Jump to content

Amaravati

Recommended Posts

నదీతీరంలో అక్రమ కట్టడాలపై సీఆర్డీఏ కొరడా
01-02-2018 06:26:08

విజయవాడ: నిబంధనలు తుంగలో తొక్కి నకిలీ ప్లాన్లతో కృష్ణా నదీతీరంలో పుట్టగొడుగుల్లా వెలసిన అక్రమ కట్టడాలు, అనధికార లే అవుట్లపై సీఆర్డీఏ అధికారులు బుధవారం కొరడా ఝుళిపించారు. 12 ఎకరాల్లో అనధికార లే అవుట్లలో నిర్మించిన రహదారులు, అనధికార లేఅవుట్‌లో నిర్మించిన ఒక షెడ్డును, ప్లాన్‌ లేకుండా జీ+1 ఇంటి నిర్మాణంలోని మొదటి అంతస్తు పిల్లర్లను తొలగించారు. యనమలకుదురు - పెదపులిపాక కరకట్ట మార్గంలోని చింతల కరకట్ట దిగువన నదీతీరంలో సీఆర్డీఏ జేఏడీ ప్రసాదరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. సర్వే నెంబర్లు 43, 44, 123లోని సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం చేసిన అనధికార లేఅవుట్‌లో రహదారులను ఎక్స్‌కవేటర్‌తో ధ్వంసం చేశారు. అనధికార లే అవుట్‌లో నిర్మించిన షెడ్డును తొలగించారు. ప్లాను లేకుండా నిర్మిస్తున్న (బేస్‌మెంట్‌ లెవల్‌లో ఉన్న) మరో కట్టడాన్ని పూర్తిగా తొలగించారు. సీఆర్డీఏ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీలేఖ, కరుణ, సర్వేయర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 
ఆరుగురికి నోటీసులు అందించాం : శ్రీలేఖ
యనమలకుదురు కరకట్ట దిగువన ప్లాన్లు లేకుండా నూతనంగా ఇంటి నిర్మాణాలు చేపట్టి రంగులు వేసే దశలో ఉన్న ఆరు కట్టడాలను గుర్తించి యజమానులకు నోటీసులను అందించాం. వారం రోజులు గడువు ఇచ్చి మళ్లీనోటీసులిచ్చి నిర్మాణాలు కూల్చివేస్తాం.

Link to comment
Share on other sites

మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 20 ఎకరాల భూమి కేటాయింపు
01-02-2018 06:19:46
విజయవాడ: ఇబ్రహీంపట్నంలో అమరావతి అమెరికన్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 17న జారీచేసిన జీవో నెం.26 మేరకు కేటాయించిన భూమి ఓషేప్‌లో లేకపోవడం తో తాజాగా సంబంధిత సర్వేనెంబర్లలోని 4.22 ఎకరాలు, 5.78, మరో పది ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. సూపర్‌ స్పెషాలిటీ, టీచింగ్‌ ఆస్పత్రులను ఇక్కడ నిర్మించనున్నారు.

Link to comment
Share on other sites

8 hours ago, Dravidict said:

Why are they building temporary High Court and additional buildings for interim Secretariat? Inkoka 1.5 years lo complete avthayi ani cheppevatiki malli ivendhuku

Complete avvavu ....cheyyaleru. akkada loans ku addu padutunnaru Central Pushpams. Loans approve avvanide we can not build capital city.

Link to comment
Share on other sites

Guest Urban Legend

వాళ్ళు "చేయి" ఇచ్చారు 
వీళ్ళు చెవులో "పూవు"పెట్టారు.

Link to comment
Share on other sites

Appataki building structures avipotavi kani, interiors, central air distribution centre, bhayata lake ivanni avvavu, work environment ki ready ga undavu, anduvalla temporary court build chestunnaru. Taravata temporary building ni tribunal ga vadutaru.

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

Appataki building structures avipotavi kani, interiors, central air distribution centre, bhayata lake ivanni avvavu, work environment ki ready ga undavu, anduvalla temporary court build chestunnaru. Taravata temporary building ni tribunal ga vadutaru.

