Jump to content

Amaravati


Recommended Posts

 

http://www.andhrajyothy.com/artical?SID=535650

జస్టిస్‌ సిటీలోనే తాత్కాలిక హైకోర్టు!
13-02-2018 01:57:03

కొత్తగా నిర్మించే సిటీ సివిల్‌ కోర్టుల్లో ఏర్పాటు
అంచనా వ్యయం 108 కోట్లు.. 8 నెలల్లో సిద్ధం
అక్కడ ఏర్పాటుకు న్యాయమూర్తుల బృందం ఓకే
సీఎంకు తెలిపిన సీఆర్‌డీఏ అధికారులు
అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాజధానిలోని జస్టిస్‌ సిటీలో రూ.108 కోట్లతో నిర్మించనున్న సిటీ సివిల్‌ కోర్టుల్లో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1.96 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ సముదాయం 8 నెలల్లో పూర్తి కానుంది. ఇందులో తాత్కాలిక హైకోర్టును నడిపేందుకు.. భవనాల పరిశీలనకు వచ్చిన న్యాయమూర్తుల బృందం కూడా అంగీకరించినట్లు సీఆర్‌డీఏ అధికారులు సీఎం చంద్రబాబుకు సోమవారం తెలియజేశారు.
 
హైకోర్టు రాష్ట్రానికి తరలివస్తే.. 24 కోర్టు హాళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 40 కోర్టు హాళ్లు ఉన్నాయి. విభజన జరిగాక వాటిలో 24 ఏపీకి వస్తాయి. 15 మంది న్యాయమూర్తులు రానున్నారు. హైకోర్టులో చిన్న బెంచ్‌ల హాళ్లు 40-20 అడుగుల సైజులో ఉండాలి. అదే చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని కోర్టు హాళ్ల పరిమాణం 100-60 అడుగుల పరిమాణంలో ఉండాలి. వీటినే కోర్టు-1గా పిలుస్తారు.

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=535791

ఇన్నర్‌ రింగ్‌రోడ్లకు ప్రణాళిక
13-02-2018 07:51:07

అనుసంధానం కోసం 27 రాజధాని రోడ్ల పొడిగింపు
ఒక్కో రోడ్డు వెడల్పు 164 నుంచి 197 అడుగులు
మొత్తం అవసరమైన భూమి 1379 ఎకరాలు
ఓఆర్‌ఆర్‌- ఐఆర్‌ఆర్‌లను కలిపేందుకు 15 రేడియల్‌ రహదారులు 
అమరావతి: రాజధాని ప్రాంతం, విజయవాడ చుట్టూ సాగుతూ, పలు ప్రాంతాలను ట్రాఫిక్‌ ఇబ్బందుల నుంచి బయట పడేసేందుకు ఉద్దేశించిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐ.ఆర్‌.ఆర్‌.)తో అమరావతిలోని పలు రహదారులను అనుసంఽధానించేందుకు బృహత్తర ప్రణాళిక రూపం దిద్దుకుంటోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 10 మండలాల పరిధిలోని 41 గ్రామాలతోపాటు కొండపల్లి అభయారణ్యం గుండా సాగే ఐఆర్‌ఆర్‌ (96.16 కిలోమీటర్లు)తో రాజధానిలో నిర్మిస్తున్న రోడ్లలో 27 రహదారులను పొడిగించి, కలపడం ద్వారా ఆయా ప్రాంతాలన్నింటినీ రాజధానికి చేరువ చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. ఈ విధంగా పొడిగించనున్న 27 రాజధాని రోడ్లలోని ఎక్స్‌టెన్షన్‌ భాగాలన్నింటి పొడవు మొత్తం 91.16 కిలోమీటర్లు కాగా వీటి ఒక్కొక్కదాని వెడల్పు 164 నుంచి 197 అడుగులు ఉండనుంది. ఈ రహదారుల పొడిగింపు కోసం మొత్తం 1378.80 ఎకరాలు అవసరమని సీఆర్డీయే గుర్తించింది.
 
పొడిగించే రాజధాని రోడ్లు ఇవే..
ఐఆర్‌ఆర్‌తో అమరావతిని అనుసంధానించనున్న 27 క్యాపిటల్‌ సిటీ రోడ్ల పేర్లు, పొడిగించనున్న దూరం, వెడల్పు వివరాలిలా ఉన్నాయి..
ఈ-1 (3.06 కి.మీ. పొడవు, 50 మీ. వెడల్పు), ఈ-2 (2.94, 50), ఈ-3 (1.84, 60), ఈ-4 (2.05, 50), ఈ-5 (1.57, 60), ఈ-8 (0.65, 50), ఈ-9 (1.19, 50), ఈ-10 (7.19, 50), ఈ-11 (6.71, 50), ఈ-12 (5.94, 50), ఈ-13 (5.6, 60), ఈ-14 (4.49, 50), ఈ-15 (2.94, 50), ఈ-16 (2.87, 50), ఎన్‌-4 (2.24, 60), ఎన్‌- 7 (1.63, 50), ఎన్‌-8 (1.22, 50), ఎన్‌-9 (1.2, 50), ఎన్‌-10 (1.44, 50), ఎన్‌-11 (4.92, 50), ఎన్‌-12 (6.76, 50), ఎన్‌-13 (రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ వే) (5.73, 60), ఎన్‌-14 (4.79, 50), ఎన్‌-15 (4.14, 50), ఎన్‌-16 (2.62, 50), ఎన్‌-17 (1.36, 50), ఎన్‌-4తో ఎన్‌-9 కలిపే కొత్త రోడ్డు (4.07 కిలోమీటర్లు, 50 మీటర్లు).
పైన పేర్కొన్న రోడ్ల పొడిగింపు కారణంగా పెదపరిమిలోని కొన్ని ప్రాంతాలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండడంతో దానిని తప్పించేందుకు సీఆర్డీయే సదరు రోడ్డు మార్గానికి 4 ప్రత్యామ్నాయాలను కూడా సూచించింది.
 
రేడియల్‌ రహదారులు..
మరొకపక్క.. అమరావతి, విజయవాడ, గుంటూరు తదితర ప్రదేశాలను కలుపుతూ సాగనున్న అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌), ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌)లను కలుపుతూ కూడా 15 రోడ్లను (రేడియల్‌ కనెక్టివిటీ)ని అధికారులు ప్రతిపాదించారు. వీటిల్లో 6 జాతీయ రహదారులను, మరొక 6 రాష్ట్ర రహదారులను, 2 రాజధానిలోని మేజర్‌ ఆర్టీరియల్‌ రోడ్లను, 1 ఎక్స్‌ప్రెస్‌ వేను కలపడం ద్వారా ఓఆర్‌ఆర్‌ను ఐఆర్‌ఆర్‌తో అనుసంధానించనున్నాయి.

