Jump to content

Amaravati


Recommended Posts

అమరావతి ఐటీ టవర్‌
14-04-2018 05:52:25
 
636592819467680326.jpg
  •  డిజైన్లకు మరిన్ని మెరుగులు
  •  అధికారులకు లోకేశ్‌ ఆదేశం
అమరావతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మించే ఐకానిక్‌ ఐటీ టవర్‌ డిజైన్‌ చరిత్రలో గుర్తుండిపోయేలా ఉండాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఈ టవర్‌కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన డిజైన్లను ఏపీసీఆర్డీఏ అధికారులు శుక్రవారం ఆయనకు, ఐటీ శాఖాధికారులకు చూపారు. ‘హైదరాబాద్‌ పేరు చెప్పగానే సైబర్‌ టవర్‌ గుర్తొచ్చినట్టే, అమరావతి అనగానే ఈ ఐటీ భవంతే స్ఫురణకు రావాలి. ప్రస్తుత డిజైన్లను మరింత మెరుగుపర్చి ఆకృతులను సిద్ధం చేయాల’ని ఈ సందర్భంగా లోకేశ్‌ సూచించారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

36 అంతస్తుల ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌’
అమరావతిలో ప్రవాసాంధ్రులకు రూ.400 కోట్లతో భారీ భవనం
  వేల మందికి ఉన్నతస్థాయి ఉద్యోగాల కల్పన లక్ష్యం
15ap-main7a.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ సంస్థ ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌’ పేరుతో భారీ భవనాన్ని నిర్మించనుంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీనిని నిర్మిస్తారు. పోడియంతో కలిపి 36 అంతస్తులు ఉంటాయి. కేవలం ప్రవాసాంధ్రుల కోసమే, వారి నిధులతోనే నిర్మించే ఈ భవనంలో నివాస, కార్యాలయ వసతులు ఉంటాయి. వీటిలోని ఫ్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. దీనిలో ఏర్పాటయ్యే కార్యాలయాల్లో ఐదారు వేల మందికి ఉన్నతస్థాయి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని ఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ ‘ఈనాడు’కి తెలిపారు. కొరియాకి చెందిన స్పేస్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆకృతి రూపొందించింది. మరో అంతర్జాతీయ సంస్థ కుష్మన్‌ వేక్‌ఫీల్డ్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది.

అమరావతికి అద్దంపట్టేలా..!
‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌’ భవనం ఆకృతిని అమరావతికి అద్దంపట్టేలా ఆంగ్ల అక్షరం ‘ఎ’లా  తీర్చిదిద్దారు. రెండు టవర్లకు మధ్యలో గ్లోబ్‌ ఉంటుంది. వివిధ దేశాల్లో తెలుగువారి ఉనికికి ఇది నిదర్శనం. మొదట ప్రధాన భవనం, రెండోదశలో చుట్టూ మూడంతస్తుల షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తారు. మొత్తం నిర్మిత ప్రాంతం 11 లక్షల చ.అడుగులు.
* పార్కింగ్‌ కోసం రెండంతస్తుల సెల్లార్‌, దానిపై మూడంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవన నిర్మాణం జరుగుతుంది. దీనిలో ఒక టవర్‌లో 29, మరో టవర్‌లో 29 అంతస్తులు ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుతూ పైన నిర్మించే భాగం నాలుగంతస్తులుగా ఉంటుంది.
* ఒక టవర్‌లోని 29 అంతస్తుల్లో ‘రెసిడెన్షియల్‌ ఫ్లాట్లు’ ఉంటాయి. ఒక్కో అంతస్తులో రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. రెండో టవర్‌లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. 56 వరకు కమర్షియల్‌ ఫ్లాట్లు ఉంటాయి. వీటికి పైన ఉండే నాలుగంతస్తుల్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు.
* రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌ వైశాల్యం 4,500 చ.అడుగులు. ఈ టవర్‌లోని రెండు అంతస్తుల్ని సర్వీసు అపార్ట్‌మెంట్‌లుగా తీర్చిదిద్దుతారు. ఒక్కొక్కటి 400 చ.అడుగుల వైశాల్యం కలిగిన 20 విలాసవంతమైన సూట్‌లు ఉంటాయి. కంపెనీల సీఈఓలు, ఇతర ముఖ్యులు వచ్చినప్పుడు వీటిలోనే బస చేయవచ్చు.
* టవర్ల పై భాగంలోని నాలుగంతస్తుల్లో పెద్ద సంస్థల కార్యాలయాల ఏర్పాటుకి 18 వేలు, అంతకు మించిన చ.అడుగుల వైశాల్యం కలిగిన స్పేస్‌ ఉంటుంది.