Still waste. Inko year late ayina parledhu. Aa Hyderabad lo ne run cheyyali. Manakenduku bokka

Link to comment
Share on other sites

అమరావతిలో... శాంతిసరోవరం
02-02-2018 06:55:36

 జీవన ప్రమాణాలు పెంచేందుకే..
 బ్రహ్మకుమారీస్‌తోనే అది సాధ్యం
 ఇప్పటికే 140 దేశాల్లో ఆ సంస్థ సేవలు
 యూనివర్సల్‌ పీస్‌ రిట్రీట్‌సెంటర్‌ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు
 
గుంటూరు/తుళ్లూరు, (ఆంధ్రజ్యోతి): నవ్య రాజధాని అమరావతిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు శాంతి సరోవరం దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన రాజధాని అమరావతి పరిధిలోని నెక్కల్లు గ్రామంలో ప్రజాపిత బ్రహ్మా కుమారీస్‌ యూనివరసల్‌ పీస్‌ రిట్రీల్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందని కొనియాడారు. ఈ సంస్థ ప్రపంచ శాంతికోసం పవిత్రమైన సందేశాన్ని ఇస్తూ, 140 దేశాలలో తమ సేవలందిస్తుందన్నారు. అప్పట్లో తాను ఉమ్మడి రాజధాని హైదరాబాదులో 34 ఎకరాల ప్రాంతాన్ని శాంతి సరోవరం కోసం కేటాయించామన్నారు. దాంతో అక్కడ ఓ ఆధ్యాత్మిక కేంద్రం రూపుదిద్దుకొందని కొనియాడారు. ప్రపంచలోనే అత్యుత్తమ బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయాలని వారిని కోరారు.
 
శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ సామజానికి మంచి సందేశానిస్తూ శిక్షణ ఇస్తున్న బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం శుభ సూచికవున్నారు. బ్రాహ్మాకుమారీస్‌ విశ్వవిద్యాలయం చీఫ్‌ రాజయోగిని డాక్టర్‌ జానకీ దాదీజీ ప్రసంగిస్తూ సీఎం ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి పీస్‌రిట్రీట్‌ సెంటర్‌ను సంవత్సరం లోపు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. నేడు ప్రపంచం మొత్తం శాంతిని కోరుకునే పరస్థితిలో ఉందని ప్రపంచం మొత్తం శాంతిని పెంపొందించేందేలా బ్రహ్మాకుమారి సంస్థ చేపట్టటం హార్షనీయమని మంత్రి అయ్యన్న పాత్రుడన్నారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రజలందర్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వా మ్యులయ్యేలా సంస్థ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.మంత్రి నక్కా ఆనందబాబు మాట్లా డుతూ రబోవు కాలంలో ఆధ్యాత్మిక భోదనలు, దీవెనలతో అమరావతి ప్రాంతం శాంతి సామరశ్యాలతో విరజీల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పీ నారాయణ, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, ఫిలిఫ్‌ త్రోచర్‌, కలెక్టర్‌ కోన శశిధర్‌, జడ్పీ ఛైర్‌ పర్సన్‌ జానీమూన్‌, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు ఈడే మూరళీకృష్ణ, బ్రహ్మాకుమారీస్‌ ప్రముఖులు సంతోష్‌ దీదీ, మృత్యుంజయ పాల్గొన్నారు.
 
కేంద్ర విశిష్టతలు....
ఇక్కడ నిర్మించబోతున్న కేంద్రంలో సుమారు 1500 మందికి ఆశ్రయం కల్పించే విఽధంగా పూర్తిగా అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్నారు. 2వేల మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా ఆడిటోరియం, ఆధునిక వసతులతో సెమినార్‌ హాల్‌, మ్యూజియం, లేజర్‌ షో, మెడిటేషన్‌హాల్‌తో పాటు నివాస గృహాల సము దాయంను నిర్మించనున్నారు.

