Jump to content

Amaravati


Recommended Posts

హోం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు
ఏపీకి గ్రేహౌండ్స్‌ యూనిట్‌
02-03-2018 02:59:59
219 కోట్లతో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.219 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయడానికి గురువారం కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ, ఆర్థికశాఖ అధికారులతో ఢిల్లీలో ఏపీ డీజీపీ ఎం మాలకొండయ్య ఈ అంశంపై చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తెలంగాణకు చెందిన క్రమం లో ఏపీలో కొత్తగా గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 9(3)లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చోపచర్చల తర్వాత ఒక యూనిట్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది.
 
దీని ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా నిధులు ఇవ్వాలని, యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన మౌలికసదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పనకు సహకరించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రూ.858.37 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టడానికి వివరణాత్మక నివేదికను కేంద్ర హోంశాఖకు పంపింది. అదే సమయంలో పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు విభాగానికి సంబంధించిన ఇతర అవసరాల కోసం 2014లోనే రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు డివిజన్‌లో 2700 ఎకరాల భూమిని గుర్తించింది. గతంలో కేంద్ర హోంశాఖ అధికారుల బృందం హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ కేంద్రానికి వచ్చి ఈ అంశంపై చర్చించింది. తర్వాత 2016 డిసెంబరులో ఆ బృందం ఏపీలో పర్యటించి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూముల వివరాలివ్వాలని విజ్ఞప్తి చేసింది.
 
ఈ నేపథ్యంలో అమరావతిలో 250 ఎకరాల విస్తీర్ణంలో 2 యూనిట్లుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. కాగా, రాష్ట్రంలో పూర్తిస్థాయి శిక్షణ కేంద్రం లేకపోవడం వల్ల విశాఖపట్నంలో ఉన్న గ్రేహౌండ్స్‌ ఆపరేషనల్‌ హబ్‌లోనే శిక్షణ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహీర్‌ వెల్లడించారు. ఆపరేషనల్‌ హబ్‌ ఏర్పాటుకు కూడా కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

On 3/1/2018 at 11:52 AM, sonykongara said:
అమరావతిలో భారీ సైనిక విగ్రహం
01-03-2018 01:20:48
 
636554640475833756.jpg
అమరావతిలో మరో అపురూప కట్టడం కొలువుతీరనుంది. ఈ మేరకు స్మార్ట్‌ పార్క్స్‌ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికుల కష్టానికి, త్యాగాలకు గుర్తుగా అమరావతిలో బుద్ధ విగ్రహం సమీపంలో భారీ సైనిక విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు స్మార్ట్‌ పార్క్స్‌ ఎండీ తవ్వా శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. ఆ విగ్రహాలను కలుపుతూ 2 కిలోమీటర్ల మేర బండ్‌ స్ర్టీట్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

Where is this located...? Buddha stupa existing one near amaravathi village or..will they construct another one..? Amar jawan sthupa ekada vastundi location as per this plan.??

Link to comment
Share on other sites

జ్యుడీషియల్‌ భవనాల తుది ఆకృతులు ఖరారు 
12 ఆకృతుల్లో మొదటిదాన్ని ఎంపిక చేసిన ముఖ్యమంత్రి 
  టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ 
2ap-main14a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన జ్యుడీషియల్‌ భవన సముదాయాల తుది ఆకృతులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీని కోసం మొత్తం 12 ఆకృతులను రూపొందించగా మొదటి ఆకృతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపిక చేశారు. శుక్రవారం సీఆర్‌డీఏ అధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రూపొందించిన ఆకృతులన్నింటినీ సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో పెట్టి వాటిపైన ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలు స్వీకరించారు. ఓటింగూ చేపట్టారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తుది ఆకృతిని ఖరారు చేశారు. అనంతరం జీ ప్లస్‌2 నమూనాలో ఈ భవనం నిర్మించేందుకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. మొత్తం 2.25 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుంది. భవిష్యత్తులో భవనంలో జీ ప్లస్‌ 5 వరకూ అంతస్తులు వేసేందుకు వీలుగా నిర్మిస్తారు. రాజధాని పరిధిలోని నేలపాడులో రూ.94.50 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఒక్కో చ.అడుగుకు రూ.4200 ఖర్చు కానుంది. ఏప్రిల్‌ 4వ తేదీ సాయంత్రం నాల్గింటికి సాంకేతిక బిడ్లు తెరుస్తారు. భవన సముదాయాల నిర్మాణం పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును తాత్కాలికంగా ఈ భవనాల్లో ఏర్పాటుచేస్తారు. పరిపాలన నగరంలో శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యాక జ్యుడీషియల్‌ భవన సముదాయాలను సిటీ సివిల్‌, జిల్లా కోర్టులకు కేటాయిస్తారు.

