Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలి: చంద్రబాబు
13-06-2018 13:52:17
 
636644947495190347.jpg
అమరావతి: కొత్త నగరంలో తమకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని రియల్ ఎస్టేట్ డెవలపర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం సీఆర్డీఏపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని తెలిపారు.
 
సాంకేతికతను మేళవించి ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ నగరాలను పరిశీలించామని సీఎం తెలిపారు. సింగపూర్, అమ్‌స్టర్‌డ్యామ్ నగరాలకు లేని ఫ్రెష్‌వాటర్ అమరావతి సొంతమని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్లు ఇక్కడికి వచ్చాయని రియల్ ఎస్టేట్ డెవలపర్లకు చంద్రబాబు తెలియజేశారు. బాబు పిలుపుపై రియల్‌ఎస్టేట్‌ డెవలపర్లు స్పందిస్తూ భూములిచ్చి రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు ముందుకొస్తే అభివృద్ధి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Amaravati to become a knowledge hub
Amaravati to become a knowledge hub

Amaravati to become a knowledge hub

Wednesday, Jun 13, 2018
CRDA Commissioner Sreedhar Cherukuri made a presentation to update the attendees with the progress of works and unique opportunities that are available to them for starting their projects in Amaravati.

Inviting ideas and suggestions from the real estate developers present at the meeting, the Chief Minister said, “This is a unique opportunity for all of you as Amaravati is offering you a Greenfield region, unlike the other cities where your works were done around brownfield regions. We want to make Amaravati a beautifully planned city with immense economic opportunities and bring a high level of happiness to its residents.”

“If you take the example of some of the well-planned cities like Chandigarh, you will see that it serves only as an administrative capital and doesn’t have as many economic opportunities. Cities like Naya Raipur, Navi Mumbai, Gandhinagar, all have some challenge or other in form of connectivity, lack of foreign investment and so on. Singapore also faced challenges initially in the form of water scarcity where it had to get water from Malaysia and shortage of land where they had to do land reclamation. Simailarly, Dubai also had issues like harsh weather and water scarcity. Unlike all these cities, Amaravati will not pose any challenges to you as we have a great riverfront with abundant freshwater resources along with 5 reservoirs. Land and space is also not an issue and the available soil is fertile in nature. We have a dynamic and hardworking population who are resolved to do great service to the state”, said the Chief Minister.

The Chief Minister also spoke about his vision to make Amaravati Carbon dioxide neutral and said he is taking active measures to encourage people to go towards electric vehicles and public transport would also be primarily electric. This would open opportunities to the real estate developers who are also into the manufacturing sector.

“We have an aim of making Amaravati an iconic city and for that, we have made sure that all registrations of land are done entirely online and are using blockchain technology for the same. You are the builders developing a better society and better future. I want to bring best schools, universities, hotels, hospitals and economic centres to Amaravati. We will together develop Amaravati with the help of best consultants and technology and your cooperation is of utmost importance. I need your partnership and will be open to any kind of suggestion you have as you too have a terrific track record in infrastructure developments. It will be an exciting challenge to you as well as till today you might have worked on an area or an IT park or a particular stretch. However, here you have a whole city to develop which is an opportunity like never before”, said the Chief Minister speaking on the need for cooperation between the Government and the real estate developers.

Responding to the Chief Minister’s appeal for collaborative development, a top official from Raheja Group said, “To bring in IT jobs we need to develop a social infrastructure. A help from government on that front and creating easy access to resources will help us immensely in operations and movement.”

The Chief Minister responded to the real estate developers’ queries on connectivity and accessibility saying, “Connectivity is an extremely crucial part of development. In case of Hyderabad, my primary aim was to enhance the connectivity and public transport which would aid in economic activities and today, the results are there for everyone to see. In past too I came up with the 1st open air policy and got in touch with Emirates Airlines to establish easy air travel. I developed the traffic first which resulted in a fantastic airport that we have today. The Government will provide all necessary support and ease of policies within regulations to enable your movement and transport.”

A senior official from Mahindra Lifespaces told the Chief Minister that Amaravati could also be developed as a manufacturing hub and based on their experiences in other cities, if livelihood opportunities are developed, it will automatically bring life to the area and developers must be prepared to provide housing to any number of people.