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=535708

 

ఐఆర్‌ఆర్‌’కు నోటిఫికేషన్‌ ఇవ్వండి
13-02-2018 03:32:41

పూలింగ్‌లో 8వేల ఎకరాల సమీకరణకు సీఎం ఆదేశాలు
అమరావతి నిర్మాణానికి 500కోట్లకు మసాలా బాండ్లు
అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు(ఐఆర్‌ఆర్‌)కు సంబంధించిన సర్వే పూర్తయినందున దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఏపీసీఆర్డీయేను ఆదేశించారు. వెలగపూడిలోని సీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన సీఆర్డీయే సమీక్ష సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు ఇతర కీలకాంశాలపై చర్చ జరిగింది. 97.50కి.మీ. పొడవుతో ఏర్పాటై, కృష్ణా- గుంటూరు జిల్లాల్లోని 41 గ్రామాలతో పాటు విజయవాడ, అమరావతి చుట్టూ సాగే ఈ రహదారికి, దీనితో రాజధానిని అనుసంధానించే క్యాపిటల్‌ సిటీ రోడ్ల పొడిగింపు కోసం సుమారు 8,000 ఎకరాలను సమీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
 
ఈ భూములను పూలింగ్‌ పద్ధతిలో తీసుకోవాలని, అలా ఇచ్చేందుకు అంగీకరించని వారినుంచి భూసేకరణ విధానం ద్వారా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అమరావతి నిర్మాణానికి అవసరమయ్యే నిధుల్లో రూ.500కోట్లను మసాలా బాండ్ల ద్వారా సమీకరించుకునేందుకు ముఖ్యమంత్రి అనుమతినిచ్చారు. ఎస్‌.పి.బి. సంస్థ ఈ ప్రక్రియను చేపట్టనుందని అధికారులు తెలిపారు. రాజధానిలో ఐటీ రంగం వేళ్లూనుకునేందుకు వీలుగా అక్కడ 5.50ఎకరాల్లో రూ.284 కోట్లతో రెండు భారీ టవర్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలోని 400, 220 కె.వి. విద్యుత్తు లైన్లను మార్చేందుకు రూ.1,370 కోట్లతో చేపట్టనున్న పనులకూ సీఎం అనుమతించారు. రాజధానిలో నిర్మిస్తున్న రహదారులను వర్షాకాలానికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
 
డస్సాల్ట్‌ సిస్టమ్స్‌ అధికారులతో చర్చలు
విజయవాడలో ఏప్రిల్‌ 10నుంచి 12వరకూ నిర్వహించనున్న హ్యాపీ సిటీస్‌ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే దావోస్ లోని ఎకనమిక్‌ ఫోరమ్‌లో తనను కలసిన డస్సాల్ట్‌ సిస్టమ్స్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వర్చువల్‌ 3డీ సిటీ ప్రతిపాదలను వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడు తూ, హ్యాపీ సిటీస్‌ సదస్సులో వర్చువల్‌ 3డీ సిటీకి సంబంధించి డెమోను ఇవ్వాలని డస్సాల్ట్‌ సిస్టమ్స్‌ అధికారులను కోరారు.

Link to comment
Share on other sites

నేడు అమరావతికి రానున్న ముఖేశ్‌ అంబానీ

అమరావతి: రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి రానున్నారు. ఇవాళ అమరావతిలో పర్యటించనున్న ముఖేష్.. సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వీరి మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇటీవల తన ముంబై పర్యటనలో భాగంగా అంబానీని కలిసిన మంత్రి లోకేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించి రాష్ట్ర పర్యటనకు రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇవాళ అంబానీ సీఎంతో భేటీ కానున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీజీ కేంద్రాన్ని ముఖేష్ అంబానీ పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి నివాసంలో విందు భేటీలోనూ ముఖేష్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం

Link to comment
Share on other sites

రాజధానిలో సిటీ సివిల్‌ కోర్టు భవనం! 
రూ.108 కోట్లతో నిర్మాణం 
తాత్కాలికంగా ఆ భవనంలో హైకోర్టు 
త్వరలో రాజధాని అంతర వలయ రహదారి ముసాయిదా ప్రకటన 
అమరావతి వర్చువల్‌ త్రీడీ సిటీ ప్రాజెక్టు రూపొందిస్తున్న డస్సాల్ట్‌ సంస్థ 
విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో సంతోష నగరాల సదస్సు 
20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం 
5.5 ఎకరాల్లో 2 ఐటీ టవర్లు 
సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయాలు 
ఈనాడు - అమరావతి
రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో శాశ్వత హైకోర్టు  నిర్మించే ప్రాంతానికి సమీపంలో సిటీ సివిల్‌ కోర్టు భవనానికి రూపమివ్వనున్నారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుని ఇందులో ఏర్పాటుచేస్తారు. శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యాక, హైకోర్టుని అక్కడికి తరలించి, ఈ భవనంలో సిటీ సివిల్‌ కోర్టు ఏర్పాటుచేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ విలేఖరులకు తెలిపారు. 
*  సిటీ సివిల్‌ కోర్టు భవనాన్ని జీ+5 విధానంలో నిర్మిస్తారు. 1.96 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది. రూ.108కోట్లు వ్యయమవుతుందని అంచనా. 8నెలల్లో నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం. 
*  వర్చువల్‌ సింగపూర్‌ ప్రాజెక్టు తరహాలో రాజధాని కోసం ‘అమరావతి వర్చువల్‌ త్రీడీ సిటీ’ ప్రాజెక్టుని రూపొందిస్తారు. డస్సాల్ట్‌ సిస్టమ్స్‌ సంస్థకు ఈ బాధ్యత అప్పగించారు. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనలో ఈ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వర్చువల్‌ సింగపూర్‌ ప్రాజెక్టుని ఈ సంస్థే రూపొందించింది. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టుల సమాచారాన్ని, దృశ్యాల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ డేటాబేస్‌కి అందజేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రికి డస్సాల్డ్‌ సంస్థ ప్రతినిధులు వివరించారు. పర్యవేక్షణ, నిఘా, ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలని, ప్రపంచంలోనే అత్యుత్తమ పరిజ్ఞానాల్ని వినియోగించాలని సీఎం సూచించారు. అమరావతి వర్చువల్‌ త్రీడీ సిటీ ప్రాజెక్టు నమూనాని ఏప్రిల్‌లో జరిగే సంతోష నగరాల సదస్సులో ప్రదర్శించాలని తెలిపారు. 
* రాజధాని అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ నిర్మించే అంతర వలయ రహదారి(ఐఆర్‌ఆర్‌)కి సంబంధించిన ముసాయిదా ప్రకటన జారీకి సీఆర్‌డీఏ అంగీకారం తెలిపింది. రాజధాని అమరావతిలో గ్రిడ్‌ విధానంలో నిర్మిస్తున్న ప్రధాన రహదారుల్ని అంతర వలయ రహదారికి అనుసంధానిస్తారు. రాజధాని వెలుపలా  ఇవి గ్రిడ్‌ విధానంలోనే ఉంటాయి. ఐఆర్‌ఆర్‌కి, రాజధాని రహదారుల్ని ఐఆర్‌ఆర్‌తో అనుసంధానించేందుకు మొత్తం 8వేల ఎకరాల వరకు కావాలని అంచనా. దీన్ని భూసమీకరణ విధానంలో తీసుకోవాలని అథారిటీ నిర్ణయించింది. అలా ఇవ్వని భూముల్ని భూసేకరణ ద్వారా తీసుకుంటారు. సీఆర్‌డీఏ త్వరలోనే ముసాయిదా ప్రకటన విడుదల చేస్తుంది. అభ్యంతరాలు తెలియజేసేందుకు 30రోజుల గడువుంటుంది. 
* రాజధాని మీదుగా వెళుతున్న 400కేవీ, 220కేవీ విద్యుత్‌ లైన్ల దారి మళ్లించే ప్రతిపాదనకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. 400 కేవీ లైన్ల మళ్లింపునకు రూ.491కోట్లు, 220కేవీ లైన్ల మళ్లింపునకు రూ.883కోట్లు వ్యయమవుతుందని అంచనా. 
*  రాజధాని నిర్మాణానికి విదేశాల్లో మసాలా బాండ్లు విడుదల ద్వారా రూ.500కోట్లు సమీకరించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఎస్‌బీఐ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. 
*  రాజధానిలో సీఆర్‌డీఏ 10లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం కలిగిన రెండు ఐటీ టవర్లు నిర్మిస్తుంది. రూ.284 కోట్లు వెచ్చింది, 5.5 ఎకరాల్లో వీటిని నిర్మిస్తుంది. 
*  సంతోష నగరాల సదస్సుని ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు విజయవాడలోని ఎ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తారు. దేశ, విదేశాల నుంచి 1500 ప్రతినిధులు హాజరవుతారని అంచనా. 
*  సదస్సుకి హాజరయ్యే అతిథులకు సేంద్రియ ఉత్పత్తులతో సిద్ధం చేసిన వంటకాలు వడ్డించాలని, అతిథుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. 
*  సంతోష నగరాల సదస్సు లోగో ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలని, లోగో కూచిపూడి నృత్యం, శాసనసభ భవన నమూనా, హరిత, జల రాజధాని ఇతివృత్తాలు ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు. 
*  రాజధానిలో వెంకటపాలెం సమీప కృష్ణా తీరంలో 8.38 ఎకరాల్లో రూ.40 కోట్ల వ్యయంతో ‘మెరీనా’ ఏర్పాటుకి అథారిటీ ఆమోదముద్ర వేసింది. త్వరలో టెండర్లు పిలుస్తారు 
*  పరిపాలన నగరంలోనే 20ఎకరాల్లో సమీకృత బహుళ ప్రయోజనకర క్రీడా ప్రాంగణం అభివృద్ధి చేస్తారు. దీనిలో 11 ఎకరాల్లో స్టేడియం, 9ఎకరాల్లో వాణిజ్య సదుపాయాలు, వసతులు వస్తాయి. వీటి నిర్మాణానికి రూ.450-500 కోట్లు వ్యయమవుతుందని అంచనా. 
*  రాజధానిలో రహదారుల నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తవ్వాలని ఆదేశం. రాజధానిలో వివిధ ప్రాజెక్టులు చేస్తున్న గుత్తేదారులతో బుధవారం మరోసారి సమీక్షా సమావేశం. 
*  సమీకృత ట్రాఫిక్‌ రవాణా వ్యవస్థపై అధ్యయనానికి 10 మంది సభ్యుల బృందం జపాన్‌కు వెళ్లేందుకు ఆమోదముద్ర. 
*  మార్చి 19 నుంచి 23 వరకు వాషింగ్టన్‌లో ‘భూమి-పేదరికం’ అన్న అంశంపై జరిగే సదస్సులో రాష్ట్ర ప్రతినిధులు పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశం.

