Jump to content

Amaravati


Recommended Posts

8 minutes ago, sonykongara said:

ante 2,leda 4 untayi kani  3 undatm enti bro

ohh ada. usually traffic won't be symmetric in busy hours. for e.g in the morning there will be more traffic from Vijayawada to capital. So that time there will be two BRTS lanes in that direction. again in the evening capital to vijayawada will have two BRTS lanes.

This is quite normal on busy bridges connecting big city to suburbs.

Link to comment
Share on other sites

2 minutes ago, swarnandhra said:

ohh ada. usually traffic won't be symmetric in busy hours. for e.g in the morning there will be more traffic from Vijayawada to capital. So that time there will be two BRTS lanes in that direction. again in the evening capital to vijayawada will have two BRTS lanes.

This is quite normal on busy bridges connecting big city to suburbs.

oho alana bro.

Link to comment
Share on other sites

Guest Urban Legend
11 hours ago, RKumar said:

Private Institues maatram fast ga works complete cheyisthunnayi.

chesthey ne migatha land isthanu ani condition pettadu ga cbn so tappadhu vaalaki 

Link to comment
Share on other sites

ఈ వేగం సరిపోదు
04-06-2018 01:27:10
 
  • వర్షాల్లోనూ అమరావతి నిర్మాణాలు కొనసాగాలి: సీఎం
అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): వర్షాల్లోనూ అమరావతి నిర్మాణాలు కొనసాగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆదివారం సీఆర్డీఏ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లోగా పెద్ద నిర్మాణాలు ఒకరూపునకు రావాలని, అందుకుఈ వేగం సరిపోదని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిరంతరంగా పనులు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం నిర్దేశిత గడువు పెట్టుకుని నెలవారీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు.
 
 
ఈ సందర్భంగా సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ వివిధ ప్రాజెక్టుల పురోగతిని సీఎంకు వివరించారు. రూ.48,116కోట్లతో సీఆర్డీఏ అమరావతి ప్రభుత్వ కాంప్లెక్‌, టైర్‌1, 2 మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఎల్పీఎస్‌ తదితర ప్రాజెక్టులు చేపట్టామని, వీటిలో 51శాతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ అక్టోబర్‌ నాటికి ఉద్యోగుల కోసం 3,840 ఫ్లాట్లు, మంత్రులతో సహా వివిధ వర్గాల వారికి 186 భవనాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

త్వరలో జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ పనులు ప్రారంభం
05-06-2018 07:31:49
 
636637807176986415.jpg
  • శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేంత వరకూ ఇందులోనే హైకోర్టు నిర్వహణ
  • నిర్మాణ వ్యయం సుమారు రూ.108 కోట్లు
  • ఆరేడు నెలల్లో సిద్ధం
రాజధానిలో సీఆర్డీయే నిర్మించ తలపెట్టిన జ్యుడీషియరీ కాంప్లెక్స్‌ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సుమారు 4 ఎకరాల్లో, 2.25 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంతో దీనిని సుమారు రూ.108 కోట్లతో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ నిర్మించనుంది. దీని ఫౌండేషన్‌లో భాగంగా మొత్తం సుమారు 500 పైల్స్‌ను వేయాల్సి ఉండగా ఇప్పటికి 60 వరకూ వేశారు. నవంబర్‌, డిసెంబర్‌కల్లా పూర్తవుతుందని భావిస్తున్నారు.
 
 
అమరావతి: రాజధాని ప్రతిష్ఠను ఇనుమడించే ఐకానిక్‌ భవంతిగా శాశ్వత హైకోర్టు నిర్మితమయ్యేంత వరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తన కార్యకలాపాలను సాగించుకునేందుకు వీలుగా సీఆర్డీయే నిర్మించ తలపెట్టిన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ (దీనినే సిటీ సివిల్‌ కోర్టులుగా కూడా వ్యవహరిస్తున్నారు) పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సుమారు 4 ఎకరాల్లో, 2.25 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంతో దీనిని సుమారు రూ.108 కోట్లతో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ నిర్మించనుంది. హైదరాబాద్‌కు చెందిన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్‌ సంస్థ టీమ్‌ 1 ఈ భవనం డిజైన్‌, నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీని ఫౌండేషన్‌లో భాగంగా మొత్తం సుమారు 500 పైల్స్‌ను వేయాల్సి ఉండగా ఇప్పటికి 60 వరకూ వేశారు.
 
