Jump to content

Amaravati


Recommended Posts


ప్రభుత్వ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ
20-02-2018 11:01:34

అమరావతి: రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. ఎమ్మెల్యే, ఐఏఎస్‌, ఎన్జీవో క్వార్టర్ల పనులను పరిశీలించిన నారాయణ పనులు జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో భవనాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చకచకా పనులు సాగుతున్నాయి.

Link to comment
Share on other sites

వైకుంఠపురం బ్యారేజీతో రాజధానికి తాగునీరు 
10 టీఎంసీలు నిల్వచేసేలా నిర్మాణం 
రూ.1985కోట్ల ప్రతిపాదనలతో సిద్ధమైన నివేదిక 
మూడేళ్లలో పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక 
ఈనాడు-అమరావతి
రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలు తీర్చడంతోపాటు పులిచింతల దిగువభాగంలో వచ్చే వరదనీటిని నిల్వచేయడానికి వీలుగా కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కార్యాచరణ నివేదిక సిద్ధం చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.1985కోట్లు వెచ్చించి మూడేళ్లలో పూర్తిచేయాలనేది ప్రణాళిక. ఇక్కడ 10టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తారు. ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు 60కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించనున్నారు. బ్యారేజీ నిర్మాణంతో నదికి రెండువైపులా భూగర్భజలాలు పెరగనున్నాయి. భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో తాగునీటి కొరత లేకుండా ఇక్కడి నుంచి నీటిని సరఫరా చేస్తారు.
9738 ఎకరాల భూసేకరణ 
వైకుంఠపురం బ్యారేజీ నిర్మించే ప్రాంతంలో 75 ఏళ్లలో కృష్ణానదిలో నీటిలభ్యత సగటు 35.44టీఎంసీలు ఉన్నట్లు లెక్కించారు. ఇందులో ఏటా 10టీఎంసీలు నిల్వచేసి ఉపయోగించుకోవాలనేది ప్రణాళిక. కృష్ణానదికి వరదలు సమయంలో వైకుంఠపురం బ్యారేజీ నుంచి ఒకరోజులో 100.68 టీఎంసీలు నీటిని విడుదల చేసేలా 55 గేట్లను ఏర్పాటుచేస్తున్నారు. మొత్తం 1250 మీటర్ల మేర స్పిల్‌వే నిర్మిస్తారు. బ్యారేజీలో 10టీఎంసీల నీటినిల్వతో కృష్ణానదితోపాటు పరిసర ప్రాంతాల్లో 9738 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. భూసేకరణకు సుమారు రూ.770కోట్లు నిధులు అవసరమని అంచనా వేశారు. కాంక్రీటు నిర్మాణాలకు రూ.919కోట్లు, భవనాలు, సర్వీసు రహదారులు, వంతెలు తదితర పనులకు కలిపి మొత్తం రూ.1985కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి త్వరలోనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. పనులు చేపట్టిన మూడేళ్లలో పూర్తిచేసి నీటిని నిల్వచేయాలని నిర్ణయించారు.

