహరణకు ప్రతి పోల్‌కీ నిఘా కెమేరా అవసరం లేకపోవచ్చు. ప్రతి పోల్‌లోను పర్యావరణ సెన్సర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. రాజధాని జనాభా, అవసరాలు పెరిగే కొద్దీ స్మార్ట్‌పోల్స్‌లో అదనపు సదుపాయాలు జమచేస్తుంటారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని నగరాల్లో పరిమిత సంఖ్యలో స్మార్ట్‌ పోల్స్‌ ఉన్నాయి. కానీ నగరం మొత్తంలో స్మార్ట్‌ పోల్స్‌ అమరావతిలోనే ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కంట్రోల్‌ సెంటర్‌కి సమాచారం పంపించేందుకు అవసరమైన ప్రత్యేక వ్యవస్థలు స్మార్ట్‌పోల్స్‌లో ఉంటాయి. దానిలో ఉండే ఒక బటన్‌ను నొక్కడం ద్వారా ఆపదలో ఉన్న విషయాన్ని కంట్రోల్‌ సెంటర్‌కి తెలియజేసే వీలుంటుంది. ఇంట్రాక్టివ్‌ తెర... నగరానికి కొత్తగా వచ్చినవారికి సమాచార కేంద్రంగా, మార్గదర్శిగా పయోగపడుతుంది.

 
 
 

కథనాలు

 
Link to comment
Share on other sites

On 7/5/2018 at 10:20 PM, sonykongara said:
DhZduBBXUAEyTp9.jpg

Each lane is 4 meters... 3 lanes each side anukunte 25m + inko 25m for other purposes anukunna.. why do they need 150m? land Acq lone most of the money is gone..

Link to comment
Share on other sites

33 minutes ago, katti said:

Each lane is 4 meters... 3 lanes each side anukunte 25m + inko 25m for other purposes anukunna.. why do they need 150m? land Acq lone most of the money is gone..

6+4 service lanes vunna NH-5, 80 meters vuntundi. konni chotla 90 meters varaku vuntundi(at under passes). ee ORR ki  8+4 anukunna 100m chalu. 150 meters lekka ento mari.

Edited by swarnandhra
Link to comment
Share on other sites

45 minutes ago, swarnandhra said:

6+4 service lanes vunna NH-5, 80 meters vuntundi. konni chotla 90 meters varaku vuntundi(at under passes). ee ORR ki  8+4 anukunna 100m chalu. 150 meters lekka ento mari.

Future expansions, railway line and greenary kosam

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:
ప్రైవేట్‌ సంస్థలకు దీటుగా రాజధానిలో సీఆర్డీయే అపార్ట్‌మెంట్లు!
08-07-2018 08:46:31
 
636666363898379165.jpg
  • మొత్తం 17.20 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియాలో వెయ్యి ఫ్లాట్ల నిర్మాణం
  • అమరావతిపై వివిధ వర్గాల ఆసక్తి దృష్ట్యా డిమాండ్‌ బాగుంటుందని అంచనా
  • రూ.500 కోట్ల వ్యయంపై రూ.42 కోట్లకుపైగా మిగులుతుందనుకుంటున్న సీఆర్డీయే
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధానిలో స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు వీలుగా అక్కడ స్వంత ఇళ్లను కలిగి ఉండాలనుకునే వారి సంఖ్య గణనీయంగా ఉన్నందున అమరావతిలో తొలివిడతగా తాను నిర్మించాలనుకుంటున్న 1,000 అపార్ట్‌మెంట్లకు గిరాకీ బాగానే ఉంటుందని ఏపీసీఆర్డీయే అంచనా వేస్తోంది. అధునాతన నిర్మాణ విధానాలతో, నాణ్యమైన బిల్డింగ్‌ మెటీరియల్‌తో, అనువైన ప్రదేశాల్లో నిర్మించనున్న దృష్ట్యా వీటిని కొనుగోలు చేసేందుకు పలువురు ముందుకు వస్తారని ఈ సంస్థ భావిస్తోంది. 4 సైజుల్లో (1285 చదరపు అడుగులు, 1580, 1880, 2150 చ.అ.) వీటిని ప్రతిపాదించడం ద్వారా మధ్య తరగతి ప్రజలతోపాటు ఎగువ మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాల వారు వీటిపై ఆసక్తి చూపుతారనుకుంటోంది. ఈ అపార్ట్‌మెంట్ల ధరను చదరపు అడుగుకు రూ.3 వేలుగా ప్రాథమికంగా నిర్ణయించడం కూడా కలసి వస్తోందని భావిస్తోంది. వీటికి లభించిన ప్రతిస్పందనపై ఆధారపడి భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని హౌసింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించి, సరసమైన ధరలకు వాటిని విక్రయించడం ద్వారా రాజధానిలో సొంత గూడు కావాలనుకునే వారి ఆకాంక్షను నెరవేర్చాలని ఈ సంస్థ తలపోస్తోంది.
 