Link to comment
Share on other sites

 

http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=7

 

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి, విజయవాడ చుట్టూ నిర్మించే అంతర వలయ రహదారి(ఐఆర్‌ఆర్‌) తుది ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సుమారు ఎనిమిది వేల ఎకరాలను భూసమీకరణ విధానంలో తీసుకోవాలని నిర్ణయించినందున సీఆర్‌డీఏ త్వరలోనే ముసాయిదా ప్రకటన జారీ చేయనుంది. ప్రకటన వెలువడ్డాక ప్రజల అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు 30 రోజుల గడువునిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని 15 రోజుల వ్యవధిలో ప్రణాళికలో అవసరమైన మార్పుచేర్పులు చేసి తుది ప్రకటన జారీ చేస్తారు. 217 చ.కి.మీ.ల పరిధిలో రాజధానిలో నిర్మిస్తున్న ప్రధాన అంతర్గత రహదారులను ఐఆర్‌ఆర్‌తో అనుసంధానిస్తారు. ఐఆర్‌ఆర్‌ నిర్మాణానికి, రాజధానిలోని రహదారులను ఐఆర్‌ఆర్‌తో అనుసంధానించేందుకు కలిపి సుమారు 8 వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా. ఐఆర్‌ఆర్‌ స్వరూపమిది! 
* అంతర్‌వలయ రహదారి పొడవు: 96.16 కి.మీ, వెడల్పు: 75 మీటర్లు 
*  కేవలం అంతర్‌వలయ రహదారి రైట్‌ఆఫ్‌ వే విస్తీర్ణం: 2195.87 ఎకరాలు 
*  ఏయే జిల్లాల మీదుగా వెళ్తుందంటే: గుంటూరు, కృష్ణా 
*  ఎన్ని మండలాల మీదుగా వెళ్తుందంటే: 10 మండలాలు- తుళ్లూరు, అమరావతి, దుగ్గిరాల, మంగళగిరి, తాడికొండ, గన్నవరం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ గ్రామీణ, జి.కొండూరు
*  ఎన్ని గ్రామాల మీదుగా వెళ్తుందంటే: 41 గ్రామాలతో పాటు కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతం మీదుగా 
* గుంటూరు జిల్లాలో: ఎండ్రాయి, కర్లపూడి, వైకుంఠపురం(అమరావతి మండలం), తమ్మపూడి (దుగ్గిరాల), చినకాకాని, చినవడ్లపూడి, కాజా, నూతక్కి, పెదవడ్లపూడి, రామచంద్రాపురం (మంగళగిరి), కంతేరు, మోతడక, తాడికొండ(తాడికొండ), హరిశ్చంద్రాపురం, పెదపరిమి, వడ్లమాను, అనంతవరం(తుళ్లూరు). 
* కృష్ణా జిల్లాలో: కవులూరు, వెలగలేరు(జి.కొండూరు), రామచంద్రాపురం, సావిరిగూడెం, వెదరుపావులూరు(గన్నవరం), దామలూరు, ఇబ్రహీంపట్నం, జూపూడి, కేతనకొండ, కొండపల్లి, కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌, కొటికలపూడి, నావిపోతవరం, త్రిలోచనాపురం, జామి మాచవరం (ఇబ్రహీంపట్నం), చోడవరం, గంగూరు, పెనమలూరు, పోరంకి(పెనమలూరు), దోనెఆత్కూర్‌, కొత్తూరు, నిడమనూరు, నున్న, పాతపాడు, తాడేపల్లి(విజయవాడ రూరల్‌). 
అంతరవలయ రహదారిని మొత్తం రెండు భాగాలుగా నిర్మించనున్నారు 
మొదటి భాగం 
*  మొత్తం గ్రామాలు: 41 
*  అంతర వలయ రహదారి పొడవు: 68.08 కి.మీ. 
*  ఎన్‌హెచ్‌-65 (హైదరాబాద్‌ రహదారిలో) కేతనకొండ వద్ద మొదలై ప్రతిపాదిత జాతీయ రహదారి బైపాస్‌ (నున్న సమీపం) వద్ద ముగుస్తుంది.
కృష్ణా నదిపై వేర్వేరు చోట్ల 
రెండు వంతెనలు వస్తాయి. అవి 
1. కృష్ణానదికి ఉత్తరాన కొటికలపూడి గ్రామానికి పశ్చిమం వైపున వంతెన మొదలై కృష్ణా నదికి దక్షిణాన వైకుంఠాపురం గ్రామానికి తూర్పు వైపున ముగుస్తుంది. దీని పొడవు: 3.1 కి.మీ. 
2. కృష్ణానదికి దక్షిణాన రామచంద్రాపురం గ్రామానికి తూర్పు వైపున వంతెన మొదలై కృష్ణా నదికి ఉత్తరం వైపున, చోడవరం గ్రామానికి తూర్పు వైపున ముగుస్తుంది. దీని పొడవు: 1.4 కి.మీ. 
* అనంతవరం వద్ద ఈ అంతరవలయ రహదారి రాజధానిని తాకుతుంది.
రెండో భాగం 
*  అంతరవలయ రహదారి పొడవు: 28 కి.మీ. 
*  కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతం గుండా తొమ్మిది కి.మీ మేర ఈ రహదారి వెళ్తుంది. అందులో 8 కి.మీ. సొరంగ మార్గం. 
*  అంబాపురం వద్ద పోలవరం కాలువ మీదుగా రెండు చోట్ల వెళ్తుంది.