పర్యావరణ అనుకూలం
భవనాన్ని పర్యావరణానికి అనుకూలంగా, తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటూ, ఎక్కువ వ్యర్థాలు బయటకు రాకుండా నిర్మిస్తున్నారు. ‘ఎక్సా స్కెలిటన్‌’ డిజైన్‌ వినియోగిస్తున్నారు. భవనంలో నిలువు స్తంభాలు ఉండవు. చుట్టూ వచ్చే ‘ఫ్రేమ్‌’పైనే భవనం బరువంతా ఆధారపడుతుంది.  5-6 శాతం అదనపు స్థలం అందుబాటులోకి వస్తుంది. 30 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. ప్రాంగణంలోనే మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తారు. రీసైకిల్‌ చేసిన నీటిని మొక్కల పెంపకానికి వాడతారు. ఘనవ్యర్థాల్నీ  రీసైకిల్‌ చేస్తారు. ప్రతి అంతస్తులో చుట్టూ పచ్చదనం, లాన్‌లు ఉంటాయి.

గ్లోబ్లో రివాల్వింగ్‌ రెస్టారెంట్‌..!
రెండు టవర్ల మధ్యలో... ఏర్పాటు చేసే గ్లోబ్‌ భవనానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ గ్లోబ్‌ తిరగకపోయినా... చూసేవారికి తిరుగుతున్నట్టు కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. దీనిలో నాలుగంతస్తులుంటాయి. రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ ఉంటుంది. దీనిలో కూర్చుంటే 360 డిగ్రీల్లో నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. గ్లోబ్‌లో 10-12 వేల చ.అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైనింగ్‌ హాల్‌, లాంజ్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా క్లబ్‌ హౌస్‌ ఉంటుంది. పోడియంలోని మూడు అంతస్తుల్లో మైగ్రేషన్‌ రిసోర్సు సెంటర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, లైబ్రరీ, ఫుడ్‌ కోర్టులు వంటి వసతులన్నీ ఉంటాయి. ఒక్కో చ.అడుగు ధరను రూ.5500గా ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికే 520 మంది నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఫ్లాట్లు కొనుగోలు చేసుకున్న ఎన్‌ఆర్‌టీలు వేరే వారికి అద్దెకు ఇచ్చుకోవచ్చు. విక్రయించాలనుకుంటే ఐదేళ్ల వరకు ప్రవాసాంధ్రులకే అమ్మాలి.

ప్రవాసాంధ్రులకు గర్వకారణం
రవికుమార్‌
15ap-main7b.jpg
ప్రవాసాంధ్రులకు గర్వకారణంగా అమరావతిలో ఒక భవనం ఉండేలా, అందులో సంస్థలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించడం ద్వారా రాజధానికి వారు తమ వంతు తోడ్పాటునందించేలా చూడటమే దీని వెనుక ప్రధాన ఉద్దేశం. శంకుస్థాపన సమయానికి ఒక్కొక్కటి 50 అడుగులు ఎత్తున్న వివిధ దేశాలకు చెందిన 50 జెండాలతో ఒక నిర్మాణం చేస్తాం. దాన్ని సందర్శనీయ ప్రదేశంగా తీర్చిదిద్దుతాం.
Link to comment
Share on other sites

అభివృద్ధి పనులకు టెండర్లు
17-04-2018 08:54:18
 
  • సీఆర్డీయే ప్రాజెక్ట్‌ ఆఫీస్‌పై మరో ఆరు అంతస్థులు
  • రూ.43.35 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు
  • పెదకాకాని, తక్కెళ్లపాడుల్లో అభివృద్ధి పనులు
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధానిలోని కొండమరాజుపాలెంలో నిర్మితమవుతున్న తన ప్రాజెక్ట్‌ కార్యాలయ భవంతిపై అదనంగా మరొక 6 అంతస్థుల కోసం సీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. ఇందుకు రూ.43.35 కోట్ల వ్యయమవుతుందని ఆ సంస్థ అంచనాలను రూపొందించింది. ప్రస్తుతం ఈ భవనాన్ని జి ప్లస్‌ 1 గా నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మించబోయే 6 అంతస్థులను ప్రీకాస్ట్‌ విధానంలో, ఈపీసీ (ఎస్టిమేషన్స్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో చేపట్టాల్సి ఉంటుందని టెండర్‌ నోటిఫికేషన్‌లో సీఆర్డీయే పేర్కొంది. ఈ పనులను దక్కించుకునే సంస్థ నిర్మాణంతోపాటు అనంతరం 3 సంవత్సరాలపాటు ఏమైనా లోపాలు తలెత్తితే అందుకు బాధ్యత వహించి, వాటిని సరి చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న సంస్థలు టెండర్లను దాఖలు చేసుకునేందుకు వచ్చే నెల 5వ తేదీ వరకు గడువునిచ్చారు.
 
