Jump to content

Amaravati


Recommended Posts

థీమ్‌సిటీలు, టౌన్‌షిప్పులు వీటి తర్వాతే...
ఇతరాలు ఎన్ని ఉన్నా... ఇవి వస్తేనే అభివృద్ధి
 రాజధాని గ్రామాల రైతుల అభిలాష
 కంపెనీల స్థాపనపై సీఆర్డీఏకు అభ్యర్థనలు
అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన గ్రామాల్లో అత్యధికం తమకు చేరువలో ఐటీ సంస్థలు రావాలని కోరుకుంటున్నాయి! ఇతర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఎన్నున్నా వాటికి అదనంగా ఇవీ వస్తేనే తమ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల వారు తమకు సమీపంలో ఐటీ కంపెనీల స్థాపనకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీసీఆర్డీఏను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించగా తాజాగా మరికొన్ని ఊళ్లు కూడా ఈ జాబితాలో చేరుతున్నాయి! ఇప్పటివరకూ సీఆర్డీఏ ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ దక్కని గ్రామాల వారు ఈ విషయంలో తమ గళాన్ని మరింత గట్టిగా వినిపిస్తుండగా, ఇప్పటికే కొన్ని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు రాబోతున్న గ్రామాలు సైతం ఈ జాబితాలో ఉండటం విశేషం! రాజధాని నగరంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా, సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సీఆర్డీఏ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించింది. అమరావతి చుట్టూ అన్ని గ్రామాలూ కవరయ్యేలా 9థీమ్‌ సిటీలు, 27 అధునాతన టౌన్‌షి్‌పలను అందులో ప్రతిపాదించారు. పరిపాలన, న్యాయ, విజ్ఞాన, పర్యాటక, క్రీడలు, మీడియా, హెల్త్‌ తదితర రంగాలకు నెలవులుగా ఆయా థీమ్‌ సిటీలను తీర్చిదిద్దాలని నిర్ణయించి, ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ విద్య, వైద్యసంస్థలు, హెచ్‌సీఎల్‌ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు వివిధ గ్రామాలకు వచ్చాయి. మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. ఈ కృషిని మరింత ముమ్మరంగా కొనసాగించి, పలు రంగాల్లో పేరొందిన ప్రముఖ కంపెనీలు, ఇనిస్టిట్యూషన్లను ప్రపంచం నలుమూలల నుంచి రాజధానికి రప్పించి, వాటితో థీమ్‌ సిటీలను రూపొందించాలని, వాటి ఆసరాగా రాజఽధానిలోని అన్ని గ్రామాలనూ ప్రగతి పథంలో పరుగులు తీయించాలని సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది.
 
ఐటీ రంగమే ప్రగతికి చుక్కాని!
ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చి, తాము అభివృద్ధి చెందేందుకు దీర్ఘకాలం పడుతుందని వివిధ గ్రామాలకు చెందిన రైతులు అంటున్నారు. సత్వరమే ఏర్పాటై, శీఘ్రంగా ఫలితాలనిచ్చే ఐటీ కంపెనీలను తమ గ్రామాల్లో స్థాపించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. తమ వాదనకు మద్దతుగా చంద్రబాబు కృషితో ఏర్పాటై, హైదరాబాద్‌ దశనే మార్చిన సైబరాబాద్‌ను వారు ఉటంకిస్తున్నారు. రాజధానికి ఓ చివరన ఉండి, ఇంతవరకూ ఒక్క ప్రాజెక్టు కూడా పొందని నెక్కల్లు, అనంతవరం వంటి గ్రామాలు ఐటీ పరిశ్రమల స్థాపనతోనైనా తమను ఒడ్డున పడవేయాలని గట్టిగా కోరుతున్నాయి. ఈ విషయమై మంత్రి నారా లోకేశ్‌తో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులకూ ఈ గ్రామాల రైతులు వినతిపత్రాలు సమర్పించడంతో పాటే పరిశీలిస్తామన్న హామీలూ పొందారు. నిడమర్రు, ఎర్రబాలెం తదితర గ్రామాలూ ఇదే బాటలో పయనిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక ‘మైస్‌’ వంటి ప్రాజెక్టు ఏర్పాటు కాబోతున్న వెంకటపాలెం రైతులు సైతం తమకూ ఐటీ కంపెనీలు కావాలని కోరుతుండటం విశేషం.

