Jump to content

Amaravati


Recommended Posts

వినోద కేంద్రంగా శాఖమూరు
10-06-2018 09:52:01
 
  • ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి
తుళ్లూరు: రాజధాని అమరావతి నగరంలోని శాఖమూరు రెవెన్యూలో రూపుదిద్దుకుంటున్న సెంట్రల్‌పార్క్‌ గొప్ప వినోద కేంద్రంగా ఉండబోతుందని అమరావతి డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ సీఎండీ లక్ష్మీపార్థసారధి అన్నారు. పార్క్‌లో జరుగుతున్న విల్డర్‌నెస్‌ అమ్యూజ్‌మెంటు పార్క్‌ల పనులను శనివారం ఆమె పరిశీలించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో విల్డర్‌నెస్‌ పార్క్‌లో ఎనిమిది అడుగుల ఎత్తు మొక్కలను నాటాలని సూచించారు. విద్యుత్‌ కనెక్టివిటీని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకొచ్చామని ఏడీసీ అధికారులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. మంచినీటి కనెక్టవిటీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని అదికారులకు సూచించారు. ఇందుకు తుళ్లూరు మెయిన్‌ లైన్‌ నుంచి పైపు లైను కనెక్షన్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అమ్యూజ్‌మెంటు పార్క్‌లో రంగుల రాట్నం వంటి వినోద పరికరాలు సమకూర్చుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఏడీసీ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

విద్య, నైపుణ్య నగరిగా అమరావతి
10-06-2018 09:55:55
 
  • కాగ్నిజెంట్‌ డైరెక్టర్‌ రామ్‌కుమార్‌
తుళ్లూరు: విద్య, నైపుణ్య నగరిగా అమరావతి మారబోతుందని కాగ్నిజెంట్‌ డైరెక్టర్‌ రామ్‌కుమార్‌ అన్నారు. శనివారం అమరావతిలోని విట్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డేటా ఎనలిటిక్స్‌, ఐవోటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెంట్‌ లాంటి టెక్నాలజీ రంగాల్లో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొ న్నారు. అమరావతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనించాలని సూచించారు. కార్యక్రమంలో విట్‌ ఏపీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ డి.శుభకర్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీఎల్వీ శివకుమార్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

యూనివర్సల్‌ కేబుల్స్‌’కు హైకోర్టులో చుక్కెదురు
10-06-2018 06:10:48
 
636642078576988991.jpg
హైదరాబాద్: మధ్యప్రదేశ్‌కు చెందిన యూనివర్సల్‌ కేబుల్స్‌ సంస్థకు హైకోర్టులో చుక్కెదురైంది. సీఆర్‌డీఏ పరిధిలో 220 కేవీ భూగర్భ కేబుల్స్‌ ఏర్పాటుకు ట్రాన్స్‌కో సంస్థ గత ఏడాది అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించింది. టెండర్‌ నిబంధనల ప్రకారం యూనివర్సల్‌ సంస్థకు అర్హతలేదనే కారణంతో కొరియాకు చెందిన ఎల్‌ఎస్‌ కేబుల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ సంస్థ కన్సార్టియంతో ఏర్పాటు చేసిన ఎల్‌ఎస్‌ కేబుల్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు ట్రాన్స్‌కో కేటాయించింది. టెండర్‌ నిబంధనలు దానికి అనుకూలంగా రూపొందించారంటూ యూనివర్సల్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి దీనిని కొట్టివేశారు. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై యూనివర్సల్‌ కేబుల్స్‌ సంస్థ డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసింది. ఈ అప్పీలు పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం కూడా దీనిని కొట్టివేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమే్‌షరంగనాథన్‌, జస్టిస్‌ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Link to comment
Share on other sites