Link to comment
Share on other sites

మెట్రోకు మంగళం!
02-02-2018 09:24:12

బడ్జెట్‌లో కేటాయింపులు ఏవీ ?
విభజన చట్టం హామీకే ఎసరు !
గతంలో కేటాయించిన రూ.300 కోట్లు హుష్‌ !
రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారం
పీపీపీ దిశగా అడుగులు
విజయవాడ(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలో నిర్దేశించిన విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా మంగళం పాడింది. బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన వారికి నిరుత్సాహమే ఎదురైంది. నూతన మెట్రో పాలసీ పేరుతో విభజన హక్కు చట్టం ప్రకారం విజయవాడ కు ఇచ్చిన ‘మెట్రో’ హామీని కూడా ఒకే గాటన కట్టేసింది. గతంలో మూడు బడ్జెట్లలో కేటాయించిన రూ.300 కోట్లను కూడా రద్దు చేసుకోవటం గమనార్హం. విభజన చట్టం ప్రకారం విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు నూరు శాతం నిధులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని సాధారణ మెట్రో ప్రాజెక్టుల తరహాలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యాలతో కొంత, మరికొంత రుణంతోనూ చేపట్టే విధంగా నిర్ణయించటం జరిగింది.
 
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్‌ను తయారు చేసి కేంద్రానికి పంపించిన తర్వాత దానికి ఆమోదముద్ర వేయనేలేదు. మౌఖికంగా ముందుకు వెళ్లమని చెబుతూ వస్తున్న కేంద్రం బడ్జెట్‌లో మాత్రం ప్రతి ఏటా రూ.100 కోట్ల చొప్పున మొక్కుబడిగా కేటాయింపులు చేస్తోంది. నూతన మెట్రో పాలసీ ప్రకారం పీపీపీ పద్ధతిలోనే కేంద్రం పెద్దపీట వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా విజయవాడ మెట్రో ప్రాజెక్టును ప్రత్యేకంగా పరిగణించాల్సిన కేంద్రం ఇతర నగరాల మెట్రో ప్రాజెక్టులగానే పరిగణించడం గమనార్హం. నూతన మెట్రో పాలసీ ప్రకారం.. గతంలో విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కేటాయించిన రూ.300 కోట్లు కూడా రద్దయ్యాయి. ప్రత్యేక హోదాలో భాగంగా మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు భరించాల్సి ఉంది. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తామని కేంద్రం చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ కింద ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల కింద విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకునే ప్రాజెక్టులు కాదు.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన క్రమంలో కూడా విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు నూరు శాతం లబ్ధి కలిగే అవకాశం ఉంది.
 
మెట్రో ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 60 శాతం నిధులను విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంటున్న నేపథ్యంలో, వీటిని కూడా కేంద్రం భరించాల్సి ఉంటుంది. నూతన మెట్రో పాలసీ రావటంతో ప్రత్యేక ప్యాకేజీ ప్రయోజనాలను కూడా మెట్రో ప్రాజెక్టు అందుకోలేని పరిస్తితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా చూస్తే.. ఢిల్లీ 118 కిలోమీటర్లు, చెన్నై 115 కిలోమీటర్లు, బెంగళూరు 12.8 కిలోమీటర్లు, అహ్మదాబాద్‌ 6.3 కిలోమీటర్లు, నాగపూర్‌ 11.7 కిలోమీటర్లు, నోయిడా 29.7 కిలోమీటర్లు చొప్పున మొత్తంగా అదనంగా 190 కిలోమీటర్ల కారిడార్‌ నిడివి పొడిగించటానికి 15 వేల కోట్లను కేటాయించింది. విజయవాడ మెట్రోకు సంబంధించి ఊసేలేదు. గత మూడేళ్ళుగా మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వటానికి జరుగుతున్న తాత్సారం ఒక వైపు... వేలాది కోట్ల రూపాయలను సొంతంగా భరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవటంతో ప్రత్యామ్నాయ రవాణా విధానాలను ఆలోచించి చివరికి లైట్‌ మెట్రో ప్రాజెక్టును ఇన్పోవేటివ్‌ పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది.