స్ట్రక్చరల్‌ ఆకృతులు సిద్ధమైన నెల రోజుల్లో శాశ్వత భవనాలకు టెండర్లు: మరోవైపు పరిపాలన నగరంలో నిర్మించనున్న శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించిన అంతర్గత, స్ట్రక్చరల్‌ ఆకృతులు ప్రస్తుతం సిద్ధమవుతున్నాయి. మార్చి 15వ తేదీకి సచివాలయం, ఏప్రిల్‌ 15వ తేదీకి హైకోర్టు, మే 15కు అసెంబ్లీ భవనాలకు సంబంధించిన అంతర్గత, స్ట్రక్చరల్‌ ఆకృతులు సిద్ధంకానున్నాయి. అవి ఖరారైన నెల వ్యవధిలో వాటి నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.

అమరావతి మెరీనా అభివృద్ధికి టెండర్లు 
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అమరావతి మెరీనాను అభివృద్ధి చేసేందుకు సీఆర్‌డీఏ శుక్రవారం టెండర్లు పిలిచింది. ఏప్రిల్‌ 17వ తేదీ సాయంత్రం మూడింటి వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Link to comment
Share on other sites

జుడీషియల్‌ కాంప్లెక్స్‌ డిజైన్‌ ఖరారు
03-03-2018 04:28:19
 
636556480993119625.jpg
  •  అత్యధికుల మద్దతు మొదటి ఆప్షన్‌కే
  •  దానికే సీఎం చంద్రబాబు ఓటు
  •   94.50 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ పిలిచిన ఏపీసీఆర్డీయే
  •  బిల్టప్‌ ఏరియా 2.25 లక్షల చ.అ.లు
అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనాలు సిద్ధమయ్యేవరకూ దానికి వసతి కల్పించేందుకు ఉద్దేశించిన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌(సిటీ సివిల్‌ కోర్టు) డిజైన్‌ ఖరారైంది. దీనికి సంబంధించిన 12 డిజైన్లను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పబ్లిక్‌ డొమైన్‌లో ఏపీసీఆర్డీయే ఉంచిన సంగతి తెలిసిందే. నెటిజన్లలో అత్యధికులు ‘మొదటి ఆప్షన్‌’పట్ల మొగ్గు చూపారన్న విషయాన్ని శుక్రవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రికి తెలియజేశారు. దాంతో ఆ డిజైన్‌నే సీఎం ఖరారు చేశారు. ఆ వెనువెంటనే జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఏపీసీఆర్డీయే టెండర్లు పిలిచింది. అమరావతి పరిపాలనా నగరిలో నేలపాడు దగ్గర నిర్మించనున్న ఈ భవనం బిల్టప్‌ ఏరియా 2,25,000 చదరపు అడుగులు. నిర్మాణ అంచనా వ్యయం రూ.94.50 కోట్లు. జీ ప్లస్‌ 2 ప్రకారం ప్రస్తుతం దీనిని నిర్మిస్తున్నప్పటికీ ఫౌండేషన్‌ను మాత్రం జీ ప్లస్‌ 5కు సరిపడగా వేస్తారు.
 
ఫలితంగా భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే వీలుంది. టెండర్‌ను ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌, కనస్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో పిలిచారు. ఈ భవంతిలో ఆర్కిటెక్చరల్‌ ఫినిషింగ్‌లు, ఇతర అంతర్గత వసతుల కల్పన కూడా టెండర్‌ దక్కించుకున్న సంస్థే చేపట్టాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మూడేళ్ల వరకూ ఏమైనా లోపాలు, ఇబ్బందులు తలెత్తితే సరిచేయాల్సిన బాధ్యత కూడా సదరు సంస్థదే. బిడ్ల సమర్పణకు ఈ నెల 8వ తేదీ నుంచి వచ్చే నెల 4 వరకూ గడువు ఇచ్చారు. కాగా, జంట ఐటీ టవర్లకు సంబంధించిన 19 డిజైన్లపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు ఇంకా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ డిజైన్లకు దాదాపు 25 వేల మంది తమ అభిప్రాయాలు తెలియజేయగా..ఐటీ టవర్లకు 13 వేల మందే స్పందించడంతో ఈ ఆదేశాలు ఇచ్చారు.
వాటికి మరికొంత సమయం: ముఖ్యమంత్రి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు అసెంబ్లీ భవనానికి సంబంధించిన సమగ్ర అంతర్గత డిజైన్లను సమర్పించారు.
 