అటవీ బ్లాక్‌ల మళ్లింపులో జాప్యం
11-06-2018 09:24:33
 
636643058845194244.jpg
  • వెంకటపాలెం, తాడేపల్లి అటవీ బ్లాక్‌ల మళ్లింపునకు 7నెలల కిందట కేంద్రం అంగీకారం
  • అడుగుపడని ప్రత్యామ్నాయ వనీకరణ
  • కేంద్రానికి ఇవ్వాల్సిన రూ.205 కోట్ల చెల్లింపుల్లో తాత్సారం?
రాజధాని అవసరాల నిమిత్తం నెలల తరబడి కృషి, విస్తృత ప్రయత్నాలతో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన తాడేపల్లి, వెంకటయపాలెం అటవీ బ్లాక్‌లు ఏపీసీఆర్డీయేకు దఖలు పడడంలో జాప్యం అనివార్యమవనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రెండు బ్లాక్‌లలోని సుమారు 2,600 ఎకరాలను డైవర్షన్‌ చేసినందుకు బదులుగా వేరే భూముల్లో పెంచాల్సిన అడవుల(ప్రత్యామ్నాయ వనీకరణ) కోసం అవసరమైన నిధులను కేంద్రానికి రాష్ట్రం జమ చేయలేకపోవడం ఇందుకు కారణమని సమాచారం.
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతి కోసం భూసమీకరణ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 34,000 ఎకరాలను సేకరించిన సంగతి తెలిసిందే. అయితే రాజధానిని పలు రంగాల్లో అగ్రశ్రేణి నగరంగా చేసేందుకు మరింత భూమి అవసరమని సీఆర్డీయే భావించింది. ఇందుకోసం రాజధాని ప్రాంతంలోనూ, దానికి పరిసరాల్లోనూ ఉన్న 25 అటవీ బ్లాక్‌లలోని సుమారు 33,750 ఎకరాలను మళ్లించి, తమకు అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎ్‌ఫ)ను చాలా నెలలుగా అభ్యర్థిస్తోంది. వాస్తవానికి అటవీ ప్రాంతాన్ని మళ్లించి, ఇతర అవసరాలకు వాడుకునేందుకు కావాల్సిన అనుమతులను కేంద్రం నుంచి పొందే ప్రక్రియ క్లిష్టతరం. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి పి.నారాయణల నేతృత్వంలో సీఆర్డీయే ఉన్నతాధికారులు జరిపిన కృషి కొంతమేర ఫలించి, గుంటూరు జిల్లాలోని వెంకటాయపాలెం, తాడేపల్లి బ్లాక్‌లలోని దాదాపు 2,600 ఎకరాల అటవీ భూమి మళ్లింపునకు కేంద్రం సుమారు ఏడునెలల క్రితం అంగీకరించింది.
 
 
అయితే ఫారెస్ట్‌ భూమి డైవర్షన్‌ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలను అమలు పరచాలని కోరింది. డైవర్షన్‌ చేసే అటవీ ప్రాంతానికి సరిసమానమైన విస్తీర్ణమున్న, వివిధ జాతుల వృక్షజాతులు పెరిగేందుకు అనుకూలమైన భూములను వాటికి బదులుగా ఇవ్వాలన్నది ఆ షరతుల్లో ఒకటి. అలా ఇచ్చిన భూముల్లో అడవులను పెంచేందుకు (ప్రత్యామ్నాయ వనీకరణ) రమారమి రూ.205 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన కేంద్రం వాటిని చెల్లించాలనగా రాష్ట్రం అంగీకరించింది.
 
 
దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యామ్నాయ భూములను చూపగా, ఎంఓఈఎఫ్‌ అధికారులు పరిశీలించి, ఆమోదం తెలిపారు. తదుపరి దశగా ఆ భూముల్లో అడవులను పెంచేందుకు చెల్లించాల్సిన రూ.205 కోట్లను సీఆర్డీయే కేంద్రానికి జమ చేయాల్సి ఉండగా, అందుకు అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తిచేసి, తుది ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చిలో పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇతమిత్థంగా కారణాలేమిటనేవి తెలియనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రూ.205 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఖాతాకు జమ చేయలేదని సమాచారం. ఫలితంగా వెంకటాయపాలెం, తాడేపల్లి అటవీ బ్లాక్‌ల మళ్లింపునకు తాత్కాలికంగా బ్రేక్‌లు పడినట్లయింది.
 