రాజధానికి గుండు సున్నా
02-02-2018 07:00:39

బడ్జెట్‌లో కేటాయింపులు నిల్‌
 ‘మెట్రో’ మాటే లేదు 
 అమరావతికి రైౖల్వే ట్రాక్‌ ఊసే లేదు
 సర్క్యూట్‌ రైళ్లు ఎటుపోయాయో...
 ఎయిర్‌పోర్టు శాశ్వత టెర్మినల్‌కు విదల్చని నిధులు
 
విజయవాడ, (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో రాజధానికి ఆర్ధిక మంత్రి జైట్లీ మొండిచెయ్యి చూపారు. క్యాపిటల్‌ నిర్మాణానికి కూడా బడ్జెట్‌లో నయాపైసా కేటాయించలేదు. విజయవాడ డివిజన్‌, గుంటూరు డివిజన్లలో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కాని, కొత్త లైన్లకుకాని ఒక్క రూపాయి విదల్చలేదు. కేంద్ర బడ్జెట్‌ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పూర్తి నిరాశే మిగిల్చింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేంద్రమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన నాలుగవ బడ్జెట్‌ ఇది. 2019 మే లోగా ఎన్నికలు కూడా జరగాల్సి ఉండటంతో ప్రజలు ఈ బడ్జెట్‌ మీద ఎన్నో ఆశలతో ఉన్నారు. అమరావతిలో ప్రస్తుతం మొదలు పెట్టిన భవనాలకు వేల కోట్లు కావలసి ఉంది. పెట్టవలసిన ఖర్చు వేల కోట్లలో ఉండగా బడ్జెట్‌లో అసలు నిధుల ఊసే లేకపోవడం అధికార రాజకీయ పార్టీల నాయకులను కూడా ఉసూ రుమనిపించింది. ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కళాశాల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. కాంగ్రెస్‌ హయాంలో ఈ కళాశాలకు 100 కోట్లు కేటాయించారు.ఇది జరిగి అయిదేళ్లు అవుతున్నా ఇంత వరకు అందులో సగం కూడా మంజూరు కాలేదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాలలో 95 కిలో మీటర్ల మేరకు మెట్రోల పొడిగింపు కోసం 17 వేల కోట్లు కేటాయించిన కేంద్రం బెజవాడను పూర్తిగా పక్కన పెట్టింది. అమరావతి మీదుగా విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలను కలుపుతూ సర్క్యూట్‌ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఏమైందో తెలియదు. అమరావతికి కొత్తగా రైల్వే ట్రాక్‌ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు టోకెన్‌ నిధులు కూడా మంజూరు చేయలేదు.
 
              బిటెక్‌ విద్యార్ధులకు పిహెచ్‌డి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. పంటలకు గిట్టుబాటు ధరలు లేక దుఃఖిస్తున్న రైతులకు మాత్రం బడ్జెట్‌లో కొంత ఊరట కలిగించారు. పంటకు అయ్యే పెట్టుబడి మీద కనీసం ఒకటిన్నర రెట్లు అదనపు ఆదాయం కూడా కనీస మద్దతు ధర ఉండేందుకు కేంద్రం ప్రకటించిన పధకం మంచి పరిణామమని రైతులు భావిస్తున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు పెంచుతారని ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై కేంద్ర మంత్రి నీళ్లు చల్లారని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే కొంతలో కొంత సీనియర్‌ సిటిజన్లకు ఆదా యపన్ను చెల్లింపులలో ఇచ్చిన మినహా యింపులు ఆ వర్గాలలో ఆనందాన్ని నింపాయి.
 
                 పోస్టాఫీసులు, బ్యాంకులలో డిపాజిట్లు వేసే సీనియర్‌ సిటిజన్లకు వాటి ద్వారా వచ్చే వడ్డీలపై పన్ను మినహాయింపును 10 వేల నుంచి 50 వేలకు పెంచటం మంచి పరిణామమని వయోధిక పౌరుల సంఘ నాయకులు అంటున్నారు. అదే విధంగా వృద్ధులకు అయ్యే మెడికల్‌ ఖర్చుల మీద పన్నుల మినహాయింపును కూడా 10 వేల నుంచి 50 వేలకు పెంచటాన్ని స్వాగతిస్తున్నారు. ఇక ఆరోగ్య భీమాకు చెల్లించే ప్రీమియంల మీద ఉన్న పన్ను మినహాయింపు 30 వేల నుంచి 50 వేలకు పెంచారు. దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ పెట్టుబడులపై లక్షకు పది శాతం చొప్పున పన్ను విధించటం రియల్‌ ఎస్టేట్‌ను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. స్వయం సహాయక సంఘాలకు కేంద్రం ఏటా ఇచ్చే రుణాలను 42,500 కోట్లను 75 వేల కోట్లకు పెంచడం వల్ల ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలలోని గ్రూపులకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి రూ.
 