వాటిని మరింత మెరుగు పర్చాలని చంద్రబాబు సూచించడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఇస్తామని ఫోస్టర్‌ ప్రతినిధులు చెప్పారు. అయితే చర్చల ప్రక్రియ దాదాపుగా కొలిక్కి రావడంతో సచివాలయం సమగ్ర అంతర్గత డిజైన్లను ఈ నెల 15న, ఏప్రిల్‌ 15న హైకోర్టు, మే 15 కల్లా అసెంబ్లీ సమగ్ర డిజైన్లు సిద్ధం చేస్తామని వారు చెప్పారు.
 
అమరావతి మెరీనాకు ఆర్‌ఎఫ్‌పీల ఆహ్వానం
అంతర్గత జలరవాణాతోపాటు జలక్రీడలు, బోటింగ్‌, శిక్షణ కేంద్రాలు, పర్యాటక వసతులకు కేంద్రంగా విలసిల్లనున్న అమరావతి మెరీనాకు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎ్‌ఫపీ)లను ఆహ్వానిస్తూ సీఆర్డీయే నోటిఫికేషన్‌ జారీ చేసింది. వెంకటపాలెం దగ్గర కృష్ణానది కరకట్టకు రెండు వైపులా 8 ఎకరాల్లో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో పీపీపీ విధానంలో దీనిని అభివృద్ధి పరుస్తారు. రైల్వేస్టేషన్‌, బస్టాండు మాదిరిగా రాజధానిలో జలరవాణా వ్యవస్థకు మెరీనా కేంద్రస్థానం కానుంది.
 
ఇందులో 60 బెర్త్‌లు(ఫ్లాట్‌ఫారాలు) ఉంటాయి. ఇది ఏర్పాటవనున్న 8 ఎకరాల్లో 7 ఎకరాలను నది కరకట్టకు లోపలి వైపున, మిగిలిన ఒక ఎకరాన్ని కరకట్టకు రెండవ వైపున అభివృద్ధి పరుస్తారు. ఒకవేళ నదికి వరదలు వస్తే దానికి ఆనుకుని ఉండే 7 ఎకరాల కేంద్రం నుంచి బోటింగ్‌ కార్యకలాపాలను నిర్వహించడం కష్టమవుతుంది. అలాంటి సందర్భాల్లో కరకట్టకు బయటి వైపున ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసే బోటింగ్‌ టెర్మినల్‌ సేవలను వినియోగిస్తారు. అమరావతి మెరీనాకు అవసరమైన స్థలాన్ని సీఆర్డీయే సమకూర్చనుండగా, అందులో ప్రైవేట్‌ సంస్థలే దానిని పూర్తిగా తమ నిధులతో నిర్మిస్తాయి. ఆ తర్వాత 30 ఏళ్లపాటు మేరీనాను అవే నిర్వహిస్తూ, ఏడాదికింతని సీఆర్డీయేకు చెల్లిస్తాయి. 30 ఏళ్ల కాలవ్యవధి ముగిసిన అనంతరం మెరీనా సీఆర్డీయే పరమవుతుంది.
Link to comment
Share on other sites

శరవేగంగా రాజధానిలో రహదారుల నిర్మాణం
మంత్రి నారాయణ 
2ap-state1a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న రహదారులు 2019 మార్చికి పూర్తవుతాయని రాష్ట్ర పురపాలకశాఖమంత్రి డా.పి.నారాయణ తెలిపారు. తొలిదశలో 277 కిలోమీటర్ల రోడ్లు 2018 డిసెంబరు నాటికి సిద్ధమవుతాయన్నారు. అమరావతిలో రహదారుల పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. దొండపాడు, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాలను అనుసంధానిస్తూ నిర్మిస్తున్న రహదారులను మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శరవేగంగా పనులు సాగుతున్నాయన్నారు.  325 కిలోమీటర్లలో నాలుగు రకాల రహదారులు నిర్మిస్తున్నామన్నారు. రైతులకు కేటాయించిన ప్లాట్ల అభివృద్ధి పనులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అందులో రహదారుల పనులు ఏప్రిల్‌ నుంచి ప్రారంభిస్తామని.. అన్నీ సిమెంటు రోడ్లనే వేస్తామన్నారు.

