Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో ఐటీ
15-06-2018 01:56:19
 
  • తొలి సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు ఏర్పాటు
  • 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • 29న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
  • 22న ఏపీఎన్‌ఆర్‌టీ భవన్‌కు భూమిపూజ
అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో తొలి సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు ఏర్పాటుకానుంది. ఇప్పటివరకూ అమరావతికి సమీపంలోని మంగళగిరి, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో పలు బీపీవో కంపెనీలు, ఐటీ ప్రొడక్ట్‌ కంపెనీలు వచ్చాయి. అయితే వేగంగా అభివృద్ధి చెందేందుకు, ఐటీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రిసెర్చ్‌ సంస్థలు అవసరం. ఆ దిశగా తొలి అడుగు పడనుంది. నూతన రాజధాని అమరావతి పరిధిలోనే ఇది రానుంది.
 
ఈ సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు వల్ల ఐదువేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబుతో దీనికి శంకుస్థాపన చేయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ గ్లోబల్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న ఇన్వికాస్‌ కంపెనీకి ఆ రోజు శంకుస్థాపన చేస్తారు. ఈ కంపెనీతో పాటు మరో 10 సెమీకండక్టర్‌ డిజైన్‌ అండ్‌ రిసెర్చ్‌ కంపెనీలు రానున్నాయి. ఈ కంపెనీలన్నింటితో కలిపి సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు ఏర్పడుతుంది. అమరావతిలోని నీరుకొండ గ్రామ ప్రాంతంలో ఇది ఏర్పాటుకానుంది. దీనికి 50 ఎకరాలు కావాలని సదరు కంపెనీలు అడుగుతున్నాయి. అయితే ప్రభుత్వం 37-40ఎకరాల మధ్యలో కేటాయించనుందని సమాచారం. అమరావతిలో ఐటీ అభివృద్ధికి ఈ సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు మరింత ఊతమిస్తుందని అంటున్నారు.
 
 
రూ.400 కోట్లతో ఏపీఎన్‌ఆర్‌టీ భవనం: మరోవైపు రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఏపీఎన్‌ఆర్‌టీ భవన్‌కు ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. రూ.400కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారు. ఐదు ఎకరాల్లో... 33 అంతస్థులు.. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంటుంది. ఒక ఐకానిక్‌ భవనంగా దీన్ని నిర్మించనున్నారు. ప్రభుత్వానికి పైసా ఖర్చులేకుండా ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ దీనికి నిధులు సమకూరుస్తుంది. ఈ భవనంలో ఐటీ కంపెనీలు, వివిధ సంస్థల కార్యాలయాలు కూడా ఏర్పాటవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఐకానిక్‌ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవనంలోని 120 ఫ్లాట్లను ఎన్‌ఆర్‌ఐలకు విక్రయిస్తారు. వారు వీటిలో నివాసం ఉండొచ్చు.. లేకుంటే ఏవైనా ఐటీ కంపెనీలకు అద్దెకు ఇచ్చుకోవచ్చు. ఒక చదరపు అడుగు ధర రూ.5,500లుగా నిర్ణయించారు. వీటిని కొనుగోలు చేసేందుకు దరఖాస్తులు ఇప్పటివరకూ ఆహ్వానించకున్నా... 500 మంది తాము కొనుగోలు చేస్తామంటూ ఆసక్తి వ్యక్తం చేస్తూ అడిగారని... ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ రవికుమార్‌ వేమూరి తెలిపారు.
 
 
నగరం మొత్తం చూడొచ్చు!
ఏపీఎన్‌ఆర్‌టీ ఐకానిక్‌ భవనం నివాస, వ్యాపార, వాణిజ్యాల మిశ్రమంగా అనేక ప్రత్యేకతలతో ఉండనుంది. ఇందులో కొంత భాగాన్ని ఐటీ కంపెనీల కోసం ఇస్తారు. మరికొంత భాగం విక్రయిస్తారు. కొనుగోలు చేసినవారు కూడా నివాసానికి కానీ, ఐటీ కార్యాలయాలకుగానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ భవనంలో ఐటీ క్యాంపస్‌, ఎన్‌ఆర్‌టీ క్లబ్‌, మైగ్రేంట్స్‌ రిసోర్స్‌ సెంటర్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంటాయి. నగరం మొత్తాన్నీ వీక్షించేలా ఒక రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు.
Link to comment
Share on other sites