               700 కోట్లతో ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపారు. ఈ బడ్జెట్‌లో దీనికి సంబంధించి కేటాయింపులు చేస్తారని భావిస్తే కనీస ప్రస్తావన లేకపోవటం గమనార్హం. సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వర్గాలకు సంబంధించి కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 నుంచి 25 శాతానికి తగ్గించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా.. మిగిలిన ప్రోత్సాహకాలు లేకపోవటంతో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. వైజాగ్‌ - చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ (వీసీఐసీ) లో భాగంగా... గన్నవరం, కంకిపాడు ఇండస్ర్టియల్‌ నోడ్లు ఉన్నాయి. వీసీఐసీలో ఏమైనా కేటాయింపులు చేస్తారని ఆశించిన పారిశ్రామిక వర్గాలకు కూడా నిరుత్సాహమే ఎదురైంది.

Link to comment
Share on other sites

రాజధానిలో శాంతి కేంద్రం 
బ్రహ్మకుమారీలు ఉన్నచోట శాంతి.. సౌభాగ్యం 
amr-top2a.jpg
తుళ్ళూరు,న్యూస్‌టుడే: రాజధాని అమరావతి గడ్డపై రాజయోగిని డా.దాదీ జానకి కాలుమోపడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం నెక్కల్లు సమీపంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారీ సంస్థ యూనివర్సల్‌ పీస్‌ రిట్రీట్‌ పేరుతో నిర్మిస్తున్న విశ్వశాంతి కేంద్రానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వశాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు దాదాజీ ఆశీస్సులు అందించినందుకు మనం ఆమెను అభినందించాలని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం బ్రహ్మకుమారీలతో  ప్రకాశించనుందని చెప్పారు. ఇటువంటి పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం తనకు లభించడం, రాజధాని అమరావతి ఇందుకు వేదిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. బ్రహ్మకుమారీలు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, సౌభాగ్యాలకు నిలయంగా ఉంటుందని తెలిపారు. బ్రహ్మకుమారీల ముఖ్య అధినేత్రి  డా.దాదీ జానకి మాట్లాడుతూ భగవంతుడే పరమాత్మ అని మనం ‘ఆత్మ’ అని చెప్పారు. రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన విశ్వశాంతి రిట్రీట్‌ సెంటర్‌ ఏడాది కాలంలో పూర్తవుతుందని వచ్చే ఏడాది ఇక్కడ నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అన్నారు. సంకల్పం, శ్వాస మా అన్నయ్య చంద్రబాబునాయుడు నాకు కలిగిస్తున్నారని, ముఖ్యమంత్రి పరమాత్మ పిల్లవాడని అందుకే పరమాత్ముడి పాత్ర పోషించాలని కోరారు. ముఖ్యమంత్రి మనస్సు చాలా శుద్ధంగా ఉందని అన్నారు.  శాసనసభ సభాపతి డా.కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్థలంలో శాంతిసరోవరం నిర్మించి ఒక ఆధ్యాత్మికతను బ్రహ్మకుమారీలు సృష్టించారన్నారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రజల్లో ఓం శాంతి కార్యక్రమాన్ని అమలుచేయడంలో బ్రహ్మకుమారీలు తమవంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పౌరసరఫరాల శాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రజల ఆనందం కోసం, సమాజ శాంతికోసం బ్రహ్మకుమారీలు అనుసరిస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని కోరారు. పురపాలకశాఖమంత్రి డా.పి.నారాయణ, సాంఘికసంక్షేమ శాఖ మంత్రి నాక్కా ఆనందబాబు మాట్లాడుతూ ప్రజలకు శాంతిచేకూర్చే బ్రహ్మకుమారీలు  నేటి సమాజానికి అవసరమని అన్నారు.  బ్రహ్మకుమారీల కేంద్రం మౌంట్‌అబూ ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి రాజయోగి బీకే మృత్యుంజయ, రాజయోగిని బీకే సంతోష్‌బెహన్‌,  బీకే కుల్‌దీప్‌, బీకే సవితా, బీకే శాంత, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జీవీ ఆంజనేయులు, అడిషనల్‌ పోలీసు కమిషనర్‌ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

