Jump to content

Amaravati


Recommended Posts

3 minutes ago, krish2015 said:

Aaa br shetty gadu emaipoyadu

Ilanti vedavalaki ichina land back ki tisukunteee daridram vadilipoddi 

edo foreign partner dorakaledu medical college cum hospital construction start seyyadaniki annaru. CRDA vallu notice pamparu asking why you still not started ani. no updates after that.

Link to comment
Share on other sites

8 minutes ago, LuvNTR said:

edo foreign partner dorakaledu medical college cum hospital construction start seyyadaniki annaru. CRDA vallu notice pamparu asking why you still not started ani. no updates after that.

@LuvNTR bro 2days lo secretariat towers ki tenders inviting anta inni rojulaki mi korika teerabotubdi

Link to comment
Share on other sites

Biggest donar so far !! నారిశెట్టి పుల్లయ్య గారు :adore:

http://www.andhrajyothy.com/artical?SID=569778

రాజధానికి రోజుకూలీ విరాళం!
26-04-2018 04:46:11
 
636603147709819585.jpg
అమరావతి/ఉండవల్లి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కుల్లికోళ్లకి చెందిన నారిశెట్టి పుల్లయ్య అనే రోజు కూలీ రూ.22,210 విరాళంగా ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద గల గ్రీవెన్స్‌ హాలులో ఈ మొత్తానికి చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. చంద్రబాబు ఆశయసాధనలో భాగస్వాముడిని కావాలనే తాను దాచుకున్న సొమ్మును రాజధానికి ఇచ్చినట్టు పుల్లయ్య చెప్పారు.
Link to comment
Share on other sites

భారీ ‘వీధి అంగడి’
అమరావతిలో వ్యాపార సముదాయం నిర్మాణం
ప్రజల కోసం 1000 ఫ్లాట్లు
ఒక్కో చ.అడుగు కనీస ధర రూ.3500
రాజధాని పనుల పురోగతిపై సీఎం సమీక్ష
25ap-main5a.jpg

ఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో పదెకరాల విస్తీర్ణంలో వినూత్న తరహాలో భారీ దుకాణ సముదాయాన్ని (మాల్‌ కాంప్లెక్స్‌) నిర్మించనున్నారు. ‘వీధి అంగడి’ తరహాలో ఉండే ఈ మాల్‌లో తాత్కాలిక నిర్మాణాలుంటాయి. ఎలాంటి పైకప్పు లేకుండా ఉంటుంది. విద్యుత్తును ఆదా చేయడంతోపాటు, ప్రజలకు వినూత్న అనుభూతిని కలిగించేందుకు ఈ ప్రయోగం చేయాలని నిర్ణయించారు. ఇందులో సినిమాహాళ్ల సముదాయం, ఆహారశాలలు, పార్కింగ్‌ వంటివన్నీ ఉంటాయి. ఈ కాంప్లెక్స్‌ను   రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) నిర్మిస్తుంది. నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో రాజధాని పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రాజధానిలో మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు.