రాజధాని భూసమీకరణ విధానం భేష్‌
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఉపమా చౌదరి ప్రశంస

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి స్వచ్ఛందంగా భూసమీకరణ విధానంలో భూములు తీసుకోవడం ప్రశంసనీయమని ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌శాస్త్రి జాతీయ పరిపాలన సంస్థ డైరెక్టర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఉపమా చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ పథకాల పరిశీలనకు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. గురువారం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో రాజధాని పురోగతిపై ఇంధన శాఖ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అమరావతి నిర్మాణంలో రైతుల్ని భాగస్వాముల్ని చేయడంలో భూసమీకరణ పథకం ప్రధాన పాత్ర నిర్వహిస్తుందని ఉపమా చౌదరి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రత్యేక పథకాలు విజయవంతమవ్వాలంటే దార్శనికత ఉన్న నాయకత్వం అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనలోను, సంక్షేమ కార్యక్రమాల అమల్లోను ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న తీరుని ఆమె ప్రశంసించారు.

Link to comment
Share on other sites

అమరావతిలో అద్భుతంగా ఎన్‌ఆర్టీ ఐకాన్‌ టవర్స్‌
19-06-2018 07:19:31
 
636649895846476672.jpg
  • రెండు టవర్లు.. ఒక్కో టవర్‌లో 33 అంతస్థులు
  • అమరావతి సూచిక ఏ అక్షరం నమూనాతో నిర్మాణం
  • 22న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
తుళ్లూరు/అమరావతి: రాజధాని అమరావతిలో అద్భుతంగా ఎన్‌ఆర్టీ ఐకాన్‌ టవర్స్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాయపూడి గ్రామానికి తూర్పుభాగంలో ఐదెకరాల్లో ఒక్కో టవర్‌ని 33 అంతస్థులతో రెండు టవర్లను నిర్మించనున్నారు. ఈ కట్టడాలకు ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పేరులోని ఏ అక్షరం సూచించే విధంగా దీని నమూనా అనుమతి పొందింది. రెండు టవర్ల మధ్యలో రివాల్వింగ్‌ రెస్టారెంటు నిర్మించేలా నమూనాను తీర్చిదిద్దారు.
 
 
అమరావతిలో ఎన్‌ఆర్టీ పెట్టుబడులు
జన్మభూమిని వదలి ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో ఆంధ్రులు 40 వేలకు పైగా నివసిస్తున్నారు. వారందరూ ఒక సంఘంగా ఏర్పడ్డారు. ప్రపంచంలో స్వతంత్ర సభ్యత్వం కలిగిన ఏకైక సంస్థ ఎన్‌ఆర్టీ(నాన్‌ రెసిడెన్స్‌ తెలుగు అసోసియేషన్‌)గా చెప్పవచ్చు. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించటానికి ఎన్‌ఆర్టీ సభ్యులు గతంలో సీఎం చంద్రబాబును సంప్రదించారు. రాజధానికి వచ్చిన ప్రవాసాంధ్రుల అవసరాలు, ఇబ్బందులు పరిష్కరించేందుకు, అలాగే కంపెనీలు ఏర్పాటు చేసుకునే విధంగా ఈ ఐకాన్‌ టవర్స్‌కు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండేందుకు ఎన్‌ఆర్టీ ముందుకు వచ్చిందని అసోసియేషన్‌ అధ్యక్షుడు రవి వేమూరి చెప్పారు.
amravathi-niram.jpg 
 