నీరుకొండ వద్ద 108 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం 
నాలుగు ఆకృతులను పరిశీలించిన ముఖ్యమంత్రి 
తుది మెరుగులు దిద్దాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: రాజధానిలో 108 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నీరుకొండ వద్ద ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నాలుగు ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పరిశీలించారు. వాటికి మరింత మెరుగులు దిద్ది వచ్చే మంత్రివర్గం నాటికి ఆకృతులు సిద్ధం చేయాలని ఆదేశించారు. తొలుత కృష్ణా నది ఒడ్డున కోర్‌ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. తాజాగా ఆ ప్రాంతాన్ని మార్చి నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని తీర్మానించారు. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉంటుంది. ఈ కొండపైనే ఎన్టీఆర్‌ స్మారక కేంద్రం, కన్వెన్షన్‌ కేంద్రాలు, గ్రంథాలయం, ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాల ఉంటాయి.

Link to comment
Share on other sites

అమరావతిలో.. కంటైనర్‌ హోటల్స్‌!
04-02-2018 05:24:55

హ్యాపీ సిటీ సదస్సులో పాల్గొనే అతిథులకు
తొలుత భవానీద్వీపంలో 100 గదులతో ఏర్పాటు
అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): అమరావతికి వచ్చే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఏపీసీ ఆర్డీయే ఒక వినూత్న యోచన చేస్తోంది. రాజధానిలో శాశ్వత ప్రాతిపదికన హోటళ్ల స్థాపనకు కనీసం 3-5 ఏళ్లు పట్టే అవకాశమున్నందున.. ఆతిథ్యానికి ఇబ్బంది రాకుండా స్వల్ప వ్యవధిలో, తక్కువ నిర్మాణ వ్యయంతో ఏర్పాటు చేసేందుకు వీలున్న కంటైనర్‌ హోటళ్ల స్థాపనకు ప్రతిపాదించింది. దీనిని ఇటీవల జరిగిన సీఆర్డీయే సమీక్షా సమావేశంలో కమిషనర్‌ శ్రీధర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలపగా... ఆయన ఆమోదించారు. విజయవాడకు సమీపంలోని భవానీద్వీపంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 10-12 తేదీల్లో నిర్వహించే సంతోష నగరాల సదస్సుకు హాజరయ్యే జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ఇలాంటి 100 గదులను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అనంతరం మరిన్ని కంటైనర్‌ హోటళ్ల స్థాపనపై ముందుకు వెళ్దామని సీఎం చెప్పారు.
 
షిప్‌ కంటైనర్లే గదులు!
సముద్ర రవాణాకు ఉపయోగించే షిప్‌ కంటైనర్లను సకల వసతులతో కూడిన అధునాతన హోటల్‌ గదులుగా మార్చి, వాడుకునే ప్రక్రియ మనకు కొత్తయినప్పటికీ పలు విదేశాల్లో కొంతకాలంగా ప్రాచుర్యం పొందింది. కంటైనర్‌ హోటళ్లను కేవలం 3 మాసాల్లోనే ఏర్పాటు చేసేయొచ్చు! ఖర్చు చాలా తక్కువ. ఇప్పటికే ముంద్రా సెజ్‌లో ఇలాంటి దాన్ని నెలకొల్పారు. వీటి నిర్మాణంలో కాలుష్యపరమైన సమస్యలు తలెత్తవు. ఈ తాత్కాలిక హోటళ్లను అవసరమై నంత కాలం ఉంచి, తర్వాత వేరొక చోటకు సులభంగా తరలించవచ్చు.