పచ్చదనం నిర్వహణకు..
చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో గన్నవరం విమానాశ్రయం నుంచి నిడమానూరు వరకు రోడ్డుకు ఇరువైపులా, మధ్యన కోట్లాది రూపాయలతో సుమారు రెండేళ్ల క్రితం నేత్రపర్వంగా అభివృద్ధి పరచిన పచ్చదనాన్ని సక్రమంగా నిర్వహించేందుకు కూడా సీఆర్డీయే టెండర్లను పిలిచింది. 2 సంవత్సరాలపాటు ఈ గ్రీనరీ నిర్వహణకు రూ.1.50 కోట్ల వ్యయం కాగలదని అంచనాలు రూపొందించింది. దీంతోపాటు మందడం కూడలి నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయం (ఐజీసీ) వరకు ఉన్న రహదారికి 2 పక్కల, ఐజీసీ ప్రాంగణంలోనూ ఉన్న పచ్చదనాన్ని రెండేళ్లపాటు నిర్వహించేందుకు కూడా సీఆర్డీయే టెండర్లు ఆహ్వానించింది. ఇందుకు సుమారు రూ.1 కోటి వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ రెండు పనులకు వేర్వేరుగా టెండర్లు పిలిచిన సీఆర్డీయే వాటి దాఖలుకు ఈ నెల 18ని చివరి తేదీగా పేర్కొంది.
 
పెదకాకాని, తక్కెళ్లపాడుల్లో..
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని పెదకాకాని, తక్కెళ్లపాడుల్లో కొన్ని పనులకు టెండర్లు పిలిచింది. జాతీయ రహదారి నుంచి పెదకాకానిలోని శివాలయం వరకు ఉన్న రహదారిని రూ.1.92 కోట్ల అంచనా వ్యయంతో, తక్కెళ్లపాడులోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌కు సీసీ రహదారి, రిటైనింగ్‌ వాల్‌ను రూ.86.27 లక్షలతో నిర్మించాలని నిర్ణయించింది. పనులకు వేర్వేరుగా టెండర్లను ఆహ్వానించిన ఈ నెల 26 వ తేదీ వరకూ గడువునిచ్చింది.
Link to comment
Share on other sites

ఆ ప్రచారంలో నిజం లేదు: సీఎం చంద్రబాబు
18-04-2018 21:24:44
 
636596834860473777.jpg
అమరావతి: రాజధాని పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా పనులు ఆగకూడదని నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజల్లో విశ్వాసం సడలకుండా చూడాలని, నిధుల సేకరణకు రూపొందించిన ఆర్థిక ప్రణాళికకు ఆమోదం తెలపాలన్నారు. పరిపాలనా నగరానికి విడిగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కేంద్రం సహకరించడం లేదని, పనులు ఆగిపోతాయని కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి నిధులు అందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అన్ని అంశాలను ప్రజలకు వివరించాలని రాజధానిలో చేపట్టిన పనులను డ్రోన్ల ద్వారా చిత్రీకరించి రెండు నిమిషాల లఘుచిత్రాలను ప్రతి నెలా సినిమా థియేటర్లలో, మీడియా ఛానళ్లలో ప్రదర్శించాలని చంద్రబాబు సూచించారు.
 
రాజధానిలో రూ.23,294 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన వివరించారు. మొత్తం రూ. 48,115 కోట్లు అవసరం అవుతాయని, వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవడం వల్ల వడ్డీతో కలిపి వ్యయం రూ.51 వేల కోట్లు దాటుతుందని ఆయన అంచనా వేశారు. రూ.38,590 కోట్ల మేర హడ్కో, వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలుగా తీసుకోవడానికి అవకాశం ఉందన్న అధికారులు, రాజధానిలో కీలకమైన 5020 ఎకరాల భూమి ద్వారా నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని అధికారులు అన్నారు. ఏ నగరమైనా రాత్రికి రాత్రే అభివృద్ధి చెందదని చంద్రబాబు చెప్పారు. హోటళ్లు, స్కూళ్లు, కళాశాలలు, వ్యాపార కూడళ్లు అన్నీ క్రమంగా నిర్మాణాలు జరిగి ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవాలంటూ, పరిణామ క్రమంలో అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు.
 