2014 మే లో చంద్రబాబు సూచనతో ఎన్‌ఆర్టీ ఆవిర్భవించింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఎన్‌ఆర్టీ చేపట్టింది. ఏపీలో ఐటీ సెక్టార్లు ఏర్పాటు చేసి 300 ఉద్యోగాలు కల్పించింది. 27 ఐటీ కంపెనీలు స్థాపించటానికి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు 19కి పైగా పేరొందిన కంపెనీలను ఏర్పాటు చేసింది. రక్షణ, ఎలకా్ట్రనిక్‌ రంగాలకు చెందిన 130కి పైగా చిన్నా, పెద్ద తరహా పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. మంగళగిరిలో ఈ హెల్త్‌ ఐటీ సర్వీసు క్లష్టర్‌, మెక్రోసాఫ్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. 11 ప్రాజెక్టులను నెలకొల్పి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్‌ఆర్టీ సిద్ధంగా ఉంది. 93 గ్రామాలలో 20 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులను కల్పించింది. రాజధానిలో ఐకాన్‌ టవర్‌ల నిర్మాణంతో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని సీఆర్‌డీఏ అధికారులు చెపుతున్నారు.
 
గుర్రపు డెక్క తొలగింపు
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులను జలవనరులశాఖ అధికారులు జేసీబీ సాయంతో చేపట్టారు. బ్యారేజీ వద్ద నదిలో దుర్గాఘాట్‌ పరిసర ప్రాంతాల్లో పదిరోజుల క్రితం కొద్దిమేర ఉన్న గుర్రపుడెక్క క్రమంగా విస్తరించి పెరిగింది. దీంతో బోటింగ్‌కు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇరిగేషన్‌ అధికారులు నదిలో పేరుకు పోయిన గుర్రపు డెక్కను జేసీబీతో తొలిగిస్తున్నారు.
Link to comment
Share on other sites

కృష్ణా దీవిలో గోల్ఫ్‌ రిసార్టు
150 ఎకరాల్లో ఏర్పాటు
వినోద, ఆతిథ్య ప్రాజెక్టులు కూడా
అమరావతిలో పలు ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించిన అధికారులు
ఈనాడు - అమరావతి
19ap-main2a.jpg
రాజధాని అమరావతికి పక్కనే కృష్ణా నదిలోని ఒక దీవిలో గోల్ఫ్‌ రిసార్టు ఏర్పాటుకు సీఆర్‌డీఏ ప్రతిపాదన సిద్ధం చేసింది. 150 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా 18 హోల్స్‌తో ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ (పీజీఏ) ప్రమాణాలతో గోల్ఫ్‌ కోర్సు రూపొందిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో గోల్ఫ్‌ కోర్సుని ఏర్పాటు చేయనున్నారు. దీనికి అవసరమైన భూమిని దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కేటాయిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు అవసరమైన వినోద, ఆతిథ్య ప్రాజెక్టులూ చేపడతారు. గోల్ఫ్‌ కోర్సుతో పాటు రాజధానిలో పీపీపీ విధానంలోనూ, ప్రైవేటు సంస్థలు చేపట్టేందుకు కొన్ని ప్రాజెక్టుల్ని సీఆర్‌డీఏ సిద్దం చేసింది. ఇటీవల స్థిరాస్తి, నిర్మాణరంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమవేశంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల గురించి సీఆర్‌డీఏ అధికారులు వివరించారు. ఆసక్తి ఉన్నవారు వీటిలో భాగస్వాములు కావాలని కోరారు. ఆ ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి..

1. ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ పార్కు(ఐబీపీ)
దీన్ని 20 ఎకరాల్లో నిర్మిస్తారు. సేవారంగం అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందిస్తారు. ఇంటి నుంచి నడిచి వెళ్లేంత దగ్గర్లో కార్యాలయాలుండేలా(వాక్‌ టు వర్క్‌) ఐబీపీలో వసతులు ఉండాలన్నది ఆలోచన. సగం కార్యాయాలు, సగం గృహ వసతి కోసం కేటాయిస్తారు.

2. టూరిజం డిస్ట్రిక్ట్‌
15 ఎకరాల్లో చేపడతారు. దీనిలోనూ సగం నివాస గృహాలకు కేటాయిస్తారు. ఐబీపీకి సమీపంలోనే ఇదీ వస్తుంది. దీనిలో భాగంగా 5 నక్షత్రాల హోటల్‌, ఇతర పర్యాటక ప్రాజెక్టులు చేపడతారు.