 
ప్రతిపాదిత ప్రాజెక్టులపై ప్రభావం
నిబంధనల ప్రకారం ఒకసారి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఫారెస్ట్‌ భూముల మళ్లింపునకు అనుమతిస్తే ఐదు సంవత్సరాల వరకు అది చెల్లుబాటవుతుంది. అందువల్ల పైన పేర్కొన్న రూ.205 కోట్లను ఇప్పటికిప్పుడు చెల్లించనప్పటికీ వెంకటాయపాలెం, తాడేపల్లి ఫారెస్ట్‌ బ్లాక్‌ల డైవర్షన్‌కు ఐదేళ్ల వరకూ వచ్చే ముప్పేమీ ఉండదు. అయితే.. ఈ భూముల్లో సీఆర్డీయే ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు మాత్రం అవాంతరాలు తప్పవు. ముఖ్యంగా వెంకటాయపాలెం అటవీ భూముల్లో స్థాపించదలచిన ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ, షూటింగ్‌ రేంజ్‌ తదితర కీలక ప్రాజెక్టులు మరి కొంతకాలం నిరీక్షించక తప్పదు. మంగళగిరి వద్ద ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్‌ను అక్కడి నుంచి వెంకటాయపాలెంకు తరలించడమూ కుదరదు.
 
 
రాజధానికి ముఖద్వారంగా భావించదగిన తాడేపల్లి అటవీ బ్లాక్‌లో సీఆర్డీయే స్థాపించాలనుకుంటున్న పలు వ్యాపార, వాణిజ్య సంస్థల ఏర్పాటు కూడా ఆలస్యమవుతుంది. అమరావతి నిర్మాణాన్ని మరింత చురుగ్గా సాగించి, వచ్చే కొన్ని నెలల్లో అది ఒక రూపం సంతరించుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పదేపదే ఆదేశిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ ప్రక్రియకు తోడ్పడే వెంకటాయపాలెం, తాడేపల్లి అటవీ బ్లాక్‌ల మళ్లింపు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ వనీకరణ నిమిత్తం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెల్లించాల్సిన సుమారు రూ.205 కోట్లను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Link to comment
Share on other sites

నైపుణ్యాభివృద్ధిరస్తు!
రాజధానిలో ప్రపంచస్థాయి శిక్షణా కేంద్రం
సింగపూర్‌ భాగస్వామ్యంతో ‘మెష్‌’!
ప్రాథమికంగా ఆరు కోర్సుల్లో శిక్షణ
నెలలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశం
కార్యాచరణ సిద్ధం
ఈనాడు - అమరావతి
11ap-main4a.jpg

రాజధాని అమరావతిలో సింగపూర్‌ సహకారంతో ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధి (స్కిల్‌ డెవలప్‌మెంట్‌), ఔత్సాహిక పారిశ్రామిక అభివృద్ధి (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌) కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. దీన్ని మల్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్కిల్‌ హబ్‌(మెష్‌)గా వ్యవహరిస్తారు. అమరావతిలో పదెకరాల్లో దీన్ని ఏర్పాటుచేస్తారు. సింగపూర్‌కు చెందిన స్కిల్స్‌ ఎస్‌జీ వెంచర్స్‌ (ఎస్‌ఎస్‌జీవీ), మన దేశానికి చెందిన సింక్రోసెర్వ్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ (ఎస్‌జీఎస్‌పీ) సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) పర్యవేక్షిస్తుంది. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణనివ్వడం, యువత స్వయంఉపాధికి పారిశ్రామిక అభివృద్ధిలో శిక్షణనివ్వడం, శిక్షకులకు శిక్షణ (ట్రైయినింగ్‌ ఆఫ్‌ ది ట్రైయినర్స్‌) వంటి కార్యక్రమాలు ఇక్కడ    ఉంటాయి. నైపుణ్యాభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించడం ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. ఇంజినీరింగ్‌ వంటి అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ కోర్సుల చివరి సంవత్సరాల్లో ఉన్న విద్యార్థులకు ఎంపవరింగ్‌ నెక్స్ట్‌ జనరేషన్‌ అప్లైడ్‌ బిజినెస్‌ లీడర్‌షిప్‌ అండ్‌ ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌ ప్రోగ్రాం (ఎనాబుల్‌) పేరుతో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని నిర్వహించనున్నారు.