Link to comment
Share on other sites

వీవీఎస్‌ లక్ష్మణ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ భేటీ అయ్యారు. అమరావతిలో క్రికెట్‌ అకాడమీ ఏర్పాటు అంశంపై చర్చించారు. రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధి కోసం కార్యాచరణను రూపొందించనున్నట్టు లక్ష్మణ్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

డ్రోన్ల పర్యవేక్షణలో అమరావతి పనులు 

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను డ్రోన్లతో పర్యవేక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డ్రోన్లతో తీసిన చిత్రాలను తనకు ప్రతి 15 రోజులకు ఒకసారి చూపించాలన్నారు. పనుల్లో వేగం పెంచాలని, చేపట్టిన ప్రతి పని నిర్ణిత కాలవ్యవధిలో పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. గృహనిర్మాణం, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడంలో ఎవరైనా విఫలమైతే ఉపేక్షించబోనని స్పష్టంచేశారు. సచివాలయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులు, సర్వీస్‌ ప్రొవైడర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. చేపట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తేనే పెట్టుబడిదారులు ముందుకు వస్తారని అన్నారు. పనులకు సంబంధించిన యంత్ర సామాగ్రి, మెటీరియల్ విషయంలో ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీఏ) అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

స్పోర్ట్స్‌ సిటీగా అమరావతి
15-02-2018 02:30:27
 
636542586284517351.jpg
  • అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలు
  • అకాడమీలు, క్రీడోత్సవాలకు నెలవుగా నగరం
  • ఒలింపిక్స్‌ నిర్వహణ లక్ష్యంతో ముందుకు
  • క్రీడా స్ఫూర్తికి కేరాఫ్‌ అడ్ర్‌సగా రాష్ట్రం
  • ప్రతిపాదనలు రూపొందించిన ఏపీ సీఆర్డీయే
అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాజధానిలోని ప్రతిపాదిత 9 థీమ్‌ సిటీల్లో ఒకటైన అమరావతి స్పోర్ట్స్‌ సిటీని దేశంలోనే అత్యుత్తమ క్రీడా వసతులకు నెలవుగా మలిచేందుకు ఏపీ సీఆర్డీయే ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం అమరావతి క్రీడా నగరంలో ప్రపంచస్థాయి స్టేడియాలు, అకాడమీలు, స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు, వివిధ స్థాయి క్రీడోత్సవాల నిర్వహణ అవసరమని గుర్తించింది. అన్ని క్రీడలకూ ప్రాధాన్యమిస్తూనే 6 లేదా 7 క్రీడలపై మాత్రం మరింత దృషి పెట్టింది. తద్వారా ప్రపంచ క్రీడాపటంలో అమరావతి పేరు కనిపించేలా చేయాలని కంకణం కట్టుకుంది. ఇంతే కాకుండా రాష్ట్రంలో క్రీడా చైతన్యం పెరిగేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని భావించింది. అలాగే 2037 నాటికి ఒలింపిక్స్‌ నిర్వహణ, పతకాల సాధన లక్ష్యంగా ముందుకు సాగాలనే యోచనలో ఉంది. పైన పేర్కొన్న లక్ష్యాలను రెండు దశల్లో అధిగమించాలని భావిస్తోంది. తొలి దశను 2017- 2021 మధ్య, మలి దశను 2021- 2037 మధ్య పూర్తి చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది.
 
 
4 అంశాల ఆధారంగా..
అమరావతి స్పోర్ట్స్‌ సిటీని.. నాలుగు అంశాల ఆధారంగా నిర్మించనున్నారు. అవి ప్రపంచస్థాయి సౌకర్యాలు, హెల్త్‌- వెల్‌నెస్‌- ట్రైనింగ్‌, ఈవెంట్ల నిర్వహణ (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ క్రీడోత్సవాలు, చివరిగా ఒలింపిక్స్‌), స్పోర్ట్స్‌ కల్చర్‌ వంటి నాలుగు అంశాలను ఈ స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణంలో కీలక అంశాలుగా భావించనున్నారు.
 
 
2 దశల్లో అభివృద్ధి..
2017-2021 మధ్య అమలు చేయనున్న తొలి దశలో.. స్టేడియాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, రేసింగ్‌ సర్క్యూట్‌, గాయపడిన క్రీడాకారులకు పునరావాస కేంద్రాలు, వాటర్‌స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, వర్చ్యువల్‌ స్పోర్ట్స్‌ కోసం ఇ-స్పోర్ట్స్‌ ఎరీనా, క్రీడాకారులు, కోచ్‌ల కోసం స్పోర్ట్స్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్లు తదితరాలను నెలకొల్పాలని సీఆర్డీయే ప్రతిపాదించింది. 2021- 2037 మధ్య అమలయ్యే మలిదశలో.. స్పోర్ట్స్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నొవేషన్‌ సెంటర్‌, నగరమంతటా కమ్యూనిటీ పార్కులు, అవుట్‌డోర్‌ స్టేడియాలు, కమ్యూనిటీ జిమ్‌లు, హెల్త్‌ సెంటర్లు, స్పోర్ట్స్‌, క్రికెట్‌ మ్యూజియం, మెగాప్లెక్స్‌, గోల్ఫ్‌ కోర్సులతో కూడిన పార్కులు, నేషనల్‌ డేటాబేస్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ మరియు బయోమెకానిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ రిసార్టులు, ఆయుర్వేద కేంద్రం, ఆర్కేడ్స్‌, స్పోర్ట్స్‌ బార్స్‌, గేమింగ్‌ కేఫ్స్‌, క్రీడాదుస్తుల ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు- ప్రాంతీయ కేంద్రాలు, అనలిటిక్స్‌ స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌, ప్రపంచస్థాయి క్రీడా సంఘాల ప్రాంతీయ కార్యాలయాలు, టీమ్‌ క్లబ్‌లు, స్పోర్ట్స్‌ అకాడమీలు తదితరాలను స్థాపించనున్నారు.
 