3. లీగల్‌ సర్వీసెస్‌ కాంప్లెక్స్‌
అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయి, పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలైతే... సుమారు 8 వేల మంది న్యాయవాదులు ఇక్కడ పనిచేస్తారని అంచనా. వారి కార్యాలయాలు, అనుబంధ సేవల సంబంధించిన కార్యాలయాలు, వసతుల కోసం ఒకటి నుంచి మూడు ఎకరాల విస్తీర్ణంలో లీగల్‌ సర్వీసెస్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలన్నది ప్రతిపాదన. మొత్తం 3 లక్షల చ.అడుగులకుపైగా నిర్మిత ప్రాంతం కలిగిన భవనాలు దీనిలో వస్తాయి. కార్పొరేట్‌ చాంబర్లు, న్యాయవాదుల చాంబర్లు, బిజినెస్‌  సెంటర్‌, సర్వీసు అపార్ట్‌మెంట్లు వంటివి దీనిలో ప్రతిపాదిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఇక్కడి అవసరాలకు 10 లక్షల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాలు అవసరమవుతాయని అంచనా.

4. పారిశ్రామిక పార్కు: కాలుష్య రహిత పరిశ్రమల కోసం 300 ఎకరాల్లో సమీకృత పారిశ్రామిక టౌన్‌షిప్‌గా దీన్ని అభివృద్ధి చేస్తారు. అక్కడ పనిచేసేవారికి అవసరమైన నివాస, వాణిజ్య వసతులూ ఉంటాయి.

5. సమీకృత క్రీడా ప్రాంగణం (స్పోర్ట్స్‌ హబ్‌): పరిపాలన నగరంలోనే 20 ఎకరాల్లో ఇది ఏర్పాటవుతుంది. 11 ఎకరాల్లో క్రీడా వసతులు, మిగతా 9 ఎకరాల్లో నివాస, వాణిజ్య వసతులు కల్పిస్తారు. 25 వేల మంది కూర్చునేలా అవుట్‌డోర్‌ స్టేడియం, 5 వేల చ.మీ. వైశాల్యం గల మల్టీ ఈవెంట్‌ స్పోర్ట్స్‌ హాల్‌, వెయ్యి మందికి శిక్షణనిచ్చే అకాడెమీ వంటివి ఏర్పాటవుతాయి. రూ.242 కోట్లు వ్యయమవుతాయని అంచనా. ప్రాజెక్టు టెండరు దశలో ఉంది.

6. రివర్‌ ఫ్రంట్‌-లీజర్‌ రిసార్టు:కృష్ణా నదిలోని ఒక దీవిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు చేపడతారు. లీజర్‌ రిసార్ట్‌, కాటేజీలు, షాపింగ్‌ తదితర అవసరాల కోసం వాణిజ్య భవనాలు నిర్మిస్తారు.

7. మైస్‌ హబ్‌:  సదస్సులు, సమావేశాలు, ఎగ్జిబిషన్లు వంటివి నిర్వహించేందుకు పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనున్నారు. దీన్నే మైస్‌(మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, కాన్ఫరెన్సెస్‌, ఎగ్జిబిషన్స్‌) హబ్‌గా వ్యవహరిస్తారు. 20 ఎకరాల్లో దీన్ని ప్రతిపాదించారు. 12.5 ఎకరాల్లో కన్వెన్షన్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్‌ నిర్మిస్తారు. 1.5 ఎకరాల్లో హోటల్‌ నిర్మిస్తారు. ఆరు ఎకరాల ఖాళీ స్థలం ఉంటుంది. రెండో దశలో ఈ ప్రాజెక్టుని మరింత విస్తరించే అవకాశం ఉంది.

8. ఐటీ పార్కు: 198 ఎకరాల్లో ఐటీ పార్కు వస్తుంది. 53 ఎకరాల్లో ఐటీ ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటుకు అనుమతి కోసం సీఆర్‌డీఏ దరఖాస్తు చేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ సంస్థల అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ భవనాలు నిర్మిస్తారు. మొదటి దశలో 10 లక్షల చ.అడుగుల విస్తీర్ణంతో కూడిన భవనాలు నిర్మించాలన్నది ఆలోచన.