Link to comment
Share on other sites

అమరావతిలో ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌..!
26-12-2017 07:14:01

అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు గ్రామానికి నైరుతి వైపున స్టేట్‌ లెవెల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ ఏర్పాటు కానున్నది. ఈ నెల 28 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ల్యాబ్‌కు మూడు ఎకరాలను సీఆర్‌డీఏ కేటాయించింది. జిల్లాకు ఒకటి చొప్పున రీజనల్‌ సైన్స్‌ ల్యాబరేటరీలుంటాయి. ఉమ్మడి రాష్ట్రానికి సంభందించి స్టేట్‌ లెవల్‌ లాబ్‌రేటరీ ప్రస్తుతం హైద్రాబాద్‌ ఉంది. రాజధాని అమరావతిలో స్టేట్‌ లెవల్‌ ల్యాబ్‌ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించటంతో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నేరపరిశోధనలో ఈ సైన్స్‌ ల్యాబరేటరీ నివేదికలే కీలకం. వాటి ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించి నేర నిర్థారణ చేస్తారు. డీఎన్‌ఏ టెస్ట్‌లు కూడా ఈ ల్యాబ్‌లో జరుగుతాయి. రాజధానిలో అంతటి ప్రతిష్ఠాత్మకమైన ల్యాబ్‌ ఏర్పాటు కాబోతుండటం సంతోషంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. తుళ్లూరు పరిసరాలలో ఏదో ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రికి రైతులు విన్నవించారు. రైతుల వినతిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ల్యాబ్‌ ఏర్పాటు చేయటానికి నిర్ణయించినట్టు సమాచారం. సోమవారం సీఐడీ పోలీస్‌ అధికారులు, సీఆర్‌డీఏ అధికారులు సోమవారం శంకుస్థాపన చేయబోయే ప్రదేశాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి రావటానికి హెలీప్యాడ్‌ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Link to comment
Share on other sites

హోం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు
వందేళ్ల సదస్సు అమరావతిలో..!
26-12-2017 04:47:48

రేపు ప్రారంభించనున్న రాష్ట్రపతి కోవింద్‌, సీఎం
హాజరుకానున్న సుప్రసిద్ధ ఆర్థికవేత్తలు
 2500 మంది దేశవిదేశీ ప్రతినిధుల రాక
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): భారతీయ ఆర్థిక సంఘం తన వందో వార్షిక సదస్సును నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్వహించనుంది. బుధవారం నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు ఉద్దండులైన ఆర్థికవేత్తలంతా హాజరు కానున్నారు. 99వ వార్షిక సదస్సు కూడా గత ఏడాది తిరుపతిలోనే జరిగింది. మళ్లీ రెండోసారి వరుసగా జరుపుతామని సీఎం చంద్రబాబు ఆసక్తి ప్రదర్శించి, అందరితో ముందుగా మాట్లాడటంతో ఇక్కడ నిర్వహించేందుకు అంగీకరించారు. ఒకే రాష్ట్రంలో వరుసగా రెండోసారి ఈ సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సును ప్రారంభిస్తారు. దీనికోసం నాగార్జున విశ్వవిద్యాలయం బయట ప్రత్యేక వేదిక, ఏర్పాట్లు చేశారు.
 
నూతన రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగం నుంచి మౌలిక సదుపాయాల వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, జరగాల్సిందేంటి? ఏ మార్గంలో వెళ్లాలన్న దానిపై చర్చించేందుకు ఈ సదస్సులో ప్రత్యేక సెషన్‌ ఏర్పాటు చేశారు. దీనికోసం 70 ప్రజంటేషన్‌ పత్రాలు వచ్చాయి. ఇందులో అత్యధి కం రాష్ట్రంలోని ఆర్థికవేత్తల నుంచి రాగా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా కొన్ని ఆలోచనలొచ్చాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఏం చేయా లన్నదానిపై ఆర్థికవేత్తలు ఈ నివేదికల్లో తమ ఆలోచనలను పొందుపర్చారు. వీటిని ఢిల్లీలోని భారతీయ ఆర్థిక సంఘం కార్యాలయానికి పంపించారు. ఇందులో 42 ప్రజంటేషన్లను ఆర్థికవేత్తల కమిటీ ఎంపిక చేసింది. వాటిని పంపిం చినవారు ప్రత్యేక సెషన్‌లో ప్రజెంట్‌ చేస్తారు.
 