Responding to a real estate developer’s query on the USP of Amaravati, the Chief Minister said, “Vishakhapatnam is the IT hub of the state. A lot of fintech, tourism and other commercial establishments are already present and many more are coming up. Tirupati is the hardware hub of the state and has resources in abundance. Amaravati is the capital and flagship city of the state which we are aiming to establish as a knowledge economy.”

The Chief Minister informed the attendees that within a month's time, the government will discuss and accept the policies and in two months time tender and project finalization would be completed. “We will share our policies with you and you can come up with your suggestions on more ideas for the betterment of Amaravati.”
 
Link to comment
Share on other sites

ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనానికి 22న శంకుస్థాపన 
40 దేశాల జెండాలతో పెవిలియన్‌ ఏర్పాటు 
13ap-state3a.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించే ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌’ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. 33 అంతస్తుల ఈ టవర్‌ను ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ నిర్మిస్తోంది. పూర్తిగా ప్రవాసాంధ్రుల పెట్టుబడితో, వారి కోసమే నిర్మిస్తున్న టవర్‌ ఇది. రాయపూడి సమీపంలో నిర్మించే ఈ భవనం ముందు ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ 40 దేశాలకు చెందిన జాతీయ పతాకాలతో ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్‌ శాశ్వతంగా ఉంటుంది. 9 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో 50 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ భవనం ఆకృతుల్ని కొరియాకు చెందిన స్పేస్‌ గ్రూప్‌ సంస్థ ఇప్పటికే రూపొందించింది. అమరావతిని ప్రతిబింబించేలా ఆంగ్ల అక్షరం ‘ఎ’ ఆకారంలో ఆకృతి ఉంటుంది. రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసిన గ్లోబ్‌లో రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ ఉంటుంది. 120 దేశాల్లోని ప్రవాసాంధ్రుల ఉనికికి చిహ్నంగా గ్లోబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవికుమార్‌ వేమూరు తెలిపారు. ఈ భవనంలో 8 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుందని, 100 కంపెనీల ఏర్పాటుకు వీలుంటుందని వెల్లడించారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

Link to comment
Share on other sites

ఇక రియల్‌ అభివృద్ధి! 
రాజధానిలో స్థిరాస్తి, నిర్మాణ  కంపెనీలకు భూములు 
స్థలాల కేటాయింపు, రాయితీలపై ప్రత్యేక విధానం 
  అగ్రశ్రేణి సంస్థల యజమానులు, ప్రతినిధులతో సీఎం సమావేశం 
  ప్రతి సంస్థా కనీసం ఒక ఐకానిక్‌ ప్రాజెక్టు చేపట్టాలని సూచన 
  పారదర్శకంగా కేటాయింపులు ఉంటాయని స్పష్టీకరణ 
13ap-main1a.jpg

ఈనాడు అమరావతి: దేశంలోని అగ్రశ్రేణి స్థిరాస్తి, నిర్మాణ సంస్థలు రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన ఒక విధానాన్ని ప్రభుత్వం రూపొందించనుంది. ఆయా సంస్థలకు భూముల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన, రాయితీల వంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఈ విధానంలోనే రాజధానిలో పెద్ద ఎత్తున ప్రైవేటు గృహ నిర్మాణం, కార్యాలయాలు, ఇతర నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆయా సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించనుంది. భూములు ఎంత ధరకు, ఏ ప్రాతిపదికన ఇవ్వాలి వంటి అంశాలపై ఆయా సంస్థల నుంచి సలహాలు తీసుకుని మార్గదర్శకాలను రూపొందించనుంది. వాటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాక విధాన ప్రకటన విడుదలవుతుంది.  దేశంలోని ప్రముఖ స్థిరాస్తి, నిర్మాణ రంగ సంస్థల యజమానులు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొదట సీఆర్‌డీఏ కమిషనరు చెరుకూరి శ్రీధర్‌ రాజధానిపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘దేశంలోని అగ్రశ్రేణి సంస్థలన్నీ రాజధానిలో కనీసం ఒక్కో ప్రాజెక్టు చేపట్టాలి. మీరు చేపట్టే ప్రాజెక్టు రాజధానికి తలమానికంగా ఉండాలి. వాటిని చూసేందుకే ప్రజలు రాజధానికి వచ్చేలా ఉండాలి. అమరావతిని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు మీ సలహాలు, సూచనలివ్వండి. మహానగర నిర్మాణంలో మీరూ పాలుపంచుకోండి’ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో పేర్కొన్నారు. భూముల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని, ఎవరూ తప్పు పట్టకుండా, కోర్టుల జోక్యానికి అవకాశం లేకుండా... అందరికీ ఏకరూప విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఎక్కువ అర్హతలు ఎవరికి ఉంటే వారికే భూములు కేటాయిస్తామని తెలిపారు. ‘అమరావతికి 20 నుంచి 22 కి.మీ. నదీతీరం ఉంది. వైకుంఠపురం వద్ద మరో బ్యారేజీ నిర్మిస్తున్నాం. స్వచ్ఛమైన నీటికి కొరత లేదు. కృష్ణా నదిలో 2వేల ఎకరాల విస్తీర్ణం కలిగిన ఏడు దీవులున్నాయి. వాటినీ పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయవచ్చు. దేశంలోని 10 అగ్ర శ్రేణి స్థిరాస్తి, నిర్మాణ సంస్థలు వచ్చి ఇక్కడ మొదట ప్రాజెక్టులు చేపట్టాలన్నది నా అభిమతం. మీ ఆలోచనలు చెప్పండి. నేను అమలు చేస్తా’ అని తెలిపారు. ‘గతంలో హైదరాబాద్‌లో రహేజా మైండ్‌ స్పేస్‌ ప్రాజెక్టుకు 100 ఎకరాలు కేటాయించినప్పుడు ఎకరానికి వెయ్యి ఉద్యోగాల చొప్పున రావాలని షరతు పెట్టా. అమరావతిలోనూ మా లక్ష్యం అదే’ అని ముఖ్యమంత్రి వివరించారు.