డిసెంబరు నాటికి రాజధాని రహదారులు పూర్తి కావాలని, పనులు పూర్తి చేయని నిర్మాణ సంస్థలను పక్కన పెట్టాలని ఆదేశించారు. రాజధానిలో గృహ అవసరాల కోసం 3 ప్యాకేజీల కింద పనులను 1258 కిలోమీటర్ల మేర 3 జోన్లుగా విభజించి ఎల్‌పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి ద్వారా రాజధానిలో పీపీపీ పద్ధతిలో 5 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేస్తామన్నారు. అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూ.15 వేల కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయని ఏడీసీ సీఎండీ చెప్పారు. ఏడాదిలోగా విజయవాడ-గుంటూరు రహదారి బ్యూటిఫికేషన్‌ చేయాలని, విజయవాడలో 50 కిమీ మేర కాల్వలు సుందరీకరించాలని సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు సూచించారు.
Link to comment
Share on other sites

అమరావతి అప్డేట్... ఎన్ని పనులు జరుగుతున్నాయో చూడండి...

   
amaravati-18042018.jpg
share.png

కేంద్ర సహాయ నిరాకరణతో అమరావతి నిర్మాణంపై ప్రజానీకంలో అనేక సందేహాలు తలెత్తాయని, వాటిని పటాపంచలు చేసేలా రాజధాని నిర్మాణంలో వేగం పుంజుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాజధాని నిర్మాణంలో కేంద్రం తన మాటను నిలబెట్టుకోకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయని, ప్రజలే ముందుకొచ్చి సొంతంగా నిధులను సమకూర్చడానికి సన్నద్ధం కావడం అన్నింటి కంటే విశేషమని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని సడలనీయకుండా నిర్ణిత వ్యవధిలోగా పనులను పూర్తిచేయడంలో నిర్మాణ సంస్థలు సహకరించాలని కోరారు. అలా కాకుండా పనులలో ఉదాశీనత ప్రదర్శిస్తే ఇక ఏమాత్రం ఉపేక్షించబోనని స్పష్టంచేశారు.

 

amaravati 18042018

అమరావతి అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పురపాలక మంత్రి పి. నారాయణతో బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సమీక్షించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు, వివిధ ప్రాజెక్టులు చేపట్టిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పనుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి నగర నిర్మాణానికి అవసరమయ్యే నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపై రానున్న 18 ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఆర్థిక ప్రణాళికను ఈ సమావేశంలో ఆమోదించారు. ఐతే, దీనిని కేవలం తాత్కాలిక ప్రణాళికగానే తీసుకోవాలని, పరిస్థితులు, రాబడి మార్గాల ఆధారంగా ఎప్పటికప్పుడు ఈ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం రూ.23,294 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని, మొత్తం రాజధాని ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 48,115 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఈ నిధులను వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవడం వల్ల వడ్డీతో కలిపి మొత్తం అంచనా వ్యయం రూ.51 వేల కోట్లు పైబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రూ.38,590 కోట్ల మేర హడ్కో, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుంచి రుణాలుగా తీసుకోవడానికి అవకాశం ఉందని వివరించారు. మెకన్సీ, క్రిసిల్ వంటి ప్రముఖ కన్సల్టెంట్ల సహకారంతో ఈ ప్రణాళికను రూపొందించామని అన్నారు. కీలక రాజధాని ప్రాంతంలో గల 5020 ఎకరాల భూమిని ఎవరికీ కేటాయించకుండా రిజర్వులో ఉంచి దాని ద్వారా నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. మరో నాలుగేళ్లలో సీఆర్‌డీఏ సొంత ఆదాయ మార్గాలలో స్వయంగా నిధులను సమకూర్చుకునే స్థాయికి ఎదగగలదని అంచనా వేస్తున్నట్టుగా చెప్పారు.

 