 
11 ఎకరాల్లో 6 క్రీడలకు అకాడమీలు
ఓపక్క అన్ని క్రీడాంశాలకూ ప్రాధాన్యమిస్తూనే మనం పతకాలు సాధించే అవకాశాలున్న స్పోర్ట్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలన్న అభిప్రాయంతో అమరావతి స్పోర్ట్స్‌ సిటీలో 6 క్రీడలకు సంబంధించిన అకాడమీలను నెలకొల్పాలని సీఆర్డీయే ప్రతిపాదించింది. ఆయా క్రీడల్లో నిష్ణాతులైన క్రీడాకారుల ఆధ్వర్యంలో ఇవి నడుస్తాయి. టెన్నిస్‌, స్విమ్మింగ్‌, హాకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, స్క్వాష్‌ క్రీడల్లో స్పోర్ట్స్‌ అకాడమీలను ఏర్పాటు చేస్తారు. వీటిల్లో టెన్నిస్‌ అకాడమీకి 2 ఎకరాల్లో 8 కోర్టులు, స్విమ్మింగ్‌కు 0.7 ఎకరాల్లో ఒక్కోటి 8 లేన్లతో 2 ఒలింపిక్‌ పూల్స్‌, హాకీ కోసం 2 ఎకరాల్లో అకాడమీ, ఫుట్‌బాల్‌కు 1.50 ఎకరాలు, బాస్కెట్‌బాల్‌కు 0.50 ఎకరాలు, స్క్వాష్‌ కోసం 0.5 ఎకరాల్లో 20 కోర్టులు నిర్మించనున్నారు
Link to comment
Share on other sites

సహించను 
ప్రతి 15 రోజులకు డ్రోన్లతో చిత్రీకరించండి 
  రాజధాని పనుల పురోగతిపై సీఎం సమీక్ష 

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో వివిధ మౌలిక సదుపాయాల పనులు ఆశించినంత వేగంగా జరగకపోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కబుర్లు చెబితోనో, కాగితాల మీద చూపిస్తేనో సరిపోదని, జరిగిన పని కళ్లకు కనిపించాలని అప్పుడే పెట్టుబడిదారులు ముందుకు వస్తారని పేర్కొన్నారు. వేగం పెరగాలని, ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా నిర్మాణ సంస్థల్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాజధానిలో వివిధ ప్రాజెక్టులు చేస్తున్న గుత్తేదారులు, వాటికి అవసరమైన యంత్రసామగ్రి, నిర్మాణ సామగ్రి సమకూరుస్తున్న సర్వీస్‌ ప్రొవైడర్లతో ప్రత్యేకంగా సమీక్షించేందుకు ఆయన బుధవారం సీఆర్‌డీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లాల్సి ఉన్నందున ఈ సమావేశాన్ని తక్కువ సమయంలోనే ముగించారు. గృహనిర్మాణం, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని సకాలంలో పూర్తి చేయడంలో ఎవరైనా విఫలమైతే ఉపేక్షించబోనని ఆయన స్పష్టం చేశారు. పనుల పురోగతిపై ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ సహకారంతో ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రోన్లతో తీసిన చిత్రాలు తనకు చూపించాలని తెలిపారు. యంత్రసామగ్రి, వస్తుసామగ్రి విషయంలో ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.
డిసెంబరు నాటికి ప్రధాన రహదారులు సిద్ధం 
ఈ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ విలేకరులతో మాట్లాడుతూ... రాజధానిలో ప్రస్తుతం 320 కి.మీ. పొడవైన ప్రధాన రహదారుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 34 ప్రధాన రహదారులుండగా, 24 రహదారుల పనులు జరుగుతున్నట్టు తెలిపారు. మిగతా 10 రహదారులకు సంబంధించి నెల రోజుల్లోగా టెండర్లు పిలుస్తామన్నారు. ప్రస్తుతం రహదారులు, ప్రభుత్వ నివాస భవనాల నిర్మాణ పనుల్లో జేసీబీలు, ప్రొక్లెయినర్లు, టిప్పర్లు ఎన్నెన్ని పనిచేస్తున్నాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి సమీక్షించినట్టు తెలిపారు. ఏ కంపెనీ ఎన్ని కిలోమీటర్ల పొడవైన రహదారుల పనులు చేస్తోంది? దానికి తగ్గట్టుగా యంత్రాల్ని, సిబ్బందిని నియమించుకుందా? అవసరమైనన్ని బ్యాచింగ్‌ ప్లాంట్లు పెట్టిందా? మెటీరియల్‌ ఎక్కడి నుంచి వస్తోంది? వంటి సమగ్ర వివరాలతో వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణం 2018 డిసెంబరుకి పూర్తవుతుందన్నారు.

ఏడాది చివరకు ప్రభుత్వ నివాస భవనాలు 
ప్రభుత్వ నివాస భవనాలకు మార్చి 15 నాటికి మొదటి శ్లాబ్‌ వేస్తారని అక్కడి నుంచి నాలుగు నెలల్లో మొత్తం జీ+12 వరకు శ్లాబ్‌లు వేయడం పూర్తవుతుందని, వచ్చే డిసెంబరు నాటికి ఆ భవనాలు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమవుతాయని నారాయణ వెల్లడించారు. ఒకపక్క ఇంత అభివృద్ధి జరుగుతుంటే, రాజధానిలో ఒక ఇటుక కూడా పెట్టలేదని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటి వాళ్లు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాట్లాడాలని ఆయన సూచించారు. స్టార్టప్‌ ప్రాంతంలో సింగపూర్‌ సంస్థల కన్సార్టియం త్వరలోనే పనులు ప్రారంభిస్తుందని, డిజైన్లు సిద్ధమవుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.
సాంకేతికతతో ఈ-ప్రగతి పటిష్ఠం: చంద్రబాబు 
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌తో ఈ-ప్రగతిని అనుసంధానించి పటిష్ఠం చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం సచివాలయంలో ఈ-ప్రగతి పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ చేపడుతున్న చర్యలు అధికారులకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పారదర్శక పాలన కోసం వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ కొనియాడిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌, ఈ-ప్రగతి ముఖ్య కార్యనిర్వహణాధికారి బాలసుబ్రమణ్యం, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సీఈవో బాబు అహ్మద్‌, సీఎం కార్యదర్శి గిరిజా శంకర్‌ పాల్గొన్నారు.
చంద్రబాబుతో వీవీఎస్‌ లక్ష్మణ్‌ భేటీ 
భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సీఎంను కలిసి క్రీడలు, క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జాతీయ, అంతర్జాతీయ క్రీడా అకాడమీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.