మన్మోహన్‌ నుంచి అహ్లువాలియా వరకు ప్రసిద్ధ ఆర్థికవేత్తలతో ఈ సంఘం ప్రారంభమైంది. సి.జె.హామిల్టన్‌ కన్వీనర్‌గా 1917లో తొలి వార్షిక సదస్సు కోల్‌కతాలో జరిగింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, నగరాల్లో ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. డిల్లీ, ముంబై, చెన్నై బెంగళూరు, అహ్మదాబాద్‌, పుణె, సూరత్‌, భువనేశ్వర్‌, హైదరాబాద్‌ తదితర చోట్ల ఈ సదస్సు నిర్వహించారు. ఆయా నగరాల్లో ఒకసారి జరిగాక మళ్లీ కొన్నేళ్ల తర్వాత రెండోసారి, మూడోసారి కూడా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1981లో తిరుపతిలో, 1991లో అనంతపురంలో ఈ సదస్సు జరిగింది. గత ఏడాది తిరుపతిలో జరగ్గా.. మళ్లీ ఇప్పుడు అమరావతిలో జరగనుంది. ఈ సదస్సులో దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక స్థితిగతులపై చర్చ జరుగుతుంది. దీంతోపాటు రాష్ట్ర పరిస్థితిపై ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు. నోట్లరద్దు అనంతర ఆర్థిక పరిస్థితి నుంచి జీఎస్‌టీ ప్రారంభమయ్యాక పరిస్థితి ఏంటన్న దానిపైనా చర్చిస్తారు. ఉద్దండులైన ఆర్థికవేత్తలు, అంతర్జాతీయంగా పేరొందిన సుప్రసిద్ధ ఆర్థిక నిపుణులు, రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్లు... ఇలా ఆర్థికరంగంలో నిష్ణాతులైనవారంతా ఈ సదస్సుకు హాజరవుతారు.
 
దేశంలోని ప్రసిద్ధ ఆర్థికవేత్తలంతా ఐఈఏలో సభ్యులుగా ఉన్నవారే. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా కూడా వీరిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఘం కన్వీనర్‌గా ఏపీ మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్లు సహా మొత్తం 1600 మంది ప్రతినిధులు రానున్నారు. వీరికితోడు రాష్ట్రంలోని ఆర్థికవేత్తలను కూడా కలిపి 2,500 మంది వరకు ఉంటారని అంచనా. బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత మహ్మద్‌ యూనస్‌ కూడా హాజరవనున్నారు.
 
ఐదు అంశాలపై చర్చ
భారతీయ ఆర్థిక సంఘం సదస్సులో మొత్తం ఐదు అంశాలపై లోతైన చర్చ జరగనుంది. ఒక్కో అంశంలోను మళ్లీ ఉప అంశాలుంటాయి. భారతదేశ అభివృద్ధి, వేగం, దిశ అన్నదానిలో గత ఏడు దశాబ్దాలుగా జరిగిన ఆర్థికాభివృద్ధి తీరు, ఆర్థిక, సామాజిక విధానాల పునరావలోకనం తదితరాలు ఉంటాయి. అభివృద్ధి ప్రక్రియలో ఆర్థిక అంశాలు అన్నదానిపై చర్చలో సుస్థిర అభివృద్ధి కోసం అనుసరించాల్సిన ఆర్థిక విధానాల నుంచి, జీఎస్‌టీ వరకు చర్చిస్తారు. భారత్‌-ఇతర ప్రపంచం అన్న అంశంపై చర్చలో భాగంగా... భారతీయ ఎగుమతులు, అంతర్జాతీయంగా భారత్‌ పరిస్థితి తదితర అంశాలపై చర్చిస్తారు. నాలుగో అంశంగా అభివృద్ధి ఫలాల పంపిణీ ఎలా ఉంది? సమస్యలేంటి? అన్న అంశాలపై, ఐదో అంశంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అభివృద్ధి తీరుపై లోతుగా విశ్లేషణ చేస్తారు. చివరిరోజున రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక సెషన్‌ ఉంటుంది.

Link to comment
Share on other sites

28న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు భూమి పూజ
తుళ్ళూరు,న్యూస్‌టుడే: అమరావతి పరిధిలోని తుళ్ళూరులో నిర్మించబోయే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ భవన నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 28న భూమి పూజ చేస్తారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో ల్యాబ్‌ నిర్మించనున్నారు.