amaravati 18042018

పరిపాలన నగరం అభివృద్ధిని ప్రత్యేకంగా పరిగణించి దానికోసం విడిగా నిధుల ప్రణాళికను తయారుచేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. 1300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న పరిపాలన నగరంలో మానిటైజేషన్ కోసం కేటాయించే భూమి ఎంతో పరిశీలించి ప్రణాళికను చేయాలని అన్నారు. అలాగే, జీఎస్‌టీ ద్వారా సమకూరే ఆదాయం, ఆస్తి పన్నులు, ఇతర మార్గాలలో వచ్చే ఆదాయాలను గమనంలోకి తీసుకుని రాజధానికి అవసరమయ్యే ఆర్థిక ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఏ నగరమైనా రాత్రికి రాత్రే అభివృద్ధి చెందుతుందని ఎవరూ అనుకోరని, హోటళ్లు, స్కూళ్లు, కళాశాలలు, వ్యాపార కూడళ్లు.. ఇలా ఒక్కొక్క నిర్మాణం జరిగి ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం ద్వారా పరిణామ క్రమంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్నంతా తీసుకెళ్లి హైదరాబాదులో పెట్టి ఆ నగరాన్ని అభివృద్ధి చేసినట్టుగా కొందరు ప్రచారం చేశారని, ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ఆనాడు తాము హైదరాబాద్ అభివృద్ధికి మళ్లించలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘సైబరాబాద్, శంషాబాద్ నిర్మాణాలకు అవసరమయ్యే నిధుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతికాం. తరువాతి క్రమంలో అక్కడ పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలు జరగడంతో సెల్ఫ్ సస్టెయినబులిటీ వచ్చింది’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘కేంద్రం సహకరించడం లేదని, పనులు నిలిచిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. అవేవీ నిజం కాదు. రాజధాని నిర్మాణానికి నిధులు అందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఇవన్నీ ప్రజలకు వివరించాల్సి వుందని అన్నారు. రాజధానిలో జరుగుతున్న పనులను డ్రోన్ల ద్వారా చిత్రీకరించి రెండు నిమిషాల నిడివి గల లఘుచిత్రాలను ప్రతి నెలా సినిమా ధియేటర్లలో, మీడియా ఛానళ్లలో ప్రదర్శించాలని సూచించారు.

amaravati 18042018

మొత్తం పరిపాలన నగరంలో 54 వేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఉపయోగించే ప్రాంతంగా ఉంటుందని సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో రహదారుల వరకు ప్రాధాన్యంగా తీసుకుని ముందు భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని, న్యాయపరమైన అవరోధాలు ఉంటే న్యాయస్థానాలలో కేవియట్లు వేసుకుని సంబంధిత స్థలం సత్వరం స్వాధీనం చేసుకునేలా చూడాలని సూచించారు. ఈ వ్యాజ్యాల వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయనే విషయాన్ని న్యాయస్థానాలకు చెప్పాలని అన్నారు. రాజధానిలో జరుగుతున్న రహదారి పనుల పురోగతిని ఆయా నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మౌలిక సదుపాయాల కోసం మొత్తం 1945 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నామని, పెనుమాక గ్రామంలోనే 540 ఎకరాల మేర భూ సేకరణ జరపాల్సివుందని అధికారులు చెప్పారు. ఉండవల్లి, తాడేపల్లి గ్రామాలలో కూడా ఈ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ఉండవల్లిలో రహదారి అవసరాలను ప్రాధాన్యంగా తీసుకుని భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేస్తున్నామని వివరించారు. తాము 32 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా, అందులో 19.5 కిలోమీరట్ల పనిని పూర్తిచేసినట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధి చెప్పారు. నవంబరు నెలాఖరుకు తమ ప్యాకేజ్ పనులన్నీ పూర్తిచేస్తామని తెలిపారు. తమ ప్యాకేజీలో 4.2 కిలోమీటర్ల మేర భూ సేకరణ జరపాల్సి ఉందని వివరించారు. డిసెంబరు నాటికి రహదారుల పనులన్నీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయని నిర్మాణ సంస్థలను పక్కన పెట్టాల్సి వస్తుందని, ఇందులో మొహమాట పడబోనని అన్నారు. 58 కిలోమీటర్ల మేర ఉన్న తమ ప్యాకేజీ పనులను నవంబరు నాటికి పూర్తిచేస్తామని ఎన్‌సీపీ తెలిపింది. వంతెనలు, డిజైన్ల తయారీలో జరిగిన జాప్యం వల్ల ఈ సంస్థ చేపట్టిన పనులలో కొంత మేర ఆలస్యం జరిగిందని అధికారులు వివరించారు. 32 కిలోమీటర్లలో చేపట్టిన తమ ప్యాకేజ్ పనులలో 7 కిలోమీటర్ల మేర భూ సేకరణ సమస్య ఉందని మెగా ఇంజనీరింగ్ ప్రతినిధి చెప్పారు. పూర్తిస్థాయిలో అక్విప్‌మెంట్ తరలించి పనులను శీఘ్రగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఈ సంస్థను ఆదేశించారు. బీఎస్‌ఆర్, ఎన్ సీసీ, బీఎస్‌సీ, ఆర్వీఆర్ తదితర సంస్థలు చేపట్టిన ప్యాకేజీ పనులను కూడా ముఖ్యమంత్రి వివరంగా తెలుసుకున్నారు. ఎక్కడా కూడా యంత్ర పరికరాలు, మానవ వనరుల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీయం సూచించారు.