15 ఎకరాలు.. 1,000 అపార్ట్‌మెంట్లు..
రాజధానిలోని 15 ఎకరాల్లో పైన పేర్కొన్నట్లుగా, 4 సైజుల్లో సీఆర్టీయే అపార్ట్‌మెంట్లను నిర్మించాలనుకుంటోంది. ఇవి మొత్తం 17.20 లక్షల చదరపుటడుగుల బిల్టప్‌ ఏరియాలో నిర్మితమవుతాయి. అయితే ఈ 15 ఎకరాలూ ఒకే చోట ఉంటాయా, లేక వేర్వేరు ప్రదేశాల్లోనా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ భూముల ధరను ఎకరానికి రూ.4.10 కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం. తొలి దశల్లో తక్కువ విస్తీర్ణముండే అపార్ట్‌మెంట్లపై అధికులు ఆసక్తి చూపుతారనే ఉద్దేశ్యంతో తాను నిర్మించబోతున్న మొత్తం 1,000 ఫ్లాట్లలో 800 అవే ఉండేలా సీఆర్డీయే ప్రతిపాదించింది. ఒక్కొక్కటి 1285, 1580 చ.అ. విస్తీర్ణంతో ఉండే అపార్ట్‌మెంట్లను 400 చొప్పున, 1880, 2150 చ.అ. అపార్ట్‌మెంట్లను వందేసి చొప్పున నిర్మించనుంది.
 
ఆధునిక వసతులతో.. ఆకట్టుకునే రూపంతో..
తాను నిర్మించబోయే అపార్ట్‌మెంట్లు ప్రైవేట్‌ బిల్డర్లు, డెవలపర్లు కట్టే వాటికి దీటుగా ఉండాలనే అభిప్రాయంతో ఉన్న సీఆర్డీయే అందుకోసం వాటిని సకల ఆధునిక వసతులతో రూపుదిద్దాలనుకుంటోంది. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ సంస్థలతో ఈ గృహ సముదాయాలకు డిజైన్లు సిద్ధం చేయించడమే కాకుండా అందమైన పచ్చదనం, ల్యాండ్‌స్కేపింగ్‌, క్లబ్‌ హౌస్‌ ఇత్యాది వసతులతో వాటిని మరింత ఆకర్షణీయంగా మలచబోతోంది. ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ఫినిష్‌తో ఉండే గోడలు, విట్రిఫైడ్‌ టైల్స్‌తో గచ్చు, ప్రఖ్యాత కంపెనీల ఎలక్ట్రికల్‌, బాత్‌రూం ఫిట్టింగ్స్‌, దోమతెరలను అమర్చుకునే వీలుండే యూపీవీసీ కిటికీలు, టేకుతో చేసిన ద్వారబంధాలు, ప్రధాన ద్వారం తదితరాలతో ఈ అపార్ట్‌మెంట్లు ఉండబోతున్నాయి.
 
 
అంచనాలు ఇలా..
ఈ వెయ్యి అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి (పన్నులను మినహాయించి) మొత్తం రూ.500 కోట్ల వ్యయమవుతుందని సీఆర్డీయే ఇప్పటికే అంచనా వేసింది. 1285 చ.అ. అపార్ట్‌మెంట్లకు ఒక్కొక్కదానికి రూ.38.55 లక్షల చొప్పున మొత్తం రూ.154.20 కోట్లు, 1580 చ.అ.కు రూ.47.40 లక్షల లెక్కన రూ.189.60 కోట్లు, 1880 చ.అ.కు రూ.56.55 లక్షల చొప్పున రూ.56.50 కోట్లు, 2150 చ.అ. విస్తీర్ణముండే అపార్ట్‌మెంట్లకు రూ.64.50 లక్షల లెక్కన రూ.64.50 కోట్లతోపాటు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ (పీఎంసీ), ప్రోగ్రాం మేనేజర్‌, ఆర్కిటెక్ట్‌, కంటింజెన్సీ ఖర్చులు కలిపి మొత్తం రూ.500 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ అపార్ట్‌మెంట్లను చదరపు అడుగు రూ.3,500 చొప్పున విక్రయించడం (1285 చ.అ. అపార్ట్‌మెంట్‌ ధర రూ.45 లక్షలు, 1580 చ.అ.ది రూ.55.50 లక్షలు, 1880 చ.అ.ది రూ.66 లక్షల చొప్పున, 2150 చ.అ. అపార్ట్‌మెంట్‌ను రూ.75.50 లక్షల చొప్పున) ద్వారా మొత్తం రూ.542.32 కోట్లను పొందవచ్చునని సీఆర్డీయే భావిస్తోంది. అంటే.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా సీఆర్డీయే రూ.42.32 కోట్ల వరకూ లాభం ఆర్జించే అవకాశముంది.