తగినంత యంత్రసామగ్రి, నిపుణులు అందుబాటులో ఉండడంతో మిగిలిన పైల్స్‌ను త్వరత్వరగా వేయించేందుకు సీఆర్డీయే అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ నేతృత్వంలో సీఈ ఎం.జక్రయ్య, ఇతర ఉన్నతాధికారులు విస్తృత కృషి జరుపుతున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌కల్లా జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తవ్వాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా కొంత జాప్యం జరగడంతో నవంబర్‌, డిసెంబర్‌కల్లా పూర్తవుతుందని భావిస్తున్నారు.
 
జి ప్లస్‌ 2 అంతస్థులు.. 23 కోర్టు హాళ్లు ..
ఈ జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను వాస్తవానికి జి ప్లస్‌ 5 అంతస్థులతో నిర్మించేందుకు అవసరమైన ఫౌండేషన్‌ను వేస్తున్నారు. అయితే ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జి ప్లస్‌ 2 అంతస్థులు మాత్రమే వేస్తారు. అయితే తాత్కాలిక ప్రాతిపదికన హైకోర్టుకు ఆశ్రయం కల్పించేందుకు ఈ భవంతిని నిర్మిస్తున్నప్పటికీ హైకోర్టు కార్యకలాపాలను సౌకర్యంగా నడుపుకొనేందుకు అవసరమైన అన్ని వసతులనూ ఇందులో ఏర్పాటు చేయనున్నారు.
ఈ కాంప్లెక్స్‌లో 22 కోర్టు హాళ్లతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోసం మరొక కోర్టు హాల్‌ను సిద్ధం చేస్తారు. వీటికి అనుబంధంగా తపాలా కార్యాలయం, బ్యాంక్‌, బార్‌ అసోసియేషన్‌, బార్‌ కౌన్సిల్‌, రికార్డ్‌ రూం, పబ్లిక్‌ లాంజ్‌లు, సమావేశ మందిరా లు, గ్రంథాల యం, ఆడిటోరియం తదితర వసతులన్నింటినీ కల్పించనున్నా రు. ఈ భవంతి పక్కన మరొక 4 ఎకరాలను ఈ కాంప్లెక్స్‌కు పార్కింగ్‌ సదుపాయం కోసం కేటాయిస్తారు.
 
 
తర్వాత సిటీ సివిల్‌ కోర్టుగా మార్పు
గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లోనే స్థూపాకృతిలో నిర్మితమయ్యే హైకోర్టు శాశ్వత భవనం పూర్తయ్యేందుకు రెండేళ్లకుపైగా సమయం పట్టనుందని భావిస్తున్నారు. అయితే హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాదే అమరావతికి వచ్చేయనుంది. శాశ్వత భవనం సిద్ధమయ్యేంతవరకూ ఈ జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే నడిచే హైకోర్టు అది తయారవ్వగానే అందులోకి తరలిపోతుంది. అది జరిగిన తర్వాత ప్రస్తుతం జి ప్లస్‌ 2 అంతస్థులతోనే నిర్మితమవుతున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లో అప్పటి అవసరాలను బట్టి అదనంగా మరొక 3 అంతస్థుల వరకూ నిర్మించి, అందులో సిటీ సివిల్‌ కోర్టులను ఏర్పాటు చేయాలన్నది సీఆర్డీయే ఉద్దేశ్యం.
Link to comment
Share on other sites

7న స్టార్టప్‌ ఏరియా ఒప్పందం!
05-06-2018 07:35:34
 
636637809425886383.jpg
అమరావతి: రాజధానిలోని స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి నిమిత్తం సింగపూర్‌ కన్సార్షియంతో కలిపి ఏడీసీ ఏర్పాటు చేసిన ‘అమరావతి డెవల్‌పమెంట్‌ పార్ట్‌నర్‌ (ఏడీపీ)’తో సీఆర్డీయే ఈ నెల 7న ఒప్పందం కుదుర్చుకోబోతోందంటూ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో సదరు కార్యక్రమానికి సంబంధించి సింగపూర్‌ ప్రతినిధులు, సీఆర్డీయే ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో సోమవారంనాడు సింగపూర్‌ కన్సార్షియం ప్రతినిధులు భేటీ అయ్యారు.
 