Link to comment
Share on other sites

28న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు భూమి పూజ
తుళ్ళూరు,న్యూస్‌టుడే: అమరావతి పరిధిలోని తుళ్ళూరులో నిర్మించబోయే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ భవన నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 28న భూమి పూజ చేస్తారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో ల్యాబ్‌ నిర్మించనున్నారు.

Link to comment
Share on other sites

 

తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాజధాని పరిధిలోని అనంతవరం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో 5,167 ఎకరాల్లో మీడియా సిటీని సిద్ధం చేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో ఇప్పటికే చర్చలు జరిపిన ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆకర్షించాలని యోచిస్తోంది.

ప్రతిపాదిత స్థలంలో 20-30 ఎకరాల్లో స్టూడియో నిర్మించనుంది. స్టూడియో నిర్మాణానికి ముందుకొచ్చే వారికి ఎకరం 50 లక్షల నామమాత్రపు ధరతో భూములు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ నిర్మించే సినిమాలకు ప్రొడక్షన్ ఖర్చులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించడంతో పాటు నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అలాగే సినిమాలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది.

అమరావతిలో ప్రారంభించే న్యూస్ చానళ్లకు కూడా నామమాత్రపు ధరకే భూములు కేటాయించనుంది. తొలి దశలో రాజధానికి మీడియా హౌస్‌లను రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రెండో దశలో అంటే 2021 నుంచి 2036 మధ్య అంతర్జాతీయ స్థాయిలో చలన చిత్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఓ స్టూడియోను నిర్మించనున్నట్టు సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మేరకు ఇప్పటికే తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుండగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, సుభాష్ ఘయ్‌లతో స్టూడియో నిర్మాణంపై చర్చలు జరిపింది. ఈ చర్చలన్నీ కార్యరూపం దాలిస్తే ఏపీలో సరికొత్త రంగులు వెలిసినట్టే.

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

 

తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాజధాని పరిధిలోని అనంతవరం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో 5,167 ఎకరాల్లో మీడియా సిటీని సిద్ధం చేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో ఇప్పటికే చర్చలు జరిపిన ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆకర్షించాలని యోచిస్తోంది.

ప్రతిపాదిత స్థలంలో 20-30 ఎకరాల్లో స్టూడియో నిర్మించనుంది. స్టూడియో నిర్మాణానికి ముందుకొచ్చే వారికి ఎకరం 50 లక్షల నామమాత్రపు ధరతో భూములు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ నిర్మించే సినిమాలకు ప్రొడక్షన్ ఖర్చులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించడంతో పాటు నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అలాగే సినిమాలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది.

అమరావతిలో ప్రారంభించే న్యూస్ చానళ్లకు కూడా నామమాత్రపు ధరకే భూములు కేటాయించనుంది. తొలి దశలో రాజధానికి మీడియా హౌస్‌లను రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రెండో దశలో అంటే 2021 నుంచి 2036 మధ్య అంతర్జాతీయ స్థాయిలో చలన చిత్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఓ స్టూడియోను నిర్మించనున్నట్టు సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మేరకు ఇప్పటికే తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుండగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, సుభాష్ ఘయ్‌లతో స్టూడియో నిర్మాణంపై చర్చలు జరిపింది. ఈ చర్చలన్నీ కార్యరూపం దాలిస్తే ఏపీలో సరికొత్త రంగులు వెలిసినట్టే.

 Bollywood olu better tollywood kante 

Link to comment
Share on other sites

తెలుగు సినీ పరిశ్రమను రాజధాని అమరావతికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సినిమాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి ఆకర్షించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అమరావతి రాజధాని నగర పరిధిలోని అనంతవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని 5,167 ఎకరాల్లో మీడియా సిటీని ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.


 


మీడియా నగరంలో సినీ - టెలివిజన్‌ పరిశ్రమ, నిమేషన్ ‌- వీఎఫ్‌ఎక్స్ ‌- గేమింగ్, డిజిటల్‌ యాడ్‌ - సోషల్‌ మీడియా, టెలికం రంగాలను ప్రోత్సహించనుంది. అమరావతిలో20 నుంచి 30 ఎకరాల్లో స్టూడియో నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీన్ని ఏర్పాటు చేసే సంస్థలకు నామమాత్రపు ధర (ఎకరం రూ. 50లక్షలు)కు భూములిస్తామని ప్రకటించింది. ఇక్కడ సినిమాను నిర్మిస్తే ప్రొడక్షన్‌ ఖర్చులో కొంత మొత్తాన్ని రీయింబర్స్‌ చేయడం, నగదు ప్రోత్సా హకాలు ఇవ్వడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. సినిమాలకు సింగిల్‌ విండో అనుమతులిచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. అమరావతిలో ప్రారంభించే తెలుగు న్యూస్‌ చానళ్లకు తక్కువ ధరకే భూములివ్వాలని నిర్ణయించింది.