@Nandamuri Rulz

Link to comment
Share on other sites

వెళ్ళిన పని ఒకటి, జరిగింది మరొకటి.. ఈయన చంద్రబాబు గురు...

Super User
08 July 2018
Hits: 1
 
cbn-lodha-08072018.jpg
share.png

ప్రపంచ నగరాల సదస్సులో పాల్గునటానికి, చంద్రబాబు సింగపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రపంచ నగరాల సదస్సులో భాగంగా, అక్కడకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులకు అమరావతి గురించి వివరించారు చంద్రబాబు. వివిధ దేశాల ప్రతినిధులు చెప్పే బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకుని, అవి అమరావతిలో ఇంప్లెమెంట్ చెయ్యటానికి వెళ్లారు. అయితే, అక్కడ కూడా చంద్రబాబు పెట్టుబడుల వేట ఆపలేదు.. అక్కడకు వచ్చిన కొంత మంది పారిశ్రామిక వేత్తలతో, మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని, పెట్టుబడుల అవకాశాల పై వివరించారు. వెంటనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘లోథా గ్రూపు’ ఆసక్తి చూపింది. వెళ్ళిన పని ఒకటి, జరిగింది మరొకటి అనట్టు, మొత్తానికి చంద్రబాబు ఒక కంపెనీని, రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టటానికి ఒప్పించారు.

 

cbn lodha 08072018 2

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా వుంది ‘లోథా’. మాల్స్, ఓపెన్ స్పేస్ వినోదం వంటి రంగాల్లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సింగపూర్ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అభిషేక్ లోథా వివరించారు. ఆదివారం ముఖ్యమంత్రితో సమావేశమైన అభిషేక్ లోథా ఆంధ్రప్రదేశ్‌లో వున్న అపార అవకాశాలు, జరుగుతున్న అభివృద్ధి తమని ఎంతగానో ఆకట్టుకుందని, ఏపీతో కలిసి పనిచేస్తామని, ఇందుకు తగ్గ ప్రతిపాదనలు-ప్రణాళికలతో సెప్టెంబరులో రాష్ట్రానికి వస్తామని చెప్పారు.

cbn lodha 08072018 3

అత్యంత సుందరమైన ల్యాండ్ స్కేపింగ్‌తో నదీ అభిముఖంగా అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మిస్తున్నామని అభిషేక్‌ లోథాకు ముఖ్యమంత్రి తెలిపారు. మూడు పట్టణ పాలక సంస్థలు, రెండు నగర పాలక సంస్థలు, అనేక గ్రామ పంచాయతీలను కలుపుకుని మహానగరంగా నిర్మిస్తున్నామని చెప్పారు. పరిపాలన కేంద్రంగానే కాకుండా ఆర్థిక కార్యకలాపాల నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్టు వివరించారు. జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధాని నగరాన్ని సుస్థిర పర్యావరణ నగరంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంతో వున్నామని, ఐదు లక్షల మంది రైతులను భాగస్వాములను చేస్తూ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.

‘స్థిరాస్థి అభివృద్దిదారులతో సంప్రదించి రాజధాని అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నాం. అభివృద్ధిలో ప్రపంచస్థాయి నిర్మాణదారుల భాగస్వామ్యం తీసుకుంటున్నాం. అమరావతిలో 1700 ఎకరాల విస్తీర్ణం గల ప్రాంతాన్ని సింగపూర్ అభివృద్ధి చేస్తోంది.’ అని అభిషేక్ లోథాతో ముఖ్యమంత్రి అన్నారు. తిరుపతి, అనంతపురము, విశాఖపట్టణం, అమరావతి నగరాలను మేజర్ ఎకనమిక్ హబ్స్‌గా తీర్చిదిద్దేందుకు జరుపుతున్న కృషిని వివరించారు. తిరుపతి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్, హార్డ్ వేర్ పరిశ్రమల కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. అనేక పేరొందిన విద్యా సంస్థలతో అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా రూపొందిస్తున్నామని, కాలుష్యరహిత పరిశ్రమలతో ఇది కళకళలాడుతుందని చెప్పారు. విశాఖలో ఇప్పటికే అనేక పరిశ్రమలు కొలువుదీరాయని, ఈ నగరాన్ని పారిశ్రామిక-వైజ్ఞానిక నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఎయిరో స్పేస్, డిఫెన్స్, ఆటో సెక్టారుకు ముఖ్య కేంద్రంగా అనంతపురము విరాజిల్లుతుందని అన్నారు. ముంబై సమీపంలో 20 చదరపు కిలోమీటర్ల మేర నిర్మాణాలు జరిపిన లోథా గ్రూపు ఇతర దేశాలలో కూడా లోథా నిర్మాణ కార్యకలాపాలు విస్తృతంగా చేపడుతోంది.

 
Advertisements
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...