7,500 మంది పేదలకు గృహాలు: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పది ప్రదేశాల్లో 5వేల కుటుంబాలు నివసించేందుకు గృహాలు సిద్ధమవుతున్నాయన్నారు. మరో 2,500 మంది నిరుపేదలు ఉన్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని వారికి కూడా త్వరలో గృహాలు మంజూరు చేస్తామన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎన్‌జీవోలకు 3,820 ఫ్లాట్లు నిర్మిస్తున్నామన్నారు. మార్చినెలాఖరుకు మొదటి అంతస్థు పైకప్పు పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు

Link to comment
Share on other sites

The road to Andhra’s new capital

http://www.thehindu.com/todays-paper/tp-national/article22921894.ece/alternates/FREE_300/TH04WHEREARTG333HJ2O41jpgjpg

Work is going on at a brisk pace to complete the roads leading to Andhra Pradesh’s new capital, Amaravati, but the designs for the various buildings, including the Secretariat, are still being finalised. About 33,000 acres of lush agricultural land on the banks of the Krishna, about 12 km to the northwest of Vijayawada, has been earmarked for Chief Minister N. Chandrababu Naidu’s dream project, estimated to cost Rs. 3 lakh crore. The foundation was laid by Prime Minister Narendra Modi on October 22, 2015.

Why is it taking so long?

The government is spending about Rs. 31,615 crore for infrastructure work, setting the stage for the start of construction of permanent facilities in a few months.

Work on government offices is yet to take off as the designs by Foster+Partners and architect Hafeez Contractor are not yet in place. The capital is coming up on 217 sq km.

Apart from arterial and sub-arterial roads that are being built, the other significant projects that have so far been completed are two universities — SRM and Vellore Institute of Technology.

The government had laid stress on the designs of the Raj Bhavan, the Legislature Complex, the High Court and the Secretariat, which it sent many times for revision, and it is currently under process by Foster+Partners and other consulting firms.

The perspective plan of the capital region, which encompasses 26 mandals in Guntur district and 30 in Krishna districts, has been readied. This includes the blueprints for transportation, tourism and townships.

What are the hurdles?

Preparation of a slew of detailed project reports (DPRs), various procedures involved in mobilising funds from the Central government and other lending agencies, including the World Bank, and awarding projects through international competitive bidding took time. The capital city’s master planning and engineering design took up to two years. Then there is the sheer scale of the project, like the construction of 4,900-odd residential units, nearly 200 bungalows and a maze of roads including those as ambitious as the expressway intended to link the faraway Anantapur to Amaravati. The government faced legal wrangles in the form of public interest litigation petitions against the construction of Amaravati at the chosen location and in the selection of the master developer.

What about funding?

The State government has received Rs. 2,500 crore from the Central government and is likely to get more funds. The World Bank had come forward to lend $1 billion for road infrastructure in the capital region, and 10 priority roads are poised for completion at the end of this year.

When will it be ready?

The construction of the iconic government buildings is likely to begin in a few months, and the laying of the first floor of residential quarters for government employees later this month.

Tenders have been just called for building another bridge across river Krishna from Ibrahimpatnam in Krishna district to Amaravati. Already 10,000 plots given to the farmers under the land pooling scheme, which began on January 1, 2015, have been registered and 200-300 are getting registered every day.

The Chief Minister has instructed officials to ground the core capital soon, having finished much of the planning and tied up funds.

Nevertheless, considering the magnitude of the task, it is going to take at least two years, if not more, to transform the entire capital region into a world-class city.

The State government is now functioning from the Interim Government Complex built at Velagapudi nearby. Situated nearby are the temporary Assembly and Council halls under a single roof.

Link to comment
Share on other sites

మూడు ప్యాకేజీలు.. ముమ్మరంగా..
05-03-2018 08:44:55
 
636558362963615963.jpg
రాజధాని అమరావతి.. హైటెక్‌ సొబగుల అధునాతన నగరంగా రూపాంతరం చెందుతోంది. సరికొత్త రహదారులు ఓ వైపు రాజధాని రూపురేఖలు మారుస్తుండగా.. ఆకాశ హర్మ్యాల వంటి ప్రభ్వుత్వ భవనాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్నాయి. రాయపూడి - ఐనవోలు మధ్య పెద్దఎత్తున నిర్మిస్తున్న పాలనా నగరం రేపటి అమరావతికి మోడల్‌గా నిలవబోతోంది. 2019 ఫిబ్రవరిలోగా వీటిని పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు పని చేస్తున్నాయి.
 