* ‘మేం 2 లక్షల చ.అడుగుల ఐటీ స్పేస్‌ నిర్మిస్తాం. ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రస్తుతం మీరు అద్దెలో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. దానికి బదులు ఐదేళ్లపాటు ఉచితంగా ఐటీ కంపెనీలకు ఆఫీస్‌ స్పేస్‌ ఇవ్వండి. అది ఆకర్షణీయంగా ఉంటుంది. 25వేల నుంచి 30వేల ఐటీ ఉద్యోగులు వస్తే నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది’ అని ఒక నిర్మాణ సంస్థ ప్రతినిధి సూచించగా... పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

*‘రాజధాని రైతులకు సీఆర్‌డీఏ స్థలాలిచ్చింది. కొందరు రైతుల నుంచి ఆ స్థలాలను సమీకరించి ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టవచ్చు. ఈ సమీకరణలో సీఆర్‌డీఏ తోడ్పాటునందించాలి’ అని మరొకరు ప్రతిపాదించారు. ఈ మైక్రోపూలింగ్‌ ఆలోచన బాగానే ఉందని సీఎం పేర్కొన్నారు.

* ఐటీ ఉద్యోగాలు రావాలంటే సామాజిక మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టాలని, అమరావతికి అనుసంధానత పెరగాలని కొందరు ప్రతినిధులు పేర్కొన్నారు. విశాఖపట్నం, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలకు సమాన దూరంలో ఉండటం అమరావతికి కలసి వచ్చే అంశమని, ఆయా నగరాలతో అమరావతిని అనుసంధానించేందుకు అవసరమైన ప్రాజెక్టులు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు.

* 50 నుంచి 100 ఎకరాల్లో బహుళ ప్రయోజనకర ప్రాజెక్టులు (మల్టీ యూజ్‌) చేపట్టేందుకు బిల్డర్లకు అవకాశమివ్వాలన్న సూచన వచ్చింది. ఒక భారీ భవనం నిర్మిస్తే... అందులో కింద కమర్షియల్‌, మధ్యలో కార్యాలయాలు, పైన నివాస అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని, అప్పుడు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని కొందరు కోరారు.

* తమకు కేటాయించే భూముల ధరను వాయిదాల విధానంలో చెల్లించే అవకాశమివ్వాలని ఒక ప్రతినిధి సూచించారు. 
పర్యావరణవేత్తలు అభివృద్ధినే అడ్డుకుంటారు..