వడివడిగా అడుగులు
ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ల అధ్యక్షతన ఇటీవల జరిగిన సంయుక్త అమలు పర్యవేక్షణ కమిటీ (జేఐఎస్‌సీ) సమావేశంలో దీనిపై చర్చించారు. శాశ్వత నిర్మాణాలతో ‘మెష్‌’ను ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుందని, నెల వ్యవధిలో కొన్ని కోర్సులతోనైనా శిక్షణ ప్రారంభించాలని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈఓ కోగంటి సాంబశివరావును ముఖ్యమంత్రి ఆ సమావేశంలో ఆదేశించారు. అదే రోజు సింగపూర్‌ ప్రతినిధులతో ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో సమావేశమై తక్షణం ప్రారంభించేందుకు ఆరు కోర్సులనూ అధికారులు గుర్తించారు. ‘సింగపూర్‌ సింక్రోస్కిల్స్‌’ పేరుతో భాగస్వామ్య కంపెనీ ఏర్పాటుకు ఎస్‌ఎస్‌జీవీ, ఎస్‌జీఎస్‌పీ సంస్థలు ప్రతిపాదించాయి.

10 ప్రధాన విభాగాలు..!
తొలి దశలో లక్ష చ.అడుగుల్లో ‘మెష్‌’ ఏర్పాటవుతుంది. తర్వాత దీన్ని ఐదు లక్షల చ.అడుగులకు విస్తరించాలన్నది ప్రతిపాదన. ఏటా పది వేల మందికి శిక్షణనిచ్చేలా తీర్చిదిద్దనున్నారు. రూ.50 కోట్లు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. దీనిలో పది ప్రధాన విభాగాలు ఏర్పాటుచేస్తారు. వాటిని ‘సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’గా వ్యవహరిస్తారు. బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రీటెయిల్‌, టెక్స్‌టైల్‌, ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌, ఆతిథ్యం-పర్యాటకం, వ్యవసాయం-అనుబంధ రంగాలు, రవాణా(లాజిస్టిక్స్‌), బ్యాకింగ్‌, ఆర్థిక సేవలు, ఆహారశుద్ధి రంగాలకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రతి ప్రధాన విభాగంలోను వేర్వేరు కోర్సులుంటాయి. మెష్‌లో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ), ఏపీఎస్‌ఎస్‌డీసీల పాత్ర ఎంతనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. రాజధానికి భూములిచ్చిన రైతుల కుటుంబాల్లోని యువతతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంవారికైనా ఇక్కడ శిక్షణనిస్తారు.

ప్రాథమికంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ సహకారం
అద్దె భవనంలో నెలలో నైపుణ్య శిక్షణ ప్రారంభించనున్నారు. గుర్తించిన కోర్సులకు సంబంధించి ఏ సింగపూర్‌ సంస్థతో భాగస్వామ్యం ఉండాలో కూడా నిర్ణయించారు. లారీ క్రేన్‌ మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌, ఫోర్క్‌ లిఫ్ట్‌ ఆపరేటర్‌, వధువుల ఫ్యాషన్‌- ఫొటోగ్రాఫిక్‌ మేకప్‌ ఆర్టిస్టులు, టెక్స్‌టైల్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌, చెఫ్‌లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- మెషీన్‌ లెర్నింగ్‌ కోర్సుల్లో మొదట శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి ఆర్థిక సహకారాన్ని ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి అందిస్తామని కోగంటి సాంబశివరావు తెలిపారు. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సింగపూర్‌ విశ్వవిద్యాలయాల్లో ఫినిషింగ్‌ కోర్సులుంటాయని, అదే తరహాలో ‘మెష్‌’లో ఎనాబుల్‌ కార్యక్రమం ప్రవేశపెడతామని వివరించారు. కోర్సు అయ్యాక ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలనే అంశాలతో పాటు వ్యక్తిత్వ వికాసంపై రోజుకు రెండు గంటల చొప్పున మొత్తం వంద గంటల శిక్షణ ఉంటుందని అన్నారు.

Link to comment
Share on other sites

L&T Construction to construct Rs 1,387-cr iconic bridge across Krishna at Amaravati

 

Hyderabad, June 12

The construction arm of L&T will construct an iconic bridge across the river Krishna at the upcoming city of Amaravati in Andhra Pradesh.

The Heavy Civil Infrastructure business of L&T Construction will design and construct a 3.2 km, six-lane iconic bridge across the river Krishna, which includes 2.72 km of approach bridges, on EPC basis.

The bridge will connect Pavitrasangamam in Vijayawada and N10 Road in Amaravati. The Rs 1,387-crore project was received from Amaravati Development Corporation Limited (ADCL) and L&T has also been entrusted with the operation and maintenance for the bridge for 5 years.