రూ.494 కోట్లతో అపార్ట్‌మెంట్లు.. రాజధానిలో ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు రూ.494 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ అపార్టుమెంట్లు నిర్మిస్తుందని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏపై సమీక్ష ముగిశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజధానిలో పరిపాలనా నగరానికి సమీపంలోనే జీ+12 విధానంలో సీఆర్‌డీఏ తొలి దశలో వెయ్యి ఫ్లాట్లను నిర్మిస్తుంది. వాటిలో 1200 చ.అడుగుల వైశాల్యంతో 500, 1500 చ.అడుగులతో 300, 1800 చ.అడుగులతో 200 ఫ్లాట్లు ఉంటాయి. చ.అడుగు కనీస విక్రయ ధరను రూ.3500గా ప్రాథమికంగా నిర్ణయించాం. డిమాండును బట్టి రెండో దశలో మరిన్ని ఫ్లాట్లు నిర్మిస్తాం. ఎక్కువ మంది అడిగితే 2400 చ.అడుగుల వైశాల్యం కలిగిన ఫ్లాట్లనూ రెండో దశలో నిర్మిస్తాం. అపార్టుమెంట్ల నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించాం. 15 రోజుల్లో టెండర్లు పిలుస్తాం. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం. లాభం, నష్టం లేని (నో లాస్‌, నో ప్రాఫిట్‌) విధానంలో అపార్టుమెంట్ల నిర్మాణం ఉంటుంది’ అని నారాయణ పేర్కొన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి భూసేకరణ ద్వారాగానీ, భూసమీకరణ ద్వారాగానీ తీసుకోవాల్సిన భూమి ఇంకా 1500 ఎకరాలు ఉందని ఆయన పేర్కొన్నారు. పరిపాలనా నగరంలో ఐదు టవర్లుగా నిర్మించే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. హైకోర్టు భవనానికి మరో 20 రోజుల్లో సూపర్‌స్ట్రక్చర్‌ డిజైన్లను ఆర్కిటెక్టులు అందజేస్తారని, ఆ వెంటనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.

రాజధానిలో కంటైనర్‌ హోటళ్లు.. రాజధానిలో వివిధ పైపులైన్ల కోసం వేసే డక్టులు, గ్యాస్‌, పెట్రోల్‌ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకునే వాణిజ్య సంస్థల నుంచి యూజర్‌ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా కొంత మేర ఆదాయ వనరులు సమకూర్చుకోవచ్చని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. వచ్చే ఏడాదిన్నర కాలంలో రాజధానికి 38వేల కుటుంబాలు తరలి వస్తాయని అంచనా వేస్తున్నామని, ముందు ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంటుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వారందరి అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సదుపాయాలు ముందే సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. రాజధానిలో స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు ముందుకొచ్చాయని, వాటి నిర్మాణం జరిగేంతవరకు ప్రస్తుత అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్‌ హోటళ్లకు అనుమతివ్వాలని నిర్ణయించారు. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్‌ హోటల్‌ నిర్వాహకులు ఐటీసీ సంస్థతో కలసి కంటైనర్‌ హోటళ్లు ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్‌ ఆదాయంపై అధ్యయనం.. వివిధ మార్గాల్లో ఆదాయం పెంచడంద్వారా రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. 1995 నాటికి హైదరాబాద్‌ నగర పరిస్థితేంటి? గడచిన 20 ఏళ్లలో ఆ నగరం నుంచి వచ్చే ఆదాయం ఎంత మేరకు పెరిగింది? ప్రధాన ఆదాయ వనరులేంటి? వంటి అంశాల్ని అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాముల్ని చేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. ‘హడ్కో’ కంటే ఇతర వాణిజ్య బ్యాంకులు అందించే రుణాలకు వడ్డీ తక్కువగా ఉన్నందున రాజధానిలో చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులకు వాటి ద్వారా ఆర్థిక సాయం పొందాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది.

Link to comment
Share on other sites

రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తి అమరావతి
26-04-2018 03:10:46
 