Link to comment
Share on other sites

అంతర వలయ రహదారికి ముసాయిదా 
అభ్యంతరాలుంటే తెలపవచ్చన్న సీఆర్‌డీఏ
ఈనాడు అమరావతి: రాజధాని అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ నిర్మించ తలపెట్టిన అంతర వలయ రహదారి (ఐఆర్‌ఆర్‌)కి సంబంధించిన ముసాయిదా ప్రకటనను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం విడుదల చేసింది. రాజధానిలో నిర్మిస్తున్న 27 ప్రధాన రహదారుల్ని ఐఆర్‌ఆర్‌కి అనుసంధానించేలా విస్తరించాలని, గ్రిడ్‌ విధానంలోనే వీటిని నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో...వాటిని కూడా కలిపే సీఆర్‌డీఏ ఈ ముసాయిదా ప్రతిపాదన రూపొందించింది. ఐఆర్‌ఆర్‌ని 96.16 కి.మీ.ల పొడవు, 75 మీటర్ల వెడల్పున నిర్మిస్తారు. ఐఆర్‌ఆర్‌ నిర్మాణం, 27 రాజధాని రహదారుల్ని ఐఆర్‌ఆర్‌ వరకు పొడిగించడం వల్ల 11 జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్లు, రాజధాని ప్రాంత బృహత్తర ప్రణాళికలో మార్పులు జరుగుతున్నాయని సీఆర్‌డీఏ పేర్కొంది. మొత్తం ఐఆర్‌ఆర్‌లో 11.11 కి.మీ. ప్రాంతం ఏ ప్రణాళికాలేని భాగంలో ప్రతిపాదించినట్టు తెలిపింది. ఐఆర్‌ఆర్‌, 27 రహదారుల్ని 41 గ్రామాలు, ఒక రక్షిత అటవీ భూభాగం పరిధిలో ప్రతిపాదించినట్టు పేర్కొంది. ప్రతిపాదించిన మార్పుల వల్ల ఎవరైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రభావితమైతే... 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సలహాల్ని సీఆర్‌డీఏ కమిషనర్‌కు తెలియజేయవచ్చునని, సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లోనైనా నివేదించవచ్చునని పేర్కొం

Link to comment
Share on other sites

బృందం పర్యటన
టోక్యో: అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం అవుతున్న అమరావతిలో అత్యాధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుకు సీఆర్‌డీఏ చర్యలు చేపట్టింది. సంబంధిత వ్యవస్థపై అధ్యయనానికి ఉన్నతాధికారుల బృందం జపాన్‌లో పర్యటిస్తోంది. ఉత్తమమైన ట్రాఫిక్‌ విధానాలను లోతుగా అధ్యయనం చేస్తోంది. అమరావతిలో ప్రపంచస్థాయి ట్రాఫిక్‌ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ సహా విజయవాడ పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌తో కూడిన అధికారుల బృందం జపాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది.

Link to comment
Share on other sites

పురోగతి.. ప్రత్యక్షంగా
17-02-2018 08:35:06

రాజధానిలో ఇళ్ల నిర్మాణాల రియల్‌ టైం మానిటరింగ్‌
ఎక్కడి నుంచి అయినా సెల్‌ఫోన్‌లో చూసే అవకాశం
ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సీఆర్డీయే
గుంటూరు(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నగరంలో ప్రభుత్వపరంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశాన్ని ప్రజలకు సీఆర్డీయే అందుబాటులోకి తీసుకొచ్చింది. పని జరుగుతున్న ప్రదేశాల్లో అమర్చిన సీసీ టీవీ కెమెరాల ద్వారా రికార్డింగ్‌ అవుతోన్న ఫుటేజ్‌ని రియల్‌టైంలో తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతోంది. దీనివలన ప్రజాప్రతినిధులు, అధికారులే కాకుండా సామాన్య ప్రజలు కూడా రాజధాని నగరంలో నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఎమ్మెల్యే, ఏఐఎస్‌, ఎన్‌జీవో, ఎస్‌పీసీ అధికారుల కట్టడాలకు సంబంధించి ఇంచుమించు 48 కెమెరాలను అమర్చి సీఆర్‌డీఏ తన వెబ్‌సైట్‌ ద్వారా పురోగతిని ప్రజల కళ్ల ముందుంచుతోంది.
 
రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారుల కోసం ఇళ్ల నిర్మాణాలను ఇటీవలే సీఆర్‌డీఏ ప్రారంభించింది. టెండర్లు నిర్వహించి వివిధ సంస్థలతో భవన సముదాయాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకొన్నది. వాటిని నిత్యం ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి పరిశీలించడం వలన సమయం వృధా అవుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జలవనరుల శాఖ సీసీ టీవీ కెమెరాలను అమర్చి రియల్‌టైం మానిటరింగ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వలన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టు పురోగతిని పరిశీలిస్తూ ప్రతీ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాజధానిలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కూడా ప్రతీ పది, పదిహేను రోజులకు ఒకసారి సీఎం సమీక్ష ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం, క్యాంపు ఆఫీసు, జిల్లాల పర్యటనలో బిజీగా ఉండే ముఖ్యమంత్రి రాజధాని ఇళ్ల నిర్మాణాలను కూడా రియల్‌ టైం మానిటరింగ్‌ ద్వారా పరిశీలిస్తున్నారు.
  
ఏకంగా సీఎం పర్యవేక్షణ జరుగుతోండటంతో కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శించకుండా పనులు చేయిస్తున్నారు. రాత్రింబవళ్లు కార్మికులకు డ్యూటీలే వేశారు. అలానే భారీ యంత్రాలను రప్పించి పనులు వేగవంతంగా పూర్తి చేస్తోన్నారు. రాజధానిలో ఒక్క తాత్కాలిక సచివాలయం మాత్రమే నిర్మాణం జరిగిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కూడా రియల్‌ టైం మానిటరింగ్‌ సిస్టమ్‌ ఉపయోగపడుతోందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Link to comment
Share on other sites