వాగుల వరదనీటికి అడ్డుకట్ట 
కృష్ణానదిలో వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించడం ద్వారా వరదనీటికి అడ్డుకట్ట వేసి ఉపయోగించుకోనున్నారు. పులిచింతల దిగువన కృష్ణానదిలోకి మునేరు, పాలేరు తదితర వాగులు వచ్చి కలుస్తున్నాయి. వర్షాకాలంలో వాగులకు వరదల వల్ల కృష్ణానది ద్వారా వరదనీరు ప్రకాశంబ్యారేజీకి చేరుతోంది. ప్రకాశంబ్యారేజీ నీటినిల్వ సామర్థ్యం 3టీఎంసీలు మాత్రమే కావడంతో అదనంగా వచ్చిన వరదనీటిని నదిలోకి వదులుతున్నారు. అదే సమయంలో స్థానికంగా వర్షాలు పడుతున్నందున సాగునీటి అవసరాలు తక్కువగా ఉండటంతో వరదనీరు నదిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు పోలవరం కుడికాలువ ద్వారా వస్తున్న నీటిని కొన్నిరోజులు పాటు నిలుపుదల చేయాల్సి వస్తోంది. వీటన్నిటికి పరిష్కారమార్గంగా వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించి వాగుల ద్వారా వచ్చే నీటికి అడ్డుకట్ట వేస్తారు. పులిచింతల దిగువ, వైకుంఠపురం బ్యారేజీ నడుమ 60కిలోమీటర్ల వ్యవధిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నీటిని 10టీఎంసీలు నిల్వచేస్తారు. ఈనీటిని రాజధాని తాగునీటి అవసరాలకు ఉపయోగించడంతోపాటు అత్యవసరమైనప్పుడు ప్రకాశంబ్యారేజీకి విడుదల చేసి వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. దీంతోపాటు గరిష్ఠంగా 25మీటర్ల మేర బ్యారేజీలో నీటిని నిల్వచేయడం ద్వారా పరిసరప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగనున్నాయి. వీటిన్నిటిని దృష్టిలో ఉంచుకుని వీలైనంత తొందరగా నిర్మాణం పూర్తిచేయాలన్న యోచనలో జలవనరులశాఖ కార్యాచరణ ప్రణాళికతో సిద్ధమవుతోంది.

Link to comment
Share on other sites

ఏదీ యంత్ర సామగ్రి.. ఏవీ రోడ్ల పనులు?
22-02-2018 07:38:25

‘మేఘా’ కంపెనీపై ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి ఆగ్రహం
వారంలోగా పరిస్థితి మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): సరిపడా యంత్రసామగ్రిని రప్పించకుండా, అరకొర పనులతో కాలక్షేపం చేస్తున్నారంటూ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌(ఎం.ఇ.ఐ.ఎల్‌) కంపెనీ ప్రతినిధులపై అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సీఎండీ లక్ష్మీ పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న వానాకాలంలోగా రాజధానిలోని ప్రాధాన్య రహదారుల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే ఆదేశిస్తున్నప్పటికీ ఈ విధంగా వ్యవహరించడం తగదన్నారు. రాజధాని ప్రయారిటీ రోడ్ల ప్యాకేజీల్లోని 12వ నెంబరులో భాగమైన ఈ-7, ఈ-9, ఈ-11 రహదారుల నిర్మాణాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. వెలగపూడి, శాకమూరు, కురగల్లు, ఐనవోలు, నెక్కల్లు, అనంతవరంలలో విస్తృతంగా పర్యటించి పనులు పరిశీలించారు. ‘మేఘా’ ఒప్పందంలో పేర్కొన్న మేరకు యంత్రసామగ్రిని తెప్పించలేదన్న విషయాన్ని గుర్తించారు. ఆయా యంత్రాలను నిర్మాణ ప్రదేశాలకు రప్పించేందుకు వారం గడువు ఇచ్చారు. అప్పటికీ యంత్రాలను తెప్పించని పక్షంలో తగు చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. ముందస్తు సమాచారం ఇచ్చినా ఆయా రోడ్లను పరిశీలిస్తున్న సమయంలో సదరు సంస్థ ఉన్నతాధికారులెవరూ ఆ దరిదాపుల్లో కనిపించకపోవడంపై లక్ష్మీ పార్థసారథి అసహనం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు తమకు తెలిసిన అరకొర సమాచారాన్నే ఆమెకు తెలిపేందుకు ప్రయత్నించగా, అసంతృప్తి ప్రకటించారు. పర్యటనలో ఏడీసీ ఉన్నతాధికారులు జి.రత్నకుమార్‌, గణే్‌షబాబు తదితరులు కూడా పాల్గొన్నారు.