కృష్ణా నదీతీరంలో పెద్ద ఎత్తున గృహ సముదాయాలు నిర్మించడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ సూచించారు. ‘పర్యావరణ అంశాల్నీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. మన దేశంలో పర్యావరణం పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎప్పుడూ కొందరు సిద్ధంగా ఉంటారు. కాలుష్యాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోరు. మూసీనది పూర్తిగా కాలుష్య కాసారంగా మారింది. అయినా ఎవరికీ పట్టదు’ అని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. సమావేశంలో డీఎల్‌ఎఫ్‌, శోభా, ప్రెస్టీజ్‌, మై హోం, రహేజా, మహీంద్రా, ఈవీపీ, షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టీ, అపర్ణ, సాలపురి సత్తావ, జీవీకే, ఎన్‌ఎస్‌ఎల్‌, గార్డెన్‌ సిటీ, సైబర్‌ సిటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

హెలికాప్టర్‌లో అమరావతి సందర్శన.. 
ముఖ్యమంత్రితో సమావేశమయ్యేందుకు వచ్చిన వివిధ సంస్థల యజమానులు, ప్రతినిధులు హెలికాప్టర్‌లో రాజధాని ప్రాంతాన్ని, జరుగుతున్న పనుల్ని పరిశీలించే ఏర్పాటు చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు హెలికాప్టర్‌లో బృందాలుగావెళ్లి రాజధానిని వీక్షించారు.

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:
ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనానికి 22న శంకుస్థాపన 
40 దేశాల జెండాలతో పెవిలియన్‌ ఏర్పాటు 
13ap-state3a.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించే ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌’ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. 33 అంతస్తుల ఈ టవర్‌ను ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ నిర్మిస్తోంది. పూర్తిగా ప్రవాసాంధ్రుల పెట్టుబడితో, వారి కోసమే నిర్మిస్తున్న టవర్‌ ఇది. రాయపూడి సమీపంలో నిర్మించే ఈ భవనం ముందు ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ 40 దేశాలకు చెందిన జాతీయ పతాకాలతో ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్‌ శాశ్వతంగా ఉంటుంది. 9 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో 50 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ భవనం ఆకృతుల్ని కొరియాకు చెందిన స్పేస్‌ గ్రూప్‌ సంస్థ ఇప్పటికే రూపొందించింది. అమరావతిని ప్రతిబింబించేలా ఆంగ్ల అక్షరం ‘ఎ’ ఆకారంలో ఆకృతి ఉంటుంది. రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసిన గ్లోబ్‌లో రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ ఉంటుంది. 120 దేశాల్లోని ప్రవాసాంధ్రుల ఉనికికి చిహ్నంగా గ్లోబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవికుమార్‌ వేమూరు తెలిపారు. ఈ భవనంలో 8 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుందని, 100 కంపెనీల ఏర్పాటుకు వీలుంటుందని వెల్లడించారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

This is excellent news 

Link to comment
Share on other sites

రండి.. మహానగర నిర్మాణంలో పాల్గొనండి
14-06-2018 02:55:11
 
  • రాజధానికొచ్చే డెవలపర్లకు ప్రత్యేక విధానం
  • మరే నగరానికీ లేని ప్రత్యేకతలు
  • స్థిరాస్తిరంగ దిగ్గజ సంస్థలతో సీఎం భేటీ
అమరావతి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచే మరొక ప్రధాన అంకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. సచివాలయంలో అగ్రశ్రేణి స్థిరాస్తి రంగసంస్థల ప్రతినిధులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డీఎల్‌ఎఫ్‌, జీవీకే, మహీంద్ర, షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, మై హోం తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి విశేషాలను వివరించి, మహానగర నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని సీఎం కోరారు. దేశంలో ఉన్న 10 అగ్రగామి రియాల్టీ సంస్థలు వెంటనే ఇక్కడికి వచ్చి, నిర్మాణాలను చేపట్టాలన్నది తన అభిలాషగా తెలిపారు. ‘రండి.. ఒక్కొక్కరూ కనీసం ఒక్కొక్క నిర్మాణాన్ని చేపట్టండి, ఐకానిక్‌ నిర్మాణాల ద్వారా మీ సంస్థల ప్రతిష్ఠను మరింత పెంచుకొని, అమరావతి పేరునూ విశ్వవ్యాప్తం చేయాలి’ అని కోరారు. ఈ మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటే తిరిగి దానిని పొందడం అసాధ్యం కావచ్చునన్నారు.
 