  • ప్రభుత్వ కోర్‌లో ముందస్తుగా గృహాలు
  • మూడు ప్యాకేజీలుగా 3,840 ఫ్లాట్లు
  • పన్నెండేసి అంతస్తులు.. 61 టవర్లు
  • జోరుగా సాగుతున్న నిర్మాణ పనులు
  • రాయపూడి, కేఆర్‌పాలెం, నేలపాడు, శాఖమూరుల్లో భవన నిర్మాణాలు
మంగళగిరి: రాజధానిలో రాయపూడి-ఐనవోలు మధ్య ప్రాంతంలో నిర్మితమవుతున్న ప్రభుత్వ పాలనా నగరం అత్యంత కీలకంగా ఉండబోతుంది. ఈ ప్రాంతంలో 61 టవర్లను రూ.2,209 కోట్ల వ్యయంతో 3,840 ఫ్లాట్‌లు వచ్చేవిధంగా 12 అంతస్తుల భవనాలుగా ప్రభుత్వం నిర్మిస్తోంది. మొత్తం మూడు ప్యాకేజీలుగా మూడు గుత్తేదారు సంస్థలు ఈ భవన నిర్మాణాలను చేపట్టాయి. రాయపూడి, కొండమరాజుపాలెం, నేలపాడు, శాఖమూరు ఏరియాల్లో ఈ గృహ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 2019 ఫిబ్రవరి 12లోగా సదరు గృహ నిర్మాణాలను గుత్తేదారు సంస్థలు పూర్తి చేయాల్సివుంది.
 
1వ ప్యాకేజీ
నగరంలోని 65.4 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం ఏడు డివిజన్లుగా భవన నిర్మాణాలను చేపట్టారు. ఇందులో 26శాతానికి పైగా విస్తీర్ణాన్ని గ్రీనరీకి ఉద్దేశించారు. రూ.635.9 కోట్ల ఒప్పందంపై నాగార్జున కనస్ట్రక్షన్స్‌ కంపెనీ తొలి ప్యాకేజీ రూపంలో పనులను చేపట్టింది. ఈ ప్యాకేజీలో మొత్తం 18 టవర్లను 432 ఫ్లాట్లు వచ్చేవిధంగా నిర్మిస్తున్నారు. ఈ ప్యాకేజీలో అన్నీ 3,500 చదరపు అడుగుల విస్తీర్ణం కల ఫ్లాట్‌లే వుంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 288 ఫ్లాట్‌లను నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తుకు రెండు ఫ్లాట్ల వంతున 12 అంతస్తుల భవనాలను 12 టవర్లుగా నిర్మిస్తున్నారు. దీంతో మొదటి డివిజన్‌ బిల్టప్‌ ఏరియా మొత్తం విస్తీర్ణం 10లక్షల 8వేల చ.అడుగులుగా వుండబోతుంది. ఇదే ప్యాకేజీలో రెండో డివిజన్‌ కింద అఖిల భారత సర్వీసు అధికారుల కోసం 144 ఫ్లాట్‌లను నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తులో రెండేసి ఫ్లాట్‌ల వంతున 12 అంతస్తుల టవర్లు ఆరింటిని నిర్మించేలా చర్యలు చేపట్టారు. దీంతో ఈ డివిజన్‌ బిల్టప్‌ ఏరియా విస్తీర్ణం 5లక్షల 4వేల చదరపు అడుగులుగా వుండబోతుంది.
 
2వ ప్యాకేజీ
రెండో ప్యాకేజీని రూ.866.1 కోట్ల ఒప్పందంపై ఎల్‌అండ్‌టీ సంస్థ చేపట్టింది. ఇది పూర్తిగా నాన్‌ గెజిటెడ్‌ అధికారుల కాలనీగా వుంటుంది. ఈ కాలనీలో మొత్తం 1,968 ఫ్లాట్‌లను 22 టవర్లుగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ 1,200 చ.అడుగుల విస్తీర్ణంతోనే వున్నప్పటికీ.. భవన నిర్మాణాలను మాత్రం రెండు వేర్వేరు డివిజన్లుగా చేశారు. ఒక్కో అంతస్తుకు ఎనిమిది ఫ్లాట్ల వంతున 12 అంతస్తుల భవనాలు పదహారింటిని నిర్మిస్తూ.... డివిజన్‌లో మొత్తం 1,536 ఫ్లాట్‌లకు స్థానం కల్పిస్తున్నారు. ఇదే ప్యాకేజీలో రెండో డివిజన్‌ కింద ఒక్కో అంతస్తుకు ఆరేసి ఫ్లాట్‌లు వచ్చేలాగున 12 అంతస్తుల భవనాలను ఆరింటిని నిర్మిస్తున్నారు. ఈ రకంగా సదరు డివిజన్లో 432 ఫ్లాట్‌లు వస్తాయన్నమాట! అంటే రెండో ప్యాకేజీలో మొత్తం 1536+432 (1968) ఫ్లాట్‌లు వుంటాయి. ఈ రెండో ప్యాకేజీ భవనాల బిల్డప్‌ ఏరియా విస్తీర్ణం 23లక్షల 61వేల 600 చ.అడుగులుగా వుంటుంది.
 