Link to comment
Share on other sites


హోం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు
దసరాకల్లా రాష్ట్రానికి హైకోర్టు?
23-02-2018 03:20:08

నేలపాడులో సిటీ సివిల్‌ కోర్టు భవనాలు
నిర్మాణానికి ఫుల్‌కోర్టు పచ్చజెండా
ఆగస్టు 31 లేదా దసరా సెలవుల్లోపు పూర్తి
జస్టిస్‌ భవన్‌ పూర్తయ్యేవరకు అందులోనే హైకోర్టు కార్యకలాపాలు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దసరా సెలవుల్లో రాష్ట్రానికి తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ఫుల్‌కోర్టు గురువారం సాయంత్రం హైకోర్టు సమావేశ మందిరంలో సమావేశమైంది. హైకోర్టు ఏర్పాటు కోసం భవనాల పరిశీలనకు బిల్డింగ్‌ కమిటీ గతవారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తాను పరిశీలించిన భవనాలపై ఆ కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
 
ఈ భవనాలు హైకోర్టు ఏర్పాటుకు అనువుగా లేవని పేర్కొన్నట్లు సమాచారం. సిటీ సివిల్‌ కోర్టుకు అనుమతించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ సారాంశాన్ని జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ న్యాయమూర్తులకు ఈ సందర్భంగా వివరించినట్లు తెలిసింది. అమరావతిలో నిర్మించ తలపెట్టిన జస్టిస్‌ సిటీ సమీపంలోనే నేలపాడు వద్ద సిటీ సివిల్‌ కోర్టు భవనాలు నిర్మిస్తామని, ఇది శాశ్వత హైకోర్టు నిర్మించే ప్రాంతానికి సమీపంలోనే ఉంటుందని సదరు లేఖలో ప్రభుత్వం తెలియజేసింది.
 
మార్చి 15 నుంచి సిటీ సివిల్‌ కోర్టు నిర్మాణాలు ప్రారంభించి ఆగస్టు చివరకు.. లేదా వచ్చే దసరా సెలవులకల్లా పూర్తి చేస్తామని, ఆ భవనాల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక అందులోకి మారవచ్చని, తాత్కాలికంగా సిటీ సివిల్‌ కోర్టు భవనం నిర్మాణానికి అనుమతించాలని అభ్యర్థించింది. ఈ ప్రతిపాదనలకు ఫుల్‌కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం

Link to comment
Share on other sites

అమరావతి పేదలకు వరం!
23-02-2018 08:18:44

త్వరలో సొంతింటి కల సాకారం
కలిసొచ్చిన పీఎంఏవై పథకం
రెండు దశలుగా 7876 గృహాల నిర్మాణం
తొలిదశలో 5024 మందికి కేటాయింపు
మొత్తం పది గ్రామాల్లో సుందర లోగిళ్లు
మంగళగిరి: రాజధాని రాకతో అమరావతి ప్రాంతంలోని ఎంతోమంది రైతులు భాగ్యవంతులైన విషయం అందరికీ తెలిసిందే! మరో మూడు నాలుగు నెలల్లో రాజఽధాని ప్రాంత పేదలకూ సొంతింటి కల నెరవేరబోతోంది. ఎంతోకాలంగా అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్న నిరుపేదలకు రాజధాని రాక ఇప్పుడు ఓ వరంలా మారింది. అమరావతిలో 7876 మంది ఇళ్లు లేని నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి.. రూ.650 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో.. అత్యంత నాణ్యత ప్రమాణాలతో అందమైన కాలనీలను జెట్‌ స్పీడుతో నిర్మిస్తోంది.
 