రాజధానిలో గృహ అవసరాల కోసం 3 ప్యాకేజీల కింద పనులను చేపట్టామని కమిషనర్ తెలిపారు. 1258 కిలోమీటర్ల మేర 3 జోన్లుగా విభజించి ఎల్‌పీఎస్ లే అవుట్ల అభివృద్ధిని చేపట్టామని చెప్పారు. తొలుత ఎల్‌పీఎస్ అభివృద్ధిని పూర్తిచేస్తేనే రాజధానిలో ఇతరత్రా నిర్మాణ పనులు మొదలవుతాయని ముఖ్యమంత్రి అన్నారు. పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడం కోసం నిధులను ముందే విడుదల చేయాలని ఆయా ఆర్థిక సంస్థలను కోరాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటి నుంచి సిద్ధం చేసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తే ప్రజలే ముందుకొచ్చి రుణాలు అందించడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన కన్వెన్షన్ సెంటర్ కోసం 5 ఎకరాల స్థలం కేటాయించి ప్రైవేట్ భాగస్వామ్యం, నిర్వహణతో పూర్తిచేద్దామని సమావేశంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. శాఖమూరు ఉద్యానవనాన్ని సైతం ఇదే రీతిలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టామని గుర్తుచేశారు. అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూ.15 వేల కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయని ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి చెప్పారు. ప్రధాన రహదారి వెంబడి, ముఖ్యమైన ప్రదేశాలలో పచ్చిక బయళ్లను అభివృద్ధి చేయడం వల్ల దుమ్ము, ధూళి నిరోధించవచ్చునని, ముఖ్యంగా విజయవాడ-గుంటూరు వరకు రహదారి వెంబడి బ్యూటిఫికేషన్ పనులను ఏడాదిలోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, 50 కిలోమీటర్ల మేర ఉన్న విజయవాడలోని కాల్వలను సుందరీకరించే ప్రాజెక్టును సత్వరం చేపట్టాలని ఏడీసీకి సూచించారు. గ్రీనరీ నిర్వహణ కోసం జల వనరుల శాఖ సమన్వయం చేసుకుని చిన్న చిన్న చెక్ డ్యాములను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. హోటళ్లు, స్కూళ్లు, హాస్పటళ్ల ఏర్పాటు వెంటపడితే మినహా పూర్తి కావని ముఖ్యమంత్రి అన్నారు. పరిపాలన నగరం అభివృద్ధి పనులను కమిషనర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయం నిర్మాణ ప్రక్రియ త్వరలోనే టెండర్ల దశకు వెళ్తున్నట్టు చెప్పారు. 2 ప్యాకేజీలుగా సచివాలయం నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. తొలిదశలో రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు వెళ్తున్నామని తెలిపారు. హైకోర్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెలాఖరుకు టెండర్లకు వెళుతున్నామని తెలిపారు. జిల్లా కోర్టు ఏర్పాటుపై టెండర్ ఓపెన్ చేశామని వివరించారు. ఈ వారంలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 2026 కోట్ల మేర ఆంధ్రాబ్యాంక్, విజయా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తున్నాయని తెలిపారు. ఈనెల 21న యుకే హాస్పటల్ గ్రూపు ప్రతినిధులు వస్తున్నారని కమిషనర్ తెలిపారు. ఆతిధ్య రంగానికి సంబంధించి ఐదు, నాలుగు, మూడు నక్షత్రాల హోటళ్లు కొన్ని ముందుకు వచ్చాయని కమిషనర్ చెప్పారు. 3 ఐదు నక్షత్రాల హోటళ్లు, 3 మూడు నక్షత్రాల హోటళ్లు ఆసక్తి చూపాయని అన్నారు. 5 వేల గదుల చొప్పున నిర్మించడానికి మహీంద్ర, తాజ్ గ్రూపులు అంగీకరించాయని ముఖ్యమంత్రి తెలిపారు. మేరియట్, ఫోర్ సీజన్స్ వంటి ప్రముఖ సంస్థలను సంప్రదించాలని సూచించారు. రాజధానిలో ఏ ప్రాంతంలో హోటళ్లు రావాలో ముందే మార్క్ చేసుకోవాలని చెప్పారు. 10 వేల హోటల్ గదుల ఏర్పాటే లక్ష్యంగా ఆతిధ్య రంగాన్ని ప్రోత్సహిద్దామని నిర్ణయించారు. సీఆర్‌డీఏ తరఫున 35 ఎలక్ట్రిక్ వెహికిల్స్ తీసుకుంటున్నామని అధికారులు తెలియజేశారు. సీఆర్‌డీఏ, ఏడీసీతో కలిసి పర్యాటక శాఖ కొన్ని ప్రాజెక్టులు చేపట్టాల్సి వుందని అన్నారు. అక్షరథామ్, టీటీడీ, బిర్లా దేవాలయాలు ఏర్పాటుకు ఆయా సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణం ఆగదు!
కేంద్రం నిధులివ్వకపోయినా  ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి
ప్రజల్లో అనుమానాలు తొలగించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
రాజధాని పనులపై సమీక్ష
18ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి కేంద్రం సహాయ నిరాకరణ నేపథ్యంలో రాజధాని నిర్మాణంపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయని, వాటిని నివృత్తి చేసేలా నిర్మాణ పనులు వేగవంతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి సహకరించే విషయంలో కేంద్రం తన మాట నిలబెట్టుకోకపోయినా.. ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయని తెలిపారు. ‘ప్రజలే ముందుకొచ్చి నిధులు సమకూర్చేందుకు సిద్ధమవడం అన్నింటికంటే విశేషం. ప్రజల్లో ఉన్న విశ్వాసం సడలకుండా రాజధాని పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు సహకరించాలి’ అని సీఎం కోరారు. పనుల్లో ఉదాసీనతను ఉపేక్షించబోనన్నారు. రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి బుధవారం సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు. రాజధానిలో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్న నిర్మాణ సంస్థల ప్రతినిధులూ సమావేశంలో పాల్గొన్నారు.