3వ ప్యాకేజీ
మూడో ప్యాకేజీ కింద గెజిటెడ్‌ అధికారుల కాలనీ, డి గ్రూపు ఉద్యోగుల సిబ్బంది కాలనీలను రూ.707.4 కోట్ల ఒప్పందంపై ఎస్పీసీఎల్‌ (షాపూజీ పల్లోంజీ)కంపెనీ చేపట్టింది. ఈ ప్యాకేజీలో మూడు రకాల కాలనీలు వున్నాయి. గెజిటెడ్‌ అధికారులకు సంబంధించి రెండు రకాల కాలనీలను నిర్మిస్తున్నారు. గెజిటెడ్‌- 1పేరుతో 1800 చ.అ. విస్తీర్ణం కల 384 ఫ్లాట్‌లను పన్నెండేసి అంతస్తుల రూపంలో ఎనిమిది టవర్లుగా నిర్మిస్తున్నారు. ఇవి ఒక్కో అంతస్తులో నాలుగు ఫ్లాట్‌ల వంతున టవర్‌కు 48 ఫ్లాట్‌లు రానున్నాయి. గెజిటెట్‌ -2 కాలనీ పేరుతో ఒక్కోటి 1500 చ.అడుగుల విస్తీర్ణం కల 336 ఫ్లాట్‌లను 12 అంతస్తుల రూపంలో ఏడు టవర్లుగా నిర్మిస్తున్నారు. ఈ కాలనీల్లోని భవనాల మొత్తం బిల్టప్‌ ఏరియా విస్తీర్ణం 11లక్షల 95వేల 200 చ.అడుగులుగా వుండబోతుంది. ఇదే ప్యాకేజీలో మూడోరకం కాలనీని డి గ్రూపు ఉద్యోగుల నిమిత్తం కేటాయించారు. ఈ కాలనీలో 720 ఫ్లాట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోటి 900 చ.అ. విస్తీర్ణంతో వుంటుంది. ఒక్కో అంతస్తుకు పదేసి వంతున టవర్‌కు 120 ఫ్లాట్‌లను నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు టవర్లను నిర్మిస్తూ 720 ఫ్లాట్‌లకు స్థానం కల్పిస్తున్నారు. ఈ డి-గ్రూపు కాలనీ భవనాల బిల ్టప్‌ ఏరియా విస్తీర్ణం 6లక్షల 48వేల చ.అ.గా వుంటుంది. ఈ మూడో ప్యాకేజీలో మొత్తం టవర్ల సంఖ్య 21గా వుంటుంది.
 
శాశ్వత సచివాలయ భవనానికి టెండర్లు
తాజాగా అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రభుత్వ నగరంలో శాశ్వత పాలనాభవనాల నిమిత్తం రూ.1200 కోట్ల వ్యయంతో 30 లక్షల చ.అడుగుల విస్తీర్ణం వచ్చేలా సచివాలయ భవనాలు, వివిధ పాలనా విభాగాధిపతుల కార్యాలయ భవనాలను నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నెలాఖరులో టెండర్లను ఫైనలైజ్‌ చేసి పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు మంత్రులు, జడ్జిలకు రూ.203.56 కోట్ల అంచనా వ్యయంతో 71 బంగ్లాలను నిర్మించేందుకుగాను టెండర్లను ఆహ్వానించింది. సచివాలయ సిబ్బందికి నేలపాడులో గృహలకు కూడా టెండర్లను పిలువనుంది.
Link to comment
Share on other sites

eedu Techo Towers kooda fast ga chesetunadu....just last December lo modalu pettaru appude progress undi...

 

kittaya e rakam ga anna upayoga padutunadu atleast...also kittaya ki a land bangaram ayyindi...bad phase lo astulu mottam poyina e polam ammaledu...mostly in-inheritance kada so kudarledu emo lekapote inko cinema ki karigipoyedi 90's lo!!!