అయితే చంద్రబాబు ప్రయత్నానికి ఎంత మంది సినీ పెద్దలు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతం వారే ఉన్నారు... కాని వీరు అందరూ హైదరాబాద్ లో స్థిరపడి పోయారు... వీరికి అమరావతి అంటే అంత ప్రేమ లేదు అనే విషయం వివిధ సందర్భాల్లో రుజువైంది... మరి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలకి వారు ఎలా స్పందిస్తారో చూడాలి... మరో పక్క న్యూస్‌ చానళ్లకు కూడా ఇదే పరిస్థితి ఉంది.. ఇప్పటికే స్టూడియో ఏర్పాటుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్, బాలీవుడ్‌ ప్రముఖుడు సుభాష్‌ ఘయ్‌లను ఆహ్వానించి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మరి మన టాలీవుడ్ నుంచి మొదటి ఎవరు వస్తారో చూడాలి...

Edited by sonykongara
Link to comment
Share on other sites

illani rannivakunda unte better.....It's ok to loose that few hundred crores but there is more damage with these fellows entry

Look at "present/latest"  Hyderabad based movie people and their society.....Except having money what do they have to get any "respect" unless you are cult?

drugs& xxx e.t.c avasarama ivi manaki? Gabbu pattistaru mottam a area ni...mammalni antara ani(patitu laga) egabadataru gani e batch asalu emanna positive unda a surroundings lo? 

Amaravati better be as "Green&blue&no pollution&no trafiic planned middle class modern COLONY" >>>> than Chandigarh...90's Bangalore atlane undedi....

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

23 minutes ago, AnnaGaru said:

illani rannivakunda unte better.....It's ok to loose that few hundred crores but there is more damage with these fellows entry

Look at "present/latest"  Hyderabad based movie people and their society.....Except having money what do they have to get any "respect" unless you are cult?

drugs& xxx e.t.c avasarama ivi manaki? Gabbu pattistaru mottam a area ni...mammalni antara ani(patitu laga) egabadataru gani e batch asalu emanna positive unda a surroundings lo? 

Amaravati better be as "Green&blue&no pollution&no trafiic planned middle class modern COLONY" >>>> than Chandigarh...90's Bangalore atlane undedi....

yes bro.. these problems are real.. but then this is TELUGU cine industry, so manam own chesukoka tappadhu..

Link to comment
Share on other sites

ప్రపంచ స్థాయిలో రహదారుల నిర్మాణం: చంద్రబాబు
26-12-2017 21:28:06

అమరావతి: ప్రపంచ స్థాయిలో అమరావతిలో రహదారులు నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానిలో రహదారుల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారాయన. రహదారుల నిర్వహణ నిర్మాణ సంస్థలకు అప్పగిస్తామని చెప్పారు. రహదారుల నిర్మాణంతో లాండ్‌ పూలింగ్‌ రైతుల ప్లాట్ల విలువ పెరుగుతుందని వివరించారు. ప్రతి పదివేల జనాభాకు ఒక టౌన్‌షిప్‌ నిర్మించాలన్నారు. టౌన్‌షిప్‌ ముందు భాగంలో వాణిజ్య అవసరాలకు స్థలం వదలాలని తెలిపారు. భవిష్యత్‌లో భారీ వాణిజ్య సముదాయాలు రావడంతో ఆ ప్రాంతంలో నగర వాతావరణం వస్తుందని సీఎం అన్నారు. టౌన్‌షిప్‌లలో నివాస ప్రాంతాలకు అనుగుణంగా గార్మెంట్‌ తరహా కాలుష్యరహిత యూనిట్లు నెలకొల్పాలని, దీనివల్ల ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని వెల్లడించారు. ప్రభుత్వం నిర్మించే పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో స్థానిక బిల్డర్‌లకు అవకాశం ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