GbfMKYJ.jpg

కావలసిన నిధులివీ..
రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల ప్రాజెక్టులు, సదుపాయాల కల్పనకు రూ.48,115 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.23,294 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నిధుల సమీకరణపై 18 ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఆర్థిక ప్రణాళికను సమావేశంలో ఆమోదించారు. దీన్ని తాత్కాలిక ప్రణాళికగానే భావించాలని.. పరిస్థితిని, ఆదాయమార్గాల్ని ఆధారం చేసుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రూ.48,115 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవడం వల్ల వడ్డీతో కలిపి అంచనా వ్యయం రూ.51 వేల కోట్లకుపైగా అవుతుందని అధికారులు వివరించారు. రూ.38,590 కోట్ల వరకు హడ్కో, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల నుంచి రుణాలుగా తీసుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. రాజధానిలో 5020 ఎకరాల భూమిని రిజర్వులో ఉంచి నిధులు సమకూర్చుకునే అవకాశం ఉందని తెలిపారు.

పరిపాలన నగరానికి ప్రత్యేక ప్రణాళిక
1300 ఎకరాల్లో నిర్మించే పరిపాలన నగరం అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీఎస్టీ ద్వారా సమకూరే ఆదాయం, ఆస్తిపన్ను, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని గమనంలోకి తీసుకుని రాజధాని ఆర్థిక ప్రణాళిక రూపొందించాలన్నారు. రాజధానిలో అభివృద్ధి పనులను ప్రతి నెలా డ్రోన్ల ద్వారా చిత్రీకరించి రెండు నిమిషాల నిడివి చిత్రాలను సినిమాహాళ్లలో, టీవీ ఛానళ్లలో ప్రదర్శించాలని ఆదేశించారు. రాజధానిలో రహదారుల నిర్మాణం ప్రాధాన్యాంశంగా తీసుకుని భూసేకరణ పూర్తిచేయాలన్నారు. న్యాయపరమైన అవరోధాలుంటే కేవియట్లు వేసుకుని సత్వరం స్థలం స్వాధీనమయ్యేలా చూడాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కోసం 1945 ఎకరాల్ని సేకరించాల్సి ఉందని, దీనిలో 540 ఎకరాలు పెనుమాక గ్రామంలోనే ఉందని అధికారులు తెలిపారు. డిసెంబరు నాటికి రహదారుల పనులన్నీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఐదెకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌
రాజధానిలో నిర్మించతలపెట్టిన కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రాథమిక ఆకృతులను ముఖ్యమంత్రి పరిశీలించారు. దీనికి ఐదెకరాలు కేటాయించి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపడదామన్నారు. ఏడీసీ ఆధ్వర్యంలో రూ.15 వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని సీఎండీ లక్ష్మీ పార్థసారథి తెలిపారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు రహదారి వెంట సుందరీకరణ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సచివాలయ నిర్మాణానికి తొలి దశలో రూ.2వేల కోట్ల అంచనాతో త్వరలో టెండర్లు పిలుస్తున్నామని, రెండు ప్యాకేజీలుగా చేపడతామని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. హైకోర్టు నిర్మాణానికి ఈ నెలాఖరుకు టెండర్లు పిలుస్తామన్నారు. ప్రభుత్వ గృహనిర్మాణ ప్రాజెక్టులకు ఆంధ్రాబ్యాంకు, విజయాబ్యాంకు, ఇండియన్‌బ్యాంకు రూ.2026 కోట్ల రుణాలు ఇస్తున్నాయన్నారు. రాజధానిలో ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి మూడు సంస్థలు, మూడు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి మరో మూడు సంస్థలు ముందుకు వచ్చినట్టు చెప్పారు. పది వేల హోటల్‌ గదుల నిర్మాణమే లక్ష్యంగా ఆతిథ్యరంగాన్ని ప్రోత్సహిద్దామని సీఎం పేర్కొన్నారు. సీఆర్‌డీఏ తరపున 35 ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అక్షరధామ్‌, తితిదే, బిర్లా సంస్థలు దేవాలయాల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