636603090457007080.jpg
  • ఏడాదిన్నరలో 38 వేల కుటుంబాలు రాక.. క్రమంగా పెరగనున్న జనాభా
  • అందరికీ ఉపయోగపడేలా మౌలిక వసతుల అభివృద్ధి
  • 10 ఎకరాల్లో భారీ మాల్‌
  • అమరావతి నిర్మాణంలో ఎన్‌ఆర్‌ఐలకు భాగస్వామ్యం
  • రాజధాని పనులపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): సంపద సృష్టిలో, ఆదాయార్జనలో తనకు ఉండబోయే శక్తిసామర్ధ్యాల ఆధారంగా భవిష్యత్తులో రాష్ట్రానికే అతి పెద్ద ఆస్తిగా రాజధాని అమరావతి నిలవబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘వచ్చే ఏడాదిన్నరలో అమరావతికి కొత్తగా సుమారు 38,000 కుటుంబాలు రానున్నాయి. వ్యాపార, పర్యాటక తదితర కార్యకలాపాలకు సంబంధించి మరెందరో రాకపోకలు సాగించనున్నారు. వీరందరి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ రాజధానికి బ్రహ్మాండమైన ఆర్థిక శోభ రాబోతుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అమరావతిలో మౌలిక వసతుల కల్పన, నిధుల సమీకరణ జరపాలని అధికారులను ఆదేశించారు. అమరావతి నిర్మాణంపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఏపీసీఆర్డీయే, ఏడీసీ తదితర సంస్థలు, విభాగాల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిని నిర్మించేందుకు అవసరమైన రూ.51,208 కోట్ల సమీకరణ, నిర్వహణకు సంబంఽధించిన ఆర్థిక ప్రణాళికపై సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది. ‘హడ్కో’, ఇతర ద్రవ్య సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు గల అవకాశాలను ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులు వివరించారు. రాష్ట్ర ప్రజలతోపాటు ప్రవాస భారతీయుల నుంచీ బాండ్ల ద్వారా నిధుల సేకరించాలని తెలిపారు. రాజధానిలో వేయబోయే పైప్‌లైన్‌, తాగునీరు, మురుగునీరు, విద్యుత్‌, కమ్యూనికేషన్‌ తదితర మౌలిక సదుపాయాలన్నీ ఉండే డక్ట్‌లను వినియోగించుకునే గణనీయమైన ఆదాయాన్ని సముపార్జించుకోగలమన్నారు. అమరావతిలో సీఆర్డీయేకు దక్కనున్న భూములను దశలవారీగా విక్రయించడం ద్వారా వచ్చే 20 ఏళ్లల్లో రూ.35,226 కోట్ల నుంచి రూ.73,509 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిల్లో కమర్షియల్‌ భూములను 269 చదరపు గజాల నుంచి 5,574 చదరపు గజాల విస్తీర్ణంలో 6 విభాగాలు చేస్తారు. 9,380 ప్లాట్లలో రెసిడెన్షియల్‌ ప్లాట్లను ఒక్కొక్కటి 1,000 చ.గ.గా విభజించి, అమ్మకానికి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. వీటికి అధిక ధరలు లభించేలా చూసేందుకుగాను ఈ-వేలం వేస్తామని, ప్రతి ప్లాట్‌కూ ప్రత్యేకంగా వేలం ఉంటుందని తెలిపారు.
 
మొదట్లో వ్యయం తప్పదు!
మొదట్లో కొన్నేళ్లపాటు రాజధాని నిర్మాణానికయ్యే వ్యయం ఎక్కువగానే ఉంటుందని సీఎం అన్నారు. అయితే వచ్చే రోజుల్లో సమకూరే ఆదాయం దానికంటే తక్కువగా ఉండబోతున్నప్పటికీ కాలం గడిచేకొద్దీ ఈ పరిస్థితి మారి.. 2033కల్లా ఆదాయమే ఎక్కువగా ఉంటుందని సీఎం అన్నారు. అమరావతి స్వయంసమృద్ధిని సాధించడమే కాకుండా రాష్ట్రానికి మంచి ఆదాయం సమకూర్చేలా ఉండబోతుందని పేర్కొన్నారు. 2036 నాటికి రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ రూపంలో సమకూరే నిధులు మొత్తం రూ.24,266 కోట్లు అయితే.. ఆదాయం మాత్రం రూ.29,405.80 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు సీఎం చెప్పారు. అప్పటికీ ఈ నగరం ద్వారా రాష్ట్రానికి వివిధ పన్నుల ద్వారా జమయ్యే మొత్తం రూ.4392.89 కోట్లుగా ఉంటుందని, అది అంతకంతకూ పెరుగుతుందని తెలిపారు. ఫలితంగా రాష్ట్ర జీడీపీలో కూడా గణనీయ పెరుగుదల ఉంటుందని.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మనం ఎంతో ముందంజలో ఉంటామని సీఎం అన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...