Link to comment
Share on other sites

విద్యుత్తు స్తంభాలు.. వృథాయేనా..!?
27-12-2017 07:10:17
రాజధాని ప్రాంతంలో తొలగించిన లైన్ల సామగ్రి సద్వినియోగం అవశ్యం
 ఇప్పటికైనా ట్రాన్స్‌కో ఈ అంశంపై దృష్టి సారించాలని పలువురి విన్నపం
 
అమరావతి: రాజధాని ప్రాంతంగా అమరావతిని ప్రకటించిన తర్వాత అందు లోని వివిధ గ్రామాలకు చెందిన వ్యవసాయ భూముల్లోని విద్యుత్తు లైన్లను క్రమంగా తొలగిస్తున్న ట్రాన్స్‌కో వాటికి సంబంధించిన స్తంభాలు, ఇతర సామగ్రిని జాగ్రత్త పరచడంలో అల సత్వం ప్రదర్శిస్తోందన్న విమర్శలు వినిపి స్తున్నాయి. ఫలితంగా అవి దుర్వినియోగమవుతూ, ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లుతోందని పలు వురు వ్యాఖ్యానిస్తున్నారు. పూలింగ్‌కు తీసుకున్న భూముల్లో వ్యవసాయం ఆపివేయాలని సీఆర్డీయే ప్రకటించడంతో రైతుల్లో అత్యధికులు సేద్యానికి స్వస్తి చెప్పారు. పైగా.. ప్రపంచస్థాయి అమరావతి నిర్మాణంలో భాగంగా విద్యుత్తు లైన్లు ఇప్పట్లా భూఉపరితలంపై కాకుండా భూగర్భంలో ఉంటాయని మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదించింది. తదనుగుణంగా గతంలో రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు లైన్లను తొలగించే కార్యక్రమాన్ని ఏపీ ట్రాన్స్‌కో చేపట్టింది. ఇప్పటికే పలు గ్రామాల్లో ఈ ప్రక్రియ చాలావరకు పూర్తవగా, మరి కొన్నింట్లో కొనసాగుతోంది. అయితే తొలగించిన, తొలగిస్తున్న విద్యుత్తు లైన్లలో భాగంగా ఉన్న ఎలక్ట్రిక్‌ పోల్స్‌, ఇతర సామగ్రిని తగిన విధంగా భద్రపరచడంలో విద్యుత్తు శాఖాధికారులు విఫలమ వుతున్నారని రాజధాని గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
 
ఇందుకు నిదర్శనంగా రాజధానిలోని పలు గ్రామాల్లో లైన్లు తొలగించినప్పటికీ, ఇంకా మొండిగా పొలాల్లో కనిపిస్తున్న వందలాది విద్యుత్తు స్తంభాలను చూపుతున్నారు. ఇలాగే వీటిని వదిలేస్తే క్రమంగా శిథిలమై, ఎందుకూ పనికి రాకుండా పోవడమో లేదా స్వార్థపరుల చేతుల్లో పడి దుర్వినియోగమవడమో జరగడం తథ్యమని హెచ్చరిస్తున్నారు. వీటిల్లో ఏది జరిగినా, లక్షలాది రూపాయల ప్రజాధనం నిరర్ధకమవుతుంటే చూస్తూ మౌనంగా ఊరుకున్నట్లే అవుతుందని వ్యాఖ్యా నిస్తున్నారు. కేవలం సంబంధిత అధికారుల అలసత్వం కారణంగా ఒక్కొక్కటి వేలాది రూపాయలు విలువ చేసే విద్యుత్తు స్తంభాలు ఎందుకూ పనికి రాకుండా పోయే ప్రమాదాన్ని అరికట్టాలంటే ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు వెంటనే స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటున్నారు. రాజధాని ప్రాంతంలో తొలగించిన, తొలగిస్తున్న విద్యుత్తు లైన్లన్నింట్లో భాగమైన ఎలక్ట్రిక్‌ పోల్స్‌ అన్నింటినీ జాగ్రత్తగా తొలగించి, భద్రపరచి, అవి కొత్తగా లైన్లు వేసే రాజధానేతర ప్రదేశాల్లో వాటిని ఏర్పాటు చేసినట్లయితే విలువైన ప్రజాధనాన్ని ఆదా చేసినట్లవు తుందంటున్నారు. పైగా.. కొత్త పోల్స్‌ పేరిట రైతులు, ఇతర వర్గాల నుంచి వసూలు చేసే మొత్తాలను కూడా వసూలు చేయాల్సిన అగత్యమూ ఉండదంటున్నారు. సామగ్రిని సద్వినియో గపరచుకోవడమే కాకుండా ఇటు ప్రజలపై అనవసర భారాన్ని తప్పించినట్లూ అవుతుందని పేర్కొంటున్నారు.