తొమ్మిది ప్రాంతాల్లో సకల సదుపాయాలతో...
రాజధాని అమరావతి పరిధిలోని 27 గ్రామాల్లో సొంతిల్లు లేని 7876 కుటుంబాల ను ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ కలిపి పెనుమాక, దొండపాడు, అనంతవరం, తుళ్లూరు, నిడమర్రు, ఐనవోలు, నవులూరు, మందడం, ఉండవల్లి గ్రామాల్లో ప్రత్యేక కాలనీలను నిర్మిస్తోంది. ఇందుకు ఏపీ సీఆర్‌డీఏ 44.05 ఎకరాలను కేటాయించింది. తొలిదశలో 5024 గృహాలను రూ. 345 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాల వ్యయం రూ.296 కోట్లు కాగా, మిగతా రూ 49 కోట్లను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు.ఏపీ టిడ్కో డిజైన్‌ చేసి న ఈ కాలనీల్లో విశాలమైన రహదారులు, కాలువలు, తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యాలతో పాటు పార్కు, ఆసుపత్రి, పాఠశాల, గ్రంథాలయం వంటి సదుపాయాలుంటా యి. అనంతవరంలో ఇప్పటికే కొన్ని బ్లాకుల నిర్మాణం పూర్తయింది. పెనుమాకలో వారం రోజుల్లో పనులను ప్రారంభించనున్నారు.
 
పథకం వచ్చిందిలా...
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎంఏవై పథకంలో ఈ కాలనీలను నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ పఽథకం అర్బన్‌ ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి మేరకు అమరావతికి పది వేల గృహాలను కేటాయించారు. ప్రస్తుతం 8 వేల ఇళ్లకు డిమాండ్‌ ఉండగా, తొలిదశ కింద 5024 గృహాల నిర్మాణాన్ని చేపట్టారు. పథకం నిబంధనల మేరకు వీటిని జీ+3 భవన సముదాయాలుగా నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తుకు ఎనిమిదేసి ఫ్లాట్ల వంతున ఒక్కొక్క భవన సముదాయానికి 32 ఫ్లాట్‌లు వస్తాయి. ఈ ఫ్లాట్‌లు 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో మూడు రకాలుగా ఉన్నాయి.
 
పథకం తీరిలా..
300 చ.అడుగుల విస్తీర్ణం కల బ్లాకులు 31 కాగా... ఫ్లాట్‌లు 992, 365 చ.అడుగుల విస్తీర్ణం కల బ్లాకులు 48 కాగా... ఫ్లాట్‌లు 1536, 400 చ.అడుగుల విస్తీర్ణం కల ఫ్లాట్‌లు 78 కాగా...ఫ్లాట్‌లు 2496 వంతున ఏర్పాటవుతున్నాయి. 300 చ.అడుగుల ఫ్లాట్‌ రూ. 5.74 లక్షలు కాగా లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.2.88 లక్షలను బాంకు రుణం ఇప్పిస్తుంది. 365 చ.అడుగుల ఫ్లాట్‌ ధర రూ 6.60 లక్షలు కాగా లబ్ధిదారు తన వాటాగా రూ. 50వేలు చెల్లించాలి. బ్యాంకు రుణం రూ.3.47 లక్షలు. 400 చ.అడుగుల విస్తీర్ణం కల ఫ్లాట్‌ ధర రూ.7.48 లక్షలు. లబ్ధిదారుడు రూ.లక్ష చెల్లించాలి. బ్యాంకు రుణం రూ.3.96 లక్షలు మంజూరవుతుంది. ఈ మూడు రకాల ఫ్లాట్‌లకు సబ్సిడీ మూడేసి లక్షలు కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి.
 
రెండోదశలో 2852 గృహాలు
రెండోదశ కింద ఉండవల్లి, మందడం, నవులూరు గ్రామాల్లో మరో 2852 గృహాలను నిర్మించేందుకు సీఆర్‌డీఏ రంగం సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. మందడం, నవులూరు గ్రామాల్లో ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఆ రెండు గ్రామాల్లో అదనపు గృహాలను మంజూరు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.