 
 
 
Link to comment
Share on other sites

రాజధానిలో జంతు ప్రదర్శనశాల
తాడేపల్లి కొండలపై 251 హెక్టార్లలో ఏర్పాటు
సచివాలయ టవర్ల నిర్మాణానికి గుత్తేదారుల ఖరారు
రాజధాని పనుల పురోగతిపై సీఎం సమీక్ష

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో 251 హెక్టార్లలో జంతు ప్రదర్శన శాల, నైట్‌ సఫారీ ఏర్పాటు చేయనున్నారు. తాడేపల్లి కొండలపై అనువైన స్థలాన్ని గుర్తించామని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

బొటానికల్‌ గార్డెన్‌ను కూడా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అమరావతిలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని ముఖ్యమంత్రి బుధవారం రాత్రి ఉండవల్లిలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు.

* కృష్ణా కరకట్ట మార్గాన్ని రాజధాని బృహత్‌ ప్రణాళికలో పేర్కొన్నట్టుగా నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు రూపొందించిన ప్రతిపాదనపై చర్చించారు. ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టాలని.. మిగతా రహదారులు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

* పరిపాలన నగరంలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్‌ టవర్స్‌పై షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. వీటిలో 20 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుందన్నారు. వాణిజ్య, నివాస అవసరాలకు తగ్గట్టుగా ఐకానిక్‌ టవర్స్‌ నిర్మాణం జరుగుతుందని, ఒక హోటల్‌ కూడా ఉంటుందని తెలిపారు. వాటిలో ఒక టవర్‌ ఎత్తు 374 మీటర్లు, రెండో టవర్‌ ఎత్తు 239 మీటర్లు ఉంటుందన్నారు. నిర్మాణానికి రూ.4 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చేందుకు లాభదాయక మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి సూచించారు. టవర్ల ఆకృతుల్ని మరింత మెరుగుపరచాలని ఆయన తెలిపారు.

* పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణానికి గుత్తేదారులను ఖరారు చేశారు. ఐదు టవర్లకు గాను... ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే టవర్‌ను ఎన్‌సీసీ; 1, 2 టవర్లను ఎస్‌పీసీపీఎల్‌; 3, 4 టవర్లను ఎల్‌ అండ్‌ టీ సంస్థలు నిర్మిస్తాయి.

* రాజధానిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని సాధారణ ప్రజలు కూడా ఆన్‌లైన్‌లో రియల్‌టైంలో తెలుసుకునేందుకు వెబ్‌ పోర్టల్‌ రూపొందించినట్టు అధికారులు తెలిపారు. భౌతికంగా అక్కడ ఎంత శాతం పనులు పూర్తయ్యాయో చూడటంతో పాటు, ఎంత విలువైన పనులు జరిగాయో కూడా ప్రజలు తెలుసుకోవచ్చునని వెల్లడించారు.

* సింగపూర్‌-విజయవాడ మధ్య నేరుగా విమాన సర్వీసు నడిపేందుకు అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Link to comment
Share on other sites

అమరావతిలో ‘జూ పార్క్‌’
21-06-2018 02:39:27
 
  • తాడేపల్లి కొండపై 251 ఎకరాల్లో ఏర్పాటు!
  • ‘జూ’తోపాటు సఫారీ జోన్‌
  • ఏడీసీ సీఎండీ ప్రతిపాదన
  • కీలక సూచనలు చేసిన సీఎం
  • శాశ్వత సచివాలయం టెండర్లు ఖరారు
  • సింగపూర్‌ విమాన మార్గంపై కేంద్రంతో మాట్లాడాలని చంద్రబాబు సూచన
  • 4వేల కోట్ల ఐకానిక్‌ టవర్లు
  • డిజైన్లు చూపించిన షాపూర్జీ పల్లోంజీ
  • రాష్ట్రానికి ఆదాయమార్గంగా ఉండాలని వ్యాఖ్య
అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లో భారీ జంతు ప్రదర్శనశాల(జూ పార్క్‌) ఉంది. మరి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అలాంటి ఏర్పాటుకు అవకాశం ఉందా? దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదన ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెంతకు చేరింది. తాడేపల్లిలోని ఒక కొండపై 251 ఎకరాల్లో ‘జూ పార్క్‌’తోపాటు సఫారీ జోన్‌ నెలకొల్పాలన్న ప్రతిపాదనను ఏడీసీ సీఎండీ డి. లక్ష్మీ పార్థసారధి సీఎంకు అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టులో పలు వృక్షజాతులకు నెలవైన బొటానికల్‌ గార్డెన్‌ కూడా జత పరిస్తే బాగుంటుందని చంద్రబాబు సూచించారు. అదురైన పలు జంతు, వృక్షజాతులను ప్రత్యక్షంగా పరిశీలించే అద్భుతమైన అవకాశం ప్రజలకు కలుగుతుందని పేర్కొన్నారు. రాజధానికి మరిన్ని వినూత్న హంగులను చేకూర్చే విధంగా వివిధ ప్రతిపాదనలపై బుధవారం జరిగిన ఏపీ సీఆర్డీయే సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది.
 