కేంద్రం సహకరించకపోయినా... అమరావతిని వేగంగా నిర్మిద్దాం!
19-04-2018 03:40:51
 
636597060530623592.jpg
  •  ప్రజల్లో విశ్వాసం సడలని రీతిలో పనులు జరగాలి
  •  ఉదాసీనత చూపే నిర్మాణ సంస్థలను ఉపేక్షించబోం
  •  పనులపై థియేటర్లు, చానెళ్లలో లఘుచిత్రాల ప్రదర్శన
  •  ఏపీసీఆర్డీయే సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో అమరావతి నిర్మాణంపై ప్రజల్లో తలెత్తిన సందేహాలను పటాపంచలు చేసేలా పనుల్లో వేగం పెరగాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానికి ఇస్తామన్న నిధుల విషయంలో కేంద్రం తన మాటను నిలబెట్టుకోకున్నా పనులేవీ ఆగవని స్పష్టం చేశారు. ఈ విషయమై కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. నిధుల సమీకరణకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిధులు ఇస్తామంటున్నారని చెప్పారు. ఏపీసీఆర్డీయే, ఏడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్షతో పాటు భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో హైదరాబాద్‌లో ప్రపంచస్థాయిలో తాము సైబరాబాద్‌, శంషాబాద్‌ను అభివృద్ధి పరచినప్పుడు కూడా వాటికి అవసరమైన నిధుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొన్నామని, కాలక్రమంలో అక్కడ పెద్దఎత్తున ఆర్ధిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఆర్థిక స్వావలంబన సాధించాయని చెప్పారు. ఇదే విధంగా అమరావతిని కూడా తీర్చిదిద్దుదామన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని సడలనివ్వని రీతిలో నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ కంపెనీలు సహకరించాలని కోరారు. పనుల్లో ఉదాసీనత ప్రదర్శిస్తే ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరు గురించి ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ప్రతినెలా తాజా చిత్రాలతో పాటు డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాలను సినిమా థియేటర్లలోనూ, అన్ని రకాల ప్రసార మాధ్యమాల్లోనూ ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు.
 
ఆర్థిక ప్రణాళికకు ఆమోదం
అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చుకునే అంశంపై వచ్చే 18ఏళ్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఆర్థిక ప్రణాళికను ఈ సమావేశంలో ఆమోదించారు. మొత్తం రాజధాని ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.48,115 కోట్లు అవసరమని తొలుత భావించినప్పటికీ ఈ నిధులను వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణరూపేణా తీసుకుంటున్నందున వడ్డీతో కలిపి మొత్తం రూ.51,000కోట్లు దాటుతుందని తాజాగా అంచనా వేసినట్లు సీఆర్డీయే అధికారులు తెలిపారు. ఈ నిధుల్లో రూ.38,590 కోట్లను హడ్కో, ప్రపంచ బ్యాంక్‌ వంటి సంస్థల నుంచి రుణంగా పొందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అమరావతిలో రూ.23,294 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. కాగా, 2,000సీట్ల సామర్థ్యంతో రాజధానిలో నిర్మించదలచిన బహుళ ప్రయోజన కన్వెన్షన్‌ సెంటర్‌కు సంబంధించిన డిజైన్లలో ఒకదాన్ని ఖరారుచేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. శాఖమూరు వద్ద నిర్మాణంలో ఉన్న అమరావతి సెంట్రల్‌ పార్కు పనుల గురించి ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారథి వివరించారు. ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి, శాసనసభ్యులు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోల కోసం వివిధ కంపెనీలు నిర్మిస్తున్న గృహ సముదాయాల నిర్మాణాలను సీఎం పరీశీలించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...