Link to comment
Share on other sites

అమరావతి పేదలకు వరం!
23-02-2018 08:18:44

త్వరలో సొంతింటి కల సాకారం
కలిసొచ్చిన పీఎంఏవై పథకం
రెండు దశలుగా 7876 గృహాల నిర్మాణం
తొలిదశలో 5024 మందికి కేటాయింపు
మొత్తం పది గ్రామాల్లో సుందర లోగిళ్లు
మంగళగిరి: రాజధాని రాకతో అమరావతి ప్రాంతంలోని ఎంతోమంది రైతులు భాగ్యవంతులైన విషయం అందరికీ తెలిసిందే! మరో మూడు నాలుగు నెలల్లో రాజఽధాని ప్రాంత పేదలకూ సొంతింటి కల నెరవేరబోతోంది. ఎంతోకాలంగా అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్న నిరుపేదలకు రాజధాని రాక ఇప్పుడు ఓ వరంలా మారింది. అమరావతిలో 7876 మంది ఇళ్లు లేని నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి.. రూ.650 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో.. అత్యంత నాణ్యత ప్రమాణాలతో అందమైన కాలనీలను జెట్‌ స్పీడుతో నిర్మిస్తోంది.
 
తొమ్మిది ప్రాంతాల్లో సకల సదుపాయాలతో...
రాజధాని అమరావతి పరిధిలోని 27 గ్రామాల్లో సొంతిల్లు లేని 7876 కుటుంబాల ను ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ కలిపి పెనుమాక, దొండపాడు, అనంతవరం, తుళ్లూరు, నిడమర్రు, ఐనవోలు, నవులూరు, మందడం, ఉండవల్లి గ్రామాల్లో ప్రత్యేక కాలనీలను నిర్మిస్తోంది. ఇందుకు ఏపీ సీఆర్‌డీఏ 44.05 ఎకరాలను కేటాయించింది. తొలిదశలో 5024 గృహాలను రూ. 345 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాల వ్యయం రూ.296 కోట్లు కాగా, మిగతా రూ 49 కోట్లను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు.ఏపీ టిడ్కో డిజైన్‌ చేసి న ఈ కాలనీల్లో విశాలమైన రహదారులు, కాలువలు, తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యాలతో పాటు పార్కు, ఆసుపత్రి, పాఠశాల, గ్రంథాలయం వంటి సదుపాయాలుంటా యి. అనంతవరంలో ఇప్పటికే కొన్ని బ్లాకుల నిర్మాణం పూర్తయింది. పెనుమాకలో వారం రోజుల్లో పనులను ప్రారంభించనున్నారు.
 
పథకం వచ్చిందిలా...
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎంఏవై పథకంలో ఈ కాలనీలను నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ పఽథకం అర్బన్‌ ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి మేరకు అమరావతికి పది వేల గృహాలను కేటాయించారు. ప్రస్తుతం 8 వేల ఇళ్లకు డిమాండ్‌ ఉండగా, తొలిదశ కింద 5024 గృహాల నిర్మాణాన్ని చేపట్టారు. పథకం నిబంధనల మేరకు వీటిని జీ+3 భవన సముదాయాలుగా నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తుకు ఎనిమిదేసి ఫ్లాట్ల వంతున ఒక్కొక్క భవన సముదాయానికి 32 ఫ్లాట్‌లు వస్తాయి. ఈ ఫ్లాట్‌లు 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో మూడు రకాలుగా ఉన్నాయి.
 
పథకం తీరిలా..
300 చ.అడుగుల విస్తీర్ణం కల బ్లాకులు 31 కాగా... ఫ్లాట్‌లు 992, 365 చ.అడుగుల విస్తీర్ణం కల బ్లాకులు 48 కాగా... ఫ్లాట్‌లు 1536, 400 చ.అడుగుల విస్తీర్ణం కల ఫ్లాట్‌లు 78 కాగా...ఫ్లాట్‌లు 2496 వంతున ఏర్పాటవుతున్నాయి. 300 చ.అడుగుల ఫ్లాట్‌ రూ. 5.74 లక్షలు కాగా లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.2.88 లక్షలను బాంకు రుణం ఇప్పిస్తుంది. 365 చ.అడుగుల ఫ్లాట్‌ ధర రూ 6.60 లక్షలు కాగా లబ్ధిదారు తన వాటాగా రూ. 50వేలు చెల్లించాలి. బ్యాంకు రుణం రూ.3.47 లక్షలు. 400 చ.అడుగుల విస్తీర్ణం కల ఫ్లాట్‌ ధర రూ.7.48 లక్షలు. లబ్ధిదారుడు రూ.లక్ష చెల్లించాలి. బ్యాంకు రుణం రూ.3.96 లక్షలు మంజూరవుతుంది. ఈ మూడు రకాల ఫ్లాట్‌లకు సబ్సిడీ మూడేసి లక్షలు కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి.
 