 
ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ సాగింది. శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ టెండర్లను ఖరారు చేసినట్లు సీఆర్డీయే అధికారులు తెలిపారు. మొత్తం 5 టవర్లలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే టవర్‌(జీఏడీ)ని ఎన్‌సీసీ నిర్మించనుండగా.. మిగిలిన నాలుగింటిలో 1,2 టవర్లను ఎస్‌పీసీపీఎల్‌, 3,4 టవర్లను ఎల్‌అండ్‌టీ నిర్మిస్తాయని పేర్కొన్నారు. రాజధానిలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల పనులను రియల్‌టైమ్‌లో పరిశీలించేందుకు వీలుగా ఒక వెబ్‌పోర్టల్‌ను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. దీనిని ప్రజలు సైతం చూడొచ్చని, ఫలితంగా రాజధానిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారని వివరించారు. అలాగే విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చూడాలని అధికారులు సీఎం ఆదేశించారు. ఈ మార్గంలో ఫ్లైట్‌ రూట్లను ఖరారు చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసేలా సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు.
 
 
మరో రెండు ఐకానిక్‌ టవర్లు
రాజధానిలో నిర్మించే భారీ మిక్స్‌డ్‌ యూజ్‌ ఐకానిక్‌ టవర్ల డిజైన్లను సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చూపించారు. 20 లక్షల చ.అ.ల్లో ఉండే ఈ ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.4వేల కోట్లు. వీటిల్లోని పొడవైన టవర్‌ 374 మీటర్ల ఎత్తుతోనూ, పొట్టి టవర్‌ 239 మీటర్ల ఎత్తుతోనూ ఉంటాయి. వీటిల్లో వాణిజ్య, నివాస సముదాయాలతోపాటు ఒక హోటల్‌ను కూడా ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ భారీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. దీనిద్వారా ఆశించినంత ఆదాయం లభించేలా చూడడంతోపాటు సుప్రసిద్ధ సంస్థలను ఇక్కడికి రప్పించడమూ ప్రధానమన్నారు. ఇందుకోసం ఈ టవర్లలో హోటల్‌, రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ కార్యకలాపాలకు ఇతోధిక నిష్పత్తిలో స్థలాలను కేటాయించాలని సూచించారు. వీటి డిజైన్లను మరింత మెరుగు పరచాలన్నారు.
 
 
4 వరుసలుగా కరకట్ట రహదారి
అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో చూపించిన విధంగా కృష్ణానది కరకట్ట రోడ్డును 4 వరుసలుగా విస్తరించడంతోపాటు పటిష్ఠం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనివల్ల రాజధాని ప్రాంతంలో వాహనాల్లో సురక్షితంగా ప్రయాణించే వీలుకలుగుతుందని అన్నారు.
Link to comment
Share on other sites

రేపు ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన
21-06-2018 09:31:11
 
636651702851909217.jpg
  • ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం
  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు
  • ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ నిర్మించనున్న తొలి ప్రత్యక్ష పెట్టుబడి ప్రాజెక్టు
  • 3 వేల మందికి భారీ వేతనాలతో ఉద్యోగావకాశాలు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నగరంలోని రాయపూడిలో గురువారం (ఈ నెల 22న) ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10గంటలకు రాయపూడిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ సైట్‌లో ప్రాంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు పాల్గొంటారని గుంటూరు జిల్లా అధికారవర్గాలు తెలిపాయి. ప్రవాస తెలుగు ప్రజలు సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆ సంస్థ ప్రత్యేకంగా ఐకాన్‌.ఏపీఎన్‌ఆర్‌టీ.కామ్‌ వెబ్‌సైట్‌ని కూడా ప్రారంభించింది. ఐకాన్‌ కోసం పేర్లను నమోదు చేసుకొనేందుకు, మెంబర్‌గా రిజిస్టర్‌ అయ్యేందుకు ఆప్షన్స్‌ని అందుబాటులో ఉంచింది.
 
