Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో అవయవ మార్పిడి ఆస్పత్రి!
02-06-2018 22:12:03
 
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రఖ్యాత అవయవ మార్పిడి నిపుణులు మహ్మద్ రేలా కలిశారు. రాజధానిలో అవయవ మార్పిడి ఆస్పత్రి నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆస్పత్రి నిర్మాణానికి కావాల్సిన 10 ఎకరాల స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. పూర్తి వివరాలతో వస్తే అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Link to comment
Share on other sites

హైకోర్టుకు పర్యావరణ అనుమతులు
03-06-2018 01:46:25
 
అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): రాజధానిలో నిర్మించదలచిన హైకోర్టు, హెచ్‌వోడీ స్టాఫ్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించినట్టు ఏపీసీఆర్డీయే వర్గాలు శనివారం తెలిపాయి. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనాల అథారిటీ వీటిని మంజూరు చేసినట్లు పేర్కొన్నాయి.
Link to comment
Share on other sites

అంకుర ప్రాంతం’పై 7న కీలక ఒప్పందాలు
చంద్రబాబు, ఈశ్వరన్‌ల అధ్యక్షతన జేఐఎస్‌సీ సమావేశం
శంకుస్థాపన జరిగిన ఏడాది తర్వాత మరో ముందడుగు
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలోని 1691 ఎకరాల్లో అంకుర ప్రాంత(స్టార్టప్‌ ఏరియా) అభివృద్ధికి సంబంధించిన కీలక ఒప్పందాలు ఈ నెల ఏడున జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ల సమక్షంలో సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ), సింగపూర్‌ సంస్థల కన్సార్షియంకి చెందిన జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ‘సింగపూర్‌ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్స్‌ హోల్డింగ్స్‌(ఎస్‌ఏఐహెచ్‌) సంస్థల మధ్య భాగస్వాముల ఒప్పందం, రాయితీ-అభివృద్ధి ఒప్పందం(కాడా) జరుగుతాయి. రెండు ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారానికి ఏర్పాటుచేసిన సంయుక్త అమలు కార్యాచరణ కమిటీ(జేఐఎస్‌సీ) సమావేశం ఈనెల 7న విజయవాడలో జరగనుంది. జేఐఎస్‌సీకి చంద్రబాబు, ఈశ్వరన్‌ ఛైర్మన్‌లుగా ఉన్నారు. ఈశ్వరన్‌ సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన శాఖ ఇటీవలే మారింది. ప్రస్తుతం కమ్యూనికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ శాఖ బాధ్యతలు చూస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌ సంబంధాల్ని ఆయనే పర్యవేక్షిస్తున్నారు.

సంవత్సరం అనంతరం..!
సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్షియం స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో స్టార్టప్‌ ప్రాంతానికి ప్రధాన అభివృద్ధిదారు(మాస్టర్‌ డెవలపర్‌)గా ఎంపికైంది. ఈ కన్సార్షియాన్ని మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపిక చేస్తూ 2017 మే 15న జేఐఎస్‌సీ సమావేశంలోనే ‘లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌’ అందజేస్తూ.. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. సింగపూర్‌ సంస్థల కన్సార్షియం, ఏడీసీల సంయుక్త భాగస్వామ్య సంస్థ ‘అమరావతి అభివృద్ధి భాగస్వామి(ఏడీపీ)’ ఆధ్వర్యంలో స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. శంకుస్థాపన జరిగి ఏడాదవుతున్నా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు అమలు దిశగా ఒక్కడుగూ ముందుకు పడలేదు. న్యాయ, సాంకేతిక అంశాల్లో మరింత స్పష్టత కోసం ఇరు పక్షాలు పట్టుపట్టడం, కొన్నింటిలో త్వరగా ఏకాభిప్రాయానికి రాలేకపోవడం, ఒప్పందాల్లోని అంశాలను వివిధ దశల్లో క్షుణ్నంగా పరిశీలించడం వంటి కారణాలతో ప్రాజెక్టులో జాప్యం జరిగింది. స్టార్టప్‌ ప్రాంత ఒప్పందాలు, లావాదేవీలన్నీ నేరుగా ఏడీసీ, సీఆర్‌డీఏలతో సింగపూర్‌ సంస్థల కన్సార్షియమే నెరపాలని రాష్ట్రప్రభుత్వం పట్టుబట్టింది. నేరుగా ఒప్పందాలు చేసుకోబోమని, ఎస్‌ఏఐహెచ్‌ సంస్థే తమ వ్యవహారాలన్నీ చూస్తుందని కన్సార్షియం స్పష్టంచేసింది. దీనిపై స్పష్టత రావడానికి ఆరేడు నెలల సమయం పట్టింది.