రెండోదశలో 2852 గృహాలు
రెండోదశ కింద ఉండవల్లి, మందడం, నవులూరు గ్రామాల్లో మరో 2852 గృహాలను నిర్మించేందుకు సీఆర్‌డీఏ రంగం సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. మందడం, నవులూరు గ్రామాల్లో ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఆ రెండు గ్రామాల్లో అదనపు గృహాలను మంజూరు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.

Link to comment
Share on other sites

దసరాకల్లా ఏపీకి హైకోర్టు?
23-02-2018 02:06:45
హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దసరా సెలవుల్లో రాష్ట్రానికి తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ఫుల్‌కోర్టు గురువారం హైకోర్టు సమావేశ మందిరంలో సమావేశమైంది. హైకోర్టు ఏర్పాటు కోసం భవనాల పరిశీలనకు బిల్డింగ్‌ కమిటీ గతవారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అమరావతిలో నిర్మించ తలపెట్టిన జస్టిస్‌ సిటీ సమీపంలోనే నేలపాడు వద్ద సిటీ సివిల్‌ కోర్టు భవనాలు నిర్మిస్తామని, ఇది శాశ్వత హైకోర్టు నిర్మించే ప్రాంతానికి సమీపంలోనే ఉంటుందని ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. మార్చి 15 నుంచి సిటీ సివిల్‌ కోర్టు నిర్మాణాలు ప్రారంభించి ఆగస్టు చివరకు.. లేదా వచ్చే దసరా సెలవులకల్లా పూర్తి చేస్తామని, ఆ భవనాల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలకు ఫుల్‌కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

రయ్‌.. రయ్‌... రహదారి!
23-02-2018 02:49:45

శరవేగంగా రాజధాని రోడ్ల నిర్మాణం
రూ.9 వేల కోట్లతో 36 రహదార్లు
85% పూర్తయిన ‘సీడ్‌ యాక్సిస్‌’
నెలలో తొలిదశ రహదారులు పూర్తి
మంగళగిరి, ఫిబ్రవరి 22: ‘‘హెలికాప్టర్‌లో వస్తున్నప్పుడు చూశాను. రాజధాని పనులు జోరుగా సాగుతున్నాయి. రహదారులు బాగా వేస్తున్నారు’’ అని నిన్నటికి నిన్న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ప్రశంసించారు. ఔను... నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం జెట్‌ స్పీడులో సాగుతోంది. హైవేలను మించిన వెడల్పుతో తయారవుతున్న విశాలమైన రహదారులను చూసి స్థానికులు అబ్బురపడుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఎటువైపు వెళ్లినా... రోడ్‌ రోలర్లు, టిప్పర్లు, పొక్లయిన్లతో సాగుతున్న రహదారి నిర్మాణ పనులే కనిపిస్తాయి. ఇక్కడ రూ.9వేల కోట్లకుపైగా వ్యయంతో 36 రహదారులను నిర్మిస్తున్నారు. అవసరమైనప్పుడు ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రిళ్లు సైతం పనులు చేస్తున్నారు. మొదటి దశలో చేపట్టిన 7 రోడ్ల పనులు మరో నెలలో పూర్తికానున్నాయి. మొత్తం రహదారుల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను పరుగులు తీయిస్తున్నారు.
 