 

TOP IT company(raz bro cheppe company ani guess) okati eedi space mottam lease chestadu ani talk...

 

about-right.jpg

 

42.jpg

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

35 minutes ago, AnnaGaru said:

eedu Techo Towers kooda fast ga chesetunadu....just last December lo modalu pettaru appude progress undi...

 

kittaya e rakam ga anna upayoga padutunadu atleast...also kittaya ki a land bangaram ayyindi...bad phase lo astulu mottam poyina e polam ammaledu...mostly in-inheritance kada so kudarledu emo lekapote inko cinema ki karigipoyedi 90's lo!!!

 

TOP IT company(raz bro cheppe company ani guess) okati eedi space mottam lease chestadu ani talk...

 

about-right.jpg

 

42.jpg

 

ohh... idhi Kittayya dha... ippati varuku ee builder evara ani Q vundedhi...

Edited by katti
Link to comment
Share on other sites

ద్భుత నగరంగా.. అమరావతి
06-03-2018 07:18:49
 
636559175300323006.jpg
 
  • కృష్ణా, గుంటూరుల సరిహద్దులు చెరిపేస్తాం
  • రెండు ప్రాంతాలకు విస్తృత రవాణా సదుపాయాలు
  • జలమార్గానికి లైన్‌ క్లియర్‌.. ప్రాధాన్యాన్ని వివరించిన గవర్నర్‌
  • అత్యద్భుతంగా ఎకనామిక్‌ సిటీ నిర్మాణం
  • ఓడీఎఫ్‌ జిల్లాలుగా కృష్ణా, గుంటూరు
  • గవర్నర్‌ ప్రసంగంలో పునురుద్ఘాటన
 
 
‘192 రోజులలో అసెంబ్లీ, సెక్రటేరియట్‌లకు తాత్కాలిక భవనాలు నిర్మించాం. అక్కడ నిర్మించబోయే ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాల కోసం రూ. 45,253 కోట్లతో అంచనాలు రూపొందించాం. ఇందులో 74 శాతం మేర టెండర్లు పిలిచారు. నలభై రెండు శాతం పనులు అమలులో ఉన్నాయి. మొత్తం 1375 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లు, సెక్రటేరియట్‌, అసెంబ్లీ, హైకోర్టు, రాజభవన్‌, ప్రభుత్వశాఖాధిపతుల భవనాలు, గవర్నమెంట్‌ క్వార్టర్స్‌, అడ్మినిస్ర్టేటివ్‌ భవన నిర్మాణాలు వస్తాయి. ఎనిమిది లక్షల చదరపు అడుగుల అసెంబ్లీ భవనం, బుద్ధుని స్థూపం వాస్తు శైలిలో నిర్మించటం జరుగుతుంది.
 
 
మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తయితే ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. పలు ప్రపంచ శ్రేణి పరిశోధనా వైద్య కేంద్రాలు అమరావతి నగరంలో కొలువు తీరనున్నాయి. ఇప్పటికే విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాసంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వెయ్యి మంది విద్యార్థులు ఇప్పటికే చేరారు. వచ్చే ఏడాది నుంచి అమృత యూనివర్శిటీ వంటి మేటి విద్యాసంస్థలు కూడా రాబోతున్నాయి.
 
 
అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అభివృద్ధి పనులన్నీ కీలక దశలో ఉన్నాయి. అమరావతిలో ప్రారంభించిన అన్న క్యాంటీన్ల తరహాలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఇవి అమరావతిలో చౌక ధరలకే ఫలహారాలు, భోజనాలను అందిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
 
 
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోనే తొలి నీలి హరిత నగరంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాజధానిలో అంతర్భాగాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రవాణా, కీలక సదుపాయాలకు అనేక ప్రణాళికలు ఆచరణలోకి రాబోతున్నాయి. ఈ అంశాలన్నీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసన సభలో చేసిన కీలక ప్రసంగంలో మరోసారి పునరుద్ఘాటించారు.
 
 
విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, నిర్మాణాలు, అభివృద్ధి పనులను అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ తన కీలక ప్రసంగంలో ప్రస్తావించారు. గత నాలుగేళ్లుగా కృష్ణా, గుంటూరు జిల్లాలు విశేష రీతిలో అభివృద్ధి చెందుతున్నాయి. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి రెండు జిల్లాల మధ్య ఉండటమే ఇందుకు కారణం. ఈ జిల్లాలను రెండుగా విభజిస్తున్న కృష్ణానదిపై మరిన్ని వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23వ కి.మీ వద్ద ఉన్న దాములూరు - వైకుంఠపురం మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఒక బ్రిడ్జి కమ్‌ రిజర్వాయర్‌ రాబోతున్నదని చెప్పారు. కృష్ణానదిపై సూపర్‌ ఐకానిక్‌ బ్రిడ్జి ఏర్పాటుకు డిజైన్లు కూడా తుది దశలో ఉన్నాయి.
 