ఇకనైనా ముందుకు..?
ఏడీసీ, ఎస్‌ఏఐహెచ్‌ సంస్థల మధ్య భాగస్వాముల ఒప్పందంలో.. ప్రాజెక్టులో ఎవరి వాటాలు ఎంతుండాలి? బాధ్యతలేంటి? ఎవరికి ఎలాంటి అధికారాలుంటాయి? తదితర అంశాలుంటాయి. అదయ్యాక... సీఆర్‌డీఏ, ఏడీపీ, ఎస్‌ఏఐహెచ్‌ మధ్య ‘కాడా’ ఒప్పందం జరుగుతుంది. ప్రాజెక్టుని ఎన్ని దశల్లో, ఎప్పటిలోగా పూర్తిచేయాలి? సీఆర్‌డీఏ తరఫున ఏడీపీకి ఎలాంటి రాయితీలు ఇవ్వాలి? వంటి అంశాలన్నీ అందులో ఉంటాయి. ఈ రెండూ జరిగితే.. క్షేత్రస్థాయి పనులు ప్రారంభించడానికి ముందుండే ప్రక్రియలన్నీ పూర్తయినట్టే. స్టార్టప్‌ ప్రాంతాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన. తొలి దశలో భాగంగానే.. మొదట 50ఎకరాల్లో ఉత్ప్రేరకాభివృద్ధిగా పలు ప్రాజెక్టులు చేపడతామని సింగపూర్‌ కన్సార్షియం ప్రతిపాదించింది. ఇటీవలే కొత్తగా ‘ఫేజ్‌ జీరో’ పేరుతో 4,000 చ.మీటర్ల విస్తీర్ణంలో సందర్శకుల కేంద్రం, ఎగ్జిబిషన్‌ గ్యాలరీ వంటివి నిర్మిస్తామని ముందుకొచ్చింది. ‘‘ఏడీపీలో తమ వాటాగా ఏడీసీ రూ.220కోట్లు, సింగపూర్‌ సంస్థల కన్సార్షియం రూ.326కోట్లు జమచేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకి నిధుల కోసం వివిధ బ్యాంకులు, రుణ వితరణ సంస్థలతో సంప్రదింపుల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కన్సార్షియం ప్రతినిధులు చెబుతున్నారు’’ అని సీఆర్‌డీఏ వర్గాలు పేర్కొన్నాయి.

Link to comment
Share on other sites

స్మార్ట్‌ రహదారులు
సకల వసతులతో విశాలంగా..
9, 6 వరుసలుగా నిర్మాణం
రాజధానిలో వేగంగా పనులు
ఈనాడు - అమరావతి
3ap-main3a.jpg

రాజధానిలో ప్రధాన రహదారులను సకల సౌకర్యాలతో ‘స్మార్ట్‌’గా తీర్చిదిద్దుతున్నారు. అన్ని వసతులతో సమీకృత ‘స్మార్ట్‌ రోడ్లు’గా నిర్మిస్తున్నారు. పచ్చదనం విరబూసేలా, భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఇవి ఉండబోతున్నాయి. అత్యంత వేగంగా నిర్మాణమవుతున్న ఈ రోడ్లలో మళ్లీ మళ్లీ తవ్వకుండా చర్యలు చేపడుతున్నారు. నీటి సరఫరా పైప్‌లైన్లు, కమ్యూనికేషన్‌ కేబుళ్లు, విద్యుత్‌ సరఫరా లైన్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ.. ఇలా సమస్తం రహదారుల నిర్మాణంలో భాగంగానే ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం ప్రత్యేక డక్టులు నిర్మిస్తున్నారు. అమరావతిలో మొత్తం 34 ప్రధాన, ఉపప్రధాన రహదారులున్నాయి. వీటి మొత్తం పొడవు 320 కి.మీ.లు. వీటిలో 238 కి.మీ.ల పొడవైన 24 రహదారుల పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాజధానిలోని ప్రధాన రహదారుల్లో తూర్పు నుంచి పడమరకు వెళ్లేవి 16 (మొత్తం పొడవు 150 కి.మీ.), ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లేవి 18 (మొత్తం పొడవు 170 కి.మీ.) ఉన్నాయి. ప్రధాన   అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) సహా ఐదు ప్రధాన రహదారుల్ని తొమ్మిది వరుసలుగా, 29 ఉప ప్రధాన రహదారుల్ని ఆరు వరుసలుగా నిర్మిస్తున్నారు. తొమ్మిది వరుసల రహదారుల వెడల్పు 60 మీటర్లు ఉంటుంది. అటూ ఇటూ మూడు వరుసలు, మధ్యలో మూడు వరుసల బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ ఉంటుంది. భవిష్యత్తులో ఈ రహదారులపై ఎలివేటెడ్‌ కారిడార్‌ వస్తుంది. బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ మార్గాన్నే అవసరమైతే మెట్రో రైలు ఏర్పాటుకు వినియోగించుకుంటారు. ఉప ప్రధాన రహదారుల వెడల్పు 50 మీటర్లు. వీటిని ఆరు వరుసలుగా నిర్మిస్తారు. వీటిలో చాలా రహదారులకు మధ్యలో రెండు వరుసల బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ వస్తుంది.