ఎటుచూస్తే అటు...
‘గ్రీన్‌ సిటీ’గా ఆవిర్భవిస్తున్న అమరావతిలో ప్రభుత్వ పరిపాలన నగరి, ఆరోగ్యనగరి, న్యాయ నగరి, క్రీడా నగరి, మీడియా సిటీ ఇలా ‘నవ నగరాలను’ నిర్మించాలని ప్రతిపాదించారు. వెలగపూడిలో ఇప్పటికే తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. ముఖ్యమైన ప్రాంతాలన్నింటినీ కలిపేలా అమరావతిలో మొత్తం 593 కిలోమీటర్ల నిడివితో రహదారులను నిర్మిస్తున్నారు. వీటిలో అతి ముఖ్యమైన 316 కిలోమీటర్ల పొడవున్న 36 రహదార్ల నిర్మాణం కోసం రూ.9162 కోట్లను వెచ్చిస్తున్నారు.
 
మొత్తం 15 ప్యాకేజీల్లో చేపట్టిన పనులను పదికిపైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఎటు చూసినా రహదారి పనులు సాగుతున్నాయి. వందల సంఖ్యలో యంత్రాలు, వాహనాలు... తిరుగుతున్నాయి. రాజధానిలో మేజర్‌ ఆర్టీరియల్‌, ఆర్టీరియల్‌, సబ్‌ ఆర్టీరియల్‌, కలెక్టర్‌ రోడ్ల పేరుతో నాలుగు రకాల రహదార్లను నిర్మిస్తున్నారు. మేజర్‌ ఆర్టీరియల్‌ రహదారులను 180 అడుగుల వెడల్పుతో వేస్తున్నారు. ఆర్టీరియల్‌, సబ్‌ ఆర్టీరియల్‌ రహదార్లను 150 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్నారు. కలెక్టర్‌ రోడ్లను మాత్రం 75 అడుగుల వెడల్పుతో వేస్తున్నారు.
 
సీడ్‌ యాక్సిస్‌ స్పెషల్‌...
రాజధానిలో అత్యంత ప్రధానమైనది... ‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌’. ఇది (విజయవాడలో కనకదుర్గమ్మ వారధి దాటిన తర్వాత) 16వ నెంబరు జాతీయ రహదారి నుంచి అమరావతి నగరంలోకి నేరుగా తీసుకెళ్లే ఎక్స్‌ప్రెస్‌ హైవే! మొత్తం 21.26 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ దారిని రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. మొదటి ప్యాకేజీలో 18.27 కిలోమీటర్ల దారిలో 85 శాతం పనులు పూర్తయ్యాయి. దీనికోసం రూ.230 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అటూ ఇటూ రహదారి మధ్యలో భారీగా ఖాళీ స్థలాన్ని వదిలారు.భవిష్యత్తులో రోడ్డును వెడల్పు చేయాల్సి వస్తే... కొత్తగా భూసేకరణ జరపాల్సిన అవసరం లేకుండా, మధ్యలోని స్థలాన్నే ఉపయోగించుకునేలా ప్రణాళిక రచించారు.
 
ఇక సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌కు ఇరువైపులా మొక్కలు నాటారు. భవిష్యత్తులో ఇవి భారీ వృక్షాలై... చల్లని నీడను అందించనున్నాయి. ఒకసారి రోడ్లు వేయడం... ఆ తర్వాత పైప్‌లైన్లు, ఇతర పనులకోసం వాటిని తవ్వేయడం ప్రతిచోటా జరిగేదే! రాజధాని రోడ్ల విషయంలో ఇలాంటివి జరగవు. సుమారు 15 ఆర్టీరియల్‌, సబ్‌ ఆర్టీరియల్‌ రహదారుల వెంట గ్యాస్‌, తాగునీరు, ఎలక్ట్రికల్‌, కేబుల్‌ వంటి పైపులైన్లను కూడా ఒకేసారి ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఆయా అవసరాల కోసం మళ్లీ మళ్లీ తవ్వాల్సిన అవసరం ఉండదు.