Shares of the company were trading at Rs 1,356.95 apiece, up 1.07 per cent from the previous close on the BSE.

Link to comment
Share on other sites

కృష్ణానదిపై వంతెనకు టెండర్లు ఖరారు
పవిత్ర సంగమం నుంచి అమరావతికి అనుసంధానం
ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణ వ్యయం రూ.1387 కోట్లు
ఎల్‌ అండ్‌ టీ సంస్థకు దక్కిన పనులు
ఈనాడు - అమరావతి
12ap-main9a.jpg
రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ బ్రిడ్జి టెండర్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం నుంచి అమరావతిలోని ఎన్‌10 రహదారిని అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. నిర్మాణ వ్యయం రూ.1387 కోట్లు. ఒప్పందం జరిగినప్పటి నుంచి రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలి. ఈ వంతెన ప్రతిపాదన దాదాపు రెండేళ్లుగా నలుగుతోంది. యోగముద్ర, కూచిపూడి నాట్య భంగిమ, కొండపల్లి బొమ్మ... ఇలా వివిధ నమూనాల్లో ఆకృతులు సిద్ధం చేశారు. ఒక దఫా టెండర్లు పిలిచి రద్దు చేశారు. మళ్లీ ఈపీసీ విధానంలో తాజాగా టెండర్లు పిలిచి ఎల్‌ అండ్‌ టీ సంస్థను ఎంపిక చేశారు. ఆ సంస్థ ఆకృతుల్ని మళ్లీ సిద్ధం చేయాల్సి ఉంది. అనంతరం మెరుగైన దాన్ని ఎంపిక చేసి స్ట్రక్చరల్‌ డిజైన్లు రూపొందిస్తారు. స్థానిక కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) షరతు పెట్టింది. ఈ ప్రక్రియ రెండు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌పీ సింగ్లా, గామన్‌ సంస్థలు పోటీపడ్డాయి.

నిర్మాణం సంక్లిష్టం..!
3.2 కి.మీ. పొడవైన ఈ వంతెన మధ్యలో 480 మీటర్ల భాగం తీగలతో (కేబుల్‌ స్టేడ్‌) స్ట్రక్చర్‌ ఉంటుంది. మధ్యలో నిర్మించే పైలాన్‌ నుంచి బలమైన ఇనుప తీగల్ని కడతారు. అక్కడ వంతెన కింద నిర్మించే పిల్లర్ల దూరం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ ఇనుప తీగల బలంపైనే ఇది ఆధారపడుతుంది. మిగతా ప్రాంతంలో కూడా స్తంభాల మధ్య దూరం 125 మీటర్ల వరకు ఉంటుంది. కృష్ణా నదిలో ఎప్పుడూ 5 మీటర్ల ఎత్తున నీరు ఉంటుంది. ఆ మేరకు నీరు ఉండగానే... వంతెన నిర్మించడం సంక్లిష్టమైన ప్రక్రియని, భారీ పరికరాలు, సామగ్రి కావాలని ఏడీసీ అధికారులు వివరించారు. ఈ బలమైన తీగల్ని స్విట్జర్లాండ్‌, అమెరికాల్లో మాత్రమే తయారు చేస్తారని, వాటికే రూ.150 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఐదేళ్ల నిర్వహణ బాధ్యత కూడా ఎల్‌ అండ్‌ టీదే. తాము ఐకానిక్‌ బ్రిడ్జి కాంట్రాక్టు దక్కించుకున్న విషయాన్ని బాంబే స్టాక్‌ ఎక్ఛేంజికి అందజేసిన వివరాల్లో ఆ సంస్థ ప్రస్తావించింది.