Link to comment
Share on other sites

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సాధ్యాసాధ్యాల పరిశీలన
04-02-2018 07:08:21

అమరావతి: రాజధాని అమరావతి నగరాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలతో అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐ.ఆర్‌.ఆర్‌) మార్గాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి సంబంధిత అధికారులతో కలసి శనివారం నాడు పరిశీలించారు. గుంటూరు జిల్లాలోని కాజ వద్ద మొదలై అమరావతి, (కృష్ణా జిల్లాలోని) కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు తదితర ప్రదేశాల మీదుగా తిరిగి కాజను చేరే ఈ భారీ రహదారి నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై ఆమె అధికారులతో చర్చించారు. ఈ రోడ్డు సాగనున్న వివిధ ప్రదేశాల వద్ద దాని మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 50 కిలోమీటర్ల మేర పర్యటించిన అనంతరం ఇంతటి బృహత్తర రహదారిని రాజధాని ప్రాంత మాస్టర్‌ ప్లాన్‌ పరిధిలో చేర్చితే బాగుంటుందని లక్ష్మీ పార్థసారధి అభిప్రాయపడ్డారు. ఈ రహదారి నిర్మాణాంశాలపై చర్చించేందుకు త్వరలోనే వివిధ శాఖల అధికారులతో సమావేశమవనున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో ఏడీసీ భూవ్యవహారాల సంచాలకుడు బి.రామయ్య, ఏపీసీఆర్డీయే ట్రాఫిక్‌ మరియు రవాణా విభాగం ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

30 ఎకరాల్లో హెల్త్‌ స్ట్రీట్‌! 
అమరావతిలో వైద్య సేవలన్నీ  ఒకే చోట పొందే సదుపాయం
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో నివసించే ప్రజలకు వైద్య సేవలన్నీ ఒకే ప్రాంతంలో, అందుబాటు ధరల్లో అందజేయాలన్న ఉద్దేశంతో ‘అమరావతి హెల్త్‌ స్ట్రీట్‌’ పేరుతో ఒక ప్రాజెక్టుకి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రూపకల్పన చేసింది. రాజధానిలో సుమారు 30 ఎకరాల్లో ఇది ఏర్పాటవుతుంది. ఈ 30 ఎకరాల్ని వివిధ పరిమాణాలు గల స్థలాలుగా విభజించి ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సేవా కేంద్రాలకు కేటాయిస్తారు. టెండరు-వేలం విధానంలో ప్లాట్ల కేటాయింపు ఉటుంది. ఇన్‌పేషెంట్‌, అవుట్‌ పేషెంట్‌ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు, ఆసుపత్రులతో పాటు, రోగ నిర్ధరణ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, రెస్టారెంట్లు వంటివి ఈ హెల్త్‌స్ట్రీట్‌లో ఏర్పాటవుతాయి.
14 సైజుల్లో స్థలాలు! 
హెల్త్‌స్ట్రీట్‌ కోసం కేటాయించిన 30 ఎకరాల్ని 14 రకాల పరిమాణాల్లో ప్లాట్లుగా విభజిస్తారు. వీటిలో 269 చదరపు గజాల నుంచి మొదలై 1602 చదరపు గజాల వైశాల్యం వరకు స్థలాలు ఉంటాయి. 269 చదరపు గజాల వైశాల్యంగల స్థలాలు 40, 598 చదరపు గజాల వైశాల్యంగల స్థలాలు 41, 1,435 చదరపు గజాల వైశాల్యం గల స్థలాలు 10 ఉంటాయి. మిగతా వైశాల్యంగల స్థలాలన్నీ ఒకటి రెండు మాత్రం ఉంటాయి. 269 చదరపు గజాల స్థలంలో జీ+2, 517, 591 చదరపు గజాల స్థలాల్లో జీ+4 వరకు, మిగతా అన్ని కేటగిరీల స్థలాల్లో జీ+5 వరకు నిర్మాణాలకు అనుమతిస్తారు.
అర్హతలివీ! 
వైద్యులు వ్యక్తిగతంగాను, ఇద్దరు, ముగ్గురు కలసి కన్సార్టియంగాను ఏర్పడి స్థలాలు తీసుకోవచ్చు. హెల్త్‌స్ట్రీట్‌లో స్థలం వైశాల్యాన్ని బట్టి, సీఆర్‌డీఏ ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయించింది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకునే వైద్యులకైతే ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నెట్‌వర్త్‌ ఉండాలి. కన్సార్టియంగా ఏర్పడినట్లైతే దానిలోని సభ్యులందరి నెట్‌వర్త్‌ కలసి ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం ఉండాలి. సొసైటీలు, ట్రస్ట్‌లు, స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలైతే.. కనీసం 20 పడకల ఆసుపత్రిని ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న అనుభవం ఉండాలి.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...