Link to comment
Share on other sites

సీఆర్‌డీఏలో పర్యావరణ పర్యవేక్షణకు కమిటీ
23-02-2018 03:12:07
అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశాల మేరకు సీఆర్‌డీఏలో పర్యావరణాన్ని పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సీఆర్‌డీఏ నిర్మాణాలు, కార్యకలాపాల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, అనుమతులు రద్దుచేయాలని కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. అయితే అందుకు నిరాకరించిన ఎన్జీటీ, పర్యావరణం దెబ్బతినకుండా పర్యవేక్షణకు ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆదేశించింది.
 
దీంతో కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీకి అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిని చైర్మన్‌గా నియమించింది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ నుంచి ఒక ప్రతినిధిని, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి, ఐఐఎస్‌ డైరెక్టర్‌ సూచించే ఒక సీనియర్‌ శాస్త్రవేత్త, మాజీ ప్రొఫెసర్‌ డా.వెంకటేశ్వర్లు కడియాల తదితరులను సభ్యులుగా నియమించింది.

Link to comment
Share on other sites

భవనానికి ఆమోదం! 
ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టుపై  న్యాయమూర్తుల సమావేశం 
  కొత్తగా నిర్మించే భవనమే సరైనదని అభిప్రాయం 
  ఇప్పుడున్న భవనాలు ఆ స్థాయిలో లేవన్న కమిటీ
ఈనాడు, హైదరాబాద్‌: అమరావతిలో శాశ్వత హైకోర్టు నిర్మించే ప్రతిపాదిత ప్రాంతానికి సమీపంలో నిర్మించనున్న సిటీ సివిల్‌ కోర్టు భవనంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు హైకోర్టు న్యాయమూర్తులు (ఫుల్‌ కోర్టు) ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలో హైకోర్టు న్యాయమూర్తులందరూ సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రస్తుతమున్న మూడు భవనాల పరిశీలనకు వెళ్లి వచ్చిన న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ ఎ.వి.శేష సాయి, జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి వాటి పరిస్థితులను వివరించారు. నాగార్జున వర్సిటీలోని దూరవిద్య భవనం, గన్నవరంలోని వెటర్నరీ విశ్వవిద్యాలయ భవనం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలోని నిమ్రా ఇంజినీరింగ్‌ కళాశాల భవనం, రాజధానిలో ఏపీ ప్రభుత్వం న్యాయ నగరం (శాశ్వత హైకోర్టు, సిటీ సివిల్‌ కోర్టు) నిర్మాణం కోసం నేలపాడులో ప్రతిపాదించిన భూములను వారు పరిశీలించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఏర్పాటు చేయడానికి తగిన స్థాయిలో ఆ భవనాలు లేవని కమిటీ తెలిపినట్లు సమాచారం. కమిటీ సభ్యులు సమర్పించిన వివరాలను, అక్టోబరు నాటికి తాత్కాలిక భవనం నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం తాజాగా రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తులు.. కొత్త భవనానికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి
అమరావతి, ఈనాడు: వచ్చే ఏప్రిల్‌లో అమరావతిలో నిర్వహించనున్న ఆనంద నగరాల సదస్సు ఏర్పాట్ల నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు అమరావతిలో జరిగే ఈ సదస్సు విజయవంతం అయ్యేలా మరిన్ని కమిటీలు నియమిస్తూ పట్టణ పరిపాలన, అభివృద్ధి శాఖ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. స్టీరింగ్‌ కమిటీలో ఉపముఖ్యమంత్రితో పాటు మరో ఏడుగురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మరికొందరు అధికారులను సభ్యులుగా, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిని కన్వీనర్‌గా నియమించారు. వర్కింగ్‌ కమిటీకి మున్సిపల్‌ మంత్రిని ఛైర్మన్‌గా నియమించారు. ప్రోటోకాల్‌, రక్షణ, నగర సుందరీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, మీడియా  తదితరాలకు సంబంధించీ కమిటీలు ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...