 
అత్యుత్తమ సాంకేతికత
ప్రపంచంలోని అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అసలైన ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. దేశంలో కొత్త రాజధానులను పరిశీలిస్తే నయా రాయపూర్‌, గాంధీనగర్‌ జనావాసాలకు దూరంగా కట్టారని, అమరావతిని అందరికీ నివాసయోగ్యమైన ప్రజా రాజధానిగా నిర్మించేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. సింగపూర్‌, ఆమ్‌స్టర్‌డ్యామ్‌ వంటి ప్రఖ్యాత నగరాలకు సైతం లేని జలవనరులు, ప్రకృతి రమణీయత అమరావతి సొంతమన్నారు.
 
 
నాలెడ్జ్‌ ఎకనమిక్‌ సిటీ
అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌కు ఎన్నెన్నో అవకాశాలున్నాయని సీఎం చెప్పారు. అమరావతిని నాలెడ్జ్‌ ఎకనమిక్‌ నగరంగా, విశాఖను ఐటీ- హెల్త్‌ సిటీగా, తిరుపతిని ఎలకా్ట్రనిక్‌- హార్డ్‌వేర్‌ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని, ఫిన్లాండ్‌, నార్వే దేశాలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని సంతోషాంధ్రప్రదేశ్‌గా మలిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నదీతీరంలో గృహ సముదాయాలను నిర్మించడం ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించవచ్చునని ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ సూచించగా, పర్యావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుందని సీఎం చెప్పారు.
 
పర్యావరణం పేరిట అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ఎల్లప్పుడూ ముందుంటారని, కానీ కాలుష్యాన్ని నియంత్రించడానికి మాత్రం తోడ్పడరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో ఐటీ సంస్థలకు ఐదేళ్లపాటు ఉచితంగా కార్యాలయ ప్రదేశాలను సమకూర్చినట్లయితే పలు సంస్థలు ముందుకొస్తాయని, తద్వారా పెద్దసంఖ్యలో ఐటీ ఉద్యోగాలు లభిస్తాయని ఒక రియాల్టీ ప్రతినిధి సూచించగా, పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని రైతులు ముందుకు వస్తే గనుక వారికి లభించిన రిటర్నబుల్‌ ప్లాట్లను అభివృద్ధి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రియాల్టీ సంస్థల ప్రతినిధులు చెప్పారు
Link to comment
Share on other sites

అమరావతిలో ఏమేం నిర్మించబోతున్నారంటే...
14-06-2018 08:09:36
 
636645605891753958.jpg
  • అద్భుత అవకాశం.. అందిపుచ్చుకోండి..
  • సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌
  • సచివాలయంలో ‘అమరావతి డెవలపర్స్‌ కాన్‌క్లేవ్‌’
  • హాజరైన స్థిరాస్తిరంగ సంస్థల ప్రతినిధులు
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
అమరావతి చుట్టూ 58 లక్షల మందితో కూడిన ఆర్థిక వ్యవస్థ ఉందని, కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ, 20 కి.మీ.ల దూరంలో ఉన్న గుంటూరు మధ్య రాజధాని నిర్మితమవుతోందని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ డెవలపర్లకు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన ‘అమరావతి డెవలపర్స్‌ కాన్‌క్లేవ్‌ (సదస్సు)’కు హాజరైన దేశంలోని పేరొందిన స్థిరాస్తిరంగ సంస్థల ప్రతినిధులకు రాజధాని నగర నిర్మాణ విశేషాల గురించి ఆయన వివరించారు.
 
 
పట్టణాల్లో మౌలిక సదుపాయాలకు ఉన్న కొరత కారణంగా 13 శాతం ఉండాల్సిన వృద్ధి రేటు సుమారు 7-8 వద్దనే నిలిచిపోతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు శ్రీధర్‌ చెప్పా రు. రాజధాని కోసం ప్రస్తుతం సుమారు 58 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఇందులో రైతులు పూలింగ్‌ ప్రాతిపదికన ఇచ్చిన 33 వేల ఎకరాలున్నాయని, మరొక రెండు వేల ఎకరాలను మాత్రమే సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎటువంటి చట్ట, న్యాయపరమైన సమస్యలు లేని ఈ భూములను అభివృద్ధి పరచేందుకు, రైతుల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామన్నారు.
 