ఇవి కాక అమరావతి చుట్టూ కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఒకటి కంచికచర్ల ఆవల, మరొకటి పెనమలూరు సమీపంలోని చోడవరం దగ్గరలో నిర్మాణం కావలసి ఉంది. గవర్నర్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో కృష్ణానదిపై నూతన వంతెనలు నిర్మాణమౌతాయని మరోసారి చెప్పారు. చేనేత రంగానికి ఇటు పెడన, అటు మంగళగిరి కేంద్రాలుగా ఉన్నాయి. రెండు జిల్లాలలో వేల సంఖ్యలో చేనేత కార్మిక కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఈ జిల్లాలలో ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంది. వాటిని దృష్టిలో ఉంచుకుని గవర్నర్‌ నరసింహన్‌ రెండు జిల్లాలను కలిపి జౌళి, ఆహార ప్రాసెసింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చేనేత, జౌళి ఎగుమతులకు కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ‘చేనేత’ కష్టాలు తీరతాయి.
 
జల మార్గానికి లైన్‌ క్లియర్‌..
కెనాల్‌ సిటీగా పేరున్న విజయవాడను కాకినాడ వరకు జల రవాణాకు అనుసంధానం చేయాలని కేంద్రం జల రవాణా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీని వల్ల రవాణా చార్జీల భారం తగ్గుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రూపు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వేగంగా జరుగుతున్నదని గవర్నర్‌ నరసింహన్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే కాల్వలలో కాలుష్యం తగ్గడంతో పాటు నగరం కూడా అందంగా తయారవుతుంది. బందరు పోర్టు కోసం భూ సమీకరణ, సేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 14 పోర్టులను ధీటుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడ బందరు పోర్టు విషయంలో సీరియస్‌గా ఉన్నారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో కూడా భూ సమీకరణ పట్ల ఉదాశీనంగా వ్యవహరిస్తే సహించనని అధికారులను హెచ్చరించారు.
 
 
విమానాశ్రయ విస్తరణ
జక్కంపూడిలో నిర్మితమవుతున్న జెట్‌ ఎకనామిక్‌ సిటీని గవర్నర్‌ ప్రస్తావించారు. ఈ సిటీని లాక్‌ టు వర్క్‌ తరహాలో నిర్మిస్తామన్నారు. ఇప్పటికే ఇక్కడ భూసేకరణ పూర్తి అయింది. ఇటీవల హౌసింగ్‌ కోసం ఏపీ టిట్కో టెండర్లు పిలవగా ఎన్‌సిసి దక్కించుకుంది. గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు మరింత వేగవంతం అవుతాయని గవర్నర్‌ నరసింహన్‌ శాసన సభలో చెప్పారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో విజయవాడ కూడా ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరాలు గన్నవరం విమానాశ్రయం ప్రయాణికుల సంఖ్య మిలియన్‌ ఫిగర్‌ దాటి పోతుందని అంచనా. ఇప్పటికే దేశంలోని అతి ముఖ్య నగరాలైన చెన్నై, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి నగరాలకు విమానాలు తిరుగుతున్నాయి. త్వరలో అంతర్జాతీయ టెర్మినల్స్‌ను కూడా ప్రారంభిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
కృష్ణా, గుంటూరు జిల్లాలు పూర్తి బహిరంగ మలవిసర్జిత జిల్లాలుగా ప్రకటించినట్టు గవర్నర్‌ చెప్పారు. రెండు జిల్లాల అధికారులు ఏడాది నుంచి నూరు శాతం లక్ష్యాల కోసం కష్టపడ్డారు. కొన్ని గ్రామాలలో బహిరంగ మలవిసర్జన సంఘటనలు తారసపడుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం నూరు శాతం ప్రారంభమయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉండటం వల్లే చెదురు మదురుగా కొన్ని గ్రామాలలో అసంపూర్తి వాతావరణం ఉంది. మరుగుదొడ్లన్నీ పూర్తి చేయిస్తే మిగిలిన కొద్ది శాతం కూడా ఆగిపోయి చెంబును పాతిపెట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...