Link to comment
Share on other sites

మార్చిలో ‘అమరావతి ఇన్నోవేషన్ సమ్మిట్’
27-12-2017 20:16:54

అమరావతి: మార్చి నెలాఖరులో అమరావతి ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘‘సిటీస్ ఆఫ్ ద ఫ్యూచర్’’ పేరుతో అమరావతి ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్‌లో మొదటి రెండు రోజులు నగర నిర్మాణాలలో ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో బృంద చర్చలు జరుపుతారు. చివరిరోజు సాంకేతిక ఆవిష్కారాలపై పోటీలు నిర్వహిస్తారు. సమ్మిట్‌కు సంబంధించిన ప్రతిపాదనలను సీఆర్డీఏ సమావేశంలో అధికారులు, సీఎంకు వివరించారు.
 
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు, నవ్య సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలలో వచ్చే 15 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక కార్యకలాపాలు భారత్‌లో సాగనున్నాయని పేర్కొన్నారు. రేపటి అవసరాలకు తగినట్టుగా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించా

Link to comment
Share on other sites

0

198 ఎకరాల్లో ఐటీ పార్కు
ఈనాడు - అమరావతి 

రాజధాని అమరావతిలోని శాఖమూరు, ఐనవోలు గ్రామాల పరిధిలో 198.52 ఎకరాల్లో ఐటీ పార్కు అభివృద్ధి చేయనున్నారు. దీనిలో 56.10 ఎకరాల్లో ఐటీ సెజ్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. ఐటీ సెజ్‌ ఐనవోలు గ్రామ పరిధిలోకి వస్తుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పనుల పురోగతిపై సమీక్షించారు. ఐటీ పార్కు సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నిర్మాణంలో ముందు చూపుతో వ్యవహరించాలని, ఏ విషయాన్నీ విస్మరించరాదని, భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. శాఖమూరు పార్కు అభివృద్ధి ప్రణాళికలను ఏడీసీ అధికారులు వివరించినప్పుడు... పార్కింగ్‌ పరిస్థితేంటని ప్రశ్నించారు. పార్కింగ్‌ సహా అన్ని అవసరాలకు ముందే స్థలం కేటాయించుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతామని ఆయన పేర్కొన్నారు.
* ‘సిటీస్‌ ఆఫ్‌ ద ఫ్యూచర్‌’ పేరుతో మార్చి నెలాఖరులో రాజధానిలో అమరావతి ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. సదస్సు ప్రధానంగా నగరాభివృద్ధి ప్రణాళికకు సంబంధించి ఉంటుంది. ఆధునిక సాంకేతికత, నవ్య ఆవిష్కరణలు, వినూత్న విధానాల మేళవింపుతో నగర రూకల్పనపై ఇక్కడ చర్చిస్తారు.
* ఈ సదస్సు నేపథ్యంలో రాజధాని పరిధిలోని పలు ప్రాంతాల్లో హ్యాపీసిటీ హ్యాకథాన్‌ నిర్వహిస్తారు. నగర నిర్మాణాల్లో ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో మొదటి రెండు రోజులూ బృంద చర్చలు, కార్యగోష్ఠులు ఉంటాయి. అమరావతిని విశ్వస్థాయి నగరంగా 21వ శతాబ్దంవైపు నడిపించేందుకు అవసరమైన వినూత్న సాంకేతిక విధానాలు, ఆవిష్కరణలకు సంబంధించి పోటీలు నిర్వహిస్తారు.
* ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ను ఒక పర్యాయం నిర్వహించి వదిలేయకుండా ఏటా క్రమం తప్పకుండా ఒక క్రతువుగా నిర్వహించాలని సీఎం సూచించారు.
* రాజధాని ప్రాంతం మొత్తంలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారి మార్గంలో పచ్చదనం వెల్లివిరిసేలా తీర్చిదిద్దాలని సూచించారు.
* రహదారి నిర్మాణాలు ఏప్రిల్‌ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని అధికారులు చెప్పగా, అంతకంటే ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
* రాజధానిలో రహదారుల నిర్మాణానికి గ్రావెల్‌ కొరతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఆర్‌డీఏ, మైనింగ్‌ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...