రాజధాని ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 40 నెలల్లోనే భూసమీకరణ, మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, పరిపాలనా భవనాల నిర్మాణం, టైర్‌-1 మౌలిక సదుపాయాల కల్పన వంటివి చే పట్టడం ద్వారా దేశ, విదేశాల్లో సమకాలీన నగరాల నిర్మాణంతో పోల్చితే ఎంతో ముందంజలో ఉన్నామని శ్రీధర్‌ అ న్నారు. ఎస్‌ఆర్‌ఎం., విట్‌ వంటి సంస్థలు ఇప్పటికే భవనాలను నిర్మించుకుని, సుమారు 2,000 మందికి విద్యనందిస్తున్నాయని, ఇతర విద్యాసంస్థల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం 320 కిలోమీటర్ల పొడవైన రోడ్లలో ప్రస్తుతం 284 కి.మీ. మేర రోడ్లు వేగంగా నిర్మాణమవుతున్నాయన్నారు. ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో 10 పాఠశాలలు, 8 స్టార్‌ హోటళ్లు త్వరలోనే నిర్మితం కాబోతున్నాయని చెప్పారు. జీ ప్లస్‌ 12 అంతస్థులుండే 61 టవర్లలో సుమారు 3,840 ఫ్లాట్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్నామన్నారు.
 
 
దిగువ మధ్య తరగతి వారి కోసం 7,000 ఇళ్లను కట్టిస్తున్నట్లు చెప్పారు. ఇంతటి విశిష్టతలు కలిగిన అమరావతిలో డెవలపర్లకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని శ్రీధర్‌ చెప్పా రు. రాజధానిలో సుమారు 100 ఎకరాల వరకు అభివృద్ధి పరచేందుకు, ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు భూమిని కేటాయించే వీలుందని ఆయన పేర్కొన్నారు. నూతన సచివాలయ భవంతుల మాదిరిగా డెవలపర్లు 40 అంతస్థుల మేర నిర్మాణాలు చేపట్టవచ్చునన్నారు. అన్ని మౌలిక వసతుల కల్పన, పలు సంస్థలకు భూకేటాయింపు లు జరిపిన తర్వాత కూడా సీఆర్డీయే వద్ద వీటన్నింటికీ అ వసరమైన భూములున్నాయని చెప్పారు. వీటిల్లో వివిధ ప్రాజెక్టులను నిర్మించేందుకు ముందుకు వచ్చే డెవలపర్ల కు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎల్‌ఎఫ్‌, శోభా డెవలపర్స్‌, ప్రెస్టీజ్‌ ప్రాజెక్ట్స్‌, మై హోమ్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌, రహేజా కార్పొరేట్స్‌, మహీంద్రా లైఫ్‌ స్పేస్‌, ఈవీపీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టి, అపర్ణ, శాలపురి సత్తాప, జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ఎన్‌ఎస్‌ఎల్‌ ఇన్‌ఫ్రాటెక్‌, గార్డెన్‌ సిటీ రియాల్టీ, సై బర్‌సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

విజయవాడ-సింగపూర్‌ విమాన సేవలకు వేళాయె!
అనుమతుల సాధనకు దిల్లీకి అధికారి

ఈనాడు, అమరావతి: విజయవాడ-సింగపూర్‌ మధ్య విమానయాన సేవలను వచ్చే నెలలో ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సేవల ప్రారంభానికి భారత విమానయాన సంస్థ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి గురువారం దిల్లీ వెళ్లారు. విజయవాడ (గన్నవరం)- సింగపూర్‌ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 80 వేల మంది (సంస్థ వెబ్‌సైట్‌, ఈమెయిల్‌ ద్వారా) సానుకూలంగా స్పందించారు. విజయవాడ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి బయలుదేరాలంటే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనేకమంది ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సమీక్షలో నెలాఖరులోగా సింగపూర్‌కు విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే కేంద్రం నుంచి అనుమతుల జారీలో జాప్యమయ్యే అవకాశం ఉండడంతో వచ్చే నెలలో విమానయాన సేవలు ప్రారంభం కావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సిల్క్‌ ఎయిర్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌ తదితర సంస్థలు విజయవాడ- సింగపూర్‌ మధ్య విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి.

సాగర్‌, పుట్టపర్తికి..: విజయవాడ- నాగార్జునసాగర్‌, విజయవాడ- పుట్టపర్తి మధ్య కూడా విమాన సేవలను ప్రవేశపెట్టేందుకు ఏపీఏడీసీఎల్‌ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీట్ల ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపాలనేది సంస్థ యోచన.

Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణంలో మరో అడుగు
15-06-2018 08:26:20
 
636646479935188578.jpg
  • అత్యద్భుతంగా ఐకానిక్ టవర్లు
  • రాజధానిలోని రాయపూడి సమీపంలో నిర్మాణం
  • 13 అంతస్థులు.. వేల మందికి ఉపాధి అవకాశాలు
  • ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబుచే శంకుస్థాపన
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
తుళ్లూరు(గుంటూరు జిల్లా): రాజధాని నిర్మాణంలో మరో అడుగు పడనుంది. కేంద్రం సహకరించకుండా కాకి లెక్కలు చెపుతూ.. రాజధాని అభివృద్ధి వైపు కన్నెత్తి చూడకపోయినా.. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో రాజధాని అమరావతి నగరం వేగంగా నిర్మాణం జరుగుతోంది. రాజధాని గ్రామం రాయపూడికి ఆనుకొని తూర్పు భాగంలో, ఐఏఎస్‌ ఇళ్ల నిర్మాణాలు దగ్గర్లో, గవర్నమెంటు కాప్లెక్స్‌కు అతి సమీపంలో ఐకాన్‌ టవర్ల నిర్మాణాలు 13 అంతస్థులతో జరగనున్నాయి. దీనికోసం సీఆర్డీయే ఐదెకరాల భూమిని కేటాయించింది. ఇందుకు పదికోట్లు ఎన్‌ఆర్‌టీ సంస్థ చెల్లించినట్టు తెలిసింది. ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10-11 గంటల మధ్యలో శంకుస్థాపన చేయనున్నారు. పూర్తిగా వాణిజ్య సముదాయంగా ఉండే టవర్లు 120 దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌లు వేల కోట్ల పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించనున్నారు. దీంతో వేలమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని సీఆర్డీయే భావిస్తోంది.
 
 
ప్రవాసాంధ్రుల ఉనికికి చిహ్నంగా రాజధానిలో ఈ టవర్ల నిర్మాణం ఎంతో ప్రతిష్ఠాత్మంగా జరగనుంది. ఎనిమిది లక్షల చదరపు అడుగులలో నిర్మిత ప్రాంతం ఉంటుందని సీఆర్డీయే ఇజనీరింగ్‌ అధికారులు సూచిస్తున్నారు. అందులో వంద కంపెనీలకు పైగా ఏర్పాటు చేసుకోవటానికి వీలుంటుంది. శంకుస్థాపన చేసే ప్రాంతంలో 40 దేశాల జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
Link to comment
Share on other sites

ప్రభుత్వ ప్రాజెక్టులకు అనువైన ‘ఇంటీరియర్‌’ పరిశీలన
15-06-2018 08:29:14
 
636646481674250631.jpg
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలోని రాయపూడి, నేలపాడుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న ప్రభుత్వ హౌసింగ్‌ ప్రాజెక్టులకు అనువైన ఇంటీరియర్‌ డిజైన్లను సీఆర్డీయే ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో గురువారం ఆర్కాప్‌ సంస్థ ప్రతినిధులు ఈ డిజైన్లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడంతోపాటు వాడదగిన మెటీరియల్‌ను ప్రదర్శనగా ఉంచారు.
 
ఈ కాంప్లెక్స్‌లోని టవర్లలో ఉండే హాళ్లు, సిట్టింగ్‌ ఏరియా, పడక గదులు, బాల్కనీ, మెట్ల రెయిలింగ్‌లు, కారిడార్లు, లిఫ్ట్‌ క్లాడింగ్‌ల కోసం రూపొందించిన డిజైన్ల గురించి తెలియజేశారు. కిచెన్‌ ప్లాట్‌ఫాం, కప్‌ బోర్డులు, బాత్‌రూం ఫిట్టింగ్స్‌, టైల్స్‌, వాల్‌ ఫినిషింగ్‌, ఫాల్స్‌సీలింగ్‌ మోడళ్లను ప్రదర్శించారు. వీటితోపాటు ఆయా హౌసింగ్‌ ప్రాజెక్టుల్లోని క్లబ్‌ హౌస్‌ల మోడళ్లను చూపారు. వీటిల్లో ఏర్పాటు చేసే స్విమ్మింగ్‌పూల్‌, అవుట్‌డోర్‌, ఇండోర్‌ గేమ్స్‌ తదతర వసతుల గురించి నిపుణులు వివరించారు. వీటిని పరిశీలించిన సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ షణ్మోహన్‌ డిజైన్లను మరింత ఆకర్షణీయంగా మలచాల్సిందిగా ఆర్కాప్‌ ప్రతినిధులకు సూచించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...