విజయవాడలో 7వ తేదీన జరగనున్న ‘జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ (జేఐఎ్‌ససీ)’ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌లతోపాటు ఉభయపక్షాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇదే సమావేశంలో స్టార్టప్‌ ఏరియా డెవల్‌పమెంట్‌కు సంబంధించిన ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేస్తాయని సమాచారం. దీనిని దృష్టిలో ఉంచుకునే సీఆర్డీయే కమిషనర్‌ తన పర్యటనను కుదించుకుని ఈ నెల 6వ తేదీ రాత్రికే లండన్‌ నుంచి విజయవాడకు తిరిగి రాబోతున్నట్లు తెలిసింది.
 
సీఆర్డీయేలో డిప్యూటీ కలెక్టర్‌గా మసుబా బేగం
ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న పి.మసుమా బేగంను సీఆర్డీయేలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ సోమవారంనాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిప్యుటేషన్‌ ప్రాతిపదికపై జరిగిన ఈ బదిలీ ఒక సంవత్సరంపాటు అమలులో ఉంటుందని అందులో పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

శాశ్వత హైకోర్టుకు..వారంలో టెండర్లు!
05-06-2018 04:06:56
 
636637684238860317.jpg
  • అంచనా వ్యయం 1168 కోట్లు
  • బౌద్ధ స్థూపాకృతిలో జీ ప్లస్‌ 7
  • 16.85 లక్షల చ.అడుగుల్లో నిర్మాణం
  • సువిశాల కోర్టు హాళ్లు,అత్యాధునిక వసతులు
  • రెండున్నరేళ్లలో ఐకానిక్‌ సిద్ధం!
అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) దీనికి వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతోంది. టెండర్ల ఖరారు తర్వాత రెండు-రెండున్నరేళ్లలో పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వ భవనాల సముదాయంలో అటు అసెంబ్లీకి, ఇటు సచివాలయానికి చేరువలో.. సుమారు 42 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, బౌద్ధ స్థూపాకృతిలో ఈ దిగ్గజ భవంతి రూపుదిద్దుకోనుంది. పూర్తి పర్యావరణానుకూలంగా నిర్మితం కానుండడం దీని ప్రత్యేకత. అత్యుత్తమంగా, అత్యధునాతన వసతులతో, తరతరాలూ చెప్పుకొనేలా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు భవనం ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రఖ్యాత ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ దీని డిజైన్‌ను రూపొందించింది. ఇందుకోసం నెలల తరబడి విస్తృత కసరత్తు కొనసాగింది. హైదరాబాద్‌లోని ప్రస్తుత ఉమ్మడి హైకోర్టుతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టులు, ఢిల్లీలోని సుప్రీంకోర్టును సీఆర్‌డీఏక ఉన్నతాధికారులు, నిపుణులు ప్రత్యక్షంగా సందర్శించారు. విదేశాల్లో అత్యున్నత న్యాయస్థానాలున్న కట్టడాల గురించీ అధ్యయనం చేశారు. అనంతరం అమరావతి ప్రాంతంలో ఒకప్పుడు విలసిల్లిన బౌద్ధ స్థూపాకృతిని తలపించేలా హైకోర్టు భవంతి డిజైన్‌ను తయారుచేశారు. ఒకపక్క ఆధునికతకు దర్పణంలా.. మరోపక్క వాస్తుసంప్రదాయాలకు అనుగుణంగానూ ఉండడం ఈ డిజైన్‌ విశిష్టత. దీనిని ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం సామాజిక మాధ్యమాల్లో ఉంచగా.. అత్యధికులు సంతృప్తి వ్యక్తంచేయడంతో ఈ డిజైన్‌నే ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు.
 
సువిశాల కోర్టు హాళ్లు..
అత్యాధునిక పరిజ్ఞానం, రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మించనున్న శాశ్వత హైకోర్టు నిర్మాణానికి దాదాపు రూ.1168 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. జి ప్లస్‌ 7 అంతస్థులతో నలు చదరంగా (పొడవు, వెడల్పు 187 మీటర్లే) ఉండనున్న ఈ భారీ భవనపు మొత్తం విస్తీర్ణం 16.85 లక్షల చదరపు అడుగులు. ఇందులో బిల్టప్‌ ఏరియా విస్తీర్ణం 14.26 లక్షల చ.అడుగులు.. బేస్‌మెంట్‌ విస్తీర్ణం 2.59 లక్షల చ.అడుగులు. ఇందులో తొలుత ప్రధాన న్యాయమూర్తి కోర్టుతో కలిపి 37 కోర్టు హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో ఇంకో 24 కోర్టులను నెలకొల్పేందుకు వీలు ఉంటుంది.
 