 
Link to comment
Share on other sites

నిర్మాణ పనులు నిరాటంకంగా సాగాలి
13-06-2018 07:28:17
 
636644717094405875.jpg
  • తదనుగుణంగా కార్మికులు, నిర్మాణ సామగ్రిని సమకూర్చుకోండి
  • ఏ కాంట్రాక్ట్‌ సంస్థలైనా ఇందులో విఫలమైతే చర్యలు: శ్రీధర్‌
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధానిలోని ప్రభుత్వ నగరంలో నిర్మిస్తున్న గవ ర్నమెంట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లోని ప్రతి టవర్‌లోనూ కాంక్రీట్‌ పనులను నిరాటంకంగా సాగించాల్సిందేనని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ ఆయా నిర్మాణ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇం దుకు అవసరమైన కార్మికులు, మెటీరియల్‌ను సమ కూర్చుకోవాలన్నారు. ఏ కంపెనీ అయినా పనుల విషయంలో ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించినా ఒడం బడికలో పేర్కొన్న ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటితోపాటు ఈ ఏడాది డిసెంబర్‌కు జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ పూర్తి చేయా లన్నారు. నేలపాడు వద్ద నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, కొండ మరాజుపాలెం వద్ద నిర్మిస్తున్న సీఆర్డీయే ప్రాజెక్ట్‌ కార్యాలయం, రాయపూడి వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లను మంగళవారం శ్రీధర్‌ పరిశీలించారు.
 
 
కీలకం.. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌..
జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్న ప్రదేశంలోనే తమ అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థలైన ఎల్‌అండ్‌టీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ (పీఎంసీ) సీబీఆర్‌ఈ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. దీని పైల్‌ ఫౌండేషన్‌ను ఈ నెలాఖర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టులో తొలి శ్లాబ్‌, సెప్టెంబర్‌లో 2, 3 శ్లాబ్‌లు వేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ఈ కాంప్లెక్స్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దీనిని డిసెంబర్‌కల్లా సిద్ధం చేయాలని, ఇం దుకోసం వర్షాకాలంలోనూ పనులకు అంతరాయం కలుగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
 
 
కాంక్రీట్‌ పనులు ప్రారంభం..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారుల అపార్ట్‌మెంట్లను పరిశీలించి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని నిర్మాణ సంస్థలను ఆదేశించారు. అఖిల భారత సర్వీస్‌ అధికా రుల (ఏఐఎస్‌) కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లకు సంబంధించిన మైవాన్‌ కాంక్రీట్‌ పనులను ఈ సందర్భంగా శ్రీధర్‌ పూజాదికాలతో ప్రారంభించారు. వీరికి ఉద్దేశించిన 6 టవర్లలో 5 టవర్ల స్టిల్ట్‌ శ్లాబ్‌లు పూర్తయ్యాయని, మిగిలిన దానికి 10 రోజుల్లో వేస్తామని కాంట్రాక్ట్‌ సంస్థ ఎన్‌సీసీ ప్రతినిధులు ఆయనకు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలకు సంబంధించిన 12 టవర్లకు రాఫ్ట్‌లు, ఐదు టవర్లకు స్టిల్ట్‌ శ్లాబ్‌లు పూర్తి చేసినట్లు కూడా చెప్పారు. మిగిలిన టవర్ల స్టిల్ట్‌ శ్లాబ్‌ పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని చెప్పారు.
 
ఈ నెల 30వ తేదీ నుంచి మొదటి టవర్‌కు చెందిన మైవాన్‌ కాంక్రీట్‌ పనులను ప్రారంభిస్తామన్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన, కొండమరాజుపాలెం వద్ద నిర్మిస్తున్న సీఆర్డీయే ప్రాజెక్ట్‌ కార్యాలయం పనులను కూడా శ్రీధర్‌ చూశారు. పైల్‌ ఫౌండేషన్‌ పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్ట్‌ సంస్థ ప్రికా, పీఎంసీ ఫీడ్‌బ్యాక్‌ ప్రతినిధులను ఆదేశించారు. ఆగస్టులో తొలి శ్లాబ్‌ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీయే సీఈ మాదాసు జక్రయ్య, ఎస్‌.ఇ. సీహెచ్‌ ధనుంజయ, ఎన్‌.సి.సి., ఎల్‌ అండ్‌ టి, ప్రికాలతోపాటు పీఎంసీలైన సీబీఆర్‌ఈ, ఫీడ్‌బ్యాక్‌ ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సీఆర్‌డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష
13-06-2018 13:04:13
 
636644918653023115.jpg
అమరావతి: సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మహీంద్రా, షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, డీఎల్ఎఫ్, జీవీకే తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై సంక్షిప్త వీడియో చిత్రాన్ని సీఆర్డీఏ సమావేశంలో ప్రదర్శించింది. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ సంతోష నగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఈ సందర్భంగా సీఎం అన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...