 
ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి సంబంధించిన మొట్టమొదటి ప్రత్యక్ష పెట్టుబడి ప్రాజెక్టుగా ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ని సంస్థ పేర్కొంటోంది. మల్టిపుల్‌ బ్లూచిప్‌ కంపెనీలకు ఈ ఐకాన్‌ గుడారంలా ఉంటుంది. 2000 నుంచి 3000 మంది ఎక్కువ వేతనాలను పొందే ఉద్యోగులను అమరావతి రాజధాని నగరానికి ఈ ఐకాన్‌ తీసుకొస్తుంది. ఇక్కడ లభించే ఉద్యోగాలు అంతర్జాతీయ స్థాయిలో ఖర్చులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. అలానే ప్రపంచవ్యాప్తంగా బయ్యర్లకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు తీసుకొస్తుంది. పెట్టుబడిదారులకు ఎలాంటి రిస్కు ఉండదు. ఈ ప్రాజెక్టుకు ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీతోపాటు ఏపీ ప్రభుత్వం ప్రమోటర్లుగా ఉన్నందున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఈ ప్రాజెక్టులో బహిరంగ ప్రదేశాలు, కన్వెన్షన్‌ హాల్స్‌, ఆఫీసులు, సమావేశ మందిరాలు, గార్డెన్‌ అపార్టుమెంట్స్‌, సూట్స్‌, టెర్రాస్‌ గార్డెన్‌, ఇన్‌ఫినిటీ పూల్‌, స్పా, చుట్టూత తిరిగే రెస్టారెంట్‌ వంటి సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు. 33 అంతస్తులలో ఐకాన్‌ టవర్‌ ఉంటుంది. ఇది రాజధానికే ఒక వజ్రంలా ఉంటుందని సొసైటీ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, కృష్ణానదికి మధ్యన ఉండటం వల్ల ప్రకృతి ఒడిలో ఇమిడినట్లుగా ఉంటుంది. 33వ అంతస్తులో రూఫ్‌టాప్‌ పూల్‌, ఎన్‌ఆర్‌టీ క్లబ్‌ ఉంటాయి. ప్రైవేటు కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, జిమ్నాజియం కూడా ఉంటాయి.
 
ఐకాన్‌ చుట్టూత ఇన్‌సులార్‌ స్కిర్ట్‌ ఏర్పాటు చేయడం వల్ల 30 శాతం ఇంధనం ఆదా అవుతుంది. రూప్‌ టాప్‌ గార్డెన్స్‌తో సహజసిద్ధమైన చల్లదనం అమరుతుంది. నీటిని పొదుపు చేసేందుకు కూడా ప్రాజెక్టులు చేపడతారు. సోలార్‌ విద్యుత్‌తో కార్బన్‌ ఎమిషన్స్‌ ఉండవు. రివర్‌ఫ్రంట్‌లో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు స్పెషాలిటీ కియోస్క్‌లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో సంస్థకి 4,500 ఎస్‌ఎఫ్‌టీని కేటాయిస్తారు. ప్రపంచస్థాయి సర్వీసు ఆర్గనైజేషన్స్‌తో ఐకాన్‌ స్పేసెస్‌ని ఆరోగ్యవంతంగా ఉంచుతారు. 9 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ని నిర్మించనున్నందున ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి సమావేశమై వారి ఆలోచనలను పంచుకొనేందుకు వేదికగా నిలుస్తుంది.
Link to comment
Share on other sites

భూకంపాలనూ తట్టుకుంటాయ్‌
 ఆధునిక సాంకేతికతతో సచివాలయ టవర్లు
 దేశంలోనే తొలిసారిగా ట్విన్‌లిఫ్ట్‌ పరిజ్ఞాన వినియోగం
 1 నుంచి పనులు ప్రారంభం
 వ్యయం రూ.2,271 కోట్లు