ఇవన్నీ కూడా డబుల్‌ స్టోరీ (8 మీటర్లకు పైగా ఎత్తు అంటే రెండంతస్థులంత పైకప్పు)తో సమున్నతంగా ఉంటాయి. హైదరాబాద్‌లోని ప్రస్తుత ఉమ్మడి హైకోర్టులోని కోర్టు హాళ్ల పరిమాణంతో పోల్చితే అధిక విస్తీర్ణంతో, మెరుగైన వసతులతో రూపుదిద్దుకోనున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి హైకోర్టులోని సీజేఐ చాంబర్‌, కోర్టుహాల్‌ అన్నిటి విస్తీర్ణం 3,400 చ.అడుగులు కాగా.. మన శాశ్వత హైకోర్టులో అది 10,800 చ.అడుగులు.! న్యాయమూర్తుల చాంబర్లు, కోర్టు హాళ్లు ఒకే సైజులో అంటే 4,000 చ.అడుగుల్లో ఏర్పాటు కానున్నాయి. కక్షిదారులు, ఉద్యోగులు, న్యాయవాదులకు అవసరమైన వసతులన్నీ.. రెస్టారెంట్‌, గ్రంథాలయం, జ్యుడిషియల్‌ మ్యూజియం, సమావేశ మందిరం, లాంజ్‌లు మొదలైనవాటితో పాటు న్యాయమూర్తులు విశ్రాంతి తీసుకునేందుకు యోగా, జిమ్నాజియం వంటి వసతులనూ కల్పించనున్నారు.
 
ప్రత్యేక ప్రవేశద్వారాలు..:
హైకోర్టులోకి న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు, కక్షిదారులు ప్రవేశించేందుకు వేర్వేరు ద్వారాలను నిర్దేశించారు. న్యాయమూర్తులకైతే వారి వాహనాలను నిలుపుకొనే ప్రదేశంతోపాటు వారి చాంబర్లలోకి వెళ్లేందుకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటవుతాయి.
ప్రవేశ ద్వారాల్లో తూర్పుద్వారం న్యాయమూర్తులకు, పడమర ద్వారం ఉద్యోగులకు, ఉత్తరాన్ని కక్షిదారులు- ప్రజలకు, దక్షిణ ద్వారాన్ని న్యాయవాదులకు కేటాయిస్తారు. సుమారు 2,400 వాహనాల పార్కింగ్‌కు వీలు కల్పించనున్నారు.
 
ఎల్‌ అండ్‌ టీకి కాంప్లెక్స్‌ టెండరు
శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణానికి రెండున్నరేళ్లు పట్టే అవకాశం ఉన్నందున ఈలోపు హైకోర్టు స్వరాష్ట్రంలో కార్యకలాపాలు సాగించేందుకు జ్యుడిషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి టెండరు పిలువగా.. రూ.108 కోట్లతో ఎల్‌ అండ్‌ టీ దక్కించుకుంది. ఈ నెలలోనే పనులు మొదలుపెట్టే అవకాశముంది. 6-7 నెలల్లో కాంప్లెక్స్‌ పూర్తవుతుందని అంచనా.
Link to comment
Share on other sites

Just now, RKumar said:

108 Cr. petti malli temporary building endhuku High court ki, main building ee immediate ga start cheyyochhu ga.

Adi highcourt kadu bro,judicial complex,which was planned before,highcourt ayyedaka just vallaki ah building istaru anthe,