కేంద్రం సహకరిస్తేనే ప్రపంచస్థాయి రాజధాని 
విభజన హామీలను నెరవేర్చాలి 
  ‘ఈటీవీ’ చర్చా కార్యక్రమంలో వక్తలు 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం కేవలం కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే నెరవేరుతుందని వివిధ వర్గాల ప్రముఖులు పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అరకొరగా నిధులిచ్చి భారీగా సాయం చేశామనడం సరికాదన్నారు. గతంలో ప్రధాని నరేంద్రమోది, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇచ్చిన హామీలను మర్చిపోవద్దని సూచించారు. రాష్ట్రానికి ఇప్పటి వరకూ విడుదలైన నిధులపై కేంద్ర, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెలగపూడి సచివాలయం వేదికగా ‘అమరావతి సాకారం ఎలా..?’ అనే అంశంపై ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ శనివారం  ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈనాడు సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. తెదేపా, భాజపా నాయకులు సహా ఆర్థిక నిపుణులు, రాజధాని ప్రాంత రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలు గమనిస్తున్నారు... 
రాజధానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, హైకోర్టు, శాసనసభ, సచివాలయ భవనాలకు ఆర్థిక సహాయం అందిస్తామని విభజన చట్టంలో చెప్పారు. దిల్లీని తలదన్నే రీతిలో రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తిరుపతి సభలో ప్రధాని చెప్పారు. ఇప్పటి పరిస్థితి ఇందుకు భిన్నంగా   ఉంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. నిధులు ఖర్చు పెట్టారా లేదా అనేందుకు ఏటా యూసీలు సమర్పించడంలో మొదటి మూడు స్థానాల్లో ఏపీ ఉంది.
- కుటుంబరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
నామమాత్రపు నిధులివ్వడం సరికాదు 
రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి చాలనడం సరికాదు. చివరి బడ్జెట్‌ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా లేదనే ఎంపీలంతా పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ అన్నారు. ఏ స్థానంలో ఉన్నా తెదేపా రాజీలేని పోరాటం చేస్తూనే ఉంది. విభజన చట్టంలోని హామీలపై ఎన్నో సార్లు సాయం చేయాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు ఎమ్మెల్యే
ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలి 
భాజపా నాయకులు అవమానకరంగా మాట్లాడుతున్నారు. పోరాటానికి అఖిల పక్షం ఏర్పాటు చేయాలి. ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలి. కేంద్ర సాయంపై రాష్ట్రం ఆలస్యంగా స్పందించింది. కేంద్ర విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన రూ.11 వేల కోట్లకు ఇప్పటి వరకూ రూ.700 కోట్లు ఇచ్చారు. నాలుగేళ్లుగా ఏం చేశారన్నది ప్రజలకు చెప్పాలి.
- చలసాని శ్రీనివాస్‌, 
ఏపీ మేధావుల సంఘం సమన్వయ కర్త
భవనాలు ఉంటే సరిపోదు... 
రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభిస్తేనే పెట్టుబడులు వస్తాయి. కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలి. భవనాలు ఉంటే సరిపోదు. రాజధానికి కావాల్సిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల్లో ఆరోగ్య రంగం మొదటిది. ఎయిమ్స్‌ మంజూరు చేసినా నిధులు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
- డాక్టర్‌ అనంత్‌, ఆర్థిక నిపుణులు
ప్రాధాన్యాలు గుర్తెరగాలి... 
అత్యంత అద్భుతంగా రాజధాని నిర్మించాలనుకోవడంలో తప్పులేదు. ప్రాధాన్యాన్ని బట్టి దశలవారీగా నిర్మాణం చేపట్టాలి. రాజధాని కోసం భూమి ఇచ్చిన స్థానికుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. మొదట ఇది జరిగాక పెద్ద ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధం చేసుకుంటే బావుంటుంది.
- గోపాల కృష్ణ, భాజపా నాయకుడు
భాజపాకీ అదే గతి 
‘‘రైతులు పెద్ద ఎత్తున భూమి ఇచ్చారంటే ఇక్కడి ప్రజల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అర్థం  చేసుకోవచ్చు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా రాజధాని తయారుకావాలి. తీరు మారకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే భాజపాకీ పడుతుంది’’ అన్నారు రాజధాని రైతు ఎం.కృష్ణారావు. ‘‘అన్ని గ్రామాల్లో తిరిగి భూసేకరణకు సహకరించాం. ప్రభుత్వంపై రైతులందరికీ విశ్వాసం ఉంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుంటారని ఆశిస్తున్నాం’’ అన్నారు రాజధాని రైతు సమాఖ్య నాయకుడు డి.రామారావు. శతాబ్దాల ఆంధ్రుల చరిత్ర భవనాల ఆకృతుల్లో ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు స్థపతి ఈమని శివనాగిరెడ్డి. అన్ని ప్రాంతాల వారి చరిత్రకు సంబంధించి కళారూపాలు భవనాల్లో కనిపిస్తే ప్రజల్లో ఇది మా రాజధాని అనే భావం ఉంటుందన్నారు.

Link to comment
Share on other sites

టోక్యో సొరంగ మార్గాల పరిశీలన
18-02-2018 08:01:17

అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రాజధానితోపాటు రాజధాని ప్రాంతం మొత్తానికీ అవసరమైన సమగ్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు కోసం జరుపుతున్న అధ్యయనంలో భాగంగా ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారుల బృందం శనివారంనాడు టోక్యో పరిసరాల్లో అధునాతన పరిజ్ఞానంతో నిర్మించిన సొరంగమార్గాలను పరిశీలించింది. అక్కడి సముద్రంలో 60 మీటర్ల లోతున టోక్యో ఉత్తర, దక్షిణ భాగాలను కలుపుతూ నెక్స్‌కో నిప్పన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కంపెనీ నిర్మించిన 15 కిలోమీటర్ల పొడవైన సొరంగమార్గంలో బృంద సభ్యులు ప్రయాణించి, దాని విశేషాలను తెలుసుకున్నారు. ఈ టన్నెల్‌ను 5 కిలోమీటర్ల పొడవైన వంతెనతో అనుసంధానించడంతో కవసాకి నుంచి సాభి వరకు మొత్తం 20 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ బ్రిడ్జ్‌ మార్గం ఏర్పడినట్లయి, ఆ రెండింటి మధ్య దూరం దాదాపు 40 కిలోమీటర్ల మేర తగ్గింది. ఈ సొరంగాన్ని భూకంపాలను తట్టుకునేలా పటిష్టంగా నిర్మించారు.
 
అధికారులు టోక్యోలో మెరుగైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ కోసం దాదాపు 600 మీటర్లకు పైగా ఎత్తుతో నిర్మించిన భారీ టవర్‌ ‘టోక్యో స్కై ట్రీ’ టూరి స్ట్‌ సెంటర్‌ను కూడా సందర్శించారు. ఇక్కడ 350 మీటర్లు, 450 మీటర్ల ఎత్తున ప్రత్యేక డెక్‌లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి టోక్యో మహానగరాన్ని టూరిస్టులు వీక్షించే అవకాశాన్ని కల్పించారు. అనంతరం సముద్ర, నదీతీరాల్లో నిర్మించిన పర్యాటక ప్రదేశాలను తిలకిం చారు. రివర్‌ ఫ్రంట్‌కు ఇరువైపులా 15 నుంచి 20 అంతస్థుల ఆకర్ష ణీయ భవనాలను నిర్మించారు. బోటింగ్‌ పాయింట్‌ వద్ద మాల్‌, రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ పర్యట నలో సీఆర్డీయే కమి షనర్‌ డాక్టర్‌ చెరు కూరి శ్రీధర్‌, గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, విజయవాడ సీపీ గౌతం సవాంగ్‌, విజయవాడ మున్సి పల్‌ కమిషనర్‌ నివాస్‌, గుంటూరు అర్బన్‌ ఎస్‌.పి. విజయరావు, గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ అనురా ధ, పురపాలక శాఖ అండర్‌ సెక్రటరీ మమతా బాత్రా, సీఆర్డీయే ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ విభాగం ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

సుస్థిర రాజధానిగా అమరావతి
19-02-2018 01:55:21
ప్రపంచ సుస్థిర సదస్సులో ప్రశంసలు
హరిత రాజధానికి సాయం: టీఈఆర్‌ఐ
సంతోష నగరాల సదస్సుకు రండి
ప్రముఖులకు అధికారుల ఆహ్వానం
అమరావతి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యంత సుస్థిర రాజధాని నగరం కానుందని, ఆ దిశగా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఇంధన, వనరుల సంస్థ(టీఈఆర్‌ఐ) కొనియాడింది. అమరావతిలో అద్భుతమైన 9 నగరాలను నిర్మించనున్నారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని ప్రశంసించింది. ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు-2018లో అమరావతి అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను టీఈఆర్‌ఐ అభినందించింది.
 
దేశంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల స్థానిక సంస్థలు నీటి సరఫరా, మురుగునీటి పారుదల, ఘనవ్యర్థాల నిర్వహణ వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉత్తమ విధానాలతో ముందుకు వెళ్తోందని సదస్సులో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని అభినందించారు. సదస్సులో ఏపీ ప్రభుత్వం తరఫున పాల్గొన్న సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ సుస్థిర అభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలను వివరించారు.

ఒత్తిడి తగ్గే మార్గాలు చూడండి: బాబు
సీఎం చంద్రబాబు పంపిన సందేశాన్ని అజయ్‌జైన్‌ ఈ సదస్సులో చదివి వినిపించారు. ‘‘ప్రస్తుతం పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోంది. ఫలితంగా పర్యావరణ అసమతుల్యం, వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు, విపత్తులు సం భవిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన, నగరాల నిర్వహణ, పట్టణీకరణ వల్ల పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు మార్గాలను అన్వేషించాలి’’ అని చంద్రబాబు సందేశంలో పేర్కొన్నారు.
 
అమరావతి అభివృద్ధికి నవీన, సుస్థిర సాంకేతిక అంశాలను తమతో పంచుకోవాలని సీఎం కోరినట్టు సదస్సులో పాల్గొన్న జాతీయ, అం తర్జాతీయ నిపుణులకు అజయ్‌జైన్‌ వివరిం చారు. అమరావతిలో ఏప్రిల్‌ 10 నుంచి జరిగే సంతోష నగరాల సదస్సు-2018లో పాల్గొనాలని వారంద రినీ ఆహ్వానించారు. టీఈఆర్‌ఐ చైర్మన్‌ అజయ్‌ మాథుర్‌ స్పందిస్తూ..అమరావతిలో హరి భవనాల అభివృద్ధికి టీఈఆర్‌ఐ సహకరిస్తుందన్నారు. అమరావతిలో అంతర్జాతీయ ఇంధన సామర్థ్య సదస్సు నిర్వహించాలనుకుంటున్నట్టు తెలిపారు.

Link to comment
Share on other sites

ఇన్నర్‌తో రాజధాని నగర అంతర్గత రోడ్ల అనుసంధానం
19-02-2018 08:19:10

92 కి.మీలు అదనంగా పెరుగనున్న అంతర్గత రోడ్లు
అదనపు నిర్మాణ వ్యయమే రూ రెండున్నర వేల కోట్ల పైమాటే!
భూసేకరణ ఇంకా అదనం
 రాజధాని అంతర వలయరహదారితో సిటీ అంతర్గత రోడ్ల నిర్మాణ వ్యయం తడిసిమోపెడంతవుతోంది. ప్రస్తుతం రాజధానిలో నిర్మిస్తున్న రహదార్లను అంతర వలయ రహదారితో అనుసంధానించాలన్న నిర్ణయంతో అంతర్గత రహదార్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అమరావతిలో 36 ముఖ్య రహదార్లకు రూ.తొమ్మిదివేల కోట్లకు పైగా ఖర్చుకానుండగా తాజా నిర్ణయంతో ఈ ఖర్చు మరో రెండువేల కోట్లను దాటిపోనుంది. ఇక ఆ రహదార్ల పొడిగింపుకు భూసేకరణ తప్పనిసరైతే నిర్మాణ వ్యయం మరింత అనూహ్యంగా పెరిగిపోతుంది.
 
మంగళగిరి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరాన్ని రూ.58వేల కోట్ల వ్యయంతో బ్లూగ్రీన్‌ సిటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకోగా.. అంచనా వ్యయాలు అనూహ్యంగా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాజధాని అమరావతిలో సీడ్‌ యాక్సిస్‌తో కలుపుకుని సుమారు 36 ముఖ్యమైన రహదారులను 316 కి.మీల నిడివిలో నిర్మించేందుకు ప్రభుత్వం రూ.916 కోట్లను ఖర్చు చేస్తుంది. ఈ ఖర్చు ఇపుడు మరింత పెరిగినట్టయింది. అమరావతి చుట్టూ 96.16 కి.మీల పొడవున అంతరవలయ రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో రాజధానిలో తూర్పు, పశ్చిమ దిక్కుల మధ్య నిర్మిస్తున్న ఇ-ఎక్స్‌ నెంబర్లతో, ఉత్తర-దక్షిణ దిశల మధ్య ఎన్‌-ఎక్స్‌ నెంబర్లతో నిర్మిస్తున్న 35 రహదార్లను అర్ధంతరంగా వదిలేయకుండా వాటిని అంతర వలయరహదారితో అనుసంధానించాలని ప్రతిపాదించడంతో రాజధాని రహదార్ల నిర్మాణ వ్యయం మరింత పెరుగనుంది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం ఆ లెక్కల వివరాలను కూడ పేర్కొంది.
 
ఈ 35 రహదార్లలో 27 రహదార్లను విధిగా అంతర వలయ రహదారితో అనుసంధానించాల్సిందేనని తేల్చారు. కేవలం ఇ-7, ఇ-3ఏ, ఎన్‌-1, ఎన్‌-2, ఎన్‌-3, ఎన్‌-5, ఎన్‌-6 రహదార్లను మాత్రమే ముందుగా అనుకున్న నిడివిలో నిర్మిస్తారు. మిగిలిన 27 రహదార్లను పొడిగిస్తూ అంతరవలయ రహదారికి అనుసంధానిస్తారు. దీంతో 316 కి.మీలుగా వున్న రాజధాని ప్రధాన రహదార్ల నిడివి అదనంగా 91.16కి.మీలు పెరుగాల్సివుంది. అంటే రాజధాని ప్రధాన రహదారి మార్గాల (సీడ్‌, మేజర్‌ ఆర్టీరియల్‌, ఆర్టీరియల్‌, సబ్‌ ఆర్టీరియల్‌) మొత్తం నిడివి 408 కి.మీలకు పెరిగిపోతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా మరో రూ.2600 కోట్లు ఖర్చుకానుంది. ఇది కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే. ఈ రహదార్ల పొడిగింపు నిమిత్తం అదనంగా 1,362 ఎకరాలు అవసరమవుతాయి. ఈ భూములను భూసమీకరణ లేదా భూసేకరణ విధానంలో తీసుకోవల్సివుంటుంది. అంటే నిర్మాణ వ్యయానికి ఈ భూమి ఖర్చు మళ్లీ అదనమన్నమాట! రాజధాని కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు ఆచరణ రూపంలోకి వచ్చేటప్పటికి అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలే నిధుల కొరతను ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి అంతకంతకూ పెరుగుతూ పోతున్న నిర్మాణ వ్యయం అదనపు భారమై మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారుతోంది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...