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణంలో ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. వీటిని ‘డయాగ్రిడ్‌’ విధానంలో నిర్మించనున్నారు. ఈ భవనాల్లో దేశంలోనే మొదటిసారిగా ఒకే ఒరలో రెండు లిఫ్ట్‌లు (‘ట్విన్‌లిఫ్ట్‌’) పరిజ్ఞానాన్ని ఉపయోగించనుండటం మరో ప్రత్యేకతగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనరు చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 5 భారీ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. మొత్తం 5 టవర్ల నిర్మాణ వ్యయం రూ.2,271.32 కోట్లు. వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలనా విభాగం ఉండే టవర్‌ను ఎన్‌సీసీ (రూ.554.23 కోట్లు), 1, 2   టవర్లను షాపూర్జీ పల్లోంజీ (రూ.932.47 కోట్లు), 3, 4 టవర్లను ఎల్‌అండ్‌టీ (రూ.784.62 కోట్లు) సంస్థలు నిర్మించనున్నాయి. ఈ 3 సంస్థలకు పనులు అప్పగిస్తూ సీఆర్‌డీఏ గురువారం ధ్రువీకరణ పత్రాలు అందజేసింది. ఆయా సంస్థలు జులై 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభించనున్నాయి. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం.

అటు అందం.. ఇటు దృఢత్వం..
ముఖ్యమంత్రి కార్యాలయ టవర్‌ 50 అంతస్తులు, మిగతా నాలుగు టవర్లు 40 అంతస్తుల చొప్పున ఉంటాయి. డయాగ్రిడ్‌ విధానంలో నిలువు స్తంభాలు (కాలమ్స్‌) ఉండవు. భవనం మధ్యలో ‘సెంట్రల్‌ కాంక్రీట్‌ కోర్‌’ ఉంటుంది. భవనం చుట్టూ బలిష్టమైన మెటల్‌ పైపులతో రూపొందించిన స్టీల్‌ డయాగ్రిడ్‌ నిర్మాణం ఉంటుంది. భవనం బరువంతా సెంట్రల్‌ కోర్‌తోపాటు ఈ గ్రిడ్‌పైనే ఆధారపడుతుంది. దీనివల్ల సాధారణ భవనాలకంటే ఇవి ఎక్కువ దృఢంగా ఉంటాయి. దీనిలో ‘బక్లింగ్‌ రెసిస్టెన్స్‌ బ్రాస్‌’ టెక్నాలజీ వినియోగిస్తారు. దీనివల్ల డయాగ్రిడ్‌కు కొంత సాగే (ఎలాస్టిక్‌) గుణం వస్తుంది. భూకంపాలవల్ల భారీ కుదుపులు తలెత్తితే... సాగే గుణంవల్ల డయాగ్రిడ్‌ షాక్‌ అబ్జార్బర్‌లా పని చేస్తుందని సీఆర్‌డీఏ అధికారులు వివరించారు. భవనాల్లో కాలమ్స్‌ లేకపోవడంవల్ల ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుంది. భవనం చుట్టూ అద్దాలు ఉండటం ధారాళంగా వెలుతురు వస్తుందని, విద్యుత్తు వినియోగం తగ్గుతుందని వివరించారు. ‘ట్విన్‌ లిఫ్ట్‌’ల టెక్నాలజీ ఈ భవనాల్లో మరో ప్రత్యేకత. సాధారణంగా ఒక షాప్ట్‌లో ఒకే లిఫ్ట్‌ కారు ఉంటుంది. ‘ట్విన్‌ లిఫ్ట్‌’ విధానంలో ఒకే షాఫ్ట్‌లో రెండు లిఫ్ట్‌లు ఉంటాయి. కొన్ని అంతస్తుల వరకు ఒక లిఫ్ట్‌, మరికొన్ని అంతస్తుల వరకు మరో లిఫ్ట్‌ పనిచేస్తుంది.
* 5 టవర్లను 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.
* సీఎం కార్యాలయం 49వ అంతస్తులో ఉంటుంది. 50వ అంతస్తులో (టెర్రేస్‌) హెలిప్యాడ్‌ ఉంటుంది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...