Link to comment
Share on other sites

అమరావతికి అంతా ఓకే
05-06-2018 04:00:40
 
636637680484792951.jpg
  • తక్కువ లోతులోనే గట్టినేల
  • 9 నుంచి 14 మీటర్లలోపే తగిలిన రాయి
  • సచివాలయ నిర్మాణానికి అనుకూలం
  • భూపరీక్షలతో అనుమానాలు పటాపంచలు
అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): నదీ తీరప్రాంతం... మెతక నేల... బహుళ అంతస్థుల భవనాలు, భారీ నిర్మాణ సముదాయాలకు ఈ ప్రాంతం అనుకూలం కాదు... అంటూ వ్యక్తమవుతున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయ నిర్మాణ ప్రాంతంలో 9 నుంచి 14 మీటర్లు (28 నుంచి 45 అడుగులు) లోతునే గట్టి రాయి తగిలినట్టు భూపరీక్షల్లో తేలింది. దీంతో నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు, నిపుణుల్లో ఉత్సాహం నెలకొంది. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం కోసం జరిపిన భూపరీక్షల్లో ఇలాంటి రాయి తగిలేందుకు 100 నుంచి 110 అడుగుల లోతు వరకూ వెళ్లాల్సి వచ్చింది. కానీ.. శాశ్వత సచివాలయ నిర్మాణ ప్రాంతంలో మాత్రం తక్కువ లోతులోనే గట్టిరాయి కనిపించింది. కృష్ణానదీ తీరం భారీ, బహుళ అంతస్థుల భవంతులకు ఏమాత్రం అనుకూలం కాదన్న కొందరి అనుమానాలకు ఈ భూపరీక్షలతో సమాధానం లభించినట్టయింది. ఇప్పటి వరకు బహుళ అంతస్థులతో కూడిన ఈ భారీ నిర్మాణ సముదాయం కోసం 23 చోట్ల ప్రముఖ సంస్థలతో భూపరీక్షలు జరిపించగా.. అవన్నీ కూడా చాలా తక్కువ లోతులోనే గట్టిరాతి నేల ఉన్నట్టు చూపాయి. ‘షీట్‌ రాక్‌’గా నిపుణులు అభివర్ణించే ఈ రాతిపొర 40 నుంచి 50 అంతస్థులతో నిర్మితమవనున్న సచివాలయ సముదాయాన్ని త్వరగా, ధృఢంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందన్న విశ్వాసాన్ని రాజధాని నిర్మాణపనులు పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌, ఇతర ఉన్నతాధికారులు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.2600 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయం కాంప్లెక్స్‌కు సీఆర్డీఏ ఈ ఏడాది ఏప్రిల్‌ 26న టెండర్లు పిలిచింది. ఈ నెల 11న వాటిని తెరవనుంది. టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తవగానే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ నేతృత్వంలో ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

అక్కడే కావాలి..
సీడ్‌ యాక్సెస్‌ రహదారికి భలే గిరాకీ!
అటూ ఇటూ ఉన్న ప్రాంతానికి పెరిగిన డిమాండ్‌
  పలు సంస్థలకు సీఆర్‌డీఏ స్థలాల కేటాయింపు
4ap-main6a.jpg

ఈనాడు అమరావతి: అమరావతిలో నిర్మిస్తున్న ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు)కి అటూ ఇటూ ఉన్న ప్రాంతానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. కీలకమైన సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, సమావేశమందిరాలు ఈ రహదారికి పక్కనే వస్తున్నాయి. ఈ రోడ్డుకి అటూ ఇటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఇప్పటికే పలు సంస్థలకు స్థలాలు కేటాయించింది. మరికొన్ని ప్రతిపాదనలూ పరిశీలనలో ఉన్నాయి. రాజధానిలో మొదట నిర్మిస్తున్న ప్రధాన రహదారి ఇదే కావడం, కృష్ణా నదికి అత్యంత సమీపం నుంచి కరకట్టకు సమాంతరంగా ఈ మార్గం నిర్మిస్తుండడం వంటి కారణాల వల్ల దీనికి ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యంగా ఆతిథ్య, పర్యాటక రంగానికి చెందిన ప్రాజెక్టులు ఎక్కువగా ఈ రహదారి పక్కనే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెంకటపాలెం నుంచి కొండమరాజుపాలెం మధ్య ఈ రహదారి పక్కన ప్రస్తుతం ఎక్కువ గిరాకీ ఉంది. ఈ రహదారికి పక్కనే అమరావతి మెరీనా, మూడు నక్షత్రాల రిసార్ట్‌, రెండు 5 నక్షత్రాల హోటళ్లు, రెండు 4 నక్షత్రాల హోటళ్లు, ఒక సమావేశమందిరం, ఒక షాపింగ్‌ మాల్‌, హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌, ఐటీ టవర్‌, మైస్‌ సెంటర్‌, కార్పొరేట్‌ స్ట్రీట్‌ వంటివి ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదనలు. వీటిలో చాలా ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ ఇప్పటికే స్థలాలు కేటాయించింది. సీడ్‌ యాక్సెస్‌రోడ్డు తొలి దశలో ఉండవల్లి నుంచి అబ్బరాజుపాలెం వరకు 18.27 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.