సైకిల్‌, నడక దారులు
ప్రతి ప్రధాన రహదారికి రెండు పక్కలా 10 మీటర్ల వెడల్పున నడక దారి, సైకిల్‌ ట్రాక్‌, చెట్లు, మొక్కలుంటాయి. ప్రధాన రహదారులకు ఒక పక్కన బఫర్‌ జోన్‌ ఉంటుంది. దీని వెడల్పు 10-15 మీటర్ల వరకు ఉంటుంది. అక్కడ రెండు, మూడు వరుసల్లో చెట్లు పెంచుతారు. చెట్లు నాటడం ఇప్పటికే మొదలైంది.

3ap-main3b.jpg

పురోగతి ఏంటి?
238 కి.మీ.ల పొడవైన 24 రహదారుల పనులు మొదలయ్యాయి. మొత్తం 15 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. వీటి విలువ రూ.9వేల కోట్లు. ప్రధాన అనుసంధాన రహదారి మొదటి దశ పనుల్ని 18.5 కి.మీ. మేర చేపట్టారు. మొదట్లో నాలుగు వరుసలకే టెండర్లు పిలిచారు. ఆ పనులు 60 శాతం పూర్తయ్యాయి. దీన్ని 9 వరుసలుగా విస్తరించేందుకు, మౌలిక వసతుల కల్పనకు విడిగా టెండరు పిలిచారు. పనులు మొదలయ్యాయి. ఏడాది క్రితం పనులు ప్రారంభించిన ఏడు ఉప ప్రాధాన్య రహదారుల పనులు 40-50 శాతం పూర్తయ్యాయి. ఈ రహదారుల నిర్మాణ పనులు మొదట ప్రారంభించి, ఇతర మౌలిక వసతులకు సంబంధించి విడిగా టెండర్లు పిలిచారు. దాంతో కొంత జాప్యం జరుగుతోంది. మిగతా రహదారుల పనులు సగటున 20-25 శాతం జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం ఇవి వచ్చే డిసెంబరులో పూర్తి కావాల్సి ఉంది.

ప్రత్యేకతలు..
ప్రతి రహదారికి సైకిల్‌ ట్రాక్‌లు, నడకదారుల కోసం కేటాయించిన ప్రాంతం కిందుగా వివిధ అవసరాల కోసం పైప్‌లైన్లు, డక్టులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో నీటి సరఫరా, మురుగు నీటి పారుదల, గ్యాస్‌ పైప్‌లైన్లు, మురుగు నీటిని శుద్ధి చేశాక పునర్వినియోగానికి సరఫరా చేసే పైప్‌లైన్లు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, కమ్యూనికేషన్‌, విద్యుత్‌ కేబుళ్ల కోసం ప్రత్యేక డక్టులు, భవిష్యత్తులో డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ పైప్‌లైన్లు వెళ్లేందుకు డక్టులు నిర్మిస్తున్నారు. హైవోల్టేజీ విద్యుత్‌ లైన్లు వెళ్లేచోట రహదారి మధ్యలో విడిగా డక్టు నిర్మిస్తున్నారు. నడక దారికి, సైకిల్‌ ట్రాక్‌కు మధ్యలో చెట్లు ఉంటాయి.

Link to comment
Share on other sites

ఆరు నెలల్లో రాజధాని నిర్మాణాలకు రూపు తేవాలి
ఈనాడు, అమరావతి: రాజధానిలో భారీ నిర్మాణాలకు ఆరు నెలల్లోగా ఒక రూపు తెచ్చేలా పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించినట్లు ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పనులు జాప్యం జరగడానికి వీల్లేదని..గడువు నిర్దేశించుకుని దానికనుగుణంగా నెలవారీ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు పేర్కొంది. వర్షాకాలంలోనూ పనులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను తయారు చేయాలని ఆదేశించినట్లు వివరించింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి ఉద్యోగులు, మంత్రుల నివాస సముదాయాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఆర్‌డీఏ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీధర్‌ సీఎంకు వివరించారని వెల్లడించింది.
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...