ప్రాజెక్టుల విశేషాలివీ!
అమరావతి మెరీనా: వెంకటపాలెం సమీపంలో 8.3 ఎకరాల్లో వస్తుంది. ఇది పర్యాటక ప్రాజెక్టు. చిన్న చిన్న బోట్లు నిలిపే స్థలాన్నే మెరీనాగా వ్యవహరిస్తారు. కృష్ణా తీరంలో వచ్చే ఈ ప్రాజెక్టు టెండరు దశలో ఉంది.
నక్షత్ర హోటళ్లు: వెంకటపాలెం దగ్గర్లో ఒక 5నక్షత్రాల హోటల్‌, ఒక 4నక్షత్రాల హోటల్‌, కొండమరాజు పాలెం దగ్గర్లో ఒక 5నక్షత్రాల హోటల్‌, ఒక 4నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి రెండు ప్రముఖ సంస్థలకు సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది. ఉండవల్లి నుంచి వెళ్లేటప్పుడు రహదారికి ఎడమ పక్కన ఇవి వస్తాయి.

మూడు నక్షత్రాల రిసార్ట్‌: 3.5 ఎకరాల్లో కనీసం 50 గదులతో రిసార్టు నిర్మిస్తారు. రహదారికి కుడిపక్కన వస్తుంది. కృష్ణా కరకట్టకు, నదికి మధ్యలో 1.5 ఎకరాలు, ప్రధాన అనుసంధాన రహదారికి, కరకట్టకు మధ్యలో 2 ఎకరాలు కేటాయించారు. వెంకటపాలెం దగ్గర్లోనే ఇది వస్తుంది.

సమావేశమందిరం, భారీ దుకాణ సముదాయం: ఇవి రెండూ ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తారు. మూడు ఎకరాల్లో సమావేశమందిరం, రెండు ఎకరాల్లో భారీ దుకాణ సముదాయం (షాపింగ్‌ మాల్‌) వస్తుంది. కొండమరాజుపాలెం- మందడం గ్రామాల మధ్యలో ఇది ఉంటుంది.

ఐటీ టవర్‌: వెంకటపాలెం, మందడం గ్రామాల మధ్యలో 10 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఐటీ టవర్‌ నిర్మిస్తారు. డిజైన్లు రూపొందించే దశలో ప్రాజెక్టు ఉంది.

హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌: జపాన్‌ సాంస్కృతిక కేంద్రం, చిన్న సమావేశమందిరం వస్తాయి. జపాన్‌ సంస్థ సహకారంతో 2 ఎకరాల్లో నిర్మిస్తారు.

మైస్‌ హబ్‌: 42 ఎకరాల్లో నిర్మించే భారీ సమావేశమందిరం (కన్వెన్షన్‌ సెంటర్‌) ఇది. వెంకటపాలెం సమీపంలో వస్తుంది.

కార్పొరేట్‌ స్ట్రీట్‌: ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకి ప్రధాన అనుసంధాన రహదారి పక్కనే సీఆర్‌డీఏ 20-30 ఎకరాల్లో స్థలాలు కేటాయించనుంది.
సీఆర్‌డీఏ కార్యాలయం: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రాజధానిలోని తన కార్యాలయాన్ని కూడా ప్రధాన అనుసంధాన రహదారి పక్కనే నిర్మిస్తోంది.

రహదారి నిర్మాణం ప్రస్తుత పరిస్థితి!
ప్రధాన అనుసంధాన రహదారిని తొలి దశలో ఉండవల్లి నుంచి అబ్బరాజుపాలెం వరకు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వెంకటపాలెం సమీపం నుంచి అబ్బరాజుపాలెం వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా రహదారి నిర్మాణం పూర్తయింది. దీన్ని తొమ్మిది వరుసల రహదారిగా నిర్మిస్తున్నారు. రెండో దశలో దీన్ని కనకదుర్గమ్మ వారధి దాటాక జాతీయ రహదారికి అనుసంధానించాలన్నది ప్రతిపాదన. ఈ రహదారి రాజధాని పరిపాలన నగరం మీదుగా వెళుతుంది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...